విమాన ప్రమాదం: ట్రంప్ శిబిరంలో కలకలం | Mike Pence Vice-Presidential Candidate of Republican party, escapes in a Plane accident | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం: ట్రంప్ శిబిరంలో కలకలం

Published Fri, Oct 28 2016 8:44 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ను బయటికి తీసుకొస్తున్న రెస్క్యూ టీమ్ - Sakshi

ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ను బయటికి తీసుకొస్తున్న రెస్క్యూ టీమ్

న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ సహచరుడు, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్  ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలోని లాగార్డియా ఎయిర్ పోర్టులో గురువారం విమానం ల్యాండ్ అవుతోన్న సమయంలో ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జారియిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రెస్క్యూ బలగాలను రంగంలోకి దింపారు. మైక్ పెన్స్, ఆన భార్య, పిల్లలు సహా విమానంలో 31 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రంప్ టవర్స్ లో గురువారం రాత్రి నిర్వహించతలపెట్టిన విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మైక్ రద్దుచేసుకున్నారు.

వర్షం కారణంగా ఎయిర్ పోర్టు రన్ వేపై నీరు నిలిచిపోయిందని, అందుకే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎయిర్ పోర్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. విమాన ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ట్రంప్.. తన సహచరుడు మైక్ కు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నారు. గండం గట్టెక్కి విమానంలో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా బయటపడటం సంతోషకరమని ట్రంప్ అధికార ప్రతినధులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నుంచి పెన్ తమ రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ ప్రతినిధులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement