సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు.
పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ
వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment