పూలవాసన చూస్తూ.. అర్ధనగ్నంగా చేపలు పడుతూ! | Vladimir Putin calendar sees Russian leader smelling flowers, cuddling dogs and topless fishing | Sakshi
Sakshi News home page

పూలవాసన చూస్తూ.. అర్ధనగ్నంగా చేపలు పడుతూ!

Published Mon, Dec 28 2015 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

పూలవాసన చూస్తూ.. అర్ధనగ్నంగా చేపలు పడుతూ!

పూలవాసన చూస్తూ.. అర్ధనగ్నంగా చేపలు పడుతూ!

బలశాలిగా పేరొందిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ సరికొత్త అవతారాలతో తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుత సంవత్సరంలో 12 నెలలు తాను ఎలా గడిపానో వివరిస్తూ ఆయన ఓ సరికొత్త క్యాలెండర్‌ తీసుకొచ్చారు. అధ్యక్షుడిలా కాకుండా ఓ సామాన్య మానవుడిగా తన అభిరుచులు, ప్రేమాప్యాయతలు పంచుతూ ఆయన ఫొటోల్లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా అర్ధనగ్నంగా చేపలు పడుతూ, పూలవాసన చూస్తూ.. కాస్త కొత్తగా, కొంచెం వింతగా ఈ ఫొటోల్లో పుతిన్‌ దర్శనమిచ్చారు.

ఓ సామాన్యుడిలా వ్యాయామాలు చేస్తూ.. తన కుక్కను అప్యాయంగా హత్తుకుంటూ.. తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టారు. బలమైన నేతగా ప్రపంచమంతా భావించే పుతిన్‌ ఓ సామాన్యుడి సంతోషంగా గడిపిన క్షణాలను ఈ ఫొటోల ద్వారా బయటపెట్టారు. అంతేకాకుండా ప్రతి నెలా తానొక కొత్త సంకల్పాన్ని తీసుకుంటానని, అలా గడిచిన సంవత్సరంలో ప్రతి నెలా నూతన ఆశయాలతో ఇలా ఆనందంగా గడిపానంటూ ఈ క్యాలెండర్‌ ద్వారా ప్రజల ముందుకొచ్చారు పుతిన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement