వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన వైస్‌ప్రెసిడెన్షియల్ డిబేట్ బుధవారం వాడివేడిగా సాగింది. కరోనా, చైనాతో సంబంధాలు, వాతావరణ మార్పులు, సుప్రీంకోర్టు జడ్జి నియామకం, జాతివివక్ష తదితర అంశాలు డిబేట్‌లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వివిధ అంశాలపై ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మైక్ పెన్స్, డెమొక్రాట్ అభ్యర్థ్ధి కమలా హ్యారిస్‌లు తమ తమ వైఖరులను వెల్లడించారు. డిబేట్‌లో భాగంగా నాలుగేళ్ల తమ ప్రభుత్వ చర్యలను పెన్స్ గట్టిగా సమర్ధించుకోగా చిరునవ్వు కోల్పోకుండా కమలాహ్యారిస్ వివిధ గణాంకాలతో ట్రంప్ ప్రభుత్వ తీరును నిశితంగా ఎండగట్టారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా చైనాకు ఆర్థికంగా దాసోహమనే స్థాయికి అమెరికాను తీసుకుపోయారని, ఆ సమయంలో అమెరికా అంతర్జాతీయ వాణిజ్యలోటులో సగం చైనాతో ఉండేదని పెన్స్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment