calendar
-
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పేపర్ లీక్ కారణంగా రెండుసార్లు గ్రూప్-1 రద్దయ్యిందని భట్టి విక్రమార్క అన్నారు.ఉద్యోగుల భర్తీ అంశంలో అధికారులతో రెండు కమిటీలు వేశారని.. ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 13వేల ఖాళీలను గుర్తించామని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పోటీ పరీక్షలను వాయిదా వేశామని.. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఇలా..గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు జరపనున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మేలో పరీక్షలు జరపనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు జరపనున్నారు.వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు జరపనున్నారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు జరపనున్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. -
జాబ్ క్యాలెండర్ బోగస్.. బీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నిరుద్యోగులను మభ్యపెట్టలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ బోగస్.. ఉద్యోగాలు లేవు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందంటూ కేటీఆర్ ధ్వజమ్తెతారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేసినా కానీ కనీసం రెండు నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న కేటీఆర్. రాహుల్‌గాంధీ, రేవంత్ అశోక్‌నగర్‌కు వస్తే యువత తరిమేస్తుందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఈ ఏడాది 1996 క్యాలెండర్స్ వాడుకోండి..! ఎందుకంటే?
2023 ముగిసింది 2024 కూడా వచ్చేసింది. అయితే ఈ ఏడాది చాలా మంది 1996 క్యాలెండర్ తీసి మళ్ళీ గోడకు తగిలిస్తున్నారు. ఇంతకీ 2024లో సుమారు మూడు దశాబ్దాల నాటి క్యాలెండర్ ఎందుకు తగిలిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి 2024లో వచ్చిన క్యాలెండర్ మొత్తం 1996 నాటి క్యాలెండర్ మాదిరిగానే ఉంది. అంటే 2024 జనవరి 1.. సోమవారంతో మొదలైంది. 1996 జనవరి 1 కూడా సోమవారమే మొదలైంది. రెండూ కూడా లీప్ సంవత్సరాలే. దీన్ని బట్టి చూస్తే క్యాలెండర్ చక్రం మళ్ళీ మొదలైందా అన్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 1996 ఈజ్ బ్యాక్ అంటూ కొందరు, 1996 - 2024 సేమ్ టు సేమ్ అంటూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాలెండర్ ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన కొన్ని ఈ కామర్స్ సంస్థలు 1996 క్యాలెండర్ మాదిరిగానే దాని మీద వివిధ కవర్ ఫొటోలతో అమ్మకానికి పెడుతూ డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఇదీ చదవండి: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్! ఆన్లైన్లో అమ్మకానికి ఉన్న ఈ క్యాలెండర్ల ధరలు 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం వీటి ధర రూ. 4000 నుంచి రూ. 16000 వరకు ఉందన్నమాట. ఇందులో కూడా 1996లో చైల్డ్ స్టార్‌గా ఫేమస్ అయిన 'జొనాథన్ టేలర్ థామస్' ఫోటో ఉన్న క్యాలెండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 1996 క్యాలెండర్లో ఉన్న డేట్స్ మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఒలంపిక్ గేమ్స్ వంటివి కూడా దాదాపు ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఒలంపిక్ గేమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024లో కూడా అమెరికా ఎలక్షన్స్.. ఒలంపిక్ గేమ్స్ కూడా జరగనున్నాయి. https://t.co/khl7lItR3j 1996 calendar is the same as 2024. Use the old one pic.twitter.com/Awa1nrkrYP — giveawayhub (@ritly_) January 2, 2024 -
2024 ఆటలు...ఆశలు...
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్‌లో ఈ సారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్ టైటిల్‌తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్–19 స్థాయిలో ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్ 23 రేస్‌లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్‌బాల్‌లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే. టెన్నిస్‌లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్‌లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్ మీ కోసం... భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ జనవరి 11–17: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్‌లు జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్‌తో స్వదేశంలో 5 టెస్టులు ఐపీఎల్: మార్చి 22 నుంచి మే 26 వరకు జూలై: శ్రీలంకలో భారత్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ (2 టెస్టులు, 3 టి20లు) అక్టోబర్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ (3 టెస్టులు) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (5 టెస్టులు) పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వేదిక: వెస్టిండీస్, అమెరికా ఫుట్‌బాల్ ఆసియా కప్ (ఖతర్) జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు యూరో–2024 (జర్మనీ) జూన్ 14 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా టోర్నీ (అమెరికా) జూన్ 20 నుంచి జూలై 14 వరకు బ్యాడ్మింటన్ జనవరి 9–14: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 16–21: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 5–10: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) మార్చి 12–17: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్–1000 టోర్నీ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 28–మే 5: థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ (చెంగ్డూ, చైనా) మే 28–జూన్ 2: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ జూన్ 4–9: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) ఆగస్టు 20–25: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) సెప్టెంబర్17–22: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) నవంబర్ 19–24: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) నవంబర్ 26–డిసెంబర్ 1: సయ్యద్ మోడి ఓపెన్–300 టోర్నీ (లక్నో) డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా) టెన్నిస్ జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్) నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (టురిన్, ఇటలీ) ఫార్ములావన్ మార్చి 2: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 21: చైనా గ్రాండ్‌ప్రి మే 5: మయామి గ్రాండ్‌ప్రి మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి జూన్ 9: కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 23: స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 7: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి జూలై 21: హంగేరి గ్రాండ్‌ప్రి జూలై 28: బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 25: డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1: ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్15: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 20: యూఎస్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబర్ 3: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నవంబర్ 23: లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1: ఖతర్ గ్రాండ్‌ప్రి హాకీ జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–19: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (రాంచీ, భారత్) జనవరి 15–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్) షూటింగ్ జనవరి 5–18: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జకార్తా) జనవరి 12–22: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (కువైట్ సిటీ) జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (కైరో, ఈజిప్ట్) ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (రబాట్, మొరాకో) ఏప్రిల్ 11–19: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) ఏప్రిల్ 22–30: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (దోహా, ఖతర్) మే 1–12: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బకూ, అజర్బైజాన్) మే 31–జూన్ 7: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) జూన్ 10–19: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (లొనాటో, ఇటలీ) అండర్–19 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ సెప్టెంబర్–అక్టోబర్ వేదిక: బంగ్లాదేశ్ పారిస్ ఒలింపిక్స్ – 26 జూలై – 11 ఆగస్టు అథ్లెటిక్స్ జనవరి 21: ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ (హాంకాంగ్) ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (టెహ్రాన్) మార్చి 1–3: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (స్కాట్లాండ్) ఆగస్టు 26–31: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (పెరూ) చెస్ ఏప్రిల్ 3–25: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (టొరంటో, కెనడా) జూన్ 1–14: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ, భారత్) సెప్టెంబర్10–23: చెస్ ఒలింపియాడ్ (బుడాపెస్ట్, హంగేరి) అక్టోబర్ 22–నవంబర్ 2: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (బ్రెజిల్) రెజ్లింగ్ ఏప్రిల్ 11–16: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) ఏప్రిల్ 19–21: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) మే 9–12: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) బాక్సింగ్ ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇటలీ) ఏప్రిల్: ఆసియా చాంపియన్‌షిప్ మే 23–జూన్ 3: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్‌లాండ్) అక్టోబర్ 20–నవంబర్ 6: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (క్రొయేషియా) టేబుల్ టెన్నిస్ ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (బుసాన్, కొరియా) డిసెంబర్ 1–8: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (స్వీడన్) ఆర్చరీ ఏప్రిల్ 23–28: ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ (షాంఘై, చైనా) మే 21–26: ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ (యెచోన్, కొరియా) జూన్ 18–23: ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) -
భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు.. ఏడాది పొడవునా సంబరాలే!
సర్వమత సమానత్వ భావన భారతదేశంలో మినహా మరెక్కడా కనిపించదు. ఈ లక్షణమే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి భారత్‌ను వేరు చేసి, ప్రత్యేకతను అందిస్తుంది. ఇక్కడ అన్ని మతాల ప్రజలు సమైక్యంగా నివసిస్తున్నారు. దీంతో అన్ని మతాలవారి పండుగలు మన దేశంలో వైభవంగా జరగుతుంటాయి. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జనవరి ఒకటిన నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజన ప్రజలంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కానుకలు, స్వీట్లు మొదలైనవి పంచుకుంటారు. అయితే మన దేశంలో జనవరి ఒకటి అసలైన కొత్త సంవత్సరం కాదనే వాదన వినిపిస్తుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మే మన దేశంలోని ప్రజలు ఏడాదికి ఐదుసార్లు కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరాలను వివిధ మత విశ్వాసాల ప్రకారం చేసుకుంటారు. హిందువులు హిందువుల నూతన సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నిర్ణీత తేదీన వస్తుంది. బ్రహ్మ దేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజున నూతన సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రైస్తవులు రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా ప్రకటించిన మొదటి వ్యక్తి అని చెబుతారు. అయితే ఆ తరువాత పోప్ గ్రెగొరీ ఇందులో కొన్ని సవరణలు చేసి, తన మత గురువును సంప్రదించి, లీప్ ఇయర్‌ని దానికి జోడించి, కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. దీని ప్రకారం కూడా జనవరి ఒకటినే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నాటి నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. పార్సీయులు పార్సీయులు ఆగస్టు 19న నూతన సంవత్సరాన్ని నవరోజ్ పేరుతో జరుపుకుంటారు. మూడు వేల సంవత్సరాల క్రితం షా జంషెడ్జీ దీనిని మొదటిసారిగా జరుపుకున్నారని పార్సీయులు నమ్ముతారు. పంజాబీయులు సిక్కు నానాక్షహి క్యాలెండర్ ప్రకారం సిక్కు మతానికి చెందినవారు వైశాఖ మాసం తొలి రోజున తమ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. జైనమతస్తులు జైన సమాజానికి చెందినవారు దీపావళి మరుసటి రోజును నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. దీనిని వీర్ నిర్వాణ సంవత్ అని అంటారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
శుభకార్యాలకు వేళాయే.. నేటి నుంచే శ్రావణమాసం
నిజశ్రావణం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో పాటే శుభముహూర్తాలు మొదలుకానున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో అధిక మాసంగా శ్రావణం వచ్చింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈ నెల 17వ తేదీ గురువారం నుంచి మొదలయ్యే నిజ శ్రావణ మాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. శుభకార్యాలకు వేళాయె.. శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ముహూర్తాలు ఉండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. దీంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాల కాలం నిజ శ్రావణ మాసం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. భాద్రపదం, పుష్యమాసాల్లో మినహా మిగిలిన మాసాల్లో శుభ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఇప్పటికే చాలామంది ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. -
45 నెలల్లో పేదలకు రూ.2,96,148.09 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 45 నెలల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ) రూ.2,96,148.09 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనం చేకూర్చనుందో వెల్లడిస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి మరీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం. జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023 – 24ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచారశాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. 2023–24 ఏ నెలలో ఏ పథకం? ఏప్రిల్ 2023: జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మే 2023 : వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా జూన్ 2023: జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జూలై 2023: జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ఆగస్టు 2023: జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర సెప్టెంబర్ 2023: వైఎస్సార్ చేయూత అక్టోబర్ 2023: వైఎస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) నవంబర్ 2023: వైఎస్సార్ సున్నావడ్డీ– పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీతోఫా (మూడో త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత) డిసెంబర్ 2023: జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండో విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జనవరి 2024: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ (మూడో విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండో విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండో విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ.3,000) ఫిబ్రవరి 2024: జగనన్న విద్యా దీవెన (నాలుగో విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు – షాదీ తోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం మార్చి 2024: జగనన్న వసతి దీవెన (రెండో విడత), ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు -
2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరాతి: ‘2023-24 జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా సీఎం ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగా లబ్ధిని ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు. నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే... ►ఏప్రిల్ 2023- జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మే 2023- వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా ►జూన్ 2023-జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జులై 2023-జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ►ఆగష్టు 2023-జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర ►సెప్టెంబర్ 2023-వైఎస్సార్ చేయూత ►అక్టోబర్ 2023-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) ►నవంబర్ 2023-వైఎస్సార్ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత) ►డిసెంబర్ 2023-జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జనవరి 2024-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (మూడవ విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000) ►ఫిబ్రవరి 2024-జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మార్చి 2024-జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు.. మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం, మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు సీఎంవో నిర్ణయం తీసుకుంది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారైంది. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం.. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమాల షెడ్యూల్: ♦మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన, వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ♦మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం ♦మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా... ఏప్రిల్ 5 వరకూ కార్యక్రమం కొనసాగనుంది. ♦మార్చి 31న జగనన్న వసతి దీవెన ♦ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు ♦ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం ♦ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
మిల్లెట్స్ వాల్ క్యాలెండర్
2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్‌పై ఓ వాల్ క్యాలెండర్‌ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్‌వర్క్‌తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్‌ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది. ఈ క్యాలెండర్లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు. -
ముఠాను అడ్డుకుని ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచారు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న ముఠాల ఆగడాలను ఎక్కడికక్కడ శాఖ సిబ్బంది అడ్డుకుని ఆదాయాన్ని పెంచారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కేలండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆయుధాలు లేకుండా ధైర్య సాహసాలతో ఒడిశాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న మాఫియా ముఠాను అధికారులు పట్టుకున్నారని తెలిపారు. గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా నిలపడానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సమర్థవంతంగా కృషి చేశారని శ్రీనివాస్‌గౌడ్ ప్రశంసించారు. అధికారులపై ఒత్తిడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే త్వరలో అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించి హెడ్ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరిస్తామని, పదోన్నతులు, ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ ( గచ్చిబౌలి) మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కేలండర్‌ను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. -
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రజాబలం తెలుగు దినపత్రిక 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది ఈ సభకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, యాదగిరిగుట్ట అష్టలక్ష్మి టెంపుల్ అధ్యక్షులు అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ, మైనంపల్లి హనుమంతరావు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రెడ్డి, తెలంగాణ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కేసరి వెంకటేశ్వర్లు, ఉర్దూ పేపర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సేవలకే మొదటి ప్రాధాన్యం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
వివాహం, గృహప్రవేశం.. ఇంకా ఈ ఏడాది ముహూర్తాలు ఇవే!
క్యాలెండర్- 2023: ముహూర్తాలు ఇవే మాఘమాసం 14.01.23 శనివారం.. సప్తమి, హస్త, మీనలగ్నం ఉ. 10.46 ని.లకు క్రయవిక్రయ, వ్యాపారాదుల, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, విద్యారంభం. 26.01.23 గురువారం.. పంచమి, ఉత్తరాభాద్ర, మీనలగ్నం ఉ. 9.32 ని.లకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారం, క్రయవిక్రయాలు, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం. మిథునలగ్నం సా. 4.18 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు. 28.01.23 శనివారం.. సప్తమి, అశ్విని, మీనలగ్నం, ఉ. 5.16 ని.లకు ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శంఖుస్థాపన. 05.02.23 ఆదివారం.. పౌర్ణమి, పుష్యమి, మీనలగ్నం ఉ. 9.26 ని.లకు వ్యాపారాదులు, క్రయవిక్రయాదులు, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, మంత్రోపదేశం. ఫాల్గుణ మాసం 24.02.23 శుక్రవారం.. పంచమి, అశ్విని, మీనలగ్నం ఉ. 7.26 ని.కు వ్యాపారాదులు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. కన్యాలగ్నం రా. 8.32 ని.లకు గృహప్రవేశం, వివాహం, గర్భాదానం. ధనుర్లగ్నం తె. 3.22 ని.లకు వివాహం, గృహప్రవేశం. 11.03.23 శనివారం.. బ. పంచమి, స్వాతి, ధనుర్లగ్నం రా. 2.25 ని.లకు వివాహం, గృహప్రవేశం. మకరలగ్నం తె.3.23 ని.లకు గృహప్రవేశం, గృహారంభం, వివాహం. 18.03.23 శనివారం.. ఏకాదశి, శ్రవణం, మకర లగ్నం, తె.3.22 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్. చైత్ర మాసం 22.03.23 బుధవారం.. శు. పాడ్యమి, ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం 29.03.23 నుండి చైత్ర శుద్ధ అష్టమి నుండి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురుమౌఢ్యమి. 05.04.23 బుధవారం.. శు. చతుర్ధశి, ఉత్తరా, మేషలగ్నంష ఉ.7.39 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 07.04.23 శుక్రవారం.. బ. పాడ్యమి, చిత్తా, మేషలగ్నం, ఉ.7.31 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 08.04.23 శనివారం.. విదియ, స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 12.04.23 బుధవారం.. సప్తమి, మూలా, మేషలగ్నం ఉ.7.12 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 15.04.23 శనివారం.. దశమి, ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. వైశాఖ మాసం 23.04.23 ఆదివారం.. చవితి, రోహిణి, కర్కాటక లగ్నం, ఉ.11.45 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాసన, కేశఖండన, బారసాల. 25.04.23 గురుమోఢ్యమి త్యాగం 03.05.23 బుధవారం.. త్రయోదశి, హస్త, వృషభలగ్నం, ఉ.7.18 ని.లకు వివాహం, గృహారంభం, ఉపనయనం, శంఖుస్థాపన. 07.05.23 ఆదివారం.. బ. విదియ, అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు. 10.05.23 నుండి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంఖుస్థాపనలు, బోరింగ్లు ఉండవు. 11.05.23 గురువారం.. షష్ఠి, ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 ని.లకు అన్నప్రాసన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠ మాసం 25.05.23 గురువారం.. షష్ఠి, పుష్యమి, మిథున లగ్నం, ఉ.8.40 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. 31.05.23 బుధవారం.. ఏకాదశి, చిత్తా, మిథున లగ్నం, ఉ.8.16 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. 07.06.23 బుధవారం.. చవితి, ఉత్తరాషాఢ, మిథున లగ్నం ఉ.7.49 ని.లకు అన్నప్రాసన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 ని.లకు వివాహం, గర్భాదానం, ప్రయాణం. 09.06.23 శుక్రవారం.. సప్తమి, శతభిషం, మీనలగ్నం, రా.12.56 ని.లకు వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణ మాసం 23.07.23 ఆదివారం.. శు. షష్ఠి, ఉత్తరా, కన్యాలగ్నం ఉ.10.34 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 30.07.23 ఆదివారం.. శు. త్రయోదశి, మూలా, కన్యాలగ్నం ఉ.10.07 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు,బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 06.08.23 ఆదివారం.. బ. పంచమి, రేవతి, కన్యాలగ్నం, ఉ.9.35 ని.లకు నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. 08.08.23 మంగళవారం.. శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుండి శోభకృత్ నామ సం.ర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు 19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం 20.08.23 శుక్లపక్షము ఆదివారం.. చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 ని.లకు గృహారంభం, గృహప్రవేశం, వివాహం. 24.08.23 గురువారం.. నవమి, అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. మిథునలగ్నం, రా.12.40 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 30.08.23 బుధవారం.. పూర్ణిమ, శతభిషం, వృషభలగ్నం, రా.11.30 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 01.09.23 శుక్రవారం.. బ. విదియ, ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 ని.లకు వివాహం, గర్భాదానం, గృహప్రవేశం, ప్రయాణాలు. 06.09.23 బుధవారం.. బ. అష్టమి, రోహిణి, వృషభలగ్నం, రా.11.02 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాదానం, 10.09.23 ఆదివారం.. బ. ఏకాదశి, పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 ని.లకు శంఖుస్థాపన, క్రయవిక్రయాలు, భాద్రపద మాసం 17.09.23 ఆదివారం.. శు. తదియ, చిత్త, ధనుర్లగ్నం మ.1.53 ని.లకు డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. 24.09.23 ఆదివారం.. శు. దశమి పూర్వాషాఢ వృశ్చికలగ్నం, ఉ.10.30 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 25.09.23 సోమవారం.. శు. ఏకాదశి, శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 30.09.23 నుండి 14.10.23 వరకు మహాలయ పక్షములు పితృపక్షాలు ముహూర్తాలు ఉండవు. (14.10.23 మహాలయ అమావాస్య) ఆశ్వయుజ మాసం 15.10.23 ఆదివారం.. శు. పాడ్యమి, చిత్త, వృశ్చిక లగ్నం, ఉ.8.50 ని.లకు శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవి పూజలు. 19.10.23 గురువారం.. శు. పంచమి, జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 ని.లకు సరస్వతీ పూజ. 21.10.23 శనివారం.. శు. అష్టమి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 ని.లకు వివాహం, గృహప్రవేశం 24.10.23 మంగళవారం.. విజయదశమి, ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుండి 11.45 ని.ల లోపు విజయ ముహూర్త కాలము. 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 ని.లకు సమస్త శుభాలు 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, 01.11.23 బుధవారం.. బ. చవితి, మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. 09.11.23 గురువారం.. బ. ఏకాదశి, ఉత్తరా, వృశ్చికలగ్నం, ఉ.07.18 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, గర్భాదానం. కార్తీక మాసం 18.11.23 శనివారం.. శు. పంచమి, ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 ని.లకు వాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన 19.11.23 ఆదివారం.. శు. సప్తమి, శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 23.11.23 గురువారం.. శు. ఏకాదశి, ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, గర్భాదానం. 24.11.23 శుక్రవారం.. శు. త్రయోదశి, అశ్విని, మిథునలగ్నం, రా.8.41 ని.లకు వివాహం, గృహప్రవేశం. 29.11.23 బుధవారం.. బ. విదియ,మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 ని.లకు వివాహం, శంఖుస్థాపన. 01.12.23 శుక్రవారం.. బ. చవితి, పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 ని.లకు గృహారంభం. 02.12.23 శనివారం.. బ. పంచమి, పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు 03.12.23 ఆదివారం.. బ. సప్తమి, మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 ని.లకు గర్భాదానం, ప్రయాణం. 06.12.23 బుధవారం.. బ. నవమి, ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 ని.లకు వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. 07.12.23 గురువారం.. బ. దశమి, హస్త, మిథునలగ్నం, రా.7.45 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు 08.12.23 శుక్రవారం.. బ. ఏకాదశి, చిత్త, మిథునలగ్నం, రా.7.41 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. -సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023 -
ఒకే పేజీలో 75 ఏళ్ల క్యాలెండర్
కంచిలి(శ్రీకాకుళం జిల్లా): స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు 75 ఏళ్ల క్యాలెండర్ ఒకే పేజీలో తీర్చిదిద్దారు. గణిత అవధాని రూపకర్త డీఎస్ఎన్ శాస్త్రి పేరులో అక్షరాలను కోడ్‌గా తీసుకుని 2001 నుంచి 2075 వరకు క్యాలెండర్ తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా తిరుపతిరావును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. చదవండి: అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట! -
సీజనల్ వ్యాధులపై 24 గంటల ‘సెల్’
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులను నియంత్రిస్తూనే.. కరోనా వంటి వైరస్‌లను అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కేలెండర్ రూపొందించింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది... ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందులో వివరించింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు, నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో వడదెబ్బ, డయేరియా వంటివి ఇబ్బంది పెడతాయని వెల్లడించింది. ఈ మేరకు సవివర సీజనల్ కేలెండర్‌ను విడుదల చేసింది. కానీ కరోనా మాత్రం సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా కరోనా, డెంగీ వంటి వాటి లక్షణాలు సమీపంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలూ నడిచే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. -
ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, మెడికల్.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం–గ్రూప్–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్ తర్వాత ఎంతో క్రేజ్ ఉండే పోలీస్ రిక్రూట్మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్‌లకు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశం ► జ్యాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్ ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్–1,2 సర్వీసులకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► పారా మెడికల్ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది. ► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా సెట్ స్కోర్ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది. సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్‌ను పరిశీలించి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్‌లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ స్టడీస్ ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ స్టడీస్ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్ స్టడీస్‌లోని కోర్ టాపిక్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంశాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు జనరల్ స్టడీస్తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. అకడమిక్స్ + సమకాలీన జాబ్ క్యాలెండర్లో పలు స్పెషలైజ్డ్ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్ స్టడీస్తోపాటు ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్ టేబుల్ ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఒకే అర్హతతో పలు పరీక్షలు ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్–ఎస్ఐ పోస్ట్‌లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్‌ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తు ప్రణాళికే ముఖ్యం ఏపీ జ్యాబ్ క్యాలెండర్లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్‌కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించి.. టాపిక్‌వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. – జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు -
తెలంగాణలో ఇక ప్రతియేటా కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇక నుంచి ప్రతి యేటా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఏడున్నర గంటలకు పైగా జరిగింది. ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి ప్రణాళికలు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం కూడా సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. ఉద్యోగుల కేటాయింపుపై చర్చ కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో, టీజీవో సంఘాలు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేబినెట్ ఆ అంశంపై చర్చించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు ఆ వివరాలను ఈ సందర్భంగా కేబినెట్‌కు తెలియజేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, ఇచ్చిన సూచనలు, ఇతర క్షేత్రస్థాయి పరిశీలనలు వివరించారు. వ్యాక్సినేషన్ ప్రకియతో పాటు పడకలు, మందుల లభ్యత, మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి సమాచారమిచ్చారు. కాగా రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్ లభ్యతతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ చర్చించింది. నెలరోజుల్లోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలి రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు మంత్రివర్గానికి నివేదికలు సమర్పించారు. దీనిపై చర్చించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో నూరు శాతం వైకుంఠధామాల నిర్మాణాన్ని నెలరోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. ఇకపై అన్ని గ్రామాల్లో వీధిదీపాల కోసం ‘మూడో వైర్’ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం రాజధాని శివారు మున్సిపాలిటీలకు రూ.1,200 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్.. తక్షణమే నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను పిలవండి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో పరిస్థితిపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థినీ విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని సంబంధిత అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలతో రండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నోట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సోమేశ్‌కుమార్ కేబినెట్ ముందుంచారు. అన్ని ప్రభుత్వ శాఖలతో మాట్లాడి రూపొందించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల వివరాలను ఆయన వివరించారు. దీనిపై మంత్రివర్గం చర్చించింది. కానీ తుది నిర్ణయం తీసుకోలేదు. దీని కోసం బుధవారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సమావేశానికి హాజరుకావాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. కాగా జిల్లాల్లోని జనాభా ప్రాతిపదికన కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారణ, జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టుల్లో పొందుపర్చాల్సిన కేడర్లపై కూడా బుధవారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. భూవిలువల పెంపుపై సుదీర్ఘ చర్చ రాష్ట్రంలోని భూములకు ప్రభుత్వ ధరల సవరణతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై కూడా కేబినెట్లో చాలా సేపు చర్చించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి కారణంగా పెరిగిన భూముల విలువలపై, ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలపై సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. సీఎం కూడా దీనిపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. అయితే నిర్ణయాన్ని మాత్రం బుధవారానికి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన అన్ని శాఖల కార్యదర్శులను బుధవారం నాటి సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇలావుండగా భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ల రాబడికి అడ్డుగా ఉన్న ఆగస్టు-2020 నాటి సర్క్యులర్‌కు బుధవారం జరిగే సమావేశంలో కొంత వెసులుబాటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అధికారులకు కేబినెట్ ఆదేశాలు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను గుర్తించిన తర్వాత, వాటి భర్తీ కోసం వార్షిక నియామక క్యాలెండర్ (జాబ్ క్యాలెండర్) తయారు చేయాలి. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపుతో పాటు ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలి. కరోనా నియంత్రణకు మందులను అందుబాటులో ఉంచాలి. జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రత్యేక లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. ఈ మేరకు అవకాశాలను అన్వేషించి విధివిధానాలను తయారు చేయాలి. -
TSPSC: వార్షిక కేలండర్ ఓ సవాల్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టగా, ఆ తరువాత ఐదేళ్లకు అంటే 2017 మళ్లీ నియామకాలు చేపట్టారు. మళ్లీ నాలుగేళ్లకు ఇపుడు 10 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక జూనియర్ లెక్చరర్ల నియామకాలైతే 2008లో జరిగా యి. ఆ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్‌కే దిక్కులేదు. 2011 తరువాత మళ్లీ గ్రూపు–1 నోటిఫికేషన్ లేదు. గ్రూపు–2, గ్రూపు–3 నోటిఫికేషన్లదీ అదే పరిస్థితి. ఇలా ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతోంది. వార్షిక కేలండర్ అమలే అసలు మందు.. ప్రస్తుతం రాష్ట్రంలో 24.54 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వద్ద వన్‌టైమ్ రిజి్రస్టేషన్ చేసుకోగా, వారిలో వయోపరిమితి దాటిపోయిన వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాల భర్తీకి వార్షిక కేలండర్ అమలు చేస్తే వయోపరిమితి సమస్య రాదని నిరుద్యోగులు ఏళ్ల తరబడి చెబుతున్నారు. అలాచేస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెండు మూడు సార్లు ప్రయతి్నంచి, అవి లభించని వారు ఏదో ఒక ప్రై వేటు ఉద్యోగమో, ఉపాధి అవకాశమో వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే శాఖల వారీగా ఏ సంవత్సరంలో ఖాళీ అయ్యే పోస్టులను ఆ సంవత్సరంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను జారీ చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుందని టీఎస్పీఎస్సీ కూడా భావించింది. దీంతో మూడేళ్ల కిందటే టీఎస్పీఎస్సీ వార్షిక కేలండర్ అమలుకు ప్రతిపాదించినా మోక్షం లభించలేదు. మరెన్నో సవాళ్లు... ఉద్యోగాల భర్తీకి లోపాల్లేని నోటిఫికేషన్లు జారీచేయడం సహా అనేక అంశాలు, సవాళ్లు శుక్రవారం కొలువుదీరనున్న కొత్త కమిషన్ ముందున్నాయి. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్‌గా నియమితులైన ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి, సభ్యులు సమష్టిగా ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో ముందుకు సా గితేనే అవి పరిష్కారం కానున్నాయి. ఇందులో కొన్ని ప్రభు త్వం చేయాల్సిన పనులే అయినా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహకారం తీసుకొని వెంటపడితేనే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 50 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుంది. పోస్టుల విభజనే ప్రధానం రాష్ట్రంలో 2018లోనే 31 జిల్లాలతో కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినా ఆ తరువాత ప్రభుత్వం మళ్లీ రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. వాటికీ రాష్ట్రపతి ఆమోదం లభించింది. అయితే ఇప్పుడు కొత్త జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం రూల్స్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని శాఖల్లో సరీ్వసు రూల్స్ మార్పు చేయాల్సి ఉంది. ఇందులో ఏ పోస్టు జిల్లా పరిధిలోకి వస్తుంది.. ఏది జోనల్ పోస్టు, ఏదీ మల్టీ జోన్ పోస్టు అన్నది తేల్చాల్సి ఉంది. గతంలో అవి తేలకపోవడంతోనే గ్రూపు–2, 3 నోటిఫికేషన్లను ఇవ్వలేదు. స్టేట్‌లెవల్ పోస్టుల రద్దును వ్యతిరేకిస్తున్న శాఖలు రాష్ట్రంలో ఇప్పటివరకు స్టేట్ కేడర్ పోస్టులు ఉన్నాయి. 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచి్చన పుడే రాష్ట్రంలోని వారికే ఆ పోస్టులు దక్కాలని స్టేట్ కేడర్‌ను రద్దు చేసి, ఆ పోస్టులను మల్టీ జోన్ పరిధిలోకి తెస్తూ జీవో 124ను జారీ చేసింది. అయితే దానిని రెవెన్యూ, పోలీసు శాఖలు వ్యతిరేకిస్తున్నాయి. మల్టీ జోన్ పరిధిలోకి వెళితే అక్కడ 8 ఏళ్లు సరీ్వసు చేశాకే స్టేట్ కేడర్‌కు వస్తారు. అక్కడ 8 ఏళ్లు సరీ్వసు చేశాకే ఐఏఎస్, ఐపీఎస్‌కు కన్ఫర్డ్ అవుతారు. కాబట్టి వారు వ్యతిరేకిస్తున్నారు. అందుకు కమిషన్ చిత్తశుద్ధితో ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పించాలి. ఏ మల్టీ జోన్లో ఏ కేడర్ పోస్టులు ఎన్ని వస్తాయన్నది తేలి్చతేనే గ్రూపు–1 నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అవుతుంది. గ్రూపు-2 విషయంలోనూ.. గ్రూపు–2 విషయంలో శాఖల వారీగా పోస్టుల విభజన చేయాలి. అందులో ఏ జోన్లో ఎన్ని.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయన్నది తేల్చి పోస్టులను కేటాయించాలి. 5 శాతం ఓపెన్, 95 శాతం స్థానికులకు కేటాయిస్తూ సరీ్వసు రూల్స్ మార్పు చేయాలి. దీనికంటే ముందు కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేసేలా చర్యలు చేపట్టాలి. ఆ తరువాత ఆయా జిల్లాల్లో శాఖల వారీగా కేడర్ స్ట్రెంత్‌ను నిర్ణయించాలి. 2018లో కొత్త జోనల్ సిస్టం రాగానే పోస్టుల విభజించి ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి రాసింది. అయినా ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదు. గ్రూపు–3 విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. -
సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా..
సాక్షి, అమరావతి: ఒకవైపు కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ నవరత్నాల్లోని పథకాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వరుసగా రెండో ఆర్ధిక ఏడాది (2021–22) కూడా నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ పథకాల అమలు ప్రణాళిక క్యాలెండర్‌ను ప్రకటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పథకాన్ని ఏ నెలలో అమలు చేస్తారో ముందుగానే చెప్పి అమలు చేసిన దాఖలాలు లేవు. ముందుగానే నెలలవారీగా ప్రకటించి అమలు చేసి చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గత పాలకులకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నెలలోనే 80 శాతం హామీలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు 2020–21లో హామీల ఫలాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేయనున్నారో వెల్లడిస్తూ 2019 ఆగస్టు 27వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించడమే కాకుండా అమలు చేశారు. ఇప్పుడు 2021–22లో ఏ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఫలాలను ఏ నెలలో అందించేది మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఖరారు చేశారు. వచ్చే జనవరిలో సామాజిక పెన్షన్లను 2500 రూపాయలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఆర్ధిక ఏడాది అగ్రవర్ణాల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్‌లో అమలు చేయనున్నారు. ఏప్రిల్ ♦జగనన్న వసతి దీవెన 1వ విడత ♦జగనన్న విద్యా దీవెన 1వ విడత ♦రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ(2019 రబీ) ♦పొదుపు సంఘాల మహిళలకు ♦వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు మే ♦రైతులకు వైఎస్సార్ ♦ఉచిత పంటల బీమా(2020 ఖరీఫ్ ) ♦వైఎస్సార్ రైతు భరోసా 1వ విడత ♦మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ) ♦మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ) జూన్ ♦వైఎస్సార్ చేయూత ♦జగనన్న విద్యా కానుక జూలై ♦జగనన్న విద్యా దీవెన 2వ విడత ♦వైఎస్సార్ కాపు నేస్తం ♦వైఎస్సార్ వాహన మిత్ర ఆగస్టు ♦రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు(2020 ఖరీఫ్) ♦ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు ♦వైఎస్సార్ నేతన్న నేస్తం ♦అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు సెప్టెంబర్ ♦వైఎస్సార్ ఆసరా అక్టోబర్ ♦వైఎస్సార్ రైతు భరోసా 2వ విడత ♦జగనన్న చేదోడు (టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు) ♦జగనన్న తోడు (చిరువ్యాపారులు) నవంబర్ ♦వైఎస్సార్ ఈబీసీ నేస్తం డిసెంబర్ ♦జగనన్న వసతి దీవెన 2వ విడత ♦జగనన్న విద్యా దీవెన 3వ విడత ♦వైఎస్ఆర్ లా నేస్తం జనవరి 2022 ♦వైఎస్సార్ రైతు భరోసా 3వ విడత ♦జగనన్న అమ్మ ఒడి ♦పెన్షన్ పెంపు నెలకు రూ.2500 ఫిబ్రవరి 2022 ♦జగనన్న విద్యా దీవెన 4వ విడత నోట్: ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్ద, రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుక మొదలైన పథకాలు అమలవుతాయి. చదవండి: నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్! యనమల పాత్రపై అనుమానాలు -
మై సౌత్ దివా కేలండర్ ఆవిష్కరణ
-
2021 డిజిటల్ క్యాలెండర్ ను లాంచ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నేడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021కి సంబందించిన డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసింది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బటన్ క్లిక్ ద్వారా 2021డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసారు. గతంలో ముద్రించిన క్యాలెండర్, డైరీలను విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. "ప్రతి సంవత్సరం 11 లక్షల క్యాలెండర్లు, 90,000 డైరీలను ముద్రించడానికి రూ.7కోట్లు ఖర్చు అయ్యేది, ప్రస్తుతం తీసుకొచ్చిన డిజిటల్ క్యాలెండర్, డైరీ యాప్ కోసం రూ.2కోట్లు ఖర్చు అయింది"అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చీఫ్ కె.ఎస్ పేర్కొన్నారు.(చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) 2021డిజిటల్ క్యాలెండర్, డైరీ లాంచ్ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. గతంలో గోడలను అలంకరించిన ప్రభుత్వ క్యాలెండర్ ఇప్పుడు మొబైల్ ఫోన్లను అలంకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 'జీఓఐ క్యాలెండర్' పేరుతో ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్ లలో 11 భాషలలో ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. "ఈ యాప్ కొత్త సంవత్సరం క్యాలెండర్ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ప్రతి నెల కొత్త థీమ్ తో పాటు ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. డైరీ ఫీచర్ కారణంగా ఈ క్యాలెండర్ ఇతర డిజిటల్ క్యాలెండర్ యాప్ లతో పోలిస్తే ఉత్తమమైనది"అని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్ బ్యూరో ఆఫ్ ఔట్ రిచ్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మీనిస్ట్రీచే రూపొందించబడింది. ఇది ప్రస్తుతం హిందీ మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంది. త్వరలో 11 ఇతర భారతీయ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. -
జూమ్ యూజర్లకు గుడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. దింతో ఒకరికొకరు కలుసుకోవడం చాలా కష్టం అయినప్పుడు జూమ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫామ్ ఒక్కసారిగా మార్కెట్ లోకి దూసుకొచ్చింది. దింతో జూమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. లాక్ డౌన్ కాలం నుండి ఇప్పటి వరకు వీడియో సమావేశాలు, రాజకీయ సమావేశాలు, ఆన్లైన్ క్లాసులు ఇలా అన్ని జూమ్ లోనే జరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో జూమ్ తన స్థానాన్ని సుస్థిర పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దింట్లో భాగంగానే ఇప్పుడు వెబ్ ఈమెయిల్, క్యాలెండర్ సేవలను కొత్తగా తీసుకురాబోతుంది.(చదవండి: ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్బుక్ తొలగించిందా?) ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు జూమ్ వెబ్ ఈమెయిల్ సేవలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. "వచ్చే ఏడాది 2021 ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు దీని యొక్క బీటా వెర్షన్" అందుబాటులోకి తీసుకోని రావచ్చు. అలాగే కంపెనీ క్యాలెండర్ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని ఒక నివేదిక తెలిపింది. మార్కెట్ వీడియో కాలింగ్ సేవలలో జూమ్ పైచేయి సాధించినప్పటికీ, మెయిల్ కి సంబంధించి తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్(ఆఫీస్ 365), గూగుల్(జీ సూట్) మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. వీటికి పోటీగా జూమ్ సంస్థ తక్కువ ఖర్చుతో యూజర్లకు కొత్త సేవలను తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ మార్కెట్లో జూమ్ వాటా 485 శాతానికి పైగా పెరిగినట్లు సంస్థ పేర్కొంది. -
మై సౌత్ దివా 2020 క్యాలెండర్‌ను ప్రారంభించిన సినీ తారలు