ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. దింతో ఒకరికొకరు కలుసుకోవడం చాలా కష్టం అయినప్పుడు జూమ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫామ్ ఒక్కసారిగా మార్కెట్ లోకి దూసుకొచ్చింది. దింతో జూమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. లాక్ డౌన్ కాలం నుండి ఇప్పటి వరకు వీడియో సమావేశాలు, రాజకీయ సమావేశాలు, ఆన్లైన్ క్లాసులు ఇలా అన్ని జూమ్ లోనే జరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో జూమ్ తన స్థానాన్ని సుస్థిర పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దింట్లో భాగంగానే ఇప్పుడు వెబ్ ఈమెయిల్, క్యాలెండర్ సేవలను కొత్తగా తీసుకురాబోతుంది.(చదవండి: ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్‌బుక్ తొలగించిందా?)
ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు జూమ్ వెబ్ ఈమెయిల్ సేవలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. "వచ్చే ఏడాది 2021 ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు దీని యొక్క బీటా వెర్షన్" అందుబాటులోకి తీసుకోని రావచ్చు. అలాగే కంపెనీ క్యాలెండర్ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని ఒక నివేదిక తెలిపింది. మార్కెట్ వీడియో కాలింగ్ సేవలలో జూమ్ పైచేయి సాధించినప్పటికీ, మెయిల్ కి సంబంధించి తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్(ఆఫీస్ 365), గూగుల్(జీ సూట్) మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. వీటికి పోటీగా జూమ్ సంస్థ తక్కువ ఖర్చుతో యూజర్లకు కొత్త సేవలను తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్‌లెస్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ మార్కెట్లో జూమ్ వాటా 485 శాతానికి పైగా పెరిగినట్లు సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment