Doalrd trump
-
ట్రంప్ 2.0లో భారత సంతతి హర్మీత్‌కు చోటు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నియమించారు.ధిల్లాన్ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘‘భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా కార్మికులపై వివక్ష, అందుకు అనుగుణంగా చట్టాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించిన పలు కార్పొరేషన్లపై న్యాయం పోరాటం చేశారు. మన రాజ్యాంగ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. కీలక బాధ్యతలు చేపట్టనున్న దిల్లాన్ పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను అమలు చేస్తారని ఆశిస్తున్నానని’ పేర్కొన్నారు. ప్రతిస్పందనగా, ట్రంప్ అప్పగించిన బాధ్యతలు ‘అత్యంత గౌరవం’గా భావిస్తా. మన దేశానికి సేవ చేయడం నా కల, ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను’ అని ఆమె ఎక్స్వేదిగా ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) వివేక్ రామస్వామి (డోజ్) కశ్యప్ పటేల్ (ఎఫ్‌బీఐ డైరెక్టర్) నియమించగా.. తాజాగా భారత సంతతి హర్మీత్ కె.ధిల్లాన్ నియమించారు.👉చదవండి : సిరియా నియంత కొంపముంచిన నాటి 14ఏళ్ల బాలుడు -
US Election Results : మిస్టర్ ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్
US Election Results 2024 LIVE Updates : వాషింగ్టన్ డీసీ: దేశ ప్రజలకు సువర్ణయుగం రాబోతుందంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంగించారు. స్వింగ్ స్టేట్స్లో విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 05: 30 PMఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు గెలుపుకమలా హారిస్ 224 ఓట్లు విజయం ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోందిట్రాంప్ మ్యాజిక్ ఫిగర్ ( 270) ఎలక్టోరల్ ఓట్లు దాటారు05: 10 PMట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు. 04: 19 PMట్రంప్ బిగ్ విక్టరీఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంవిస్కాన్సిన్లో విజయంతో మేజిక్ ఫిగర్ దాటిన ట్రంప్రెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌లో నెగ్గిన రిపబ్లికన్ కేండిడేట్‌గా ట్రంప్ రికార్డు277కి చేరిన ట్రంప్ బలం.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్.. మరో 30 స్థానాలు ట్రంప్ ఖాతాలోకే! 04: 10 PMడొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన చైనాట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనాఅధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం: చైనాఅమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తాంపరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్తామని చైనా ప్రకటన04: 05 PMట్రంప్ గెలుపు ఇక లాంఛనమేదాదాపు ఖరారైన డొనాల్ట్ ట్రంప్ విజయంమేజిక్ ఫిగర్‌కు అతిచేరువలో ట్రంప్ఇప్పటికే 267 సీట్లు.. మరో మూడు ఎలక్టోరల్ సాధిస్తే విజయంఇంకా ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ట్రంప్మరో 44 ఎలక్టోరల్లు దక్కే అవకాశంమరో నాలుగు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలీనా, పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ పార్టీ గెలుపుఓటమి దిశగా కమలా హారిస్డెమోక్రటిక్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ03: 30 PMరన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ జంటపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుఅద్భుతమైన, అందమైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ జంటకు అభినందనలుఇక నుంచి మిమ్మల్ని( జేడీ వాన్స్) ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలవచ్చు: ట్రంప్ 2: 34 PMఅమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికనూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారని పేర్కొన్న అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశWe have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024 2:17pmడొనాల్ట్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని పిలుపునిచ్చిన భారత ప్రధాని Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024 02:02pmట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు శుభాకాంక్షలు మీరు వైట్‌హౌస్‌లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది అమెరికా, ఇజ్రాయెల్‌ల బంధం మరింత బలోపేతమవుతుంది Dear Donald and Melania Trump,Congratulations on history’s greatest comeback!Your historic return to the White House offers a new beginning for America and a powerful recommitment to the great alliance between Israel and America.This is a huge victory!In true friendship,… pic.twitter.com/B54NSo2BMA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 6, 20241:20pm రిపబ్లికన్లకు 315 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది - ట్రంప్సరిహద్దు మూసివేతల్ని పరిశీలించాలిఎవరైనా చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సిందేసరిహద్దులు నిర్ణయిస్తాంఅమెరికన్లు పవర్ఫుల్ తీర్పు ఇచ్చారు1:00pmఅమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు. వారి కోసం పని చేస్తాను.అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుందినా గెలుపు అమెరికాకు ఉపయోగంఈ ఫలితాలను ఎవరూ ఊహించలేదుఅమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు 11:50amఆ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు267కి పెరిగిన రిపబ్లికన్ల బలంమూడు సీట్ల దూరంలో అధ్యక్ష పీఠం11:43amడొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడేందుకు పామ్ బీచ్‌కు వెళుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, అమెరికా అధ్యక్షుడిని ఖరారు చేసే ఏడు స్వింగ్ స్టేట్స్‌లలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో గెలుపొందారు.11:35am అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం.. మద్దతు దారుల గురించి చేసే ప్రసంగానికి హారిస్ గైర్హాజరు కానున్నారు. 11:20amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్యల విషయానికొస్తే ట్రంప్ 230 ఓట్లతో, హారిస్ 209 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 23 రాష్ట్రాల్లో కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందినట్లు అంచనా. 270 ఎలక్టోరల్ సీట్లు వచ్చిన అభ్యర్థే అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపడతారు 11:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా ట్రంప్230 ఎలక్టోరల్ సీట్లు సాధించిన ట్రంప్210 ఎలక్టోరల్ సీట్లతో వెనుక బడ్డ కమలా హారిస్ మార్ ఆ లాగో రిసార్ట్‌కు బయలు దేరిన ట్రంప్.ముఖ్య నేతలు,ట్రంప్‌తో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్న ట్రంప్ తన మద్దతు దారుల గురించి ప్రసంగం 3 స్వింగ్స్ స్టేట్స్లో విజయం సాధిస్తే ట్రంపే అధ్యక్షుడు 10:50amనాలుగు గంటలుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చే స్వింగ్ స్టేట్స్లో సైతం ట్రంప్ హవా కొనసాగుతుంది. ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా(విజయం), ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. 10:10amఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తే తన విజయం ఖాయమైనట్లేనని అన్నారు. కానీ కౌంటింగ్‌లో తన విజయాన్ని అడ్డుకునేలా కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు.9:55amకొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పోరులో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ హారిస్ క్రమంగా పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌కు 230 ఎలక్టోరల్ సీట్లు సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 179 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.9:40am2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో నిరాశజనకమైన ఫలితాలు రాబట్టిన ట్రంప్.. ఈ సారి మాత్రం ఊహించని ఫలితాల్ని సాధిస్తున్నారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్‌పై దాడి చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ పెన్సిల్వేనియా ఓటర్ల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేశారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.9:20amబ్యాలెట్ పేపర్లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. ఎన్నికల అధికారులు వాటిని చేతితో కాకుండా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (డీఆర్ఈ) సిస్టమ్‌తో కౌంట్ చేస్తారు. పెన్సిల్వేనియాలో ఈ డీఆర్ఈ డివైజ్‌లలో సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తాయి. దీంతో డీఆర్ఈ డివైజ్‌లు మొరాయించడంతో అధికారులు ఓట్లను చేతితో కౌంట్ చేస్తున్నారు9:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిని గెలుపును ఖాయం చేసే పెన్సిల్వేనియాలో సైతం డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియాలో 55 శాతం ఓట్లు లెక్కించగా, కమలా హారిస్ కంటే డోనాల్డ్ ట్రంప్ 3 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్‌కు 51.1 శాతం ఓట్లు రాగా, హారిస్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి.9:05amఅమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. స్వింగ్ స్టేట్స్లో ఒకటైన ఈ పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేస్తాయిని అంచనా. అంతటి ముఖ్యమైన పెన్సిల్వేనియాలో భారీ మోసం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనిని ఎన్నికల అధికారులు ఖండించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు. 8:27am9 రాష్ట్రాల్లో కమలా హారిస్.. 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. టెక్సాస్‌లో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లిక్ పార్టీ ఖాతాలో 41 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో గెలిచారు. 8:15amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ చివరి అంకానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ పూర్తయిన కౌంటింగ్ ప్రారంభమైన అన్నీ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించారు. అధ్యక్ష పదవిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోర్లో ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 154 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 81 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు.7:41amబాంబు బెదిరింపు తర్వాత పెన్సిల్వేనియా కౌంటీలో ఓటింగ్ సమయాన్ని మరింత పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు 7:36amటెక్సాస్, వ్యోమింగ్‌లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా ట్రంప్ దక్షిణ, ఉత్తర డకోటాలలో విజయం సాధించారు7:33amట్రంప్, కమల ఒక్కొక్కరు 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:24 amట్రంప్ 10 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:20amచెస్టర్ కౌంటీ ప్రభుత్వ సేవల కేంద్రానికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన అధికారులు 7:13amబాంబు బెదిరింపుల కలకలంఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విడుదలలో ఓ వైపు ఉత్కంఠత కొనసాగుతుండగా.. మరోవైపు బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలోని ఓటింగ్ సర్వీస్ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపులపై సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. 7:10amస్వింగ్ స్టేట్స్లో హారిస్ వెనుకంజఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్లో ట్రంప్, కమలా హారిస్‌లలో ఎవరిది పైచేయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యం సాధించే అభ్యర్థికి అమెరికా అధ్యక్ష పీఠం దక్కనుండటమే అందుకు కారణం. అయితే పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ఈ ఏడు స్వింగ్ స్టేట్స్లో సైతం హారిస్ వెనుకంజలో ఉన్నారు. స్వింగ్స్ స్టేట్స్లో ట్రంప్‌కు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్‌కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 6:50amఅమెరికా అధ్యక్ష ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించే ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. ట్రంప్ 101 ఎలక్టోరల్‌లో ఓట్లు సాధించగా.. హారిస్ 49 మాత్రమే సాధించారు. అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9మంది భారతీయులు అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా), అమీ బెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి (ఇల్లినోయీ), రో ఖన్నా (కాలిఫోర్నియా), శ్రీ థనేదార్ (మిషిగన్), అమీశ్ షా (ఆరిజోనా), ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్), రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ) పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు, స్థానిక సంస్థల బరిలో ఉన్నారు.6:40amఅమెరికాలో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇండియా, కెంటికీ,వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కమలా హారిస్ వెర్మాట్లో మాత్రమే గెలుపొందారు. 👉: అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు) -
ట్రంప్ అంటే విద్వేషం.. ఎఫ్‌బీఐ అదుపులో ర్యాన్ వెస్లీ రౌత్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ క్లబ్ వెలుపల ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ను ఏకే-47 ఆయుధంతో సహా ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు . దీనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్‌తో ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానిత షూటర్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు. ఇది దర్యాప్తునకు ఉపకరించింది. రెండు నెలల్లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గమనార్హం.తాజాగా ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగినవాడని పోలీసులు గుర్తించారు. ఎఫ్‌బీఐ ఇతనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనప్పటికీ.. న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది. లింక్డ్ఇన్ను ఆధారంగా చేసుకుని నిందితుడు నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది.లింక్డ్ఇన్లో రౌత్ తన అభిరుచులు, ఆలోచనలు పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయి. 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఆయుధాలు కలిగి ఉండటం, హిట్ అండ్ రన్ కేసులలో రౌత్‌కు శిక్ష పడింది. 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యింది. అమెరికా రాజకీయాల గురించి రౌత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు రాసేవాడు.రౌత్ 2019లో డెమోక్రటిక్ అభ్యర్థులకు విరాళాలు అందించాడు. 2022 ఏప్రిల్‌లో ఒక పోస్టులో అతను ట్రంప్‌ను విమర్శించాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రౌత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు.పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత రౌత్ అధ్యక్షుడు బైడెన్‌ను సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని బైడెన్‌ను కోరాడు. రౌత్ గత జూలై 16న ఈ పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు రౌత్ సూచించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం? -
అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం?
న్యూయార్క్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ రేటును అదుపు చేయకుంటే మరిన్ని మరణాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి మరణాలు వేల సంఖ్యలో ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అసలు సవాలు ఇప్పుడే! అమెరికాలో లాక్డౌన్ కొనసాగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ న్యూయార్క్ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు ప్రతి లక్ష మందికి 6.2 నుంచి 7.5కు పెరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. న్యూయార్క్‌లో కొన్ని రోజులుగా కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టాయి కానీ చాలా ప్రాంతాల్లో పెరిగాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన అమెరికా విషయంలో పనిచేయదని, వాస్తవంగా కేసులు ఎక్కువయ్యాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్ జాంగ్ తెలిపారు. న్యూయార్క్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయోవాలో మంగళవారం రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా టైసన్ ఫుడ్ పోర్క్ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన రోజు నుంచే కేసుల పెరుగుదల నమోదు కావడం ఇక్కడ గమనార్హం. భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నాటికి అమెరికా మొత్తమ్మీద కోవిడ్ కారణంగా 1.34 లక్షల మంది మరణించే అవకాశముందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్ ముర్రే సిద్ధం చేసిన మోడల్ హెచ్చరించడం తెల్సిందే. చదవండి: ‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం పోరులో మలిదశలో ఉన్నాం వాషింగ్టన్: కరోనా వైరస్ కేసుల గ్రాఫ్‌ను ఇప్పటికే చదును చేసిన అమెరికా.. మలిదశలో సురక్షితంగా.. దశలవారీగా లాక్డౌన్ నిబంధనలను సడలించే ప్రక్రియలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. పౌరుల చిత్తశుద్ధి కారణంగా వైరస్ గ్రాఫ్‌ను చదును చేయగలిగామని, తద్వారా లెక్కలేనని అమెరికన్ పౌరుల ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆయన ఫీనిక్స్‌లో మాస్క్‌లు తయారు చేసే ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. వారం రోజులుగా దేశం మొత్తమ్మీద కేసులు, మరణాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ అంశం ఆధారంగానే ట్రంప్ గ్రాఫ్ వంపును చదునుచేసి చెబుతున్నట్లు అంచనా. ఈ మహమ్మారి కారణంగా అమెరికా వస్తు సేవల సరఫరా అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పిందని, స్థానికంగా వస్తువుల తయారీ కేంద్రాల నిర్మాణం జరగాలని చెబుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ట్రంప్ ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ కరోనా ఓ గట్టి ప్రత్యర్థేనని కానీ.. దానిపై విజయం సాధిస్తున్నామని భరోసానిచ్చారు. అమెరికా ఇప్పుడు వెంటిలేటర్లు వంటి అత్యవసర సరుకులను అందివ్వడం ద్వారా నైజీరియా వంటి దేశాలను ఆదుకునేపనిలో ఉందని అన్నారు. -
సరైన దిశలోనే అడుగులు: ట్రంప్
వాషింగ్టన్/లండన్/మాడ్రిడ్: కరోనా రక్కసి కొమ్ములు విరిచేయడంలో తాము చేస్తున్న కృషి ఫలిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ ప్రభుత్వం సరైన దిశలోనే అడుగులు వేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతోందని అన్నారు. ‘కరోనాపై చేస్తున్న పోరాటంలో పురోగతి సాధిస్తున్నాం. న్యూయార్క్, న్యూజెర్సీ, మిషిగాన్, లూసియానాలో కేసుల తీవ్రత తగ్గింది’ అని చెప్పారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో రోజుకి 30 వేల కొత్త కేసులు నమోదైతే, ఇప్పుడు వాటి సంఖ్య 25 వేలకు తగ్గింది. అదే విధంగా 24 గంటల్లో 2 వేలమందికి పైగా మృతి చెందితే, ఇప్పుడు మృతుల సంఖ్య 1300కి తగ్గింది. మార్కెట్లు తెరవడంపై నిర్ణయం కరోనా ఉక్కు పిడికిలిలో చిక్కుకొని విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో ఆంక్షలు ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు కొనసాగించాలన్న అంశంలో అధ్యక్షుడు ట్రంప్, వివిధ రాష్ట్రాల గవర్నర్ల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ అంశంలో అధ్యక్షుడిదే తుది నిర్ణయమని, మార్కెట్లు ఎప్పుడు తెరవాలో త్వరలోనే వెల్లడిస్తామని ట్రంప్ చెబుతుంటే, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు విభేదిస్తున్నారు. తమ రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తామే ఆ పని చేస్తామని అంటున్నారు. అలా వ్యాఖ్యానించిన గవర్నర్లలో డెమొక్రాట్లతో పాటుగా రిపబ్లికన్లు ఉన్నారు. దీనిపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పష్టతనిచ్చారు. ‘వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడం గవర్నర్ల చేతుల్లో ఉంటుందని కొందరు చెబుతున్నారు. కానీ అది సరైనది కాదు. అధ్యక్షుడే అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ పాటించాలి’అని అన్నారు. స్పెయిన్‌లో పాక్షికంగా లాక్డౌన్ ఎత్తివేత స్పెయిన్‌లో సోమవారం నుంచి పాక్షికంగా లాక్డౌన్ ఎత్తివేశారు. నిర్మాణ, తయారీ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకొని కార్మికులు విధులకు హాజరయ్యారు. పబ్లిక్ ప్లేస్‌లు, పార్కులు, రెస్టారెంట్లు, బార్లు మాత్రం లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. ఏప్రిల్ 25వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఎన్నికలకు వెళుతున్న తొలిదేశంగా దక్షిణ కొరియా వార్తల్లో నిలిచింది. నేషనల్ అసెంబ్లీలో 300 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. కరోనా కట్టడి, ఆర్థిక స్థితిగతులు ఎన్నికల అంశంగా మారాయి. ► కేసులు అదుపులోకి వస్తే మే 11 నుంచి ఆంక్షలు ఎత్తివేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. ► రష్యాలో మంగళవారం 2,774 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21వేలు దాటిపోయింది. ► రష్యా సరిహద్దుగా ఉండే చైనా ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 89 కొత్త కేసులు నమోదయ్యాయి. మోదీ నిర్ణయం భేష్ : డబ్ల్యూహెచ్ఓ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. ‘భారత్‌లో కరోనా కేసులు ఎంతవరకు తగ్గుముఖం పడతాయో ఇప్పట్నుంచో చెప్పలేంగానీ దేశం ఆరువారాల పాటు లాక్డౌన్లో ఉండడం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తా రని, దీని వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చు’అని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రాపాల్ సింగ్ అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతు న్నప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తోంద ని ఆమె కొనియాడారు. -
మార్కెట్‌కు ట్రంప్ షాక్!
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధభయాలు మళ్లీ చెలరేగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,600 పాయింట్ల వద్దకు చేరగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు త్వరలో ఒక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలను ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తుంచేశారు. చైనా వస్తువులపై సుంకాలు విధిస్తామని అకస్మాత్తుగా ఆయన ట్వీట్ చేయడం ప్రపంచ మార్కెట్లను నష్టాల పాలు చేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు పతనమై, 38,600 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. సేవల రంగం మంద వృద్ధి ఈ ఏడాది ఏప్రిల్‌లో నికాయ్ మార్కెట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 51కు పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఇది 52గా ఉంది. గడిచిన ఏడు నెలల కాలంలో సేవల రంగంలో ఇదే అత్యంత మందగమన వృద్ధి. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ వ్యాపార, విస్తరణ ప్రణాళికలను పలు కంపెనీలు వాయిదా వేయడంతో ఈ మందగమనం చోటు చేసుకుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీన పడింది. డాలర్‌తో రూపాయి మారకం 18 పైసలు తగ్గి 69.40 వద్ద ముగిసింది. ఇటీవల జోరుగా వస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం గండి కొట్టగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు భారీగా తగ్గినా స్టాక్ సూచీల పతనం ఆగలేదు. భారీ నష్టాలతో ఆరంభం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు ట్వీట్ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో మన స్టాక్ మార్కెట్ కూడా భారీ నష్టాలతోనే ఆరంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 244 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 106 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యలో ఈ నష్టాలు ఒకింత తగ్గినా, రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 453 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల వరకూ నష్టపోయాయి. మరిన్ని విశేషాలు... ►స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.25 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.25 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.150.37 లక్షల కోట్లకు చేరింది. ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, ఓఎన్జీసీలు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ► వివిధ బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్‌ను తగ్గించడంతో యస్ బ్యాంక్ షేర్ 5.3 శాతం నష్టంతో రూ.166 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.2,135 కోట్లు తగ్గి రూ.38,516 కోట్లకు పడిపోయింది. ఈ బ్యాంక్ లాంగ్‌టర్మ్ రేటింగ్స్‌ను దేశీయ రేటింగ్ సంస్థ, ఇక్రా తగ్గించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► మెరియా ప్లాంట్‌కు అమెరికా ఎఫ్‌డీఏ 14 పరిశీలనలను వెల్లడించడంతో క్యాడిలా హెల్త్‌కేర్ షేర్ తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.292కు పడిపోయింది. చివరకు 1 శాతం లాభంతో 308 వద్ద ముగిసింది. ► టాటా స్టీల్ షేర్ 2.2 శాతం నష్టంతో రూ.535 వద్ద ముగిసింది. టాటా స్టీల్, థిసన్క్రప్ల జాయింట్ వెంచర్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల కారణంగా ఈ షేర్ నష్టపోయింది. ► ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు 2% వరకూ లాభపడ్డాయి. ► దేశీ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, కొన్ని షేర్లు మాత్రం ప్రతికూలతలను ఎదురీది మంచి లాభాలను నమోదుచేశాయి. మోర్పెన్ ల్యాబ్స్ షేరు ధర 20 శాతం, టాటా కెమికల్స్ షేర్ 8 శాతం. అలెంబిక్ ఫార్మా 3 శాతం చొప్పున ఎగబాకాయి. ట్రంప్ ట్వీట్‌తో పతనమైన ప్రపంచ మార్కెట్లు అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం జరుగుతున్న చర్చల్లో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో చర్చలు నత్త నడకన నడుస్తున్నాయని, 20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ప్రస్తుతం 10 శాతంగా ఉన్న సుంకాలను 25 శాతానికి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ట్వీట్ చేయడంతో సోమవారం ప్రపంప మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. కాగా వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఈ బుధవారం చర్చల నిమిత్తం చైనా అధికారులు వాషింగ్టన్కు రానున్నారు. ట్రంప్ ట్వీట్ నేపథ్యంలో ఈ చర్చలను రద్దు చేసుకోవాలని చైనా ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఒత్తిడిలో చర్చలు జరపలేమని చైనా అధికారులు వ్యాఖ్యానించడంతో నష్టాలు మరింత పెరిగాయి. చైనాకు చెందిన షాంఘై సూచీ 5.5 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 3 శాతం, కొరియా కోస్పీ 1 శాతం రేంజ్లో పడిపోయాయి. పిల్లల దినోత్సవం కారణంగా జపాన్ స్టాక్ మార్కెట్ పనిచేయలేదు. అయితే నికాయ్ 225 సూచీ ఫ్యూచర్స్ 2 శాతం నష్టపోయింది. చైనా స్టాక్ మార్కెట్ మూడేళ్ల కనిష్టానికి చేరింది. ఇక అమెరికాకు చెందిన డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఫ్యూచర్స్ 1.7 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ ఫ్యూచర్స్ 1.6 శాతం వరకూ కుదేలయ్యాయి. ఆరంభంలోనే యూరప్ మార్కెట్లు 2 శాతం మేర నష్టపోయాయి. -
ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?
న్యూఢిల్లీ: అమెరికా 45 అధ్యక్షుడిగా ట్రంప్ చేపట్టనున్న విధానాలు, వివిధ పరిపాలనా సంస్కరణలు మన దేశాన్నికూడా ప్రమాదంలోకి నెట్టనున్నాయా? వివాదాస్పద నిర్ణయంతో ముస్లిందేశాలకు గట్టి షాకిచ్చిన ట్రంప్ మన మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయనున్నాడా? ఇపుడిదే చర్చ మార్కెట్ నిపుణులను ఆలోచనలో పడవేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లపై తక్కువ ప్రభావం ఉండనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేసియా లాంటి దేశాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. వీటి ఆర్థిక వ్యవస్థల కంటే దేశీయంగా తక్కువగా ఉండనుందని భావిస్తున్నారు. లోయర్ ఫిస్కల్ రేటు, కరెంట్ ఖాతా లోటుతో బలంగా ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విధానాలు ఎఫెక్ట్ పెద్దగా ఉండదని భావిస్తున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ దేశీయంగా తటస్థమని నోమురా ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుని అంచనా. బలమైన ఆర్థిక వ్యవస్త, తక్కువ అంతర్జాతీయ వ్యాపారం కారణంగా ఇతర మార్కెట్లతో పోలిస్తే సాంకేతికంగా బలంగా ఉన్నట్టు చెప్పారు. టీపీపీలో ఒప్పందంలో ఇండియా భాగస్వామ్యం లేనందున అమెరికా చేపట్టిన వ్యాపార రక్షణాత్మక చర్యల ప్రభావం చాలా పరోక్షంగా ఉండనున్నట్టు చెప్పారు. అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థలకు కొంత నష్టమేనని తెలిపింది. అలాగే అమెరికా సరిహద్దు పన్ను పెరుగుదల ఔషధ తయారీ, టెక్స్ టైల్స్, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, ఆటో ఉత్పత్తులను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చైనా, అమెరికా ట్రేడ్ వార్ చైనా, లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టనుందని నోమురా ఎనలిస్ట్ అంచనావేశారు. అలాగే హాంక్ కాంగ్ జీడీపీ లో 25శాతం వాటావున్న ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రాపర్టీ మార్కెట్ కి పెద్ద దెబ్బేనని వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని పడవేయనున్నాయి? టంపోనమిక్స్ ఫలితాలు మన ఆర్థిక వ్యవస్థపై సానుకూలమా? అనుకూలమా అనేది మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యగా ప్రమాణం చేసినప్పటినుంచి తనదైన దూకుడుతో తీసుకుంటున్న వివాదాస్పద పరిపాలన నిర్ణయాలు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏడు ముస్లిం దేశాలకు షాకిస్తూ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అమెరికాలో రెండో రోజూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.