Fake seeds
-
నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారిన పాలమూరు జిల్లా
-
తెలంగాణలో రైతులకు గడ్డు పరిస్థితి
-
నకిలీ విత్తనాలు.. దాడులు..
సాక్షి నెట్వర్క్: పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలుచోట్ల అధికార యంత్రాంగం దాడులు, తనిఖీలు చేపట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఓ దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. లూజ్ విత్తనాలను వివిధ కంపెనీల పేరిట ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దాని యజమాని రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన గోదాముల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇక్కడి తాంసి బస్టాండ్ సమీపంలోని నిఖిల్ ఫర్టీలైజర్ షాపులో స్టాక్ ఉన్నా డీలర్ నోస్టాక్ బోర్డు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. నిఖిల్ ఫర్టీలైజర్ షాపు వద్ద ఇన్చార్జ్గా ఉన్న ఏఈఓ శివచరణ్‌ను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ ఏఓ భగత్ రమేశ్‌ను బదిలీ చేశారు. ఇక విత్తనాలు గోదాంలో అందుబాటులో ఉన్నా, డీలర్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాశీ–659 డిస్ట్రిబ్యూటర్ వామన్‌రావుపై కేసు నమోదు చేశారు. ⇒ ఖమ్మంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశా రు. ఆ సమయంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతు లతో మాట్లాడారు. అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకటేనని, ఏవైనా దిగుబడి బాగానే వస్తాయని చెప్పారు. ⇒ మరోవైపు జనుము, జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జీలుగ విత్తనాల కోసం బారులుతీరారు. -
నకిలీ విత్తన ముఠా అరెస్ట్
నార్కట్‌పల్లి: నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ఓ ముఠాను నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువైన పది టన్నుల పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ హిల్స్ ప్రాంతానికి చెందిన గోరంట్ల నాగార్జున, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మెరిగె వేణు, అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ఓ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఈ ము ఠా సభ్యులు కర్ణాటకలో పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో స్టోరేజీ చేశారు. అక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు హైదరాబాద్ మీదుగా తరలించాలని నిర్ణయించుకున్నారు. కారులో నాగార్జున, రవీంద్రబాబు, వేణు బయలుదేరారు. పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు, టాస్‌్కఫోర్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఎర్టిగా కారును తనిఖీ చేయగా రెండు బస్తాల విత్తనాలు బయటపడ్డాయి. వాటిని వ్యవసాయ అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలుగా నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మిగతా విత్తనాలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ ప్రయోగించనున్నట్టు చెప్పారు. -
అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..
వరంగల్ క్రైం: పంట నష్టం, అప్పుల బాధ తదితర కారణాలతో గ్రామాల్లో జరిగే రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ విత్తన ముఠాల వివరాలు వెల్లడించిన సీపీ.. అనంతరం పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ ‘గ్రామాల్లో జరుగుతున్నవన్నీ రైతు ఆత్మహత్యలు కాదు.. గుండెపోటు, అనారోగ్యంతో చనిపోయినా రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యేవి. గతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇచ్చేది. అందుకే రైతు ఆత్మహత్యగా నమోదు చేసేవాళ్లం. ఎలా చనిపోయినా రైతు ఆత్మహత్యగానే నమోదు చేయడంతో సంఖ్య ఎక్కువగా ఉంది..’అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రావడంతో సీపీ వివరణ ఇచ్చారు. 6 నెలలుగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు: రైతు ఆత్మహత్యలపై ఎలాంటి వివాదం లేదని సీపీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం ద్వారా ఆరు నెలల కాలంగా ఏ ఒక్క రైతు కూడా ఆర్థిక, పంటనష్టం కారణంతో ఆత్మహత్యకు పాల్పడలేదని, ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే రైతుబీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. కానీ రైతులు, పోలీసులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇతర కారణాలతో రైతులు మరణిస్తే 2004లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన 421 జీఓ నిబంధనల ప్రకారమే ఆర్థిక సాయం కోసం రైతు ఆత్మహత్యలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం రైతులు ఏ విధంగా మరణించినా బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. -
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
గద్వాల రూరల్: నకిలీ విత్తనాలను కట్ట బెట్టి తమను నిండా ముంచేశారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌కు గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. భూత్పూర్ వద్దనున్న కంపెనీ నకిలీ బీటీ పత్తి విత్తనాలు తమకు కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విత్తనాలతో సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేస్తే.. పంట దిగుబడి రాలేదని, దీనికి నకిలీ విత్త నాలే కారణమని వాపోయారు. ఇదే విష యమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫి ర్యాదు చేస్తే.. క్షేత్ర పరిశీలనకు వచ్చిన శాస్త్రవేత్తలు సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపి ంచారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై, తప్పుడు నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాస్త్ర వేత్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రత్తి రైతుకు ఎకరా కు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కలెక్టర్ తమకు స్పష్టమై న హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మధ్యా హ్నం కలెక్టరేట్ ఎదుటే సామూహిక భోజ నాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మదన్మోహన్కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో రైతు సంఘం నాయ కులు ఆంజనేయులు, లక్ష్మీకాంతరెడ్డి, రామాంజనేయులు, నాగన్న, ఎర్రన్న, జైలు, నారాయణరెడ్డి, భీంరెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తు.. నమ్మితే చిత్తు.. విత్తనాల కొనుగోలుకు ముందు ఇలా చేయండి..
దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): తొలకరి చినుకులు పలుకరించాయి. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచి వేసే పంట విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించడం అవసరం. చదవండి: సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి.. కొందరు డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ ఏటా అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాల ఎంపిక నుంచి పంట దిగుబడి వరకు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంభించడంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలంటున్నారు. జిల్లాలో అధికారులు నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచారు. ప్రభుత్వం సైతం నకిలీ విత్తలనాలను విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా రైతుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల కొనుగోలుకు ముందు.. ♦వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి. ♦విత్తన ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి. ♦సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. రశీదు తీసుకోవాలి ♦రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా ఉండేలా చూసుకోవాలి. ♦విత్తనాలను కొనుగోలు చేసేముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్ర వేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. ♦రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలు విక్రయిస్తాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తా పై నీలి వర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించాలి. ♦లేబుల్ విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జిల్లాలో ఈ రకం విత్తనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ♦ట్యాగ్ కట్టి ఉంటుంది. దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్త్తనాలను రైతులు కేవలం ఆయా కంపెనీల నమ్మకంపై మాత్రమే కొనుగోలు చేయాలి. పూర్తి వివరాలు తీసుకుని డీలర్ల నుంచి సరైన బిల్లు తీసుకోవాలి ♦బ్రిడిల్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి ♦ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసిన పంట సాగు వరకు రశీదులను రైతులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎరువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పంటల అధిక దిగుబడికి ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు దళారుల, వ్యాపారుల నాసి రకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు నష్టపోతున్నారు. ఈ మేరకు కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే అవకాశం ఉంది. ♦లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి. ♦కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లును తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ♦డీలర్ బుక్‌లో రైతులు తప్పకుండా సంతకం చేయాలి. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్కడైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే రైతులు వెంటనే దగ్గరలో వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన రైతుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
పత్తి టాస్క్ఫోర్స్పై దళారుల ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ స్తబ్దుగా ఉండటం, ఇప్పటివరకు ఎలాంటి టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు ఈ విత్తనాలు చేరినట్టు సమాచారం. నిజానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విస్తృతంగా టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి, దాదాపు 200 మంది విత్తన దళారులపై కేసులు పెట్టారు. నకిలీ విత్తనాలను కొంతవరకు అరికట్టగలిగారు. కానీ ఈసారి దళారులు, కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక.. రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేసినా.. గతేడాది సాధారణం కంటే తక్కువగా 46.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 75 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు కూడా ఈసారి పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్లో తొలి వర్షం పడగానే పత్తి నాట్లు మొదలవుతాయి. ఈ క్రమంలో 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు సన్నాహాలు చేసుకున్నాయి. విత్తన దళారులు ఇదే అదనుగా భావించి నకిలీ పత్తి విత్తనాలను రంగంలోకి తెచ్చారు. కొన్ని సంస్థలు నిషేధిత హెచ్‌టీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు తరలించి జిల్లాల్లో తమ దళారులకు అప్పగించినట్టు తెలిసింది. పలుచోట్ల ఇప్పటికే ఈ విత్తనాలను రైతులకు అంటగట్టారు. టాస్క్‌ఫోర్స్ ఏదీ? గత ఏడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విస్తృతంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను, దళారులను పట్టుకుంది. ఇంతచేసినా ఆరేడు లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలు, హెచ్‌టీ పత్తి సాగయింది. రైతులు భారీగా నష్టపోయారు. అయితే టాస్క్‌ఫోర్స్ దాడుల వల్ల నష్టపోయిన నకిలీ విత్తన మాఫియా ఈసారి ముందుగానే వ్యవసాయశాఖలోని కొందరు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చిందని.. భారీగా ముడుపులు సమర్పించుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలకు సంబంధించి ఇప్పటివరకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. భారీగా వెనకేసుకునేందుకు.. విత్తన డీలర్లకు ఒక పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ.25–30 వరకే లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను రైతుకు విక్రయిస్తే రూ.500 దాకా.. అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 దాకా మిగులుతుంది. ఈ క్రమంలోనే డీలర్లు, విత్తన వ్యాపారులకు నకిలీ విత్తన మాఫియా ఎర వేసి.. వారి ద్వారా రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు పెట్టుబడికి డబ్బులు లేక.. డీలర్ల వద్ద అప్పుగా విత్తనాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యాపారి ఇచ్చిన నకిలీ విత్తనాలు తీసుకోవాల్సి వస్తోంది. -
నకిలీ విత్తనం.. మాఫియా పెత్తనం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పత్తివిత్తన మాఫియా నకిలీలలు’అన్నీఇన్నీకావు. అక్రమార్కుల మాయాజాలంలో అ మాయక రైతులు చిక్కుకుంటున్నారు. తాము కొని సాగు చేసినవి నకిలీ విత్తనాలనే విషయం కూడా రైతులకు తెలియకపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలను పసిగట్టే పరిస్థితిలేక చాలామంది నష్టపోతున్నారు. ఇదీ నడిగడ్డ కేంద్రంగా వేళ్లూనుకున్న విత్తన మాఫియా మాయాజాలం. అక్రమార్కు ల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ–3 సాగు కొనసాగుతున్నట్లు తేలింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో పోలీసుల దాడుల్లో వేలాది క్వింటాళ్లలో నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందే జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పలు మండలాలతోపాటు ఇతర జిల్లాల రైతులకు ఇవి చేరాయి. ఇలా బట్టబయలు.. ఈ ఏడాది జూలైలో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు డీసీఎంలో నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు టన్నుల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అవి బీటీ–3 విత్త నాలని తేలింది. ఈ క్రమంలో గద్వాల, మల్దకల్, ధరూరు, అయిజ మండలాల్లో పట్టుబడిన నకిలీ విత్తనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపారు. వీటిలో బీటీ–3 విత్తనాలున్నాయని నిర్ధారణ అయింది. రంగంలోకి వ్యవసాయ శాఖ ఇంటెలిజెన్స్.. గద్వాల జిల్లాలో నిషేధిత బీటీ–3 విత్తనాలు వెలుగుచూడటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి బీటీ–3 పంట పండిస్తున్న రైతులకు విత్తనాలు ఇచ్చిన సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు ఎవరు.. ఏ కంపెనీ విత్తన ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీలా.. సీడ్ ఆర్గనైజర్ల సొంత బ్రాండెడ్ కంపెనీలా.. ఎప్పటి నుంచి నిషేధిత బీటీ–3 పంట సాగవుతోంది.. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు.. అనే కోణాల్లో పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలిసింది. రైతులకు తెలియకుండానే.. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో పలువురు రైతుల నుంచి బీటీ–3 విత్తనాలను తక్కువ ధరకు సీడ్ ఆర్గనైజర్లు సేకరించారు. హైదరాబాద్ కేంద్రంగా గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాలకు.. కర్ణాటక కేంద్రంగా అయిజ మండలానికి తరలించి రైతులకు తెలియకుండానే బీటీ–3 విత్తనాలను వారికి కట్టబెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. సీడ్ ఆర్గనైజర్లు ఏడాది కిత్రం ధరూర్, అయిజ మండలాల్లో పలువురు రైతులకు బీటీ–3 ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సాగు చేయించారని.. మళ్లీ వాటిని సేకరించి ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన సొంత బ్రాండ్ ప్యాకెట్లలో వేసి పలుచోట్ల రైతులకు విక్రయించారని విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీడ్ ఆర్గనైజర్లతో పాటు కంపెనీల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకే పెట్టుబడి ఇవ్వడం లేదా? రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టినట్లు గ్రహించిన సీడ్ ఆర్గనైజర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీడ్ పత్తి మొక్కలు ఏపుగా పెరగగా.. క్రాసింగ్ దశలో కూలీలు, ఇతరత్రా ఖర్చు అధికం. దీంతో రైతులు పెట్టుబడి కోసం సీడ్ ఆర్గనైజర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బీటీ–3 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందనే భయంతో సీడ్‌ఆర్గనైజర్లు రైతులకు అప్పు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికైనా సాగు నిలిపివేసి.. పంట తొలగించాలని పరోక్షంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆర్గనైజర్లు పెట్టుబడికి డబ్బులు ఇవ్వకపోవడంతో మల్దకల్, అయిజ మండలాల్లో పలువురు రైతులు పంటలు తొలగించారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్గనైజర్లు మాత్రం ‘కంపెనీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.. మేం చేతి నుంచి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సొంతంగా పెట్టుబడి పెడితేనే సీడ్ పత్తి సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం’అని చెబుతున్నారు. కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్వహించిన దాడుల్లో మొత్తం 162 క్వింటాళ్ల ఫెయిలైన విత్తనాలు పట్టుబడ్డాయి. అనుమానంతో జిల్లా నుంచి మొత్తం ఆరు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. అవి నిషేధిత బీటీ–3 విత్తనాలుగా నిర్ధారణ అయ్యాయి. నిందితులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన విత్తనాలతోపాటు ల్యాబ్ రిపోర్ట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తాం. – గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి, జోగుళాంబ గద్వాల -
రాష్ట్రంలో దాడుల నేపథ్యంలో విత్తన మాఫియా అలర్ట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ విత్తనాల దందాపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుండడంతో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నకిలీ పత్తి విత్తుకు కేరాఫ్‌గా నిలిచిన గద్వాల జిల్లా సీడ్ ఆర్గనైజర్ల మా ఫియా అలర్ట్ అయ్యింది. ఇటీవల సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించేసి వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచినట్లు సమాచా రం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఎత్తుగడ ధనార్జనే ధ్యేయంగా పలువురు సీడ్ ఆర్గనైజర్లు ప్రతి ఏటా సీజన్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఫెయిల్యూర్ విత్తనాలతో పాటు నాసిరకం సీడ్స్‌ను సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేవారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల టాస్క్‌ఫోర్స్ దాడులు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుంటూ వ్యాపారులపై పీడీ యాక్ట్ సైతం ప్రయోగిస్తున్నారు. దీంతో గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొంత మేర నిల్వ ఉన్న నకిలీ విత్తనాలను పలువురు సీడ్ ఆర్గనైజర్లు దహనం చేశారు. గద్వాల పట్టణ శివారులోని పలు మిల్లులు, మల్దకల్, ధరూర్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న నకిలీ విత్తనాలను ఎవరికి వారే స్వయంగా కాల్చివేశారు. ఆ తర్వాత కొత్త ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళికతో సుమారు 1,500 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను రాష్ట్ర సరిహద్దు దాటించారు. గద్వాల జిల్లా సరిహద్దు అయిన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ పరివాహకంలో లింగ్సుగుర్, మట్మారి, అమరేశ్వర వంటి తదితర క్యాంప్‌లలో పెద్ద ఎత్తున నిల్వ చేసినట్లు తెలిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ సరిహద్దులో కర్ణాటకకు చెందిన ఆదులాపూర్‌లో సైతం డంప్ చేసినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల నుంచి రాయచూర్, మాన్వి, సింధనూర్‌తో పాటు పలు ప్రాంతాల రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. రంగంలోకి ప్రత్యేక బృందాలు గద్వాల జిల్లాలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించిన సందర్భంగా పట్టుబడిన నకిలీ విత్తనాలకు సంబంధించిన నింది తులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సీడ్ ఆర్గనైజర్ల మాఫియా జిల్లా నుంచి పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు తరలించి నిల్వ చేసినట్లు బయటపడింది. గద్వాల జిల్లా గట్టు మండలంలోని బల్గెర చెక్‌పోస్టు గుండా 1,500 క్వింటాళ్ల వరకు నకిలీ విత్తనాలను రాయచూర్ జిల్లాకు తరలించి వివిధ ప్రాంతాల్లో డంప్ చేశారని వారు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగం లోకి దింపింది. కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం తో నకిలీ విత్తన నిల్వ కేంద్రాలపై ఆరా తీస్తోంది. ఎవరినీ వదిలిపెట్టం జిల్లాలో ఇప్పటివరకు 180.71 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి 74 మంది నిందితులపై 54 కేసులు నమోదయ్యాయి. నకిలీ దందాపై డేగ కళ్లతో నిఘా పెట్టాం. అక్రమార్కులు ఎక్కడ ఉన్నా, ఎవరైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
అక్రమ హెచ్‌టీబీటీ పత్తిసాగుపై చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా హెచ్‌టీబీటీ పత్తి విత్తనాల సాగు ఒక్కసారిగా ఊపందుకోవడంపై ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల పర్యావరణంతోపాటు రైతులకు, చట్టబద్ధమైన విత్తన కంపెనీలకు, ప్రభుత్వాల ఆదాయానికి నష్టమని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి మెరుగ్గా ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తు చేశాయి. గతేడాది 25 లక్షల ప్యాకెట్ల హెచ్‌టీబీటీ కాటన్ విత్తనాలను సాగు చేయగా.. ఈ ఏడాది 70 లక్షల ప్యాకెట్లకు పెరిగిపోయినట్టు రాసి సీడ్స్ చైర్మన్, ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్ ఎం.రామసామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిశ్రమకు, రైతులకు ఎంతో నష్టమన్నారు. -
గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..
కర్నూలు: నకిలీ విత్తన కవర్ల తయారీదారులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, జయరాముడు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వెంకటేశ్, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నకిలీ కవర్లు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేయగా.. హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు బయటకు వచ్చింది. ఆ కంపెనీ సీఈఓ బొగుడ సురేష్..నకిలీ కవర్లు తయారు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల విలువ చేసే యంత్రాలు, ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తన ముఠాలపై దృష్టి.. శివారు ప్రాంతాల్లోని పాడుబడిన భవనాలు, మూతపడిన మిల్లులు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకుని నకిలీ విత్తన దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నకిలీ విత్తన ముఠాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఫక్కీరప్ప క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారో పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. స్పిన్నింగ్ మిల్లుల్లో పత్తిని తీసిన తరువాత మిగిలిన గింజలనుయాసిడ్‌తో శుద్ధి చేసి నిగనిగలాడేలా చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీలపై సమాచారం కోసం.. నకిలీలపై సమాచారం కోసం పోలీసు శాఖ వాట్సాప్ నంబర్‌ను కేటాయించింది. నకిలీ వ్యాపారాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 7993822444 వాట్సాప్ నంబర్‌కు సమాచారమివ్వాలని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి తెలిపారు. పీడీ యాక్టు నమోదుకు కసరత్తు.. ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినా రైతులు నకిలీ విత్తన విక్రయదారుల బారిన పడుతున్నారు. తక్కువ ధరకు కావాలని కోరుకుంటుండటంతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. విత్తనం నాటిన కొన్నాళ్ల తరువాత ఫలితం రాకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది వెల్దుర్తికి చెందిన మునిగొండ రత్నాకరరావు పావని సీడ్స్ పేరుతో లైసెన్స్ లేకుండా విత్తన వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ప్రివెంటివ్ డిటెక్షన్(పీడీ చట్టం) యాక్ట్ ప్రయోగించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నూకల మనోహర్‌రావుపై 14 గుట్కా కేసులు నమోదు కావడంతో గత సంవత్సరం పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు. ఇదే తరహాలోనే హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ బొగుడ సురేష్‌పై కూడా పీడీ చట్టం ప్రయోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతనిపై పలు స్టేషన్లలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిర్బంధ చట్టం ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు -
నకిలీ విత్తన దందా: నకిలీకి ‘అసలు రంగు’
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ విత్తనాల వ్యవహారంలో ఇటీవల కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ఇటు పోలీసు శాఖ, అటు వ్యవసాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రైతులకు, సీడ్ కంపెనీలకు మధ్య అనుసంధానంగా ఉండే దళారుల చేతివాటమే ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణమని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో లభిస్తున్న, పక్క రాష్ట్రం నుంచి వస్తున్న నకిలీ విత్తన కేసుల్లో అధిక శాతం ఇలాంటివే వస్తున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. పనికి రాని, తక్కువ నాణ్యత కలిగిన, నకిలీ విత్తనాలను రంగులద్ది ప్యాకింగ్ చేసి, మంచి లాభాలు వస్తాయని ఆశ చూపి రైతులకు అంటగడుతున్నారు. ఈ వ్యవహారంలో పలు జిల్లాల్లో విత్తనాలను విక్రయించే డీలర్లు కూడా కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని పోలీసులు గుర్తించి వారిపై నిఘా పెంచారు. సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తున్నా రు. తొలిసారైతే సాధారణ కేసులు, రెండు, మూడోసారి అయితే పీడీ యాక్టులు పెడుతున్నారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు పలు మార్గాల్లో చొరబడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ బృందాలు గుర్తించాయి. దందా నడిచేది ఇలా రాష్ట్రంలో పలు లైసెన్స్ పొందిన విత్తన కంపెనీలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. తయారీకి ముందు రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తాయి. విత్తనాలు సేకరించాక వాటిని తొలుత పలు దశల్లో ప్రాసెస్ చేస్తాయి. తర్వాత వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తాయి. అందులో తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలను తిరస్కరించి, మిగిలిన వాటికి రైతుల కోసం ప్యాకింగ్ చేస్తాయి. ఇందుకోసం రైతులకు, సీడ్ కంపెనీలకు మధ్యలో కొందరు దళారులుగా ఉంటారు. వీరిని సీడ్ ఆర్గనైజర్లు అంటారు. తిరస్కరించిన విత్తనాలను వీరు తిరిగి రైతులకు అప్పగించాలి. అయితే ఈ విత్తనాలకు ఎంతోకొంత ఇచ్చి వాటిని రైతుల నుంచి సేకరిస్తారు. పైగా ఈ ఆర్గనైజర్లు రైతులకు అప్పులు ఇస్తారు. రైతుల నుంచి సేకరించి, కంపెనీకి పంపిన విత్తనాలు ల్యాబ్‌లో పరీక్షల అనంతరం నాణ్యమైనవని తేలితే అప్పు పోగా, మిగిలిన డబ్బును రైతులకు చెల్లిస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే రైతు తిరిగి వారికే అప్పు చెల్లించాలి. ఈ వ్యవస్థ జిల్లాల్లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక ఫెయిలైన వాటిని ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో నింపి మళ్లీ రైతులకే విక్రయిస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రముఖ బ్రాండ్ల లోగోలను ప్యాకెట్లపై ముద్రించి మరీ అమ్ముతున్నారు. పగులగొట్టరు.. రైతులకు ఇవ్వరు పత్తి విత్తన చట్టం ప్రకారం ఫెయిలైయిన విత్తనాలను కంపెనీలు, ఆర్గనైజర్లు ఆయా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ అధికారుల సమక్షంలో పగులగొట్టాలి. ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఫెయిల్ అయిన విత్తనాలను ఆర్గనైజర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఎవరైనా రైతులు కావాలని గట్టిగా పట్టుబడితే నామమాత్రంగా కిలోకు రూ.200 మించకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ విత్తనాలకు ఆర్గనైజర్లు రంగులద్ది లూజ్‌గా విక్రయిస్తున్నారు. ఈ ఏడాది అత్యధికంగా కేసులు 2014లో 3 కేసులు, 2015లో 25 కేసులు, 2016లో 31 కేసులు, ఏడు పీడీ కేసులు 2017లో 69 కేసులు, మూడు పీడీ కేసులు, 2018లో 115 కేసులు, ఒక పీడీ యాక్టు, 2019లో 160 కేసులు, రెండు పీడీ యాక్ట్‌లు, 2020లో 112 కేసులు, 14 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో జనవరి 1 నుంచి జూన్ 19 వరకు ఏకంగా 321 కేసులు, 7 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. 446 మందిని అరెస్టు చేశారు. 4,940 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు.. ‘నకిలీ విత్తనాలకు సంబంధించిన కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. రైతులకు నష్టం కలిగించే విత్తనాల విషయంలో మోసాలను ఉపేక్షించేది లేదు. ఈ క్రమంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విత్తన డీలర్లు, సీడ్ ఆర్గనైజర్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు కూడా ఎలాంటి చిన్న సమాచారం తెలిసినా డయల్ 100 లేదా సమీపంలోని పోలీసు స్టేషన్లో సమాచారమివ్వండి.’ - ఐజీ నాగిరెడ్డి -
కర్నూలు జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
-
Telangana: విత్తు.. విపత్తు
►శనివారం ఖమ్మం జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయు క్తంగా దాడులు చేసి ఏకంగా రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ►మూడురోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో ఏకంగా రూ. 13.5 కోట్ల విలువ చేసే నకిలీ మిర్చి, కూరగాయలు, పుచ్చ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఒక్కరోజులోనే ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం అధికారులనే నివ్వెరపరిచింది. ►శనివారం హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్, వనస్థలిపురం పరిధిలో పోలీసులు దాడులు చేసి రూ. 1.15 కోట్ల విలువైన నకిలీ పత్తి, మిరప, వేరుశనగ విత్తనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. ►అత్యధికంగా ధర ఉండే పత్తి, మిరప, సోయాబీన్, మొక్కజొన్న వంటి విత్తనాలు (నకిలీ) తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వాటిని కొంటూ మోసపోతున్నారు. రాష్ట్రంలో విత్తనాల కొరత కూడా నకిలీ దందాకు కారణమవుతోంది. సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఒకపక్క అధికారులు ఎక్కడికక్కడ నిఘా వేసి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నా.. మరోపక్క అదే స్థాయిలో నకిలీ విత్తన మాఫియా పేట్రేగిపోతోంది. వానాకాలం మొదలై ప్రస్తుతం విత్తనాలు వేసే సమయం కావడంతో అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోంది. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ప్రతిరోజూ నకిలీ విత్తనాలు భారీ మొత్తంలో బయటపడుతున్నాయి. వాస్తవానికి సీజన్ రాకముందు నుంచే నకిలీ విత్తనాల సరఫరా మొదలుపెట్టిన అక్రమార్కులు, ఇప్పుడు మరింత విచ్చలవిడిగా అమాయక రైతులకు అంటగడుతున్నారు. రాష్ట్రంలో విత్తన మాఫియా ప్రతి వానాకాలం సీజన్లో వందల కోట్ల విలువైన నకిలీ విత్తనాల దందా కొనసాగిస్తోందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ఈ సీజన్లో కేవలం గత 15–20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.80 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడినట్లుగా వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపిందంటే.. రాష్ట్రంలో ఏస్థాయిలో ఈ అక్రమ దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నకిలీ విత్తన మాఫియా రెచ్చిపోవడానికి కొందరు అధికారులు, మరికొందరు రాజకీయ నేతల అండదండలే కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. లక్షలకు లక్షలు ముడుపులు తీసుకుంటున్న అధికారులు, నేతల కారణంగానే రాష్ట్రం నకిలీ విత్తనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. విత్తన చట్టంలోని లోపాలు కూడా అక్రమ దందాకు ఊతం ఇస్తున్నాయని అంటున్నారు. అధిక ధర పలికే విత్తనాల్లోనే.. పోలీసులు, వ్యవసాయాధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా అత్యధికంగా ధర ఉండే పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, మిరపలకు సంబంధించిన నకిలీ విత్తనాలు వ్యాపారులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అందులో అత్యధికంగా పత్తి విత్తనాలే ఉంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో 70.05 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాల చొప్పున మొత్తం 1.40 కోట్ల ప్యాకెట్లకు పైగా అవసరం. ఈ విత్తనాన్ని మొత్తం ప్రైవేట్ కంపెనీలే (ప్రభుత్వ విత్తనాల్లేవు) రైతులకు విక్రయిస్తాయి. అయితే ప్రైవేటు కంపెనీల వద్ద కేవలం 90 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అంటే ఇంకా 50 లక్షల ప్యాకెట్ల కొరత నెలకొని ఉంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన మాఫియా నకిలీ లేబుళ్లు తయారు చేసి అందులో నాసిరకం విత్తనాలను పెట్టి రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం వరదలా పారుతోంది. రైతులు కూడా అమాయకంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందానికి భారీగా బీజీ–3 విత్తనాలు దొరికాయి. అయితే ‘మాకు మంచి దిగుబడి వస్తే చాలు... ఏ విత్తనమైతే ఏంటి?’అని కొందరు రైతులు ప్రశ్నించడంతో అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. ఇక మిరప విత్తనం కొరత కూడా ఉండటంతో అందులోనూ నకిలీ ముఠా రెచ్చిపోతోంది. ఇక నకిలీ, నాసిరకం విత్తనాలను కొన్నిచోట్ల ప్యాకింగ్ చేయకుండానే లూజ్‌గా అమ్ముతున్నారు. లైసెన్సులు లేకుండానే అనుమతి ఉన్నట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. అసలు జర్మినేషన్ రాదని (మొలకెత్తవని) నిర్ధారించిన సీడ్స్‌ను కూడా ప్యాకింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడ రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. కాలం తీరిన విత్తనాలను వాటి నాణ్యత పరీక్షించకుండా, తేదీలు మార్చి మళ్లీ వాటినే (పాత విత్తనాలకు కొత్త ప్యాకింగ్) అమ్మకానికి పెడుతున్నారు. ఈ నకిలీ విత్తనాల విషయంలో సాధారణ, చోటా మోటా వ్యాపారులను మాత్రమే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తుండగా.. ఈ అక్రమ దందాల వెనుక అసలు సూత్రధారులు బయటకు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 13 కేంద్రాలపై క్రిమినల్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన విక్రయ కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ శనివారం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 229.55 క్వింటాళ్ల నకిలీ పత్తి, సోయాబీన్ తదితర పంటల విత్తనాలను, రికార్డులు లేని 74.3 మెట్రిక్ టన్నుల ఎరువులు, 268 కిలోల క్రిమిసంహరక మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లోని 13 కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గతంలో పట్టుకున్న మరికొన్ని కేసులు – ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 24.05 లక్షలు. – మంచిర్యాల జిల్లాలో గత 15 రోజుల్లో రూ. 50 లక్షల విలువైన బీజీ–3 విత్తనాలను పట్టుకున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, మందమర్రి, భీమినిలలో ఎక్కువగా దొరికాయి. ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. – కర్ణాటక సరిహద్దు గ్రామాల మీదుగా వికారాబాద్ జిల్లాకు తరలిస్తున్న 5.95 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను ఈ నెల 8వ తేదీన చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు పలు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ముద్రించిన ఖాళీ ప్యాకెట్లు, తూకం యంత్రాలు, ప్యాకింగ్ మెషీన్లను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. – ఈ నెల 4న వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటిపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే మండలం గోకఫసల్వాద్ గ్రామానికి చెందిన వీరపనేని కొండప్పనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. – మెదక్ జిల్లాలో కాలం చెల్లిన వరి, కూరగాయల విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 5.20 లక్షలు. తూప్రాన్, రామాయంపేటలలో ఎక్కువగా దొరికాయి. – ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్వారకా స్టార్ బిందు మిర్చి విత్తనం పట్టుకున్నారు. వాటి విలువ రూ.71 లక్షలు. ఏన్కూరు మండల కేంద్రం, ఖమ్మం రూరల్ మండలం అరేకొడు, కాచిరాజుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని అంజనాపురంలలో ఎక్కువగా పట్టుకున్నారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల దీప్తి, భూమిక, పల్నాడు, సిరి, రాజేశ్వరి, పద్మావతి, అల్ట్రా, స్టార్ బిందు, పీహెచ్ఎస్ – 491 బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్న రూ.3.04 కోట్ల విలువైన నకిలీ మిర్చి విత్తనాలను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. – ఆసిఫాబాద్ జిల్లాలో గత పదిహేను రోజుల్లో రూ. కోటిన్నర విలువైన నిషేధిత బీజీ–3 (హెచ్‌టీ కాటన్) పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కాగజ్‌నగర్, బెజ్జూర్, చింతల మానేపల్లి, పెంచికల్పేట్లలో ఇవి వెలుగుచూశాయి. ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఏన్కూరుకు చెందిన బైరు వేణుగోపాల్‌రావు, మంగయ్యలు అదే గ్రామానికి చెందిన ముడిగొండ వెంకట కృష్ణారావు అనే రైతుకు మే 17న రూ.68 వేల విలువైన ‘ద్వారకా సీడ్స్ స్టార్ బిందు ఎఫ్–1 హైబ్రిడ్’అనే మిరప విత్తనాలు విక్రయించారు. ఇవి నాణ్యమైనవని, అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు. అయితే ఇటీవల నకిలీ విత్తనాల బెడద అధికమయ్యిందనే సమాచారంతో కృష్ణారావు ఈనెల 8న స్థానిక వ్యవసాయాధికారి (ఏవో) నర్సింహారావుకు సమాచారం అందించారు. ఏవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్ గుట్టు బయటపడింది. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని సాయిలక్ష్మి ఏజెన్సీ నుంచి 2,016 ప్యాకెట్లు, మహబూబాద్‌లోని దార్వకా ఏజెన్సీ దుకాణం నుంచి 1,840 ప్యాకెట్లు, వరంగల్‌లోని పరమేశ్వరి ఏజెన్సీ నుంచి 3,380 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ షాప్ యజమానులు శ్రీధర్, సురేష్, పిచ్చయ్య, అజ్మీర సురేష్, చెరుకుమల్లి శ్రీధర్, వరంగల్‌కు చెందిన దేవ సతీష్‌పై కేసు నమోదు చేశారు. ద్వారకా విత్తన కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ మేనేజర్ మలపతి శివారెడ్డిని అరెస్ట్ చేశారు. నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు మంచిర్యాల క్రైం: జిల్లాలోని మంచిర్యాల, సీసీసీ నస్పూర్, తాళ్లగురిజాల, భీమిని, కన్నెపెల్లి, తాండూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ.51 లక్షల విలువైన నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో.. కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంపై జిల్లా టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్, కొడంగల్ పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి దాడులు చేశారు. సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలను, గడ్డి మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. టేకుమట్ల(రేగొండ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్ఎస్ అగ్రి మాల్లో రూ.2.9 లక్షల విలువైన కాలం చెల్లిన మిరప విత్తనాలు ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక!
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): నకిలీ విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంత చెప్పినా.. కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో నకిలీ దందా చేస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలు గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.13.51 కోట్ల విలువైన విత్తనాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ దందాను సూర్యాపేట జిల్లా పోలీసులు చాకచక్యంగా బయటపెట్టారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, గుడిహత్నూరు మండలాల్లో, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ భారీగా నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతు ఇచ్చిన సమాచారంతో..: అనుమతి లేకుండా విత్తనాలను తయారుచేసి రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఓ రైతు ద్వారా అందించిన సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. ద్వారకా సీడ్స్ పేరుతో వారు తయారు చేసిన మిర్చి, పలు కూరగాయలు, పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.రూ.13.51 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ల సమక్షంలో గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన ఓ రైతు నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అదే గ్రామానికి చెందిన రైతు మాడా జగన్మోహన్రావు వద్ద ద్వారకా సీడ్స్ పేరుతో భారీగా ఉన్న విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. అవి అనుమతి లేనివని గుర్తించి, అతడిని విచారించగా, దీని వెనుక ఉన్న అసలు గుట్టును విప్పాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మాలపాటి వెంకటశివారెడ్డి.. ద్వారకా సీడ్స్ పేరుతో విత్తనాలను తయారు చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వనస్థలిపురంలోని గోడౌన్లో ఈ నెల 9న ఆకస్మిక తనిఖీలు చేయగా, రూ.13.51 కోట్ల విలువైన ద్వారకా స్టార్ బిందు పేరుతో ఉన్న 281.84 కిలోల ప్యాకింగ్ మిర్చి విత్తనాలు , 68 కిలోల కాలం ముగిసిన లూజ్ మిర్చి విత్తనాలు, ద్వారకా సీడ్స్ పేరుతో ఉన్న 45 కిలోల టమాట, 11.75 కిలోల బీరకాయ, ద్వారాకా సౌమ్య, సుప్రియా పేరుతో ఉన్న 479.3 కిలోల పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలకు రంగులద్ది అమ్మకం.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డికి గతంలో విత్తనాల కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2017లో ద్వారకా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో లైసెన్స్ పొందాడని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. విత్తన ప్యాకెట్లపై సరైన లేబుళ్లు ముద్రించలేదని, రైతులకు రశీదులు ఇవ్వకుండా రాత్రి సమయంలో బ్రోకర్ల ద్వారా విక్రయిస్తున్నాడని విచారణలో తేలిందని వివరించారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి రంగులద్ది వివిధ కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. కాగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డి, రీజినల్ మేనేజర్ వేమిరెడ్డి లక్షిరెడ్డి, వాసిరెడ్డి ప్రతాప్, సూకరి యాదగిరి, మాడా జగన్మోహన్, రమణలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఖమ్మంలో విత్తన దుకాణం సీజ్ ఖమ్మంలో లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న భాస్కర సీడ్స్ దుకాణాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. అందులో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.26.38 లక్షల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవిరావుల చెర్వులో 18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం కొత్తపల్లిలో దాదాపు రూ.1,37,780 విలువ చేసే 166 ప్యాకెట్ల (దాదాపు 75 కేజీలు), గద్వాల జిల్లాలో 80 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాలలో వివిధ సీడ్స్ దుకాణాల్లో రూ.70వేల విలువ చేసే కాలం చెల్లిన విత్తనాలను పట్టుకున్నారు. ఆదిలాబాద్‌లో.. అనుమతి లేని రూ.23 లక్షల విలువైన పత్తి విత్తనాలను గురువారం ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో 3, గుడిహత్నూర్ మండలంలో 2 దుకాణాల్లో నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 1.5 లక్షల విలువైన 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. కాగా, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని మాదన్నపేటకు చెందిన బోల్లోని సాంబయ్య ఇంట్లో రూ.3.29 లక్షల విలువైన అనుమతుల్లేని నిమ్మకాయ నాగేశ్వర్ పీహెచ్ఎస్ 491 రకం 524 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సూర్యాపేట జిల్లాలో నకలీ విత్తనాల రాకెట్ గుట్టురట్టు
-
ఉత్తుత్తిగా నకిలీ విత్తనాల కేసులు నమోదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో 15 రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,230 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. 18 మందిపై 15 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడుతున్న వారిపై తూతూమంత్రంగా చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్‌లో టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసి, ఎవరో వ్యక్తిపై కేసు నమోదు కావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలొచ్చాయి. ఆ మిల్లును లీజుకిచ్చినట్లు పేపర్లు సృష్టించారనే చర్చ జరిగింది. దీంతో గద్వాల రూరల్ పోలీసులు సోమవారం మిల్లు యజమాని, సీడ్ ఆర్గనైజర్, సీడ్మెన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భీంనగర్‌కు చెందిన బండ్ల రాజశేఖర్‌రెడ్డి (ఏ–1) ధరూర్ మండలం, బురెడ్డిపల్లికి చెందిన ఎం.విజయభాస్కర్‌రెడ్డి (ఏ–2)పై కేసు నమోదుచేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్డి ఎదుట హాజరుపరిచారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు వారిపై చీటింగ్ కేసు, విత్తన యాక్ట్ కిందే కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినా గద్వాల పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ నాడే చెప్పింది.. రాష్ట్రంలో కొనసాగుతోన్న నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కొద్ది రోజుల క్రితం ‘కల్తీ విత్తులతో కొల్లగొడతారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల దందా జరుగుతోంది?, మాఫియా ఆగడాలు, వారికి అండగా నిలుస్తున్నదెవరు?, నామమాత్రంగా కేసుల నమోదుపై ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. నాటి నుంచి సర్కారు ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో జిల్లాల్లోని విత్తన దుకాణాలు, గోదాంలు, మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడగా, వందల మందిపై కేసులు నమోదయ్యాయి. ‘సాక్షి’ కథనం తర్వాత సీడ్మెన్ అసోసియేషన్ సమావేశమైంది. ఇందులో ప్రస్తుతం కేసు నమోదైన బండ్ల రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నాణ్యమైన సీడ్‌ను పండిస్తూ దేశవ్యాప్తంగా నడిగడ్డకు మంచిపేరును తీసుకొస్తామని.. కొందరు వ్యక్తులు గద్వాల సీడ్‌కు ఉన్న బ్రాండ్‌ను వినియోగించుకుని నకిలీవి ఉత్పత్తి చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని’ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన మిల్లులోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. చదవండి: కల్తీ విత్తులతో కొల్లగొడతారు -
నకిలీ పత్తి విత్తుల ఖిల్లాగా మారిన గద్వాల జిల్లా
హైదరాబాద్‌లో అదొక త్రీస్టార్ హోటల్... ఇటీవల వ్యవసాయ శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి అక్కడకు చేరుకున్నాడు. పక్కన ఎవరూ లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత పావు గంటకు ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఒక రూమ్ బుక్ చేసి ఉండటంతో ఆ అధికారి, మరో ఇద్దరు వ్యక్తులు అందులో దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ వెళ్తూ వ్యవసాయ అధికారికి రూ.50 లక్షలున్న పెద్ద సూట్ కేసు ఇచ్చారు. ఆ వ్యక్తులు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా గ్యాంగుకు చెందినవారు కావడం విస్మయం కలిగించే అంశం. ఆయనొక ముఖ్య ప్రజాప్రతినిధి... అధికారులను ప్రభావితం చేయగలరు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా విత్తన కంపెనీలు సహకరిస్తుంటాయి. అలాగే అవసరమైనప్పుడల్లా కోటి, రెండు కోట్ల రూపాయలు సర్దుతుంటాయి. ఇందుకు బదులుగా నకిలీ విత్తనాల సరఫరా చేసేందుకు ఆయా కంపెనీలకు ఆ ప్రజాప్రతినిధి సహకరిస్తుంటారు. ఎక్కడైనా ఆ కంపెనీలు నకిలీ విత్తనాలతో పట్టుబడితే ఈ నేత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతుంటారు. ముందే మామూళ్లు అందుకున్న పోలీసులు, అధికారులు ఓకే అనేస్తుంటారు. గతేడాది, ఈ ఏడాది నకిలీ విత్తనాలతో పట్టుబడిన కొన్ని కంపెనీలకు ఈ ప్రజా ప్రతినిధే సహకరించాడని ఓ కంపెనీ ఉద్యోగి వెల్లడించాడు. అది గద్వాల జిల్లా. నకిలీ పత్తి విత్తనాలకు దశాబ్దంన్నర కాలంగా కేంద్ర బిందువుగా ఉంది. నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా ముఠాలో సీడ్ ఆర్గనైజర్లు కీలకం. జిల్లాలో 23 పత్తి జిన్నింగ్ మిల్లులున్నాయి. ప్రముఖ వ్యాపారులు సీడ్ ఆర్గనైజర్ల పేరిట మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి ప్రధానంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తున్నారు. వీరే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల నేతలకు రూ.కోట్లలో ఫండింగ్ చేస్తుంటారు. మరోవైపు ఈ ముఠాలో జిల్లాకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గద్వాల జిల్లాలో ఈ నెల 8వ తేదీన నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్, నిఘా విభాగం అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్ శివారులో 40 సంచుల నాసి రకం సీడ్ విత్తనాలను పట్టుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా స్థానిక వ్యవసాయ, పోలీసు అధికారులు జాగ్రత్త పడినట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. దీనిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో దాదాపు 50 మంది రైతులు 200 ఎకరాల్లో కలాఫ్ కంపెనీకి చెందిన బంగారం రకానికి చెందిన మిర్చి విత్తనాలను గత అక్టోబర్‌లో జిల్లా కేంద్రంలో కొనుగోలు చేసి పంట సాగు చేశారు. ఒక ప్యాకెట్‌కు రూ.600 నుంచి రూ.700 వరకు వెచ్చించారు. ఎకరాకు 12 నుంచి 15 ప్యాకెట్ల వరకు విత్తారు. నెలలు గడిచినా పూత రాకపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నకిలీ విత్తనాలుగా గుర్తించి లబోదిబోమంటూ డీలర్లను నిలదీసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ‘సాక్షి’కి తెలిపారు. పైగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. అయితే ఆ తర్వాత జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు మొక్కుబడిగా గుంతకోడూరు సందర్శించినట్లు తెలిసింది. నకిలీ విత్తనాలు దశాబ్దాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని అరిగోస తీయిస్తున్నాయి. నకిలీ విత్తనాలతో అన్నదాతలైన రైతుల నోట్లో మట్టి కొడుతూ అక్రమార్కులు తమ జేబుల్లో కాసుల పంట పండించుకుంటున్నారు. దిగుబడి రాక నష్టపోతున్న రైతులు అదేమని నిలదీస్తే విత్తన మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నారు. విత్తన చట్టంలో ఉన్న లొసుగులు, మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారం ఏళ్ల తరబడి నిరాటంకంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఉన్నా, ఎన్నో కేసులు నమోదవుతూ అరెస్టులు జరుగుతున్నా.. నకిలీ దందాను నిర్వహించే కంపెనీ యజమానుల్లో ఏ ఒక్కరికీ గత 20 ఏళ్లలో జైలు శిక్ష పడలేదని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పత్తి, సోయా, మిర్చి, వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు సాగవుతాయి. దీంతో ఈ పంటలకు సంబంధించిన నాసిరకపు విత్తనాలే ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే నకిలీ విత్తన దందాలో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. కాగా సోయా, మిర్చి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండడంతో నకిలీ విత్తన మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ భారీ దందాకు తెర లేపినట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. ఈ మకిలీ దందాకు ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, మరో కీలక అధికారి అండ తోడవడంతో.. సీడ్ ఆర్గనైజర్లు, దళారులు, దుకాణదారులతో కూడిన పటిష్ట నెట్వర్క్ నకిలీ విత్తన విక్రయాలు జరిపేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించి అమల్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తనం మళ్లీ రాష్ట్ర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వ్యాపారులు, దళారులు నిరాటంకంగా అమాయక రైతాంగానికి వీటిని అంటగడుతున్నారు. అసలు నకిలీ విత్తనాలంటే.. జెనెటిక్ ప్యూరిటీ లేనివన్నీ (మొలకెత్తే శాతం నిర్దేశిత మొత్తానికన్నా తక్కువ ఉండటం) నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ చెబుతోంది. సాధారణంగా రైతులు తాము పండించిన పంటనే విత్తనాలుగా వాడి మళ్లీ పంటలు పండిస్తుంటారు. అయితే మొలకెత్తే శాతం తగ్గడం, తద్వారా దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విత్తన తయారీ అనేది మొదలయ్యింది. వ్యవసాయ శాఖతో పాటు (ప్రభుత్వ), ప్రైవేటు కంపెనీలు కూడా ఈ విధంగా విత్తనోత్పత్తిని చేస్తున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, కంపెనీలు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) ఎప్పటికప్పుడు రైతులకిస్తాయి. వారు ప్రత్యేకంగా విత్తనోత్పత్తి చేసి తిరిగి ప్రభుత్వానికి, కంపెనీలకు అందజేస్తారు. ఆ విత్తనాలనే వ్యవసాయ శాఖ, ప్రైవేటు కంపెనీలు రైతులకు విక్రయిస్తుంటాయి. లేబొరేటరీల్లో పరీక్షించాలి రైతులు ఆయా పంటలను వేర్వేరు దూరాల్లో పండించాలి. ఈ దూరం రెండు మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది. వరిలోనైతే రెండు మీటర్ల దూరంలో వేర్వేరు వెరైటీలు పండించాలి. పత్తి విత్తనో త్పత్తిలో వేర్వేరు వెరైటీల మధ్య కనీసం 25 మీటర్లు ఉండాలి. ప్రభుత్వ విత్తనోత్పత్తిలో అయితే ఈ దూరంగా సరిగ్గా ఉందా లేదా అని వ్యవసాయ అధికారి మూడుసార్లు తనిఖీ చేస్తారు. ఈ పంటలను ప్రత్యేకంగా కోసి ప్రాసెసింగ్‌కు తీసుకురావాలి. వీటిని డీఎన్ఏ టెస్టులో, లేదా గ్రోఔట్ టెసు ్టల్లో పరీక్షించి నాణ్యతను (జెనెటిక్ ప్యూరిటీ) నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా, 98–99 శాతం నాణ్యత లేకపోయినా అది నాసిరకం కిందకు వస్తుంది. విత్తనాల్లో మొలక శాతం 65 నుంచి 90 వరకు ఉండాలి. పత్తిలో మొలకశాతం 75 ఉండాలి. అంతకంటే తక్కువుంటే నాసిరకం లేదా నకిలీ కింద లెక్క. అలాగే పత్తిలో బీటీ ప్రొటీన్ 90 శాతం ఉండాలి. ఈ మేరకు నాణ్యత ఉన్న వాటినే కంపెనీలు రైతులకు విక్రయించాలి. విత్తనాల ప్యాకెట్ల లేబుల్‌పై ఆ విత్తనం నిర్దేశిత ప్రాంతానికి సరిపోతుందో లేదో రాయాలి. నాణ్యత శాతం, మొలక, తేమ శాతం, పత్తికి బీటీ ప్రొటీన్ శాతం పేర్కొనాలి. లాట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. పత్తికి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) ధ్రువీకరణ ఉండాలి. ఇవి ఉంటేనే నాణ్యమైన విత్తనంగా గుర్తిస్తారు. జనరల్ సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రైవేట్ వెరైటీలకు ఆయా కంపెనీల స్వీయ ధ్రువీకరణ చేసుకుంటే చాలు. లైసెన్స్ వచ్చినట్టే. ఆ విధంగా విత్తన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. స్వీయ ధ్రువీకరణ, విత్తనోత్పత్తి మీద నియంత్రణ విత్తన చట్టంలో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కంపెనీలు నకిలీ విత్తన దందాకు తెరతీస్తూ రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారంలేని విత్తనాలను, గడువు ముగిసిన విత్తనాలను, స్థానికంగా తయారు చేసిన విత్తనాలను పెద్దయెత్తున రైతులకు అంటగడుతూ విత్తన మాఫియా జేబులు నింపుకుంటోంది. ప్రభుత్వ విత్తనాలు చాలినన్ని లభించకపోవడం, నకిలీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వీటి వైపు మొగ్గుచూపుతూ మోసపోతున్నారు. పత్తిదే సింహభాగం ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రాష్ట్రంలో రూ.1,000 కోట్లకు పైనే సాగుతోంది. ఒక్క నకిలీ పత్తి విత్తన దందానే దాదాపు రూ. 500 కోట్లు ఉంటుందని తేలింది. ఈసారి పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో రానున్న ఖరీఫ్‌లో 75 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఏ విత్తనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందో ఆ విత్తనాలకు సంబంధించే నకిలీ విత్తనాలు పుట్టుకొస్తుంటాయి. ఉదాహరణకు ఒక ఎకరాలో పత్తి సాగుకు ఏకంగా రూ.1,500 విలువైన విత్తనాలను విత్తాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఈ పంటకు సంబంధించి తక్కువ ధరతో నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. రైతులు కూడా ఎప్పటికప్పుడు ధర తక్కువగా ఉంది కదా అని వాటినే కొనుగోలు చేస్తూ దిగుబడి రాక మోసపోతున్నారు. ఈసారి పత్తి సాగు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. మరోవైపు బీజీ–3 పత్తి విత్తనాలపై నిషేధం ఉన్నా.. తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులు దీనిని సాగు చేస్తుంటే, అధిక లాభాల కోసం కక్కుర్తి పడుతూ వ్యాపారులు వీటిని అక్రమ మార్గాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ పత్తి గద్వాలలో పండిస్తారు. అయితే పత్తి నకిలీ విత్తనాలకు సంబంధించి 150 మంది ‘ఆర్గనైజర్లు’ ఉన్నారు. రైతులకు, కంపెనీలకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా ఎక్కువగా సాగుతోంది. ఎస్ఆర్ సీడ్స్, రజనీ సీడ్స్, పల్లవి, పావని, అరుణోదయ, కావ్య, శ్రీపావని పేరుతో విక్రయాలు చేస్తున్నారు. ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులు కల్తీ విత్తనాలను అంటగ డుతున్నారు. వేల క్వింటాళ్ల విత్తనాలు లూజ్ సంచుల్లో తీసుకువచ్చి, ఆకర్షణీయ సంచుల్లో ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. మిర్చి, సోయా, కంది విత్తనాల్లోనూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో రైతులు సోయాబీన్ సాగు చేస్తుంటారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది. ఇందుకు గాను 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, ఈ ఏడాది ప్రభుత్వ పరంగా 35 వేల క్వింటాళ్లే అందుబాటులో ఉండటంతో మిగిలిన విత్తనాల కోసం రైతులు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని అనేక కంపెనీలు నకిలీ సోయా విత్తన దందాకు దిగాయి. గతంలో కొన్ని కంపెనీలు సరఫరా చేసిన నకిలీ సోయా విత్తనంలో 10 నుంచి 15 శాతం కూడా మొలకెత్తలేదని రైతులు తెలిపారు. మరోవైపు పాలమూరు జిల్లాలో కంది విత్తన మాఫియా తన కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక ఖమ్మం జిల్లాలో మిర్చి నకిలీ విత్తన వ్యవహారం జోరుగా సాగుతోంది. గతంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. అన్నీ ప్రైవేట్ కంపెనీలే.. మొక్కజొన్న, పత్తి, మిర్చి నూటికి నూరు శాతం ప్రైవేట్ కంపెనీలే సమకూర్చు తున్నాయి. ఇక కంది, వరిలో 50 శాతం కూడా ప్రైవేట్ విత్తనమే. ఇవన్నీ కూడా చట్టం పరిధిలోకి రావు. చిన్నా పెద్దా కంపెనీలు నాసిరకం అమ్ముతున్నాయి. రాష్ట్రంలో పత్తి విత్తనాలను అమ్మే కంపెనీలు 50 ఉంటే, అందులో 20 వరకు చిన్నాచితక కంపెనీలు ఉన్నాయి. ఎక్కువగా వీటి ద్వారానే నాసిరకపు విత్తనం, బీజీ–3 విత్తనం రైతులకు చేరుతున్నాయి. అక్రమ దందా ఇలా..: నకిలీ విత్తన మాఫియా పలు రకాలుగా విత్తనాలు, వాటి ప్యాకెట్లను మార్చుతుంది. ప్యాక్ చేయకుండా విత్తనాలు లూజ్‌గా అమ్ముతారు. వీటిలో నాసిరకానివి కలుపు తారు. అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేస్తారు. నకిలీ లేబుళ్లు ముద్రించి విక్రయిస్తారు. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేస్తారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా స్థానికంగా తయారు చేస్తారు, దళారుల ద్వారా మార్కెట్లోకి పంపుతారు. రీ సై‘కిల్లింగ్’..: గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్ (పుచ్చులు వంటి వాటిని తొలగించి తిరిగి ప్యాక్ చేయడం) చేసి వాటినే రైతులకు అమ్ముతూ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలా విక్రయిస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ దాడుల్లో ఇది బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయి అండదండలు ఉండటంతో వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. గతంలో 15 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. లక్షలాది ఎకరాల్లో నిషేధిత బీజీ–3 సాగు..: బీజీ–3 పత్తిపై నిషేధం ఉంది. ఈ పంటలో కలుపు తీసేందుకు గైల్‌పోసైట్ అనే ప్రమాదకరమైన మందు వాడతారు. దానివల్ల కూలీల ఖర్చులు ఎకరానికి రూ. 8 వేల వరకు మిగులుతాయి. గైల్‌పోసైట్ చల్లటం వల్ల కలుపు పోతుంది కానీ, వాతావరణం, జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అందువల్లే దీనిపై నిషేధం ఉంది. కానీ రాష్ట్రంలో బ్లాక్‌లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంది. తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. బీజీ–3 పత్తిని ఎక్కువగా మంచిర్యాల, భువనగిరి, ఆసిఫాబాద్ జిల్లాల్లో వేస్తున్నారు. ఒక విత్తన డీలర్ ఒక సాధారణ పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ. 25– రూ. 30 లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ. వెయ్యి చొప్పున మిగులుతాయి. దీంతో అక్రమంగా వ్యాపారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి సాగు అవుతుందని సమాచారం. ఈసారి మరింతగా మార్కెట్‌ని ముంచెత్తుతాయని అంచనా. ఎన్ని కేసులో.. నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో గత ఏడాది 34 కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్ శివారులో 42 సంచుల (26.10 క్వింటాళ్లు) నాసి రకం విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్‌కు చెందిన సీడ్ వ్యాపారి గాజుల శ్రీనివాస్, పత్తి మిల్లు యజమాని ధర్మారెడ్డి, మిల్లులో పని చేసే గుమాస్తా రఫీక్, డీసీఎం డ్రైవర్ మనోజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో 2020 జూన్ 18వ తేదీన 25 కేజీల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. మల్దకల్ మండలం కర్తిరావుల చెర్వు గ్రామానికి చెందిన పరశురాములు విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఉండవల్లి మండల కేంద్రంలో 2020 జూన్ 27వ తేదీన ఇద్దరు వ్యక్తులు లూజ్ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేసి 53 కేజీల విత్తనాలు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మానవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రానికి చెందిన వ్యక్తి 2019లో లూజ్ విత్తనాలు విక్రయిస్తుండగా.. పోలీసులు కేసుపెట్టారు. 2020లో నల్లగొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మానవపాడు మీదుగా విత్తనాలు తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదైంది. 2020 జూన్ 16వ తేదీన రాజోలి మండల కేంద్రానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి వడ్డేపల్లి మండలం బుద్దారెడ్డి పల్లె నుంచి తీసుకొచ్చి స్థానికంగా 20 కేజీల విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయిజలో 2020 మే 28న కూట్కనూరులో 320 కేజీలు, మూగోనిపల్లిలో 2020 జూన్ ఒకటో తేదీన 120 కేజీల లూజ్ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొత్తినోనిదొడ్డిలో 2020 జూన్ ఒకటో తేదీన 43 కేజీల లూజ్ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. 2020 జూన్ 9వ తేదీన మేడికొండలో 75 కేజీలు, 11న తొత్తినోనిదొడ్డిలో 150 కేజీలు, 17వ తేదీన ఉత్తనూరులో ఒక చోట 35 కేజీలు, మరో చోట 55 కేజీల లూజ్ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఉత్తుత్తి విత్తన చట్టాలు నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు 1966 సీడ్ యాక్ట్, 1968 సీడ్ రూల్స్, 1983 సీడ్ కంట్రోల్ ఆర్డర్ వంటివి ఉన్నాయి. పత్తికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్–1989, కాటన్ సీడ్ యాక్ట్–2007 ఉంది. అయితే కంపెనీలు నాసిరకపు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్లో లేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 99 శాతం కేసుల్లో అక్రమార్కులకు కనీస శిక్షలు కూడా పడటం లేదు. వాస్తవానికి నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు సీడ్ బిల్–2004 పార్లమెంటులో పెట్టినా అప్పటినుంచి అది ఆమోదం రాలేదు. 2020లో మళ్లీ పెట్టినా పాస్ కాలేదు. అది పాసైతే సీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని, ఆ విత్తన సామర్థ్యం ఎంత? ఎంత ఉత్పత్తి, ఉత్పాదకత వస్తుంది? చీడపీడలకు ఎంతమేరకు తట్టుకుంటుంది? వంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ సందర్భంగా కంపెనీలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాత కాలపు విత్తన చట్టాలు మారేంతవరకు నకిలీ, నాసిరకపు విత్తనాలను విక్రయించే, ఉత్పత్తి చేసేవారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, అందువల్ల రాష్ట్రాలు తాత్కాలికంగా చట్టాలు చేసుకుంటే మంచిదని అంటున్నారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తి విత్తన ధరలను నియంత్రణలో ఉంచేందుకు కాటన్ యాక్ట్ తీసుకురావడాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ విత్తన భాండాగారంగా వెలుగొందుతున్న తరుణంలో రాష్ట్రానికి విత్తన చట్టం ఆవశ్యకత ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. -బొల్లోజు రవి -
వామ్మో.. విదేశీ విత్తన ప్యాకెట్లు!
కరోనా విపత్తుతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న తరుణంలో విదేశాల నుంచి అవాంఛిత విత్తనాల ప్యాకెట్లు అడగకుండానే పౌరుల పేరు మీద వేలాదిగా పోస్టులో రావటం అమెరికా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాల్లో ఇటీవల పెను సంచలనాన్ని కలిగించింది. వ్యవసాయక జీవవైవిధ్యానికి, ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించే దురుద్దేశంతోనే చైనా ఈ ‘విత్తన బాంబుల’ను విసురుతున్నదని సర్వత్రా ఆందోళన నెలకొంది. అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు ఎవరి పేరు మీద వచ్చినా ఆ విత్తనాలను ముట్టుకోవద్దని, పొలంలో, పెరట్లో, కుండీల్లో ఎక్కడా కూడా వాటిని మట్టిలో నాటవద్దని, ఇటువంటి విదేశీ విత్తన ప్యాకెట్లు ఎవరికైనా అందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలు పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే, కోరని వ్యక్తులకు పోస్టు/కొరియర్ ద్వారా విదేశాల నుంచి వస్తున్న ఈ విత్తన ప్యాకెట్లపై చైనా పేరు ముద్రించి ఉండటంతో చైనా దేశం నుంచే దురుద్దేశంతోనే రకరకాల రంగుల్లో, రకరకాల పంటల విత్తనాలను పంపుతున్నట్లు భావిస్తున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కూడా ఇటువంటి హెచ్చరికే చేసింది. అనుమానాస్పద విత్తనాలు విషపూరితమైనవి అయి ఉండొచ్చని.. వైరస్లు, బ్యాక్టీరియా వ్యాధులతో అనేక పంటలకు పెనునష్టం కలిగించేవి అయి ఉండొచ్చని.. భయంకరమైన కలుపు జాతి మొక్కల విత్తనాలు కూడా ఇందులో ఉండొచ్చని హెచ్చరించింది. వీటి ద్వారా వ్యవసాయ పర్యావరణానికి, జాతి భద్రతకు ముప్పు కలగొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఇటువంటి విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విత్తనాభివృద్ధి సంస్థలు, పరిశోధనా సంస్థలకు కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డా. దిలిప్ కుమార్ శ్రీవాస్తవ లేఖ రాశారు. మన దేశంలో ఎవరికీ అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు విదేశాల నుంచి పరిశోధనల నిమిత్తం విత్తనాలను, మొక్కలను తెప్పించుకోవడానికి ప్రత్యేకమైన క్వారంటెయిన్ వ్యవస్థ ఉంది. అయినా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల దగ్గర అధికారుల కన్నుగప్పి కొన్ని విత్తనాలు, మొక్కలు మన దేశంలోకి వస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి అలా వచ్చిన వర్తులాకార తెల్లదోమ కొబ్బరి, పామాయిల్ వంటి ఉద్యాన తోటలను గత మూడేళ్లుగా అల్లాడిస్తున్న సంగతి జ్జాపకం పెట్టుకోవాలి. అయితే, విదేశాల్లో కంటికి నచ్చాయని పెరట్లో పెంచుకుందామన్న ఆసక్తి కొద్దీ ఒకటీ అరా అయినా సరే విదేశీ విత్తనాలను మన దేశానికి తెస్తున్న / తెప్పించుకుంటున్న వారు లేకపోలేదు. తెలిసీ తెలియక చేసే ఇటువంటి పని ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా తాము దేశ జీవ భద్రతకు, ఆహార భద్రతకు ముప్పు తెచ్చి పెడుతున్నారని గుర్తించాలని అధికారులు హెచ్చస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయండి: డా.కేశవులు అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం(ఐఎస్‌టిఎ) ఉపాధ్యక్షులు, తెలంగాణ విత్తనోత్పత్తి – ఆర్గానిక్ ధృవీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు ఈ విషయమై ముందుగా స్పందించి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. విత్తనంతో పాటు విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకరమైన చీడపీడలు మన దేశ జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో విత్తన క్వారంటెయిన్ యంత్రాంగం మరింత జాగరూకత వహించాలని ఆయన సూచించారు. ఎవరికైనా అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు అందితే వెంటనే దగ్గరలోని వ్యవసా, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లక్షలాది ఎకరాల్లో అనేక రాష్ట్రాల్లో నిషిద్ధ కలుపు మందును తట్టుకునే పత్తి విత్తనాలు అక్రమంగా సాగవుతున్న మన దేశంలో ఇలాంటి అవాంఛనీయ విత్తనాలను అరికట్టడం సాధ్యమేనా అన్న సందేహాలకు తావు లేదని, ప్రభుత్వం పటిష్ట నియంత్రణ చర్యలు తీసుకుంటున్నదని ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో డా. కేశవులు అన్నారు. దశాబ్దాల క్రితం గోధుమలతోపాటు మన దేశానికి అమెరికా నుంచి దిగుమతైన పార్థీనియం (వయ్యారిభామ/ కాంగ్రెస్ గడ్డి) మొక్కలు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న విషయం తెలిసిందే. -
నకిలి విత్తనాల గుట్టు రట్టు చేసిన పోలీసులు
సాక్షి, నల్గొండ: జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్‌ను మంగళవారం ఛేదించారు. ఈ రాకెట్‌కు సంబంధించిన 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాక్ చేసే మెషినరీ సామాగ్రిని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలం కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తనాల ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబుల్ లేకుండా కనిపించడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణ నుంచి ఆంధ్రవరకు ఈ రాకెట్‌కు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. (కరోనా టెస్ట్ చేయలేదని నానా హంగామా) దీంతో ఎస్పీ రంగనాధ్ జిల్లా స్థాయిలో ఏఎస్పీ సతీష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రంగంలోకి దిగి దీనితో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. ఒక్కో లింక్ చేధిస్తున్న కొద్ది వీటిని విక్రయిస్తున్న ముఠా సభ్యులు మరికొంత మంది బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా పరిధిలోని గుర్రంపోడు, నకిరేకల్, శాలిగౌరారం, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన మరికొందరి పాత్ర వెల్లడైంది. మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు. అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వీటిని ప్యాకింగ్ చేసే వారు, రవాణా చేసే వారు, విక్రయించే వారు ఉన్నట్లు ఎస్పీ రంగనాధ్ వివరించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. వీరిపై పీడి యాక్టు పెట్టె యోచనలో ఉన్నట్లు, అందుకు సరిపోయే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఎస్పీ రంగనాధ్ వివరించారు. ఇప్పటికే ఈ విత్తనాలు కొని పంట వేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’) -
నకిలీ.. మకిలీ!
మేకల కళ్యాణ్ చక్రవరి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అలా ప్రవేశించాయో లేదో మళ్లీ నకిలీ విత్తనాల మకిలీ అంటుకుంది. ప్రతి సంవత్సరం మాది రిగానే ఈ వానాకాలంలోనూ ఈ మాయదారి విత్తనాల ముప్పు పొంచి ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో సోయాబీన్, కంది రైతాంగానికి నకిలీల బెడద పట్టుకోగా, ఇప్పుడిప్పుడే విత్తనాల కొనుగోళ్లు ప్రారంభించిన పత్తి రైతు కూడా ఈ నకిలీల బారిన పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వానాకాలంలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే అందరి కళ్లుగప్పి రాష్ట్రంలో ప్రతియేటా చెలామణి అయ్యే నకిలీ విత్తన మాఫియా యథేచ్ఛగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సోయా... చలే గయా! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో రైతులు సోయాబీన్ సాగు చేస్తుంటారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది. ఇందుకు గాను 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, ప్రభుత్వం వద్ద 18 వేల క్వింటాళ్లే అందుబాటులో ఉండటంతో మిగిలిన విత్తనాల కోసం రైతులు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తెలంగాణ సీడ్స్ సంస్థ నిజామాబాద్ జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల ద్వారా రెండు, మూడు రకాల కంపెనీల సోయాబీన్ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసింది. ఇందులో, వీకేర్ అగ్రిటెక్, అక్షయ అగ్రిటెక్ జేఎస్335 రకాల విత్తనాలు 10 నుంచి 15 శాతం కూడా మొలకెత్తలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి నకిలీవేనని బల్లగుద్ది చెబుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే మొలకెత్తని విత్తులను రైతులకు అంటగడితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇక పాలమూరు జిల్లాలో కంది విత్తన మాఫియా తన కార్యక్రమాలను ప్రారంభించింది. అలంపూర్ ప్రాంతంలో కాలం చెల్లిన కంది విత్తన ప్యాకెట్లు బయటపడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చిలో పరీక్షించి 2019 నవంబర్ వరకు మాత్రమే గడువున్న విత్తనాలను ప్రస్తుతం రైతులకు అంటగడుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి కూడా పీఏసీఎస్‌ల ద్వారానే సబ్సిడీపై ఇస్తున్నారని, సొసైటీల్లో ఇచ్చే విత్తనాలే ఇలా ఉంటే ప్రైవేటు కంపెనీల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. జర్మినేషన్ పూర్తిస్థాయిలో లేకుండానే విత్తనాల గడువు తేదీలను మార్చి అవే విత్తనాలను రీసైక్లింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాస్‌్కఫోర్స్ అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాణిజ్య పంటల్లో మరీ నష్టం నియంత్రిత వ్యవసాయంలో భాగంగా పత్తి సాగు పెంచాలని, రైతులను ఆ మేరకు ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానంలో స్పష్టంగా పేర్కొంది. దీంతో గతేడాది కంటే ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు అదనంగా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే పెరిగే పత్తి సాగును ఆధారం చేసుకొని రైతులను మోసం చేసేందుకు అక్రమార్కులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టడం, నిషేధిత బీజీ–3 విత్తనాలను విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గతంలో కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి, మిర్చి పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను విక్రయించడంతో రైతులు నష్టపోయిన అనుభవాలున్నాయి. అయితే, ఈ సందర్భాల్లో విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా యథేచ్ఛగా మళ్లీ మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడిందని, అప్పట్లో విత్తులు అమ్మిన వ్యాపారుల నుంచి విత్తనాల రేటుకు డబుల్ రేటు రైతులకు ఇప్పించి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకుందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వాణిజ్య పంటల విత్తనాలు నాణ్యత ఉండేలా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమయాన్ని ఆసరాగా చేసుకుని.. గత ఆరేళ్లలో పత్తి సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం వల్ల కూడా సాగు పెరిగిందని అంచనా వేస్తున్నారు. పత్తి మద్దతు ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు మరింత రేకెత్తాయి. దీంతోపాటు ఉత్పత్తి కూడా అమాంతం పెరుగుతుండటం గమనార్హం. సకాలంలో వర్షాలు కురవడం వల్లే దిగుబడులు మరింత పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014–15లో పత్తి 42.32 లక్షల ఎకరాల్లో సాగైతే, 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. గతేడాది ఏకంగా 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది ప్రభుత్వం దాన్ని ఏకంగా 65 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. అంటే అదనంగా 10.54 లక్షల ఎకరాలు ఈ ఏడాది సాగు కానుంది. అందుకోసం ఈసారి పత్తి విత్తన ప్యాకెట్లు 1.30 కోట్లు అవసరం పడతాయని అంచనా వేశారు. దీనికి అదనంగా మరో 10 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని కూడా అంటున్నారు. అయితే ఇప్పటివరకు దేశంలో బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. బీజీ–2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీరంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ–3 రంగప్రవేశం చేసింది. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీలు, వ్యాపారులు నిషేధిత బీజీ–3ని రైతులకు అంటగడుతున్నారు. ఏడాదికేడాది బీజీ–3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది. రాష్ట్రంలో పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు గతంలోనే నిర్ధారణకు వచ్చారు. అయితే మనదేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు, దళారులను గుర్తించడం, ఆయా గోదాములను పసిగట్టడం ద్వారా పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటల రైతాంగం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘టాస్్క’లోనే ఉన్నాం: వ్యవసాయ శాఖ తాము అప్రమత్తంగానే ఉన్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ కమిటీలు క్రియాశీలంగానే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది జూన్ 19 నాటికి నకిలీ విత్తనాలకు సంబంధించి 15 మందిపై 60 కేసులు, 122 మందిపై 420 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో 10,705 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేశామని, వీటి విలువ రూ.4 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. మరో రూ.4 కోట్లకు పైగా విలువ గల పలు రకాల పంటల విత్తనాలను అదుపులోకి తీసుకుని వాటికి సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. నకిలీ ‘మార్గాలివే’... నకిలీ విత్తన మాఫియా తన కార్యకలాపాల కోసం పలు రకాలుగా విత్తనాలు, వాటి ప్యాకెట్లను ఉపయోగించుకుంటోంది. ప్యాక్ చేయకుండా విత్తనాలు అమ్మడం, జీఈఏసీ అనుమతి లేకుండా విక్రయించడం, గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేయడం, నకిలీ విత్తనాలను స్థానికంగా తయారు చేయడం, లేబుళ్లు మార్చడం, స్టాక్‌లో తేడాలుండటం, స్టాక్ రిజిస్టర్లలో విత్తనాలను నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేయడం లాంటి మార్గాల ద్వారా నకిలీ విత్తనాలను మార్కెట్లోకి పంపుతుంటారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అన్నింటినీ సరిచూసుకున్న తర్వాతే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గంగుల నరేందర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వడ్యాట్ గ్రామానికి చెందిన ఈయన మోర్తాడ్ పీఏసీఎస్‌లో సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేసి పది రోజుల కింద నాటాడు. రెండెకరాలకు విత్తనం కోసం రూ.3,600, రోటవేటర్ కోసం రూ.1,200, అడుగు మందు కోసం రూ.950, డ్రిప్ పైప్‌లను వేయడం కోసం కూలీలకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేశాడు. రూ.6,750 ఖర్చు చేసి పొలంలో ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు విత్తితే అవి తీరా మొలకరాలేదు. దీనిపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పొలం దున్నేసి మళ్లీ విత్తుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ రైతు మళ్లీ సోయా విత్తులు పెట్టాలంటే రూ.8,000 వరకు ఖర్చవుతుంది. -
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయలో ఉన్న ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. రూ.31 లక్షల విలువైన భారీ నకిలీ విత్తనాలతో పాటు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.12.24 లక్షల విలువైన 1529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, రూ.18. 76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు అన్నారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించి, వారిపై విత్తన చట్టం, ఐ.పీ.సీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
నాణ్యత లేని విత్తన సంస్థలపై వేటు
సాక్షి, అమరావతి: ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి. డి.వెంకటరాయుడు మూడు మూటల విత్తన కాయల్ని తీసుకున్నాడు. మూట విప్పి చూస్తే అవి కె–6 రకంగా అనిపించలేదు. కాయల్ని వలవకుండానే రెండు మూడు కిలోల విత్తనాలు కిందపడ్డాయి. అవి నాణ్యత లేనివిగా గుర్తించి గ్రామ వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశాడు. ► అనంతపురం రూరల్ మండలం నారాయణపురానికి చెందిన జగన్ మూడు బస్తాల వేరుశనగ విత్తనాన్ని కొన్నాడు. కాయల్ని కొట్టి విత్తనాన్ని చూస్తే పప్పు పుచ్చిపోయి, ఏమాత్రం నాణ్యత లేకుండా ఉంది. దీంతో తనతోపాటు కాయల్ని కొన్న 130 మంది రైతులతో కలిసి శుక్రవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా.. అనంతపురం జిల్లాలో ఐదారు మండలాలు.. నార్పల, అనంతపురం రూరల్, కందుకూరు, కదిరి, పెనుగొండ, రాప్తాడుల్లో నాణ్యత లేని విత్తన వేరుశనగ కాయలు పంపిణీ అయ్యాయి. రైతుల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్‌ఫెడ్, ఇతర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా ఎలా జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనంతపురంలోనే ఉన్న ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబును ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన ప్రైవేటు సంస్థలపై వేటు వేశారు. ఆ సంస్థలు సరఫరా చేసిన 835 క్వింటాళ్ల కాయల్ని వెనక్కి తీసుకుని రైతులకు మేలైన కాయల్ని సరఫరా చేస్తామని ప్రకటించారు. రైతుల హర్షాతిరేకాలు పుచ్చిపోయిన, పనికిమాలిన నాణ్యత లేని కాయల్ని వెనక్కు తీసుకుని తిరిగి నాణ్యమైన కాయల్ని ఇస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించడం పట్ల ఆయా మండలాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో కాయలు బాగోకపోతే పారేయడం తప్ప వేరే మార్గం ఉండేది కాదని.. ఇప్పుడా బాధ తప్పిందని నారాయణపురానికి చెందిన వేణుగోపాల్, రాప్తాడుకు చెందిన జయప్రకాష్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు తెలిపారు. ఆ రెండు సంస్థలే.. ► అనంతపురం,కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కె–6 రకం 4,81,344 క్వింటాళ్లు, నారాయణి 25,263 క్వింటాళ్లు, ధరణి 992 క్వింటాళ్లు కలిపి మొత్తం 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయ కావాల్సి ఉంది. ► ఇందులో వ్యవసాయ శాఖ ’రైతు విత్తనం రైతు చెంతకే’ అనే కార్యక్రమం కింద 2 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన కాయను కొనుగోలు చేసింది. ► మిగతా 3 లక్షల క్వింటాళ్ల కాయను కొనుగోలు చేసే బాధ్యతను ఏపీ సీడ్స్‌కు అప్పగించింది. అయితే.. రైతుల వద్ద సరుకు లేకపోవడంతో ఏపీ సీడ్స్ అధికారులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించారు. వీటిలో కొన్ని నాణ్యత లేని విత్తన కాయలను సరఫరా చేశాయి. ► ఈ నెల 18 నుంచి గ్రామ సచివాలయాల వద్ద విత్తన పంపిణీ ప్రారంభమైంది. ► అనంతపురం రూరల్, రాప్తాడు, నార్పల మండలాలకు శ్రీ సుబ్రమణ్యేశ్వర అగ్రిటెక్ (వనపర్తి, ప్రొద్దుటూరు), గంగాధర్ అగ్రిటెక్ (ప్రొద్దుటూరు) నుంచి విత్తన కాయలు వచ్చినట్టు వ్యవసాయ శాఖాధికారులు గుర్తించి వాటిపై వేటు వేశారు. ► మనీలా, కంబదూర్, ఎ.నారాయణపురం, బొమ్మేపర్తి, గంగిరెడ్డిపల్లి, మరూర్–1, రాప్తాడు, చెలమూరు గ్రామాల్లోని రైతులకు తిరిగి నాణ్యమైన కాయల్ని సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్ ప్రకటించింది. ► మిగతా మండలాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వం నిఘా బృందాలను పంపింది. ► రైతులు తమ సమస్యలను 1902, 1907కు ఫిర్యాదు చేయొచ్చు. -
నకిలీలకు చెక్.. కల్తీకి కళ్లెం
ముఖ్యమంత్రి ముందు చూపు.. సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం సమగ్ర (ఇంటిగ్రెటెడ్) ప్రయోగశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.198 కోట్లు వ్యయం చేయనుంది. సాగు ఖర్చులు తగ్గించి ఉత్పాదన పెంచడంతోపాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా ప్రయోగశాలలు కీలకపాత్ర పోషిస్తాయి. రైతు లాభమే ధ్యేయంగా ఈ ల్యాబ్‌లు పని చేస్తాయి. నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే కేంద్రాలను వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా ప్రయోగశాలలుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ముందు చూపు.. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులతో రైతులు నష్టపోకుండా ముందు చూపుతో ఈ ప్రయోగశాలలకు శ్రీకారం చుట్టింది. నాబార్డ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదాలోనూ వీటి గురించి ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. వైఎస్సార్ ల్యాబ్స్ కోసం ఇప్పటికే స్థలాల ఎంపిక జరిగిందని, త్వరలో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రయోజనాలు ఎన్నెన్నో... ప్రస్తుతం నమూనాల సేకరణ, ఫలితాల విశ్లేషణకు చాలా సమయం పడుతోంది. అన్ని కంపెనీల ఉత్పత్తులు ఈ పరిధిలోకి రావడం లేదు. ఇకపై అలా కుదరదు. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థలోని ఆటోమేటెడ్ శాంప్లింగ్ మాన్యువల్ వ్యవస్థని పూర్తిగా మారుస్తారు. జిల్లా స్థాయిలోనే శాంపిళ్లను పరీక్షించి నకిలీవని తేలితే చట్టపరమైన చర్యలు చేపడతారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ కేంద్రాలకు బాధ్యుడిగా ఉంటారు. 600 చదరపు గజాల స్థలంలో ఇవి ఏరా>్పటవుతాయి. 2,112 చదరపు అడుగుల స్థలాన్ని భవనం కోసం వినియోగిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వ్యయం అవుతుంది. ఇందులో భవనానికి రూ.55 లక్షలు కేటాయించారు. జిల్లా స్థాయి ల్యాబ్ 1.10 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలు కొత్తవాటితో విలీనం అవుతాయి. పర్యవేక్షణ ఇలా.. నెల్లూరులోని జీవన ఎరువుల నాణ్యతా నియంత్రణ ప్రయోగశాల, అమరావతిలోని పురుగు మందుల అవశేషాల పరీక్షా ప్రయోగశాల, గుంటూరులోని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ కేంద్రాలు ఇకపై రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ఏకీకృత డిజిటల్ వేదిక ద్వారా శాంపిళ్లు స్వీకరిస్తాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు ఏర్పాటవుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల శాంపిళ్లను స్వీకరించి కోడింగ్ చేసి పరీక్షా కేంద్రాలకు పంపడం వీటి ప్రధాన కర్తవ్యం. ప్రతి కోడింగ్ సెంటర్‌కు సుమారు రూ.90 లక్షల వరకు వ్యయం అవుతుంది. జిల్లా ల్యాబ్‌లకు అధిపతిగా ఉండే ఏడీఏకి 12 మంది ఏవోలు సహకరిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌లను రెగ్యులర్ ఏడీఏ పర్యవేక్షిస్తారు. గ్రామ వీఏఏలు లేదా మండల సిబ్బంది ఆయనకు సహకరిస్తారు. ఆక్వా ల్యాబ్‌లకు రూ.12.42 కోట్లు ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు కోస్తాలోని 46 నియోజకవర్గాలలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలతో పాటు ఆక్వా ల్యాబ్‌లు కూడా ఏర్పాటవుతాయి. వీటికోసం రూ.12.42 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆక్వా ల్యాబ్‌లతో రైతులకు మేలైన సీడ్ అందుతుంది. ఆక్వా సీడ్‌పై నియంత్రణ, పరీక్షలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందడుగు ‘నకిలీ, కల్తీలను అరికట్టి అన్నదాతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమగ్ర ప్రయోగశాలలు దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే పెద్ద ముందడుగు. నియోజకవర్గ స్థాయి అగ్రీ ల్యాబ్ ముఖ్యమంత్రి మానస పుత్రిక. రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. త్వరలో 147 వైఎస్సార్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నాబార్డ్ ఆర్థిక సహకారం అందించనుంది. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే ఏ కంపెనీనీ వదలం’ – కె.కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
గద్వాల నుంచి జిల్లాలోకి..
కర్నూలు(అగ్రికల్చర్) : రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గద్వాల నుంచి.. బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్ డివిజన్లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్ రూ.500 నుంచి రూ.600 ప్రకారం విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్‌పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్ కేర్ నెంబర్లు లేవు. బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్‌ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు. -
కల్తీ విత్తనం.. మార్కెట్లో పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల్లో ఇద్దరు వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకున్న వారే. మరొకరు కల్తీ విత్తనం బారినపడి నష్టపోయిన వారు. కల్తీ విత్తన చావులకు ఇదో నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో కల్తీ విత్తనాల బారినపడి నష్టపోతున్న వారిలో పత్తి, మిర్చి రైతులే అధికం. అయితే, ప్రతి వంగడాన్ని ఏదోవిధంగా కల్తీ చేయడం సాగిపోతూనే ఉంది. ఒకపక్క కలిసిరాని ప్రకృతి, మరో వంక కల్తీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆర్థికంగా దెబ్బతిని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వందలాది కేసులు నమోదవుతున్నా.. తనిఖీలు చేస్తున్నా కల్తీ విత్తనాల బెడద రాష్ట్రంలో ఏమాత్రం ఆగడం లేదు. కల్తీకి పలానా కంపెనీ కారణం అని తేలినా ఆ విత్తన సంస్థల నుంచి రైతులకు పరిహారం అందడం లేదు. బడా విత్తన కంపెనీలతో లాలూచీ పడిన గత ప్రభుత్వాల నిర్వాకంతో రాష్ట్రంలో ఇప్పటికీ కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగానే సాగుతోంది. కల్తీ విత్తన విక్రయ అడ్డాలు వాణిజ్య పంటలు ఎక్కడ సాగవుతుంటే.. అక్కడ కల్తీ విత్తనాలు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, గుంటూరు, కర్నూలు, నంద్యాల వీటికి ప్రధాన అడ్డాలుగా మారాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి రైతులు కల్తీ విత్తనాలతోనే నష్టపోతున్నారు. నాసిరకం, కల్తీ విత్తనాలతో రెండేళ్ల కిందట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు నష్టపోయినా.. వారికి విత్తన కంపెనీల నుంచి నయాపైసా పరిహారం అందలేదు. ఎకరానికి రూ.లక్ష, రూ.లక్షన్నర ఖర్చుపెట్టి సాగు చేసినా విత్తన వైఫల్యంతో మిర్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కల్తీ విత్తనాల బెడద మొదలైంది. గుంటూరు, కర్నూలులో జీవ వైవిధ్యం పాలిట శత్రువుగా మారిన బీజీ–3 పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మరోపక్క, రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులు గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుజరాత్‌లలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్న 33 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బోల్‌గార్డ్–111 పేరిట నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారి భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా దళాలను ఏర్పాటు చేసింది. 13 కంపెనీలను నిషేధించినా ఫలితం లేకుండా పోయింది. ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు విత్తనాల విక్రయం నిత్యావసరాల వస్తువుల చట్టం పరిధిలోకి కూడా వస్తుంది. ఎవరైనా కల్తీ విత్తనాన్ని విక్రయిస్తే తక్షణమే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టవచ్చు. భారతీయ శిక్షాస్మృతిలోని 420, 427, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. అదే పత్తి విత్తనాలకైతే కాటన్ యాక్ట్ 2009 కింద కేసులు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే జిల్లా కలెక్టర్లు విత్తన కంపెనీలకు జరిమానా విధించవచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆయా విత్తన కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. రశీదు కచ్చితంగా తీసుకోండి మంచి విత్తనం చేలో వేస్తే కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం విత్తనాలు చిన్న, పెద్ద వ్యాపారులు సరఫరా చేసేవే. రాష్ట్రంలో విత్తన ధ్రువీకరణ పద్ధతి ఉంది. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వంగడాలను ప్రయోగాత్మకంగా మొలక శాతాన్ని నిర్ధారించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు. ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే విత్తనాలను కొనడంతోపాటు సొంతంగా తయారు చేసే ప్రైవేటు కంపెనీలు ఆ విత్తన ధ్రువీకరణ పత్రంతోనే విత్తనాలు అమ్మాలి. రైతు ఎక్కడ విత్తనాన్ని కొన్నా తాను కొంటున్న విత్తనానికి ఈ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో చూడాలి. కొనుగోలు చేసిన ప్రతి వంగడానికి రశీదు తీసుకోవాలి. కల్తీ విత్తనాల వల్ల నష్టాలివీ - విత్తనాన్ని పదేపదే వేయాల్సి వస్తుంది. - ఒకటికి రెండుసార్లు కొనుక్కోవాల్సి వస్తుంది. - డబ్బుకన్నా సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది. - తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగిపోతాయి. - ఆర్థికంగా నష్టపోయి అఘాయిత్యాలకు పాల్పడాల్సి వస్తుంది. నూతన ప్రభుత్వం ఏం చేయబోతోందంటే కల్తీ విత్తనాన్ని విక్రయించే వారి భరతం పట్టేలా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కల్తీ మాట వినబడటానికే వీలు లేదన్నారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకు వస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అటు వ్యవసాయాధికారులు, పోలీస్ యంత్రాంగంలో చలనం వచ్చింది. ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు అమ్మే సంస్థలపై నిఘా పెరిగింది. -
మొన్న పట్టుబడిన వ్యక్తే మళ్లీ దొరికాడు..
సాక్షి, బిచ్కుంద (కామారెడ్డి): ఖరీఫ్ ప్రారంభమైన తరుణంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ ఊపందుకుంది!. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా వివిధ కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇటీవల అనుమతి లేకుండా సోయా విత్తనాలు విక్రయిస్తూ ఓ లారీ పట్టుబడిన ఉదంతం మరవక ముందే తాజాగా మరో లారీ పట్టుబడింది. మండలంలోని ఫత్లాపూర్‌లో లారీలో విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా వ్యవసాయ అధికారులు సోమవారం పట్టుకుని, లారీని సీజ్ చేశారు. అంకాపూర్ కేంద్రంగా విత్తనాల దందా కొనసాగుతుందని అధికారులు గుర్తించారు. దీనిపై గట్టి నిఘా పెట్టినట్లు వారు తెలిపారు. అక్రమంగా విక్రయాలు.. వితనోత్పత్తి పథకం కింద కంపెనీ పేరుతో విత్తనాలు అమ్మడానికి అనుమతి తీసుకోవాలి. అలాగే, గ్రామాల్లో ఏజెన్సీ ద్వారా విక్రయించడానికి లైసెన్సు కావాలి. కానీ, వీటన్నిటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా సోమవారం ఫత్లాపూర్ గ్రామంలో లారీలో 500 బస్తాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఏవో పోచయ్య పట్టుకున్నారు. ఈ నెల 15వ తేదీన గుండెకల్లూర్‌లో పట్టుబడిన అంకాపూర్ విఘ్నేశే.. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు విక్రయిస్తూ దొరికిపోయాడు. కమీషన్ పేరుతో గ్రామంలో ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని విత్తనాలు విక్రయిస్తున్నారు. రకరకాల కంపెనీల పేర్లతో.. విఘ్నేశ్ మొన్న గుండెకల్లూర్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణోదయ ఆగ్రో సీడ్స్ కంపెనీ విత్తనాలు విక్రయించాడు. తాజాగా ఫత్లాపూర్‌లో హై దరాబాద్‌కు చెందిన వర్ధ కంపెనీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. రకరాకల కంపెనీల పేరుతో విత్తనాలు విక్రయించడంపై అధికారులు విగ్నేష్‌ని విచారించగా, పలు విషయాలు వెల్లడించాడు. అంకాపూర్ గ్రామంలో గోదాం ఉందని, అక్కడ సుమాంజలి, అరుణోదయ, వర్ధ తదితర 10 రకాల కంపెనీల విత్తనాలు ఉన్నాయని చెప్పా డు. అక్కడి నుంచి విత్తనాలను తీసుకొచ్చి జుక్క ల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో విక్రయిస్తున్నామని వివరించాడు. మూడు మండలాల్లో వివిధ కంపెనీల పేరుతో సుమారు 4 వేల బస్తాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. బిల్లుపై అనుమానం.. ఫత్లాపూర్ గ్రామ కమిటీ పేరుతో 500 వస్తాలు ఉన్నాయని బిల్లులో రాసి ఉంది. అయితే, విత్తనాలకు సంబంధించిన డబ్బులు ఎన్ని, విలువ ఎంత, జీఎస్టీ ఎంత అనేది మాత్రం అందులో రాయలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి రైతులు కోరుతున్నారు. లారీ సీజ్.. రెండ్రోజుల క్రితం గుండెకల్లూర్‌లో, తాజాగా ఫత్లాపూర్‌లో సోయా విత్తనాలు విక్రయిస్తుండగా లారీని పట్టుకున్నామని ఏడీఏ ఆంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు. అంకాపూర్ విగ్నేశ్ అనే వ్యక్తి లైసెన్సు, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండానే వివిధ కంపెనీల విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని, దీంతో లారీ (టీఎస్16 యూబీ 3632)ని సీజ్ చేశామని చెప్పారు. గుండెకల్లూర్‌లో పట్టుకున్నప్పుడు లైసెన్సు తీసుకొచ్చి చూపిస్తామని చెప్పిన విఘ్నేశ్ మూడు రోజులైనా తీసుకురాలేదని తెలిపారు. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు అమ్ముతుండగా పట్టుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా విత్తనాలు విక్రయిస్తే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు మోసపోకుండా ఉండడానికి గట్టి నిఘా పెట్టామని, రైతులు ఇతరుల మాటలు మోసపోవద్దని సూచించారు. రైతులు జాగ్రత్తపడాలి.. ప్రభుత్వం అందిస్తున్న ధరకే విక్రయిస్తున్నామంటూ రైతులను మభ్యపెట్టి విత్తనాలు అంటగడుతున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారు. అయితే, ఆ విత్తనాలు మొలకెత్తక పోయినా, దిగుబడి సరిగా రాకపోయినా రైతులు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, విత్తనాలు తీసుకునే సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
నకిలీ విత్తనంపై నిఘా
కరీంనగర్‌రూరల్: నకిలీ విత్తనాల విక్రయాలపై ఇటు వ్యవసాయ శాఖ.. అటు పోలీసు శాఖ అధికారులు నిఘా వేశారు. నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు విత్తన దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో పత్తి సాగు చేసేందుకు రైతులు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,37,500 ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి రైతులు 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఈ లెక్కన మొత్తం 2.75లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. ఎకరానికి రూ.1460 చొప్పున రైతులు విత్తనాలకు ఖర్చు చేస్తారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. అధికారుల కంటే విత్తన డీలర్ల మాటలనే రైతులు ఎక్కువగా నమ్ముతుంటారు. డీలర్లు సైతం కమీషన్‌కు ఆశపడి రైతులకు నకిలీ, కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ముగ్గురు ఏడీఏలు, ముగ్గురు సీఐలు ఉన్నారు. మండల స్థాయిలో ఏవో, ఎస్సైలతో ప్రత్యేకంగా నిఘా కమిటీలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నా దాదాపు 70శాతం మంది రైతులు విత్తన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేస్తారు. నిఘా కమిటీ సభ్యులు తమ పరిధిలోని విత్తన దుకాణాలను తనిఖీ చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా... ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. కొంతమంది బ్రోకర్లు ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో పత్తి సాగు ఎక్కువయ్యే ప్రాంతాల్లో విత్తనాలను నిల్వ చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా విత్తన డీలర్లతోపాటు కొంతమంది రైతుల సాయంతో కమీషన్ పద్ధతిలో విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో హుజూరాబాద్‌లో రూ.70లక్షల విలువైన 60క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పీడీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ విక్రయదారులపై పీడీ చట్టం నకిలీ, కల్తీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో రెండు కేసులు నమోదు చేశాం. నకిలీ విత్తనాల అమ్మకాలను నియంత్రించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి నిఘా కమిటీలను ఏర్పాటు చేశాం. రైతులు విత్తన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేసి తప్పనిసరిగా రశీదు పొందాలి. – వాసిరెడ్డి శ్రీధర్,జిల్లా వ్యవసాయాధికారి -
కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ దాడి
హైదరాబాద్: నగంరలో కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సిద్ధిపేట్ జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఎస్కే ఖాదర్ ఈ కల్తీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 45 కేజీల బరువు గల మూడు బ్యాగ్‌ల కల్తీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్లవి-12, గోఖుల్, కృష్ణ-10 పేరు గల 25 ప్యాకెట్ల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. వీటి మొత్తం విలువ భారీగా ఉండవచ్చునని చెప్పారు. ఈ కల్తీ విత్తనాలు కర్నూలు నుంచి గుంటూరు మీదుగా నగరానికి వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్ డీలర్ల వద్దనే కొనాలని సూచించారు. -
‘నకిలీ’ దందా !
బూర్గంపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వేలాది నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టుబడుతున్నాయి. జిల్లాలో నిషేధిత బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు దొడ్డిదారిన సరఫరా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ దాడుల్లో తేటతెల్లమవుతోంది. టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు విత్తన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ దాడులు జరుగుతుండడంతో నకిలీ విత్తన వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశాలున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు విత్తన వ్యాపారులు.. ప్రభుత్వం నిషేధించిన బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలోనే నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అయ్యాయి. వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచి, రైతుల అవసరాలను బట్టి ప్యాకింగ్ చేయించి విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాలను రైతులకు నమ్మకం కలిగేలా అత్యంత పకడ్బందీగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు వాడితే పురుగు మందులు కొట్టే పని ఉండదని, ఒకవేళ చేలో కలుపు పడితే నిరభ్యంతరంగా గడ్డిమందు కొట్టుకోవచ్చని, పత్తి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులను నమ్మిస్తున్నారు. దీంతో కొందరు రైతులు వారి మాటలు నమ్మి ఈ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది నకిలీ విత్తన ప్యాకెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీసులు, వ్యవసాయశాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 3వేలకు పైగా నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. జిల్లాలో 15 మంది వ్యాపారులపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ దాడులతో అప్రమత్తమైన అక్రమ వ్యాపారులు తమ వద్దనున్న నకిలీ విత్తనాలను రహస్య ప్రాంతాలకు తరలించారు. కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లలోని అనేక మండలాల్లో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యాయి. ఈ సమాచారంతో వ్యవసాయ, పోలీస్‌శాఖలు అప్రమత్తమై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులను ఇంకా విస్తృతం చేయాలని రైతులు కోరుతున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ముందే విక్రయాలు... జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. ఎండలు మండిపోతున్నాయి. విత్తనాలు వేసేందుకు ఏ మాత్రం అనువైన వాతావరణం లేదు. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం గత పది రోజుల నుంచే గుట్టుచప్పుడు కాకుండా రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన కొందరు రైతులు తొలకరికి ముందే పొడి దుక్కుల్లో వేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోతే వేసిన విత్తనాలు నష్టపోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ విత్తనాల కోసం పరుగులు తీస్తే నకిలీ విత్తనాలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు ఇప్పటి వరకు పత్తి విత్తనాల విక్రయాలకు వ్యవసాయశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు ఖమ్మం నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. దీంతో స్థానిక విత్తన డీలర్లు తమ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో తమకు నమ్మకమైన రైతులకు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విత్తనాలను విక్రయిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం డివిజన్లో 25 శాతం మేర విత్తనాల విక్రయాలు జరిగాయి. సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి గింజలు వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు రైతులు విత్తనాలు వేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంది. విత్తన విక్రయాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రత్యేక నిఘా పెడుతున్నాం నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి పంపించి నకిలీ విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాం. రైతులు కూడా వర్షాలు పడిన తరువాతే విత్తనాలు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ అనుమతులు రాకుండా విత్తనాలు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌రావు, ఏడీఏ, మణుగూరు -
‘నకిలీ’పై ఉక్కుపాదం
మెదక్ మున్సిపాలిటీ: కోట్లాది ప్రజల కడుపు నింపే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. నకిలీ విత్తనాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేలను నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానమని, పంటలు పండించడమే తప్ప వాటిని లాభనష్టాలతో బేరీజు వేసే నైజానికి వారు దూరమన్నారు. తొలకరి జల్లులు పడగానే కోటి ఆశలతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని ఈ రోజు మన నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే అదంతా రైతు కష్టమేనన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు బాగుండాలని, దేశానికి అన్నం పెట్టే వారే రైతులన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కారణంగా రైతు కంట కన్నీరు తప్ప వారికి ఆనందం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేదం చిందించి సేద్యం చేసి పచ్చని పంట పండించే రైతన్న నేడు నకిలీ విత్తనాలతో మోసానికి గురవుతున్నాడన్నారు. రైతులేని దేశాన్ని ఉహించలేమని, అందుకే రైతును కాపాడుకుంటేనే దేశం సస్యశ్యామలమవుతుందన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు ఇకపై రైతులను మోసాలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను శాశ్వతంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించిందని తెలిపారు. రైతులు తీసుకున్న విత్తనాలను నిజమైనవా, నకిలీవా? అని గుర్తించే విధానం గురించి, నకిలీ విత్తనాలను అమ్ముతున్న దళారుల మీద, కంపెనీలపై కేసులు నమోదు చేసే విధానం గురించి, నకిలీ విత్తనాలపై రైడింగ్‌చేసే విధానంపై పోలీసు అధికారులకు వివరించారు. ఆ కేసులకు సంబంధించి కోర్టులో చార్జ్‌షీట్ వేసే విధానంపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి వారి సహాయ సహకారాలతో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ షాపు యజమానులు తమ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించరాదని, అలా అమ్మితే యజమానులపై చట్టపరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పత్తి వైపే మొగ్గు..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటనే సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాగు విస్తీర్ణం అంచనా ప్రకారం.. గతేడాది కంటే ఈ ఏడాది కొంత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది గులాబీరంగు పురుగు ఉధృతి, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొదట్లో వర్షాలు కురిసినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రాలేని పరిస్థితి ఎదురైంది. కొంతమంది రైతులు గులాబీపురుగు ఉధృతితో పత్తి పంటను ముందుగానే తొలగించారు. ఈ దశలో మరోసారి పత్తి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు ఆ దిశగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలుస్తోంది. 65శాతం పత్తినే.. జిల్లాలో అధిక శాతం మంది రైతులు పత్తివైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు ఉంది. అయితే ఇందులో పత్తి పంట గతేడాది 1లక్ష 30వేల హెక్టార్ల వరకు సాగు కాగా, ఈసారి మరో 10వేల హెక్టార్లు అధికంగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. పత్తి తర్వాత 30వేల హెక్టార్లలో సోయాబీన్, 20వేల హెక్టార్లలో కంది సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు 8 లక్షలు అవసరం ఉండగా, 14లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్నారు. ప్యాకెట్ ధర రూ.730 ఉంటుందని పేర్కొన్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూపు గతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కూడా భారీగా వర్షాలు కురువడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. జూన్ మొదటి, రెండో వారంలోనే విత్తనాలు వేశారు. అయితే ఈసారి జూన్ మొదటి వారం గడిచినా వర్షం జాడలేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పినా మరో వారం రోజులపాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భా రీ వర్షాలు కురిస్తే తప్పా చిరుజల్లులకు విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు సూచి స్తున్నారు. గతంలో పలుసార్లు తొలకరి వర్షాలు కురువగానే పత్తి విత్తనాలను వేయడం, ఆ తర్వా త వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో విత్తనం మాడిపోయి నష్టాలు చవిచూశారు. ఒకటికి రెండుసార్లు కూడా విత్తనాలు వేసిన పరిస్థి తి ఎదురైంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రైతుకు రూ.4వేల చొప్పున మేలోనే రైతులకు చెక్కుల రూపంలో అందించిన విషయం విధితమే. ఈసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా 10శాతం మంది రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ అయినట్లు కనిపించడం లేదు. పెట్టుబడి సాయం త్వరగా అందిస్తే దళారులను ఆశ్రయించకుండా పెట్టుబడి కోసం వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాలతో జాగ్రత్త.. ఏటా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతూనే ఉన్నారు. ఈసారి కూడా జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో నకిలీ విత్తనాలు, బీటీ–3 పేరిట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నకిలీ విత్తనాల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో మరోమారు మోసపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది కొంతమంది రైతులు నకిలీ విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి రాక అవస్థలు పడ్డారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా ఎకరానికి ఒకట్రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాలేని దుస్థితి ఎదురైంది. -
విత్తన కంపెనీలతో బాబు సర్కారు లాలూచీ!
సాక్షి, అమరావతి: ప్రైవేట్ విత్తన కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. 2017లో అధికారులు రూపొందించిన రాష్ట్ర విత్తన బిల్లును అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అటకెక్కించారు. 2017 మార్చి 2వ తేదీన మంత్రివర్గ(కేబినెట్) సమావేశం అజెండాలో రాష్ట్ర విత్తన బిల్లును చేర్చారు. ప్రైవేట్ విత్తన కంపెనీలతో సంప్రదింపులు జరపాల్సి ఉందంటూ చంద్రబాబు ఆ బిల్లును పక్కన పెట్టారు. విత్తన కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని, అందుకే బిల్లును పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ, నాణ్యత లేని విత్తనాల బారి నుంచి రైతులను రక్షించేందుకు రాష్ట్ర విత్తన బిల్లు–2017ను అధికారులు రూపొందించగా, చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. బిల్లును అప్పటి ప్రభుత్వ పెద్దలే అడ్డుకున్నారు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయినా, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోయినా సదరు కంపెనీల నుంచి బాధితులకు సరైన పరిహారం ఇప్పించడానికి ఏపీ విత్తన బిల్లు–2017ను అధికారులు రూపొందించారు. ఆ బిల్లు అమల్లోకి రాకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలే అడ్డుకున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద అరికట్టేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విత్తన బిల్లు–2017లోని ముఖ్యాంశాలు ►వ్యవసాయ శాఖ కమిషనర్ నేతృత్వంలో రాష్ట్ర సీడ్ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో ఉద్యాన శాఖ కమిషనర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ, వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీ రీసెర్చ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. రైతులను, ఇతర వ్యవసాయ, విత్తనాల నిపుణులను కూడా సభ్యులుగా నామినేట్ చేస్తారు. ►ధరల నియంత్రణ, పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించే అధికారాలను కమిటీ కలిగి ఉంటుంది. ►విత్తనాల ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేస్తారు. రాయల్టీతో సహా ఎంత ధరకు ఏ రకం విత్తనాలను విక్రయించాలో ఈ కమిటీ నిర్ధారిస్తుంది. ►రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాలు తయారు చేయడం, విక్రయించడం చేయరాదు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నడపరాదు. ►స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర సీడ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై 30 రోజుల్లోగా అప్పిలియేట్ అథారిటీకి వెళ్లే అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏక వ్యక్తితో గానీ, ముగ్గురుతో గానీ అప్పిలియేట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. ►కల్తీ విత్తనాల విక్రయాల నియంత్రణకు సీడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా ఇన్స్పెక్టర్ దాడులు, సోదాలు చేయవచ్చు. ►తప్పుడు బ్రాండ్‌తో విత్తనాలను విక్రయిస్తున్నా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకున్నా రూ.50 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ►నాణ్యతా ప్రమాణాలు, ఫిజికల్ ప్యూరిటీ, జర్మినేషన్ లేకున్నా లక్ష వరకు జరిమానా, మూడేళ్లు జైలు. ►తప్పుడు నమూనా స్టాండర్డ్స్, జెనిటిక్ ప్యూరిటీ లేని, రిజిస్ట్రేషన్ లేని, తప్పుదోవ పట్టించే బ్రాండ్లు, నకిలీ, కల్తీ విత్తనాలను విక్రయిస్తే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు. ►నాణ్యత లేని, నకిలీ విత్తనా వల్ల రైతు పంటలు కోల్పోయినా, దిగుబడి తగ్గినా అప్పటి వరకు సాగుకైన ఖర్చు మొత్తాన్ని ఆయా విత్తన కంపెనీల నుంచి రైతులకు పరిహారంగా ఇప్పిస్తారు. ►రాయల్టీతో కలిపి ఎంత ధరకు విత్తనాలు విక్రయించాలనేది రాష్ట్రస్థాయి సీడ్ కమిటీ నిర్ణయిస్తుంది. -
నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించాలి
-
నకిలీ విత్తనాల చలామణీపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, అమరావతి : నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్ జగన్‌కు అధికారులు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్ జగన్ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 'ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలి. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలి. నాణ్యమైన విత్తనాలు గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి జరిగిందంటే ఎవరు క్షమించలేని చర్యలు తీసుకుంటాం. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తాను. అటువంటి వారికి సన్మానం చేస్తాం. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదే. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిష్కారాలు వంద శాతం ఉండాలి. రైతులకు ప్రయోజనాలు అందకపోతే ప్రభుత్వాలెందుకు. 62 శాతం రైతులపైనే ఆధారపడుతుంటే వారికి కావలసినవి ఏమీ చేయకపోతే ఉపయోగం ఏమిటి? రైతు సంతృప్తి చెందకపోతే ఎంత చేసినా వృధానే' అని వైఎస్ జగన్ అన్నారు. -
నకిలీ విత్తనాలపై నిఘా
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు విక్రయించే వారి బెడద ఎక్కువవుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి. దీంతో నకిలీలతో అన్నదాత బేజారవుతున్నాడు. పలు కంపెనీలకు చెందిన డీలర్లు ఈ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టక ప్రతీ ఏటా రైతులను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిలీలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మండలాలు, డివిజన్, జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడుతోంది. అనుమతులు లేని విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో సాగు వివరాలు... ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. పత్తి 1లక్షా42వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, సోయాబీన్ 28వేల హెక్టార్లలో, కందులు 25వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ శాతం ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మార్కెట్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల డిమాండ్‌ను బట్టి ధర తక్కువ చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అమాయక గిరిజన రైతులకు విక్రయించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. 2017 సంవత్సరంలో జైనథ్, ఆదిలాబాద్, తాంసి మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలాల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో నష్టాలను చవిచూశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇటీవల నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ విత్తనాలను ప్యాకెట్లలో ప్యాక్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసులు సైతం నమోదు చేశారు. మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాంల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌ల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ బృందం వచ్చింది. రైల్వే స్టేషన్, జిన్నింగ్ మిల్లులు, గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో వారు ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంటుంది. రశీదు తప్పనిసరి.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రశీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుంది. సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. జిల్లాలో నకిలీ విత్తనాలతో అక్కడక్కడ నష్టపోతున్న అన్నదాతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారుతోంది. ఇం దుకు ప్రధాన కారణంగా కొనుగోలు దారుల వద్ద ఎలాంటి రశీదు లేకపోవడమే. గ్రామాలకు వచ్చి విత్తనాలను విక్రయించే వారు రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా రైతులకు అంటగడుతున్నా రు. అవగాహన లేమి కారణంగా అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. విత్తనాల ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ ప్యాకింగ్ చేశారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జెన్యూ స్వచ్ఛత తదితర విషయాలను ముద్రించాలి. అయితే విత్తన కంపెనీలు కొన్ని ఈ నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మార్కెట్లోకి వస్తున్నాయి. స్థానికంగానే తయారీ.. ఇటీవల నేరడిగొండలో స్థానిక విత్తనాలకు రంగులు పూసి ప్యాకింగ్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెడితే తప్పా అక్రమాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవాటిపై తనిఖీలు ముమ్మరం చేస్తే కొంత వరకైనా రైతులను నకిలీల బెడద నుంచి కాపాడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని బీటీ–3, గ్లైసిల్, రౌండ్ఆ‹ఫ్ బీటీ ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్స్ ద్వారా జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. పత్తి విత్తన సంచి ధర రూ.740 ఉండగా, దాదాపు వీరు రూ.600లకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు విత్తనాలు లభించడంతో రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మంగీలాల్‌ను ఫోన్ ద్వారా పలుసార్లు సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
నకిలీలపై నజర్
సాక్షి, సిటీబ్యూరో: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పత్తి సాగు ఊపందుకోనుంది. ఈ సీజన్లో వరి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేస్తారు. ఫలితంగా విత్తనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు నకిలీ, అనుమతి లేని విత్తనాల మాఫియాలు విజృంభిస్తూ ఉంటాయి. ఈ దందాకు చెక్ చెప్పడానికి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ బందాల్లో వ్యవసాయ, సీడ్ సర్టిఫయింగ్ ఆఫీసర్, పోలీసు అధికారులు సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) నుంచి ఎస్సై స్థాయి అధికారులకు ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇచ్చారు. పత్తి విత్తనాలు నాటే సీజన్ సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఏటా రూ.వేల కోట్లలో జరిగే ఈ వ్యాపారంలో నకిలీ విత్తులూ పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి. దీనిని గుర్తించలేని రైతన్నలు వీటిని నాటుతున్నారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో రైతు ఆత్మహత్యలకూ కారణం అవుతోంది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తన విక్రయాలపై కన్నేసి ఉంచడానికి, నకిలీ విత్తుల దందాకు పూర్తిగా చెక్ చెప్పడానికి 15 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ నుంచి వ్యవసాయ అభివృద్ధి అధికారి, సీడ్ సర్టిఫయింగ్ అధికారి, పోలీసు విభాగం నుంచి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ లేదా సైబరాబాద్, రాచకొండల్లోని ఎస్వోటీల్లో పని చేస్తున్న సబ్–ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రధాన సభ్యులుగా ఉన్నారు. తనిఖీల్లో వీరికి మండలస్థాయిల్లో స్థానిక వ్యవసాయ అధికారి సహకరిస్తున్నారు. నకిలీ విత్తనాలను కొందరు వ్యాపారులు స్థానికంగానే తయారు చేస్తుండగా మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా చేసి విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, అదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలతో పాటు రాజధానిలోనూ పత్తి విత్తనాల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ గ్రేట్ హైదరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించింది. నకిలీల దందాలో అత్యధికంగా రాజధాని కేంద్రంగానే జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీమ్స్ పని చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గోదాములు, ట్రాన్స్పోర్ట్ సంస్థల కార్యాలయాలు, విక్రయ దుకాణాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్న వ్యవసాయ అధికారులు అనుమానాస్పదమైన వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అవి నకిలీ లేదా అనుమతి లేనివిగా తేలితే స్థానిక వ్యవసాయ అధికారితో ఫిర్యాదు చేయించి ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. కొన్ని అనుమానాస్పద దుకాణాలు, రవాణా సంస్థలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఏడీఓ జీఎం నివేదిత, టాస్క్‌ఫోర్స్ సబ్–ఇన్స్పెక్టర్ కేఎస్ రవి, ఎస్సీఓ పి.అపర్ణ, ఏఓ నిర్మలలతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం ఆది, సోమవారాల్లో సరూర్‌నగర్‌లోని యూనిసెమ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్బీనగర్లోని చార్డన్ పోఖ్పాండ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటోనగర్‌లోని కావేరీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీటీ ట్రాన్స్పోర్ట్స్, వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్స్, అసోసియేటెడ్ రోడ్ క్యారియర్స్, టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌ల్లో సోదాలు చేశాయి. ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఉన్న పత్తి విత్తనాలపై వ్యవసాయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజధాని కేంద్రంగా పని చేస్తున్న ఈ 15 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. పత్తి విత్తనాల విక్రయ సీజన్ ముగిసే వరకు వీటిని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
నకిలీపై నజర్
సాక్షి, వరంగల్ రూరల్: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయశాఖ మేలైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు. మే 25 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు. అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 35 నుంచి 40 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకు పైగా పలుకుతుండడంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఖరీఫ్ 59,484 హెక్టార్లలో మొత్తం సాగు చేశారు. ఈ ఏడు ఖరీఫ్‌కు పత్తి విత్తనాలు 6 లక్షలు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అంచనాలు పంపించింది. ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయశాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొంద రు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్ టెక్నాలజీ 2(బీటీ 2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది. తనిఖీలు.. నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజుగా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయశాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి. మండల, జిల్లాస్థాయిలో బృందాలు టాస్క్‌ఫోర్స్ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించనున్నారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు. -
భారీగా ‘హెచ్‌టీ’ పత్తి విత్తనాల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకొని అనధికార హెర్బిసైట్ టొలరెంట్(హెచ్‌టీ) పత్తి విత్తనాలను బ్రాండెడ్ పత్తి విత్తనాల కంటే తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధమైన ఇద్దరు వ్యక్తులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి రైల్వే (కార్గో) సర్వీసు ద్వారా వచ్చిన ఈ అనధికార పత్తి విత్తనాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుట్వార్డ్ పార్శిల్ కార్యాలయం నుంచి టాటా ఏస్ వాహనంలో తరలించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.32,52,110 విలువైన 2005 కిలోల బీజీ–3 (హెర్బిసైడ్ టొలరెంట్) విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. అగ్రికల్చర్ డిప్లోమో చేసి అడ్డదారి... కరీంనగర్ పట్టణానికి చెందిన రావుల రజినీకాంత్ అగ్రికల్చర్ డిప్లోమోతో పాటు ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఓ పెస్టిసైడ్‌లో కంపెనీలో పనిచేసిన అతను విత్తనాల విక్రయాలు, కొనుగోళ్లపై అవగాహన పెంచుకున్నాడు. ఈ అనుభవంతో 2003లో అబిడ్స్‌లోని లెనిన్ ఎస్టేట్స్‌లో ‘ఓంకార్ అగ్రిటెక్’ పేరుతో సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. 2009లో కంపెనీ పేరును ఓంకార్ సీడ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చి కొత్తపేటలోని ఓంకార్ నిలయానికి కార్యాలయాన్ని మార్చాడు. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం, కీసరమ్ రోడ్డులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన అతను విత్తనాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ సీడ్ స్టోరేజీ యూనిట్‌ను నెలకొల్పాడు. దీంతో పాటు ‘సేద్య పొలం అగ్రికల్చర్’ మేగజైన్ నడుపుతున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఇందులో భాగంగా 2019 ఖరీఫ్ సీజన్ కోసం అనధికారిక హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయాలు చేపట్టాలని భావించిన అతను గుజరాత్ గాంధీనగర్‌లోని ‘అవిరాట్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వాహకుడు భరత్ పటేల్‌ను సంప్రదించాడు. కిలోకు రూ.500 చొప్పున పత్తి విత్తనాలకు భారీగా కొనుగోలు చేసి అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు రైల్వే కార్గో ద్వారా తెప్పించాడు. అక్కడి నుంచి కీసరం రోడ్డులో ఉన్న తన ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించి 450 గ్రాముల పత్తి విత్తనాలను ప్యాక్ చేసి సబ్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్లకు రూ.730 చొప్పునపంపిణీ చేయాలని నిర్ణయించాడు. అయితే అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఎటువంటి ఇన్వాయిస్ బిల్లులు, డెలివరి చలాన్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా 50 గన్నీ బ్యాగ్‌ల్లో పత్తి విత్తనాలు వచ్చినట్లు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన అధికారులు టాటా ఏస్‌లో లోడ్ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రావుల రజనీకాంత్‌తో పాటు ఆటో డ్రైవర్ బండారి మహేష్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోపాలపురం పోలీసులకు అప్పగించారు. పర్యావరణానికి ప్రమాదకరం... సాగు భూమితో పాటు, పర్యావరణంతో పాటు మానవళికి ప్రమాదకరమైన ఈ హెచ్‌టీ పత్తి విత్తనాలకు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అనుమతి ఇవ్వలేదు. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలను అతిక్రమించారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారి గీతా రెడ్డి అన్నారు. ఎంఆర్పీ లేకుండా, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీలు లేకుండా అక్రమంగా రవాణా చేసుకుని ఎక్కువ ధరకు రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ తరఫున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల కేన్సర్ వచ్చే ప్రమా దం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించిందన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేఎస్ రవి, శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర రెడ్డి, గోపాలపురం ఇన్స్పెక్టర్ ఎం.నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ సీజన్‌కి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో కల్తీ విత్తనాల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో కల్తీ విత్త నాలు లేకుండా చేసేందుకు అధికా రు లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, విత్తన ధ్రువీకరణ, విత్తనాభివృద్ధి సంస్థ ల డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
‘నకిలీ’పై నజర్
ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు. మే 15 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు. అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 42 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకుపైగా పలుకుతుండటంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది 97 వేల హెక్టార్లలో పత్తిని జిల్లాలో సాగు చేయగా.. ఈ ఏడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. వీటి ఆధారంగా 1.14 లక్షల హెక్టార్లకు 5,72,806 విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు తయారు చేసింది. ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా.. అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయ శాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొందరు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్ టెక్నాలజీ–2(బీటీ–2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కొందరు రైతులు సాగు చేశారు. వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుందని జనటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ నిర్దారించింది. దీంతో బీటీ–2 విత్తనాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ దొడ్డిదారిన కొందరు డీలర్లు బీటీ–2 మాటున.. బీటీ–3 విత్తనాలను విక్రయించారు. ఈ ఏడాది ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ సీరియస్‌గా ఉంది. పత్తి విత్తనాలతోపాటు వరి, పెసర వంటి విత్తనాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేసింది. నియామకాలకు సమాయత్తం నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజ్‌గా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయ శాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి. మండల, జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలు టాస్క్‌ఫోర్స్ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించేందుకు నిర్ణయించారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు. పకడ్బందీ చర్యలు అనుమతి లేని పత్తి విత్తనాలను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకుంటున్నారు. జనటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ నిర్ణయించిన విత్తన రకాలను మాత్రమే.. అనుమతించిన డీలర్లు విక్రయించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అన్ని రకాల లైసెన్స్‌లు, అనుమతులు కలిగిన డీలర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి.. ఆయా డీలర్లకు విత్తన విక్రయాలపై తగిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టాన్ని ప్రయోగించాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని జిల్లా వ్యవసాయ శాఖ నుంచి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని స్థాయిల్లో తనిఖీలు.. అనుమతి పొందిన.. నాణ్యమైన విత్తనాలను విక్రయించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. విత్తన విక్రయాలపై అన్ని స్థాయిల్లో తనిఖీ బృందాలు ఉంటాయి. అక్రమ, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులకు విత్తన విక్రయాల్లో అనుమానాలు తలెత్తినట్లయితే వెంటనే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలి. పత్తి విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
క్షామ నామ సంవత్సరం
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు,సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు, వాడికి భుక్తిలేదు! – గుర్రం జాషువా సాక్షి, అమరావతి: 2018... రాష్ట్రంలో అన్నదాతల పాలిట క్షామ నామ సంవత్సరం. వ్యవసాయ రంగంలో ఈ ఏడాదంతా తిరోగమనమే తప్ప పురోగమనం జాడ లేదు. అన్నదాతకు అశ్రువులే మిగిలాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి విపత్తులు, పెరిగిపోయిన పెట్టుబడులు, దక్కని గిట్టుబాటు ధరలు, పెట్రేగిపోతున్న దళారీ వ్యవస్థ, వారికే వత్తాసు పలికే అధికార వర్గం... వెరసి రైతన్నలు దారుణంగా మోసపోయారు. అన్నదాతల ఆత్మహత్యలతోనే 2018 మొదలైంది. రెయిన్ గన్లతో పంటలను కాపాడే, కరువులను జయించే, సముద్రాలను నియంత్రించగలిగే చంద్రబాబు పాలనలో రైతుల బలవన్మరణాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. మట్టి నుంచి మాణిక్యాలను పండించే రైతు నోట్లో ఈ ఏడాదీ మట్టే పడింది. 2018లో పండించిన ఆహార, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కలేదు. ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు.. దేనికీ ధర లేకుండా పోయింది. ఉద్యాన పంటలైన టమోటా మొదలు మామిడికి కూడా గిట్టుబాటు ధరలు రాలేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరికి క్వింటాల్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,750 కాగా, రైతుకు దక్కింది రూ.1100 నుంచి రూ.1350 మాత్రమే కావడం గమనార్హం. ఇక మిగిలిన పంటల పరిస్థితి చెప్పనక్కర్లేదు. లక్షలాది క్వింటాళ్ల శనగలు కొనేవారు లేక గిడ్డంగుల్లో పేరుకుపోయాయి. తెల్లజొన్నలు కొనే దిక్కులేకుండా పోయింది. రాయలసీమలో వేరుశనగ సాగుచేసిన రైతులు కరువు వల్ల పంటను కోల్పోయి రూ.4,650 కోట్లు నష్టపోయారు. కరవును జయించిందెక్కడ? జూన్ నుంచి మొదలై సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 18 శాతం, రబీలో ఇప్పటిదాకా 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లు తగ్గింది. రబీలో సాగు విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా, ఇందులో 480 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వం కేవలం 347 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వరుణుడి కరుణ లేక, పంటలు పండక, సొంత ఊళ్లలో బతికే దారి కనిపించక రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. అయినా కరువును జయించామని, 2018 ఖరీఫ్‌లో రెయిన్గన్లతో 25,795 హెక్టార్లలో పంటలను కాపాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. నకిలీ విత్తనాలు.. చుట్టుముట్టిన తెగుళ్లు వ్యవసాయ శాఖ వైఫల్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, చుట్టుముట్టిన తెగుళ్లు, అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం సేకరణలో వైఫల్యంతో రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. మెగాసీడ్ పార్క్ అంటూ ప్రభుత్వం హడావిడి చేసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ధరల స్థిరీకరణ నిధి ఉంటే.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ ఏడాది కొంతలో కొంతైనా ఊరట లభించేది. మొక్కజొన్న, జొన్న రైతులకు, చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి, ఆగస్టులో వచ్చిన అకాల వర్షాలకు నష్టపోయిన వరికి ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంతవరకూ అందలేదు. రైతులు ఈ ఏడాది పంటల సాగు కోసం రూ.19,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. కరువు, తుపాన్ల వల్ల ఈ పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఆగని ఆత్మహత్యలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 79 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికి 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రుణమాఫీ జరగక, బ్యాంకుల నుంచి రుణాలు అందక, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవడంతోపాటు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఊసే లేకుండా పోయింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం గ్రామానికి చెందిన కొండవీటి బ్రహ్మయ్య అనే రైతు తాను ఎలా నష్టపోయిందీ సవివరంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పురుగుమందు తాగి తనువు చాలించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, పాల డెయిరీలు వరుసగా మూతపడుతున్నాయి. బకాయిల కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం చలించడం లేదు. యూనివర్సిటీలలోని పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. తెగుళ్లు చుట్టుముట్టినా శాస్త్రవేత్తల బృందాలు పొలాలకు వెళ్లడం లేదు. మొక్కజొన్నకు కత్తెర తెగులు ఆశించడంతో రైతులు రాత్రికి రాత్రి పంటను ధ్వంసం చేశారు. శోకం మిగిల్చిన తుపాన్లు రాష్ట్ర రైతాంగం ఈ ఏడాది మూడు తుపాన్లు– తిత్లీ, గజ, పెథాయ్.. రెండుసార్లు అకాల వర్షాలను చవిచూసింది. ఉత్తరాంధ్రను తిత్లీ, పెథాయ్ వణికిస్తే.. కోస్తాను గజ, పెథాయ్ తుపాన్లు గడగడలాడించాయి. మే, ఆగస్టులలో కురిసిన అకాల వర్షాలు ఉద్యాన పంటల్ని దెబ్బతీశాయి. ఖరీఫ్‌కు ముందు కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల్ని రైతులు పొలాల్లోనే వదిలేశారు. అపరాలు చేతికి అందకుండానే పోయాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో వరిని తుపాన్లు నష్టపరిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పంటల్ని తిత్లీ తుపాను తీవ్రంగా ముంచేసింది. జీడి పంట, జీడి పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయాయి. ఆదుకోని రుణమాఫీ తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, చంద్రబాబు రుణమాఫీ కోసం కేవలం రూ.24,500 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఆ సొమ్ము రుణాలపై వడ్డీలకు కూడా సరిపోదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన మూడో విడత డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. సర్కారు విధానాల వల్ల బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. సంఘటితమవుతున్న రైతులు వాతావరణ మార్పులతో రైతులు ఈ ఏడాది 27 శాతం ఆదాయం కోల్పోనున్నట్టు ఆర్థిక సర్వే చెబుతోంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వలేదు. శాశ్వత రుణ విముక్తి లేదు. పెట్టుబడి సాయం లేదు. బీమా సొమ్ము చేతికి రాలేదు. ప్రకృతి కనికరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెల్లుబికినట్టే రాష్ట్రంలోనూ రైతులు సంఘటితం అయ్యే ప్రయత్నం ఈ ఏడాది జరిగింది. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం కోసం ధర్నాలు చేశారు. తుందుర్రు ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. అంతా బాగుందట! సంక్షోభంలో చిక్కుకుని రైతన్నలు అష్టకష్టాలు పడుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ వ్యవసాయ రంగంలో ప్రగతి అద్భుతంగా ఉందని సెలవిచ్చారు. అధిక ఆదాయం కోసమే వలసలు వెళుతున్నారని అనడం కొసమెరుపు. మరి అంతా బాగుంటే ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన రోజే కర్నూలు జిల్లాలో ఓ యువరైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు. -
సిండి‘కేటు’
అల్లాదుర్గం(మెదక్) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్‌గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు. గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు. వట్పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. – నాగరాజు రైతు, ముప్పారం. చర్యలు తీసుకుంటాం.. ఈ సిండికేట్ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. –పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆ విత్తనం ఓ మహా విస్ఫోటనం
మా నాయిన సోలిపేట రామకృష్ణారెడ్డి 12 ఎక రాలకు ఆసామి. పంట విత్తనంలోనే ఉంది’ అని నమ్మే రైతు. కోతకొచ్చిన పంట చేలోంచి మెండైన కంకులు ఏరించి మరుసటి ఏడాదికి విత్తనంగా దాచి పెట్టేవారు. మా నాయిన పండించిన వరి విత్తనాలను మా ఊరు రైతులు ఎగబడి ఎగబడి కొనేటోళ్లు. ఇçప్పుడీ పద్ధతి పల్లెల్లో చూద్దామన్నా కనిపించటం లేదు. సాంప్రదాయ విత్తనాల స్థానంలోకి అధికో త్పత్తి హైబ్రీడ్, జన్యుమార్పిడి విత్తనాలు చొర బడ్డాయి. ఇవ్వాళ పంట పొలంలో నాటుతున్న ఒక్కొక్క జన్యు మార్పిడి విత్తనం భవిష్యత్తులో మందు పాతరను మించిన మహా విస్ఫోటనమై మహా విపత్తును సృష్టించబోతున్నాయి. పత్తితో పాటు, మనుషులు ఆహారంగా తీసుకునే మిరప, వంగ, టమాట, నువ్వులు, వేరుశెనగ వంటి కూర గాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో జన్యు మార్పిడి విత్తనాలు వచ్చేశాయి. పర్యావరణ విఘాతం ఏర్పడుతుందనే కారణంతో వాణిజ్యప రంగా ఉత్పత్తి చేయటాన్ని దేశంలో నిషేధించారు. యూరోపియన్ దేశాలు కూడా బీజీ3ని నిషేధిం చాయి. జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలోనైనా ప్రభావితం చేసే విత్తనాలకు దేశంలోకి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ గత ఏడాది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాల్లో బోల్‌గార్డు 3 విత్తనాలు సాగైనట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు పరిశోధనలు చేసిన విత్తనా లను సర్టిఫై చేసి వాణిజ్యపరంగా ఉత్ప త్తికి విడుదల చేసేవాళ్లు, గ్లోబలైజేషన్‌తో వచ్చిన సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తన రంగం బాధ్యతల నుంచి తప్పుకొని బహుళజాతి సంస్థ లçకు అప్పగించాయి. ఫలితంగానే నేడు విత్తనంపై బహుళజాతి సంస్థల పెత్త నమే కొనసాగుతున్నది. ఇప్పటికీ మనం 1955, 1966 నాటి సరళమైన పాత విత్తన చట్టాలనే వాడుతున్నాం. 52 ఏళ్లు గడిచిపోయినా కొత్త విత్తన చట్టాలను రూపొందించు కోవాల్సిన అవసరం లేదా? 1966 విత్తన చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన విత్తన చట్టం– 2004 ముసాయిదా నేటికీ పార్లమెంటులో పెండింగ్‌లోనే ఉంది. దేశంలోని 75 శాతం మంది రైతాంగం కోరుకుంటున్న సమగ్ర విత్తన చట్టాలు అమల్లోకి రాకుండా ఆపు తున్నది ఎవరో బహిరంగ రహస్యమే. ప్రస్తుతం రాష్ట్రంలో మోన్శాంటో, డూపా యింట్, కార్గిల్, సింజెంటా కంపెనీలు 60 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. మరో 9 సంస్థలు మిగిలిన మార్కెట్‌ను గుప్పిట పట్టాయి. ఇప్పటి వరకు లభించిన వ్యవసాయ శాఖ నివే దికల ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు 31.06 కోట్ల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 9.80 కోట్ల ఎకరాల్లో, నూనె గింజలు 6.62 కోట్ల ఎకరాల్లో, పత్తి 5.45 కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 397 విత్త నోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌లో 20 లక్షల క్వింటాళ్ళు ఆహార, పప్పు, నూనె గింజల విత్తనాలు, ఒక కోటికి పైగా పత్తి విత్తనాలు, రబీలో 8 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. కొత్త విత్తన చట్టాలు అమల్లోకి రాకపోగా.. బహుళ జాతి సంస్థలు పాత విత్తన చట్టాల్లో ఉన్న కొన్ని కఠినమైన క్లాజుల్లో మార్పులు తెచ్చేవిధంగా ప్రభు త్వంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ఉత్పత్తి చేసే కంపెనీయే తన విత్తనానికి ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ఇచ్చు కునే వెసులుబాటు కల్పించారు. దీంతో పత్తి విత్త నాల అక్రమసాగుకు అడ్డు లేకుండాపోయింది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేసే పత్తి పంటలోకి నిషేధిత బీజీ3 విత్తనాలను చొప్పించటానికి ఓ రాచ మార్గం ఏర్పడింది. ఫలితంగా ఆ పంటలను మేసిన పశువులు మరణించడం, చేలో పనిచేసిన వారికి గర్భస్రావాలు, చర్మవ్యాధులు సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన బీజీ3 విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రస్థాయిలో ఒక సమగ్రమైన విత్తన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చే పనిలో నిమగ్నమ యింది. నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై పీడీ యాక్టు ప్రయోగించే విధంగా నిబంధ నలు అమల్లోకి తెచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 -
విత్తును వీడని నకిలీ మకిలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ఆంగోతు రాములు. ఈయనది నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుండ్ల తండా. గతేడాది గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని ఓ వ్యాపారి వద్ద ఒక ప్రముఖ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను తెచ్చి తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో విత్తాడు. కనీసం మొలకలు కూడా రాలేదు. దీంతో వ్యాపారి వద్దకు వెళ్లి నిలదీశాడు. తనకేం తెలియదని, మంచి విత్తనాలనే ఇచ్చామని దబాయించడంతో చేసేది లేక వెనుదిరిగాడు. కంపెనీ యజమాని, వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట పలుమార్లు రైతు సంఘం నాయకులతో కలిసి ధర్నా చేశాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. రాములు సుమారు రూ.2 లక్షలు నష్టపోయాడు. సాక్షి, నెట్వర్క్: నకిలీ విత్తనాల కారణంగా రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. పత్తి, మిర్చి, వరి విత్తనాల్లో ఈ నకిలీ ఎక్కువగా ఉంటోంది. రైతులు ఇరుగుపొరుగు వారిని అడిగి మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నారు. అందులో కొన్ని నకిలీ విత్తనాలు ఉండటంతో మొక్క ఎదిగినా పూత, కాత ఉండడం లేదు. దీంతో అప్పటివరకు పెట్టిన పెట్టుబడులన్నీ రైతులు నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో ఇలా నష్టపోయిన రైతులు వ్యవసాయాధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. కొన్ని కంపెనీల విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినా నివేదికలను తెప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల తాము సరఫరా చేసిన విత్తనాలు నాణ్యమైనవేనంటూ విత్తన కంపెనీలు కోర్టును ఆశ్రయించడంతో పరిహారం అంశం తేలడం లేదు. ఇంకొన్ని చోట్ల తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయనే కారణంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో కొందరు చోటా నాయకులు విత్తన వ్యాపారుల అవతారం ఎత్తి రైతులకు పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. ఏటా ఖరీఫ్ ఆరంభానికి ముందు రైతు చైతన్య యాత్రల పేరిట గ్రామాలకు వెళ్లే వ్యవసాయ అధికారులు.. ఈ ఏడాది రైతుబంధు చెక్కుల పంపిణీతో తీరిక లేకుండా గడిపారు. ప్రస్తుతం బదిలీల హడావుడి కొనసాగుతుండడంతో రైతులకు విత్తనాలపై మార్గనిర్దేశనం కొరవడింది. ఖమ్మం జిల్లాలో ఎక్కువ దాదాపు అన్ని జిల్లాల్లో నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతుండగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. నకిలీ విత్తనాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. మిర్చి నకిలీ విత్తన వ్యవహారం 2016లో ఇక్కడే బయటపడింది. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన బాధ్యులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. గతేడాది కూడా పత్తి, మిర్చి రకాల్లో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి పరిస్థితీ అంతే. ఇక రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విక్రయించిన వరి విత్తనాల్లో సరైన మొలక శాతం లేకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. పరిహారంపై కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఏడాది విత్తనాలు అరకొరేనా? ఈ ఖరీఫ్‌లో విత్తనాల కొరత లేకుండా చూస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నా మండల పాయింట్లలోకి ఇండెంట్లో సగమే వచ్చాయి. కొన్నిచోట్ల ఇంకా వస్తున్నాయి. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, సాగు పనులు ముమ్మరం అయ్యేసరికి విత్తనాలు సరఫరా అవుతాయని స్థానిక వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న విత్తనాలను ప్రైవేటు కంపెనీలు విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. గింజలు గట్టి పడలేదు.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు మహదేవ్. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన ఈయన గతేడాది రబీలో బోరు నీటి ఆధారంగా ఎకరన్నర విస్తీర్ణంలో వరి సాగు చేశాడు. రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. నాలుగు నెలలు గడచినా వరి గింజలు గట్టి పడలేదు. ఉత్తి తాలుగా మారాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా నష్టపరిహారం అందలేదు. శాస్త్రవేత్తలు పరిశీలించినా ఏం లాభం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాథోడ్ దేవీదాస్. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామం. గతేడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకుని తొమ్మిదెకరాల్లో బీటీ–3 విత్తనాలతో పత్తి సాగు చేశాడు. మిగతా 11 ఎకరాల్లో బీటీ–2 విత్తనాలు వేశాడు. బీటీ–2 పంట ఆశాజనకంగానే వచ్చింది. కానీ బీటీ–3 దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బీటీ–3 సాగు కోసం సుమారు రూ.1.8 లక్షల వరకు ఖర్చుచేయగా.. 40 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. ఈ సీజన్లో ఏ వ్యవసాయాధికారి కూడా తమకు ఏ విత్తనాలు వాడాలో చెప్పలేదని.. దాంతో తెలిసినవాళ్ల సలహాతో పత్తి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశానని చెప్పాడు. అధికారులు సూచనలు ఇవ్వడం లేదు గత ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన. ప్రభుత్వపరంగా, విత్తన కంపెనీ పరంగా, ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందలేదు. సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు విత్తన ఎంపికకు సంబంధించి అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. – ఎల్లారం నవాజులు, బాబిల్‌గాం, సదాశివపేట మండలం, సంగారెడ్డి జిల్లా కాపు రాని మిర్చి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాలుగెకరాల్లో సాగు చేసేందుకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా, ఖమ్మం జిల్లా వైరాలోని విత్తన దుకాణాల నుంచి మిర్చి విత్తనాలు తెచ్చాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.350 చొప్పున ఎకరానికి 20 ప్యాకెట్ల చొప్పున రూ.28 వేలు వెచ్చించాడు. కాపు రాలేదు. కొద్ది రోజులు చూసి తోటను తొలగించాడు. రూ.2 లక్షలు నష్టపోయాడు. – వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నారాయణపురం, తల్లాడ మండలం -
కిరాణా షాపుల్లోనూ బిజీ‘బీజీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిషేధిత బీజీ–3 పత్తి విత్తన దందా జోరుగా సాగుతోంది. సీజన్ మొదలు కావడంతో పలు విత్తన కంపెనీలు బీజీ–3 విత్తనాలను అన్నదాతలకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఎరువులు, విత్తన దుకాణాల్లో నేరుగా అమ్మడం సాధ్యం కాకుంటే ఇతరత్రా పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా అనేకచోట్ల కిరాణా దుకాణాల్లో బీజీ–3 విత్తనాలను విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖకు ఫిర్యాదులందాయి. కొన్నిచోట్ల బడ్డీ కొట్లూ బీజీ–3కి అడ్డాలుగా మారాయి. ఇటీవల జరిగిన దాడుల్లో కిరాణా షాపుల్లో విత్తనాలను సీజ్ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. బీజీ–3 విత్తనాలను ప్యాకెట్లలో కాకుండా లూజ్‌గా గ్రాముల వారీగా అమ్ముతున్నారు. 450 గ్రాముల విత్తనాల ధర రూ.800 వరకు రైతులకు అంటగడుతున్నారు. బీజీ–3, బీజీ–2 విత్తనాలను పక్కన పెట్టి చూస్తే రెండింటి మధ్యì తేడాను గుర్తించలేం. దీంతో ఏది నిషేధిత విత్తనమో అర్థంగాక రైతులు అయోమయంలో పడిపోతున్నారు. గత్యంతరం లేక వ్యాపారులు ఇచ్చిందే కొనుగోలు చేసి విత్తుకుంటున్నారు. గతేడాదీ ఇంతే గతేడాది నకిలీ, అనుమతి లేని అన్ని రకాల విత్తనాలు వెల్లువెత్తాయి. గత ఖరీఫ్‌లో రైతులు 47 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగు చేశారు. దేశవ్యాప్తంగా బీటీ–2 పత్తి విత్తనాలకు మాత్రమే అనుమతి ఉంది. వాటి లోనూ నకిలీ విత్తనాలు వెలుగుచూశాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2.37 లక్షల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. వాటి విలువ రూ.15.19 కోట్లు. అయితే ఇంతస్థాయిలో నకిలీ విత్త నాలు మార్కెట్లోకి వచ్చి చేరుతుంటే, ఎందుకు ముందస్తుగా గుర్తించలేదన్న అనుమానాలు తలెత్తుతున్నా యి. అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాలను కంపెనీ లు అక్రమంగా సరఫరా చేశాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో బీటీ–3 విత్తనాలు వేసినట్లు అంచనా. గత ఖరీఫ్‌లో విత్తనాలు విక్రయించే వరకు చోద్యం చూసిన వ్యవసాయ శాఖ తనిఖీలు చేసి పట్టుకోవడం వరకే పరిమితమైంది. తనిఖీల్లో అనేకచోట్ల కంపెనీలు కొందరు వ్యవసాయాధికారులకు ముడుపులు చెల్లించి తమ దందా కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 లక్షల ప్యాకెట్లు: గతేడాది 79.15 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు విక్రయించగా, 2018–19 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున 1.05 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. మొత్తం 43 కంపెనీలకు పత్తి విత్తనాలను సరఫరా చేసే బాధ్యతను సర్కారు అప్పగించింది. అందులో అత్యధికంగా రాశి విత్తన కంపెనీ 17.23 లక్షల ప్యాకెట్లు, ఆ తర్వాత కావేరీ విత్తన కంపెనీ 16.25 లక్షల ప్యాకెట్లు, నూజివీడు విత్తన కంపెనీ 13.17 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తాయి. అయితే బీజీ–2తోపాటు అనేక కంపెనీలు దాదాపు 20 లక్షల ప్యాకెట్ల వరకు బీజీ–3 పత్తి విత్తనాలను ఇప్పటికే రంగంలోకి దింపాయన్న చర్చ జరుగుతోంది. కంపెనీలు ఆ మేరకు రైతులకు అంటగడుతున్నాయి. గ్లైఫోసేట్ను నిషేధించని సర్కారు రాష్ట్రంలో రెండేళ్లుగా రైతులు పండిస్తున్న పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్రవేత్తల బృందం కూడా ధ్రువీకరించింది. ఇక ‘గ్లైఫోసేట్’అనే కలుపు మందును కేవలం తేయాకు తోటల్లో వేయడానికే దేశంలో అనుమతి ఉంది. ఇతర పంటలకు ఏమాత్రం వాడకూడదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఈ మందునే వాడాల్సి ఉంది. అనుమతి లేకుండా బీజీ–3 వేయడమే పెద్ద తప్పు. అదీగాక బీజీ–3 వేసిన రైతులు తప్పనిసరిగా గ్లైఫోసేట్ను కొనుగోలు చేస్తారు. ‘గ్లైఫోసేట్’ను బీజీ–3 పత్తికి వేస్తే, ఇతర పంటలపై ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఆ పురుగు మందుతో జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం కలుషితమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లైఫోసేట్’ కలుపు మందును నిషేధించాల్సి ఉండగా, ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదు. గ్లైఫోసేట్ను మార్కెట్లో అనుమతిస్తున్నారంటే బీజీ–3కి రాష్ట్ర వ్యవసాయ శాఖ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లేనంటూ చర్చ జరుగుతోంది. -
నకిలీ విత్తు!
సాక్షి, గద్వాల : జిల్లావ్యాప్తంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు జరుపుతున్న దాడుల్లో నకిలీ విత్తనాల బాగోతం బయట పడుతోంది. ఈ నెల రోజులోనే రూ.కోట్లు విలువజేసేవి పట్టుకున్నారు. రైతు తమ పొలంలో దుక్కి దున్ని విత్తనాలు వేసినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేంత వరకు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. నకిలీ విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ ముప్పెట దాడి చేస్తున్నాయి. నకిలీ దందా నిర్వహించే వారు కోట్లకు పడుగలెత్తుతుంటే, ఆరుగాలం కష్టపడి పండించిన పంట నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల సక్రమంగా దిగుబడి రాక, వచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతులు మ రింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నడిగడ్డ కేం ద్రాంగానే ఎక్కువగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకుం టామని, కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది మాటలకే పరిమితం కావడంతో అడ్డూఅదుపు లేకుండాపోయింది. అనుమతి లేకపోయినా కొందరు దళారులు బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మభ్యపెడుతున్న వ్యాపారులు రాష్ట్రంలోనే అత్యధికంగా సీడ్ పత్తి సాగు ఈ జిల్లాలోనే ఉంటోంది. దీనిని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు ఆర్గనైజర్ల సహకారంతో గతేడాది రైతులతో బీటీ–3 విత్తనాలు సాగు చేయించినట్టు బహిర్గతమైంది. నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఎంత హె చ్చరించినా చాపకింద నీరులా వాటి విక్రయం కొ నసాగుతూనే ఉంది. డీలర్ కంటే తక్కువ రేటుకు విక్రయిస్తామంటూ రైతులను కొందరు వ్యాపారులు ఆకట్టుకుంటూ వీటిని అంటగడుతున్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఎక్కువ ప్యాకెట్లను కొంటే రేటు తక్కువగా ఇస్తామని చెబుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల నకళ్లను రూపొందించి గ్రామాల్లో తిరుగుతూ వాటినే అసలివిగా చూపెడుతూ విక్రయిస్తున్నారు. అలాగే డీలర్లను సైతం కమీషన్ ఎక్కువగా ఇస్తామంటూ తమ వైపు తిప్పుకొంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మరీ రైతులకు విత్తనాలను విక్రయిస్తున్న పరిస్థితి. జిల్లాలోని గద్వాల, అయిజ మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇక్కడ పండించిన విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో నిల్వ ఉంచుతూ ఏటా అక్కడి నుంచి నకిలీ విత్తనాల మాఫీయా నడిగడ్డ కేంద్రంగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తూ రైతులను నట్టేట ముంచుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. అయితే సీడ్ పత్తి పై అధికార యంత్రాంగం ఈసారి ప్రత్యేక దృష్టి సారించడంతో ఇప్పుడైనా నకిలీ విత్తనాల నుంచి రైతులు బయటపడతారా లేదా అనేది చూడాలి. వరుస దాడులు పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడుల్లో నకిలీ విత్తనాలు పెద్ద ఎ త్తున బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కా కుండా జర్మినేషన్లో ఫెయిల్ అయిన విత్తనాలకు రంగులు, రసాయానాలు అద్ది రైతులకు అమ్మి కొందరు వ్యక్తులు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంతవరకు బీటీ–1, 2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే కొ న్నేళ్లుగా కంపెనీలు రైతులతో గుట్టుచప్పుడు కా కుండా బీటీ–3 సాగు చేయిస్తున్నారని అధికారులు దాడులు జరిపి, పరీక్షించిన వాటిలో తేలింది. గతేడాది పెద్ద ఎత్తున వివిధ కంపెనీలు రైతుల ద్వారా ఫౌండేషన్ సీడ్‌గా బీటీ–3ని ఇచ్చి సాగు చేశారు. ఇక్కడ పండించిన ఈ విత్తనాలను ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో నిల్వ ఉంచడంతో అక్కడి ప్రభుత్వం సదరు కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టేం దుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధి కారులు నకిలీ పత్తి విత్తనాలు, బీటీ–3ని నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం ఈ సీజన్ ఆరంభంలోనే విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిం చి పొలాలు, ఇళ్ల వద్ద ఉన్న నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న కొందరు వ్యక్తులు తప్పని పరిస్థితుల్లో వాటిని రోడ్లపైన పారబోస్తున్నారు. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే అయిజ మండలంలోని తూంకుంటలోని ఓ ఇంట్లో అనుమతి లేని పత్తి విత్తనాలు మూడు బస్తాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మచ్చుకు కొన్ని ఘటనలు గత ఏప్రిల్ 10న ధరూరు మండలం మార్లబీడులోని రాము ఇంట్లో సుమారు 3.25క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. 16న ధరూరు మండలం సోంపురంలోని గోవిందు నుంచి 4.5క్వింటాళ్ల పత్తి విత్తనాల స్వాధీనం. మే 7న ధరూరు మండలం మార్లబీడు, సోంపురంలలో 3.36క్వింటాళ్లు, గట్టు మండలం మిట్టదొడ్డిలో 150క్వింటాళ్ల విత్తనాలు పట్టుబడ్డాయి. 24న ధరూరు మండలం జాంపుల్లిలో రూ.12లక్షలు విలువ చేసే 12క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. 25న మల్దకల్ మండలం తాటికుంటలో రూ.12లక్షలు విలువ జేసే 28.50క్వింటాళ్ల స్వాధీనం. 28న గద్వాల పట్టణ పాత హౌసింగ్‌బోర్డుకాలనీలోని సీడ్ ఆర్గనైజర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో 125కిలో నకిలీ పత్తి విత్తనాలు, అందుకు సంబంధించి రంగులు స్వాధీనం చేసుకున్నారు. 28న అయిజ మండలం మేడికొండలోని నాగరాజు ఇంట్లో 10.50క్వింటాళ్లు పట్టుబడ్డాయి. ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్వింటాల్ నకిలీ పత్తినాలు పడేశారు. వాటిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 30న అయిజ మండలం బింగిదొడ్డిలోని సబ్ ఆర్గనైజర్ తిమ్మప్ప ఇంట్లో 19.50క్వింటాళ్ల స్వాధీనం. జూన్ 1న మల్దకల్ మండలం అమరవాయిలోని డీలర్, సీడ్ ఆర్గనైజర్ తిమ్మారెడ్డి ఇంట్లో క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. -
నకిలీ గుట్టు రట్టు
ధరూరు(గద్వాల): నకిలీ పత్తి విత్తనాల వ్యాపారుల గుట్టురట్టు అవుతోంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న జర్మనేషన్ ఫెయిల్ అయిన విత్తనాలకు రంగులు, రసాయనాలు అద్ది రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులు ఒక్కొరుగా బయటికొస్తున్నారు. కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశానుసారం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు నకిలీ గుట్టును రట్టు చేస్తున్నారు. వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో సాగుతున్న టాస్క్‌ఫోర్స్ తనిఖీలతో నకిలీ వ్యాపారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రెండు కేసులు.. పత్తి సాగుకు కేంద్ర బింధువైన గద్వాల నియోజకవర్గంలో అత్యధికంగా సాగయ్యే సీడ్ పత్తితో రైతులు అప్పులపాలవుతుండగా.. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, ఇతర వ్యాపారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం బృందం తనిఖీల్లో వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో నకిలీ పత్తివిత్తనాల కేంద్రాలను గుర్తించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 10న మార్లబీడులో రాము అనే ఆర్గనైజర్ కోళ్లఫారం వద్ద 3.25 క్వింటాళ్ల పత్తి విత్తనాలు లభించగా.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘనటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే పారుచర్ల అనుబంధ గ్రామమైన సోంపురంలో సోమవారం ఏఓ భవానీ, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంకటేష్, స్వాములు, నజీర్ సోదాలు నిర్వహించి 4.50 క్వింటాళ్ల పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన గోవిందును అదుపోలోకి తీసుకున్నారు. రంగులు అద్ది రాష్ట్రం, రాయిచూరులో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. వ్యవసాయ పొలంలో గుడిసెలో దాచి ఉంచిన విత్తనాలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత దుకాణాల్లో సోదాలు అనుమానం ఉన్న ఎరువుల దకాణాలు, గద్వాలలోని వివిధ పత్తి మిల్లుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానిత విత్తనాలను షాంపిల్ సేకరించి టెస్ట్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో పట్టుబడిన దాదాపు 8 క్వింటాళ్ల నకిలీ విత్తనాల విలువ సుమారు రూ.3లక్షలకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. నకిలీ సీడ్ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేస్తున్న ప్రత్యేక బృందాలను ఎస్పీ రెమారాజేశ్వరి అభినందిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా తమ సహకారం ఉంటుందని చెప్పడంతో పోలీసులు మరింత ముందుకుసాగి నకిలీ గుట్టును రట్టు చేసే పనిలో బిజీగా ఉన్నారు. -
అడ్డుకట్టేది..!
ఇచ్చోడ(బోథ్): నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల విక్రయం చాపకింద నీరులా జోరుగా సాగుతోంది. అక్రమ మార్గం గుండా భారీ ఎత్తున జిల్లాలోకి విత్తనాలను తరలించినట్లు తెలుస్తోంది. ఆంధ్రా ప్రాంతం నుంచి లక్షలాది రూపాయల విలువైన విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి గత ఏడాది కంటే అధికంగా నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని విక్రయించాలని చూస్తున్నట్లు తెలిసింది. గత రెండు నెలల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల లక్షలాది రూపాయల విలువైన విత్తనాలు పట్టుబడినా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. పదేళ్ల క్రితం బీటీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. వీటిని విత్తుకోవడం ద్వారా చీడపురుగుల ధాటికి తట్టుకుని పెట్టుబడులు తగ్గుతాయనే ఆశతో రైతులు అధికంగా సాగు చేస్తూ వచ్చారు. గత రెండేళ్ల నుంచి బీటీ పత్తిపై గులాబీ రంగు పురుగు తీవ్ర పెరిగిపోవడం, చీడపీడల ధాటికి బీటీ పత్తి సాగు విఫలమై దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి రైతులు నష్టాల బారినపడ్డారు. పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. రైతులు అప్పుల పాలవుతున్న సంఘటనలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు నిషేధిత బీజీ–3 రకంపై ప్రచారం మొదలుపెట్టారు. ఈ రకం పత్తి విత్తనం కలుపు మందును తట్టుకుని గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా తట్టుకుంటుందని, తద్వారా తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి పొంది లాభాలు పొందవచ్చని చేసిన ప్రచారం ఫలించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది 3,07,505 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఇందులో సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలు సాగైనట్లు అధికారులు అంచనా వేశారు. నిషేధిత బీజీ–3 విత్తనాలను అడ్డుకుని పూర్తి స్థాయిలో నిలిపి వేయాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జీవ వైవిధ్యానికి హానికరంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ రకం పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వలేదు. ఈ రకం పత్తి పంటకు కలుపు నివారణ కోసం గైసెల్ పురుగు మందు వాడాలి. ఈ మందు వాడకం వల్ల బీజీ–3 సాగు చేస్తున్న పక్క పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందస్తు చర్యలు శూన్యం... కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలం కాగా.. ఈ రకం విత్తనాలు జిల్లాలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది. గత ఏడాది జిల్లాలోకి అక్రమంగా బీజీ–3 విత్తనాలు సరఫరా అయ్యాక జూన్‌లో విజిలెన్స్ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు తూర్పు జిల్లాలో రైలు సౌకర్యాలు ఉన్న ప్రాంతాలతోపాటు ఇటీవల బోథ్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద దాదాపు 300 బీజీ–3 విత్తనాల ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి నిషేధిత పత్తి విత్తనాలను కొందరు వ్యాపారులు జిల్లాలోకి తరలించినట్లు సమాచారం. ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలే లక్ష్యం.. నిషేధిత బీజీ–3 విత్తనాలను రైతులను అంటగట్టడానికి వ్యాపారులు అధికంగా ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. రెండు జిల్లాలో అధికంగా పత్తి సాగు చేసే రైతులు ఉండడంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఈ రకం పత్తి విత్తనాలను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది గిరిజన రైతులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ రకం విత్తనాలను ఉద్దెర కూడా ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. నిషేధం ఉన్నప్పటికీ ఈ రకం విత్తనాలను రైతులు సాగు చేయడానికి ముందుకు రావడం కూడా వ్యాపారులకు కలిసి వస్తోంది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తే బీజీ–3 విత్తనాల వ్యాపారానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. -
రైతుల్ని ముంచిన నకిలీ విత్తనాలు
మల్దకల్ (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు సరఫరా అవుతోంది. దీంతో తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్లతోపాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు రబీలోనూ వరి పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కాపు వచ్చినా గింజ పట్టక తాలు రావడంతో పంటలు సాగు చేసిన రైతులు నట్టేట మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు. మండలంలోని ఉలిగేపల్లికి చెందిన రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో తులసి, ధనలక్ష్మి, వినాయక, ఓంకార్, టాటా, ధర్మరాజ్ పల్లి కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలతో నాటు వేశారు. 25 కిలోల వరి విత్తనాల ప్యాకెట్ రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి గద్వాల, రాయచూరు పట్టణ ప్రాంతాల్లోని డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేరకు వరి పంట రాకపోవడంతోపాటు, వరి గింజలు పట్టక తాలుపోయింది. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులు చిన్న సవారన్న, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, జైపాల్, లక్ష్మన్న, రాములతోపాటు మరో 80 మందికి పైగా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయాధికారిణి శ్రీలత బుధవారం గ్రామానికి వెళ్లి వరి పంటలను పరిశీలించారు. పంటకాలం పూర్తికావస్తున్నా గింజలు పట్టకుండా తాలుపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రై తులు ప్రశ్నించారు. వరి నాటు పెట్టి ఐదు నెలలు కావొస్తుందని, గింజలు పట్టక మొత్తం తాలు గింజలు పట్టినట్లు రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన తమకు కంపెనీలు నకిలీ వరి విత్తనాలను అంటగట్టారని, వరి పంటలకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు వివరిస్తాం.. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటలను పరిశీలించామని, వరికి ఇంత వరకు గింజ పట్టక తాలుపోయిందన్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా మల్దకల్ మండలంలోని బిజ్వారం, కుర్తిరావుల్‌చెర్వు గ్రామాల రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దీనిపై అప్పట్లో రైతులు కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి ఫిర్యాదు చేయగా, కంపెనీ అధికారులు పంట పొలాలను పరిశీలించినా ఫలితం లేకపోవడంతో నకిలీ మిరప పంటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారం కంపెనీ నిర్వాహకులు చెల్లిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. పంటలను పరిశీలిస్తాం : డీఏఓ ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ స్పందిస్తూ ఉలిగేపల్లి రైతులతోపాటు కేటీదొడ్డి, గట్టు మండలాలకు చెందిన రైతులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారికి లేఖ రాశామన్నారు. వారు పంటలను పరిశీలించిన అనం తరం ఏ విషయమనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. -
విత్తన కేటుగాళ్లు వస్తున్నారు..!
