Satyadev
-
ఓటీటీలోకి వచ్చేసిన బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ సినిమా
యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ టెక్నీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై మోస్తరు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన 'జీబ్రా' మూవీని డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. కానీ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ చందాదారులు మాత్రం 48 గంటల ముందే చూడొచ్చని పేర్కొంది. అందుకు తగ్గట్లు ఇప్పుడు వాళ్ల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.'జీబ్రా' విషయానికొస్తే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్) ఇతడి లవర్. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో సూర్య సాయం కోరుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది కానీ అక్కడి నుంచే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ అవేంటి? సూర్యతో పాటు అతడి ఫ్యామిలీని డాన్ ఆది (డాలీ ధనంజయ) ఎందుకు చంపాలనుకున్నాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సత్యదేవ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్‌మీడియాలో వెల్లడించింది. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్ట్ చేసింది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఈ నెల 18 నుంచే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు స్ట్రీమింగ్ కానుంది. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి చూసేయొచ్చు. జీబ్రా కథేంటంటే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
‘జీబ్రా’ క్లైమాక్స్ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్
‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.→ ఇందులో నేను బ్యాంకర్ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది. -
'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై!
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లోనూ మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు.Chiranjeevi timing 😂😂🤣🤣😭😭Cinemalo aina Offline lo aina Boss @KChiruTweets timing ni kottevadu inka puttaledu 💥💥😂😂🫶🏻#ZEBRA #Chiranjeevi pic.twitter.com/khp7QZvSwq— Vamc Krishna (@lyf_a_zindagii) November 12, 2024 -
‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుక..ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
అది మా తప్పు.. ప్రేక్షకులది కాదు: చిరంజీవి
‘‘నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్లు కాదు. చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న, పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడాలి అనుకునే మాలాంటి వాళ్లకి, నాకు ఒకరకమైన బెరుకు వచ్చింది. కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి? అని. కానీ, అవన్నీ కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు’’ అని హీరో చిరంజీవి అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్ . ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. పద్మజ ఫిల్మ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘2024 ‘హను–మాన్’ సినిమాతో శుభారంభం అయింది. అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఈ ఆదరణ నిæ పెద్ద సినిమాల స్థాయికి మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2’ ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. మొన్న దీపావళికి వచ్చిన ‘అమరన్, క, లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు.. పెద్ద డైరెక్టర్లు లేరు.. కోట్ల బడ్జెట్ లేదు. కానీ, కంటెంట్ ఉంది. అది సినిమాలకి ఆయువుపట్టు. కంటెంట్ బాగుండి, వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు.‘జీబ్రా’లో కూడా మంచి కంటెంట్, వినోదం, ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు.. అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కచ్చితంగా ‘జీబ్రా’ సూపర్‌హిట్టు అవుతుంది.. అవ్వాలి.. అవుతుంది’’ అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్యగారు పిలిచి ‘గాడ్ ఫాదర్’లో విలన్‌గా అవకాశం ఇచ్చారు. నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది. నా కెరీర్లో ‘జీబ్రా’ చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ లో బాబీ చేసిన క్యారెక్టర్ని నేను చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాను’’ అని తెలిపారు డాలీ ధనంజయ. ‘‘జీబ్రా’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్, ఎస్ఎన్ రెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్‌తో రూపొందింది’’ అని దినేష్ సుందరం, బాల సుందరం చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత వై.రవి శంకర్, డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా, కెమెరామేన్ సత్య పొన్మార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్, నటీమణులు అమృత అయ్యంగార్, జెన్నీఫర్ పిక్కినాటో, ఎడిటర్ అనిల్ క్రిష్, లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడారు. -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
నవంబరులో జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.ఈ సినిమాని నవంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సత్యదేవ్, ధనుంజయ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘జీబ్రా’. ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి రెడ్డి. -
ఆ కష్టం నాకు తెలుసు: మనోజ్ మంచు
‘‘జీబ్రా’ సినిమా కోసం టీమ్ ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. ‘జీబ్రా’ టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అని హీరో మనోజ్ మంచు అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర చేశారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.ఈ మూవీ టీజర్‌ని హీరో నాని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘జీబ్రా’ టీజర్‌లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మనోజ్ మంచు హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘జీబ్రా’ నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘జీబ్రా’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పాను’’ అని డాలీ ధనంజయ తెలిపారు. ‘‘ఈ మూవీలో నా పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది’’ అని సత్య రాజ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులు మంచి కథని సపోర్ట్ చేస్తార నే నమ్మకంతోనే ఈ సినిమా చేశాం’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్. ‘‘జీబ్రా’ చాలా కొత్త కంటెంట్. సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని నిర్మాతలు దినేష్ సుందరం, బాల సుందరం, ఎస్ఎన్ రెడ్డి తెలిపారు. జెన్నీఫర్ పిక్కీనాటో మాట్లాడారు. -
సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
దీపావళికి జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మించారు.ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్. -
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
-
వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల అయింది. అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.చిత్రపరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ‘కృష్ణమ్మ’ని విడుదల చేశాయి. ఇందులో సత్యదేవ్ నటనతో పాటు సెకండ్ పార్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ కథా నేపథ్యం కాస్త సాగతీతగా ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’ వచ్చేసింది. మే 16 నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో చూడలేని ప్రేక్షకులు ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.టాలీవుడ్లో మంచి ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేసేందుకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. ‘కృష్ణమ్మ’ సినిమా కూడా స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథగా సాగుతుంది. ఇందులో బలమైన భావోద్వేగాలతో పాటు రా రస్టిక్ కోణం ఉన్నప్పటికీ.. కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి తీరు కాస్త సాగతీత వ్యవహారంగా ఉంటుంది. -
కృష్ణమ్మ నదిలో మలుపుల్లా...
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రంలో అతీరా రాజ్ హీరోయిన్. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘వించిపేట భద్ర, శివ, కోటి అనే ముగ్గురి స్నేహితుల నేపథ్యంలో సాగే కథ ఇది. కథ ప్రధానంగా 2003–2015 మధ్యకాలంలో జరుగుతుంది.కొంతకాలంగా నేను ఎదురు చూస్తున్న మంచి హిట్ ‘కృష్ణమ్మ’తో లభిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘రాజకీయాలు, రౌడీయిజం అంశాలు ‘కృష్ణమ్మ’ సినిమాలో లేవు. విజయవాడను మరో కోణంలో చూసేలా ఈ చిత్రం ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాం. కృష్ణమ్మ నదిలో ఎలా అయితే మలుపులు ఉంటాయో భద్ర, కోటి, శివ జీవితాల్లో కూడా మలుపులు ఉంటాయి. ఈ మలుపులను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వీవీ గోపాలకృష్ణ. -
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్‌గా స్టార్‌ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్‌కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
మేలో కృష్ణమ్మ
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.కాగా పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ‘కృష్ణమ్మ’ని విడుదల చేస్తున్నాయి. ‘‘రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఈ మూవీ నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. -
జీబ్రాకి బైబై
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు బై బై చెప్పుకున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. -
యూత్‌ఫుల్ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. ‘‘బెస్ట్ బడ్డీస్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ రైడ్ ‘కిస్మత్’. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
సత్యదేవ్ 'ఫుల్ బాటిల్' టీజర్ చూశారా?
‘‘నాలుగు క్వార్టర్స్ ఉంటే ఫుల్ బాటిల్. అలాగే మనిషి జీవితం కూడా ఓ ఫుల్‌బాటిల్ లాంటిదనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు ‘ఫుల్‌బాటిల్’ టైటిల్‌ని పెట్టాడు శరణ్. ఇందులో మెర్క్యూరీ సూరిగా కొత్త సత్యదేవ్‌ని చూస్తారు’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఫుల్ బాటిల్’. జవ్వాజి రామాంజనేయులు, ఎస్.డి కంపెనీ చినబాబు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ–‘‘డార్క్ కామెడీ నా బలం అని భావించి ఈ మూవీ చేశాను’’ అన్నారు. ‘‘సత్యదేవ్‌తో మా బ్యానర్లో మరో సినిమా చేస్తాం’’ అన్నారు రామాంజనేయులు. Happy to launch this Crazy Teaser of #FullBottle 🤗https://t.co/xU0hDbenRc#MercurySoori looks Wild, Wacky-Knacky & Mass @ActorSatyadev 💥Wishing you & the whole team All the best ❤️@itssanjanaanand @sharandirects @actorbrahmaji #FullBottleTeaser pic.twitter.com/SdnqeRGTNl— Vijay Deverakonda (@TheDeverakonda) May 27, 2023 -
Satyadev: క్రైమ్ జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్కు ‘జీబ్రా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిచినెటో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న చిత్రం ఇది. గురువారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘‘తొలి షెడ్యూల్‌ను 50 రోజులపాటు జరిపాం. బ్యాలెన్స్ షూటింగ్‌ను హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లొకేషన్స్‌లో ప్లాన్ చేశాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా–సహనిర్మాత: సుమన్ ప్రసార బాగే. -
బాలీవుడ్ రమ్మంది...
మామూలుగా ఉత్తరాది తారలు దక్షిణాదికి ఎక్కువగా వస్తుంటారు. ఈసారి కూడా నార్త్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే సౌత్ నుంచి కూడా నార్త్‌కి వెళ్లారు. మన స్టార్స్‌ని బాలీవుడ్ రమ్మంది. ఈ ఏడాది హిందీ తెరపై కనిపించిన కొందరు సౌత్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కెరీర్లో ఇరవైకి పైగా సినిమాలు చేసిన నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగచైతన్యది కీ రోల్. ఈ హిందీ చిత్రంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు బాలరాజు పాత్రను చేశారు నాగచైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. ఇక విజయ్ దేవరకొండ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. మరో హీరో అడివి శేష్ ‘మేజర్’తో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి’ చిత్రం తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరుడు ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూర్టీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. అలాగే ఏపీ (ఆంజనేయ పుష్పక్ కుమార్)గా హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పారు సత్యదేవ్. అక్టోబరు 25న రిలీజైన ‘రామసేతు’లోనే ఏపీగా సత్యదేవ్ కీ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకుడు. అయితే బాలీవుడ్‌కు కీలక పాత్ర ద్వారా కాకుండా సత్యదేవ్ హీరోగా పరిచయం కావాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో జెన్నిఫర్ డైరెక్షన్లో ఆరంభమైన ఓ హిందీ చిత్రంలో సత్యదేవ్ హీరోగా కమిట్ అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ‘రామసేతు’ సత్యదేవ్‌కి తొలి హిందీ చిత్రంగా నమోదైంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రష్మికామందన్నా బాలీవుడ్ ఎంట్రీ ‘గుడ్ బై’ చిత్రంతో కుదిరింది. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబరు 7న విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే... రష్మిక కెరీర్లో రిలీజైన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ అయినప్పటికీ ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం మాత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక హీరో హీరోయిన్లుగా శాంతను భాగ్చీ తెరకెక్కించిన ‘మిషన్ మజ్ను’ డైరెక్టర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఓ లీడ్ యాక్ట్రస్‌గా హిందీ తెరకు పరిచయమైంది కూడా ఈ ఏడాదే. రణ్వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో రిలీజైన ‘జాయేష్ భాయ్ జోర్ధార్’లో నటించారు షాలిని. 2023లో... ఇక కొందరు తారల బాలీవుడ్ జర్నీ కూడా ఈ ఏడాది ఆరంభమైంది. కానీ వచ్చే ఏడాదే వారు హిందీ తెరపై కనిపించనున్నారు. కెరీర్లో డెబ్బై చిత్రాలు చేశాక బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నయనతార. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ హిందీలో నయనతారకు తొలి చిత్రం. ఇటు అట్లీ చేస్తున్న తొలి హిందీ ఫిల్మ్ కూడా ‘జవాన్’ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక 2005లో వచ్చిన తెలుగు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ ప్రయాణం ఈ ఏడాది నవంబరులో మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు వరుణ్‌తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడు. మరికొందరు స్టార్స్ కూడా వచ్చే ఏడాది హిందీ తెరపై కనిపించనున్నారు. -
'నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, టికెట్లు ఇప్పించన్నా' హీరో ఆన్సర్ అదిరింది!
గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో సత్యదేవ్. కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన లవ్ మాక్‌టైల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. రేపు (డిసెంబర్ 9న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు సత్యదేవ్. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 'బ్రో, నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. స్టోరీ కూడా కనెక్ట్ అయింది. మూడు టికెట్స్ ఇవ్వొచ్చు కదా బ్రో' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'మూడు టికెట్సా? అంటే నువ్వు రావట్లేదా?' అని కౌంటరిచ్చాడు. 'అన్నా రిప్లై ఇవ్వకపోతే సినిమా చూడను ప్లీజ్ రిప్లై.. నీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మహేశ్‌బాబు 28వ సినిమా అప్డేట్ ఇప్పించు అన్నా' అని ఓ వ్యక్తి కోరగా.. 'నా ఇన్‌ఫ్లూయెన్స్‌తో గుర్తుందా శీతాకాలం టికెట్ ఇప్పించగలను కానీ ఆ అప్డేట్ ఎలా సాధ్యమవుతుందనుకున్నావు?' అని రిప్లై ఇచ్చాడు. రెబల్ స్టార్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా మిస్టర్ పర్ఫెక్ట్ అని, అల్లు అర్జున్ను ఐకాన్‌గా పేర్కొన్నాడు సత్యదేవ్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు కరకరలాడే అప్పడాలని చెప్పాడు. రీమేక్స్ అంటే జనాలిష్టపడట్లేదు, అయినా అంత నమ్మకంగా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీకి ఇవ్వొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా ఓటీటీకి అడిగారు. కానీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా' అని బదులిచ్చాడు సత్యదేవ్. Bro naaku 3 girlfriends unnaru bro ... Story kuda connect ayindhi. . oka three tkts bro #GurtundaSeetakalam #asksatyadev — Vineeth (@Vineethvineeee) December 7, 2022 #asksatyadev remakes meedha audience intrest chupiyatledhu kadha Anna Ayna Antha confident ga theatre release Endhuku Chesthunnaru Ott ki evvochu ga — Tarak_Star (@TarakStar9) December 7, 2022 Hai @ActorSatyaDev Anna, Watched #RamSetu film two days ago, your character and performance was terrific 👌. How is your working experience with #AkshayKumar Sir in that film? #AskSatyadev — 𝐑𝐚𝐯𝐢 𝐊𝐢𝐫𝐚𝐧 #𝐓𝐇𝐄𝐆𝐇𝐎𝐒𝐓 🗡️👑 (@PRAVIKIRAN18) December 7, 2022 చదవండి: లగ్జరీ కారు కొన్న సోనూసూద్ -
హీరోలలో పెద్ద, చిన్న అనే తేడా చూడను..కథ నచ్చాలి: తమన్నా
‘గుర్తుందా శీతాకాలం’ సినిమాను గీతాంజలి మూవీతో పోలుస్తున్నారు.అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చారు.. ఆ అంచనాను మేము తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం నాకుంది’ అని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. యంగ్ హీరో సత్యదేవ్, తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా తమన్నా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాం ► మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి ► సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాం. ► సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరింది. ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దొరికింది. ► హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి.. ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను . ► ఇప్పటివరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు. నాగ శేఖర్( గుర్తుందా శీతాకలం చిత్ర దర్శకుడు) యాక్టర్ కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు ► నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయింది. ఇప్పటికీ నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను. ► ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను. ► భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను. ► ఈ ఏడాదిలో నేను నటించిన ఎఫ్3 విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ‘గుర్తుందా శీతా కాలం’రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో ‘భోళాశంకర్ ’ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నాను. -
25.. 50.. 75.. 100..మన స్టార్ హీరోలు ఎంత దూరం వచ్చారంటే..
ప్రయాణంలో ఎంత దూరం చేరుకున్నామో మైల్ స్టోన్ చెబుతుంది. అందుకే మైల్ స్టోన్ చాలా స్పెషల్. ఇక సినిమా స్టార్స్‌కి అయితే కెరీర్ పరంగా ఎంత దూరం వచ్చారో సినిమా నంబర్స్ చెబుతాయి. 25.. 50.. 75.. 100... ఈ నంబర్స్ స్టార్స్ కెరీర్‌కి చాలా స్పెషల్. ఒకటో సినిమా నుంచి ఇరవైఅయిదవ సినిమాకి చేరుకోవడం ఓ మైల్స్టోన్. ఆ తర్వాత 50.. 75.. 100.. ఇలా ఒక్కో మైల్ స్టోన్ దాటుతున్నప్పుడు వారికి దక్కే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా ఆ సినిమాలు స్పెషల్‌గా ఉండాలని కూడా కోరుకుంటారు. ప్రస్తుతం 25, 75, 100 చిత్రాల మైల్ స్టోన్ మూవీస్ చేస్తున్న స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. కెరీర్లో వందో సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు హీరో నాగార్జున. ఆల్రెడీ నాగార్జున కొన్ని కథలు విన్నారు. మరికొన్ని కథలు వినడానికి రెడీ అవుతున్నారు. కాగా తన గత చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా తాను, అఖిల్ కలిసి ఓ మలీ్టస్టారర్ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఇదే ఆయన కెరీర్లో వందో సినిమాగా ఉండబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే తమిళ దర్శకుడు మోహన్‌రాజా, బెజవాడ ప్రసన్న కుమార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. నాగార్జున వందో చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇంకెందరి దర్శకుల పేర్లు వస్తాయో? ఫైనల్‌గా ఎవరు ఖరారవుతారో చూడాలి. మరోవైపు ప్రభాస్ కెరీర్లో రూపొందనున్న 25వ చిత్రం ఖరారైపోయింది. ‘స్పిరిట్’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటు సందీప్‌రెడ్డి వంగా కూడా రణ్‌బీర్ కపూర్‌తో ‘యాని మల్’ సినిమా చేస్తున్నారు. సో.. ‘స్పిరిట్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2024లో ఆరంభం అయ్యే అవకాశం ఉంది. ఇక తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. కార్తీ హీరోగా చేసిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం కార్తీ కెరీర్లో 25వ చిత్రం ‘జపాన్’ తెరకెక్కుతోంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇంకోవైపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మెప్పు పొందిన సత్యదేవ్ 25వ సినిమాగా ‘కృష్ణమ్మ’లో నటిస్తున్నారు. వీవీ గోపాలకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఓ నిర్మాత. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక పదిహేనేళ్లుగా ఏ మాత్రం స్టార్డమ్ తగ్గకుండా కొనసాగుతున్న నయనతార 75 చిత్రాల మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. ఈ సినిమాతో నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. వీరే కాదు..75 చిత్రాల మైలు రాయికి రవితేజ, 25 చిత్రాల మైలురాయికి అల్లు అర్జున్, నాగశౌర్య.. ఇలా మైల్స్టోన్ చిత్రాలకు దగ్గరగా ఉన్న స్టార్స్ ఇంకొందరు ఉన్నారు. -
Gurthunda Seethakalam Trailer: మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా..
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేం. అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ‘లవ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే..’, మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా’ లాంటి డైలాగ్స్ ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. -
‘గుర్తుందా శీతాకాలం’ చూస్తే మనందరి లవ్‌స్టోరీస్ గుర్తొస్తాయి: కావ్య శెట్టి
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది కన్నడ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్ గా కన్నడలో నేను నటించిన లవ్ మాక్టేల్ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు అడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. అలాగే మలయాళం లో ఒకటి, తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. అయితే తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం. ► మూడు లవ్ స్టోరీస్ (త్రీ ఏజ్ గ్రూప్స్) కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూడు లవ్ స్టోరిస్ మీ హర్ట్ ని టచ్ చేసేలా ఉంటాయి. ఇందులో నేను కాలేజీ గర్ల్ అమ్ములు పాత్రలో నవ్విస్తాను.. కాలేజ్ నేపథ్యం లో సాగే నా పాత్ర మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ మెంట్ నిస్తుంది . ► నేను డి గ్లామర్ పాత్రలో ఒక సినిమా చేశాను కానీ నాకు గ్లామర్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే "గుర్తుందా శీతాకాలం"’ మాత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఎక్సటింగ్ గా ఉన్నాను. ► నా కో స్టార్ సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో నాకున్న డైలాగ్స్ కు ఎక్కువగా తనే హెల్ప్ చేశాడు. తనతో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. తమన్నా తో నాకు ఎటువంటి సీన్స్ లేవు, కానీ ప్రియదర్శి తో సీన్స్ ఉన్నాయి. కాలభైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి. ► కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయిన నిర్మాతలు రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు లలో మంచి మంచి లొకేషన్స్ లలో షూట్ చేశారు. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.. ► కన్నడ నుండి వచ్చిన హీరోయిన్స్ అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టి వంటి వారందరినీ అదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. వారిని ఆదరించినట్లే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూడు కన్నడ సినిమాలు , ఆమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇంకా కొన్ని లైనప్ లో ఉన్నాయి. -
శీతాకాలంలోనే వస్తున్న "గుర్తుందా శీతాకాలం" మూవీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు విడుదలకాకుండా వాయిదా పడుతూ వచ్చింది. శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్‌లో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్ అని ఈ సినిమా ట్రైలర్లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్ లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్‌కి జస్టిఫికేషన్ గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది అంటూ మూవీ టీం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
‘ఫుల్ బాటిల్’ నుంచి సత్యదేవ్ ఫస్ట్‌లుక్ అవుట్
మెర్క్యురీ సూరి సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. ఈ చిత్రంలో మెర్క్యురీ సూరి పాత్రలో స్టయిలిష్‌గా కనిపించనున్నారు సత్యదేవ్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎస్డీ కంపెనీ, రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
‘గాడ్‌ఫాదర్’ క్లైమాక్స్‌ని మళ్లీ రీ షూట్ చేశాం: చిరంజీవి
‘‘ఎన్ని సినిమాలు చేసినా ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతే. ఓ సినిమాకు ఎంత డబ్బులు వచ్చాయిన్నది కాదు.. ఎంతమంది చూసి వావ్ అన్నారన్నది కూడా అంతే ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్’ రేంజ్ బ్లాక్‌బస్టర్ ‘గాడ్ ఫాదర్’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గాడ్ ఫాదర్’ సినిమాకు కొంత మంది దర్శకుల పేర్లు అనుకున్నాం. ఫైనల్‌గా దర్శకుడు మోహన్ రాజా రావడం నాకు ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఆ తర్వాత సత్యానంద్గారిని ఇన్వాల్వ్ చేశాను. నా ఇన్‌ఫుట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఓ క్లైమాక్స్ షూట్ చేశాం. ఆ తర్వాత మళ్లీ క్లైమాక్స్‌ను రీ షూట్ చేశాం. సినిమాను నేను ఓ క్రిటిక్‌గా చూసినప్పుడు తప్పులు తెలుస్తాయని నా గట్ ఫీలింగ్. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవి కళ్లతో యాక్ట్ చేశారు అని అంటుంటే ఆ క్రెడిట్ టీమ్ అందరిదీ’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ – ‘‘రెండు రోజుల క్రితమే నిశ్శబ్ద విస్ఫోటనంకి మీనింగ్ తెలిసింది నాకు. ఎవడు పడితే వాడు మాటి మాటికి, సరిసాటి రానోళ్లందరూ మాట్లాడుతుంటే ఒక చిరునవ్వుతో ఆయన (చిరంజీవి) ఆ క్షణం ఆ పని అలా జరిగేలా ముందుకు వెళ్తున్నారు చూడండి.. అది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే. 153 సినిమాలకు ఆయన చిరునవ్వే నిదర్శనం’’ అన్నారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు. ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాము’’ అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ– ‘‘ప్రాజెక్ట్‌లో చిరంజీవిగారు ఇన్ వాల్వ్ అవుతున్నారు అని ఎవరైనా అంటే కొడతాను. ఆయన అనుభవాన్ని ఊపయోగించుకోలేకపోతే మేం ఫూల్స్. ప్రతి సీన్ లోనూ ఆయన ఇన్ పుట్ ఉంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఆయన్ను (చిరంజీవి) అడగకుండా కూడా నేను చెబుతున్నాను. ‘అమ్ముడుపోయారు.. అమ్ముడు పోయారు అంటున్నారు. మద్రాస్‌లో ప్రసాద్ ల్యాబ్ పక్కన ఉండే కృష్ణా గార్డెన్ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజింగ్ రోజున ఆయన అప్పులు అన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీని అమ్మిన వ్యక్తి ఆయన. ఈ రోజుకీ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పని చేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతుంటారు. ఏదంటే అది రాస్తుంటారు. ఆయన స్పెషల్ పర్సన్ కాబట్టి ఏదంటే అది రాయొచ్చు. అదో హక్కు అయిపోయింది. ప్రజారాజ్యంలో నుంచి పుట్టిన బాధ, ఆవేశమే ఈ రోజు జనసేన. ఆ రోజు చిరంజీవిగారి గురించి ఏం మాట్లాడారో దానికి సమాధానమే జనసేన. సార్.. మీరు సహనంగా, వినయంగా.. దండాలు పెడుతూనే ఉండండి. మేం కాదనం. దయచేసి కొన్ని విషయాల్లో మనం కొంతమందిని వదులుకోవాల్సి ఉంది. సోషల్ మీడియాలో కానీ, మీడియా వ్యక్తులు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేప్పుడు ఒకసారి ఆలోచించండి’’ అన్నారు. రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – ‘‘ఈ సందర్భంగా రామాయణంలోని ఓ సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. చూడామణి, నగలు.. వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు కానీ.. నిజంగా నేను సీతనే చూశాను అని రాముడికి చెప్పి నమ్మించాలంటే మీ ఇద్దరికే తెలిసిన మీ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని నాకు చెబితే ఆ సన్నివేశాన్ని నేను రాముడికి చెబుతా’’ అని సీతతో హనుమంతుడు అంటాడు. అప్పుడు సీత.. ‘‘ఓ రోజు నేను రాముడి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఓ కాకి వచ్చి నా గుండెలమీద పొడుస్తుంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. కానీ నా రక్తపు చుక్క తగిలి రాముడు నిద్రలేచి చూస్తుండే సరికి కాకి మళ్లీ పొడవటానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో ఓ గరికను లాగి ఆ కాకిమీదకు బ్రహ్మాస్త్రంగా వేశాడు’’ అంటూ ఓ సన్నివేశం హనుమంతుడికి చెబుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే... నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే..ఓ వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని గరిక వినయంగా ఒప్పుకుంటే... ఆ గరిక విలువ, రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ పెరగదు... తగ్గదు.. ఆ రాముడి విలువ ఎప్పుడూ అలానే ఉంటుంది’’ అన్నారు. ఎడిటర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు, నటీనటులు కస్తూరి, మురళీ మోహన్, సునీల్, మురళీ శర్మ, డెలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్‌గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్‌ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
'గాడ్‌ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్‌రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్లో హిందీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ ఈ చిత్రం. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, సల్మాన్, సత్యదేవ్, మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'గాడ్ ఫాదర్'లో ఒక బలమైన పాత్ర వుంది. ఆ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బాగుంటుందని భావించాం. మేము కోరగానే నేను చేస్తాను' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు ఆయనే. సల్మాన్‌తో కలిసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ జోష్‌గా చేశాను.' అని అన్నారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ..'చిరంజీవి పేరు చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమే దీనికి కారణం. ఆయనతో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని అన్నారు. (చదవండి: గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్‌పుల్ డైలాగ్స్) సత్యదేవ్ మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్ల ముందు మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్యపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. మోహన్ రాజా సినిమాని చాలా కూల్‌గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది' అని అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్ చేయడమనే నా కల నెరవేరింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి' అని కోరారు. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రమిది. సత్యదేవ్, ధనంజయల కెరీర్లో ఈ సినిమా ఇరవై ఆరవది కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్ రాజ్. ∙™డాలీ ధనంజయ, సత్యదేవ్ -
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నా కల నెరవేరింది
‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. ఆయన స్ఫూర్తితో నటుడు కావాలని కలలుకని, అయ్యాను. నా నటనని అన్నయ్య ప్రశంసించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. ఆయనతో నటించాలనే నా ఇన్నేళ్ల కల ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో నేరవేరింది’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సత్యదేవ్ పంచుకున్న విశేషాలు... ► అన్నయ్య(చిరంజీవి) ఒక షూటింగ్లో లంచ్‌కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా(గాడ్‌ఫాదర్) ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను ఆయనకి వీరాభిమానిని.. గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, నా పాత్ర గురించి చెప్పడం ఆశ్చర్యమనిపించింది.. వెంటనే చేస్తాను అని చెప్పా. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే ఆ పాత్ర చేస్తున్నపుడు అందులోని లోతు అర్థమైంది.. అప్పుడు చిన్న టెన్షన్ మొదలైంది. కానీ, అన్నయ్యగారు నటుడిగా నాపై పెట్టిన బాధ్యత ముందు భయాలు తొలగిపోయాయి. గతంలో ఎప్పుడూ చేయని పాత్ర ఈ సినిమాలో చేశా. ► అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవిగారిని మెగాస్టార్ అని ఎందుకు అంటారో ఆయనతో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది. ఆయన చాలా క్రమశిక్షణగా, మా కంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రతి డైలాగ్ నేర్చుకుంటూ తర్వాతి సన్నివేశం గురించి ఆలోచించడం గ్రేట్. ► సల్మాన్ఖాన్గారు సెట్స్‌లో చాలా సింపుల్‌గా, సరదాగా ఉంటారు. దర్శకుడు మోహన్ రాజాగారు నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్ హంగ్రీ, గ్రీడీ.. ఇలా చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారు. అందరిలానే సోలో హీరోగా చేయాలనే ఉంటుంది. అయితే మంచి పాత్ర వస్తే క్యారెక్టర్స్ కూడా చేస్తాను. ► అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. తన సినిమాలతో సౌత్, నార్త్ అనే బౌండరీలు లేకుండా ఇండియన్ సినిమా అనేలా చేసిన రాజమౌళిగారికి హ్యాట్సాఫ్. నేను నటించిన ‘గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్ బాటిల్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో డాలీ ధనుంజయతో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాను. -
సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమవుతుందో మనలో..’సాంగ్ విన్నారా?
సత్యదేవ్, అతిరా రాజీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి, కృష్ణమ్మ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఏమవుతుందో మనలో..’ అనే మెలోడి సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. ‘‘ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘ఏమవుతుందో మనలో..’ పాట ఉంటుంది. సన్ని కూరపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు!
‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే డైలాగ్‌తో ‘కృష్ణమ్మ’ టీజర్ విడుదల అయింది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ తేజ్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా. ఓ ఘటన ముగ్గురి స్నేహితుల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ప్రధానాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ. -
మరోసారి వాయిదాపడ్డ గుర్తుందా శీతాకాలం!
నటుడు సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూలై 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. సోమవారం సత్యదేవ్ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్ వైరల్‌గా మారింది. ఒకవేళ అదే నిజమైతే ఆగస్టు 5న గుర్తుందా శీతాకాలంతో పాటు కల్యాణ్ రామ్ బింబిసార, సీతారామం చిత్రాలు రిలీజ్ కాబోతుండటం గమనార్హం. Wishing Our Hero & Supremely Talented @ActorSatyaDev a very Happy Birthday 🤩❤️ 🎉🤗 - Team #GurtundaSeethakaalam@tamannaahspeaks @nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @nagshekarmov @anandaudioTolly#HBDSatyaDev pic.twitter.com/OHcawJFb9S — Vamsi Kaka (@vamsikaka) July 4, 2022 చదవండి: పద్మశ్రీ గ్రహిత, ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే? -
గాడ్ ఫాదర్ వస్తున్నాడు
‘గాడ్‌ఫాదర్’ రాకకు రంగం సిద్ధమైంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గాడ్‌ఫాదర్’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లుగా శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు, సంగీతం: తమన్. -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన నటించిన 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు సిద్దం అవుతుండగా, మరో సినిమా గాడ్సే కూడా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే టీజర్‌తో పాజిటివ్ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను తొలుత మే20న రిలీజ్ చేయాలని భావించినా అది కుదరలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ కీలక పాత్రలు పోషించారు. Only the date has changed. Not the cause. Godse from June 17, 2022. #GodseOnJune17 @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/cuS9SM61XX — Satya Dev (@ActorSatyaDev) May 18, 2022 -
‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు
Chirajeevi Praises Actor Satyadev: నటుడు సత్యదేవ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో సత్యదేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ‘గాడ్‌ఫాదర్’లో కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. రీసెంట్గా గాడ్‌ఫాదర్‌లో సెట్లోకి అడుగు పెట్టాడు సత్యదేవ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ చిరంజీవితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సత్యదేవ్ ట్వీట్ చేశాడు. చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! ‘అన్నయ్యా.. నటన జీవితంతో తమాలాంటి ఎదరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్నిచూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో మీతోపాటు కాసేపైనా నటించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూఇ నేర్చుకునే అవకాశం దక్కింది’ అంటూ సత్యదేవ్, చిరుపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక అతడి ట్వీట్‌కు మెగాస్టార్ ఫిదా అయ్యాడు. అతడి ట్వీట్‌కు తన అభిమానిగా సత్యదేవ్‌ను చూసి గర్వపడుతున్నానంటూ చిరు స్పందించాడు. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో ‘డియర్ సత్యదేశ్. థ్యాంక్యూ. నీలాంటి చక్కటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. ఇక గాడ్‌ఫాదర్ చిత్రంలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం’ అంటూ చిరు రాసుకొచ్చారు. కాగా మెహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ చిత్రం మలయాళం లూసీఫర్ మూవీకి రీమేక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సత్యదేశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. చిరు తాజా ట్వీట్‌తో సత్యదేవ్ ఇందులో ప్రతికథానాయకుడిగా కనిపంచానున్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కాగా ప్రస్తుతం గాడ్‌ఫాదర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డియర్ @ActorSatyaDev ..Thank you. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! https://t.co/L0R7yw1Tti pic.twitter.com/P4zqp78SbE — Acharya (@KChiruTweets) April 28, 2022 -
ఈ వేసవిలోనే సత్యదేవ్ గాడ్సే!
Satyadev Godse Movie Releasing This April: సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. ‘‘సత్యదేవ్, గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ హిట్ కావడంతో ‘గాడ్సే’పై మంచి అంచనాలున్నాయి. అవినీతిమయమైన రాజకీయ నాయకుణ్ణి, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. ఐశ్వర్యా లక్ష్మిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
'ఫుల్ బాటిల్'తో వస్తున్న యంగ్ హీరో.. కిక్కు ఎక్కాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే
Full Bottle Movie: Satyadev Next With Director Sharan Koppisetty: విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ టైటిల్స్‌తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల 'స్కైలాబ్' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్ ప్రస్తుతం గాడ్సే, గుర్తుందా శీతకాలం మూవీస్తోపాటు కొరటాల శివ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా, హిందీలో 'రామసేతు' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ 'రామసేతు' సినిమాలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సత్యదేవ్ హీరోగా మరో చిత్రం బుధవారం (ఏప్రిల్ 6) ప్రారంభమైంది. ఈ సినిమా 'ఫుల్ బాటిల్' అనే టైటిల్‌తో సినిమా షూటింగ్ మొదలైంది. చదవండి: సత్యదేవ్ పవర్ఫుల్ డైలాగ్‌లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్ 'కిర్రాక్ పార్టీ', సత్యదేవ్ 'తిమ్మరుసు' చిత్రాలను తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి మొదటి రెండు సినిమాలు కన్నడ రీమేక్స్ కాగా, ఇటీవల ఓటీటీ సంస్థ జీ5 కోసం 'గాలివాన' పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కాకినాడ నేపథ్యంలో 'ఫుల్ బాటిల్' రూపొందనున్నట్లు సమాచారం. రామాంజనేయులు జువ్వాజి, ఎస్డీ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో అలరించే సత్యదేవ్ 'ఫుల్ బాటిల్' కిక్కు ఎక్కాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. చదవండి: సత్యదేవ్ భార్యగా నయనతార -
ముగ్గురమ్మాయిలతో సత్యదేవ్, గుర్తుందా శీతాకాలం ట్రైలర్ చూశారా?
వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చింది 'గుర్తుందా శీతాకాలం' యూనిట్. సత్యదేవ్, తమన్నా భాటియా హీరోహరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. 'శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..' అంటూ ట్రైలర్ మొదలైంది. కోమలి, అమ్ము, దివ్య.. ఇలా చాలామందినే ప్రేమించాడు హీరో. చివరగా నిధి.. ఆమెతో ప్రేమలో పడలేదంటూనే ఇద్దరి మధ్య లవ్ స్టోరీని చూపించాడు డైరెక్టర్. మరి ఆ అమ్మాయిల్లో హీరో కరెక్ట్ పార్ట్నర్ ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించగా భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: సంపత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి, రాఘవ సూర్య. -
ఓటీటీలో స్కైలాబ్, రిలీజ్ ఎప్పుడంటే?
Skylab Movie Confirms OTT Release Date: సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్కైలాబ్. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్ నిర్మించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కొంత కామెడీ జోడించి సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సోనీ లైవ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS — SonyLIV (@SonyLIV) January 11, 2022 -
సత్యదేవ్ పవర్ఫుల్ డైలాగ్‌లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్
Satyadev Godse Movie Teaser Released By Chiranjeevi: విభిన్న కథా చిత్రాలతో అలరించే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. ఇటీవల 'స్కైలాబ్' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్ గాడ్సేగా రాబోతున్నాడు. దర్శకుడు గోపీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలు, నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న గాడ్సే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ విడుదల చేస్తూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్. విడదల చేసిన టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. సత్యదేవ్ చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. 'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయయే తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అలాగే 'సేవ చేస్తున్నందుకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌రా?' అనే డైలాగ్ ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది. సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తుంది. నాగబాబు, తనికెళ్ల భరణి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Godse Teaser launch video 🎥 by Mega 🌟 @KChiruTweets garu #GodseTeaser https://t.co/IcruuzHXrn@ActorSatyaDev @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @CKEntsOffl #SunilKashyap @vamsikaka @adityamusic pic.twitter.com/LfGusH5XCt — Vamsi Kaka (@vamsikaka) December 20, 2021 -
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలని ఉంది
ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ దర్శకత్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబరు 9 సి. కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ♦ టికెట్ రేట్లను మరీ ఇంతగా తగ్గించడం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్. ♦ ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం అడిగాం, కానీ మీడియా వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం. ♦ శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. ఆ తర్వాత హిట్ అయింది. సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి. ♦ చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. ♦ ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు. ♦ పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు. ♦ ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్. ♦ గాడ్సే సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తయ్యింది. అలాగే మా బ్యానర్లో రానా నటిస్తున్న 1945 సినిమాకి సంబంధించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ♦ రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. ♦ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. రామానుజాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయన కూడా చేయాలనుకుంటున్నారు. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను. ♦ గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ♦ తమిళనాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో చూపిస్తాను అంటూ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచాడు నిర్మాత కళ్యాణ్. -
నాకు నన్నే కొత్తగా చూపించారు: సత్యదేవ్
Satyadev At Skylab Trailer Launch Event: ‘‘స్కైలాబ్’ చిత్రం బాగా వచ్చింది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే నాకు నన్నే కొత్తగా, నా నటనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్’’ అని సత్యదేవ్ అన్నారు. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్’. రవికిరణ్ సమర్పణలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది. హీరోయిన్ నిత్యామీనన్ ఈ సినిమాకు సహ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా వల్ల పృథ్వీ, విశ్వక్ అనే ఇద్దరు ప్యాషనేట్ నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తున్నందుకు హ్యాపీ. మా ట్రైలర్ విజువల్స్ చూసి పూరీ జగన్నాథ్‌గారు కాల్ చేసి కెమెరామ్యాన్ ఆదిత్యను అభినందించారు’’ అన్నారు. ‘‘స్కైలాబ్ నాకు స్పెషల్ మూవీ. ఈ సినిమా నిర్మాణంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. విశ్వక్, పృథ్వీ భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు నిత్యామీనన్. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్‌లతో పని చేయడం నా అదృష్టం’’ అన్నారు విశ్వక్. ‘‘మానవీయ విలువలే ముఖ్యం అని చెప్పే చిత్రమిది’’ అన్నారు రవికిరణ్. ‘‘ఈ చిత్రంతో నిర్మాతగా నేను తొలి అడుగు వేస్తున్నాను’’ అన్నారు పృథ్వీ. ఎడిటర్ రవితేజ, కెమెరామ్యాన్ ఆదిత్య పాల్గొన్నారు. -
చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్ ‘లూసిఫర్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం చిరు బర్త్‌డే సందర్భంగా ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖారారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను ప్రారంభించాడు. చదవండి: Nayantara: సత్యదేవ్‌కు భార్యగా నయనతార ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపించగా దీనిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో సల్మాన్ గాడ్ ఫాదర్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. సల్మాన్ తన డెట్స్ సర్దుబాటు చేసి ‘గాడ్ ఫాదర్’ మూవీకి తన షెడ్యూల్ కెటాయించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చెందిన స్టార్ నటీనటులు కూడా భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ను మేకర్స్ సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట. చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా! అయితే తెలుగులో నటించడానికి సల్మాన్ ఆసక్తిగా లేడని, ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లనేనని, ఈ చిరంజీవి సినిమా ఆఫర్ అనగానే సల్మాన్ హ్యాపీగా ఫీల్ అయినట్లు ఆయన సన్నిహితులు నుంచి సమాచారం. కాగా తమిళంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించనున్నాడట. మరి దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. అయితే ఇందులో చిరుకు సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నయన్, సత్యదేవ్‌లు భార్యభర్తలుగా కనిపించనున్నారట. చదవండి: Allu Arjun: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..! -
సత్యదేవ్ భార్యగా నయనతార
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్ ‘లూసిఫర్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అయితే ఇందులో మెగాస్టార్ సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్లో వివెక్ ఒబెరాయ్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేస్తున్నాడు. చదవండి: పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్ ఇదిలా ఉంటే ఈ మూవీలో సత్యదేవ్‌కు నయనతార భార్యగా కనిపించనుందట. ఈ పాత్రకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సోలో హీరోగా సక్సెస్ రూట్లోకి వచ్చిన సత్యదేవ్ కెరీర్‌కు ఈ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చెందిన స్టార్ నటీనటులు ఈ మూవీలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా.. తమిళంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌లో గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్! -
కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ సినిమా
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యదేవ్ 25వ చిత్రం షురూ అయింది. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టారు. కొరటాల శివ, ‘దిల్’రాజు, ఫైనాన్షియర్ ఎంఆర్వీఎస్ ప్రసాద్ స్క్రిప్ట్‌ను వీవీ గోపాలకృష్ణకు అందించారు. ‘‘సమర్పకుడిగా కొరటాల శివకు ఇది తొలి ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సుర్నిద్ది. చదవండి :అట్రాసిటీ కేసు: స్పందించిన దాసరి అరుణ్ కుమార్ రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్! -
తిరుపతి నుంచే ‘తిమ్మరుసు’ విజయోత్సవ యాత్ర
తిరుపతి కల్చరల్: తిమ్మరుసు చిత్రం విజయవంతం అయిన సందర్భంగా విజయోత్సవయాత్రలో భా గంగా ఆదివారం ఆ చిత్రం యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్ సినిమాస్‌కు విచ్చేసిన తిమ్మరుసు చిత్రం హీరో సత్యదేవ్, దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి, నిర్మాత మహేష్ కోనేరు, సహనటుడు అకింత్‌కు పీజీఆర్ అధినేత అభిషేక్ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రేక్షకులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించి, ప్రేక్షకుల నడుమ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. కరోనా విపత్కర కష్టాల నేపథ్యంలో విడుదలైన తమ చిత్రాన్ని ఆదరిస్తూ విజయపథంలో నడిపిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తిరుమల వెంకన్న పాదాల చెంతనున్న తిరుపతి అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి నుంచే తన విజయయాత్ర ప్రారంభించడం మహదానందమని చెప్పారు. ఈ చిత్రం తర్వాత ‘స్కైలాబ్’ చిత్రంలో నటిస్తున్నానని, భవిషత్తులో జనం మెచ్చే మంచి చిత్రాలతో ముందుకు సాగుతాయనని తెలిపారు. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ చిత్రం యూనిట్ సమష్టి కృషితో ఒక మంచి చిత్రాన్ని అందించామని చెప్పారు. కరోనా రెండోదశ తర్వాత ఎంతో నమ్మకంతో చిత్రా న్ని విడుదల చేశామని, అదే నమ్మకంతో సినిమాకు విజయాన్ని చేకూర్చుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అనంతరం హీరో సత్యదేవ్‌తో సెల్పీ దిగేందుకు అభిమానుల సందడిచేశారు. -
తిమ్మరుసు మూవీ టీమ్‌తో స్పెషల్ చిట్ చాట్
-
తిమ్మరుసు మూవీ రివ్యూ
టైటిల్ : తిమ్మరుసు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు : మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్ ఎడిటర్ : తమ్మి రాజు విడుదల తేది : జూలై 30, 2021 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు సత్యదేవ్. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు లాయర్ అవతారమెత్తాడు. కానీ కేసు పేరుతో డబ్బులు గుంజే లాయర్‌గా కాదు, కేసును గెలిపించడం కోసం జేబులోని డబ్బును కూడా నీళ్లలా ఖర్చుపెట్టే న్యాయవాదిగా! ఈ మధ్య వచ్చిన 'నాంది', 'వకీల్ సాబ్' వంటి కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో తను నటించిన 'తిమ్మరుసు' సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కొండంత ధీమా పెట్టుకున్నాడు సత్యదేవ్. మరి అతడి నమ్మకం నిజమైందా? అసలు తిమ్మరుసు అన్న టైటిల్ ఈ చిత్రానికి సెట్టయ్యిందా? అసలే బాలీవుడ్‌లోనూ కాలు మోపబోతున్న అతడికి ఈ సినిమా ప్లస్‌గా మారనుందా? మైనస్ అవనుందా? అనే విషయాలన్నీ కింది రివ్యూలో ఓ రౌండేద్దాం.. కథ శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అతడి పేరును టైటిల్‌గా పెట్టుకున్నారంటేనే తెలిసిపోతోంది హీరో చాలా తెలివైనవాడని. ఈ సినిమాలో సత్యదేవ్ ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించాడు. అతడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు? ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఎంతమేరకు ఉంది? అసలు ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా? అతడు ఇంతలా ఇన్వాల్వ్ కావడానికి ఆ కేసుతో ఇతడికేమైనా సంబంధం ఉందా? ఆ కేసు స్టడీ చేసే రామచంద్రకు పోలీసులు ఎందుకు సహకరించరు? అన్న వివరాలు తెలియాలంటే బాక్సాఫీస్‌కు వెళ్లి బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ 'బీర్బర్' సినిమాకు రీమేక్‌గా వచ్చిందే తిమ్మరుసు. ఈ సినిమా ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం బాగుంది. ప్రియాంక జవాల్కర్ తన అందంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను బుట్టలో వేసుకోవడం ఖాయం. బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. బీజీఎమ్ మరొక హైలైట్ అని చెప్పవచ్చు. మర్డర్ కేసును చేధించే పనిలో పడ్డ హీరో ఒక్కో క్లూను కనుక్కోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకుడిని సీటులో అతుక్కుపోయేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ కథనం కొంత వీక్‌గా ఉన్నట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది! నటీనటులు యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పుకునే సత్యదేవ్ ఈ సినిమాలో ఎలా నటించాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు సాఫ్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఫైట్ సీన్లలోనూ ఇరగదీశాడు. లాయర్ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సూటయ్యాడు. ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బాగానే నటించింది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను వీలైనంత నవ్వించేందుకు ట్రై చేశాడు. మిగతా నటీనటులు కూడా సినిమాను సక్సెస్ దిశగా నడిపించేందుకు తెగ కష్టపడ్డట్లు తెలుస్తోంది. ప్లస్ సత్యదేవ్ నటన ట్విస్టులు ఇంటర్వెల్, క్లైమాక్స్ మైనస్ ఫస్టాఫ్ వీక్‌గా ఉండటం -
ఆ పిచ్చి, ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు: యంగ్ హీరో
‘‘చిత్రపరిశ్రమలో నా ప్రయాణం బాగానే ఉంది. ఇప్పుడు వరుసగా లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఇప్పటివరకూ కెరీర్లో సినిమాపై ఉన్న పిచ్చి, ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు.. అవి నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను’’ అని సత్యదేవ్ అన్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన విశేషాలు. ►కొత్త తరహా సినిమా కోరుకునే ప్రేక్షకుల కోసం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చేశాను. ఆ సినిమా తర్వాత నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వైవిధ్యంగా ఉండే ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలో సృజన్ ఎరబోలు ఫోన్ చేశారు. ఆ తర్వాత శరణ్ కొప్పిశెట్టి వచ్చారు. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కోసం మహేశ్ కోనేరు కూడా జతకలిశారు. కోవిడ్ టైమ్‌లో 39 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో ‘తిమ్మరుసు’ పూర్తి చేశాం. ►లాయర్ కోణం నుంచి సాగే థ్రిల్లర్ చిత్రమిది. ‘అభిలాష’ సినిమాలో చిరంజీవిగారు ఉరిశిక్ష రద్దు కోసం పోరాడితే, ‘తిమ్మరుసు’లో నా పాత్ర యావజ్జీవ కారాగార శిక్ష రద్దు కోసం ఫైట్ చేస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ‘నాంది, వకీల్‌సాబ్’ వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో మా సినిమా విజయంపైనా చాలా నమ్మకంగా ఉన్నాం. ►ఓటీటీల హవా 2023లో స్టార్ట్ అవుతుందనుకున్నాను. అయితే కోవిడ్ వల్ల 2020లోనే స్టార్ట్ అయింది. నా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదనే బాధ ఉండేది.. కానీ మంచి వ్యాపారం జరగడంతో నిర్మాతలు హ్యాపీ. సో.. నేను కూడా హ్యాపీ. కరోనా మొదటి విడత తర్వాత థియేటర్స్‌లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ హిట్ సాధించాయి. అదే నమ్మకంతో ‘తిమ్మరుసు’ను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ►కోవిడ్ సమయంలో మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ రెండొందల రోజుల్లో ఐదు సినిమాలు పూర్తి చేశా. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉండటంతో ఇతర సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకోవడం లేదు.. అయితే సమయం కుదిరితే నటిస్తా. ప్రస్తుతం తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్, గాడ్సే’ చిత్రాలతో పాటు కొరటాల శివగారు సమర్పణలో మరో సినిమా, బాలీవుడ్లో ‘రామ సేతు’ సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రాలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. -
మనదేశంలో సినిమాకి మించిన వినోదం లేదు: నాని
