surrender
-
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు. -
మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్‌గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్‌గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు. -
జూన్-2న తీహార్ అధికారుల ఎదుట లొంగిపోనున్న కేజ్రీవాల్
-
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
‘నా భార్యను అందుకే హత్య చేశాను’ అంటూ..!
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే దంపతులలో ఎవరైనా వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే వారి బాంధవ్యం బీటలు వారుతుంది. అప్పుడు పరిస్థితులు ఎంతవరకైనా దారితీస్తాయి. ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్ దెహాత్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్య గొంతునులిమి హత్యచేశాడు. తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి సరెండర్ అయ్యాడు. అతను పోలీసులకు ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రసూల్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండవర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి చెందిన ములాయం సంఖ్వార్ భార్య ఖుష్బూ కొన్ని రోజుల క్రితం వారి ఎదురింటిలో ఉంటున్న ఆమె ప్రేమికుడు వివేక్‌తో పాటు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో ములాయం సంఖ్వార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ ఉదంతం పోలీస్‌స్టేషన్ వరకూ చేరుకుంది. అక్కడ భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిరిద్దరూ తిరిగి కలిసివుండసాగారు. అయితే భార్య గతంలో ప్రియుడితో వెళ్లిపోయిన విషయాన్ని ములాయం సంఖ్వార్ మరచిపోలేకపోయాడు. దీంతో గత మూడు రోజులుగా భార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ములాయం తన భార్య ఖుష్బూ గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కుబడి
ఇద్దరు గ్రామస్తుల మధ్యన తమలో ఎవరు గొప్ప భక్తుడనే వాదన మొదలయ్యింది. వందలాది పుణ్య క్షేత్రాలు తిరిగి వచ్చిన తను గొప్ప భక్తుడినని ఒక గ్రామస్తుడు వాదించాడు. ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసిన తానే నిజమైన భక్తుడని మరో గ్రామస్తుడు వాదించసాగాడు. వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో గ్రామం గుండా పోతున్న ఓ గురువును వారు ఆశ్రయించారు. ‘‘మా భక్తి నిరూపించుకోడానికి ఏమైనా చేస్తాం, ఎన్ని సాహసకార్యాలైనా చేయగలం’’ అని గట్టిగట్టిగా అరిచి చెప్పారు. వారిద్దరి వాదనలూ ఓపికగా విన్నాడు గురువు. చిన్న నవ్వు నవ్వి ‘‘మీలో ఎవరు నిజమైన భక్తుడో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నాతోపాటు రండి, ఎన్నో మహిమలను చూపే దేవుడు మా ఆశ్రమంలో ఉన్నాడు. ఆ దేవుడికి మీలో ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారే నిజమైన భక్తులు’’ అని సెలవిచ్చాడు. ‘‘అదెంత పని?’’ అని వారిద్దరూ ముందుకు వచ్చారు. ‘‘అయితే మా దేవుడికి తలనీలాలు ఎవరైతే సమర్పిస్తారో వారికి ఆ తదనంతరం తల పైన ఒక్క వెంట్రుక కూడా మొలకెత్తదు. దానికి సంసిద్ధులైనవారు మాత్రమే నాతో రాగలరు’’ అని గురువు చెప్పాడు. అంతే... అప్పటిదాకా గొప్ప భక్తులమని చెప్పుకున్న ఇద్దరూ, చల్లగా అక్కడినుంచి జారుకోబోయారు. వారిని ఆపిన గురువు ‘‘భవిష్యత్తులో వెంట్రుకలు రావని చెప్పేసరికి మీరు తలనీలాలు ఇవ్వడానికే సుముఖత చూపడం లేదు. బాహ్య సౌందర్యంలో చిన్న మార్పుకు సైతం అంగీకరించని మీరు అంతః సౌందర్యంలో మార్పులకు అంగీకరిస్తారా..? నిజమైన భక్తుడు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేయడు. సంపూర్ణంగా తనను నమ్మి సర్వస్వ శరణాగతి కోరే వారి వెంటే దేవుడు సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటాడు’’ అని వివరించాడు. తప్పు తెలుసుకున్న ఆ ఇద్దరు గ్రామస్తులు గురువును క్షమాపణ కోరారు. అమృత బిందువులు ♦ ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మలు కూడిన మనిషి జీవితం సఫలం. ♦ వేడినీరు ఒకటే... కాని కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది. ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది. రాగద్వేషాలు ఒక్కటే కాని ... ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు అవే. దుఃఖం కలిగినప్పుడు కన్నీటి ఓదార్పులు అవే. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బందోబస్తుకు ప్లాన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాసిక్యూటర్ల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నందున న్యూయార్క్ పోలీసులు గట్టి బంధోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రహదారులను బారికేడ్లతో బ్లాక్ చేయడమే గాక కోర్లులోని ఇతర గదులను సైతం మూసేస్తన్నట్లు సమాచారం. శృంగార తారతో సంబంధం బయటపడుకుండా ఉండేందుకు చెల్లించిన డబ్బు కేసులో ట్రంప్‌పై వచ్చిన నేరారోపణ రుజువ్వడంతో.. ట్రంప్ అరెస్టు ఖాయమైన నేపథ్యంలో ముందుగానే కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోయి విచారణకు హాజరు అవ్వాలని ట్రంప్ భావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మంగళవారం మధ్యాహ్నం మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ముంగిట హాజరుకానున్నారు. ఆయన లొంగుబాటు నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక నిరసనలకు పాల్పడకుండా ఉండేలా ముందుస్తుగా గట్టి బంధోబస్తును ఏర్పాటు చేశారు న్యూయార్క్ పోలీసులు. అంతేగాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా భద్రతను మరింత కఠినతరం చేసేలా వ్యూహం సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. అయితే న్యూయార్క్ నగరానికి ప్రస్తుతానికి ఎలాంటి భద్రత బెదిరింపులు రాలేదని తెలిపారు. తమ డిపార్ట్మెంట్ చాలా అప్రమత్తంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను శాంతియుతంగా వినయోగించుకోవాలని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్‌పై నమోదైన కేసును రిపబ్లికన్ శాసన సభ్యుడు మార్జోరీ టేలర్ గ్రీన్మాత్రం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆమె కోర్ట్‌కి సమీపంలో ఉన్న పార్క్ వద్ద నిరసనను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో.. న్యాయ వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా నిరశిస్తాను. అలాగే హింసను ప్రేరేపించేలా లేదా చేసే వారిని వ్యతిరేకిస్తాను అని టేలర్ ట్వీట్లో పేర్కొంది. కాగా 2021 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మద్దతదారులు వైట్ హైస్పై దాడి చేసి అల్లర్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: లైంగిక ఒప్పందం కేసు.. అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!) -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్‌వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్‌వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
కృష్ణయ్య హత్యకేసులో ఆ ఇద్దరూ లొంగుబాటు
ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. గతనెల 15న జరిగిన కృష్ణయ్య హత్యకేసులో చార్జీషీట్లో నిందితులుగా పది మందిని చేర్చారు. హత్య జరిగాక 3 రోజుల వ్యవధిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఏ9గా ఉన్న తమ్మినేని కో టేశ్వరరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు), ఏ10గా ఉన్న ఎల్లంపల్లి నాగయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి అరెస్టులో జాప్యం జరగడంతో పోలీసుల తీరుపై కృష్ణయ్య కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మౌనిక ఎదుట కోటేశ్వరరావు, నాగయ్య లొంగిపోయారు. న్యాయవాది కొల్లి సత్యనా రాయణ వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరినీ జిల్లా జైలుకు తరలించారు. -
కూతురు ఓ నిరుపేదను పెళ్లి చేసుకుందని..
చెన్నై: పెద్దగా చదువుకోని, నిరుపేద యువకుడిని తన కూతురు పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె తండ్రి వారిద్దరినీ హత్య చేశాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా ట్యుటికోరిన్‌లో ఈ పరువు హత్య దారుణం చోటుచేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన మానిక్‌రాజ్(26), రేష్మా(20) జూన్ 29న వివాహం చేసుకుని, ఎటో వెళ్లిపోయారు. చివరికి గ్రామస్తులు జోక్యం చేసుకుని ఆ దంపతుల జోలికి వెళ్లవద్దని రేష్మా కుటుంబాన్ని ఒప్పించారు. దీంతో, వారు నాలుగు రోజుల క్రితం తిరిగి సొంతూరులోని మానిక్‌రాజ్ ఇంటికి వచ్చి ఉంటున్నారు. సోమవారం వారు ఆ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. రేష్మా తండ్రి ముత్తుకుట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేష్మా కాలేజీలో చదువుకుంటుండగా, రోజుకూలీగా పనిచేసుకునే మానిక్‌రాజ్ స్కూలు విద్యతోనే ఆపేశాడు. అతడు నచ్చకనే రేష్మా కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
Navjot Sidhu: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ఛండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేతనవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు లొంగిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కారణాల వల్ల తాను లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంతనే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధూ..పటియాల కోర్టు ముందు లొంగిపోయారు. Patiala, Punjab | He (Navjot Singh Sidhu) has surrendered himself before Chief Judicial Magistrate. He is under judicial custody. Medical examination and other legal procedures will be adopted: Surinder Dalla, media advisor to Congress leader Navjot Singh Sidhu pic.twitter.com/U13TDDOPju — ANI (@ANI) May 20, 2022 -
Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్
కీవ్: ఉక్రెయిన్‌లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్‌పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది. ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది. చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్ మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు. మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్‌తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. సైనికుడి నేరాంగీకారం యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు. -
తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మందికి రావాల్సిన సరెండర్ సెలవుల డబ్బులను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా 30 రోజుల పాటు ఉండే సరెండర్ (ఆర్జిత సెలవులు) లీవులను ఉపయోగించుకోలేని వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి జూన్ నెలలో చెల్లించాల్సిన సరెండర్ లీవుల డబ్బులు ఇప్పటివరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్ల చుట్టూ తిరిగి అలసి పోతున్నామే తప్ప సమస్య మాత్రం తీరడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్ ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి పోలీస్ శాఖ అంటేనే అత్యవసరమైన విభాగం. పండుగలు, అనుకోని ఘటనలు, సభలు, సమావేశాలప్పుడు రోడ్డుపై బందోబస్తు నిర్వహించాల్సిందే. అది శాంతి భద్రతల విభాగమైనా, బెటాలియన్లు అయినా.. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిందే. దీని వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఉండే సాధారణ సెలవులనే వాడుకునే అవకాశం దక్కదని, కనీసం సరెండర్ లీవులకు సంబంధించిన డబ్బులైనా చెల్లిస్తే పిల్లల ఫీజులు లేదా ఇతరత్రా ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. ప్రతీ పోలీస్ ఉద్యోగికి రెండు సార్లు సరెండర్ లీవ్‌లకు డబ్బులు చెల్లిస్తారు. చదవండి: కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా.. ఏటా మొదటి ఆరునెలల కాలానికి వచ్చే 15 సెలవులకు జూన్ లేదా జూలైలో, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఉండే 15 రోజుల సెలవులకు జనవరిలో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది సిబ్బందికి జనవరి నుంచి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మంది సిబ్బందిలో 80 శాతం మందికి సరెండర్ సెలవుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వనం నుంచి జనంలోకి..