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతి యేడాది నకిలీ విత్తనాల బారినపడి వేలాది మంది రైతులు మోసపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. కంపెనీలు, డీలర్లు మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసి నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు కూడా డిమాండ్ పెరగడంతో అప్పటికప్పుడు నకిలీ సీడ్స్‌ను సృష్టించి రైతులకు అంటగడుతున్నాయి. అమాయక రైతులు వారి మోసానికి గురై సాగులో పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రతి యేడాది నకిలీ విత్తనాల దందాను అరికడతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి మోసాలను మొదటినుంచే అదుపు చేయడంలో విఫలమవుతోంది. తాజాగా బుధవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. జిల్లాలోనూ గ్రామాల్లోకి ఇలాంటి కేటుగాళ్లు మళ్లీ చొరబడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలకు సంబంధించి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు. పత్తి విత్తన రకానికి సంబంధించి బడా భూస్వాముల చేలలో ఆ రకం విత్తనాలను సాగు చేయడం ద్వారా ఇంత కాత, పూత వస్తుందని డీలర్లు రైతులకు చూపించి ఎరవేయడం వారికి ఈ దందాలో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వానకాలం పంటల సాగుకు ముందే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సంయుక్తంగా తనిఖీలు చేపడితే దీన్ని అరికట్టవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ టాస్క్ ప్రారంభం కాకపోవడం చోద్యమే. గతేడాది వేల ఎకరాల్లో నష్టం.. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా వేల ఎకరాల్లో రైతులు పంట నష్టం చవిచూశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఒక రకం పత్తి విత్తనాలను దాదాపు 3500 మంది రైతులు 8800 ఎకరాల్లో సాగు చేశారు. బేల, జైనథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ విత్తనం సాగు చేసిన రైతుకు ఎకరానికి రెండు క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వచ్చింది. సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల పైబడి దిగుబడి రావాలి. దీంతో నష్టపోయిన రైతులందరు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు. దీంతో శాస్త్రవేత్తలతో పంట చేలల్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2007 కాటన్‌సీడ్ యాక్ట్ ప్రకారం విత్తనం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త, ఎక్కువ పంట నష్టపోయిన గ్రామానికి సంబంధించి ఒక ప్రతినిధి, విత్తన కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇతర విత్తనాల పరంగా సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ నాసిరకం పత్తి విత్తనాల కారణంగా రెండు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. మిగతా మూడున్నర క్వింటాళ్ల పత్తిని నష్టపోయినందునా దాని పరిహారం కనీస మద్దతు ధర ఆధారంగా చెల్లించాలని ఆదేశించారు. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ.4320 కాగా, 3500 మంది రైతులకు 8800 ఎకరాల్లో సుమారు రూ.13 కోట్లు రైతులకు చెల్లించాలని ఇటీవల స్పష్టం చేశారు. దానికి మార్చి 16లోగా చెల్లించాలని కంపెనీ ప్రతినిధులకు గడువు విధించారు. అయితే ఆ కంపెనీ చెల్లిస్తుందా లేదో తెలియదు. ప్రభుత్వం నకిలీ విత్తనాల మోసాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనబడటం లేదు. పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలి ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేసి నకిలీ విత్తన మోసాలను అరికట్టాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. రైతులను మోసం చేసేవారిని వదలకూడదు. ఖమ్మంలో మిర్చి సీడ్స్ నకిలీవి విక్రయించిన కంపెనీపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనూ గతేడాది నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏకం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నష్టానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారణ చేసింది. వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు సంయుక్తంగా తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేందుకు బృందాలను మండల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల బారిన పడకూడదు. కంపెనీలు, డీలర్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దు. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
రైతుల ఆందోళనలు పట్టని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్ యాక్ట్ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
గ(క)ల్తీ.. ఎరువులు
నందిమల్ల్లగడ్డ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ రెండు మళ్లలో వంకాయ తోట సాగుచేశాడు. 15 రోజుల క్రితం వనపర్తిలోని ప్రియాంక ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన ఎరువును పంటకు వేశాడు. తడి ఆరకుండా నీళ్లు పెడుతున్నా ఎరువు కరగడం లేదు. అందులో సున్నపురాళ్లు, గులకరాళ్లు ఉన్నట్లు బాధిత రైతు గుర్తించి లబోదిబోమన్నాడు. ఇలా చాలామంది రైతులను నకిలీ ఎరువులు నిలువునా ముంచాయి. సాక్షి, వనపర్తి : జిల్లాలోని వీపనగండ్ల మండలంలో ఓ వ్యాపారి నుంచి రైతులు వరి విత్తనాలను కొనుగోలుచేసి నాటితే నారుకు బదులు మొత్తం తుంగనే మొలిచింది. దీనిని తుంగ దశలోనే గుర్తించడంతో కోట్ల రూపాయల పంటనష్టం నుంచి రైతులు బయటపడగలిగారు. ఇదే కోవలో వనపర్తి మండలంలోనూ నకిలీ ఎరువులను విక్రయించడంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఇలా కల్తీ ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అక్రమ సంపాదన రుచిమరిగిన వ్యాపారు లు వాటిని యథేచ్ఛగా అంటగడుతున్నారు. నకిలీ ఎరువు లు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు ముందు నుంచే ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అమలుకాలేదు. ‘నకిలీ’ దుకాణం వనపర్తి పట్టణంలో కేశవులు అనే వ్యాపారి ప్రియాంక ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నాడు. ఈ దుకాణంలో వనపర్తి మండలంలోని నందిమళ్ల గడ్డకు చెందిన కొందరు రైతులు చాలారోజులుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. తెలిసిన వ్యాపారి కావడంతో పెద్దగా నిరక్షరాస్యులైన రైతులు ఏటా వ్యాపారి చెప్పిన ఎరువులనే తీసుకెళ్లేవారు. గత ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులనే కొనుగోలుచేసినా పెద్దగా పంట దిగుబడి రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు వేరుశనగ, వరి, వంకాయ, చిక్కుడు, టమాట పంటలను సాగుచేశారు. రెండు నెలల క్రితం పంటలు సాగుచేసే సమయంలో వ్యాపారి కేశవులు వద్ద మందు 20–20రకం అడుగు మందును సుమారు 20మంది రైతులు కొనుగోలుచేశారు. సదరు వ్యాపారి జిల్లాలోని చాలామంది రైతులకు ఇలాంటి విత్తనాలు, ఎరువులనే విక్రయించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.. చేనులో ఎదుగుదల లోపించడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోక రైతులు మరోసారి మరోసారి అడుగు మందు చల్లారు. అయినా పంటలో మార్పు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన రైతులు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. రైతులు రెండు రోజులు క్రితం నాణ్యత లేని ఎరువులను విక్రయించిన వ్యాపారి దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు దుకాణాన్ని తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా గ్రీన్‌గోల్డ్ అనే కంపెనీకి చెందిన 20–20 అడుగు మందు, 3–15, 20–20–0 ఎరువులు బస్తాల కొద్దీ పట్టుబడ్డాయి. వీటి శాంపిళ్లను సేకరించిన అధికారులు నివేదిక కోసం ఎరువుల ప్రయోగశాలకు పంపించారు. రిపోర్టు వస్తే సదరు ఎరువుల వ్యాపారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఈ –పాస్ వచ్చినా అదేతీరు.. ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి కలెక్టర్ శ్వేతామహంతి, వ్యవసాయ శాఖ అధికారులు వరసుగా డీలర్ల దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. అయినా ప్రియాం క ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు ఎరువుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. అతని వద్ద ఎన్ని కంపెనీలకు చెందిన ఎరువులు ఉన్నా యో కూడా లెక్కచెప్పడం లేదు. రిపోర్టు రాగానే చర్యలు రైతుల ఫిర్యాదు మేరకు నష్టపోయిన పంటలను పరిశీలించాం. రైతులకు అమ్మిన ఎరువుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించాం. ప్రియాంక ఫర్టిలైజర్ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశాం. రెండు రోజుల్లో తెరిపించి మొత్తం లెక్కగట్టి 6 ఏ సెక్షన్ కింద కేసునమోదు చేసి జేసీ కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. – సుజాత, వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి జిల్లా -
నాసిరకం విత్తు ఇకపై చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పత్తి విత్తనంలో జన్యు స్వచ్ఛతకు నిర్వహించే గ్రో ఔట్ టెస్ట్ (జీవోటీ)లపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జీవోటీ పరీక్షల్లో నాసిరకం విత్తనాలని తేలుతున్నా మార్కెట్లో అవి విచ్చలవిడిగా లభిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జీవోటీ పరీక్షలు, నాసిరకపు విత్తనాలను కట్టడి చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇవే మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ప్రస్తుత నెలలో (జనవరి) పత్తి విత్తన జన్యు స్వచ్ఛత పరీక్షలు నిర్వహించి మార్చి, ఏప్రిల్ నెలల్లో వాటి ఫలితాలు విడుదల చేస్తారు. అందువల్ల ఈ సమయంలోనే మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 2 కోట్ల ప్యాకెట్ల విత్తనం! రాష్ట్రంలో పత్తి విత్తన తయారీ అధికంగా జరుగుతోంది. 10–12 ప్రముఖ కంపెనీలు దాదాపు 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులతో పంటను పండిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా, ఇతర ప్రాంతాల్లో మోస్తరు స్థాయిలో బీటీ పత్తి విత్తనోత్పత్తి జరుగుతోంది. దాదాపు రెండు కోట్ల ప్యాకెట్ల విత్తనం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని అంచనా. దేశానికి అవసరమయ్యే విత్తనంలో దాదాపు పావు వంతు ఇక్కడ్నుంచే వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా విత్తనోత్పత్తిపై ఎలాంటి నియంత్రణ లేదు. విత్తనం ఉత్పత్తి అయ్యాక దాన్ని విక్రయించే సమయంలో సమస్యలు తలెత్తితే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటుంది. కానీ విత్తనోత్పత్తి సమయంలో జరిగే అవకతవకల నియంత్రణకు ఎలాంటి నిబంధనల్లేవు. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలు తయారు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది బీటీ–2లో నాసిరకం విత్తనాలతోపాటు బీటీ–3 విత్తనాలు కూడా ఇక్కడే తయారయ్యాయి. వీటిలో బీటీ–3 విత్తనాలకు ఎలాంటి అనుమతి లేదు. విత్తనోత్పత్తిలో ఇంత విచ్చలవిడిగా అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మార్కెట్లోకి వస్తున్నాయిలా.. పత్తి విత్తన కేలండర్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి జూలై 15 వరకు విత్తన సాగు చేస్తారు. సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ మధ్య కాలంలో పత్తి తీత ఉంటుంది. నవంబర్ తొలి వారం నుంచి జనవరి చివరి వరకు జిన్నింగ్ చేస్తారు. జనవరిలోనే నమూనాలు సేకరించి జీవోటీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్ మధ్య జీవోటీ ఫలితాలు ప్రకటిస్తారు. జీవోటీ పరీక్షల్లో విత్తన సామర్థ్యాన్ని గుర్తించి అది నాసిరకమా కాదా అని తేలుస్తారు. నాసిరకం అని తేలినా వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ మార్గదర్శకాలు ఖరారు చేశారు. మార్గదర్శకాలివీ.. - విత్తన ధ్రువీకరణ ప్రమాణాల ప్రకారం హైబ్రీడ్ పత్తి విత్తన జన్యు స్వచ్ఛత 90 శాతం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే వాటిని నాసిరకపు విత్తనంగా పరిగణిస్తారు. అలాంటి విత్తనాలను మార్కెట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. - జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయాలి. అవసరమైతే జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలి. నాసిరకపు విత్తనాలని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి. - జీవోటీ పరీక్షలు సరిగా జరగలేదని భావిస్తే మరోసారి నిర్వహించాలని కోరే హక్కు విత్తనోత్పత్తిదారులకు కల్పించారు. అందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. - జీవోటీ పరీక్షల్లో నాసిరకం అని తేలినా మార్కెట్లోకి వస్తే దాన్ని ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ వద్ద అరగంట పాటు కాల్చి వేయాలి. అప్పుడే అది మొలకెత్తే లక్షణాన్ని కోల్పోతుంది. - విత్తనోత్పత్తిదారులకు, వ్యాపారులకు మధ్య ఒప్పందం ఉండాలి. దీని ప్రకారం ఎవరు అక్రమాలకు పాల్పడినా అందుకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాలి. - విత్తనోత్పత్తి స్వచ్ఛందంగా ఉండాలి. ఎవరిపైనా ఒత్తిడి చేసి విత్తనోత్పత్తిలో పాల్గొనేలా చేయకూడదు. - దళారుల ప్రమేయం లేకుండా కంపెనీలే రైతులతో విత్తనోత్పత్తి చేయించాలి. - పత్తి విత్తనాన్ని జిన్నింగ్ చేసే సమయంలో విచక్షణారహితంగా రసాయనాలు కలుపుతున్నారు. ఇది పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. దీన్ని నిరోధించేందుకు జిన్నింగ్ మిల్లులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. -
నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు వాటిని విక్రయించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది ఎకరాకు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తే, ఈసారి నకిలీ విత్తనాల వల్ల దిగుబడి 5 క్వింటాళ్లకు పడిపోయిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు మార్కెట్లో పత్తికి క్వింటాల్‌కు రూ.4వేల ధర కూడా రావడం లేదని, దీంతో పెట్టుబడి డబ్బులు కూడా రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. అలాగే వరి పంటకు దోమపోటు సోకడంతో పంట ఉత్పత్తి తగ్గిపోయి, రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోమపోటుకు గురైన వరి, నకిలీ విత్తనాలతో దిగుబడి పడిపోయిన పత్తి పంటలపై సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. -
పేరు గొప్ప.. దిగుబడి జీరో..!
ఆదిలాబాద్/ ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా నాసిరకం పత్తి విత్తనం రైతును నిండా ముంచుతోంది. గత మూడేళ్లుగా జిల్లా రైతులను చిత్తు చేస్తున్న నకిలీ విత్తనం ఈ ఏడాది ‘కింగ్ ’ రూపంలో వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల ఎకరాల్లో కింగ్ విత్తనం సాగైనట్లు తెలుస్తోంది. పత్తి కర్ర ఏపుగా పెరిగిందే గానీ పూత.. కాయ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా ఎదురు చూసినా పత్తి పుంజ రాకుండా కర్ర మాత్రమే మిగిలింది. ఇప్పటికే నకిలీ విత్తనాలు, బీటీ–3, గులాబీ పురుగుతో పత్తి రైతులు పంట దిగుబడులు కోల్పోయిన విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి కింగ్ విత్తనం వేసిన రైతులు ఆందోళన బాట పడుతున్నారు. నాసిరకం విత్తనాలతో మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కింగ్ విత్తనాలు విత్తిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పత్తి రైతులు ధర్నా చేపట్టారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నాథ్ సీడ్స్ కంపెనీకి చెందిన కింగ్–101 విత్తనరకంతో మోసపోయిన జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ఆ కంపెనీ ప్రతినిధులను నిర్భంధించారు. బీజేపీ ఆధ్వర్యంలోనూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పత్తి కర్రలకు నిప్పటించి నిరసన తెలిపారు. 15 వేల ఎకరాల్లో.. జిల్లాలో 15 వేల నుంచి 20 వేల వరకు నాథ్ సీడ్స్ కంపెనీకి చెందిన కింగ్–101 పత్తి ప్యాకెట్లను విక్రయించినట్లు సమాచారం. జైనథ్ మండలంలోని మేడిగూడ, జైనథ్, పార్టీ, ముక్తాపూర్, గిమ్మ, కౌట, బీంపూర్ మండలంలోని అర్లి–టి గ్రామాల్లో రైతులు ఈ సీడ్‌ను అధికంగా విత్తుకున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ డీలర్ బంధువు సీడ్ బాగుటుందని చెప్పడంతోనే అర్లి–టి గ్రామంలో అధిక మొత్తంలో విత్తనాలు విత్తుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా జైనథ్ మండలంలో దాదాపు 10 వేల ఎకరాల వరకు ఈ సీడ్‌ను వేసినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ కంటే ముందుగానే రైతుల వద్ద బుకింగ్ చేసుకుని సగం డబ్బులు ముందుగానే తీసుకున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీకి చెందిన ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలిసింది. శుక్రవారం కంపెనీకి చెందిన ప్రతినిధులు జైనథ్ మండలంలో పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లారు. వారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్రలే మిగులుతున్నాయి.. విత్తనాలు విత్తుకునే సమయంలో విత్తన కంపెనీలు గ్రామాల్లో ఆర్భాటంగా ప్రచారాలు చేపట్టాయి. ప్రతి ఏడాది విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం గానీ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో చివరకు రైతులకు నష్టమే మిగులుతోంది. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో కింగ్ పత్తి విత్తనాలతో పంట దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పడంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కంపెనీకి చెందిన పత్తి మొక్కలు 7 ఫీట్ల కంటే ఏపుగా పెరిగాయి. చెట్టుకు కనీసం పది కాయలు కూడా కాయడం లేదు. పూత, కాత వస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో పింజగా మారకుండా రాలిపోతున్నాయి. ఇప్పటికే రైతులు రెండుసార్లు పత్తి ఏరగా, ఈ రకానికి చెందిన పత్తికి ఇంకా ఏరేందుకు పత్తి కూడా రాలేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అ«ధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ గోస ఎవరి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజుల క్రితం జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి కంపెనీ ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించారు. అయితే తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమ శాస్త్రవేత్తలతో వచ్చి పంటలను పరిశీలిస్తామని చెప్పి తప్పించుకున్నారు. -
పత్తి రైతుకు మద్దతు ధర ఏదీ ?
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు, గులాబీ రంగు పురుగు తాకిడికి రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్నో కష్టాలను భరించి రైతులు ఈ ఏడాది భారీ ఎత్తున పత్తిని పండించినా.. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వా రా నామ మాత్రంగానే పత్తిని కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, వ్యవసాయ అనుబంధ అంశాలపై బుధవారం శాసన మండలిలో జరిగిన స్వల్పకాల చర్చలో మాట్లాడా రు. కేంద్రతో మాట్లాడి 15 శాతం వరకు తేమ తో పత్తి కొనుగోళ్లకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులపై పెట్టి న కేసులను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అంతకు ముందు మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమంకోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రూ.16,124.37 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు. -
నకిలీ విత్తన వ్యాపారిపై పీడీ యాక్ట్
రాష్ట్రంలో తొలిసారిగా.. సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలు తయారుచేసి రైతు లను మోసగిస్తున్న ఓ వ్యాపారిపై రాష్ట్రంలో తొలిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన చిన్నం జానకిరామ్ అలియాస్ గోపీకృష్ణపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్, మహబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ విత్తనాల తయారీకి సం బంధించి మూడు కేసుల్లో ఇతను నిందితుడు. స్వతహాగా తన తండ్రి విత్తనాల వ్యాపారంలో ఉండటంతోనే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన జానకిరామ్ 2004లోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో నాణ్యతలేని విత్తనాలు తయారు చేసి ఏజెంట్ల ద్వారా విక్రయించడం మొదలుపెట్టాడు. సృష్టి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైబ్రిడ్ బీటీ ఇంద్ర, భీష్మ, బలరామ్ విత్తనాలు తయారుచేసి రైతులకు విక్ర యించి మోసం చేస్తున్నాడు. ఈ కేసులో జూన్ 27న హయత్‌నగర్ పోలీసులు జానకిరామ్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇతను విడుదలై బయ టకు వస్తే మళ్లీ నకిలీ విత్తనాల ముసుగులో ఎంతో మంది రైతులకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా కారకుడయ్యే అవకాశం ఉందని మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. నకిలీ విత్తనాలతోపాటు ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కొరడా ఝళిపిం చేందుకు ఇటీవలే పీడీ యాక్ట్‌కు సవరణ తెచ్చారు. -
సర్కారీ విత్తూ..నాసిరకమే!
♦ రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ♦ సోయాబీన్, జీలుగ విత్తనాలు నాణ్యమైనవి కావని లేబొరేటరీలో నిర్ధారణ ♦ విత్తనాభివృద్ధి సంస్థకు నోటీసుల జారీకి వ్యవసాయశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై యుద్ధం అంటూ ప్రభుత్వం ఓవైపు దాడులు చేస్తుంటే.. మరోవైపు సర్కారు వారి సంస్థే రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ఎస్డీసీ) సబ్సిడీపై సరఫరా చేసిన సోయాబీన్, జీలుగ విత్తనాలు నాసిరకమని సాక్షాత్తూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీ నిర్ధారించడం నివ్వెరపరుస్తోంది. వాస్తవానికి సోయాబీన్, జీలుగ విత్తనాల్లో 80–95 శాతం వరకు మొలక రావాలి. కానీ వికారాబాద్ జిల్లా తాండూరులో సేకరించిన సోయాబీన్ విత్తనా న్ని డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించగా.. కేవలం 56 శాతమే మొలక రావడం గమనార్హం. అదే జిల్లా పెద్దేముల్లో సేకరించిన జీలుగ విత్తనా లను పరీక్షించగా అందులో 46 శాతమే మొలక వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో సేకరించిన సోయాబీన్ (జేఎస్‌వో–335 వెరైటీ) విత్తనాన్ని డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించగా 57 శాతమే మొలక ఉన్నట్లు నిర్ధారించారు. అదే జిల్లాలో ఓ చోట సేకరించిన జీలుగ విత్తనంలో 55 శాతమే మొలక ఉన్నట్లు గుర్తించారు. యాథృచ్చికంగా అక్కడక్కడ సేక రించిన నమూనాల్లోనే ఇలా నాసిరకం సర్కారు విత్తనాలు బయటప డడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహనే ఎండీగా వ్యవహరిస్తుం డటం గమనార్హం. ఇతర ప్రైవేటు విత్తన కంపెనీలపై ఎలా చర్యలు తీసు కుంటారో.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తనాభివృద్ధి సంస్థకు కూడా నోటీసులు జారీ చేస్తామని, ఆ ప్రకా>రం కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని వ్యవసాయశాఖ విత్తన విభాగం డిప్యూటీ డైరెక్టర్ కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేసి... ఖరీఫ్‌లో 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 63,800 క్వింటాళ్ల మొక్కజొన్న, 64 వేల క్వింటాళ్ల జీలుగ, 2.40 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 43 వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు, 39 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. సోయాబీన్ విత్తనాలను 33 శాతం సబ్సిడీతో, జీలుగ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో సరఫరా చేశారు. వీటిని టెండర్లు, ప్రైవేటు విత్తన కంపెనీల ద్వారా సేకరించి రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకపోవడం, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశారా? లేదా? అన్న అంశంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే సోయాబీన్, జీలుగ విత్తన నమూనాల్లో కొన్నిచోట్ల నాసిరకం విత్తనాలు వెలుగుచూశాయి. ప్రభుత్వమే ఇలాంటి విత్తనాలు సరఫరా చేస్తే ఇక ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసే ఇతర విత్తనాలపై రైతులకు నమ్మకం ఎలా కలుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా సోయాబీన్ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేలా కంపెనీలతో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేయడంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. దుమారం చెలరేగడంతో సర్కారు వాటి ధరలను కాస్తంత తగ్గించింది. కానీ కంపెనీలు సరఫరా చేసిన విత్తనాలపై నిఘా పెట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర విత్తనాలూ అంతే..? ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసిన విత్తనాల్లో కూడా ఎక్కువగా నాసిరకానివే ఉన్నట్టు డీఎన్ఏ లేబొరేటరీలో నిర్ధారణ అయింది. పోలీసులు, వ్యవసాయాధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని పలు దుకాణాలు, కంపెనీల గోదాముల నుంచి విత్తన నమూనాలు సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన నమూనా విత్తనాలు 5,594 కాగా.. అందులో 3,830 విత్తనాలను డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించారు. అందులో 122 విత్తనాలు నాసిరకమని తేలింది. అందులో అత్యధికంగా 92 విత్తన నమూనాలు పత్తివే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలైతే 95 శాతానికి పైగా మొలకెత్తుతాయి. అయితే రైతులకు విక్రయించినవాటిలో అత్యధికం 55 నుంచి 70 శాతంలోపే మొలకలుంటున్నాయి. ప్రభుత్వం తూతూమంత్రంగానే విత్తన కంపెనీలపై కేసులు పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క పీడీ యాక్టు కేసు నమోదైంది. మిగిలినవన్నీ అత్యంత సాధారణ కేసులు.. అరెస్టులే! దీంతో విత్తన కంపెనీ యాజమాన్యాలు ఏమాత్రం భయపడడంలేదని అంటున్నారు. -
రూ. 60 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం
తొండుపల్లిలోని ఓ గోదాంపై అధికారుల దాడులు.. శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): కోళ్ల ఫారం షెడ్డులో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ఓ గోదాంపై పోలీసులు, వ్యవసాయా ధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు రూ.60 లక్షల విలువైన వివిధ రకాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఓ ఫంక్షన్ హాలు పక్కన సుదర్శన్‌రెడ్డికి చెందిన కోళ్లఫారం షెడ్డు ఉంది. ఈ షెడ్డును రెండు నెలల కిందట అనంతపురానికి చెందిన మనోజప్ప అద్దెకు తీసుకున్నాడు. ఇందులో వివిధ రకాల విత్తనాలను కూలీల చేత రాత్రి వేళల్లో ప్యాకింగ్ చేయిస్తున్నాడు. సమాచా రం అందుకున్న అధికారులు శుక్రవారం సాయంత్రం గోదాంపై దాడి చేశారు. అక్కడ కిరణ్–88, అక్షయ్–669, మహేం ద్ర హైబ్రిడ్, గాయత్రి–12, తేజ–505 రకా ల బ్రాండ్లతో ఉన్న ప్యాకెట్లు, యూరియా బస్తాల్లో ఉన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. -
నకిలీ విత్తనాలతో కుళ్లిన వరి
ఐదున్నర ఎకరాల్లో పంట నష్టం హవేళిఘణాపూర్ (మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాజేందర్‌రెడ్డి, రాంరెడ్డి నకిలీ విత్తనాలతో మోసపోయారు. మెదక్ పట్టణంలోని రైతునేస్తం ఫర్టిలైజర్ దుకాణంలో ఆమోగ్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి వీరు తూకాలు పోశారు. గత నెల తూకాలను తీసి నాట్లు వేశారు. 17 రోజులు గడుస్తున్నా వరి పైరు పెరగకపోగా, పంటంతా కుళ్లి పోయింది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకులు మొత్తం ఎండిపోయాయి. ఐదున్నర ఎకరాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.80 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కళ్ల ముందే కుళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాగమాధురి పొలాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
భారీగా నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. హయత్ నగర్ పరిధిలోని మునుగానూరులో ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న పత్తి, కూరగాయల విత్తనాల గోదాంపై హయత్ నగర్ పోలీసుల వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గోదాంలో 850 బెండకాయ విత్తనాల ప్యాకెట్లు, 500 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15 బ్యాగుల మక్కా జొన్న విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కల్తీగాళ్లపై ఉక్కుపాదం మోపండి..
-
కల్తీగాళ్లపై ఉక్కుపాదం మోపండి..
పోలీసు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం కల్తీ ఆహార పదార్థాలు, విత్తనాలతో భారీ నష్టం.. ∙కల్తీకి పాల్పడే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి ∙పీడీ యాక్ట్ ప్రయోగించండి.. అవసరమైతే కొత్త చట్టం తీసుకొద్దాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని పోలీసులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆహార పదార్థాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, కల్తీ విత్తనాల వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఈ దుర్మార్గాన్ని తరిమికొట్టాలని, ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు, విత్తనాల నియంత్రణకు అవలంబించాల్సిన వ్యూహంపై ఆదివారం ప్రగతి భవన్లో పోలీసు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, హైదరాబాద్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీ ఐజీ ఎంకే సింగ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. నియంత్రణ ఉండాలి.. గుడుంబా, పేకాట వల్ల అనర్థాలు కలుగుతున్నాయని భావించి వాటిని రాష్ట్రంలో అనుమతించవద్దని గట్టిగా నిర్ణయించుకున్నామని సీఎం పేర్కొన్నారు. పోలీసు అధికారుల కృషితో గుడుంబా, పేకాట నియంత్రించగలిగామని, అలాగే ఇప్పుడు కల్తీలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. కల్తీ నియంత్రణను పోలీసు శాఖ ఒక సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు త్రికరణ శుద్ధితో కల్తీపై యుద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టి వ్యవసాయ, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. దాడులు జరిపి, దోషులను గుర్తించాలని, ఈ విషయంలో అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కల్తీలను గుర్తించడానికి అధిక సంఖ్య లో డీఎన్ఏ కిట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆహార పదార్థాలు, ఎరువులు, విత్తనాలను ఈ కిట్ల ద్వారా ఎక్కడికక్కడ పరీక్షించవచ్చని, క్షేత్రస్థాయిలో ఇవి అందుబాటులో ఉండటం వల్ల కల్తీని గుర్తించడం, నియంత్రించడం తేలికవుతుందని అభిప్రాయపడ్డారు. కల్తీలకు పాల్పడే వారిపై చీటింగ్, కాపీ రైటింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలని, పీడీ యాక్టు కూడా పెట్టే వెసులుబాటు కల్పించామని తెలిపారు. కల్తీలకు పాల్పడే వ్యక్తులను పట్టుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. అలాంటి వారికి ఇన్సెంటివ్‌లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి సూచించారు. వంద శాతం కల్తీని అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఒకటీ రెండు రోజుల్లో పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ సేవలు భేష్ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారని సీఎం కితాబిచ్చారు. షీ టీమ్స్‌కు ఎంతో పేరొచ్చిందని, తాము భద్రంగా, సురక్షితంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని, సమైక్య పాలనలో పోలీసు శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా గాలికొదిలేశారని, పోలీసు కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోలేదన్నారు. కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వం శాంతిభద్రతల పర్యవేక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. పోలీసులు హరితహారం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయయంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. పోలీసులు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. పోలీసు ఉన్నతాధికారుల దగ్గర కూడా అత్యవసర పనుల కోసం ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఏడేండ్లకు ప్రణాళిక రూపొందించండి పోలీసు వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకోవాలని, ఏడేండ్ల కోసం కార్యాచరణ రూపొందించాలని డీజీపీని ఆదేశించారు. వివిధ జోన్లు, రేంజ్‌లలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏడేళ్ల తర్వాత ఎలా ఉండాలి, అనే విషయాల్లో స్పష్టత రావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, అత్యాచారం వంటి కేసుల్లోనూ బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాల్సి ఉందని, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని సూచించారు. పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే కలెక్టర్లు డబ్బులు వెంటనే విడుదల చేసి బాధితులకు తక్షణం సాయం అందడం వల్ల కొంత ఉపశమనం పొందుతారని సూచించారు. -
నకిలీ విత్తనాలపై పోలీసు నజర్
♦ రాష్ట్రవ్యాప్తంగా 1,500 దుకాణాల్లో సోదాలు ♦ 75కు పైగా కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలు రైతన్న నడివిరుస్తు న్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిపోయి న కంపెనీలు మార్కెట్లోకి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నాయి. ప్రచా రంతో రైతులను మాయచేసి నకిలీ విత్తనాలు అంటగడుతున్న కంపెనీ లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, విత్తన సంస్థలు, విత్తన కేంద్రాలపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ వారం రోజులుగా విత్తన విక్రయ దుకాణాలపై దాడులు జరుపుతోంది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్లే.. నకిలీ, కల్తీ, కాలం చెల్లిన విత్తనాలను విక్రయిస్తున్న విత్తన దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరుపుతున్నా రు. గత శనివారం నుంచి ఇప్పటివరకు వరంగల్, హైదరాబాద్ జోన్లలో 1,500కు పైగా దుకణాలపై దాడులు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. 2014, 2015లోపు విక్రయించాల్సిన విత్తనాలను రైతులకు అంటగడుతున్నా రని తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాపారులకు కలిసివస్తోందని, సీజన్ ప్రారంభానికి ముందే విత్తన దుకాణాలు, విక్రయ కేం ద్రాల్లో తనిఖీ చేయకపోవడం, మా మూళ్ల మత్తులో ఉండటంవల్లే వ్యాపా రుల దందా వర్ధిల్లుతోందని చెబుతు న్నారు. కాలం చెల్లిన ప్యాకెట్లపై తాజా తేదీ స్టిక్కర్లు వేయడం, పాత విత్తనాల ప్యాకెట్ల రూపంలో కాకుండా విడిగా విక్రయించడం, కల్తీ, అసలు విత్తనాలు కలిపి కొత్త రకం బస్తాల్లో పెట్టి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. క్రిమినల్, సీడ్స్ యాక్ట్ కింద కేసులు.. ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన పోలీస్, వ్యవసాయ శాఖలు విత్తన దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాయి. నాసి రకం విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న వారిపై ఐపీసీ సెక్షన్ 420 కింద క్రిమినల్ కేసు, సీడ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా మని డీజీపీ అనురాగ్‌శర్మ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తం గా 75 కేసులకుపైగా నమోదు చేశామన్నారు. వరంగల్ జోన్లో 704, హైదరాబాద్ జోన్లో 809 దుకాణాల్లో సోదాలు నిర్వహించామన్నారు. రామగుండం, కరీంనగర్, ఖమ్మం,ఆదిలాబాద్,నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, మహ బూబ్‌నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని దుకాణా లపై ఎక్కువగా కేసులు నమోదయినట్లు తెలిపారు. -
నకిలీ విత్తనాల కేసులో మరిన్ని చర్యలు
హైదరాబాద్: నకిలీ విత్తనాల తయారీ, విక్రయాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమాలకు ఊతమిచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నలుగురు అధికారుల సస్పెన్షన్, ఇద్దరికి ఛార్జ్ మెమోలు జారీ చేసింది. భూత్పూర్ ఎంఏవో అశ్విని పంకజ్, హయత్‌నగర్ ఎంఏవో రవీంద్రనాథ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ కవిత, దేవరకద్ర ఏడీఏ ఇందిరలను సస్పెండ్ చేసింది. దీంతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల డీఏవోలకు గురువారం ఛార్జిమెమోలు పంపింది. -
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ కేంద్రంగా నాసిరకం విత్తనాలు తయారు చేసి విక్రయిస్తూ రైతులు జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలివీ.. కాలం చెల్లిన విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలను తయారు చేసి విక్రయిస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు ప్రదేశాల్లో దాడులు చేపట్టి నలుగురు సభ్యుల ముఠా చిన్నం జానకి రాం, సంఘి మహేందర్ , శ్రీను, లక్ష్మీ అనే వారిని అరెస్ట్ చేశారు. సృష్టి, గోపీ కృష్ణ సీడ్స్ పేరుతో వీరు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో రైతులను మోసం చేశారు. తొర్రూర్‌లోని సృష్టి సీడ్స్ కంపెనీ నుంచి 1651 నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను హయత్ నగర్ పొలీసులు సీజ్ చేశారు. అలాగే, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్‌లోని గోపీ కృష్ణ సీడ్స్ కంపెనీపై దాడి చేసి 2045 కేజీల పత్తి విత్తనాలను, నకిలీ కందులు 1050 కేజీలను సీజ్ చేశారు. వీటి విలువ 46 లక్షలుంటుంది. ఈ మేరకు నిందితులపై సీడ్ కంట్రోల్ యాక్ట్ కింద సెక్షన్ 420 , ఐపీసీ 13 (1), 18(1) కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన భూత్పూర్ ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేశారు. -
ఆదోనిలో ఎరువులు, విత్తనాలు సీజ్
ఆదోని అగ్రికల్చర్: నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ఎరువులు, విత్తనాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనరేట్ అడిషనల్ డైరెక్టర్ మద్దిలేటి హెచ్చరించారు. బుధవారం ఆదోనిలోని ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ధరల పట్టిక లేకపోవడం, విక్రయించిన బిల్లు బుక్కులో రైతుల సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేయకపోవడంతో.. సోమిశెట్టి సుబ్బారావు ఎరువుల దుకాణం యజమానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా, డీఏపీకి లింకు పెట్టి ఇతర మందులు అంటగట్టరాదని సూచించారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను ఆయన ఆరాతీశారు. కంపెనీ అనుమతి పత్రం లేకపోవడంతో నిర్మాణ్ ఫర్టిలైజర్ కంపెనీకి చెందిన 126 ఎరువుల బస్తాలను సీజ్ చేశారు. భువనేశ్వరి విత్తన దుకాణంలో రికార్డులు సరిగా లేకపోవడంతో మైక్రో కంపెనీకి చెందిన 252 విత్తన ప్యాకెట్లకు సీజ్ చేశారు. సీజ్ అయిన ఎరువులు, విత్తనాల విలువ రూ.2,73,500 ఉంటుందని ఏడీ తెలిపారు. అనంతరం ఎస్వీఎఫ్ దుకాణాన్ని పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఒకే చోట విక్రయిస్తుండడంతో మండిపడ్డారు. వేర్వేరుగా విక్రయించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడీఏ చంగల్రాయుడు, ఏఓ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దుకాణాదారులకు ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరిక నంద్యాలరూరల్: రైతులకు ఎవరైనా కలీ్తవిత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణాదారులకు ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరించారు.నంద్యాలలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. సంతోష్‌రెడ్డి ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా రూ.7.28లక్షలు విలువ గల ఎరువులను విక్రయించకుండా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు చెప్పారు. అలాగే రైతులుకు బిల్లులు వేయకుండా వంద ప్యాకెట్లను వెలుగోడు మండలం గుంతకందాలకు పంపినందుకు గణేష్ సీడ్స్ యాజమాన్యంపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో నంద్యాల ఏఓ అయూబ్‌బాషా, కర్నూలు జేడీఏ ఆఫీసు ఏఓ విశ్వనాథం, నంద్యాల రైతు శిక్షణా కేంద్రం ఏఓలు నిరంజన్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కొట్టుకుంటూ తీసుకెళ్లాలి
వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయించే వారి చేతులకు బేడీలు వేసి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ రూ. 6.19 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న విత్తన నాణ్యత పరీక్ష ప్రయోగశాల భవనానికి మంగళవారం మండలి చైర్మన్ స్వామి గౌడ్‌తో కలిసి ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. విత్తనాలలో కల్తీని నిరోధించేందుకు త్వరలోనే సమగ్రమైన విత్తన చట్టం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణ విత్తనాలు అంటే కళ్లు మూసుకుని కొనేలా విత్తన నాణ్యత ఉండాలని సూచించారు. ఈ ప్రయోగశాల వల్ల తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం అయ్యేలా కృషి చేయాలని పోచారం కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఎం.జగన్మోహన్, డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్‌లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ. కోటి తొమ్మిది లక్షల విలువజేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రవికుమార్, శ్రీనివాస్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో పది మంది నిర్వాహకులు పరారయ్యారని, రెండు కార్లు, ఒక డీసీఎం స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ పద్మజా తెలిపారు. -
రైతు మెడపై నకిలీ కత్తి
► గతేడాది జిల్లాలో నకిలీ విత్తనాల జోరు ► మిరప సాగు చేసి నిండా మునిగిన అన్నదాతలు ► జిల్లాలో 12 మంది మిర్చి రైతుల ఆత్మహత్యలు ► అక్రమార్కులకు ప్రభుత్వం అండదండలు ► ఈ ఏడాదైనా నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో నకిలీ విత్తనాల జోరు పెరిగింది. అప్పనంగా ఆర్జించేందుకు వ్యాపారులు నకిలీ విత్తనాలు తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు వేసి పంట దిగుబడులు రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కోలుకోలేని పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో మిర్చి పంట దెబ్బతినటంతో ఇప్పటి వరకు 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారుల కొమ్ముకాస్తోంది. వారిపై ఎటువంటి చర్యలు లేవు. జిల్లావ్యాప్తంగా అద్దంకి, దర్శి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో రైతులు మిరప సాగు చేస్తారు. గతేడాది 58 వేల హెక్టార్లలో మిరపను సాగు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాల్లో విత్తనాలు తెచ్చి నర్సరీల్లో నారు పెంచి వ్యాపారులు రైతులకు అమ్మారు. కొందరు రైతులు స్వయంగా విత్తనాలను కొని తెచ్చుకొని నర్సరీల్లో నార్లు పోయించుకున్నారు. గతేడాది మిరపకు అధికంగా ధరలు ఉండటంతో ఈ ఏడాది ఆశతో రైతులు అధికంగా మిరప సాగు వైపు మొగ్గు చూపారు. ముందస్తుగా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో రైతులు మిరప సాగు చేశారు. ఆది నుండే మిరపకు తెగుళ్లు సోకాయి. జెమిని వైరస్‌తో పాటు పలు రకాల చీడపీడలు చుట్టుముట్టాయి. అధికంగా పెట్టుబడి పెట్టిన రైతులు పురుగుమందులను సైతం అంతేస్థాయిలో పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఎకరానికి రూ.50 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీల జోరు: తక్కువ ధరలకు గుంటూరు, విజయవాడ, నంద్యాల తదితర ప్రాంతాల్లో విత్తనాలు కొని అవే నాణ్యమైన విత్తనాలు అంటూ జిల్లాలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అత్యధిక ధరలకు విత్తనాలు కొని వేసినా మొలక సక్రమంగా రావడం లేదు. ఒక వేళ మొలక వచ్చినా పూత దశ నాటికే పనికి రాకుండాపోతున్నాయి. కాపు కాసే పరిస్థితి లేదు. ఇక నర్సరీల్లో ఉత్పత్తి చేసిన మిరప నారు కొని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో విత్తన వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. నర్సరీలు సైతం వేలాదిగా వెలిశాయి. నిబంధనల మేరకు నర్సరీలు కొనే విత్తనాలు లాట్ నంబర్లతో సహా నమోదు చేయాలి. రైతులకు నారు ఇచ్చే సమయంలో ఏ విత్తనాలకు సంబంధించిన నారు ఏయే రైతుకు అమ్ముతున్నారన్న విషయాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. కానీ వారు ఎటువంటి రికార్డులు నిర్వహించడం లేదు. కొందరు నర్సరీ యజమానులు నాణ్యమైన విత్తనాలు కాకుండా తక్కువ ధరలకు నకిలీ విత్తనాలు తెచ్చి నార్లు పోసి మరీ రైతులకు అంటగడుతున్నారు. దీంతో దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, అద్దంకి, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 వేల ఎకరాలకుపైగా పంట పనికి రాకుండాపోయింది. అయినా ప్రభుత్వం విత్తన వ్యాపారులపై మొక్కుబడిగా మాత్రమే చర్యలు తీసుకొని వదిలేసింది. యర్రగొండపాలెం ప్రాంతంలో ఒకరిద్దరు వ్యాపారులపై నామమాత్రంగానే కేసులు నమోదు చేశారు తప్ప... కఠిన చర్యల్లేవు... రైతులు తీవ్రంగా నష్టపోయినా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాదైనా ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌కు నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కారుమంచిలో నకిలీ విత్తనాలు పట్టివేత
తంగరడోణలో 7లక్షలు విలువ చేసే కంది, పత్తి విత్తనాలు సీజ్ ఆస్పరి: మండలంలోని కారుమంచి, తంగరడోణ గ్రామాల్లో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. నకిలీ, అనుమతి లేకుండా విక్రయిస్తున్న పత్తి, కంది విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. మండలంలోని కారుమంచిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఏఓ పవన్ కుమార్, ఏఈఓలు నాగరాజు, జయరాం, సిబ్బందితో కలిసి కృష్ణ అనే వ్యక్తి ఇంటికెళ్లి తనిఖీలు చేశారు. 14 కేజీల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి, 1950 పీడీ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే తంగరడోణలో పరమేశ్వర్, సీతారామిరెడ్డి ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించి రూ.7లక్షలు విలువ చేసే పత్తి, కంది విత్తనాలను సీజ్ చేసి 1966 సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన విత్తనాలను ఆలూరు ఏడీఏ రాజశేఖర్‌కు అప్పగించినట్లు ఏఓ చెప్పారు. ఎవరైనా గ్రామాల్లో, దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మినా, ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తప్పవని ఏఓ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని మండల ప్రజలను కోరారు. -
నకిలీ విత్తనాలపై నిఘా
► సమాచారం ఇవ్వండి ► వాట్సప్ నంబరు 8333986898 ► ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఆదిలబాద్: జిల్లాలో రైతులకు విక్రయించే నకిలీ విత్తనాలపై నిఘా ఉంచామని, ఎవరైనా విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం పోలీసు కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అన్ని మండలాలు, పట్టణాల్లో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు దాడులు నిర్వహించాలని సూచించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు. రైతులకు అండగా పోలీసులు ఉన్నారని, ఎటువంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా, 8333986898కు సమాచారం అందించాలని, లేనిపక్షంలో నేరుగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అమాయక రైతులను మోసం చేయడానికి ఎవరు ప్రయత్నించినా, తక్కువ ధర ఉందని ప్రలోభ పెట్టిన, విక్రయించిన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు, గోదాముల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులు విత్తనాలు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం దుకాణదారుని పేరు మీద ఉన్న ఒరిజనల్ రసీదు తీసుకోవాలని, రసీదుపై కొనుగోలు చేసిన విత్తనాల పేర్లు లిఖించి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు బి. ప్రవీణ్, అన్వర్ ఉల్‌హఖ్, జి.రామన్న, సంజీవ్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై తనిఖీలు ముమ్మరం
కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసేందుకు ఒక వైపు విజిలెన్స్ అధికారులు, మరోవైపు వ్యవసాయాధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తెల్లబంగారం... విత్తు కలవరం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపధ్యంలో అధికారులు స్పందించారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు.. కర్నూలు నగరంలోని నవత, ఎస్ఆర్ఎంటీ తదితర ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించారు. కోడుమూరు తదితర ప్రాంతల్లోనూ తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా చేసిన రూ.5లక్షల విలువ చేసే నాలుగు క్వింటాళ్ల నకిలీ బీటీ విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి స్వాధీనం చేసుకున్నారు. మే నెల 26న కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని పోలీసు కాలనీ నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. నంద్యాలలో రూ.34 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడటం సంచలనం రేపింది. పత్తిలో 95 శాతం బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నకిలీ విత్తనాలు ఇప్పటికే తరలివెల్లినట్లు సమాచారం. నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్ నంద్యాలఅర్బన్: స్థానిక విజయ డెయిరీ సమీపంలోని వెంకటేశ్వర సీడ్స్ విత్తన కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ బీటీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. జిల్లా విజిలెన్స్ అధికారి బాబురావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ జగన్మోహన్రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. సీడ్ ప్రాసెసింగ్‌కు అనుమతులు లేకుండా సీడ్ కంట్రోల్ నిబంధనలు అతిక్రమించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.11.76లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. అయితే బండిఆత్మకూరుకు చెందిన రైతు కావేరి బీటీ పత్తి విత్తనాలను సీడ్ విత్తనాల ప్రాసెసింగ్‌కు ఇక్కడ నిల్వ ఉంచినట్లు వెంకటేశ్వర సీడ్స్ యజమాని విజిలెన్స్ అధికారులకు వివరించారు. రైతుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో సంచుల్లో ఉంచిన సీడ్ మొత్తాన్ని సీజ్ చేసి టెక్కె మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలించారు. సీడ్ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీరి వెంట ఏఓ అయూబ్‌బాషా, విజిలెన్స్ సిబ్బంది మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యత కొరవడితే క్రిమినల్ చర్యలు
► విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను హెచ్చరించిన జేడీఏ ► అన్ని వివరాలతో బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచన అనంతపురం అగ్రికల్చర్ : విత్తన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో పెట్టాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు విత్తన పంపిణీ డీలర్లు, దుకాణదారులను ఆదేశించారు. నాసిరకం, కల్తీలు అంటగట్టినట్లు రైతుల నుంచి ఫిర్యాదుల వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్ సమీపిస్తుండటంతో విత్తన డీలర్లు, దుకాణాదారులతో బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జేడీఏ, డీడీఏలు మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన బీటీ పత్తి, నాన్ బీటీ పత్తి, ఆముదం, కందులు, పెసలు, పొద్దుతిరుగుడు, అలసంద, కొర్ర, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర వ్యవసాయ పంటల విత్తనాలతోపాటు కర్భూజ, కళింగర, దోస, వివిధ రకాల కూరగాయల విత్తనాలు ధృవీకరణ కలిగిన కంపెనీలవే అమ్మాలన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలకు విరుద్ధంగా పేరూ ఊరు లేని కంపెనీల విత్తనాలను రైతులకు ఇస్తే చర్యలు తప్పవన్నారు. విత్తన చట్టం కింద జరిమానాతోపాటు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి కంపెనీ, లాట్, బ్యాచ్‌నెంబర్, గడువు తేదీ, చెల్లించిన డబ్బులకు సంబంధించి అన్ని వివరాలతో బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. దీంతోపాటు ఆ విత్తనాలను ఎలా సాగు చేయాలో వివరిస్తూ తెలుగులో ముద్రించిన కరపత్రం కూడా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు కూడా అన్ని వివరాలతో బిల్లులు తీసుకుంటే భవిష్యత్తులో సమస్య వస్తే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతోపాటు శాస్త్రవేత్తల ద్వారా పరిశీలించి నివేదిక తయారు చేయడం ద్వారా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందే వీలుంటుందన్నారు. సమావేశంలో ఏడీఏ(పీపీ) విద్యావతి, సీడ్సెల్ ఏవో వెంకటేశ్వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఫల్గుణ పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
హైదరాబాద్: నకిలీ మిర్చీ విత్తనాల బారిన పడిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అలంపూర్ నియోజకవర్గ మిరప రైతులు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు న్యాయం చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారి నిరసనకు ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంఘీభావం తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. -
మిర్చి రైతుల పడిగాపులు
⇒ బస్తాలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్న సిబ్బంది ⇒ 15 వేల బస్తాలకు 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు ⇒ ఏప్రిల్ 2 వరకు మార్కెట్ బంద్ సాక్షి, మహబూబాబాద్: మిర్చి పంట ఈ సారి రైతాంగాన్ని చిన్నబుచ్చింది. గతేడాది మంచి ధర పలికిందని ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు మార్కెట్ అధికారుల తీరు వారిని మరింత కుంగదీస్తోంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో వారంలో మూడు రోజులు(సోమ, మంగళ, బుధ) మాత్రమే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆదివారమే భారీగా మిర్చితో మార్కెట్‌కు చేరుకుంటుండడంతో యార్డ్ అంతా మిర్చి బస్తాలతో నిండి పోతోంది. రోజూ వందలకొద్దీ బస్తాలు మార్కెట్‌కు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ అధికారులు పేర్కొంటుండగా రైతులు మాత్రం సరుకు అమ్ముడుపోక రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందంటున్నారు. వాహనాలను అడ్డుకుంటున్న సిబ్బంది రైతులు మార్కెట్‌కు మిర్చిని తీసుకొస్తే మార్కెట్ సిబ్బంది మూడు రోజులుగా అడ్డుకుంటున్నారు. గేట్‌కు తాళం వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వస్తున్న రైతులను లోపలికి రానివ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం నుంచి బుధవారం వరకు 15 వేల బస్తాలు మార్కెట్‌కు చేరుకోగా కేవలం 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు. గిట్టుబాటూ దక్కడం లేదు.. నకిలీ విత్తనాలకు సరిగా దిగుబడిరాక ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతులను గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాకు గరిష్ట ధర రూ.7,400 నుంచి కనిష్ట ధర రూ.5,575 వరకు పలుకుతోంది. ఏప్రిల్ 2 వరకు కొనుగోళ్లు బంద్ సోమవారం ప్రారంభమైన కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. వాస్తవానికి బుధవారంతోనే కొనుగోళ్లు ఆపాల్సి ఉన్నప్పటికీ మరో రెండు రోజులు మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని మార్కెట్ సిబ్బంది పేర్కొన్నారు. అందుకే కొత్తగా బస్తాలు తీసుకురావొద్దంటూ గేట్ వద్ద నుంచే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. వచ్చే శని, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉండడం వల్ల సోమవారం కూడా కొనుగోళ్లు చేయబోమని, మంగళ బుధవారాలు మార్కెట్‌కు ఉగాది సెలవు ప్రకటించినట్లు సిబ్బంది వెల్లడించారు. అందుకే ఏప్రిల్ 2 వరకు మిర్చిని కొత్తగా మార్కెట్‌కు తీసుకురావొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు.