ఘటనా స్థలంలో పడివున్న తెలుగు శంకరమ్మ, తెలుగు బడేసా మృతదేహాలు నిందితుడు తెలుగు రాముడు (ఫైల్)
కర్నూలు , సి.బెళగల్: తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి కాదని చెప్పిన కుమారిడిని చంపుతానని బెదిరించింది. భయపడిన కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల శివారులో బుధవారంచోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాలు.. సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన తెలుగు కర్రెన్న, శంకరమ్మ (48) దంపతులకు రాముడు, భాస్కర్ కుమారులు సంతానం. కర్రెన్న ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు రాముడికి తెలంగాణ రాష్ట్రంలోని కొంకల ప్రాంతానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. శంకరమ్మ గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన తెలుగు బడేసా (52)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయమై తల్లీ, కుమారుల మధ్య గొడవలు జరిగాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి శంకరమ్మ పలుమార్లు పెద్ద కుమారుడు రాముడిని హంతు చూస్తానని బెదిరించేది. దీంతో తననను చంపుతుందనే భయంతో కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారంరాజోలి గ్రామ శివారులో ఇద్దరూ ఉన్నారన్న సమాచారంతో రాముడు అక్కడికి వెళ్లి వేట కొడవలితో దాడి చేసి, ఇద్దరినీ హత్య చేశాడు. అనంతరం సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజోలి పోలీస్‌లు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సి.బెళగల్ పోలీసులు నిందితుడిని రాజోలి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment