mike pence
-
USA: అమెరికా మాజీ అధ్యక్షుడు మైక్ పెన్స్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిపబ్లికన్ నేత మైక్ పెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్ జెవిష్ కొయిలేషన్ వార్షిక సదస్సులో మైక్ పెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ..‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. 🚨🚨🚨Mike Pence DROPS OUT of 2024 Presidential Race Watch: pic.twitter.com/xRTucsmFqV — Benny Johnson (@bennyjohnson) October 28, 2023 ఇక, పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ హయాంలో పెన్స్ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదితరులు పోటీపడుతున్నారు. -
ట్రంప్‌కు ఊహించని షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్..
అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్ పారీ్టలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పారీ్టలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచి్చనవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. రాన్ డెసాంటిస్ ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్ నెగ్గారు. 44 ఏళ్ల వయసున్న రాన్ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. రాన్ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్‌్కలు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ. ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచి్చంది. పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. మైక్ పాంపియో డొనాల్డ్ ట్రంప్ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. ‘‘చరిత్ర మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది’’ అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు. ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది. మైక్ పెన్స్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్ పెన్స్ ఈసారి అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్ నిరాకరించారు. అప్పట్నుంచి పెన్స్‌పై గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనని ఒక పిరికివాడుగా ముద్ర వేస్తూ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌కి మదుస్వభావిగా పార్టీలో మంచిపేరుంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రతినిధుల సభకు ఎన్నికైన పెన్స్ 2013 వరకు కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు. కరడు గట్టిన సంప్రదాయవాదిగా ముద్రపడిన పెన్స్ 2016లో ట్రంప్ అభ్యరి్థత్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి సై అంటున్నారు. రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ? ట్రంప్ అధ్యక్ష అభ్యరి్థగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యరి్థగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్ వేవ్ వస్తుందని అత్యధికులు ఆశించారు. అధ్యక్షుడు జో బైడెన్ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడం, కేపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలకు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చదవండి: ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం.. -
తప్పిస్తారా ? తప్పించాలా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి ప్రకంపనలు అమెరికాని కుదిపేస్తున్నాయి. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపాలన్న డిమాండ్లు హోరెత్తిపోతున్నాయి. కాంగ్రెస్ సభ్యులందరూ ట్రంప్‌ని ఇంటికి పంపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి మీరు ట్రంప్‌ని తొలగిస్తారా? లేదంటే ఆ పని మేమే చెయ్యాలా అని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ని ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ఉపా«ధ్యక్షుడు, కేబినెట్ మంత్రులు ట్రంప్‌ని గద్దె దింపాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన చేసింది దేశద్రోహమని విమర్శించారు. ఉపాధ్యక్షుడు ట్రంప్‌ని తొలగించకపోతే ప్రజల డిమాండ్ మేరకు తామే అభిశంసన తీర్మానం ద్వారా ఆయన్ను ఇంటికి పంపిస్తామన్నారు. ట్రంప్‌ని గద్దె దింపడం ఇప్పుడు దేశ తక్షణ అవసరమని నాన్సీ వ్యాఖ్యానించారు. వాళ్లంతా దేశీయ ఉగ్రవాదులు: బైడెన్ ట్రంప్ ప్రజాస్వామ్య ధిక్కార చర్యలతో క్యాపిటల్ భవనంలో హింసాకాండ చెలరేగిందని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. దాడికి దిగిన వారంతా చొరబాటుదార్లు, ఉగ్రవాదులని బైడెన్ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ట్రంప్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని,అందుకే ఈ దుస్థితి దాపురించిందన్నారు. కేబినెట్ మంత్రుల రాజీనామా ట్రంప్ మద్దతుదారులు సాగించిన హింసాకాండకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా పదవి నుంచి తప్పుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి బెట్సీ దెవోస్, రవాణా శాఖ మంత్రి ఎలైన్ చావోలు రాజీనామా చేశారు. ‘‘ప్రభుత్వాన్ని వీడడానికి ముందు మనం సాధించిన ఘనతలు గురించి చాటి చెప్పాలనుకున్నాం. కానీ మీ మద్దతుదారులు చేసిన బీభత్సకాండతో మన మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తోంది’’అని బెట్సీ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని చాలా మనస్తాపానికి గురి చేసిందని అందుకే రాజీనామా చేస్తున్నానని రవాణా మంత్రి ఎలైన్ పేర్కొన్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటిదాకా పని చేసిన అధ్యక్షుడు హాజరు కావడం అమెరికాలో ఒక సంప్రదాయంగా వస్తోంది. -
బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా కాంగ్రెస్ బైడెన్ గెలుపుని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నెల 20 ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసింది. ఇక ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా 306 ఓట్లు.. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా 232 ఓట్లు వచ్చాయని ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. రిపబ్లికన్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు. (చదవండి: ‘వారు దేశభక్తులు’: ఇవాంకపై విమర్శలు) ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్, బైడెన్ గెలుపును అంగీకరించలేదు. అధికార మార్పిడికి అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. -
’హంతకుల ప్రవేశానికి అనుమతి ఇస్తారు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమె కమ్యూనిస్టు అని, చాలా భయంకరమైన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ 77 ఏళ్ల జో బైడెన్ గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లయితే, రెండు నెలలు తిరగకుండానే కమల ఆయన నుంచి అధికారాన్ని లాక్కొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బుధవారం నాటి వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా రిపబ్లికన్ మైక్ పెన్స్, డెమొక్రాట్ కమలా హారిస్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. అమెరికాపై కోవిడ్ ప్రభావం, చైనాతో సంబంధాలు, వాతావరణ మార్పులు, సుప్రీంకోర్టు జడ్జి నియామకం, జాతివివక్ష తదితర అంశాలే ప్రధానంగా చర్చ సాగింది. ఈ క్రమంలో ట్రంప్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించిన కమల, గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. (చదవండి: ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్ రాలేదు!) ఈ నేపథ్యంలో గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ గత రాత్రి జరిగింది అసలు చర్చలా అనిపించనే లేదు. ఆమె చాలా టెర్రిబుల్. ఇంతకంటే ఘోరంగా ఇంకెవరూ ఉండరు. అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె ఒక కమ్యూనిస్టు. సెనెటర్ బెర్నే సాండర్స్‌కు ఆమె మద్దతుదారు. తనో కమ్యూనిస్టు. మనం కమ్యూనిస్టు పాలన చూడాల్సి వస్తుంది. మీకు తెలుసా, ఆరోజు జో పక్కన కూర్చున్నపుడు తనను గమనించాను. ప్రెసిడెంట్‌గా గెలిస్తే తను రెండు నెలలు కూడా పదవిలో ఉండడు. నా అభిప్రాయం ప్రకారం రెండంటే రెండు నెలలు కూడా అధ్యక్షుడిగా కొనసాగడు’’ అంటూ వ్యాఖ్యానించారు. (చదవండి: ట్రంప్ చెప్పిన వ్యాక్సిన్‌ని తీసుకోను: కమల) హంతకులు, రేపిస్టులకు సరిహద్దులు తెరుస్తారు! ఇక కరోనాకు చికిత్స తీసుకుని శ్వేతసౌధానికి చేరుకున్న అనంతరం ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే తరహాలో కమలపై విరుచుకుపడ్డారు. ఆమె సోషలిస్టు కాదని, హంతకులు, రేపిస్టులను దేశంలోకి అనమతించేలా సరిహద్దులు తెరుస్తానని చెబుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి, ఆసియా- ఆఫ్రికా మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తొలుత అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడిన ఆమె, పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో సరిపడా ఓట్లు రాకపోవడంతో బరిలో నుంచి తప్పుకొన్నారు. ఇక ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ కమలను తన రన్నింగ్ మేట్‌గా నామినేట్ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ క్రమంలో ట్రంప్, పలుమార్లు కమలను ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. -
