వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు.
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. శనివారం సాయంత్రం భూమా నాగిరెడ్డిని నంద్యాలలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. భూమాకు అనారోగ్యంగా ఉందని ఆయన తరపు న్యాయవాది పటిషన్ వేశారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
భూమా నాగిరెడ్డి శనివారం మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు.
నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి.