– రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్‌గా స్టార్‌ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు.
సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు.
‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి.
సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్‌కి సచిన్ టెండూల్కర్‌గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్‌ఆర్‌ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు.
వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment