US Election Results 2024 LIVE Updates
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఈ హోరా హోరీ పోరులో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ఆధిక్యతను కనబరుస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసే స్వింగ్స్ స్టేట్స్‌లో ట్రంప్ దూసుకెళ్తుండగా.. ట్రంప్‌తో కమలా హారిస్ సైతం పోటీ పడుతున్నారు.
8:27am
9 రాష్ట్రాల్లో కమలా హారిస్.. 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. టెక్సాస్‌లో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లిక్ పార్టీ ఖాతాలో 41 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో గెలిచారు.
8:15am
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ చివరి అంకానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ పూర్తయిన కౌంటింగ్ ప్రారంభమైన అన్నీ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించారు. అధ్యక్ష పదవిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోర్‌లో ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 154 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 81 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు.
7:41am
- బాంబు బెదిరింపు తర్వాత పెన్సిల్వేనియా కౌంటీలో ఓటింగ్ సమయాన్ని మరింత పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు
7:36am
- టెక్సాస్, వ్యోమింగ్‌లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా
- ట్రంప్ దక్షిణ, ఉత్తర డకోటాలలో విజయం సాధించారు
7:33am
- ట్రంప్, కమల ఒక్కొక్కరు 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు
7:24 am
- ట్రంప్ 10 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు
7:20am
- చెస్టర్ కౌంటీ ప్రభుత్వ సేవల కేంద్రానికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన అధికారులు
7:13am
బాంబు బెదిరింపుల కలకలం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విడుదలలో ఓ వైపు ఉత్కంఠత కొనసాగుతుండగా.. మరోవైపు బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలోని ఓటింగ్ సర్వీస్ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపులపై సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
7:10am
స్వింగ్ స్టేట్స్‌లో హారిస్ వెనుకంజఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్, కమలా హారిస్‌లలో ఎవరిది పైచేయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వింగ్ స్టేట్స్‌లో ఆధిక్యం సాధించే అభ్యర్థికి అమెరికా అధ్యక్ష పీఠం దక్కనుండటమే అందుకు కారణం. అయితే పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ఈ ఏడు స్వింగ్ స్టేట్స్‌లో సైతం హారిస్ వెనుకంజలో ఉన్నారు. స్వింగ్స్ స్టేట్స్‌లో ట్రంప్‌కు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్‌కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి.
6:50am
అమెరికా అధ్యక్ష ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించే ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. ట్రంప్ 101 ఎలక్టోరల్‌లో ఓట్లు సాధించగా.. హారిస్ 49 మాత్రమే సాధించారు.
అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9మంది భారతీయులు
అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా), అమీ బెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి (ఇల్లినోయీ), రో ఖన్నా (కాలిఫోర్నియా), శ్రీ థనేదార్ (మిషిగన్), అమీశ్ షా (ఆరిజోనా), ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్), రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ) పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు, స్థానిక సంస్థల బరిలో ఉన్నారు.
6:40am
అమెరికాలో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇండియా, కెంటికీ,వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కమలా హారిస్ వెర్మాట్‌లో మాత్రమే గెలుపొందారు.
👉: అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment