ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి జూరాలకు చేరుకున్న వరద ప్రవాహం
జూరాల విద్యుత్ కేంద్రం, ప్రాజెక్టు గేట్ల నుంచి నీరువిడుదల
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్‌ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.
ఆల్మట్టి డ్యామ్‌లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది.
నేడు తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం
కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది.
సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల
ఎత్తులో నీటిప్రవాహం
తెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.
బరాజ్‌లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్‌లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది.
Comments
Please login to add a commentAdd a comment