e mail
-
విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్ సింఘానియా
భార్యతో నవాజ్ మోడీతో విడాకులు ప్రకటించినప్పటినుంచి మౌనంగా ఉన్నరేమాండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఎట్టకేలకు స్పందించారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా కంపెనీ బిజినెస్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. కంపెనీని సజావుగా నడిపించేందుకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు ఉద్యోగులు, బోర్డు సభ్యులకు హామీ ఇస్తూ ఈమెయిల్ సమాచారం అందించారు రేమాండ్ బాస్.. వక్తిగత అంశాలకు సంబంధించి మీడియాలో పలు నివేదికలు వస్తున్నాయని, అయితే వాటిపై తాను వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల రేమాండ్ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలోనే గౌతమ్ ప్రకటన రావడం గమనార్హం. విడాకులు, భార్య నవాజ్ మోడీ, తండ్రి, రేమాండ్స్ గ్రూపు ఫౌండర్, విజయ్‌పత్ ఆరోపణల తరువాత రేమండ్ స్టాక్ 12 శాతం పడిపోయింది. కాగా ఈ దీపావళి మునుపటి దీపావళిలా ఉండబోదు. 32ఏళ్ల బంధానికి స్వస్థి అంటూ నవాజ్ మోడీతో విడిపోతున్నట్లు సింఘానియా ట్విటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్టార్ క్రికెటర్ల వంతపాట ఆగాలి
న్యూఢిల్లీ: క్రికెట్ జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నారు. జట్టుపై తన అభిప్రాయాలను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు ఈ–మెయిల్లో తెలియజేశారు. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా... జట్టులో ప్రస్తుతమున్న స్టార్ క్రికెటర్ అనే సంస్కృతి మారాలని గట్టిగా లేఖలో సూచించినట్లు తెలిసింది. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్ రామన్ ఈ–మెయిల్ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. స్టార్ సంస్కృతి జట్టుకు చేటు చేస్తోందని రామన్ చెప్పినట్లు తెలిసింది. దీనిపై అధ్యక్షుడు గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం 42 ఏళ్ల రమేశ్ పొవార్‌కు మళ్లీ అమ్మాయిల కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. 2018లో కోచ్‌గా పనిచేసిన పొవార్... మిథాలీతో వివాదం కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. -
జూమ్ యూజర్లకు గుడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. దింతో ఒకరికొకరు కలుసుకోవడం చాలా కష్టం అయినప్పుడు జూమ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫామ్ ఒక్కసారిగా మార్కెట్ లోకి దూసుకొచ్చింది. దింతో జూమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. లాక్ డౌన్ కాలం నుండి ఇప్పటి వరకు వీడియో సమావేశాలు, రాజకీయ సమావేశాలు, ఆన్లైన్ క్లాసులు ఇలా అన్ని జూమ్ లోనే జరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో జూమ్ తన స్థానాన్ని సుస్థిర పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దింట్లో భాగంగానే ఇప్పుడు వెబ్ ఈమెయిల్, క్యాలెండర్ సేవలను కొత్తగా తీసుకురాబోతుంది.(చదవండి: ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్బుక్ తొలగించిందా?) ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు జూమ్ వెబ్ ఈమెయిల్ సేవలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. "వచ్చే ఏడాది 2021 ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు దీని యొక్క బీటా వెర్షన్" అందుబాటులోకి తీసుకోని రావచ్చు. అలాగే కంపెనీ క్యాలెండర్ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని ఒక నివేదిక తెలిపింది. మార్కెట్ వీడియో కాలింగ్ సేవలలో జూమ్ పైచేయి సాధించినప్పటికీ, మెయిల్ కి సంబంధించి తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్(ఆఫీస్ 365), గూగుల్(జీ సూట్) మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. వీటికి పోటీగా జూమ్ సంస్థ తక్కువ ఖర్చుతో యూజర్లకు కొత్త సేవలను తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ మార్కెట్లో జూమ్ వాటా 485 శాతానికి పైగా పెరిగినట్లు సంస్థ పేర్కొంది. -
వ్యాపారికి రూ.60 లక్షల టోకరా
సాక్షి, హైదరాబాద్: ఫేక్ ఈ–మెయిల్ ఐడీతో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారికి రూ.60 లక్షలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. జూబ్లీహిల్స్‌కు చెందిన శేషగిరిరావు ట్రైక్యాడ్ డిజైన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయనకు తన క్లయింట్ అయిన అమెరికాకు చెందిన గ్లోబల్ జియో సప్లయిస్ సంస్థ నుంచి 3డీ సాఫ్ట్ మౌస్‌లు దిగుమతి చేసుకుంటుంటారు. ఇటీవల శేషగిరిరావుకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆయన అమెరికా సంస్థతో చేస్తున్న వ్యాపార లావాదేవీలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో అమెరికా సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీని పోలిన మరో ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్‌గాళ్లు ఓ మెయిల్ పంపారు. అందులో తమకు చైనా సంస్థతోనూ లావాదేవీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ దేశంపై అమెరికాలో ఆంక్షలు ఉన్నందున అక్కడి నుంచి తమకు అవసరమైన సరుకును మీరు దిగుమతి చేసుకుని, ఆ సరుకు భారత్ నుంచి వస్తున్నట్లు తమకు ఎగుమతి చేయాలని సూచించారు. అందులోనే చైనాకు చెందిన సంస్థ పేరుతో ఓ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచారు. ఈ ఖాతాలోకి 79,800 డాలర్లు (రూ.60 లక్షలు) జమ చేస్తే మీకు చైనా నుంచి సరుకు వస్తుందంటూ నమ్మించారు. సదరు అమెరికా సంస్థతో శేషగిరిరావుకు 13 ఏళ్లుగా వ్యాపార అనుబంధం ఉండటంతో సదరు ఖాతాలోకి ఈ నెల 18న ఆ మొత్తం జమ చేశాడు. ఇది జరిగిన రెండ్రోజులకు స్పేర్ పార్ట్స్ పంపడానికి మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఇంకో మెయిల్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి తనకు వచ్చిన మెయిల్ ఐడీని పరిశీలించగా మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్నారు. -
త్వరలోనే పరీక్షలు..క్వారంటైన్ పూర్తి చేసి రావాలి
బెంగుళూరు : కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పదోతరగతి సహా వివిధ పరీక్షలను రద్దు చేస్తూ ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీకి చెందిన ఇన్స్టిట్యూట్ మాత్రం పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది. సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాలంటూ విద్యార్థులకు ఈ- మెయిల్స్ పంపించింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారు ప్రభుత్వం ఆదేశించిన 14 రోజుల క్వారంటైన్ నిబంధనల్ని పాటించాలని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ నిబంధనలతో పాటు వసతి కల్పనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. కాబట్టి తాత్కాలికంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. (కంపెనీ ఉద్యోగులకు కరోనా.. బాధితులు పరార్ ) సాధారణంగా అయితే జూన్ చివరి వారంలో పరీక్షలు జరగాలి. కానీ కరోనా కారణంగా ఆగస్టు 3 నుంచి 21 మధ్యకాలంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ సదరు ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఈ -మెయిల్ ద్వారా షెడ్యూల్ పంపింది. అంతేకాకుండా రాష్ర్టంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల దృష్ట్యా అత్యధిక కేసులు వెలుగుచూస్తున్న కోవిడ్ కేంద్రాలను గుర్తించి వాటి సరిహద్దు ప్రాంతాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశించిన సంగతి తెలిసిందే. లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. (కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్ ) -
అశ్లీల వెబ్సైట్లు చూశారంటూ డబ్బు డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్ ఎక్స్ట్రాక్షన్... ఇటీవల కాలంలో నగరంలో పెరుగుతున్న సైబర్ నేరం ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 18 రోజుల్లోనే ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీరిని బెదిరించడానికి సైబర్ నేరగాళ్లు వాడుతున్న అస్త్రమే... అశ్లీల వెబ్సైట్లు సందర్శన. అలా చేయనివారు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తుండగా.. వీక్షించిన వాళ్లు మాత్రం గప్‌చుప్‌గా నేరగాళ్లు కోరిన మొత్తాలు చెల్లించేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా అశ్లీల వెబ్సైట్ల వీక్షణం గణనీయంగా పెరిగిందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్‌గా పేరుగాంచిన పోర్న్ హబ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ ధోరణి కొనసాగుతోంది. దేశంలోని దాదాపు ప్రతి టెలికం సంస్థా అశ్లీల వెబ్‌సైట్స్‌ను బ్యాన్ చేశాయి. అయినప్పటికీ మిర్రర్ డొమైన్స్ ద్వారా వీటిని చూస్తున్నారని పోర్న్ వెబ్ సంస్థ స్పష్టం చేస్తోంది. సాధారణ సమయాల్లో కంటే లాక్డౌన్ వేళ వీటి వినియోగం ఏకంగా 35 శాతం పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది. దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి, తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్ హబ్ గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి నైజీరియా సహా మరికొన్ని సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్‌సైట్స్‌ను రన్ చేస్తున్నారు. వీటికి బ్యాక్ గ్రౌండ్లో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్‌లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్ అయి ఆ వ్యక్తి ఫొటోను సంగ్రహిస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది. ఈ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలా తన చేతికి చిక్కిన వివరాలతో ఆ సైబర్ క్రిమినల్స్ అసలు పని ప్రారంభిస్తున్నారు. పోర్న్ సైట్ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు. నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామనో, మీ మెయిల్ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామనో బెదిరిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే నిర్ణీత మొత్తం బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్ అందుకున్న వారిలో 95 శాతం మంది బెదిరింపులకు లొంగిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. వీక్షించకపోయినా బెదిరింపులు... అశ్లీల వెబ్సైట్లు వీక్షించిన వారితో పాటు చూడని వారికీ ఈ ఈ–మెయిల్ బెదిరింపులు తప్పట్లేదు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మందీ ఈ కోవకు చెందిన వారే అని అధికారులు చెబుతున్నారు. అనేక డొమైన్లకు చెందిన ఈ–మెయిల్ ఐడీలను, పాస్వర్డ్స్ ను అనునిత్యం కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇలా సంగ్రహించిన వివరాలను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. డీప్ వెబ్, డార్క్ వెబ్ గానూ పిలిచే ఈ డార్క్ నెట్ అనేది ఇంటర్ నెట్ ప్రపంచంలో అథోజగత్తు లాంటిది. సాధారణ బ్రౌజర్లు, విండోస్ ద్వారా ఎవరూ డార్క్ నెట్లోకి వెళ్లలేదు. దీనికి ప్రత్యేకమైన ట్రోజర్లు ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే డార్క్ నెట్లోకి వెళ్లి, బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపు చేస్తూ సైబర్ క్రిమినల్స్ కొన్ని ఈ–మెయిల్ ఐడీలు, వాటి పాస్వర్డ్స్ ఖరీదు చేస్తున్నారు. వారందరికీ బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిస్తూ అశ్లీల వెబ్‌సైట్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నేరగాళ్లు పంపుతున్న మెయిల్స్‌లో తమ పాస్వర్డ్స్ సైతం ఉంటుండటంతో వీటిని అందుకున్న వాళ్లు ఆందోళనకు గురై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మంది విషయంలో ఓ సారూప్యత ఉంది. వీళ్లందరూ వినియోగిస్తున్నది హాట్ మెయిల్.కామ్ కాగా... బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన వారంతా ఔట్లుక్.కామ్ వాడారు. వీరిలో కొందరికి వచ్చిన మెయిల్స్‌లో వారి ప్రస్తుత పాస్వర్డ్స్ కాకుండా గతంలో వినియోగించినవి పొందుపరిచారు. ఇలాంటి మెయిల్స్ వచ్చిన వాళ్లు భయపడవద్దని, తక్షణం తమ మెయిల్స్‌కు చెందిన పాస్ వర్డ్స్ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నదీ నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే అని అనుమానిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. -
మెయిల్ స్ఫూఫింగ్‌తో మోసం!
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్లో లభిస్తున్న మెయిల్ స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగార్థులకు టోకరా వేసిన అంతర్రాష్ట్ర ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో 70 మందికి టోకరా వేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం పేర్కొన్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగిలిన ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు కోదాడ, మహారాష్ట్ర, చెన్నైలకు చెందిన రేష్మ బేగం, షేక్ నహీమ్, మహ్మద్ అలీ, మహ్మద్ జఫీర్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తాత్కాలికంగా కాల్సెంటర్లను ఏర్పాటు చేసే రేష్మాతో పాటు అలీ సైతం వివిధ మార్గాల్లో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన, దానిపై ఆసక్తి ఉన్న వారి ఫోన్ నెంబర్లు సేకరించే వారు. వారికి ఫోన్లు చేసే ఈ ద్వయం విప్రో, అమేజాన్, కాగ్నిజెంట్, ఐబీఎం తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ చెప్పేవారు. ఆ ఓపెనింగ్స్ విషయం బయటకు తెలియదని, తమకు అందులో ఉన్నతస్థానాల్లో పని చేసే వారితో పరిచయాలు ఉండటంతోనే తెలిసిందని నమ్మబలికే వారు. ఆసక్తి చూపిన వారి నుంచి విద్య తదితర ధ్రువపత్రాలు సేకరించే వారు. ఆయా సంస్థలతో మాట్లాడామంటూ ఉద్యోగార్థులతో చెప్పే రేష్మ, అలీలు త్వరలోనే ఆఫర్ లెటర్ వస్తుందని నమ్మించేవారు. చెన్నైలో ఉంటున్న జఫీర్ సాయంతో నకిలీ ఆఫర్ లెటర్స్ తయారు చేయించేవారు. వీటిని రేష్మ మెయిల్ స్ఫూఫింగ్ ద్వారా ఉద్యోగార్థులకు పంపేది. కొన్నేళ్ల క్రితం సరదా కోసం ‘సాఫ్ట్ మేధావులు’ రూపొందించిన ఈ స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘికశక్తులతో పాటు మోసగాళ్లకు సైతం వరంగా మారింది. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. ఆయా సైట్స్‌లోకి ఎంటరైన తరవాత మోసగాళ్ళు తమ మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, అలా అందుకునేప్పుడు అతడికి ఎవరి మెయిల్ నుంచి వచ్చినట్లు కనిపించాలో అదీ ఫీడ్ చేసి రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సదరు ఉద్యోగార్థికి ప్రముఖ కంపెనీ నుంచే ఈ–మెయిల్ వచ్చినట్లు కనిపించి పూర్తిగా బుట్టలో పడిపోతారు. ఈ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న ఈ మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. వారు పేర్కొన్న కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుంచి వచ్చినట్లే ఉంటుంది. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి ఈ మోసగాళ్ళు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జమచేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తామకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తుండటంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. డబ్బు ముట్టిన తర్వాత మోసగాళ్ళు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపుతున్నారు. వీటిని పట్టుకుని ఉద్యోగార్థులు ఆయా సంస్థలకు వెళ్ళిన తర్వాతే తాము మోసపోయామని గుర్తించగలుగుతున్నారు. ఈ తరహాలో రేష్మ అండ్ గ్యాంగ్ అనేక మందిని మోసం చేయడంతో ఎస్సానగర్, కేపీహెచ్‌బీ, రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో వలపన్ని రేష్మ, నహీంలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.25 లక్షల నగదు, సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నేహ, అలీనా, స్వప్న తదితర పేర్లతోనూ చెలామణి అయిన రేష్మ బేగంపై గతంలో మాదాపూర్, నారాయణగూడ, మలక్‌పేట, సుల్తాన్‌బజార్, హబీబ్‌నగర్, కేపీహెచ్‌బీ ఠాణాల్లోనూ కేసులు నమోదైనట్లు డీసీపీ వివరించారు. -
ఆన్లైన్లో వీలునామా
సాక్షి, పెద్దపల్లి: వీలునామా ఒక వ్యక్తి తదనంతర ఆస్తిపాస్తులను వేరొకరికి ఇవ్వడానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించిన తర్వాత ఆయన పేరిట ఉన్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. కోర్టు కేసులూ మామూలే. కాస్తముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీలునామా రాయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాస్తే సరిపోదు. దీనిని రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయాలి. అప్పుడే కోర్టుతో సహ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో తేలిగ్గా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడం వంటి బాధ్యతలు చేపడుతున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహ వీలునామాకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుండగా ఆన్లైన్లో రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు అవడం గమనార్హం. నిజప్రతిలోనూ సవరణలు మన చేతికొచ్చిన వీలునామా నిజప్రతిలో కూడా ఏమైనా సవరణలు అవసరమైతే సరి చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాలి. దీంతోపాటు అవసరమైన వారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను ఈ సంస్థలు తీసుకుంటాయి. ఇ–విల్ సౌకర్యం.. ఎస్బీఐకు చెందిన ఎస్బీఐ క్యాబ్ ట్రస్టీ కంపెనీ ఆన్లైన్ వీలునామా అందుబాటులోకి తేగా.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్టక్చర్, వార్మెండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. హెచ్ఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ సైతం లీగల్ జినీ అనే సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తుంది. 5దశల్లో పూర్తి.. – సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. – అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. – ఆ తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. – ఆపైన తదనంతరం మన ఆస్తులు, నగదును ఎవరికి ఎంతమేర బదలాయించాలో తెలుపుతూ సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. – ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరుతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామా రాస్తారు. దాని చిత్తు ప్రతిని మనకు ఈ–మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైనచో వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత నిజప్రతి వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ–మెయిల్‌కు లేదా మనం ఇచ్చిన చిరునామాకు 90రోజుల్లో పంపిస్తారు. -
విమానంలో హిల్లరీ ఫొటో వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఓ వార్తా పత్రికలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సంబంధించి వచ్చిన వార్తను ఆమె ఆసక్తిగా చదువుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ విమానంలో తన ఫోన్‌తో బిజీగా ఉన్న హిల్లరీ తన ముందు ఉన్న యూఎస్ఏ టుడే అనే పత్రిక వైపు చూసి అలాగే చూస్తుండిపోయారు. ఇంతకీ ఆమె అంత ఆసక్తి చూస్తున్న మైక్‌పెన్స్‌కు సంబంధించిన వార్త ఏమిటంటే ఈమెయిల్ వ్యవహారం. అవును.. తన అధికారిక కార్యకలాపాలకు హిల్లరీ వ్యక్తిగత మెయిల్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చినట్లుగానే ఇప్పుడు మైక్ పెన్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు మైక్ పెన్స్ కూడా తన వ్యక్తిగత ఈమెయిల్‌ను ఉపయగిస్తున్నారట. ఆ వార్తనే యూఎస్ఏ టుడే ప్రధాన వార్తగా తొలిపేజీలో వేసింది. గతంలో ఆయన ఉపయోగించిన ఇదే మెయిల్ హ్యాకింగ్‌కు గురైందని, ప్రధానమైన సమాచారం తస్కరణ చేశారని, ఇప్పుడు అదే ఉపయోగిస్తే దేశ భద్రతకు ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వార్తా కథనం వెలువరించింది. ఈ వార్తను చూసిన హిల్లరీ తదేకంగా చూస్తు ఉండిపోగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి క్లిక్‌మనిపించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. -
పోస్టుకార్డు.. ఈ-మెయిల్
కార్డు ముక్క: అప్పుడు అవసరం.. ఇప్పుడు జ్ఞాపకం మన దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఏదైనా సమాచారం పంపాలంటే.. పోస్టుకార్డులే దిక్కు. తొలినాళ్లలో వీటిని ఏనుగులు.. గుర్రాలు.. ఒంటెలపై ఒక ప్రాంతం నుంచి మరో చోటికి బట్వాడా చేసేవారు. కాలక్రమంలో మార్పులకు అనుగుణంగా రైళ్లు.. బస్సులు.. విమానాల్లో కూడా వీటిని చేరవేస్తున్నారు. 1861 నాటికి దేశవ్యాప్తంగా 889 పోస్టాఫీసులు ఉండేవి. వీటి ద్వారా 4.3 కోట్ల ఉత్తరాలు.. 45 లక్షల వార్తా పత్రికలు బట్వాడా అయ్యేవి. స్వాతంత్య్రం వచ్చే నాటికి వీటి సంఖ్య 23,344కు చేరింది. అదే 2011 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,54,866 పోస్టాఫీసులు ఉంటే.. వాటిలో సుమారు 5,66,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. పోస్ట్.. అంటూ సైకిల్‌పై వచ్చి మన ఇంటి దగ్గర ఉత్తరాలు ఇచ్చివెళ్లే పోస్ట్‌మ్యాన్ మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. ఒకప్పుడు మంచి.. చెడు.. పెళ్లి.. పేరంటం.. చావు.. పుట్టుక.. ఇలా రకరకాల విషయాలు చేరేది ఈ ‘కార్డుముక్క’ ద్వారానే. సాధారణ సమాచారం పంపాలంటే పోస్టు కార్డులు.. కీలక సమాచారం కొంచెం భద్రంగా పంపాలంటే ఇన్‌ల్యాండ్ లెటర్లు ఉపయోగించే వారు. లేఖలను పంపాలంటే ఇన్‌ల్యాండ్ కవర్లు అందుబాటులో ఉండేవి. 1990 తర్వాత రిజిస్టర్ పోస్ట్.. ఎయిర్‌మెయిల్.. స్పీడ్ పోస్టు.. కొరియర్.. వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి హవా కొన్నాళ్లు.. నడిచింది. ఇప్పుడంతా స్పీడ్ యుగం. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ దూరాన్ని చెరిపేసింది. దీంతో ఉత్తరాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపడం తేలికైపోయింది. మనం ఏ క్షణం ఏంచేస్తున్నామో.. తక్షణం సుదూర ప్రాంతంలో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈమెయిల్ ద్వారా క్షణాల్లో చేరవేయవచ్చు. అవసరమైతే వారితో నేరుగా చాట్ చేయవచ్చు. దీంతో పోస్టు కార్డు.. ఇన్‌ల్యాండ్ లెటర్లు.. పాత జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి. -
అన్నింటికీ ‘ఆధార’మే