సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ సీజన్‌కి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో కల్తీ విత్తనాల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో కల్తీ విత్త నాలు లేకుండా చేసేందుకు అధికా రు లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, విత్తన ధ్రువీకరణ, విత్తనాభివృద్ధి సంస్థ ల డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment