
కేటీదొడ్డి (గద్వాల): ఓ పిల్లి చేసిన పనికి ఆ రైతు కష్టించి పోగు చేసిన లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్ తనపొలంలో యాసంగిలో వరి సాగు చేశాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిం చాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు డ్రా చేసి బట్టలో చుట్టి ఇంట్లో (గుడిసె)ని సంచిలో భద్ర పరిచాడు.
కాగా, సోమవారం దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పిల్లి హారతికి తగలడంతో గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేసి నప్పటికీ అప్పటికే దాచుకున్న రూ.లక్ష నగదు దగ్ధమయ్యాయి. పంట పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చిన రూ.50 వేల అప్పు తీరు ద్దామనుకునేలోపే ప్రమాదం జరగడంతో బాధిత రైతు వీరేష్ లబోదిబోమంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment