irrigation
-
మళ్లీ సాగునీటి సంఘాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. చెరువుల సంవత్సరంగా 2025! 2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది. -
ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
-
ఎన్నిక కాదు.. ఎంపికే!
సాక్షి, అమరావతి: సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలకు పదవులు పంచి పెట్టేలా 2018లో సవరించిన సాగు నీటి సంఘాల చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా 2019 ఫిబ్రవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నెంబరు 20)ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి 26 జిల్లాల కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నిక పేరుతో తాము ఎంపిక చేసిన నేతలు, కార్యకర్తలకే సాగు నీటి సంఘాల పదవులను టీడీపీ కూటమి పెద్దలు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 21,03,825 హెక్టార్లు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 1,85,804 హెక్టార్లు, చిన్న నీటి వనరుల విభాగంలో 5,55,056 హెక్టార్లు.. వెరసి 28,44,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది. నీటి వృథాకు అడ్డకట్ట వేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించి, దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో సాగు నీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటికి 2014 వరకూ సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికలు నిర్వహించింది. ఆయకట్టు రైతులు తమ ఓటు ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులను ఎన్నుకునేవారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం 2018లో ఆ విధానానికి స్వస్తి పలుకుతూ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో తమ వారికే పదవులు కట్టబెట్టేలా చట్టాన్ని సవరించి, సాగునీటి సంఘాలను నీరుగార్చింది. 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి రాష్ట్రంలో 26 జిల్లాల్లో సాగు నీటి సంఘాల ఎన్నికలకు సోమవారం కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. సంఘాల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, జల వనరుల శాఖ నుంచి ఇంకో అధికారిని నియమించారు. ఎన్నికల సిబ్బంది నియామకం ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ 40 రోజుల్లో అంటే నవంబర్ 27తో పూర్తవుతుంది. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
-
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్‌లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్‌లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్‌లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్‌తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
కళ్లెదుటే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు (కృష్ణ జలవిహార్)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి 31,866 పట్టాల రెగ్యులరైజ్... ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్‌లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కు విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. బెజవాడ ట్రాఫిక్ కష్టాలకు విముక్తి గుంటూరు నుంచి ట్రాఫిక్ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. రూ.500 కోట్లతో కరకట్ట గోడలు.. కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం. చిత్తశుద్ధితో నిర్మించారు వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది. – కసగోని జ్యోతి, రణదివెనగర్ శాశ్వత పరిష్కారం లభించింది రాణిగారితోట తారకరామనగర్ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది. – ఏలూరి వినయ్, తారకరామనగర్ సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్‌లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ -
కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. మాకు(బీఆర్ఎస్)కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హితవు పలికారు. ‘‘డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్ టెస్ట్ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్ మాకు లేదు అంటున్నారు.. ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు. .. మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు. .. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి. .. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కానీ, బీజేపీ కింద పని చెసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు?. కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ కు బరాజ్ కు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ‘‘మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీ చేయాలి. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
Congress vs BRS: ఇరిగేషన్ వార్ తారాస్థాయికి..
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి కేసీఆర్ సభ మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నల్లగొండలో ఉద్రిక్తత! కేసీఆర్ సభకు కౌంటర్‌గా.. నల్లగొండ క్లాక్ టవర్‌లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఒక్క దరఖాస్తు.. అధికారి చొరవ..
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్‌డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది. గతంలో చెక్‌డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్‌డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. కదిలిన అధికారి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్లో నిర్వహించారు. కడెం మండల ఇన్చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్‌బైక్‌పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
నీటిపారుదల అదనపు బాధ్యతలపై స్మితాసబర్వాల్ అయిష్టత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగడం పట్ల ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రభుత్వం వద్ద అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలకు ఆమె ఎందుకు రావడం లేదని ఇటీవల ఆ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించగా.. ఈ మేరకు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిషన్ భగీరథ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రజత్‌కుమార్ పదవీ విరమణ చేసిన సమయంలో స్మితా సబర్వాల్‌కు నీటిపారుదల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగి స్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జా రీచేశారు. అయితే ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. నీటిపారుదల శాఖ కార్య దర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆ పోస్టులో కొనసాగుతానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారని ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేయడానికి కూడా ఆమె అయిష్టత వ్యక్తంచేయడంతో రెండు వారాలుగా ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని వెల్లడించారు. -
ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే
శ్రీకాకుళం (పాత బస్టాండ్): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్‌తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్‌కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్‌కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్‌ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. -
ఇంత విషమా? కూసింత బాబుగారి వైపు చూడరా?
ఊహించిందే. ఎప్పటిలాగే విషపు రాతలు. సీమంతైనా మేలు చేశారా? అంటూ సీఎం జగన్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబుకు కొమ్ముకాస్తూ కాకమ్మ కథలు రాసింది ఈనాడు . అఫ్కోర్స్.. అది కర్నూల్లో రాయలసీమ గర్జన నేపథ్యంలో ఉక్రోశంతో రాసిందే!. కానీ. పరిస్థితులను ఒక్కసారి బేరీజూ వేసుకోవాలి కదా. ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? అన్నింటికి మించి తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే చంద్రబాబు ఘనతను కూడా ఒక్కసారైన గుర్తించాలి కదా!. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన బాబు రాయలసీమ లోనే కాదు, రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసారా?.. ఇదీ ఈనాడు గుర్తించాల్సిన ప్రధానమైన విషయం. అంతెందుకు సొంత నియోజకవర్గం కుప్పంలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయాడు. మరి సీఎం జగన్.. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తారు. బాబు హయాంలో కంటే.. సీఎం జగన్ హయాంలోనే ఇరిగేషన్ పనులు ఊపందుకున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అయినా ఇది జనమెరిగిన సత్యం. ► వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2 సంవత్సరాలు కరోనా ఉంది అని మరిచిపోతే ఎలా?.. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పనులను త్వరగతిన పూర్తి చేసే యత్నం చేస్తున్నారు కదా. ఓ.. బాబూ డైరెక్షన్ కదా.. అందుకే అవేమీ పేపర్‌కి ఎక్కవేమో!. ► ఇది పక్కన పెడితే.. రాయలసీమలో శ్రీ సిటీ సంగతి ఏంటి? అది ఆనాడు మహానేత వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీ పరిశ్రమల కేంద్రంగా విరజిల్లుతోంది. అచ్చం శ్రీసిటీ లాగా .. కడప కొప్పర్తిని అభివృద్ధి చేస్తున్నారు జన నేత వైఎస్ జగన్. మరి చంద్రబాబు ఏం చేశాడు?.. సీమ లో పుట్టి సీమకు ద్రోహం చేయడం తప్పించి!. ► కరువు సీమగా పేరొందిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. అప్పుడేం జరిగిందో ఈనాడుకు గుర్తు లేనట్లుంది. ఒకసారి గుర్తు చేద్దాం.. బాబుగారి(చంద్రబాబు) ఆదేశాల మేరకు, యెల్లో పార్టీ నేతలు దేవినేని ఉమ చౌదరి , కోడెల శివప్రసాదరావు చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ధర్నా చేసి మరీ రాయలసీమకు వైఎస్ జలాన్ని మళ్లిస్తున్నారని, ఇది జలదోపిడీ అంటూ ఆందోళన చేశారు. మరొకటి చూద్దాం.. ► మద్రాస్ లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో పదివేల ఉద్యోగాలు కల్పన కోసం హెచ్‌సీఎల్ ఏర్పాటు చేస్తామని.. ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంలో ప్రకటించారు. కానీ, సీఎంగా చంద్రబాబు చేసింది ఏంటి?.. శివనాడార్‌పై ఒత్తిడి తెచ్చి తన అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేయడమా?. ► కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో ఉన్నతమైంది ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ అనంతపురం నుంచి మంగళగిరికి తరలిపోయింది బాబుగారి దయవల్ల కాదా? ► శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) .. రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్ళు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు. పోనీ ఇవన్నీ పక్కనపెడితే.. ► కాపు గర్జన సందర్భంగా అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అని ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు. మరి అరెస్ట్ చేసింది కోస్తా కాపులను!. రాయలసీమ ద్రోహిగా బాబుగారు సాధించిన పై ఘనతలు.. బహుశా ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు, మిగిలిన యెల్లో మీడియా పేపర్లు.. ఛానెల్స్ దృష్టిలో ఏనాటికీ పడవేమో! -
ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
అన్నదాతపై జీఎస్టీ పిడుగు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భూతం సూక్ష్మసేద్యానికి విఘాతం కలిగిస్తోంది. వివిధ పంటల కోసం వ్యవసాయ భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలను ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు 12 శాతం జీఎస్టీ భరించాల్సిరావడమే దీనికి కారణం. సూక్ష్మసేద్యం కోసం ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే జీఎస్టీ సొమ్ము చెల్లించలేక రైతులు వెనుకడుగు వేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకుపైగానే ఖర్చుకానుంది. కానీ, జీఎస్టీ భారాన్ని మాత్రం ఆ వర్గాల రైతులు భరించాల్సి వస్తోంది. అంటే ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు అన్నివర్గాలూ జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తోంది. నాలుగెకరాల్లో సూక్ష్మసేద్యం నెలకొల్పాలంటే రూ. 12–16 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు వేల రూపాయలు ఖర్చయ్యే సూక్ష్మసేద్యం పరికరాలను ఉచితంగా బిగిస్తున్నా, జీఎస్టీని మాత్రం ఆయా రైతులు భరించాల్సి వస్తోంది. సూక్ష్మసేద్యంతో నీటి ఆదా...: సూక్ష్మసేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నందున ఈ ఏడాది కూడా పెద్దమొత్తంలో రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా రాష్ట్రంలో 43 శాతం(25 టీఎంసీల) నీటిని పొదుపు చేశారు. వివిధ రకాల పంటల సాగును నూతన పద్ధతుల ద్వారా ప్రోత్సహించారు. ఈ పథకాన్ని పంటల సాగుకు వాడటంతో 33 శాతం విద్యుత్ అంటే 1,703 లక్షల యూనిట్లు ఆదా అయినట్లేనని న్యాబ్కాన్స్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. మైక్రో ఇరిగేషన్ అమలు వల్ల 52 శాతం దిగుబడి పెరిగినట్లు గుర్తించారు. ఎందుకంటే మొక్కకు అవసరమైన నీరు నేరుగా సూక్ష్మసేద్యం పైపుల ద్వారా వెళుతుంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అందించిన పరికరాల ద్వారా ఏడేళ్ల వరకు లబ్ధిపొందవచ్చు. అందుకే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గత లెక్కల ప్రకారం చూస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో కేవలం 5 లక్షల ఎకరాల్లోపే ఉందని అంచనా. ఆయిల్‌పాం సాగుకు దెబ్బ ప్రస్తుతం 55 వేల ఎకరాలకే పరిమితమైన ఆయిల్‌పాం విస్తీర్ణాన్ని రానున్న రోజుల్లో 20 లక్షల ఎకరాలకుపైగా విస్తరించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్దేశించింది. ఆయిల్‌పాం సాగులో సూక్ష్మసేద్యం పరికరాలే కీలకపాత్ర పోషిస్తాయి. కానీ, సూక్ష్మసేద్యం ఏర్పాటులో జీఎస్టీ భారం వల్ల అనేకచోట్ల రైతులు వెనకడుగు వేస్తున్నారు. సూక్ష్మసేద్యం మంజూరైన చోట్ల కూడా రైతులు జీఎస్టీ భారం భరించలేక, ఆ సొమ్ము చెల్లించకపోవడంతో అవి నిలిచిపోయాయి. రైతులకు భారం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే కంపెనీలైనా ఆ భారాన్ని భరించాలని పలువురు కోరుతున్నారు. ఇదీ చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
పల్లెల్లోకి రండి.. నీటి పరుగు చూపిస్తాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్/సిద్దిపేటకమాన్:హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం కాదు.. తెలంగాణ పల్లెల్లో, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాలకు రూ.2 కోట్ల విలువైన కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నీరు పారలేదంటున్న వాళ్లు సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి చెరువులను చూస్తే తెలుస్తుందన్నారు. ఎప్పుడూ నిండని రాఘవాపూర్ చెరువు ఇప్పుడు గోదారి నీటితో కళకళలాడుతోందని, ఒకప్పుడు రాఘురూకుల, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాలలు కరువు ప్రాంతాలుగా ఉండేవని, ఇప్పుడవి సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో గుంటెడు భూమైనా పడావు పడి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో కరంట్ సమస్యపై విద్యుత్ కార్యాలయం వద్ద వంటావార్పు, రాత్రి బస చేశామని, కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ వస్తోందని తెలిపారు. తెలంగాణలో రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టానికి వచ్చే 30 వేల కోట్లు ఆపిందని ఆరోపించారు. కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేయకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేపని పెట్టుకుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఊరికి కుల సంఘాల భవనాలున్నాయని, ఒక్కో ఊరిలో రెండు, మూడు, ఐదు, ఎనిమిది, 11 చొప్పున కమ్యూనిటీ భవనాలు ఉన్నాయని చెప్పారు. ఇబ్బందైనా కష్టపడి నిధులు తెచ్చానని, కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెయ్యి నొప్పి పెట్టిందని చమత్కరించారు. కాగా, బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. మెరుగైన వైద్యమే సీఎం ధ్యేయం పేదలు, గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే వారికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. -
పంటలకు పోల‘వరం’..నిర్మాణ దశలోనే అందుతున్న నీరు
పిఠాపురం: పోలవరంలోనే ఉంది వరం. నిర్మాణ దశలోనే రైతులకు వరంగా మారింది. వర్షాధారంతోనే సాగయ్యే మెట్ట భూములకు పనులు పూర్తి కాకుండానే సాగునీరందిస్తోంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ 80 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పోలవరం కాలువ వేల ఎకరాలలో పంటలకు నీరందించి సిరులు కురిపిస్తోంది. కాలువ తవ్విన ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలకళ ఉట్టిపడుతోంది. ఎక్కడ చూసినా కాలువ నిండా నీటి నిల్వలు ఉండడంతో సమీప పొలాలకు రైతులుమోటార్ల ద్వారా నీటిని తోడి సాగు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువపై ఆధార పడి జిల్లాలో సుమారు 2580 ఎకరాల వరకూ మెట్ట భూముల్లో 2300 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. అపరాల నుంచి వరి వరకు పోలవరం కాలువపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇంకా ప్రారంభం కాకుండానే రైతులకు ఉపయోగపడుతున్న ఈ కాలువ పనులు పూర్తయితే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి. రబీకి అండగా.. వర్షాకాలంలో కాలువ నిండుగా మారి ఎద్దడి సమయంలో సాగు చేసే రబీ పంటకు నీరందిస్తోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, పెద్దాపురం, తొండంగి, గొల్లప్రోలు తదితర మండాలల్లో ఎక్కువగా పంట పొలాలకు రబీ సీజన్లో నీటి ఎద్దడి ఎదురవుతుంది. అలాంటి సమయంలో కాలువ చివరి భూములకు, మెట్ట భూములకు ప్రస్తుతం పోలవరం కాలువే నీటి వనరుగా మారిపోయింది. కాలవకు ఆనుకుని కిలో మీటరు దూరంలో ఉన్న అన్ని భూములకూ రైతులు ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. సాగు చేసుకుంటున్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా కాలువలోని నీటి సహాయంతో ముందుగా నారు మళ్లు వేసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఎదురైతే వెంటనే ఇంజిన్ల సహాయంతో నీటిని తోడి పంట ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. కాలువు సమీపంలోని రైతులు ఇంజిన్లతో నీటిని తోడుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఎక్కువ మంది కలిసి నిధులు సమకూర్చుకుని పెద్ద ఇంజిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలవరం కాలువే కాపాడుతోంది నేను ఎనిమిదెకరాలు సాగు చేస్తున్నాను. కాలువ తవ్వక ముందు నీటి ఎద్దడి వస్తే పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు వచ్చేవి. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువ అండగా నిలిచింది. ఖరీఫ్ నుంచి రబీ, అపరాల సాగు వరకు నీటి ఎద్దడి ఎదురైనా ఇబ్బంది లేకుండా ఉంటోంది. పక్కనే కాలువ నిండా ఎప్పుడు నీరు ఉంటుండడంతో మాకు భయం లేకుండా పోయింది. ఒక వేళ నీటి ఎద్దడి వస్తే ఇంజన్లతో నీరు తోడుకుని సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. – కోరుమిల్లి నూకరాజు, కౌలు రైతు, చెందుర్తి, గొల్లప్రోలు మండలం. కాలువ లేనప్పుడు కష్టాలు పడ్డాం కాలువ లేని సమయంలో చాలా కష్టాలు పడ్డాం. పంట వేయడమే గగనంగా ఉండేది. నీరందక పంటలు ఎండిపోయేవి. ఎక్కువగా బోర్లపై ఆధారపడే వాళ్లం. అదీ కొందరికే అవకాశం ఉండేది. కౌలు రైతులయితే ఒక పక్క పంటలు పోవడం వల్ల అటు కౌలు, ఇటు పెట్టుబడి నష్ట పోయేవారు. ఇప్పుడు పోలవరం కాలువ కొండంత అండగా నిలిచింది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు పంటలు వేసుకుంటున్నాం. . – వాసంశెట్టి శ్రీనివాస్, కౌలు రైతు చెందుర్తి, గొల్లప్రోలు మండలం. పోలవరం కాలువ రైతులకు వరమే బోర్లతో పని లేకుండా కాలువ నీటితో సాగు చేసుకుంటున్నారు. కొంత పెట్టుబడి అయినా పంట నష్ట పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో అపరాల సాగు అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు సాగు పెరిగింది. రైతులు ధైర్యంగా సాగు చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి వల్ల పంటలు పోయాయనే మాట వినపడటంలేదు. – సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి. గొల్లప్రోలు. ఇదీ చదవండి: రీసర్వేలో మరో మైలురాయి.. 8 లక్షలకుపైగా ఎకరాలకు సరిహద్దుల నిర్ణయం -
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్‌గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
పోలవరం నిర్వాసితులకు పరిహారం నేరుగా వారి ఖాతాల్లోకే
-
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
వేగంగా వెలిగొండ పనులు
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్‌లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్ టన్నెల్‌ను సైతం పరిశీలించారు. -
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష నిర్వహించనుంది. 8 ప్రాజెక్టులు.. 8 నెలలు... రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు. 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు. -
Sitarama Lift Irrigation Project: అయ్యో .. ‘రామా’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. మూడు పంప్‌హౌస్‌లు సిద్ధమైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్‌హౌస్‌ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్‌హౌస్‌లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు. ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్‌హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. ముందుకు సాగని పనులు కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికే..! 116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
Telangana: ‘పవర్’ఫుల్ డిమాండ్!
