అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాసిక్యూటర్ల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నందున న్యూయార్క్ పోలీసులు గట్టి బంధోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రహదారులను బారికేడ్లతో బ్లాక్ చేయడమే గాక కోర్లులోని ఇతర గదులను సైతం మూసేస్తన్నట్లు సమాచారం. శృంగార తారతో సంబంధం బయటపడుకుండా ఉండేందుకు చెల్లించిన డబ్బు కేసులో ట్రంప్‌పై వచ్చిన నేరారోపణ రుజువ్వడంతో.. ట్రంప్ అరెస్టు ఖాయమైన నేపథ్యంలో ముందుగానే కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోయి విచారణకు హాజరు అవ్వాలని ట్రంప్ భావించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ మంగళవారం మధ్యాహ్నం మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ముంగిట హాజరుకానున్నారు. ఆయన లొంగుబాటు నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక నిరసనలకు పాల్పడకుండా ఉండేలా ముందుస్తుగా గట్టి బంధోబస్తును ఏర్పాటు చేశారు న్యూయార్క్ పోలీసులు. అంతేగాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా భద్రతను మరింత కఠినతరం చేసేలా వ్యూహం సిద్దం చేసినట్లు పేర్కొన్నారు.
అయితే న్యూయార్క్ నగరానికి ప్రస్తుతానికి ఎలాంటి భద్రత బెదిరింపులు రాలేదని తెలిపారు. తమ డిపార్ట్‌మెంట్ చాలా అప్రమత్తంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను శాంతియుతంగా వినయోగించుకోవాలని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్‌పై నమోదైన కేసును రిపబ్లికన్ శాసన సభ్యుడు మార్జోరీ టేలర్ గ్రీన్‌మాత్రం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆమె కోర్ట్‌కి సమీపంలో ఉన్న పార్క్ వద్ద నిరసనను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో.. న్యాయ వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా నిరశిస్తాను. అలాగే హింసను ప్రేరేపించేలా లేదా చేసే వారిని వ్యతిరేకిస్తాను అని టేలర్ ట్వీట్‌లో పేర్కొంది. కాగా 2021 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మద్దతదారులు వైట్ హైస్‌పై దాడి చేసి అల్లర్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
(చదవండి: లైంగిక ఒప్పందం కేసు.. అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!)
Comments
Please login to add a commentAdd a comment