కమల వర్సెస్ పెన్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన వైస్ప్రెసిడెన్షియల్ డిబేట్ బుధవారం వాడివేడిగా సాగింది. కరోనా, చైనాతో సంబంధాలు, వాతావరణ మార్పులు, సుప్రీంకోర్టు జడ్జి నియామకం, జాతివివక్ష తదితర అంశాలు డిబేట్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వివిధ అంశాలపై ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మైక్ పెన్స్, డెమొక్రాట్ అభ్యర్థ్ధి కమలా హ్యారిస్‌లు తమ తమ వైఖరులను వెల్లడించారు. డిబేట్లో భాగంగా నాలుగేళ్ల తమ ప్రభుత్వ చర్యలను పెన్స్ గట్టిగా సమర్ధించుకోగా చిరునవ్వు కోల్పోకుండా కమలాహ్యారిస్ వివిధ గణాంకాలతో ట్రంప్ ప్రభుత్వ తీరును నిశితంగా ఎండగట్టారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా చైనాకు ఆర్థికంగా దాసోహమనే స్థాయికి అమెరికాను తీసుకుపోయారని, ఆ సమయంలో అమెరికా అంతర్జాతీయ వాణిజ్యలోటులో సగం చైనాతో ఉండేదని పెన్స్ విమర్శించారు. -
అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ బిగ్ డిబేట్
-
కమల హారిస్, మైక్ పెన్స్ ముఖాముఖి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి సాల్ట్‌లేక్‌లోని కింగ్స్ బర్రీహాల్‌లో ప్రారంభమైంది. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్ మాస్క్ ఏర్పాటు చేశారు. ముఖాముఖిలో భాగంగా మొదటిగా డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని, అమెరికా చరిత్రలో ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడని తెలిపారు. కమల విమర్శలను రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ ఖండిస్తూ.. కరోనాపై ఐదు కంపెనీలు ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని తెలిపారు. కరోనా వాక్సిన్ రూపకల్పనలో భాగంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికన్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని సమాధానం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అసమర్థతో అమెరికా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కమల హారిస్ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఒబామా కేర్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అయితే ఒబామా కేర్‌ను ట్రంప్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇరువురు ఉపాధ్యక్ష అభ్యర్థులు పలు అంశాలపై చర్చ కొనసాగిస్తున్నారు. -
నేడు కమల– పెన్స్ మాటల యుద్ధం!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్ధులు కమలా హారిస్, మైక్ పెన్స్‌ల మధ్య బుధవారం సాల్ట్‌లేక్ సిటీలో జరగనుంది. వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఒక శ్వేతజాతీయేతర, భారతీయ మూలాలున్న మహిళ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందులో కమలదే పైచేయి కావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్ధుల మధ్య ఒక్కసారి మాత్రమే ముఖాముఖి చర్చ జరుగుతుంది. ఇక తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం రిపబ్లికన్ ట్రంప్‌తో పోలిస్తే డెమొక్రాట్ బైడెన్‌కు ఆదరణ పెరిగినట్లు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ డిబేట్లో మాత్రం రిపబ్లికన్ పెన్స్ సులభంగా పైచేయి సాధిస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.(చదవండి: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనాకు చికిత్స తీసుకుని సోమవారం శ్వేతసౌధానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక కోవిడ్-19 ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ట్రంప్ సర్కారు విఫలమైందని ఇప్పటికే డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. స్వయంగా అధ్యక్షుడే మహమ్మారి బారిన పడటంతో వారికి మరో అవకాశం లభించింది. బైడెన్ వలె కమల సైతం ఈ అంశాన్ని డిబేట్లో ప్రస్తావించి, మైక్ పెన్స్‌ను ఇరుకున పెడతారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. (చదవండి: అగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!) ఆ అవసరం లేదు ఉపాధ్యక్ష డిబేట్లో భాగంగా ప్లెక్సిగ్లాస్ బారియర్(రక్షణ కవచం) ఉపయోగించాలని కమల టీం అంటుంటే, మైక్ పెన్స్ బృందం మాత్రం అలాంటి అవసరం లేదంటూ కొట్టిపారేసింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డిబేట్ నిర్వహించాలని, ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి తర్వాత ట్రంప్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ కావడం, ఈ కారణంగా జో బైడెన్ ఆరోగ్యం సైతం ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో పెన్స్ టీం ఎట్టకేలకు ఇందుకు అంగీకరించింది. (చదవండి: ప్రేమ, పెళ్లి, అంతలోనే వరుస విషాదాలు..) చదవండి: నేనే గెలిచా.. కాదు నేను! -
హారిస్ Vs పెన్స్
-
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడన్ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు. మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు. అమెరికాలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న సమయంలోనూ మాస్క్ ధరించని ట్రంప్..శనివారం వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ మిలటరీ మెడికల్ సెంటర్ సందర్శన సమయంలో మాత్రం వైద్యాధికారుల సూచనల మేరకు మాస్క్ పెట్టుకున్నారు. ఈ ఆస్పత్రిలో క్షతగాత్రులైన సైనిక సిబ్బంది, కోవిడ్–19 ఆస్పత్రుల్లో సేవలందించే సిబ్బందికి వైద్యం అందిస్తున్నారు. దేశంలో కోవిడ్–19 వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా అందరూ మాస్క్ ధరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న ట్రంప్ మాత్రం మాస్క్ ధరించడం లేదు. దీనిపై ట్రంప్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మాస్క్ ధరిస్తే ప్రజలు తనను బలహీనుడిగా భావిస్తారని ట్రంప్ అనుకుంటున్నారు. ప్రజారోగ్య సంక్షోభం బదులుగా దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంటోందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లాలంటే అలా చేయక తప్పదని భావిస్తున్నారు’అని తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మాస్క్ ధరించడంపైనా ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. డెమో క్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీలతో పోలిస్తే రిపబ్లికన్ పార్టీ ర్యాలీల్లో చాలా తక్కువ మంది మాస్క్‌లు ధరిస్తుండటం గమనార్హం. -
వూహాన్లో ఆరు కొత్త కరోనా కేసులు
బీజింగ్/వాషింగ్టన్: ప్రాణాంతక మహమ్మారి కరోనా పుట్టినిల్లు వూహాన్లో సుమారు నెల రోజుల స్తబ్దత తర్వాత ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. వూహాన్‌లోని సాన్‌మిన్ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్ చేసింది. ఛాన్‌గోయింగ్ స్ట్రీట్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి ఝాంగ్ యుక్సిన్ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్ చేసినట్లు షిన్హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా బయటపడ్డ కేసులన్నీ ఈ ఛాంగ్గోయింగ్ వీధిలోనివే. మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్ రిస్క్ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్ మళ్లీ మొదలైంది. మైక్ పెన్స్ స్వీయ నిర్బంధం తన సహాయకుడు ఒకరు కరోనాబారిన పడటంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా పరీక్షల్లో పెన్స్‌కు ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్ సైతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
ట్రంప్‌కి రోజూ కోవిడ్ పరీక్షలు
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి/బ్యాంకాక్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో వైట్‌హౌస్ ఉలిక్కి పడింది. వెంటనే అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రంప్ ఇకపై రోజూ పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నారు. కరోనా సోకిన సహాయకుడు ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారని, అధ్యక్షుడి భోజన ఏర్పాట్లు, ఆయనకు దుస్తులు అందివ్వడం వంటి పనులు చేసేవారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. అయితే ట్రంప్ దీనిని తోసిపుచ్చారు. అతనిని తాను చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాను, ఉపాధ్యక్షుడు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకు వారానికి ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించుకునే వాడినని, ఇకపై రోజూ చేయించుకుంటానని ట్రంప్ చెప్పారు. భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీకూతురు మృతి అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీ కూతుళ్లు కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సత్యేందర్ దేవ్ ఖన్నా(78) కొన్ని దశాబ్దాలుగా న్యూజెర్సీలో వివిధ ఆసుపత్రుల్లో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రియా ఖన్నా (43) కిడ్నీ సంబంధిత వ్యాధుల్ని నయం చేసే నిపుణురాలు. ఆమె యూనియన్ ఆస్పత్రిలో చీఫ్ ఆఫ్ రెసిడెంట్‌గా ఉన్నారు. వీరిద్దరికీ ఇటీవల కరోనా వైరస్ సోకింది. డాక్టర్ సత్యేంద్ర ఖన్నా నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న క్లారా మాస్ మెడికల్ సెంటర్లో కోవిడ్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అదే ఆస్పత్రిలోనే సేవలందిస్తున్న ప్రియాఖన్నా కూడా కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి మృతి అత్యంత బాధాకరమని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫీ చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన ఇద్దరు వైద్యుల్ని కోల్పోయిందని అన్నారు. విదేశీయులపై విద్వేషం వద్దు : యూఎన్ కోవిడ్–19 ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో విదేశీయులపై విద్వేషం సునామీలా పెరిగిపోతోందని, దానికి అడ్డుకట్ట వేయడానికి అందరూ కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ అన్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా ఏ దేశం పేరుని కూడా ప్రస్తావించలేదు. ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా, లాటిన్ అమెరికా సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వలసదారులు ఎటూ వెళ్లడానికి లేకుండా ఉన్నారని, వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిన్‌పింగ్‌కు కిమ్ ప్రశంస కరోనా వైరస్‌ను నియంత్రించడంలో విజయం సాధించినందుకుగాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ప్రశంసించారు. ఈ మేరకు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. కరోనా కారణంగా ఉత్తర కొరియా ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు నెదుర్కొంటోందని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కిమ్ తన సందేశాన్ని పంపారు. 14.7 శాతానికి చేరుకున్న నిరుద్యోగం కోవిడ్–19 అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా తీవ్రంగా కుంగదీసింది. 2007–2009 మధ్య కాలంలో అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 14.7శాతానికి చేరుకుంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 2.05 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫిబ్రవరి వరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్టం 3.5 శాతానికి తగ్గింది. వరసగా 113 నెలల పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉండడం కూడా ఒక రికార్డే. ఇక మార్చిలో నిరుద్యోగం 4.4 శాతంగా ఉంది. అదే ఏప్రిల్ వచ్చేసరికి 14.7 శాతానికి ఒక్కసారిగా పెరిగిపోయింది. -
సడలిన ఉద్రిక్తత
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు గురువారం నాటికి కొంత సడలాయి. అమెరికా, లేదా అమెరికన్లు లక్ష్యంగా ఎలాంటి దాడులకు పాల్పడవద్దని ఇరాన్ తన అనధికార సైనిక బృందాలకు సమాచారమిచ్చినట్లు తమకు నిఘా సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇదే తీరును భవిష్యత్తులో కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గురువారం వ్యాఖ్యానించారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అనంతరం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ శాంతి ప్రతిపాదన చేశారు. ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకోవడం లేదని, అధికారంలో ఉన్నవారి తీరు మారాలని కోరుకుంటోందని పెన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా దళాలకు కానీ, ఇరాకీ దళాలకు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం తమ దళాల సమర్ధవంతమైన సన్నద్ధత వల్లనే సాధ్యమైందన్నారు. ఇరాన్ గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశంతో ఘర్షణ విషయంలో తామెప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీ చనిపోయాక ప్రపంచం మరింత సురక్షితమైందన్నారు. కాగా, అమెరికాతో ఘర్షణకు సంబంధించి ఇరాన్ నుంచి విభిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సులేమానీ హత్యకు భవిష్యత్తులో తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారి అబ్దొల్లా అరాఘి వ్యాఖ్యానించారు. వందలాది మిస్సైల్స్ ఉన్నాయి ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై 13 క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ వైమానిక దళ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ అలీ హజీజాదేహ్ వెల్లడించారు. తమవద్ద ఇంకా వందలాది క్షిపణులు ఉన్నాయన్నారు. క్షిపణి దాడులతో పాటు ఇరాక్‌లోని అమెరికా మిలటరీ మానిటరింగ్ సర్వీసెస్‌పై సైబర్ దాడి చేశామన్నారు. ఇరాన్ దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా మరో తప్పు చేస్తే ప్రతీకారం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడి న్యాయమైనదేనన్నారు. తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఐరాస పర్యవేక్షకులకు సహకరించడం కొనసాగిస్తామన్నారు. రౌహానీ గురువారం బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. సులేమానీ హత్యను ఖండించాలని ఈ సందర్భంగా జాన్సన్‌ను కోరారు. సులేమానీ కృషి వల్లనే సిరియా, ఇరాక్‌ల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను అణచివేయగలిగామని, ఆ కారణంగానే బ్రిటన్‌లో ప్రజలు శాంతిగా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోరిస్ జాన్సన్‌తో రౌహానీ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని జాన్సన్ రౌహానీని కోరారు. భారత్ ఆకాంక్ష ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా తగ్గాలని భారత్ ఆకాంక్షించింది. గల్ఫ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్ తీసుకునే చర్యలను స్వాగతిస్తామని బుధవారం భారత్‌లో ఇరాన్ రాయబారి పేర్కొన్న విషయం తెలిసిందే. -
అమెరికాను గొప్పగా చేస్తా
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా. మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది. -
ఉగ్ర ఆనవాళ్లన్నీ అక్కడే!
సింగపూర్: అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల ఆనవాళ్లు, మూలాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ప్రత్యేకంగా ఏ దేశాన్ని ప్రస్తావించకున్నా పాకిస్తాన్‌ను ఉద్దేశించే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆసియాన్–ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీ బుధవారం పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మైక్ పెన్స్‌తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్–ఓ–చాలతో భేటీ అయ్యారు. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అమెరికా కంపెనీలను కోరారు. పెన్స్ నోట ముంబై దాడుల మాట.. మోదీ–పెన్స్ భేటీలో ఉగ్రవాదం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎలా చూసినా కూడా ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల మూలాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల పలు దేశాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ సంతతి ప్రజల పాత్ర సంగతి ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పార్టీ పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, పెన్స్ భేటీ వివరాల్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానానికి పెన్స్ అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో భేటీ అయిన మోదీ..ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం తదితరాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మోదీ, లూంగ్ మధ్య సమావేశం ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్‌లతో సమావేశమైన మోదీ..వాణిజ్యం, రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. -
పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
-
పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్ : ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా మరోసారి ఘాటుగా హెచ్చరించింది. ‘ముష్కర ముఠాలపై మీరు చర్యలు తీసుకోకుంటే మేమే నేరుగా దాడులు చేస్తామని’ ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్.. పాక్ ప్రధాని అబ్బాసీతో అన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని శుక్రవారం ట్రంప్ డిప్యూటీని కలుసుకున్నారు. ఉగ్రవాద నిరోదానికి పాక్ చేపట్టిన చర్యలను అబ్బాసీ వివరించగా, పేన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్లతోపాటు అన్ని ఉగ్రవాద స్థావరాలను తక్షణమే నేలమట్టం చేయాలని పాక్‌కు సూచించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వవైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని, అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించే ఏ సంస్థలనైనా వదిలిపెట్టబోమని పేన్స్ గుర్తుచేశారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి ఆ సాయాన్ని పొందేందుకు పాక్ చేస్తోన్న యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. -
ఇండియా జోలికొస్తే ఊరుకోం.. పాక్‌కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి ఝలక్ ఇచ్చారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం అంటూ పేర్కొన్నారు. తాలిబన్లకు ఇతర ఉగ్రవాదులకు పాక్ రక్షణ కల్పిస్తోందంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాబితాలో పాక్‌ను తొలి స్థానంలో ట్రంప్ చేర్చినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. త్వరలో ఆయన అప్ఘనిస్థాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. 'పాక్ చాలాకాలం నుంచి తాలిబన్లకు ఎంతోమంది ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇప్పుడు అలాంటి రోజులు ముగిశాయి. పాక్‌ను ట్రంప్ నోటీసులో చేర్చారు' అని పెన్స్ తెలిపారు. 'పాకిస్థాన్ ఎంతో కాలం నుంచి అమెరికా భాగస్వామ్యం ద్వారా లబ్ధిని పొందుతోంది. కానీ, మున్ముందు అలాంటివాటిని పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. తన పొరుగు దేశాలైన ఇండియా, అఫ్ఘనిస్థాన్‌పై తమ దేశంలోని వ్యతిరేక శక్తులను ఉపయోగించాలని చూస్తున్న పాక్‌ను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాంటివి ఇక ఆపేయాలి. ఇప్పటికే అప్ఘనిస్థాన్‌లో సరిహద్దులో 500 బలగాలను దింపాం. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారన్నది మాకు అసలు విషయమే కాదు.. మా అధ్యక్షుడు ఎంత సైన్యాన్ని ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారు. అందుకే పాక్ ఉగ్రవాదుల విషయంలో కఠినంగా ఉండాలి' అని పెన్స్ హెచ్చరించారు. -
అమెరికా మాట మార్చింది
న్యూయార్క్ : పాకిస్థాన్ విషయంలో అమెరికా మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. నిన్నమొన్నటి వరకు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఇదే ఆఖరి అవకాశం అంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా తాజాగా మాట మార్చింది. పాకిస్థాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న తమవారిని బయటపడేసేందుకు పాకిస్థాన్ ఎంతో సాయం చేసిందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. కెనడియన్-అమెరికా కుటుంబానికి చెందిన జోషువా బోలే అతడి భార్య ముగ్గురు సంతానం ఇటీవలె హక్కాని నెట్వర్క్ ఉగ్రవాదుల చేతుల్లో నుంచి బయటపడ్డారు. ఐదేళ్ల కిందట ఆ కుటుంబం కిడ్నాప్ అయింది. అయితే, తాజాగా వారిని పాకిస్థాన్ బలగాలు విడిపించాయి. దీంతో తమ దేశీయులకు ఎలాంటి హానీ జరగకుండా విడిపించినందుకు పెన్స్ పాక్ ను కొనియాడారు. వాస్తవానికి గతంలోనే వారిని విడిచిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ పాక్ నిర్లక్ష్యం చేసింది. అయితే, ఇటీవలె పాక్ ఉగ్రవాద దేశం అని, ఆదేశానికి ఇదే చివరి హెచ్చరిక అంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్థాన్ కావాలనే రియాక్ట్ అయి అమెరికాను ఆకట్టుకునేందుకే వారి పౌరులను విడిపించిందని సమాచారం. -
‘ఉత్తర కొరియాపై మా సహనం ముగిసింది’
పాన్‌మన్జామ్: ఉత్తర కొరియా విషయంలో తమ ‘వ్యూహాత్మక సహన శకం ముగిసింది’ అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. ఇష్టానుసారం అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా విషయంలో తాము చాలా ఆగ్రహంతో, అసహనంతో ఉన్నామని తెలిపారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న డిమిలిటేరైజడ్ జోన్ బోనిఫాస్‌ను పెన్స్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్తర కొరియా చేస్తున్న అణుకార్యక్రమాన్ని నిలిపివేసేలా చైనా ఒత్తిడి చేసే చొరవ తీసుకుంటుందని తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. అలా జరగకుంటే తాము తమ భాగస్వామ్య దేశాలతో కలసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఉత్తర కొరియా విషయంలో వేచి చూసే దోరణితో మాత్రం లేమని స్పష్టం చేశారు. -
విమానంలో హిల్లరీ ఫొటో వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఓ వార్తా పత్రికలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సంబంధించి వచ్చిన వార్తను ఆమె ఆసక్తిగా చదువుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ విమానంలో తన ఫోన్‌తో బిజీగా ఉన్న హిల్లరీ తన ముందు ఉన్న యూఎస్ఏ టుడే అనే పత్రిక వైపు చూసి అలాగే చూస్తుండిపోయారు. ఇంతకీ ఆమె అంత ఆసక్తి చూస్తున్న మైక్‌పెన్స్‌కు సంబంధించిన వార్త ఏమిటంటే ఈమెయిల్ వ్యవహారం. అవును.. తన అధికారిక కార్యకలాపాలకు హిల్లరీ వ్యక్తిగత మెయిల్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చినట్లుగానే ఇప్పుడు మైక్ పెన్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు మైక్ పెన్స్ కూడా తన వ్యక్తిగత ఈమెయిల్‌ను ఉపయగిస్తున్నారట. ఆ వార్తనే యూఎస్ఏ టుడే ప్రధాన వార్తగా తొలిపేజీలో వేసింది. గతంలో ఆయన ఉపయోగించిన ఇదే మెయిల్ హ్యాకింగ్‌కు గురైందని, ప్రధానమైన సమాచారం తస్కరణ చేశారని, ఇప్పుడు అదే ఉపయోగిస్తే దేశ భద్రతకు ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వార్తా కథనం వెలువరించింది. ఈ వార్తను చూసిన హిల్లరీ తదేకంగా చూస్తు ఉండిపోగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి క్లిక్‌మనిపించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. -
యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది!
వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం విజయవంతంమౌతోందని, దీనికి రిపబ్లికన్ ప్రభుత్వం తోడ్పడుతుందని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన 'మార్చ్ ఫర్ లైఫ్' కార్యక్రమంలో మైక్ పాల్గొన్నారు. అబార్షన్లకు వ్యతిరేకంగా వాషింగ్టన్లో ప్రతి సంవత్సరం నిర్వహించే మార్చ్ ఫర్ లైఫ్‌లో పాల్గొన్న తొలి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ కావడం విశేషం. 'రైట్ టు లైఫ్'ను సపోర్ట్ చేసే వ్యక్తి ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని.. మార్ఛ్ ఫర్ లైఫ్‌లో పాల్గొనాలని స్వయంగా ట్రంప్ తనను కోరారని ఈ సందర్భంగా మైక్ చెప్పుకొచ్చారు. అబార్షన్లకు వ్యతిరేకంగా ఇటీవల రిపబ్లికన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన ర్యాలీలో వివరించారు. అమెరికాలో ప్రాణం విజయం సాధిస్తోందన్న పెన్స్.. సంస్కృతిని పునరుద్ధరించేవరకు మనకు విశ్రాంతి లేదన్నారు. ర్యాలీ అనంతరం ప్రో లైఫ్ మార్చ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు. -
'అమెరికా ఉపాధ్యక్షుడికి నల్లగొండ దోస్తు'
వాషింగ్టన్: దక్షిణాసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ కీలకంగా మారుతున్న దేశం భారత్. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ పరిపాలనా కాలంలో భారతదేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని ట్రంప్ పరిపాలన వర్గం భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుందని పక్కా సమాచారం. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ప్రస్తుతం అమెరికాకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడు రాజు చింతల. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు చెందిన రాజు చింతల గత పదేళ్లుగా మైక్ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఇండియానా గవర్నర్‌గా మైక్ పెన్స్ అవతరించేవరకు కూడా రాజు చింతల పెన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇండియానా నుంచి వాషింగ్టన్లో దిగారు. వాషింగ్టన్లో కొలువు దీరనున్న కొత్త అమెరికా ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో రాజు చింతల పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. 'దక్షిణాసియా దేశాల్లో అమెరికా తరుపున కీలక పాత్ర ఒక్క భారత్ మాత్రమే పోషించగలదని అమెరికా భావిస్తోంది. పైగా అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను అమెరికా భావిస్తోంది. ట్రంప్ ఆధ్వర్యంలో కచ్చితంగా భారత్, అమెరికాల మధ్య బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ విభాగంలో.. అలాగే ఉగ్రవాదం విషయంలో కూడా ట్రంప్ భారత్‌తో కలిసి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఐసిస్‌ను తుదముట్టించేందు ట్రంప్ కూడా సన్నద్ధమవుతున్నారు. మైక్ పెన్స్ ఈ ఏడాది భారత్‌లో పర్యటించాలని అనుకుంటున్నారు. దాని ద్వారా భారత్‌లో అమెరికా ఎగుమతులకు మరింత ఊపునివ్వాలని భావిస్తున్నారు' అని ఆయన చెప్పారు.