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనంతగా ఉండనుంది. గత ఏడాది వినియోగానికి అదనంగా 3 వేల మెగావాట్లు కలుపుకొని మొత్తంగా 6,520 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇరిగేషన్ శాఖ ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోని పంప్‌హౌస్‌ల్లో కనీసం నాలుగు నెలల పాటు మోటార్లను నడపాల్సి ఉంటుందంటూ లెక్కగట్టింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4,720 మెగావాట్ల విద్యుత్ అవసరాలుంటాయని విద్యుత్ శాఖకు నివేదించింది. –సాక్షి, హైదరాబాద్ ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల, కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు, పాక్షికంగా డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే సిద్ధమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వర్షాలు ఏమాత్రం సహకరించకపోయినా, కృష్ణా, గోదావరిలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా ఎంత విద్యుత్ అవసరాలు ఉన్నాయో లెక్కించాలని సూచించారు. ఇప్పటివరకు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్పీ, దేవాదుల, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా 1,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. అయితే ఈ ఏడాది దేవాదుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండిన నేపథ్యంలో దీనికి నీటి లభ్యత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో కనీసంగా 20 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇక్కడి అన్ని ప్యాకేజీల్లో కలిపి 48 మోటార్లు ఉండగా, 500 మెగావాట్లు అవసరమని లెక్కగట్టారు. ఇక పాలమూరులోని ప్రాజెక్టుల కింద కనీసం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృష్ణాలోకి వచ్చే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లోని 40 మోటార్లు తిరిగినా 800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరం కింద పెరగనున్న డిమాండ్ ఇక కాళేశ్వరం ద్వారా గత ఖరీఫ్‌లో పెద్దగా ఎత్తిపోతలు జరగలేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు 15 టీఎంసీలు ఎత్తిపోయగా, అనంతరం మూడు నెలల్లో 35 టీఎంసీలను ఎత్తిపోశారు. దీంతో పెద్దగా విద్యుత్ అవసరం పడలేదు. కానీ ఈసారి మేడిగడ్డ మొదలు బస్వాపూర్ వరకు రిజర్వాయర్లన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్‌తో పాటు 11.39 టీఎంసీల సామర్ధ్యం ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ సిద్ధమవుతోంది. ఇక 14 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపాలని నిర్ణయించారు. అంటే మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకే కనీసంగా 120 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉంది. దీంతోపాటే ప్రధాన రిజర్వాయర్ల కింద కాల్వల పనులు పూర్తవుతున్నాయి. దీనికి తోడు ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరందిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ద్వారా 250–300 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి వరకే 71 మోటార్లను నడపాల్సి ఉంటుంది. దీనికే 3,049 మెగావాట్ల విద్యుత్ కావాలి. దీని దిగువన బస్వాపూర్ వరకు నీటిని తరలించాలంటే మరో 28 మోటార్లను నడిపించాలి. దీనికి మరో 1,672 మెగావాట్లు అవసరం. ఇక పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా వానాకాలంలో నీటి ఎత్తిపోతలు సాధ్యపడేలా లేవు. అయితే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను మాత్రం స్థానిక ప్రవాహాల ద్వారా వచ్చే నీటితో నింపేలా ప్రణాళికలు వేశారు. వీటితో పాటే ఏఎంఆర్పీ, ఐడీసీ పథకాలను కలుపుకొని మొత్తంగా వానాకాలంలో అన్ని ఎత్తిపోతల పథకాల కింద 4 నెలల పాటు 607 మోటార్లు నడుస్తాయని, వాటి సామర్థ్యాన్ని బట్టి 6,520 మెగావాట్ల అవసరం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. గత ఖరీఫ్‌లో విద్యుత్ 2 వేల మెగావాట్లను కూడా దాటలేదు. యాసంగిలో 2,000–2,800 మెగావాట్లు వినియోగించినట్లు అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా విద్యుత్ అవసరాలు ఉండనున్నట్లు విద్యుత్ శాఖకు నివేదించింది. ప్రధాన పథకాల కింద అవసరాలు ఇలా.. -
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్‌కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. చదవండి: హాట్‌హాట్‌గా ఓటు వేట -
జలమండలికి ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్ టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం యూనిట్ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ప్రత్యేక టారిఫ్ అమలుతో గతేడాది జూన్ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
అనూహ్యం తుంగభద్రలో 4.94 టీఎంసీల పెరుగుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు 1944లో బ్రిటిష్ సర్కార్ పాలనలో మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్‌లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్‌లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్‌కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్‌లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. -
తుంగభద్ర బోర్డుకు తెలంగాణ వినతి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం) -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
సీఈలకే అధికారాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని.. సాగునీటి వసతులు పెరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిం దన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉండగా.. వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కాలువలు, సబ్స్టేషన్లు అన్నీ సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ వంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది. కాకతీయుల కాల్వల పునరుద్ధరణకు ఆదేశం.. మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలనిæ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ వచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమేనని వ్యాఖ్యా నించారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, డిప్యూటీ ఈఎన్సీ అనిత, డీడీఏ చందర్రావు, ఎస్ఈ ఆర్.కోటేశ్వర్ రావు, ఈఈలు కె.ప్రసాద్, ఎస్.విజయ్ కుమార్, డీఈఈ వెంకట నారాయణ, ఏఈఈ శివకుమార్, కేపీఎంఏ రత్నం పాల్గొన్నారు. -
కొత్త సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్‌లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుదలశాఖ, ఎల్లుండి ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు. (సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్) కాగా తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. (సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!) -
ఏసీబీ వలలో ఏఈ
ఇల్లెందు: నీటిపారుదల(ఇరిగేషన్) శాఖలో ఏఈగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ మధుసూదన్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ కోటన్ననగర్ గ్రామంలోని అనంతారం చెరువును మిషన్ కాకతీయ ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇల్లెందుకు చెందిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ మరమ్మతు చేశారు. ఈ పనులు గత వేసవిలోనే పూర్తయ్యాయి. ఈ మేరకు ఏఈ నవీన్‌కుమార్ ఎంబీ కూడా పూర్తి చేశాడు. వీటికి సంబంధించి రమేష్‌కు రూ.20 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను తనిఖీ చేశాకే బిల్లులు మంజూరవుతాయి. అయితే పనులు తనిఖీ చేసే అధికారులను తీసుకొస్తానని, అందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని నవీన్‌కుమార్ డిమాండ్ చేశాడు. రమేష్ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అతడిలో మార్పు రాకపోవడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు.. రమేష్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా నవీన్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కుతరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని కోరారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు రమణమూర్తి, రవీందర్, సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు... ఇల్లెందులో పని చేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఏఈ నవీన్‌కుమార్ కూడా ఇల్లెందు సుభాష్‌నగర్‌లో పాల కేంద్రం వెనుక గల్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన అవినీతి కార్యకలాపాలను కొనసాగించాడు. ఏసీబీ అధికారులకు పట్టుబడింది కూడా ఈ ప్రైవేట్ కార్యాలయంలోనే. ఏఈ ఒక్కరే కాదు.. ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఏఈలు, పలు శాఖల అధికారులు కూడా ప్రైవేట్ కార్యాలయాల నుంచే కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం. ఏడాదిలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఏఈలు.. ఇల్లెందులో ఏడాది కాలంలో ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కారు. గత ఏడాది జూలై 29న మున్సిపల్ ఏఈ అనిల్, ఈ ఏడాది ఫిబ్రవరి 9న అదే మున్సిపాల్టీలో పని చేస్తున్న ఇన్చార్జ్ ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్ బాబురావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు నీటిపారుదల విభాగం ఏఈ నవీన్‌కుమార్ దొరికిపోయాడు. ఏడాది కాలంలోనే ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. -
కట్టలు, కాల్వలకు పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలకు పనుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోని కాల్వలు, కట్టల పునరుద్ధరణకు బృహత్ కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల శాఖకు అనుసంధానించి రూ.1,200 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. వర్షాలు, నీటి లభ్యత పుష్కలంగా ఉండనున్న దృష్ట్యా చెరువులు, ప్రాజెక్టుల పరిధిలోని కట్టలు, కాల్వలు, ఫీడర్ చానళ్ల అభివృద్ధి.. చెట్లు, పొదల తొలగింపును పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ఉపాధి’తో అభివృద్ధి.. లాక్డౌన్ పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలంతా సొంత గ్రామాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలంతా కష్టంగా నెట్టుకొస్తున్న నేపథ్యంలో కూలీలకు పని కల్పన లక్ష్యంగా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద భారీగా నిధుల కేటాయింపులు జరిపి, గ్రామీణ స్థాయిలో 260 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పనుల్లో నీటి పారుదల రంగానికి సంబంధించిన పనులే 23దాకా ఉన్నాయి. ప్రధానంగా చెరువుల పూడికతీత, కాల్వలు, కట్టలు, ఫీడర్ చానళ్లలో పూడికతీత, చెట్లు, పొదల తొలగింపు, కాల్వలు, పిల్ల కాల్వల లైనింగ్ పనులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ కాల్వల పునరుద్ధరణ పనులకు అనుమతించింది. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చెరో 15వేల చెరువులు కలిపి 30 వేల చెరువుల కింద కట్ట, కాల్వలు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణకు రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ పనులతో 30 వేల చెరువుల పరిధిలోని కాల్వల్లో కోటి క్యూబిక్ మీటర్ల పూడికతీత తీయనున్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జునసాగర్, దేవాదుల, కల్వకుర్తి, బీమా, జూరాల వంటి భారీ ప్రాజెక్టులతో పాటు పోచారం, ఘణపురం, శనిగరం, సాత్నాల, వైరా, ర్యాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు వంటి సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రధాన, బ్రాంచ్ కాల్వల మరమ్మతుల నులను రూ.700 కోట్లతో చేపట్టనున్నారు. -
‘ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం’
సాక్షి, కర్నూలు: వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి శ్రీశైలం డ్యామ్ నుంచి బోట్లో వెళ్లి వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాంతంలోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను సాకారం చేసే దిశగా తలపెట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుతుందని తెలిపారు. (ఏపిలోకి నైరుతి రుతుపవనాలు) గత ప్రభుత్వాలు 12 సంవత్సరాలు అవుతున్నా వెలుగొండ ప్రాజెక్టు పనులను అంతంత మాత్రంగానే పూర్తి చేశారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం నాలుగు కిలోమీటర్ల టన్నెల్‌ను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కేవలం16 నెలల్లో మూడు కిలోమీటర్లు టన్నెల్‌ను పూర్తి చేసిందని తెలిపారు. జూన్ 25 లోపు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ వరకు ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ఏడున్నర కిలోమీటర్ల దూరమున్న రెండో టన్నెల్ పనులను 18 నెలల లోపు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
‘సాగునీటి’కి కోతే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే.. ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది. వచ్చే వార్షిక బడ్జెట్లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు. పాత ప్రాజెక్టులకు నిరాశే.. ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది. -
జలం వర్షించే.. పొలం హర్షించే
సాక్షి, అమరాతి: కృష్ణా, గోదావరి, వంశధార జలాలను ఒడిసి పట్టి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. రాష్ట్రంలో భారీ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో 87,62,037 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. మూడు నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు శుక్రవారం వరకూ 20,62,891 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 9.87 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేయడం గమనార్హం. ఈ ఏడాది సెపె్టంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టుకు నీటిని అందించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించేలా యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించిన దాఖలాలు లేవు. గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా, గోదావరి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. మూడు నదుల్లోనూ నీటి లభ్యత భారీగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా నది వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ప్రభుత్వం తరలించింది. పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. గోదావరి కుడిగట్టుపై తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, ఎడమ గట్టుపై పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీటిని ఒడిసి పడుతున్నారు. వంశధార, నాగావళి నదుల వరద జలాలను తోటపల్లి, నారాయణపురం, గొట్టా బ్యారేజీల్లో నిల్వ చేశారు. సమర్థవంతంగా నీటి పంపిణీ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని వృ«థా కానివ్వకుండా, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాకు జూన్ రెండో వారంలోగానే సాగునీరు విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తోటపల్లి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జూన్ మొదటివారంలో నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు జూన్ రెండో వారం నుంచి నీరు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల కింద ఆయకట్టుకూ జూన్ రెండోవారంలో నీటిని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో సాగు జోరు శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు ఆగస్టు 11న.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లకు ఆగస్టు 7న, హంద్రీ–నీవాకు ఆగస్టు 6న నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు సెపె్టంబర్ మూడో వారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరువులు నింపి, కొంత భాగం ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది పంటల దిగుబడి భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
కలసిసాగారు... నీరు పారించారు...
కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు. మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్ సీజన్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు. 9 గ్రామాలకు అందని సాగునీరు... వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్ అధికారులు చొరవ చూపలేదు. శ్రమదానంతో కాలువల నిర్వహణ.. అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్బీసీ పరిధిలోని 12ఎల్ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు.. శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌సీజన్ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం.. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్ సీజన్ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్ అధికా రులు పట్టించుకోవడం లేదు. – రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు సీజన్ పూర్తవుతున్నా ఉభాలు జరగలేదు.. నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్‌సీజన్ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం -
అన్నీ అనుమానాలే?
టీడీపీ పాలనలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన పనులపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తొలిరోజు మంగళవారం నిర్వహించిన పరిశీలనల్లో అన్నీ అనుమానాలే వ్యక్తం అయ్యాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అందుకు విరుద్ధంగా పనులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఒక్కో పనిని సునిశితంగా పరిశీలిస్తూ నిపుణులు పర్యటన సాగించారు. సాక్షి, బి.కొత్తకోట / తిరుపతి: గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అబ్దుల్ బషీర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎల్.నారాయణ రెడ్డి, రిటైర్డ్ ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బరాయ శర్మ, ఏపీ జెన్కో డైరెక్టర్ జీ.ఆదిశేషులను ప్రభుత్వం నియమించింది. ఈ బృందం మంగళవారం గాలేరు–నగరిలో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్ పనులు, హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పరిశీలించింది. ఎన్నో ప్రశ్నల ను లేవనెత్తింది. తొలుత మల్లెమడుగు రిజర్వాయర్‌ను పరిశీలించి రూ.120కోట్లతో ఇక్కడ పనులు ఎలా చేపట్టారని అధికారులపై అనుమానం వ్యక్తంచేశారు. గాలేరు–నగరి పూర్తి కాలేదు.. ప్రస్తుతానికి ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది కదా? ఇది తెలిసీ భారీ అంచనాతో పనులు చేపట్టడానికి కారణమేమిటని అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 17శాతం పూర్తయిన పనులు పరిశీలించాక ఒక టీఎంసీ సామర్థ్యానికే రిజర్వాయర్‌ను నిర్మించాలని సూచనలిచ్చారు. గాలేరు–నగరి పూర్తయి నీటి లభ్యత అందుబాటులోకి రాగానే రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవచ్చ ని సూచనచేశారు. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ పరిశీలనకు వచ్చిన కమిటీ ఈ పనులపై అడుగడుగునా అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేసింది. రూ.413 కోట్ల పనులను రూ.430.27 కోట్లకు అప్పగించినా నిర్ణీత గడువులో పనిచేయకపోగా అదనంగా రూ.144.7 కోట్ల పెంపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని బలంగా అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పం ఉపకాలువ 4వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన పరిశీలన చివరిదాకా సాగింది. 4వ కిలోమీటర్‌కు సమీపంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాక 11వ కిలోమీటర్ వద్ద గ్యాస్ పైప్‌లైన్ దాటేందుకు తవ్విన సొరంగం, పైప్‌లైన్ పనులు చూశారు. 26వ కిలోమీటర్ వద్ద జరిగిన ఇన్వర్టర్ సైఫన్ పైప్‌లైన్ చూశాక కమిటీకి తీవ్రమైన అనుమానాలు తలెత్తినట్టు తెలిసింది. అసలు ఈ సైఫన్ విధానం పని చేపట్టాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో ఉందా అని ఆరా తీశారు. కాలువను తవ్వాల్సిన చోట సైఫన్ పద్ధతి అమలుచేసే విషయంలో తెర వెనుక ఏదో బలమైన వ్యవహరం నడిచిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కాలువను నిర్మించకపోవడం వల్లే అదనంగా రూ.110 కోట్లు పెంచుకొన్నట్టు నిర్ధారించారని తెలిసింది. డీపీఆర్‌లోని పనులు చేపట్టడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఒక ఎత్తయితే, దానికి భారీగా చెల్లింపులు చేయడం సాహసమేనని కమిటీ సభ్యులు చర్చించినట్టు తెలిసింది. దీనికి అనుమతులు ఇచ్చిందెవరని అధికారులను అడిగినట్టు తెలిసింది. కాలువ తవ్వకంలోనూ నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ల ఇష్టం మేరకు పనులు చేశారని తేల్చారు. అదే సమయంలో చేసిన పనుల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వకం తగ్గినప్పుడు అంచనాలు తగ్గాలి కదా, అలా కాకుండా రూ.144 కోట్ల అదనపు చెల్లింపులు చేయడమేమిటని ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 140 కిలోమీటర్ వద్ద సొరంగం, కాలువలోనే పెద్దదైన అక్విడెట్ పనులు పరిశీలించారు. కాలువ పరిశీలన సమయంలో జరిగిన పనులకు నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేల్చారని సమాచారం. నేడు మదనపల్లెలో కమిటీ సభ్యులు రెండో రోజు బుధవారం మదనపల్లె సమీపంలోని 59వ ప్యాకేజీకి చెందిన సొరంగం పనులు, చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను పరిశీలించనున్నారు. -
లోకేష్‌ను నిలదీసినా.. సిగ్గు లేకుండా విమర్శలా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశామని..మరో పది రోజులు వరద వస్తే.. నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్ని నదుల వరద, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేస్తూ నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. ముంపు ప్రాంతాలను తరలించకుండా గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్‌ను నిర్మించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాక్షాత్తు లోకేష్‌ను గిరిజనులు నిలదీశారని..అయినా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాల హృదయంతో స్పందించారని తెలిపారు. ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా ఐదు వేలు సాయం ప్రకటించారన్నారు. 25 వేల కుటుంబాలకు మేలు జరిగేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. -
చిరు ధాన్యాలను ప్రోత్సహించేలా ప్రణాళిక
-
అక్రమార్కుల భరతం పడతాం
సాక్షి, కొడవలూరు: ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నీరు–చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. విచారణలో అవినీతిని నిగ్గుతేల్చి అక్రమార్కుల భరతం పడతామన్నారు. నీరు–చెట్టులోని అవినీతి కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది అధికారులు బలయ్యారని తెలిపారు. ఉపాధి పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, వీటిపై తహసీల్దార్, ఎంపీడీఓలతో విచారణ జరిపిస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ప్రజలు తనను 40వేల మెజార్టీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వం మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి దాడికి పాల్పడిన చర్యలు తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వైద్యులు మండల కేంద్రాల్లోనే నివాసం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైద్యులు మానవతతో వ్యవహరించాలన్నారు. ఊటుకూరులో బోరు బావిలో పడిన బాలికను కొనఊపిరితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేరన్నారు. అనంతరం కోవూరు వైద్యశాలకు తీసుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికీ గిరిజనులు బడులకు పోవడం లేదని తెలిపారు. ఎంఈఓ, ఐసీడీఎస్, పంచాయతీ కార్యదర్శులు సమైక్యంగా కృషి చేసి అమ్మఒడిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతీబిడ్డా చదివేలా చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖలో లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. అందువల్లే గృహాలన్నీ వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు. సమావేశం ప్రారంభమైనా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీపీ నల్లావుల వెంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ ఎన్వీ ప్రసాద్, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, వైస్‌ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంఈఓ వసంతకుమారి, వైద్యాధికారులు రామకృష్ణ, సుచిత్ర, ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
కొత్త ఆశలు!
సాక్షి, చిన్నంబావి: నూతన పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుండగా.. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కొంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిబద్ధతలో పనిచేస్తామని హమీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మండలంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ..మరోవైపు అభివృద్ధి వనరులు సమకూర్చేందుకు వీరికి శక్తికి మించిన భారంకానుంది. పల్లెల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం విధులు, విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త మండలం.. సమస్యలతో సతమతం నూతనంగా ఏర్పడిన చిన్నంబావి మండలంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. మండలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి పక్కా భవనం లేదు. పేరుకే మండలం ఏర్పడింది కాని చాలా వరకు శాఖలు ఉమ్మడి మండలం అయిన వీపనగండ్లలోనే కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంఈఓ, ఉద్యానవనశాఖ, పశువైద్యశాల, ప్రభుత్వ ఆసుపత్రి తదితర కార్యాలయాలన్ని అక్కడే కొనసాగుతున్నాయి. అదేవిధంగా చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఒక్క పాఠశాల కూడా లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు, సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు నూతన ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. రైతుల కల నెరవేరేనా..? కృష్ణానది చెంతనే ఉన్న గుక్కెడు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడి ప్రాంత రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం బాధకరమని ఇక్కడి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు టెయిలండ్ ప్రాంతం కావడంతో పంటల చివరి దశకు వచ్చే సరికి సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. కృష్ణానదిపై ఉన్న చెల్లెపాడు, చిన్నమారూర్ మినీలిప్టులు గత దశాబ్ధ కాలంగా మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయానికి లిప్టుల ప్రస్తావన తప్ప వాటికి పూర్తిస్థాయి పరిష్కార మార్గం చూపడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆ రెండు లిప్టులను మరమ్మతు చేస్తే దాదాపుగా 12వేల ఎకరాలకు సాగునీరు పుష్కాలంగా అందుతుంది. వీటి పరిష్కారం కోసం ఎంపీపీ,జడ్పిటిసిలు ప్రయత్నించాలని ఇక్కడి ప్రాంత రైతులు కోరుతున్నారు. -
అనుసంధానం.. అంతామాయ!
సాక్షి, అమరావతి: పది వేల ఎకరాల్లో వరి సాగుకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. ఆరుతడి పంటలైతే ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాల్లో సాగు చేయవచ్చు. కానీ, 58 టీఎంసీలతో 15.01 లక్షల ఎకరాలకు ఒకేసారి నీటిని అందించడం సాధ్యమేనా? 5.80 లక్షల ఎకరాలకు మించి ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లందించడం సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని పెడచెవిన పెట్టారు. అధికారాంతమున కమీషన్లు వసూలు చేసుకోవడానికి, సాగునీరు ఇస్తామంటూ రైతుల చెవ్వుల్లో పువ్వులు పెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా రూ.6,719 కోట్లతో గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ, కోటపాడు– చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు హైడ్రలాజికల్, పర్యావరణ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తదితర అనుమతులు తీసుకోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శుక్రవారం ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పట్టిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంచనా వ్యయం భారీగా పెంపు గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కుల(1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2.1 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి.. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు(4,897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలు తరలించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.1 లక్షల ఎకరాలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాలువ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలు.. వెరసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని 2016 సెప్టెంబరు 3న రూ.4,909.80 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులను 2019 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి 4.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పట్లో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. బాబు ఎత్తులు చిత్తు గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడాన్ని ఎన్జీటీ మరోసారి బహిర్గతం చేసింది. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘వ్యాప్కోస్’ నివేదిక ఆధారంగా గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి.. సీడబ్ల్యూసీ, పర్యావరణ, హైడ్రలాజికల్, సైట్ క్లియరెన్స్‌లు తీసుకుని పనులు చేపట్టే వారని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కమీషన్ల కక్కుర్తితో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాప్కోస్ నివేదికను వక్రీకరించి.. గోదావరి–పెన్నా అనుసంధానం చేపట్టి లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తును ఎన్నికల్లో రైతులు చిత్తు చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రణాళికా లోపానికి పరాకాష్ట - నాగార్జున సాగర్ కుడి కాలువకు 152 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 2014కు ముందు నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 545 అడుగులు ఉన్నప్పుడు కూడా కుడి కాలువ కింద వరి సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కానీ, 2014 నుంచి 2018 ఖరీఫ్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా కుడి కాలువ ఆయకట్టులో వరి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దాంతో టీడీపీ సర్కార్ తీరుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు గుర్తించారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడం, కమీషన్లు మింగేయడమే లక్ష్యంగా ‘వ్యాప్కోస్’ నివేదికను వక్రీకరించి, రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. - పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఇప్పటికే 8,500 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశలో భాగంగా.. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు వేల క్యూసెక్కులను పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి, పట్టిసీమ జలాలతో కలిపి తరలిస్తే ప్రవాహ నష్టాలు, మార్గమధ్యంలో వినియోగం పోనూ ప్రకాశం బ్యారేజీకి 14 వేల క్యూసెక్కులు చేరుతాయని.. వాటిలో ఏడు వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు విడుదల చేసి, మిగతా ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం నుంచి ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ కుడి కాలువలో పోసి, 9.61 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. - ఎన్నికలకు మూడు నెలల ముందు అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలో, అదీ మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన చంద్రబాబు.. రైతులను ఆకట్టుకోవడానికి రూ.699 కోట్లతో కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతలను మంజూరు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి, కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు. ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు జేబులో వేసుకున్నారు. ఈ ఆయకట్టుకూ 2019 ఖరీఫ్ నాటికే నీళ్లందిస్తామని చెప్పారు. -
మోటార్లకు తగ్గట్టే తిరగనున్న మీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది నుంచి విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ ఏర్పడనుందని నీటిపారుదల, విద్యుత్ శాఖలు అంచనా వేస్తున్నాయి. గరిష్టంగా 6 వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకే గరిష్టంగా 3,800 మెగావాట్లు అవసరం ఉంటుందని గుర్తించాయి. అవసరాలకు తగ్గట్లే విద్యుత్ సరఫరా చేసే విషయంపై దృష్టి సారించాయి. 6 వేల మెగావాట్లు..: రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. నీటిని తీసుకునే మోటార్ల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు రూ.6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి కల్వకుర్తితోపాటు బీమా, నెట్టెంపాడులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లకు వెట్‌రన్ నిర్వహిస్తున్నారు. సీతారామలో కొన్ని పంపులైనా నడపాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది నుంచి అదనంగా మరో 4,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం అదనంగా అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలను కలుపుకొని మొత్తంగా 6 వేల మెగావాట్ల డిమాండ్ దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాళేశ్వరానికే భారీ డిమాండ్... కాళేశ్వరంలో మేడిగడ్డ మొదలు అన్నిదశల్లో ఉన్న పంప్‌హౌస్‌ల్లో 82 మోటార్లను ఏ ర్పాటు చేస్తుండగా, ఇందులో ప్యాకేజీ–8లో 139 మెగావాట్లు, ప్యాకేజీ–6లో 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను వాడుతున్నారు. ఈ మొత్తం మోటార్ల ను నడిపించేందుకు 4,800 మెగావాట్ల విద్యుత్ అవసరాలను గుర్తించారు. వచ్చే ఖరీఫ్‌లో అన్ని మోటార్లను నడిపించే వీలులేకున్నా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 70 మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకే 1,600 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తయితే గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని 6 నెలలపాటు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది గరిష్టంగా 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్‌కో, నీటి పారుదల శాఖలు అంచనా వేశాయి. జూలై నుంచి నీటిని ఎత్తిపోయనుండగా, జూలైలో 600 మెగావాట్ల విద్యుత్ అవసరాలతో మొదలై గోదావరిలో వరద ఎక్కవగా ఉండే అక్టోబర్, నవంబర్, డిసెం బర్ నెలల్లో 3,800 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని తేల్చాయి. దీనికి గాను రెండు శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలని గురువారం సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. -
ఎంఈఐఎల్ 130 ప్రాజెక్టుల రికార్డు!
ఇంజినీరింగ్, ఇన్ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది. 2018-19 సంవత్సరానికి గాను తెలంగాణాలో మిషన్ భగీరథ కింద కరీంనగర్, సిరిసిల్లా, వెములవాడ, చొప్పదండి, పెద్దపల్లి-రమగుండం,మహబూబ్‌నగర్, నల్గొండ, పాలేరు-వరంగల్ వంటి ప్రాజెక్ట్‌లతో పాటు రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్, అసింద్, కోట్రి, షాపుర, పాలి, ఓడిషాలోనిభూవనేశ్వర్ బల్క్ వాటర్, కియోన్‌జహర్ వాటర్ ప్రాజెక్ట్, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఆగ్రా లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక సాగునీటి రంగంలో పురుషోత్తపట్నం స్టేజ్-2, కొండవీటివాగు, చింతలపూడి, హంద్రీ-నీవా ఫేస్-2, కర్నాటకలోని ఉత్తర కోలార్, దసరహళ్లి, కాన్వా, గుజరాత్‌లోని సౌనీయోజనతో పాటు ఆరు ఎత్తిపోతల పథకాలను దిగ్విజయంగా పూర్తిచేసింది. అలాగే విద్యుత్ రంగంలో నర్సాపూర్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి, సత్తేనపల్లి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. ఎంఈఐఎల్ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు. రికార్డ్ సమయంలో రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్... రికార్డ్ సమయంలో రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్‌ను 6 నెలల్లోనే పూర్తి చేసింది. కెయిర్న్ ఇండియా కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులను 2018 సెప్టెంబర్‌లో మొదలుపెట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ఎంఈఐఎల్ 18నెలల పాటు చూడనుంది. సౌరాష్ట్ర బ్రాంచ్కెనాల్పై జల విద్యుత్... అలాగే గుజరాత్‌లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్‌పైన రెండు హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఎంఈఐఎల్ పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో ఒక్కో యూనిట్లో 15 మెగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మరో 15 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్లాంటును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మూడో ప్లాంటు అందుబాటులోకి వస్తే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది. రాయచూర్‌లో వైటీపీఎస్ ఇక కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో వైటీపీఎస్ ప్రాజెక్ట్‌ను గడువుకంటే ముందే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్లాంటుకు అవసరమైన నీటిని కృష్ణనది నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కసారి ప్లాంట్లులో వాడిన నీటిని (బూడిద నీరు) చెరువులకు పంపించి చెరువు ద్వారా మళ్లీ నీటినివైటీపీఎస్ ప్లాంట్‌కు తరళించేలా ఏర్పాట్లు చేశారు. నీటి వృథా కాకుండా ఎంఈఐల్ ఇలా ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలోని లింక్-1 సబ్స్టేషన్లు... ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లింక్-1 సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ప్యాకేజ్-8 సబ్‌స్టేషన్‌ను విజయంతంగా పూర్తిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని నాలుగు సబ్స్టేషన్లు అందుబాటులోకివచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గుండెకాయ లాంటి లింక్-1లోని ప్యాకేజ్-8 రామడుగు 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ విజయవంతంగా చార్జ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భూగర్భ పంపింగ్‌స్టేషన్‌ను ప్యాకేజ్-8లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంకలిగిన 7 భారీ పంప్‌మోటార్లకు విద్యుత్ అందించేలా రామడుగులో 400/13.8/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ విజయంతంగా చార్జ్ చేసింది. 360 మెగావాట్ల మొత్తం సామర్థ్యం కలిగిన 9 పంప్మోటర్లను సుందిళ్లలో ఏర్పాటు చేశారు. ఈ మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 400 కేవీ సబ్‌ష్టేషన్, 480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్‌హౌజ్‌లోని 12 పంప్ మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీఅన్నారం సబ్‌స్టేషన్, 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ పంప్‌హౌజ్‌లోని 17 పంప్‌మోటార్లకు విద్యుత్‌ను అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరానికి తాగునీటి సరఫరా పథకంలో భాగంగా 70,000 గృహాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును కూడా ఎంఈఐఎల్ దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇందుకుగాను ఎంఈఐఎల్ 544 కిలోవాట్ల సామర్థ్యం గల మూడు టర్బైన్ పంప్‌లను ఏర్పాటు చేసింది. రోజుకు 122 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసేలా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో పురుషోత్తపట్నం స్టేజ్-2, హంద్రీనీవా రెండో దశ, కొండవీటివాగు, చింతలపూడి ప్రాజెక్టులను కూడా రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. -
టీఆర్ఎస్కు సాగునీరే ప్రచారాస్త్రం!
సాక్షి, వనపర్తి: మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు రాల్చిన సాగునీటి, సంక్షేమపథకాల అస్త్రాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా మరోమారు ఓట్లు రాల్చనున్నాయా.? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 3.86 లక్షల ఎకరాలుండగా ఖరీఫ్‌లో సుమారు 2.86 లక్షల ఎకరాల్లో, రబీలో సుమారు 95 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తారు. రబీలో వర్షాధారిత పంటలు వేరుశనగ, వరిమాత్రమే సాగు చేస్తారు. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన జూరాల, రాజీవ్ భీమా ఫేస్–2, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుంది. కాల్వల పనులు పూర్తి చేయటంతో పాటు సమీపంలోని చెరువులను, కుంటలను కృష్ణాజలాలతో నింపటంతో వనపర్తి జిల్లా సాగునీటి ఆయకట్టు గణనీయంగా పెరిగింది. లక్ష ఎకరాలకు కృష్ణా జలాలు వనపర్తి జిల్లా పరిధిలోనే సుమారు లక్ష ఎకరాలకు జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సాగునీరు అందిస్తున్నారు. అత్యధికంగా జూరాల ప్రాజెక్టు ఎడవ కెనాల్ నుంచి సుమారు 67 వేల ఎకరాలకు అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు, భీమా ఫేస్–2 కాల్వ ద్వారా వనపర్తి మండలం, పెద్దమందడి మండలంలో కొంత భాగం, పానగల్ మండలంలో కొన్ని గ్రామాల్లోని సుమారు 22 వేల ఎకరాలకు, కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా గోపాల్పేట, రేవల్లి మండలాలు పూర్తిగా పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాలు కొంత భాగాలకు మొత్తంగా సుమారుగా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దశాబ్దాల కాలంగా బీడుగా మిగిలిన చెరువులు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. తుమ్మలు మొలిచిన బీడు భూముల్లో ప్రస్తుతం పచ్చని సిరుల పంటలు దర్శనమిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ ప్రభావమూ ఎక్కువే.. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అత్యధికంగా సీఎం ఆర్థికసాయం మంజూరైన టాప్ త్రీలో జిల్లాలో వనపర్తి జిల్లా ఒకటి. అనారోగ్య సమస్యలతో సాయం కోరి వచ్చిన వారందరికీ మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎం ఆర్థికసాయం మంజూరు చేయించారు. గడిచిన ఐదేళ్లలో సాయం పొందిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయని పార్టీ శ్రేణులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కొద్ది రోజులు మినహాయిస్తే మిగతా రోజుల్లో కనీసం రోజుకు ఒక్కటైన చెక్కు మంజూరవుతుంది. -
చేయూతనివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 15వ ఆర్థిక సంఘం తలుపుతట్టనుంది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ రానున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి చేయూతనివ్వాలని కోరనుంది. నిర్వహణకే భారీ నిధులు అవసరం... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వీటిలో విద్యుత్ అవసరాల ఖర్చు రూ.37,796 కోట్లు కాగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ అవసరం 4,627 మెగా వాట్లు కాగా, ఇందులో 2020–21 నుంచి విద్యుత్ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు అవసరం ఉంటుందని లెక్కలేసింది. ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది. ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. మిగతావి ఓఅండ్‌ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకా శం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా, అలాంటిదేమీ జరగ లేదు. దీంతో ఇప్పుడైనా సానుకూల నిర్ణయం చేయాలని కోరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. నేడు కాళేశ్వరం సందర్శన.. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12కి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్‌హౌజ్ పనులను చూస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్రావుతో కూడిన బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అనంతరం మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది. -
సీతారామలో కీలక ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి తుది అటవీ అనుమతులు మంజూరయ్యాయి. అత్యంత కీలకమైన ఈ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చెన్నై కార్యాలయం డిప్యూటీ కన్జర్వేటర్ కె.గణేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకోసం సుమారు 20,946.72 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, అటవీభూమి 3,827.63 ఎకరాలు. ఇందులో మణుగూరు డివిజన్లో 212.95 హెక్టార్లు, పాల్వంచ పరిధిలో 618.95, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 369.09, సత్తుపల్లిలో 277.41, ఖమ్మం డివిజన్ పరిధిలో 52.64 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ అటవీ భూముల పరిధిలో కాల్వలు, టన్నెళ్లు, పంప్‌హౌస్‌లు, విద్యుత్ లైన్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ అటవీ అనుమతులకు స్టేజ్–1 క్లియరెన్స్ గత ఏడాది ఫిబ్రవరిలోనే మంజూరయింది. భూములకు పరిహారాన్ని చెల్లించడంతో బుధవారం తుది స్టేజ్–2 అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే వన్యప్రాణి బోర్డు, పర్యావరణ అనుమతులు సైతం మంజూరు అయ్యాయి. తాజాగా అటవీ అనుమతులకు క్లియరెన్స్ దక్కడంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. -
ప్రాణహితనా.. వార్ధానా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా పక్కన పెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని ఏ నదిపై నిర్మించాలన్న తర్జన భర్జన మొదలైంది. వెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా, కొత్తగా కేవలం వార్ధా నదిపై వీర్దండ వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనపైనా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మేలు చేస్తుందో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పుడైనా తేలుతుందా.. వెయిన్‌గంగ, వార్ధా నదులు కలిసిన అనంతరం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని 2004లో నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బ్యారేజీలో రీడిజైన్ తర్వాత జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ.639 కోట్లతో అంచనా వేశారు. వన్యప్రాణి సంరక్షణ కారణంగా ప్రాణహిత నదిపైనే ఒకటిన్నర కిలోమీటర్ ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చడంతో అంచనా వ్యయం రూ.1,918.70 కోట్లకు చేరింది. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్ర లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాల ముంపు, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణం గత ఐదేళ్లుగా జరగకపోవడంతో ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనా వ్యయం రూ.1,918.70 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరుతోంది. పునరాలోచనలో ప్రభుత్వం... బ్యారేజీ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్ధాపై నిర్మాణంతో కేవలం కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 28 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ.700 కోట్లు దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయని లెక్క గట్టాయి. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్షించిన సీఎం గత ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వార్ధా వద్ద నీటి లభ్యత ఉన్నా అది తక్కువ సమయంలోనే భారీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బ్యారేజీ సామర్థ్యం 1.5 టీఎంసీలే కావడంతో అంత తక్కువ సమయంలో నిర్ణీత 20 టీఎంసీలు మళ్లించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని సమీక్ష సందర్భంగా ఇంజనీర్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, లభ్యత కాలం, మళ్లింపు అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పెద్దవాగులో సైతం 16 నుంచి 18 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఆ నీటిని కాళేశ్వరంలో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు ఎలా తరలించాలన్న దానిపైనా పరిశీలన చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఇరిగేషన్ రిటైద్ డీఈ దేముడు
-
ఆనంద‘సాగు’రం
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని రైతులకు..ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కాల్వల పరిధిలో పంటలను సాగు చేసేవారికి ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో రెండు పంటలకు జలాలు విడుదల చేసేందుకు ఢోకా లేదని అధికారులు ప్రకటించడంతో...జిల్లా రైతులు పంటల తడులకు ఇబ్బంది ఉండదని ఆనందసాగరంలో ఉన్నారు. మొత్తం 21మండలాలు ఉండగా..17 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ పారుతోంది. ప్రత్యక్షంగా రెండు లక్షల 50వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా, పరోక్షంగా మరో లక్ష ఎకరాలకు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో నీరు ఊరి..సాగు కష్టాలు తీరతాయి. సాగర్ ఎడమకాల్వ మొత్తానికి ఈఏడాది 132 టీఎంసీల నీరు సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో 99టీఎంసీలు తెలంగాణకు, మిగిలిన టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఖరీఫ్‌లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 45 టీఎంసీలు విడుదలకు నిర్ణయించగా మన జిల్లాలోని ఆయకట్టుకు 20 టీఎంసీలు వాడుకోనున్నారు. దీని ద్వారా ఖమ్మం ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో మొత్తంగా లక్షా 26 వేల ఎకరాల వరకు వరి పైర్లకు, లక్షా 28 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, చెరకు, ఇతరత్రా కూరగాయలు సాగుకు నీరందనుంది. చుక్కనీరు వృథా కాకుండా..ఆయకట్టు చివరి భూములవరకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని ఇటీవల జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ఎన్నెస్పీ ఎస్ఈ సుమతీదేవి సూచించారు. గతేడాది నిరాశే.. జిల్లాలోని 16–17 బ్రాంచ్కాల్వ, బోనకల్, మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలోని రెండు వేల కిలోమీటర్ల మేజర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వల ద్వారా రైతుల పంట భూములకు సాగర్ నీరు అందిస్తుంటారు. గతేడాది ఖరీఫ్‌కు సాగర్ నీరు విడుదల చేయలేదు. అయినా కొంతమంది రైతులు మొండిగా..పంటలు వేసి, నీరందక ఇబ్బంది పడుతుండడంతో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో జలాలు విడుదల చేయించారు. అదీ..వారబందీ విధానంతో అమలు చేశారు. తర్వాత రబీ సాగుకు కూడా 9రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్ విధానంలో మొత్తం 8తడుల నీరు క్రమపద్ధతిలో అందించడంతో గండం తొలగింది. ఈఏడాది ఖరీఫ్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగునీటి కష్టం ఉండబోదు. గత నెలలో మిర్యాలగూడెంలో జరిగిన ఎన్నెస్పీ, ఆయకట్టు పరిధి రైతుల సంయుక్త సమావేశంలో జిల్లా నుంచి హాజరైన మాజీ నీటి సంఘాల చైర్మన్లు..గతేడాది రబీ తరహాలోనే వారబందీ విధానంలో విడుదల చేసినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చిందని వివరించారు. అయితే..నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఇంజినీర్లు మాత్రం నిరంతరాయంగా మొదటి తడి వరకే ఇవ్వడానికి నిర్ణయించారు. వారబందీ విధానం ద్వారా అయితేనే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, పైగా దిగుబడి పెరగడంతోపాటు, తర్వాత కాలంలో రబీ సాగు, విద్యుత్ తయారీ, తాగు నీటి అవసరాలకు సాగర్ నీరు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది.. గత 20రోజుల కిందట కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో నీళ్లిస్తారో లేదోనని భయం భయంగా ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి నీరు పుష్కలంగా చేరడంతో మా చింత తీరింది. నీళ్లొస్తే..బోర్లు, బావుల్లో ఊట పెరుగుద్ది. ఆయకట్టు పరిధిలోని పంటలకు డోకా ఉండదు. – మంకిన వెంకటేశ్వర్లు, చెన్నారం రైతు నేలకొండపల్లి మండలం -
నీళ్లు ప్రవహిస్తున్నాయ్.. బీళ్లు చివురిస్తున్నాయ్
ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. గత పాలకుల హయాంలో పెట్టిన ఖర్చు, సాధించిన ప్రగతి పోల్చుకుంటే వాస్తవం తెలుస్తుంది. మా చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్థం అవుతుంది. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగిపోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి. నీళ్లు, నిధులు, నియామ కాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రం ఉద్యమ నాయ కుడు కేసీఆర్ నేతృత్వంలో నాలుగేండ్లు నడిచింది. ఈ నాలుగేండ్లలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి నీళ్ల మంత్రిగా నాకు సంతృప్తిని మిగి ల్చింది. ఇంకా సాధించవలసింది ఎంతో ఉన్నా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి రంగంపై దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా గ్రామీణ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు చొప్పున మొత్తంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా ప్రణాళికలు తయారు చేసుకు న్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాలుగంచెల వ్యూహాన్ని అను సరించింది. తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు ఆధా రాలుగా ఉన్న 46,500 చెరువులను దశలవారీగా పునరుద్దరించడం, గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వల్ల పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో పాటు వాటిలో కొన్నింటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకుని పూర్తి చేసుకోవడం, గత ప్రభుత్వాలు ఆమోదించి అట కెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం, గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురయి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవ స్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లింది. ఈ నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేయడానికి ఉద్యమ నాయకుడి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నాలుగేండ్ల కాలంలో శాయశక్తులా ప్రయత్నించింది. మెరుగైన ఫలితాలను సాధించింది కూడా. చెరువుల పునరుద్ధరణ కోసం ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి యేటా రాష్ట్రం లోని 20శాతం చెరువులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అభీష్టం మేరకు కాకుండా స్థానిక ప్రజలను, ప్రజాపతిని ధులను సంప్రదించి వారికి అవసరమైన చెరువులను పునరుద్ధ రించే స్వేచ్ఛ అధికారులకిచ్చాం. చిన్ననీటిపారుదల వ్యవస్థను బలో పేతం చేశాం. అధికార వికేంద్రీకరణ, అవసరమైన వ్యవస్థల ఏర్పాటు ద్వారా టెండర్ల ప్రక్రియను 90 నుంచి 15 రోజులకు కుదిం చాం. పరిపాలనా అనుమతుల ప్రక్రియలో వేగాన్ని, ప్రజల భాగ స్వామ్యాన్ని పెంచాం. పూడిక మట్టి ఉపయోగాలపై ప్రజల్లో చైత న్యం కలిగించాం. వేలాది మంది ప్రజలు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. రైతులు తమ స్వంత ఖర్చులతో పూడిక మట్టిని తరలించుకుపోయి తమ పొలాల్లో చల్లుకుని మెరుగైన దిగుబడి సాధించుకున్నారు. దీంతో రసాయనిక ఎరువులపై ఖర్చు కూడా తగ్గింది. మొదటి దశలో 8,029 చెరువుల పునరుద్ధరించి 6.73లక్షల ఎకరాలకు, రెండోదశలో 7,264 చెరువుల ద్వారా 4.29లక్షల ఎకరాలకు, మూడో దశలో 2,566 చెరువుల ద్వారా 1.45లక్షల ఎకరాలకు ఆయకట్టు అందేలా చేశాం. మొత్తం మీద మిషన్‌కాకతీయ ద్వారా 17,859 చెరువుల కింద 12.47లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆయా చెరువుల్లో 8.20 టీఎంసీల నీటి నిల్వ పునరుద్ధరణ జరిగింది. 1.05లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధుల సహకారంతో మిషన్ కాకతీయ ద్వారా ఆశించిన ఫలితాలు, మార్పులు సాకారం అయ్యాయి. దీనికి తోడు 165 ఎత్తిపోతల పథ కాల కింద నాలుగేండ్లలో కొత్తగా 1.23లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించి 27వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో పడేందుకు గల కారణాలను విశ్లేషించుకున్నాం. ప్రధాన అవరోధంగా మారిన భూసేకరణ సమస్యను ‘ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ జీవో నెం: 123 (30.07.2015) ద్వారా పరిష్కరించుకున్నాం. ఆ తర్వాత 2013 భూసేకరణ సవరణ చట్టాన్ని రూపొందించుకున్నాం. ఇది మంచి ఫలితాలనిచ్చింది. ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. రైలు, రోడ్డు శాఖల నుంచి అనుమతులు పొందడంతో మరింత ఉపశమనం లభించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలను మనమే చొరవ తీసుకుని పరిష్కరించడం ద్వారా ప్రాణహిత, గోదావరి, పెన్ గంగా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోగలిగాం. ఈ ఒప్పంద ఫలితంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద, గోదా వరిపై మేడిగడ్డ వద్ద, పెన్ గంగా నదిపై చనాక కొరాట వద్ద బ్యారే జీల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ నాలుగేండ్లలో కల్వకుర్తి, ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం), పాలమూరు–రంగారెడ్డి, పెన్ గంగ కాలువ, చనాకకొరాట బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధిం చడంలో పురోగతి సాధించాం. డిండి, సీతారామా ప్రాజెక్టుల అను మతుల ప్రక్రియ వేగం పుంజుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 10 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు. ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలలపాటు ఇంజనీరింగ్ నిపుణు లతో, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో అధ్యయనం చేసిన తర్వాత ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్ చేసుకుని పనులు చేపడుతున్నాం.ఈ నాలుగేండ్లలో మా సర్కార్ 8 పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయ డానికి చర్యలు తీసుకుంది. వీటి ద్వారా కొత్తగా 9.12 లక్షల ఎక రాలకు సాగునీటి సౌకర్యం కల్పించి, మరో 2 లక్షల ఎకరాల ఆయ కట్టును స్థిరీకరించాం. పాలమూరు జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016–17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 సంవ త్సరం రబీపంట కాలంలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి 700 పైగా చెరువులని నింపడంతో ఆ జిల్లాలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగు బడి వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసెళ్లిన వారు ఇంటిముఖం పట్టారు. మెదక్ జిల్లాలో సింగూరు కాలువలను పూర్తి చేసి మెదక్ జిల్లాలో 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 రబీలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. దేశానికి స్వతం త్రం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాలో నీరివ్వడం ఇదే తొలి సారి. కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాస సమస్యలను పరిష్కరించి, రాయపట్నం బ్రిడ్జ్‌ని నిర్మించి 20 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం. ఎత్తిపోతల నుంచి 25 వేల ఎకరాలు, చెరువులను నింపినందున మరో 37వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. 2016లో ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లోని వందలాది చెరువులను నింపాం. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చెరువులను నింపడం వల్ల 6 వేల ఎకరాలకు సాగునీ రిచ్చాం. డీబీఎం–60 కాలువ పనులు ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేసి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 58,958 ఎకరాలకు సాగు నీరు అందించబోతున్నాం. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పున రుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీళ్లు వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీ జలాశయానికి రివర్స్ పంపింగ్ అవుతాయి. దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరా లకు, లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నికరంగా నీరు అందుతుంది. మిడ్ మానేరు జలాశయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 25 టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉంచాం. మిడ్ మానేరు కింద మరో 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పంప్ హజ్ పనులు పూర్తి అయిన కారణంగా గత రబీలో అనేక చెరువు లను నింపి చెరువుల కింది ఆయకట్టును కాపాడం. ఎల్ఎల్సీ కింద 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్లప్రాజెక్టు 2008 లో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పడే నాటికి అటకెక్కింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని కూలంకషంగా సమీక్షించింది. తొలుత మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించుకునే కృషి జరిపాం. అయితే, తమ భూభాగంలో ముంపును అనుమతించలేమని, తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్ఆర్ఎ ల్ని 152మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించమని మహారాష్ట్ర కోరింది. అదే సమయంలో తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని, అందులో పైరాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకునే వీలున్న 63 టీఎంసీలున్నాయని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. తమ్మిడిహట్టి వద్ద నుంచి తరలించగలిగే నీటి పరిమాణాన్ని పునఃసమీక్షించుకోమని సూచించింది. జలాశ యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ఆయకట్టును స్థిరీకరించడా నికి ఈ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ అవసరమయింది. గోదావరిపై మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు నిర్మించి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి యెల్లంపల్లికి చేర్చడం, అక్కడి నుంచి మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసా గర్, కొండ పోచమ్మ సాగర్ తదితర జలాశయాలకు నీటిని తర లించి 13 జిల్లాల్లో 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, 18.80 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించాలనే లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. హైదారాబాద్ నగరానికి, దారి పొడవునా ఉన్న వందలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ‘నభూతో నభవిష్యత్’ అనే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం కార్మికులు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్, సర్జ్ఫూల్స్, టన్నెళ్లు, కాల్వలు, పైప్లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు.. ఇలా ఏకకాలంలో అనేక పనులు యుద్ధప్రాతిపదికన సాగుతు న్నాయి.ఈ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు జలాశ యానికి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ కింద రెండు దశల్లోని ఆయక ట్టుకు 2018లోనే నీరిచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కారణంగా 150 కిలోమీటర్ల మేర గోదావరి సజీవం కాబోతోంది. వ్యవసాయం, చేపల పెంప కం, టూరిజం, జలరవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాల్లో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరగనుంది. ఒక్క మాటలో చెప్పా లంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు ‘గ్రోత్ ఇంజన్’ లాగా మార బోతున్నది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీంకోర్టు ముందు వాదనలు మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి, 4 లక్షల ఎకరాలకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగి స్తోంది. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచింది. గత రెండేళ్లుగా రూ. 25 వేల కోట్ల మేర అత్యధికంగా నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సాగునీటి శాఖలో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టింది. శాఖ పునర్వ్యవస్థీకరణ, కొత్త చీఫ్ ఇంజనీర్ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఈపీసీ పద్ధతిని, మొబిలైజేషన్ అడ్వాన్సులను మా ప్రభుత్వ రద్దు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకోవడానికి నీటిపారుదల శాఖ.. ఐఐటీ, ఐఐటీహెచ్, బిట్స్, ఇస్రో, నాబార్డు, ఇక్రిశాట్ లాంటి ఉన్నతస్థాయి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మార డానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగి పోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి. వ్యాసకర్త సాగునీటి శాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావు -
ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట
సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రోజంతా ముసురేసింది. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తివేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం ధాటికి అనేక ఇళ్లు కూలుతుండగా, రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు జన్నారం నుంచే రాకపోకలు సాగుతుండగా, బ్రిడ్జి లేకపోవడంతో జన్నారం మండలం కలమడుగు, ధర్మపురి మీదుగా 50 కిలోమీటర్ల దూరం తిరిగి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జన్నారం మండలం చింతగూడలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందన్పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద ఆదివారం బురదలో దిగబడిన వ్యాన్ సోమవారం వరద ఉధృతికి కొట్టుకుపోగా, పోలీసులు క్రేన్ తెప్పించి బయటకు తీశారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్ జలమయమయ్యాయి. గుండి వాగు, పెద్దవాగు, తుంపెల్లి ఒర్రె పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తివేశారు. సారంగాపూర్ మండలంలోని ధని కొత్త చెరువు అలుగులో నుంచి 20 గేదెలు కొట్టుకుపోగా, అందులో 17 మృత్యువాతపడ్డాయి. మామడ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద మట్టి కట్ట, బిగించడానికి సిద్ధంగా ఉంచిన గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 రోజులుగా వరద నీటిలోనే ఉంది. దుబార్పేట్ గ్రామం వరద నుంచి తేరుకోలేదు. 300 మందికి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్లోని రైతు విశ్రాంతి భవనంలో ఆశ్రయం కల్పించారు. గిరిజన గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో 800 మంది విద్యార్థినులకు మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కుంటాల జలపాతం వద్ద ఏర్పా ట్లు చేసిన బారికేడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రాంతం ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. రెండువైపులా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద, వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది.కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం వెళ్తోంది. అన్నారం వద్ద లక్ష క్యూసెక్కుల వరద తరలిపోగా, కాళేశ్వరం వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపునకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాజేడు మండల పేరూరు వద్ద 11.67 మీటర్ల ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 7 మీటర్ల వరకే ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 8.4 మీటర్లకు పెరిగింది. పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి 10 గంటల వరకు 33.125 టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం సోమవారం రాత్రి 7 గంటల వరకు 34.827 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 70,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగుల (90.138 టీఎంసీలు)కుగాను సోమవారం రాత్రి ఏడు గంటలకు వరకు 1072.80 అడుగులు (34.827 టీఎంసీలు)కు చేరుకుంది. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని: భారీ వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచింది. మట్టి వెలికితీత పనులు ముందుకు సాగడం లేదు. రామగుండం రీజియన్‌లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తాలిపేరు, కిన్నెరసానికి వరద తాలిపేరు, కిన్నెరసాని జలాశయాల్లోకి భారీగా వరదనీరు వస్తోంది. తాలిపేరు జలాశయం పూర్తిగా నిండింది. దీంతో మొత్తం 25 గేట్లు ఎత్తి 1,72,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1,77,000 క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా 403.60 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద గోదావరి 44.5 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. భద్రాచలంలోని అశోక్ నగర్‌కాలనీలో సుమారు 30కి పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారిని పునరావాస శిబిరానికి తరలించారు. వాగులో పురిటినొప్పులతో... మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రాగా గ్రామస్తులు వాగు దాటించి 108 అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి జిల్లా అతలాకుతలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేకచోట్ల రోడ్లు మునిగిపోవడం, కోతకు గురికావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,465.2 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 హెక్టార్లలో ఇసుక మేటలతో ఆయా రైతులు నష్టపోయారు. -
16 ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్నవి ఐదే
న్యూఢిల్లీ: దేశంలో 16 సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దం తర్వాత ఐదు మాత్రం నిర్మాణంలో ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక తూర్పారబట్టింది. నిర్మాణం నత్తనడకన సాగుతుండగా వాటి అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ పలు సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. వాటిల్లో ప్రస్తుతం పనులు నడుస్తున్నవి గోసిర్‌కుండ్, తీత్సా, సరయూ, ఇందిరాసాగర్ పోలవరం, షాపూర్–కాండి ప్రాజెక్టులు. కాగా, 2017 వరకు వీటి నిర్మాణానికి వెచ్చించిన మొత్తం రూ.13,299 కోట్లుగా కాగ్ తేల్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు 8 శాతం నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాయి. వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ నిర్వహణ లోపాలున్నాయని తెలిపింది. -
‘రైతు ఆత్మహత్యలు నివారించేందుకే..’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ టన్నెల్ పనులను జాతీయ మీడియాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పనులను ఆయన మీడియాకు వివరించారు. ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో విదర్భ తర్వాత తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ ఇంజనీర్‌గా మారారన్నారు. అందులో భాగంగానే వ్యాప్కోస్ సంస్థ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. -
ఇది ‘చెరువూరు’
సాక్షి, హైదరాబాద్: ఊరికి ఉత్తరాన కర్విరాల చెరువు. తూర్పున కొత్త కుంట. రెండు చెరువుల్లోంచి పునాదులు వేసుకున్న ఊరే కర్విరాల కొత్తగూడెం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ చిన్న గ్రామమిది. పల్లె తలాపున చిన్న గుట్ట. పొలిమేరలోని చెరువులే జీవనాధారం. ఈడొచ్చిన ఒడ్డోళ్ల పోరగాళ్లు చిన్నగుట్టను పగులగొట్టి కంకర చేసి పొట్టపోసుకుంటారు. ఇతర జాతుల వారికి చెరువుపై ఆధారపడి కుల వృత్తులు, చేతి వృత్తులతో జీవనం. ఊరు పుట్టిన 200 ఏళ్ల చరిత్రలో చెరువులు నిండిన సందర్భాలు చాలా తక్కువే. కాలం కలిసిరానప్పుడు ఒడ్డెర్లు వలసలతో, మిగతా కులాల నాటు సారా పెట్టి కాలం గడిపేవాళ్లట. అలాంటి ఊరు ఇప్పుడు వలసలను, గుడంబాను జయించింది. మిషన్ కాకతీయ కింద నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ చెరువులను పునరుద్దరించారు. వానలతో పని లేకుండా గోదావరి జలాలతో నింపారు. దాంతో వలస పోయిన వాళ్లతో పాటు సుదూరంలోని సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చి కొత్తగూడెంలో సందడి చేస్తున్నాయిప్పుడు. చెరువే ఆదరువు కర్విరాల చెరువుకు ఎగువన, కొత్తకుంటకు దిగువన లింగమంతుల గుట్ట, చిన్నగుట్ట, వడ్లు దంచే బండ... ఇవన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఎక్కువగా లేక చెరువులు నిండవు. ఆయకట్టు తక్కువే ఉన్నా చెరువు నీళ్లపై ఆధారపడి బోరు, బావుల కింద సాగు సాగేది. చేతి వృత్తులు బలపడేవి. మిషన్ కాకతీయ తొలి దశలో కొత్తకుంటకు రూ.26 లక్షలు, రెండో దశలో కర్విరాల చెరువుకు రూ.22 లక్షలు ఖర్చు చేసి పూడిక తీశారు. ఉపాధి హామీ పనులతో గ్రామస్థులంతా ఏకమై చెరువు క్యాచ్‌మెంటు ఏరియాను పునరుద్ధరించారు. హరీశ్ చొరవ చూపి శ్రీరాంసాగర్ కాల్వ నుంచి గోదావరి జలాలు తెచ్చి చెరువులు నింపారు. నిండిన చెరువుల్లో చేపలు పెంచారు. భూగర్భ జలాలు పెరిగి కర్విరాల చెరువు కింద 600 ఎకరాలకు, కొత్తకుంట కింద 300 ఎకరాలకు సాగునీరందుతోంది. చెరువులకు జలకళ రావడంతో వలస పోయిన గ్రామస్థులు తిరిగొచ్చారు. చేతి వృత్తులు పూర్తిగా అంతరించాయి గానీ కుల వృత్తులు ఇప్పుడిప్పుడే కొత్త జీవం పోసుకుంటున్నాయి. నాటుసారా పెట్టొద్దని ఊరు తీర్మానం చేసుకుంది. శీతాకాలంలో సైబీరియా నుంచి కొంగ జాతులొచ్చి వేసవి ముగిసే దాకా చెరువు మీదే గడిపి వర్షాకాలం ప్రారంభంలో తిరిగి వెళ్లిపోతున్నాయి. బోర్లకు నీళ్లు మళ్లినయి నాకు రెండు ఎకరాలుంది. బోరు నీళ్లే దిక్కు. చెరువుల పూడిక తీసి గోదావరి నీళ్లతో నింపినంక బోర్లళ్లకు నీళ్లు మళ్లినయి. రెండు కార్ల పంట వచ్చింది. కానీ ఈ ఏడాది చెరువుకు గోదావరి నీళ్లు రాలేదు. బోర్లు మళ్లీ మొదటికొచ్చినై. ప్రభుత్వం మళ్లీ గోదావరి నీళ్లొదిలి మా చెరువులు నింపాలె. – పేర్ల ప్రహ్లాద చెరువు నిండితే చుట్టాలొస్తరు చెరువుల్ల నీళ్లున్నప్పుడు మా ఊరికి సైబీరియా కొంగలొస్తయి. ఈ పక్షులు ఒక రకంగా మా చుట్టాలు. ఆర్నెల్ల పాటు చేప పిల్లల తిని బతుకుతై. గట్టు మీద సవారు చింతల తోపు చెట్ల మీద ఉంటై. –బండి అంతయ్య -
ఆయకట్టుకు ఆయువు!
సాక్షి, హైదరాబాద్: చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి లభ్యత పెరగడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయంలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా నీటి లభ్యత పెరిగిందని, ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పథకాలను సమీక్షించిన నీతి ఆయోగ్.. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల పథకాలను పేర్కొంటూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల్లో మిషన్ కాకతీయ ఒకటని కీర్తించింది. గత రబీలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు 2017 ఆగస్టులో రాష్ట్రంలో పలు చెరువులను పరిశీలించిన అనంతరం తాము గుర్తించిన అంశాలను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. పూడికతీత వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగిందని, తద్వారా సాగును ప్రోత్సహించినట్లయిందని తెలిపింది. భూమిలో నీటి సాంద్రత పెరిగిందని, మెజార్టీ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని వెల్లడించింది. చిన్న నీటి వనరుల కింద 265 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు మించి అందిందిలేదు. అయితే చెరువుల పునరుద్ధరణ తర్వాత గత రబీలో ఏకంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కింద పంట సాగైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ ఆయకట్టులో 63 శాతం ఆయకట్టుకు మిషన్ కాకతీయ నీరందించగలిగిందని నీతి ఆయోగ్ తెలిపింది. గణనీయంగా పెరిగిన దిగుబడి రైతులు పూడిక మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడంతో ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గిందని, పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎండిన బోరు బావులకు కాకతీయ ప్రాణం పోసిందని, చెరువుల ఆయకట్టు కింద 17 శాతం ఎండిన బావులు, బోరు బావులు పునరుజ్జీవం పొందాయని తెలిపింది. చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగిందని వెల్లడించింది. గతంలో మిషన్ కాకతీయ చెరువులపై అధ్యయనం చేసిన నాబ్కాన్స్ సంస్థ కూడా పూడిక మట్టితో రసాయన ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గిందని, రైతుకు ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గిందని తన అధ్యయనంలో తేల్చిందని చిన్న నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ పరిశీలనలో అవే వెల్లడయ్యాయని చెప్పాయి. పంటల దిగుబడి పరంగా చూసినా, వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల మేర పెరిగాయని తెలిపాయి. -
‘సప్త సముద్రాలకు’ పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: ఆకలి చావులు.. వలసలకు నిలయం.. సాగుకు నీళ్లు లేక గోసటిల్లిన నేల. పసిపిల్లలను, పండుటాకులను వదిలేసి ఎందరో వలసలు పోగా పల్లెలు పడావు పడిన ప్రాంతం. తరతరాలుగా కరువు కాళనాగై పగబట్టినట్టు వెంటబడి తరుముతుంటే సాగు చేయలేక, జోడెద్దులను సాకలేక కబేళాలకు అమ్ముకున్న రైతన్నల కన్నీళ్లతో నిండిన నేల పాలమూరు జిల్లా. ఇప్పుడు అదే బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాగులు.. వంకలు.. గొలుసుకట్టు చెరువులు.. పాడుబడ్డ కుంటలు.. సకల జల స్థావరాలను నింపుతూ నెర్రెలు బాసిన భూముల్లో జీవం నింపుతోంది. పాడుబడిన పాలమూరు జిల్లా మిషన్ కాకతీయ తొలి ఫలాలతో పచ్చని పంట చేనుగా మారింది. 45 వేల ఎకరాలు.. 60 గ్రామాలు గొలుసుకట్టు చెరువులు అంటే మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్త సముద్రాలు. రంగ సముద్రం, రాయ సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, గోపాల సముద్రం, మహభూపాల సముద్రం, శంకరమ్మ సముద్రం.. సప్త సముద్రాలుగా పేరెన్నికగన్నాయి. వనపర్తిని కేం ద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన నాటి రాజులు వీటిని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువులకు గతంలో ఆదరణ కరువైంది. పాడుబడిన పాలమూరులో నీళ్లు పారిస్తామని ఉద్య మ సమయంలోనే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే మిషన్ కాకతీయ కింద సప్త సముద్రాలను మరమ్మతు చేయించారు. 45 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తొలుత బీమా ఎత్తిపోతల నుంచి నీళ్లను తోడి కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 160 ఏళ్ల కిందట రాణీ శంకరమ్మ పాలనలో నిర్మించిన శంకర సముద్రాన్ని నింపారు. అటు నుంచి కృష్ణ సముద్రానికి, తర్వాత పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లోని రంగ సముద్రంలోకి నీళ్లు మళ్లాయి. తర్వాత కొత్తకోట మండలం రాయణిపేట వద్ద వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాయ సముద్రాన్ని నింపారు. అటు నుంచి వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించిన మహభూపాల సముద్రం చెరువును.. తర్వాత పెబ్బేరు మండలంలోని వీర సముద్రం చెరువు, పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రం చెరువును నింపి 45 వేల ఎకరాలకు సాగునీరుతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. గూటికి చేరిన వలస పక్షులు వనపర్తి జిల్లా వలసలకు నిలయం. భూమిని పడావు పెట్టి ఊరు ఊరంతా వలస వెళ్లటం అక్కడ సర్వ సాధారణం. మిషన్ కాకతీయ, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో ఇప్పుడీ గ్రామాలకు నీళ్లు వచ్చాయి. ఊళ్లలోనే పని దొరుకుతుండటంతో వలసపోయిన కుటుంబాలు తిరిగి వచ్చాయి. సాగు పనుల్లో నిమగ్నమయ్యాయి. 30 ఏళ్లుగా బోసినట్లు కన్పించిన ఖానాపురం ఇప్పుడు పల్లె రూపం సంతరించుకుంది. వలస పోయేటోన్ని శంకర సముద్రం నిండింది. మూడు పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. గతంలో ఏడాదిలో 10 నెలలు వలస పోయేటోన్ని. ఇప్పుడు ఊరిలోనే పొలం పనులు చేసుకుం టున్నాం. – నారాయణ, శ్రీరంగాపురం కళ్లెదుటే సుందర స్వప్నం ఉమ్మడి రాష్ట్రంలో ‘సప్త సముద్రాలు’ ఉనికి కోల్పోయాయి. వీటిని పునరుద్ధరిస్తే వనపర్తి జిల్లాలో కరువును రూపుమాపొచ్చని కేసీఆర్ నాతో చెప్పారు. రికార్డు సమయంలో మరమ్మతు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సుందర స్వప్నం ఆవిష్కృతమైంది. రైతన్నల మోముల్లో చిరునవ్వు ఆనందం కలిగిస్తోంది. – మంత్రి హరీశ్‌రావు -
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్‌రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
గిరి సీమల్లో కొబ్బరి సిరులు
అమలాపురం: మైదానంలో డెల్టా ప్రాంతాలకు.. మెట్టలో సాగునీటి సౌలభ్యమున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొబ్బరి సాగు.. ఇకనుంచీ కొండకోనల్లోనూ జోరుగా సాగనుంది. గిరి సీమల్లో సిరులు కురిపించడం ద్వారా గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. మొట్టమొదటిగా తూర్పు కనుమల్లో విశాఖ మన్యంలో కొబ్బరి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీసీఆర్‌ఐ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విశాఖ మన్యంలో 100 ఎకరాలకు సరిపడే కొబ్బరి మొక్కలను గిరి రైతులకు అందించనుంది. అన్నీ సవ్యంగా సాగితే విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొబ్బరిసాగుకు సీపీసీఆర్‌ఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొండ ప్రాంతాల్లో సాగుకు చేయూత.. కొబ్బరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేరళే. అక్కడ పశ్చిమ కనుమల విస్తీర్ణం ఎక్కువైనప్పటికీ కొబ్బరి సాగు పెద్దఎత్తున సాగుతుండడం విశేషం. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లోని మైదాన, మెట్ట ప్రాంతాల్లో సుమారు 3.01 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కేరళలో వర్షపు నీటిని నిల్వ చేయడం.. బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్), ఆచ్ఛాదన(మల్చింగ్) విధానాలతో కొండ ప్రాంతాల్లో కొబ్బరిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించి.. వాటి ద్వారా నీటిని మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇదే విధానంతో రాష్ట్రంలోనూ కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కేరళలోని కాసర్ఘోడ్లోని సీపీసీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం ముందుకొచ్చింది. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాలెం చౌడప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా విశాఖ మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఎంపిక చేసిన రైతులకు వచ్చేనెలలో ఆరువేల కొబ్బరి మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున వంద ఎకరాల్లో కొబ్బరితోట సాగు చేసేలా గిరిజన రైతులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలతోపాటు కాపు వచ్చేవరకు ఎరువులు, బిందు సేద్యం పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తెస్తారు. కొబ్బరిలో కోకో, పోక, ఏజెన్సీలో సాగు జరిగే కాఫీ, డ్రాగన్ ఫ్రూట్, అనాస వంటి పంటల్నీ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఇక్కడ సాగు విజయవంతమైతే.. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తారు. నీరు నిల్వ చేస్తూ.. కొండలపై సాగు చేస్తూ... కేరళ రైతులు వర్షం రూపంలో పడిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నీటిని నిల్వ చేసుకోవడం, దానిని తోటలకు మళ్లించడం ద్వారా అక్కడి రైతులు సముద్ర తీరప్రాంతమైన ఇసుక నేలలు, కొండవాలు ప్రాంతాల్లోనూ కొబ్బరి పంటను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇళ్లు, ఇతర భవంతులపై పడే వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులకు మళ్లించి.. దీన్నుంచి డ్రిప్ ద్వారా కొబ్బరి, ఇతర మొక్కలకు నీటిని ప్రవహింపచేస్తున్నారు. ఇదే రీతిలో కొండవాలు ప్రాంతాల్లో పడే వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నీరు ట్యాంకులోకి వెళ్లేందుకు అనువుగా గట్లు వేస్తూ.. ట్యాంకులోకి నీరు వెళ్లేచోట అడుగున వెడల్పుగా బ్లాక్‌మెటల్ వేస్తారు. తొలుత ఇళ్లు, భవనాలన ఉంచి వచ్చే నీటిని, తరువాత దిగువన నిర్మించిన ట్యాంకు నీటిని కొబ్బరి సాగుకోసం వినియోగిస్తున్నారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం... ఏజెన్సీలో కొబ్బరిసాగు చేస్తే గిరి రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందుతారు. కాఫీ, మామిడి, జీడి మామిడి కన్నా కొబ్బరి ఎక్కువకాలం పంట. నెలనెలా దిగుబడి రూపంలో ఆదాయం వస్తుంది. కొబ్బరితోపాటు దీనిలో విలువైన అంతర పంటలను కూడా సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాగుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాం. కేరళ తరహాలోనే బిందు సేద్యం పద్ధతిలో ఏజెన్సీలోనూ కొబ్బరిసాగు చేయవచ్చు. –పాలెం చౌడప్ప, డైరెక్టర్ సీపీసీఆర్‌ఐ, కాసరఘోడ్, కేరళ -
సాగునీటి కోసం ఉద్యమించాలి
భూత్పూర్ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్‌యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్‌యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్‌యాత్ర చేపడితే సైకిల్‌పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు. జడ్చర్లలో ఘన స్వాగతం.. జడ్చర్ల టౌన్ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు. పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు. -
చివరిదశకు ‘ఉదయసముద్రం’ పనులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఒకటి, అదే నెల 25న మరొక పంపు డ్రై రన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా పనులన్నీ జెట్ స్పీడ్‌తో చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం శాసనమండలిలోని మినిస్టర్స్ చాంబర్స్‌లో సమీక్షించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నదన్నారు. ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌లోకి నీరు చేరేవిధంగా మే నెల చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ పనులు పూర్తయ్యాయని, 3.665 కిలోమీటర్ల పొడవున్న కాలువకట్ట పనుల్లో మిగిలినవాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 6.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 10.625 కిలో మీటర్ల టన్నెల్ పనుల్లో 2.22 మీట ర్లు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయని తెలిపారు. మే చివరికల్లా మొత్తం టన్నెల్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు పూర్తయితేనే రిజర్వాయర్‌లో నీరు నింపేందుకు వీలవుతుందన్నారు. ఆ లోగా పంప్‌హౌస్ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. ఖరీఫ్‌లోగా రిజర్వాయర్ నుంచి 40 చెరువులను నింపేవిధంగా పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద మొదటి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 40 చెరువులను నింపడానికి గాను ఫీడర్ చానళ్ల పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్ సీఈ ఎస్.సునీల్, ఎస్ఈ హమీద్ ఖాన్, ఈఈ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జూన్ నాటికి ప్రాజెక్టులన్నీ పూర్తి: ఎంపీ కవిత
మంథని/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కరువు తీరనుందని ఎంపీ కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ పనులు, మహదేవపూర్ మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనులను మంగళవారం ఆమె సందర్శించారు. జూన్ నాటికి రాష్ట్రంలోని ప్రాజె క్టులన్నీ పూర్తవుతాయని కవిత తెలిపారు. అన్నారం బ్యారేజీ నుంచి 2 టీఎంసీల నీటిని ప్రతిరోజూ వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు 2050 వరకు ఎలాంటి కొరత లేకుండా కాళేశ్వరం ద్వారా అందనుందన్నారు. కవిత వెంట మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పుట్ట మధు తదితరులు ఉన్నారు. -
చెరువు పనుల్లో.. చిలక్కొట్టుడు
మిషన్ కాకతీయ.. చెరువులను పునరుద్ధరించే గొప్ప పథకం. ప్రతి వర్షపు చుక్క నీటిని నిల్వ చేసుకోవడం.. రైతుల మోములో ఆనందం నింపడం దీని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యంతో మిషన్ కాకతీయ అభాసుపాలవుతోంది. చాలా చోట్ల చెరువులు ఆక్రమణలకు గురైనా అధికారులు రికార్డుల్లో ఉన్న పూర్తి విస్తీర్ణానికి టెండర్లు పిలుస్తున్నారు. అలా కొద్దిమొత్తంలో పనులకే ఎక్కువ సొమ్ము ముట్టజెబుతున్నారు.. దీనికితోడు సగం సగం పనులే చేసినా.. నాసిరకంగా చేసినా కూడా మొత్తం బిల్లు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పుచ్చుకుంటున్నారు. మరోవైపు పలు చోట్ల చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదు. అలాంటి చోట్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రావడం లేదంటూ వాపోతున్నారు. మొత్తంగా చెరువుల పునరుద్ధరణ లక్ష్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయలో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఈ వారం ‘ఫోకస్’.. – సాక్షి నెట్వర్క్ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీరు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మిషన్ కాకతీయ’పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 45 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించి.. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఒక్కో విడతలో సుమారు 9 వేల చెరువుల చొప్పున ఎంపిక చేస్తూ.. పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యం ఇంత ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కానీ రికార్డుల్లో మాత్రం పూర్తి విస్తీర్ణం నమోదై ఉంది. అయితే అధికారులు ఇలా ఆక్రమణలకు గురైన మేర భూమి విస్తీర్ణాన్ని తగ్గించకుండా... పూర్తి విస్తీర్ణాన్ని లెక్కించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టర్లు కొంతమేరకే పనులు చేశారు. అధికారులు వారితో కుమ్మక్కై పూర్తి మొత్తానికి బిల్లులు మంజూరు చేశారు. ఇక ఉన్నమేరౖనా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకపోయినా, నాసిరకంగా చేసినా కూడా పట్టించుకోలేదు. దీంతో చాలా చోట్ల చెరువుల తూములకు గండ్లు పడ్డాయి. కట్ట, మత్తడి దెబ్బతిన్నాయి. కాలువలు కనిపించకుండానే పోయాయి. మరోవైపు బిల్లుల జాప్యం.. రెండు, మూడు విడతల పనుల్లో కేవలం కట్టను చదును చేయడం, మట్టిని నేర్పడం, తూముల మరమ్మతు వంటి పనులు మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల మొదటి విడతలో మంజూరైన పనులే ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. పలుచోట్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఈసారి పాత కాంట్రాక్టర్లలో చాలా వరకు నాలుగో దశకు టెండర్ వేయలేదు కూడా. వాస్తవానికి నిధుల సమస్య కారణంగానే నాలుగో విడతలో ప్రతిపాదించిన చెరువుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల పాలవుతున్నామంటున్న కాంట్రాక్టర్లు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లి–కొండారెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పెద్ద చెరువు 68 ఎకరాల్లో ఉంది. కాంట్రాక్టర్ రూ.14.25 లక్షలకు ఈ చెరువు పునరుద్ధరణ పనులు దక్కించుకున్నారు. ఏడాది క్రితమే పనులు పూర్తిచేసినా.. ఇప్పటివరకు రూ.6 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేశానని, బిల్లులు చెల్లించక నానా అవస్థలు పడుతున్నానని కాంట్రాక్టర్ వాపోతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయిని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే పనులు చేస్తున్న కాంట్రాక్టర్దీ ఇదే తరహా పరిస్థితి. రూ.2.4 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పనుల్లో రూ. కోటికిపైగా విలువైన పనులు పూర్తయినా.. కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు రూ.30 వేల మేర మాత్రమే బిల్లులు చేతికందినట్లు చెబుతున్నారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా పనులు పూర్తయినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బిల్లు రాదు పని కాదు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ చెరువును మిషన్ కాకతీయ మూడో దశలో ఎంపిక చేశారు. 16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు పునరుద్ధరణకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్ చెరువు కట్టకు మాత్రమే మరమ్మతు పనులు చేశారు. ఇందుకోసం రెండెకరాల్లో మాత్రమే మట్టిని తీశారు. చెరువు తూము, మత్తడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రెండు కాలువల్లో ఒక కాలువ మాత్రమే చేపట్టారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా.. చేసిన పనులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ 18న రూ.7 లక్షల బిల్లు పెట్టినప్పటికీ ఇప్పటికీ సొమ్ము రాలేదని, దాంతో పనులు నిలిపేశామని చెప్పారు. చిన్న నీటి పారుదల శాఖ జేఈ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా.. బిల్లులు విడుదల కాలేదని, మంజూరైన వెంటనే పనులను పునః ప్రారంభింపజేస్తామని తెలిపారు. పనులు చేయకపోయినా బిల్లులు.. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోని రాయిని చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు. ఈ చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.62 లక్షలు మంజూరు చేసింది. మొత్తం చెరువులో పూడికతీయాల్సి ఉండగా.. కేవలం చెరువు కట్టకు అవసరమైన మేర మాత్రమే మట్టి తవ్వారు. సుమారు 20 శాతం పనులే పూర్తయినా.. 60 శాతం పనులు పూర్తయినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఇక కాంట్రాక్టర్ చెరువు తూములను నాసిరకంగా నిర్మించడంతో గ్రామ రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. గతేడాది అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. లేని భూమికి టెండర్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరులోని రామయ్య చెరువు 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిషన్ కాకతీయ రెండో విడతలో ఈ చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.40.5 లక్షల అంచనాతో టెండర్లు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్ 22 శాతం తక్కువ (లెస్)కు ఈ పనులను దక్కించుకున్నారు. అయితే చెరువులో సుమారు పదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. ఈ మేరకు విస్తీర్ణం, టెండర్ ధరను తగ్గించాల్సి ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. దీంతో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరింది. పనుల్లో తొండి.. తూముకు గండి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లిలోని గౌని చెరువును మిషన్ కాకతీయ తొలి విడతలో పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 81.18 ఎకరాలు. కానీ అందులో 21 ఎకరాలకుపైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని లెక్కించి.. రూ.35 లక్షలకు పనులు అప్పగించారు. ఇక కాంట్రాక్టర్ ఏదో పైపైన పనులే చేశారు. తూము, కట్ట నిర్మాణం నాసిరకంగా చేశారు. ముళ్ల పొదలను కూడా తొలగించలేదు. ఈ అరకొర పనులకు కూడా అధికారులతో కుమ్మక్కై రూ.10 లక్షలు బిల్లు తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది కురిసిన కొద్దిపాటి వర్షాలకే తూముకు గండిపడింది. ఆయకట్టు రైతులంతా కలసి ఆ తూమును మూసివేశారు. ఇక చెరువంతా ముళ్ల చెట్లతో నిండిపోయింది. ఇక ఉపాధి హామీ పథకం కింద మరో రూ.24 లక్షలు వెచ్చించి చెరువులో ఒండ్రు మట్టి తవ్వకాలు చేపట్టారు. అయినా చెరువు పూడికతీత పూర్తి కాలేదు. మొరం పోసి.. కానిచ్చేశారు..! జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మిషన్ కాకతీయ తొలివిడతలో ఈ చెరువును పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రూ.1.33 కోట్లకు కాంట్రాక్టుకు ఇచ్చారు. పూడికతీతతోపాటు తూముల నిర్మాణం, పంట కాలువ పనులు, మత్తడి నిర్మాణం చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేసి, బిల్లు తీసేసుకున్నారు. తూముల నిర్మాణం, చెరువుకట్ట, పంట కాల్వల పనుల్లో నాణ్యత లేదని రైతులు మొత్తుకుంటున్నారు. రాయికల్ నుంచి చెర్లకొండాపూర్కు వెళ్లే ప్రజలు ఈ చెరువు మత్తడిపై నుంచే ప్రయాణిస్తారు. ఈ మేరకు మత్తడిని పటిష్టం చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ గతంలో ఉన్న మత్తడిపైనే కాస్త మొరం పోసి వదిలేశారు. -
పొంచి ఉన్న సాగునీటి కష్టాలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగి పంటకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో చివరి తడులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యాసంగికి నీటి విడుదల ప్రారంభమైన 2017 డిసెంబర్ 25 నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ యాసంగి సీజను (2016 డిసెంబర్ 25) నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత సీజనుతో పోల్చితే ఈ ఏడాది నీటి నిల్వ సగానికి తగ్గడంతో ఆయకట్టుకు సాగునీరం దడం ప్రశ్నార్థకమవుతోంది. చివరి తడులకు ఇబ్బందులు..? ఈ యాసంగి సీజనులో ప్రాజెక్టు కింద మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిసెంబర్లో నిర్ణయించింది. లక్ష్మి కాలువ కింద నిజామాబాద్ జిల్లా పరిధిలో 16 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ కింద ఉన్న మరో 16,300 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సుమారు 3.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని ఎల్ఎండీ ఎగువ భాగం వరకు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా నీటి పారుదలశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం ఎనిమిది తడులు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాలువకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదట్లో రోజుకు ఐదు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.అయితే చివరి ఆయకట్టుకు సాగునీరు చేరకపోవడంతో ఇప్పుడు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో తడికి 4.8 టీఎంసీల చొప్పున నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది. ఈ లెక్కన ఎనిమిది తడులకు సుమారు 38.4 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటుంది. కానీ నీటి విడుదల ప్రారంభించే నాటికి జలాశయంలో 47 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. డెడ్‌స్టోరేజీ, ఎవాబ్రేషన్ లాస్, తాగునీటి అవసరాలు పోగా కేవలం సుమారు 33 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. కానీ ఎనిమిది తడులకు 38.4 టీఎంసీల నీటి అవసరం ఉన్న నేపథ్యంలో సుమారు ఐదు టీఎంసీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పంట కీలక దశ చివరి తడికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ «అధికారులు సూచిస్తున్నారు. గత యాసంగి సీజనులో 80 టీఎంసీలు.. గతేడాది ఈ యాసంగి సీజను ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఈసారి 47 టీఎంసీలే ఉండటంతో సాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా గతేడాది యాసంగి సీజను మాదిరిగానే ఈసారి కూడా ఆయకట్టు రైతులు వరి వైపే మొగ్గుచూపడంతో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టులో నీటి లభ్యత దృష్ట్యా ఇందుకు రైతులు సహకరించాలి.’’ అని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
బోధన్ ఇరిగేషన్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఇరిగేషన్ డిఈ శ్రావణ్ కుమార్ రెడ్డి ఇంటిపై ఏసీబి దాడులు చేసింది. బాన్సువాడ లోని ఆయన నివాసంలో రూ.40లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖదీదైన కారును సీజ్ చేశారు. ఆర్మూర్‌లో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడా విలువైన అస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. -
ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
-
తాగునీటి గండం గట్టెక్కినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు వస్తున్న ప్రవాహాలతో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో పూర్తిస్థాయి సాగు అవసరాలను తీర్చే అవకాశాలు లేకున్నా, తాగునీటి గండం నుంచి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అవసరాలకు పెద్దదిక్కుగా ఉన్న సాగర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటం, ఎగువ శ్రీశైలానికి భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రాష్ట్రానికి ఉపశమనమిస్తోంది. మిషన్ భగీరథకు ఢోకాలేదు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, కడెం, సింగూరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు 727.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 438.9 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇందులో ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు దిగువన 168 టీఎంసీలు ఉండాల్సిందే. శ్రీశైలంలో ఏపీ వాటా మరో 100 టీఎంసీలు, ఆవిరి నష్టాలు మరో 20 టీఎంసీలను పక్కన పెట్టినా, గరిష్టంగా 150 టీఎంసీల రాష్ట్ర వాటా ఉన్నట్టే. ఇందులో ఇప్పటికే సాగు ప్రాజెక్టులకింద ఉన్న తాగునీటి కేటాయింపులు 40 నుంచి 50 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక మిషన్ భగీరథ కింద ఈ ఏడాది జనవరి నుంచి 60 టీఎంసీల అవసరాలు ఉండనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద వచ్చే జూలై వరకు మిషన్ భగీరథకు 16 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు మరో 16 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీల మేర అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్‌లో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 13 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అయితే ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలంలోకి 1.21లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 181 టీఎంసీలకు చేరింది. ఇక్కడ లభ్యతగా ఉన్న నీటిని అవసరానికి తగ్గట్టు ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ప్రవాహాలతో మరింత నిల్వలు పెరిగితే వాటా ప్రకారం సాగర్‌నుంచి గరిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల వాటా అయినా దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో వచ్చే ఏడాది వరకు తాగునీటి కష్టాలను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్ పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి, కడెంలు పూర్తి స్థాయి మట్టాలకు చేరుకున్నాయి. ఎస్సారెస్పీలో అనుకున్న మేర నీటి నిల్వలు చేరకున్నా, ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 37.38 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలకు ఢోకాలేదు. ఒక్క నిజాంసాగర్ ప్రాజెక్టు కింది తాగునీటి అవసరాలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సింగూరుకు మరిన్ని ప్రవాహాలు కొనసాగితే, అక్కడి నుంచి నిజాంసాగర్‌కు నీటి విడుదల జరిగే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇక్కడి అవసరాలు సైతం తీరుతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కట్టలు తెగిన నిర్లక్ష్యం
బనగానపల్లె/కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)ని వరుస గండ్లు వెంటాడుతున్నాయి. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లోని 1.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ గత ఆరేడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆదివారం తెల్లవారు జామున బనగానపల్లె సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు భారీ గండి పడటంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఇదే కాలువకు భారీ గండి పడి పంట పొలాలు నీట మునిగి నష్టం సంభవించింది. అదే ఏడాది అవుకు సమీపంలో మరో గండి పంట పొలాలను ముంచెత్తింది.అప్పుడు తాత్కాలిక మర మ్మతులతో సర్కార్ చేతులు దులుపుకున్న ఫలితంగా ఆదివారం భారీ గండి పడి బనగానపల్లె వాసులను భయాందోళనకు గురిచేసింది. ఎస్సార్బీసీని పటిష్టం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సర్కార్ నిద్రమత్తులో తూగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు తాజా గండి నేపథ్యంలో వెల్లువెత్తుతున్నాయి. గండికి ప్రధాన కారణాలు గత ఏడాది అధికారులు అనాలోచితంగా ప్రవాహస్థాయికి మించి కాల్వకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా కాల్వ పటిష్టతను పట్టించుకున్న దాఖలాలు లేవు. నీరు–చెట్టు పథకం కింద కాల్వలోకి జేసీబీలను దించి పనులు చేయించే సమయంలో కాల్వ దెబ్బతినడం, కట్టపై నిత్యం భారీ వాహనాలు తిరగడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల మళ్లీ గండి పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కాల్వ పటిష్టతను పరిశీలించిన తర్వాత నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అదేదీ పట్టించుకోకుండా సామర్థ్యానికి మించి ఒకేసారి నీటిని విడుదల చేయడంతో గండి పడి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే.. శుక్రవారం వరకు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయని అధికారులు శనివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి సుమారు 1,500 క్యూసెక్కులు విడుదల చేయడంపై కొందరు ఇంజనీరింగ్ అధికారులే తప్పుబడు తున్నారు. ప్రధాన కాల్వ దెబ్బతిన్నందున దశలవారీగా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు ఇలా ఒకేసారి విడుదల చేయడంతో గండ్లు పడే ప్రాంతాలను అధికారులు గుర్తించలేకపోయారు. కట్టుబట్టలతో రోడ్లపైకి ... ఎస్సార్బీసీకి గండి పడి నీరంతా బనగానపల్లె పట్టణంలోని వివిధ కాలనీల్లోకి చేరింది. పెండేకంటి నగర్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, ఈద్గానగర్, ఎరుకలికాలనీ.. తదితర ప్రాంతాలను నీరు ముంచెత్తింది. ఎరుకలి కాలనీలోని ఇళ్లలో రెండు అడుగుల లోతు నీరు ప్రవహించి బియ్యం, కందిపప్పు, వంట సామగ్రి తడిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్‌బంకు, పవర్ హౌస్ ప్రాంతానికి విస్తరించడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో ప్రహరీకి గండి కొట్టారు. దీంతో ఈద్గానగర్ జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు కట్టుబట్టలతో రోడ్డుపైకి చేరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై గడపాల్సి వచ్చిందని, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. పండుగ పూట చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. -
డిసెంబర్‌కి ‘ఉదయ సముద్రం’ పూర్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనవరి మొదటి వారంలోగా బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులోకి చెరువులు నింపడానికైనా నీళ్లు విడుదల చేస్తామన్నారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించి ముందుకెళుతోం దన్నారు. టన్నెల్లో ఇంకా 675 మీటర్ల పని మిగిలి ఉందని, నెలకు 200 మీటర్ల చొప్పున మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారు లను, ఏజెన్సీని ఆదేశించామన్నారు. 15 రోజులకోసారి ఈ పనుల విషయమై కలెక్టర్‌ను రివ్యూ చేయాలని చెప్పామన్నారు. సకాలంలో నిర్ధారిత పని చేయకపోతే సదరు ఏజెన్సీని తొలగించి బ్లాక్‌లిస్టులో పెట్టి ప్రత్యామ్నాయ ఏజెన్సీకి పనులు అప్పగిం చాలని ప్రాజెక్టు సీఈ సునీల్‌ను ఆదేశిం చామని మంత్రి పేర్కొన్నారు. పనులన్నీ పూర్తి చేసి డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలో ముం దుగా 40 వేల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ కృష్ణానదిలో ఇప్పటి వరకు నీళ్లు ఆశాజనకంగా లేవని, ఇటీవల కొంత వరద వచ్చిందన్నారు. తాగునీటికి ఇక ఢోకా లేదని, ఇంకా కొంత వరద వస్తే అటు ఎన్నెస్పీకి, ఇటు లోలెవల్ కెనాల్, ఉదయ సముద్రం, ఏఎమ్మార్పీకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుం దని ఆయన వివరించారు. మిగిలి ఉన్న భూ సేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాల న్నారు. ఏఎమార్పీ కాలువల్లో జంగిల్ కటిం గ్ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. -
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
-
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర కానుకగా వచ్చే జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అం దించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకోసం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఇంటేక్ వెల్స్ నుంచి నీటిని తీసుకుని.. ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా మంచినీటిని పంపింగ్ చేయాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయిం బవళ్లు పనిచేసి అయినా లక్ష్యాన్ని చేరుకోవా లని సూచించారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిషన్ భగీరథపై గురువారం ప్రగతి భవన్లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇది జీవన్మరణ సమస్య మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. అనుకున్న సమయంలో ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించటం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందిం చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాలు చేసి మరీ మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎవరూ తీసుకోని సవాల్ స్వీకరించా మని.. దానికి తగినట్లు పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. రూ.43 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని ఇకపై స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షిం చాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం 19 ఇంటెక్‌వెల్స్‌లో ఇప్పటికే 16 పూర్త య్యాయని, మిగతావి త్వరలోనే పూర్తవుతా యని అధికారులు వివరించారు. 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 27 పూర్తికావచ్చాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 49,238 కి.మీ.కు గాను 43,427 కి.మీ. (88 శాతం) పైపులైన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు. ముప్పై ఏళ్ల ముందస్తు ప్లాన్ ఇది.. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ రూపొందించామని.. అప్పటికి ప్రజలకు సరిపడే నీటిని అందించేలా ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరోసారి మదింపు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని... ప్రతి జిల్లాలో మం త్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యే నాటికే వాటికి కావలసిన విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల నిర్మాణం జరగాలన్నారు. ఆ పనుల పర్య వేక్షణకు ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ముగ్గురు అధికారులను నియమించాలని సూచించారు. తాగునీటికి ప్రాధాన్యం జలాశయాల నీటిని వాడుకునే విషయంలో మంచినీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు కేటాయిస్తామని.. అందుకు చట్టం కూడా తెచ్చామని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని తీసుకోగల కనీస మట్టం (ఎండీడీఎల్) ఉండేలా చూసుకోవాలని.. దీనిపై నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్‌ను మార్చాలని సూచించారు. రాష్ట్రంలో 19 ప్రాంతాల్లోని నీటి వనరుల్లో కేవలం దుమ్ముగూడెం వద్ద మాత్రమే 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని.. మిగతా 18 నీటి వనరులలో నిరంతరం నీరు అందుబాటులో ఉండేందుకు ఇది ఎండీడీఎల్ పాటించడం అవసరమని పేర్కొన్నారు. వర్కింగ్ ఏజెన్సీలకు గొప్ప అనుభవం పథకం వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించాలని... ఈ పథకం వర్కింగ్ ఏజెన్సీలకు కూడా ప్రతిష్టాత్మకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోందని, సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి 1.5 శాతం ఇన్సెంటివ్ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాప్యం చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీల నుంచి పనులను తప్పించడానికి ప్రభుత్వం వెనుకాడదని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. మూడు కీలక పథకాలూ విజయవంతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు మూడు అని.. ఒకటి నిరంతర విద్యుత్ సరఫరా, రెండోది రైతులకు సాగునీరు అందివ్వడం, మూడోది ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘‘విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించాం. 45 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే వంద శాతం పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. పనులు అనూహ్యంగా జరుగుతున్నాయి. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు సమకూరుస్తున్నాం. మొత్తం ఏడాదికి రూ.58 వేల కోట్ల వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుండే గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి.. అదే సమయంలో ఇంటింటికీ మంచినీరు అందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి జీఎస్టీ వల్ల తమపై అధిక భారం పడుతుందని సమీక్ష సందర్భంగా వర్కింగ్ ఏజెన్సీలు ప్రస్తావించాయి. పరికరాలు, మెటీరియల్ కొనుగోలు సందర్భంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందని.. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... ప్రజోపయోగ పనులపై జీఎస్టీ తగ్గించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమా వేశంలో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిం చకుంటే వర్కింగ్ ఏజెన్సీలకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల
కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు, గండికోట వద్ద నీటి డెలివరీ ఫాయింట్, పురుషోత్తపట్నం నుంచి సీతానగరం, నాగంపల్లి మీదుగా అచ్చయ్యపాలెం, గండికోట మార్గాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పైలాన్ ఏర్పాటుపై అసహన వ్యక్తం పైలాన్ ఏర్పాటుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి కాస్త దూరంలో విద్యుత్ స్తంభాల వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను తక్షణమే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసి మొదటి దశ నీరు విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం సీతానగరం నుంచి పథకం వద్దకు కాన్వాయ్ ద్వారా చేరుకుని నీరు విడుదల చేస్తారని చెప్పారు. అనంతరం సీతానగరం చేరుకుని గండికోట వద్ద పోలవరం ఎడమ కాలువలో పథకం నీరు డెలివరీ పాయింట్‌ను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జగ్గంపేటలో నిర్వహించే సభకు వెళ్తారని చెప్పారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఎస్.పి.బి.రాజకుమారి, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సి.ఎస్.ఎన్.మూర్తి, విద్యుత్ శాఖ డీఈ రాజబాబు, ఏడీఈ కె.రత్నాలరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, తహసీల్దార్ కె.చంద్రశేఖరరావు, టి.గోపాలకృష్ణ, కె.పోశయ్య, దేవి, ఎంపీడీఓ డి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.