శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే ముట్టడి: భూమా
శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే ముట్టడి: భూమా
Published Wed, Jul 30 2014 7:08 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
కర్నూలు: శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే రైతులతో కలిసి ముట్టడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. కృష్ణా జలాలకు సంబంధించిన బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమా డిమాండ్ చేశారు.
శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 854 అడుగులు ఉండేటట్లుగా నిర్వహించాలని ఐఏబీలో తీర్మానం చేశారు. అలాగే ఐఏబీలో చేసిన తీర్మానాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు పట్టుబడటంతో తుంగభద్ర డ్యామ్ నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు అంగీకరించారు.
కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కు కడప ఎమ్మెల్యే, ఎంపీలు, కర్నూలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు.
Advertisement