![US Congress Formally Certifies Joe Biden Election Win - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/7/joe%20biden.jpg.webp?itok=DX4haEWu)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా కాంగ్రెస్ బైడెన్ గెలుపుని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నెల 20 ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసింది. ఇక ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా 306 ఓట్లు.. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా 232 ఓట్లు వచ్చాయని ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. రిపబ్లికన్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు. (చదవండి: ‘వారు దేశభక్తులు’: ఇవాంకపై విమర్శలు)
ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్, బైడెన్ గెలుపును అంగీకరించలేదు. అధికార మార్పిడికి అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment