bhooma nagireddy
-
ఇదేం దిగజారుడు రాజకీయం ?
-
చంద్రబాబు రాజకీయాలకు పావుగా అఖిల ప్రియ
-
గుండెపోటా? వెన్నుపోటా ?
-
వెనుకబడిన తరగతులకు బడ్జెట్లో పెద్దపీట
-
పదవి ఇవ్వలేదని ఒత్తిడే భూమాను కుంగ దీసిందా ?
-
మా బలాన్ని కబ్జా చేయాలనే..
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్న దుగ్ధతోనే తాము పార్టీ మారుతున్నట్లు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. జిల్లా నుంచి గెలిచినవాళ్లంతా మంచి క్యారెక్టర్, విజన్ ఉన్నవాళ్లని.. అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారని ఆయన చెప్పారు. తమ బలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నట్లుగా ఓ ప్రకటన ఇచ్చారని ఆయన అన్నారు. ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్లారో ఈవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు ఎన్నికల కౌంటింగ్ ముగిసి.. తాను గెలిచినట్లు తెలిసిన మరుక్షణం నుంచే తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశారని భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రతిరోజూ రాస్తున్నారని... దాన్ని ఎన్నిసార్లు ఖండించాలని ప్రశ్నించారు. -
నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు
* ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత * ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక * ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గరని స్పష్టీకరణ * సర్కారుపై తమకు నమ్మకం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తన తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదేపదే వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ప్రభుత్వం తన తండ్రిని అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఆయనను ఎంతగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే అంతగా ఎదుగుతారని, ఏ మాత్రం వెనక్కి తగ్గరని స్పష్టంచేశారు. ఆమె శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రికి మధుమేహం, రక్తపోటు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదన్నారు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరని చెప్పారు. తమను వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రమేయం ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారని గుర్తుచేశారు. తన తండ్రికి హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా ‘నిమ్స్’కు తరలించడానికి అభ్యంతరం ఏమిటని ఆమె సూటిగా ప్రశ్నించారు. పథకం ప్రకారమే...: ఒక పథకం ప్రకారం తన తండ్రిని ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగిన సంఘటన ను ఆమె సవివరంగా తెలిపారు.తన హక్కులకు భంగం కలిగించినందునే పోలీసులను తన తరఫున తండ్రి నిలదీశారన్నారు. భూమాకు ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత: బొత్స తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఆరోగ్యపరంగా ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న భూమాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సలహాఇస్తే పొరుగు రాష్ట్రానికి పంపడానికి ఎస్కార్టు లేదని నిరాకరించడమేమిటని ఆగ్రహం వెలిబుచ్చారు. ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ మరో రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. -
రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?
-
రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?
ఒక మహిళా ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రం నుంచి ఎలా వెళ్లగొడతారు, తాను ఆమె వెంట లేనప్పుడు ఎలా మాట్లాడతారని తన తండ్రి భూమా నాగిరెడ్డి అడిగినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి అరెస్టు, దాని పూర్వాపరాలపై ఆమె హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా అవమానిస్తారని నాగిరెడ్డి అడిగారు తప్ప.. అసలు ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఎందుకు కూతురితో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేని ఎలా వెళ్లగొడతారని అడిగారు రూల్ బుక్ చూపించాలని గట్టిగా అడిగారు అంతే తప్ప అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వాడలేదు కానీ సంబంధం లేకపోయినా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సండ్ర వెంకట వీరయ్య మీద కేసు ఉన్నప్పుడు చిన్న నొప్పి ఉందని రాజమండ్రి ఆస్పత్రికి పంపారు. ఇప్పుడు నాన్న గుండె రోగి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. షుగర్ ఉంది, ఈ ఘటనతో ఆయనకు బీపీ వచ్చింది. అయినా నిమ్స్ కు పంపడానికి బోలెడంత సీన్ క్రియేట్ చేశారు గతంలో కూడా ముందు నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు, తర్వాత నిమ్స్‌కు పంపారు ఇప్పుడు కలెక్టర్ ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్ జైలుకు పంపారు. వాళ్లు ఇచ్చే నివేదికను బట్టే నిమ్స్‌కు పంపుతారట ఆ ముగ్గురిలో కార్డియాలజిస్టులు ఎవరూ లేరు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది, సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు భూమా నాగిరెడ్డినే ఇబ్బందిపెడుతున్నాం, మిగిలిన వాళ్లు మాకొక లెక్కా అన్న సందేశాన్ని పంపుదామనుకుంటున్నారు కానీ ఇలా చేస్తే ఆయన ఇంకా రైజ్ అవుతారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది నాన్న జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి రేపు ఆయనకేమైనా జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అవుతుంది ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను అడ్డుకున్నది కూడా పోలీసులే డీఎస్పీ నాతో ఎలా మాట్లాడారో, మేం ఎలా చెప్పామో అన్నీ తెలుస్తాయి మేం అసెంబ్లీలో హక్కుల తీర్మానం పెడతాం. -
భూమాకి సెక్యూరిటీ ఇవ్వలేం
-
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టు.. ఉద్రిక్తత
* ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు * అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే కేసు బనాయింపు నంద్యాల టౌన్: పీఏసీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్సీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై సెక్షన్ 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అసలేం జరిగింది... :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్లో కూర్చున్నారు. కొద్దిసేపు తర్వాత భూమా బయటకు వెళ్లడంతో అఖిలప్రియ పరిచయస్తులను పలకరిస్తూ ఉన్నారు. ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశం అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయింటింగ్ స్టాల్లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో.. వీరిద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు. భూమాపై కేసు నమోదుకు వ్యూహం.. అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను నిలదీశారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్ అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా పోలీస్ అధికారులపై ఒత్తిడి తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు సం దర్భంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సా ర్సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు. భూమా వ్యాఖ్యలకు కులం రంగు..: ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్ ఎస్ఐ సూర్యమౌళి భూ మాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్ కేసులను(ఎఫ్ఐఆర్ నెం.132/2015) నమోదు చేశారు. ‘డోంట్టచ్ మీ, నేను ప్రజాప్రతినిధిని’ అని మీడియా సాక్షిగా భూమా చేసిన వ్యాఖ్యలకు కులం రంగు పూశారు. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ ఏమన్నారో ఆమె మాటల్లోనే... ఓటు వేయడానికి నేను, నాన్నగారు కలిసి వెళ్లాం. నాన్నగారు చిన్న పనిమీద బయటకు వచ్చారు. క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం. నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలింది కూడా లేదు అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్‌గా మాట్లాడారు. టీడీపీ ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్‌గా మాట్లాడారు. గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా .. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా వాళ్లు అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు అక్కడ పోలీసులు మాట్లాడినదానిపై మేం ఏమైనా చర్యలు తీసుకోగలమా అని చూస్తున్నాం. -
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
-
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
నంద్యాల:నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పదకొండు మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. నంద్యాల పురపాలక సమావేశంలో ఘర్షణకు ప్రేరేపించి టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారని భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆ సమావేశం సజావుగా సాగడం లేదని ప్రశ్నించినందుకు భూమాపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. -
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
-
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. శనివారం సాయంత్రం భూమా నాగిరెడ్డిని నంద్యాలలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. భూమాకు అనారోగ్యంగా ఉందని ఆయన తరపు న్యాయవాది పటిషన్ వేశారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. భూమా నాగిరెడ్డి శనివారం మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
భూమా నాగిరెడ్డి లొంగుబాటు
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. కాగా భూమా నాగిరెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాం, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
కాసేపట్లో పోలీసుల ముందుకు భూమా నాగిరెడ్డి
-
చట్టాన్ని గౌరవించి లొంగిపోతున్నా: భూమా నాగిరెడ్డి
ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. చట్టాన్ని గౌరవించి తాను పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. భూమా ఇంటిచుట్టూ భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆయన లొంగిపోనున్నట్లు చెప్పడంతో.. నంద్యాలకు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ తదితరులు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయిరెడ్డి కూడా కాసేపట్లో నంద్యాలకు చేరుకుంటారు. -
నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాటి మున్సిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. దాంతో నంద్యాల అంతా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను అడిగినా ఎలాంటి సమాధానం రావట్లేదు. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
మహానేతను నిందించడానికే అసెంబ్లీ సమావేశాలు..
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని, మహానేత కుటుంబాన్ని నిందించడానికే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెట్టుకున్నట్టు ఉందని వైఎస్ఆర్ సీపీ నేత భూమానాగిరెడ్డి విమర్శించారు. ఊహాతీత బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలపై రుద్దడం నీచ రాజకీయాలకు నిదర్శనమని భూమా అన్నారు. నంద్యాల మున్సిపల్ కమిటీ సమావేశాన్ని భూమానాగిరెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిలర్ అనూషను భూమానాగిరెడ్డి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే ముట్టడి: భూమా
కర్నూలు: శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే రైతులతో కలిసి ముట్టడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. కృష్ణా జలాలకు సంబంధించిన బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమా డిమాండ్ చేశారు. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 854 అడుగులు ఉండేటట్లుగా నిర్వహించాలని ఐఏబీలో తీర్మానం చేశారు. అలాగే ఐఏబీలో చేసిన తీర్మానాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు పట్టుబడటంతో తుంగభద్ర డ్యామ్ నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు అంగీకరించారు. కర్నూలు కలెక్టరేట్లో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కు కడప ఎమ్మెల్యే, ఎంపీలు, కర్నూలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు. -
శోభా నాగిరెడ్డికి రక్షణ ఇవ్వని వాహనం
శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఆమెకు తగిన స్థాయిలో రక్షణ ఇవ్వలేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ఆర్ జనభేరిలో ఉత్సాహంగా పాల్గొన్న శోభా నాగిరెడ్డి, ప్రచారాన్ని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం కుప్పల నుంచి వాహనాన్ని పక్కకు తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాంతో ఒక్కసారిగా వాహనం నాలుగు పల్టీలు కొట్టింది. (చదవండి: శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు) సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే వెంటనే అలాంటి వాహనాల్లో వెంటనే బెలూన్లు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ముందు సీట్లలో కూర్చున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగదు. సురక్షితంగా ఉంటారు. కానీ, బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో బెలూన్లు తెరుచుకోలేదు. వాహనం ముందుభాగం తుక్కుతుక్కు అయిపోయింది. ముందు టైర్లు కూడా ఊడిపోయాయి. ముందున్న అద్దం పగిలిపోయింది, తలుపు కూడా ఉన్నట్టుండి తెరుచుకుంది. దాంతో తలుపు లోంచి శోభానాగిరెడ్డి యబటకు పడిపోయారు. అందుకే ఆమెకు అంత తీవ్రస్థాయిలో గాయాలయ్యాయని తెలుస్తోంది.