-
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్‌బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్‌గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదక్క డీజీపి ఎదుట లొంగిపోనున్నారు. శారదక్క లొంగుబాటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. (చదవండి: చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..) గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం బెజ్జరి. ఇటీవల శాదరక్క భర్త హరిభూషణ్ కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శారదక్క మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దానికి తోడు కరోనా పాజిటివ్ రావడం తో కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యం కారణంగా లొంగుబాటు కు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
-
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. '' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్ అయి 2019 వరకు మెంబర్‌గా వ్యవహరించాడు. అయితే తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్‌తో పాట 2020 మినప అటాక్‌లో సైతం రంజిత్ చురుగ్గా వ్యవహరించాడు. కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు. -
మావోయిస్టుల్లారా.. లొంగిపోండి: డీజీపీ పిలుపు
జయపురం: ఉద్యమం వీడి జనస్రవంతిలో కలిసిపోవాలని రాష్ట్ర డీజీపీ అభయ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన నవరంగపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతలపై సు«దీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఒడిశా–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల కట్టడికి చేపట్టాల్సిన పలు వ్యూహాలను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలోని ఆదర్శ పోలీస్‌స్టేషన్, రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల జవానులు, పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన కరోనా కష్టకాల పరిస్థితులతో భయాందోళనలో ఉన్న ప్రజలను మరింత భీతి కలిగించవద్దని మావోయిస్టులకు సూచించారు. ప్రజలంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులను కోరారు. తమ వద్దకు వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో ఆయనతో పాటు నవరంగపూర్ ఎస్పీ ప్రహ్లాద్ సహాయి మీనా, విజిలెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్.కె.శర్మ, నవరంగపూర్ తహసీల్దారు రవీంద్రకుమార్ రౌత్, పట్టణ పోలీస్ అధికారి తారిక్ అహ్మద్ ఉన్నారు. -
దంతెవాడలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
చత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్ గ్రూప్స్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు 'లాన్ వర్రటు' పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
లొంగిపోయిన ఉగ్రవాది
-
కోయి గోలి నహీ చలేగా..
కశ్మీర్: ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యల సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఓ ఉగ్రవాది.. భద్రతా దళాల ముందు లొంగిపోయినట్లు ఆర్మీ శుక్రవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. సరెండర్ సందర్భంగా అధికారులు అతని నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక సైనికుడు, పోరాట భద్రతా సామగ్రిని ధరించి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. ఇక లొంగిపోయిన వ్యక్తిని జహంగీర్ భట్‌గా గుర్తించారు. ఈ సంఘటన ఓ తోటలో జరిగింది. కేవలం ప్యాంట్ మాత్రమే ధరించిన ఉగ్రవాది చేతులు పైకి లేపి, సైనికుడిని సమీపించడం వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా సైనికుడు అతడికి ఎటువంటి హాని జరగదని భరోసా ఇస్తాడు. "కోయి గోలి నహీ చలేగా" (ఎవరూ కాల్పులు జరపవద్దు) అని అతను తన సహచరులకు చెప్పడం వీడియోలో చూడవచ్చు. అనంతరం ఉగ్రవాదిని ఉద్దేశించి ‘కుమారా నీకు ఏమీ జరగదు’ అని చెప్తాడు. అంతేకాక అతడికి మంచినీళ్లు ఇవ్వండి అని మరో సైనికుడిని ఆదేశిస్తాడు. (చదవండి: బీజేపీ సర్పంచ్‌ను కాల్చి చంపారు) ఆర్మీ విడుదల చేసిన మరో వీడియో క్లిప్‌లో.. ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలపడం చూడవచ్చు. ఆ సమయంలో సిబ్బంది "అతన్ని మళ్ళీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వవద్దు" అని జహంగీర్ తండ్రికి సూచిస్తారు. ఈ సందర్భంగా జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. "అక్టోబర్ 13 న, ఒక ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అతడి వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్) తో కనిపించకుండా పోయాయి. అదే రోజు, చాదూరాకు చెందిన జహంగీర్ భట్ తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జరిపిన ఉమ్మడి ఆపరేషన్‌లో అతడిని గుర్తించాము. ప్రోటోకాల్ ప్రకారం, భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్ లొంగిపోయాడు" అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం) "జహంగీర్‌ని కార్నర్ చేసినప్పుడు అతని తండ్రి అక్కడే ఉన్నాడు. భద్రతా దళాలు, అతడి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అతడిని ప్రమాదం నుంచి కాపాడాము. భారత సైన్యం ఉగ్రవాద నియామకాలను నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. యువత ఉగ్రవాదంలో చేరినట్లయితే, వారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. -
లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?
-
గణపతి ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే. ఖండించని మావోయిస్టు పార్టీ.. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్‌ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. లొంగిపోతాడని అనుకోవడం లేదు: జంపన్న సాక్షి, హైదరాబాద్: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు.