smelling flowers
-
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్‌లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్‌కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్‌కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్‌లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
పూలవాసన చూస్తూ.. అర్ధనగ్నంగా చేపలు పడుతూ!
బలశాలిగా పేరొందిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సరికొత్త అవతారాలతో తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుత సంవత్సరంలో 12 నెలలు తాను ఎలా గడిపానో వివరిస్తూ ఆయన ఓ సరికొత్త క్యాలెండర్ తీసుకొచ్చారు. అధ్యక్షుడిలా కాకుండా ఓ సామాన్య మానవుడిగా తన అభిరుచులు, ప్రేమాప్యాయతలు పంచుతూ ఆయన ఫొటోల్లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా అర్ధనగ్నంగా చేపలు పడుతూ, పూలవాసన చూస్తూ.. కాస్త కొత్తగా, కొంచెం వింతగా ఈ ఫొటోల్లో పుతిన్ దర్శనమిచ్చారు. ఓ సామాన్యుడిలా వ్యాయామాలు చేస్తూ.. తన కుక్కను అప్యాయంగా హత్తుకుంటూ.. తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టారు. బలమైన నేతగా ప్రపంచమంతా భావించే పుతిన్ ఓ సామాన్యుడి సంతోషంగా గడిపిన క్షణాలను ఈ ఫొటోల ద్వారా బయటపెట్టారు. అంతేకాకుండా ప్రతి నెలా తానొక కొత్త సంకల్పాన్ని తీసుకుంటానని, అలా గడిచిన సంవత్సరంలో ప్రతి నెలా నూతన ఆశయాలతో ఇలా ఆనందంగా గడిపానంటూ ఈ క్యాలెండర్ ద్వారా ప్రజల ముందుకొచ్చారు పుతిన్.