కలెక్టరేట్ వద్ద సామూహిక భోజనాలు చేస్తున్న పత్తి రైతులు
గద్వాల రూరల్: నకిలీ విత్తనాలను కట్ట బెట్టి తమను నిండా ముంచేశారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌కు గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. భూత్పూర్ వద్దనున్న కంపెనీ నకిలీ బీటీ పత్తి విత్తనాలు తమకు కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విత్తనాలతో సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేస్తే.. పంట దిగుబడి రాలేదని, దీనికి నకిలీ విత్త నాలే కారణమని వాపోయారు.
ఇదే విష యమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫి ర్యాదు చేస్తే.. క్షేత్ర పరిశీలనకు వచ్చిన శాస్త్రవేత్తలు సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపి ంచారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై, తప్పుడు నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాస్త్ర వేత్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రత్తి రైతుకు ఎకరా కు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు.
కలెక్టర్ తమకు స్పష్టమై న హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మధ్యా హ్నం కలెక్టరేట్ ఎదుటే సామూహిక భోజ నాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మదన్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో రైతు సంఘం నాయ కులు ఆంజనేయులు, లక్ష్మీకాంతరెడ్డి, రామాంజనేయులు, నాగన్న, ఎర్రన్న, జైలు, నారాయణరెడ్డి, భీంరెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment