krishnamma
-
మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్/కడెం: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భీకర వరద పోటెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటలకు వరద ప్రవాహం 4,10,581 క్యూసెక్కులకు పెరగడంతో 212.38 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 8 గేట్లను 12 అడుగులు, మరో 2 గేట్లను 10 అడుగుల మేరకు పైకెత్తి 3,12,390 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,227 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు కలిపి మొత్తం 68,109 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000, హంద్రీ నీవా ద్వారా 1,688, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి కాల్వకు మొత్తం 29,088 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లోలు 4,09,587 క్యూసెక్కులకు పెరిగాయి. సాగర్ 26 గేట్లు ఎత్తివేత..దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 3,87,653 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతుండగా, 308.76 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. సాగ ర్ 20 గేట్లను 10 అడుగుల మేర, మరో 6 గేట్లను 5 అడుగు లమేర పైకెత్తి 3,43,810 క్యూసె క్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,313 క్యూసెక్కుల ను కిందికి విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 5,496, ఎడమ కాల్వకు 6,634, ఏఎంఆర్పీకి 1,800, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో సాగర్ నుంచి మొత్తం అవుట్‌ఫ్లోలు 3,87,653 క్యూసెక్కు లకు పెరిగాయి.దీంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రవాహానికి తోడు కావడంతో ప్రకాశం బరాజ్‌కి వరద ఉధృతి పెరిగింది. బరాజ్‌కి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 184 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ఆల్మట్టికి భారీ వరద..పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టిలోకి వస్తున్న 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.78 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,983 క్యూసెక్కులు చేరు తుండటంతో నీటి నిల్వ 94.55 టీఎంసీలకు చేరుకుంది.అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్భారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని, సెలవులు తీసుకోరాదని సూచించారు. జలాశయాలు, చెరువుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.కడెం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేతఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు శనివారం 22,696 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఏడు వరద గేట్లు ఎత్తి 57,821 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
సాగర్ 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళు
నాగార్జునసాగర్/దోమలపెంట: కృష్ణా ఎగువ నుంచి భారీస్థాయిలో నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది.దీంతో గురు వారం ప్రాజెక్టు మొత్తం 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. గేట్ల ద్వారా 2,67,906 క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుతాμదన కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు.. మొత్తంగా 2,96,407 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు(312.5050 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 586.00 అడుగుల( 300.3200 టీఎంసీల) నీటి నిల్వలున్నాయి. 15 ఏళ్లలో 11సార్లు తెరుచుకున్న మొత్తం గేట్లు ఈ పదిహేను సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు 11సార్లు తెరుచుకు న్నాయి. 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2019, 2020, 2021, 2022, 2024 సంవత్సరాల్లో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత కూడా 2.5లక్షల క్యూసెక్కులు వరద వస్తే కచ్చితంగా 26 గేట్లు తెరవాల్సిందేనని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును చూడటానికి వచిన సందర్శకులు● శ్రీశైలం జలాశయానికి వరద మళ్లీ కాస్త పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు 3,15,000 ఇన్‌ఫ్లో ఉండగా.. 45 గేట్లు ఎత్తి సిμల్వే ద్వారా 3,13,065 క్యూసెక్కులు, విద్యుదుతμత్తి ద్వారా 19,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి మరో 58,227 క్యూసెక్కులతో మొత్తం 3,91,066 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో పది గేట్లు ఎత్తి 3,08,480 క్యూసెక్కులు,విద్యుదుతμత్తి ద్వారా 65,410 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, సాగర్‌కు చేరుతోంది. -
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్: పులిచింతల ప్రాజెక్టుదిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కో గేటు ఎత్తుతూ రాత్రి 9.30 సమయంలో మొత్తం 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,20,064 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 28,907 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం 1,48,971 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేసే నీటి పరిమాణం గంట గంటకూ పెంచుతుండటంతో పులిచింతలలోకి చేరుతున్న వరద క్రమేణా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 30,388 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 గేట్లు ఎత్తి 26,083 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 6.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో రెండ్రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండనుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,44,218 క్యూసెక్కులు చేరుతుండగా.. 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 26,481, కుడి విద్యుత్ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం కొంతమేర తగ్గింది. ఆ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను నింపుతూ దిగువకు 1,89,700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో భీమాపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 1,27,705 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్రలో వరద ప్రవాహం కొంత తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 82 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 50 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.నిలకడగా గోదావరిపోలవరం రూరల్: గోదావరి వరద నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.320 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 7.26 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 35.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. టెయిల్ పాండ్ నుంచి 1,32,411 క్యూసెక్కులుసత్రశాల (రెంటచింతల): పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద కృష్ణా నదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్లు, ఆరు క్రస్ట్‌గేట్లు ద్వారా మొత్తం 1,32,411 క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏడీ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ సోమవారం తెలిపారు. ఎగువనున్న నాగార్జున సాగర్ నుంచి టైల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 1,32,794 క్యూసెక్కులు వరదనీరు వస్తోందన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్‌లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్‌లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్‌లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
-
వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల అయింది. అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.చిత్రపరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ‘కృష్ణమ్మ’ని విడుదల చేశాయి. ఇందులో సత్యదేవ్ నటనతో పాటు సెకండ్ పార్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ కథా నేపథ్యం కాస్త సాగతీతగా ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’ వచ్చేసింది. మే 16 నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో చూడలేని ప్రేక్షకులు ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.టాలీవుడ్లో మంచి ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేసేందుకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. ‘కృష్ణమ్మ’ సినిమా కూడా స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథగా సాగుతుంది. ఇందులో బలమైన భావోద్వేగాలతో పాటు రా రస్టిక్ కోణం ఉన్నప్పటికీ.. కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి తీరు కాస్త సాగతీత వ్యవహారంగా ఉంటుంది. -
Athira Raj: ‘కృష్ణమ్మ’ మూవీ హీరోయిన్ నటి అథిరా రాజ్ (ఫొటోలు)
-
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
కృష్ణమ్మ నదిలో మలుపుల్లా...
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రంలో అతీరా రాజ్ హీరోయిన్. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘వించిపేట భద్ర, శివ, కోటి అనే ముగ్గురి స్నేహితుల నేపథ్యంలో సాగే కథ ఇది. కథ ప్రధానంగా 2003–2015 మధ్యకాలంలో జరుగుతుంది.కొంతకాలంగా నేను ఎదురు చూస్తున్న మంచి హిట్ ‘కృష్ణమ్మ’తో లభిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘రాజకీయాలు, రౌడీయిజం అంశాలు ‘కృష్ణమ్మ’ సినిమాలో లేవు. విజయవాడను మరో కోణంలో చూసేలా ఈ చిత్రం ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాం. కృష్ణమ్మ నదిలో ఎలా అయితే మలుపులు ఉంటాయో భద్ర, కోటి, శివ జీవితాల్లో కూడా మలుపులు ఉంటాయి. ఈ మలుపులను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వీవీ గోపాలకృష్ణ. -
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
‘‘నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ‘నాయగన్’ సినిమాలో కమల్‌హాసన్‌లా కొత్త గెటప్ ట్రై చేయాలని ఉంది. చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం అంటే ఇష్టం. అలాగే ‘బాహుబలి’ కూడా. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా కల. కొత్త తరహా కథతో రూపొందించిన కృష్ణమ్మ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని హీరో సత్యదేవ్ అన్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘కృష్ణమ్మ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఓకే అయ్యాక నేను చివర్లో ఈ ప్రాజెక్టులోకి వచ్చా. గోపాలకృష్ణ చెప్పిన కథ నిర్మాత కృష్ణకు నచ్చింది. ఆ తర్వాత ఈ కథను కొరటాల శివ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో సమర్పకుడిగా మారారు. కొరటాలగారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. అంత పెద్ద డైరెక్టర్ అయిన కొరటాల స్క్రిప్ట్‌లో మార్పు చెప్పకుండా సినిమాకు సపోర్ట్ చేయడం సంతోషం. ∙విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం, రౌడీయిజం గురించి చెబుతుంటారు. కానీ, విజయవాడ అంటే అవి మాత్రమే కాదని చెప్పే కథే కృష్ణమ్మ. ముగ్గురు స్నేహితుల కథే ఈ మూవీ. మంచి ఫ్యామిలీ ఉండాలి, జీవితంలో బాగా సెటిల్ కావాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కల చెదిరిపోతుంది.అసలు అప్పుడు వాళ్లేం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో వించిపేట భద్ర అనే పాత్ర చేశాను. విజయవాడ యాస, పొగరు, పగ.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత కృష్ణకి సినిమా అంటే ఫ్యాషన్. ఆయన ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ అంతా విజయవాడలోనే చేయడానికి సపోర్ట్ చేశారు. కాలభైరవ చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. ‘కృష్ణమ్మ’ మూవీతో సత్యదేవ్ స్టార్ అవుతాడనే నమ్మకం ఉందని రాజమౌళి అనడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ హిట్ అయి స్టార్డమ్ వచ్చినా నేను ఇప్పటిలాగే ఉంటాను. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్‌గారి ‘రామసేతు’ చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉత్తరాదిలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ రేంజ్ పాత్రలు రాకపోవడంతో చేయడంలేదు. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. -
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్‌కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్‌మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు! -
సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీలో అతీరా రాజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓకేసులో సత్యదేవ్‌ను అన్యాయంగా ఇరికిస్తారు.. అతను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం.. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్.. అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ట్రైలర్లో సత్యదేవ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మరీ సత్య ఖాతాలో కమర్షియల్ హిట్ పడుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్‌గా స్టార్‌ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్‌కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
మేలో కృష్ణమ్మ
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.కాగా పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ‘కృష్ణమ్మ’ని విడుదల చేస్తున్నాయి. ‘‘రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఈ మూవీ నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. -
కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర
సాక్షి, అమరావతి: జీవన వాహిని కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యాత్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొందిస్తోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడు తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవా లయాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది. 80 కిలోమీటర్ల ప్రయాణం ఎకో–ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్‌కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు. మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో ఆలయాల దర్శనంతో పాటు భో జన సదుపాయాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్‌ను అందుబాటులో ఉంచనుంది. నాగా ర్జున సాగర్ నుంచి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40–45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో పర్యాటకులకు బో టు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్‌లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం పర్యాటకులకు దైవ దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నాం. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్ సర్క్యూట్ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేస్తాం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ -
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు!
‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్‌తో ‘కృష్ణమ్మ’ టీజర్ విడుదల అయింది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ తేజ్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. -
టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కృష్ణ బూరుగుల
దర్శకుడు రవిబాబు తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది నటులను పరిచయం చేశారు. అందులో అల్లరి నరేశ్, విజయదేవరకొండ లాంటి వారు మంచి నటులుగా నిరూపించుకొని స్టార్స్ అయ్యారు. మరికొంత మందికి స్టార్ ఇమేజ్ రాకున్నా..ఇండస్ట్రీలో మాత్రం మంచి పేరు సంపాదించుకొని వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా రవిబాబు పరిచయం చేసిన మరో నటుడు కృష్ణ బూరుగుల కూడా టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. రవిబాబు ‘క్రష్’సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు కృష్ణ. తొలి చిత్రంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘మా నాన్న నక్సలైట్’తో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ చిత్రం లో రెండవ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తున్న ఎ టి ఎం (ATM) అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఎగ్జీకుటీవ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెట్టనున్నాడు. -
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సత్యదేవ్ కొత్త చిత్రం..
Satya Dev Krishnamma First Look Release On His Birthday: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. కాగా సోమవారం (జూలై 4) సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సత్యదేవ్‌తోపాటు లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె నటించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. చదవండి: హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ #Krishnamma is my next with director VV Gopalakrishna under the production of @ArunachalaCOffl. Super happy and blessed that blockbuster director #KoratalaSiva Garu is presenting it. pic.twitter.com/QbOLnzbHFU — Satya Dev (@ActorSatyaDev) July 3, 2022 -
శ్రీశైలంలోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎట్టకేలకు కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన శనివారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద కనీసం వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, దాని ఉపనదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టిలోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో.. దిగువకు అంతే స్థాయిలో వరదను వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి చేస్తూ.. స్పిల్‌వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో టీబీ డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దాంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యాం నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి.. వరదను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో సాగర్‌కు 29305 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
శాంతిస్తున్న కృష్ణమ్మ
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణమ్మ శాంతిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గింది. శనివారం జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 1,71,037 క్యూసెక్కులు రాగా.. అంతకుముందు వరకు తెరిచి ఉంచిన 10 గేట్లలో నాలుగు మూసివేసి 6 గేట్ల ద్వారా 1,67,622 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో డ్యామ్ గేట్లను మూసివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్ జలాశయానికి 1,60,718 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 589.50 అడుగుల వద్ద 310.5510 టీఎంసీలు నిల్వ ఉంది. -
కృష్ణమ్మ విలయానికి 11 ఏళ్లు
సాక్షి, రేపల్లె: కృష్ణమ్మ విలయానికి సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తూ 106 సంవత్సరాల తరువాత 2009, అక్టోబర్ 5న అర్ధరాత్రి సరిగ్గా 12.10 ప్రాంతంలో 10.98 లక్షల క్యూసెక్కుల వరద నీటితో ఉరకలేస్తూ పరుగులు తీసింది. సరిగ్గా ఆదే సమయంలో కరకట్ట మధ్యలో ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకై భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని పల్లెపాలెం వద్ద కరకట్ట క్షణాల్లో కోతకు గురైంది. కళ్లు తెరిచి కళ్లు మూసే సమయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గ్రామాలపై విరుచుపడింది. గొడ్డుగోదా, పిల్లాపాపల్ని చంకనేసుకుని ప్రజలు బతుకుజీవుడా అంటూ జనం పరుగులు తీశారు. క్షణక్షణం భయానక వాతావరణం కృష్ణానది కరకట్ట తెగిన అనంతరం నీరు ఉప్పొంగుతూ క్షణాల్లో పక్కనే ఉన్న బ్యాంకు కెనాల్‌ను దాటుకుంటూ పంటలు, గ్రామాలపై విరుచుకుపడింది. ఆ ప్రభావంతో రేపల్లె పట్టణం మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటిæ రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆధ్వర్యంలో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. లంక భూములే రక్షణ కవచాలు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహించే సమయంలో కరకట్టకు రక్షణ కవచంలా లంక భూములు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వాటిల్లోని చెట్లు, ప్రవాహాన్ని నిలువరిస్తున్నా యి. సాధారణ నదీ ప్రవాహానికి కరకట్టకు మధ్యలో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల మేర లంకభూమి విస్తరించి ఉంది. ఇప్పటికే ఏయేటికాయేడు వరదల సమయంలో లంక భూమి కోతకు గురవుతోంది. 2009 అక్టోబర్‌లో వ చ్చిన వరద ఉద్ధృతికి మండల పరిధిలోని బొబ్బర్లంక లంక భూములు సుమారు 70ఎకరాల వరకు కోతకు గురయ్యా యి. దీంతో పాటు రేపల్లె మండల పరిధిలో మరో 30 ఎక రాల వరకు కోతకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. ‘సాక్షి’ సాయం మరువేనిది వరదల సమయంలో సాక్షి ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించిన సహాయక కార్యక్రమాలను ప్రజలు నేటి గుర్తు చేసుకుంటున్నారు. రెండు వేల కుటుంబాలకు దుప్పట్లు, బట్టలు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కరకట్ట పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం రెండు సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకుని పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతతో పాటు రైతులకు వెసులుబాటు కలిగించే విధంగా రోడ్డు నిర్మాణాలకు, గ్రామాల సమీపంలో కరకట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణాల అవసరాలను గుర్తించే కార్యక్రమాలను చేపట్టాం. –కె.నాగేశ్వరనాయక్, రివర్ కన్జర్షెన్సీ ఏఈఈ -
కృష్ణమ్మకు కొత్తనీరు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో జల ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ రెండో వారం నుంచే కృష్ణా పరీవాహకంలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరొచ్చి చేరుతుండగా, రాష్ట్ర పరిధిలోని మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం ఆశాజనకంగా ఉంది. ఆల్మట్టిలోకి కొత్తగా 25 టీఎంసీలు.. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టులోకి నిన్నమొన్నటి వరకు 20వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా, అది శుక్రవారం 42,659 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం మరింత పెరిగి 57,346 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు 129 టీఎంసీలకు గానూ 50 టీఎంసీలకు చేరింది. ఈ నీటి సంవత్సరం ఆరంభమైన 20 రోజుల్లోనే 25 టీఎంసీల మేర కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో కేవలం 22.50 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది 28 టీఎంసీల మేర అదనంగా ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. ఇక నారాయణపూర్‌లోకి సైతం స్థానిక ప్రవాహాలు వస్తుండటంతో 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 4 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరగా, నిల్వలు 37.64 టీఎంసీలకు గానూ 24 టీఎంసీల మేర ఉన్నాయి. ఇక ఉజ్జయినిలోకి సైతం 3,105 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 117 టీ ఎంసీల నిల్వలకు గానూ 53 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ ప్రవాహాలు క్రమంగా పెరిగితే గతేడాది మాదిరి జూలై రెండో వారానికి దిగువకు ప్రవాహాలు నమోదు కానున్నాయి. ఇక స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,455 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 169.52 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 35 టీఎంసీ, జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 4.71 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలోనూ జల ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. మేడగడ్డ వద్ద శనివారం 15వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, ఇవి ఈ నెల 25,26 నాటికి లక్ష క్యూసెక్కులకు పెరగవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.