విమానంలో హిల్లరీ ఫొటో వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఓ వార్తా పత్రికలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సంబంధించి వచ్చిన వార్తను ఆమె ఆసక్తిగా చదువుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ విమానంలో తన ఫోన్‌తో బిజీగా ఉన్న హిల్లరీ తన ముందు ఉన్న యూఎస్‌ఏ టుడే అనే పత్రిక వైపు చూసి అలాగే చూస్తుండిపోయారు.
ఇంతకీ ఆమె అంత ఆసక్తి చూస్తున్న మైక్‌పెన్స్‌కు సంబంధించిన వార్త ఏమిటంటే ఈమెయిల్ వ్యవహారం. అవును.. తన అధికారిక కార్యకలాపాలకు హిల్లరీ వ్యక్తిగత మెయిల్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చినట్లుగానే ఇప్పుడు మైక్ పెన్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు మైక్ పెన్స్ కూడా తన వ్యక్తిగత ఈమెయిల్‌ను ఉపయగిస్తున్నారట. ఆ వార్తనే యూఎస్‌ఏ టుడే ప్రధాన వార్తగా తొలిపేజీలో వేసింది.
గతంలో ఆయన ఉపయోగించిన ఇదే మెయిల్ హ్యాకింగ్‌కు గురైందని, ప్రధానమైన సమాచారం తస్కరణ చేశారని, ఇప్పుడు అదే ఉపయోగిస్తే దేశ భద్రతకు ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వార్తా కథనం వెలువరించింది. ఈ వార్తను చూసిన హిల్లరీ తదేకంగా చూస్తు ఉండిపోగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి క్లిక్‌మనిపించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.