మసనోబు ఫుకుఓక ఆవిష్కరణ..
► విత్తన బంతులతో సేద్యం!
బంజరు భూముల్లో, కొండలు, గుట్టల్లో, ఎడారి ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి దోహదపడటంతోపాటు రాజు టైటుస్ వంటి ప్రకృతి వ్యవసాయదారులు తమ పొలాలను దున్నకుండా విత్తన బంతులతో సేద్యం చేస్తుండడం విశేషం.
1940లోనే జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా విత్తన బంతుల విధానాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం అన్ని దేశాలకూ విత్తన బంతుల వాడకం విస్తరించింది.
విత్తన బంతుల తయారీ ఇలా..
మెత్తని జల్లెడ పట్టిన ఎర్రమట్టి మూడు పాళ్లు, పశువులు/వానపాముల ఎరువు ఒకపాలు, జీవామృతం మిశ్రమాన్ని కలిపి.. రొట్టెల ముద్దలు చేసినట్టు.. గులాబ్ జామూన్ సైజులో చేసుకోవాలి.రెండు, మూడు విత్తనాలను అందులో చొప్పించి 3–4 గంటలు ఆరబెట్టాలి. గట్టి పడిన విత్తన ముద్దలను నిల్వ చేసుకొని.. వర్షాకాలంలో గుట్టలపైనా క్షీణించిన అడవుల్లో వెదజల్లాలి. ఇదే పద్ధతిని అనుసరించి భూమిని దుక్కి చేయకుండా పంట విత్తనాలతో సైతం విత్తన బంతులు తయారు చేసి.. సేద్యం చేయవచ్చు అని రాజు ౖటైటుస్ చెబుతున్నారు.