‘‘థియేటర్లో సినిమా చూడటం అనేది మన సంస్కృతి.. అది మన రక్తంలోనే ఉంది. మనదేశంలో సినిమాకి మించిన వినోదం లేదు’’ అని హీరో నాని అన్నారు. సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ–‘‘కరోనా సమయంలో అన్నిటికంటే ముందే థియేటర్లు మూస్తారు.. అన్నిటికంటే చివర్లో తెరుస్తారు. బయట ఉండే ఇతర ప్రదేశాల కంటే థియేటర్స్ చాలా సురక్షితం. ఒకరితో ఒకరం మాట్లాడుకోం.. మాస్క్‌లు వేసుకుని సినిమా చూస్తాం. థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ కుటుంబంపై ఆధారపడి లక్షల మంది ఉన్నారు. థియేటర్ల మూత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ, సినిమా విషయానికొచ్చేసరికి చిన్న సమస్యగా ఆలోచిస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద సమస్య. పరిస్థితులు చక్కబడకుంటే మన తర్వాతి తరం థియేటర్స్ అనుభూతిని మిస్ అవుతారు’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సత్యదేవ్ అంటే నాకు నటుడిగా, వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ సినిమాతో తనకు స్టార్డమ్ వస్తుంది. కరోనా థర్డ్‌వేవ్‌లాంటివేవీ రాకుండా మళ్లీ మనం థియేటర్స్‌లో సినిమాలు చూడాలి. ‘తిమ్మరుసు’ చిత్రం మొదలు ‘టక్ జగదీశ్, లవ్‌స్టోరీ, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్..’ ఇలా అన్ని సినిమాలను మనం థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలి. ‘తిమ్మరుసు’ హిట్ అయ్యి ఈ నెల 30 నుంచి విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్ ఇవ్వాలి. నా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తా’’ అన్నారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది ఓపెన్ యూనివర్సిటీ. ఎవరైనా సరే ప్యాషన్‌తో రావాలి.. కష్టపడి నిరూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్ రేట్ అన్నది చాలా తక్కువ. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్ అయిన ఎంతో మందిలో నాని అన్న ఒకరు. నాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి’’ అన్నారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ–‘‘తిమ్మరుసు’ బాగా రావడానికి సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్. మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సక్సెస్ మీట్లో మరింత మాట్లాడతా’’ అన్నారు. శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ–‘‘యూనిట్ అంతా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు మాస్క్ ధరించి థియేటర్‌కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు వెంకటేశ్ మహా (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), రాహుల్(శ్యామ్ సింగరాయ్), మ్యాంగో మ్యూజిక్ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
తిమ్మరుసు ట్రైలర్ రిలీజ్ చేసిన తారక్
Thimmarusu Movie Trailer: 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్మెంట్ వాలి అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకు వెళ్తారు కానీ రామ్ కారు నుంచి బైక్‌కు వచ్చాడు' అన్న డైలాగ్ సత్యదేవ్ వ్యక్తిత్వాన్ని చెప్తోంది. 'నీ ముందున్నది వాలి అని మర్చిపోకు, ఎదురుగా ఉంటే సగం బలం లాగుతా లాయర్ రామచంద్ర.. నువ్వు సగం బలం లాక్కునే వాలివైతే నేను దండేసి దండించే రాముడిలాంటోడిని' అన్న డైలాగ్ హైలైట్‌గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసు చుట్టూ కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఈనెల 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. Wishing Satya garu @ActorSatyaDev , Mahesh @smkoneru and team #Thimmarusu the very best. Here's the trailer https://t.co/Wfd5VRZ33t Enjoy the movie in theaters — Jr NTR (@tarak9999) July 26, 2021 -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'తిమ్మరుసు'..రిలీజ్ ఎప్పుడంటే..
’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో హీరోగా మారిన సత్యదేవ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ హీరోగా 'తిమ్మరుసు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. 'టాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న ప్రియాంకా జవాల్కర్ ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్, స్టార్ హీరో సినిమాలో అవకాశం
Satyadev Bollywood Entry: హీరోగానూ, కీలక పాత్రలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ‘‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి. నా బాలీవుడ్ పరిచయం కూడా అంతే. నేను నా ప్రొఫైల్‌ను బీ టౌన్లో షేర్ చేయలేదు. కానీ ‘రామ సేతు’లో నటించే అవకాశం వచ్చింది. హ్యాపీ’’ అన్నారు సత్యదేవ్. అతడు నటించిన 'తిమ్మరుసు' చిత్రం కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్గా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. -
1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది
సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘కథ బాగా నచ్చడంతో ‘తిమ్మరుసు’ చేశా. శరణ్ కూల్‌గా సినిమాని పూర్తి చేశాడు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు, వినోదం, సందేశం ఉంటాయి. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు మహేశ్ కోనేరు. ‘‘శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేట లున్న లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించారు. కోవిడ్ నేపథ్యంలో సవాళ్లు ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేశాం’’ అన్నారు శరణ్. ప్రియాంకా జవాల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. ∙సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ -
అక్షయ్ కుమార్ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్!
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదిచుకున్న సత్యదేవ్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామ్‌సేతు' లో సత్యదేవ్‌కు అవకాశం వచ్చినట్లు బీటౌన్ టాక్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుష్రత్ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి సీనియర్ నటుడు నాజర్, తెలుగు నుంచి సత్యదేవ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్ర షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయినా కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. చదవండి :నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసిన 'జాంబిరెడ్డి' డైరెక్టర్ -
పవర్ ఫుల్ లాయర్ పాత్రలో సత్యదేవ్
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. శరణ్ కొప్పిశెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వినోదంతో పాటు సందేశాత్మకంగా రూపొందిన చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య అంశాలున్నాయి. సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించారు. ఆయన లుక్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు దర్శకుడు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. బ్రహ్మాజీ, అజయ్, ‘అల్లరి’ రవిబాబు, అంకిత్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. -
సరైన ఎంట్రీ
‘బ్లఫ్ మాస్టర్’ వంటి హిట్ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మి తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తెలుగులో ఎంట్రీకి ‘గాడ్సే’ సరైన చిత్రం అంటున్నారు ఐశ్వర్య. ‘‘యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్యా లక్ష్మి కూడా నటనకి మంచి ఆస్కారం ఉండే పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: సి.వి. రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి. -
పండగ తర్వాత బిజీ
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆరంభించడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి. 20 నుంచి ‘ఆచార్య, లూసీఫర్’ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌తో చిరంజీవి బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్’ రీమేక్ పొలిటికల్ డ్రామా. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. -
గాడ్సే యాక్షన్
హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విభిన్నమైన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యా మీనన్, కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాత: సీవీ రావు. -
‘గాడ్సే’గా మారబోతున్న సత్యదేవ్
‘బ్లఫ్ మాస్టర్’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించిన సత్యదేవ్... పూరీ జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. (చదవండి : నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) తాజాగా సత్యదేవ్ నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘బ్లఫ్ మాస్టర్’ లాంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గోపీ గణేష్.. మరోసారి సత్యదేవ్‌తో సరికొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘గాడ్సే’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. సీరియస్ లుక్, గన్స్ బ్యాక్ గ్రవుండ్, గాడ్సే అనే టైటిల్ అన్నీ కలిసి సినిమా ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతోందని చెప్పకనే చెబుతున్నాయి. Happy to collaborate once again with 'bluffmaster' @MeGopiganesh anna. This time for an action packed thriller #GODSE. Shoot begins soon. Produced by C Kalyan garu. #GodseTitlePoster pic.twitter.com/pT3mG5CR5q — Satya Dev (@ActorSatyaDev) January 3, 2021 -
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. -
మానవ సంబంధాలతో...
సినిమా తర్వాత సినిమా చేస్తూ లాక్డౌన్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సత్యదేవ్. లాక్ డౌన్ లో ’ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రంతో అలరించిన సత్యదేవ్ నటించిన మరో చిత్రం ’గువ్వా గోరింక’ విడుదలకు సిద్ధమైంది. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాలాల్ కథానాయిక. దాము రెడ్డి కొసనం, ‘దళం’ దర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న అమెజాన్ ప్రై మ్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ– ’’ఈ తరం యువతీ, యువకుల మధ్య పెనవేసుకున్న మానవ సంబంధాలే కథా వస్తువుగా ‘గువ్వాగోరింక’ చిత్రం రూపొందింది. లిమిటెడ్ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రాన్ని తీశాది. తక్కువ బడ్టెట్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలనేవాళ్లకు ఈ సినిమా ఓ గైడ్‌లా ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి. కెమెరా: మైలేశం రంగస్వామి. -
అసైన్మెంట్ వాలి
లాక్డౌన్లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రం విజయంతో ఫుల్ స్పీడు మీదున్నారు సత్యదేవ్. వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. శనివారం ‘తిమ్మరుసు’ చిత్రం ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. సత్యదేవ్‌ను ఈ సినిమాలో కొత్తగా ఆవిష్కరిం^è బోతున్నాం. చిత్రీకరణ పూర్తయింది, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
శీతాకాలానికి అతిథి
‘‘బొంబాటుగుందిరా పోరి...’’ అని పాడుతూ మేఘా ఆకాశ్‌ని ’లై’ సినిమాలో ఆటపట్టించారు నితిన్. తెలుగులో మేఘా ఆకాశ్‌కి ఇది తొలి సినిమా. ఆ పాట చాలా ఫేమస్. ఈ సినిమా ద్వారా మేఘాకి బాగానే పేరొచ్చింది. ఆ తర్వాత ’చల్ మోహనరంగ’ సినిమాలో నటించారామె. రజనీకాంత్ ’పేటా’లో కూడా మంచి పాత్ర చేశారీ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’లో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. సత్యదేవ్, తమన్నా జంటగా రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగశేఖర్, భావనా రవి నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. నేటినుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనుంది. హీరో సత్యదేవ్ పాత్రతో మేఘా పాత్ర ట్రావెల్ అవుతుందట. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ చింతల. -
‘గుర్తుందా శీతాకాలం’లో మేఘా ఆకాశ్
ఈ మధ్యకాలంలో సినిమా కంటెంట్‌కే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అది స్టార్ హీరో సినిమానా. . పెద్ద డైరెక్టర్ తీస్తున్నాడా.. భారీ బడ్జెట్‌తో తీస్తే బ్లాక్‌బస్టరే.. అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. కంటెంట్ బాగుంటే ఇవేమీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మూవీ లవర్స్ టేస్ట్‌ని బట్టే నడుచుకుంటున్నారు మేకర్స్ కూడా. అలాగే కథలో దమ్ముంటే ఎవరితో నటించడానికైనా, ఏ బ్యానర్లో సినిమా తీస్తున్నా ఓకే అంటున్నారు నటీనటులు. అలాంటి కాంబినేషన్లు కూడా బాగానే వర్కవుట్ అవుతున్నాయి. తాజాగా సత్యదేవ్, తమన్నా కూడా ఓ సినిమాలో జోడీ కడుతున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ఈ జంట ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ని సెప్టెంబర్‌లోనే విడుదల చేసింది మూవీ టీమ్. అది మూవీ లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఇక పలు కన్నడ చిత్రాలతో శాండిల్‌వుడ్‌లో తనేంటో నిరూపించుకున్న నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’తో టాలీవుడ్లోకి అడుగు పెడతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. ఒక కీలక పాత్ర కోసం తమిళ ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్‌ను తీసుకుంటున్నారట. ఈ ఏడాది కన్నడలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన లవ్ మాక్‌టెయిల్‌కు రీమేక్ ఈ చిత్రం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండగా ఇప్పటికే ఇద్దరు ఫైనల్ అయ్యారు. అయితే కొద్దిరోజుల క్రితం బడ్జెట్ సమస్యలతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లని తేలిపోయింది. షూటింగ్ త్వరగా ముగించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. -
సరికొత్త తిమ్మరుసు
‘బ్లఫ్ మాస్టర్’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందుతోంది. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్ . శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ ఇవ్వగా, రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుంది. ఈ నెల 21న రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అన్నారు. ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: అప్పూ ప్రభాకర్. -
సూర్యకు డబ్బింగ్ చెప్పిన యంగ్ హీరో
హీరో సూర్య కథానాయకుడిగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’ ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. అపర్ణ బాల మురళి హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లు హీరో సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో చివరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. (మోహన్‌బాబు నా గాడ్ ఫాదర్: సూర్య) ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ'సినిమాలో కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు కీలక పాత్రలో కన్పించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఆకాశం నీ హద్దురా’లో హీరో సూర్యకు విభిన్న పాత్రలతో నటుడుగా ప్రేక్షకాభిమానుల నుంచి మన్ననలు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో వెల్లడించారు. సూర్యకు సత్యదేవ్ వాయిస్ అయితే సరిగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవ్ ఇటీవల విడుదలైన విలక్షణ చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం’తో ప్రేక్షకులను అలరించారు. -
వెబ్ సిరీస్ రివ్యూ: థ్రిల్ చేసే ‘లాక్డ్’
కరోనా దెబ్బతో ఎంటర్టైన్మెంట్ కరువైంది. సినిమాలు, సీరియళ్లు,స్పోర్ట్స్ టోర్నమెంట్లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుప్పుడే అవన్నీ తిరిగి ప్రాంభమవుతున్నా.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సమయం పట్టనుంది. అలాంటి తరుణంలో ఇళ్లవద్ద ఒకరకంగా క్వారంటైన్ పరిస్థితులు అనుభవించిన జనాన్ని ఎంటైర్‌టైన్ చేయడానికి మేమున్నామంటూ వెబ్ సిరీస్‌లు అందుబాటులోకొచ్చాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లతో మొదటైన వెబ్ సిరీస్‌ల ట్రెండ్ తెలుగులోనూ షురూ అయింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు అలరిస్తోంది. ఈ మధ్య విడుదలై సక్సెస్ సాధించిన ‘లాక్డ్’ వెబ్ సిరీస్ రివ్యూ ఓసారి చూద్దాం! టైటిల్: లాక్డ్ నటీనటులు: సత్యరాజ్, శ్రీలక్ష్మీ, ఇంటూరి వాసు, అభిరామ్ వర్మ, సంయుక్త హొర్నాడు తదితరులు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ దేవకుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ:నిజాయ్ గౌతమ్ సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్ నిర్మాతలు: కేఎస్.మధుబాల, హెచ్.శణ్ముగ రాజా జానర్: థిల్లర్ కథ: డాక్టర్ ఆనంద్ చక్రవర్తి (సత్యదేవ్) ఓ గొప్ప న్యూరో సర్జన్. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎంతో మందిని, అతి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసి రక్షిస్తుంటాడు. తినేందుకు కూడా తీరిక లేకుండా సేవలందిస్తుంటాడు. అయితే, ఓ రోజు రాత్రి పని ముగించుకుని వచ్చిన అతనిపై ఇంట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి దాడి చేసి పెట్టెలో బంధిస్తాడు. అదే సమయంలో ఆనంద్ ఇంట్లో ఇద్దరు మహిళలు పద్మిని బామ్మ (శ్రీలక్ష్మీ), వైష్ణవి (సంయుక్త) దొంగతనం చేసేందుకు వస్తారు. ఆనంద్‌ని బంధించిన ఆ వ్యక్తే ఇంటి యజమాని అని భ్రమపడి మత్తుమందు చల్లి తాళ్లతో కట్టేసి సోఫాలో బంధిస్తారు. లాకర్లో ఉన్న డబ్బులు దోచుకుని వెళ్లిపోయే సమయానికి వైష్ణవి మరింత డబ్బు, నగలు ఇంట్లో ఉండొచ్చునని ఓ పెట్టె తెరుస్తుంది. అందులో ఆనంద్ ఉండటంతో ఇద్దరు దొంగలు అతని కట్లు విప్పి రక్షిస్తారు. అతనే ఇంటి యజమాని అని తెలియడంతో.. కారు పాడై సాయం కోసం వస్తే.. నీ స్థానంలో ఉన్న వ్యక్తి మాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే కట్టివేశామని కథ అల్లుతారు. అయితే, పోలీసులకు సమాచారం ఇస్తానని, వాళ్లు వచ్చి తనను బంధించిన వ్యక్తి పని చెప్తారని ఆనంద్ చెప్పడంతో.. ఆ దొంగలు అక్కడ నుంచి పారేపోయేందుకు యత్నిస్తారు. దీంతో ఇంట్లో చొరబడ్డ వ్యక్తి, దొంగతనం చేసిన ఇద్దరు మహిళలను ఆనంద్ వేర్వేరుగా బంధిస్తాడు. ఈక్రమంలోనే భార్యతో గొడవ కావడంతో ఆనంద్ కొలీగ్ మిస్బా, మరో పోలీస్ అధికారిని వెంటబెట్టుకుని అదే ఇంటికొస్తాడు. మందు పార్టీ చేసుకుంటారు. పార్టీలో పాల్గొంటూనే ఆ ఇంట్లో తాము ముగ్గురం కాకుండా ఇంకెవరో ఉన్నారని పోలీస్ వ్యక్తి అనుమానంగా ఉంటాడు. ఇంటి వెనకాల అతను చూసిన వస్తువులు అతని అనుమానాన్ని మరింత పెంచుతాయి. దాంతోపాటు డాక్టర్ ఆనంద్ బంధించిన మహిళలు కూడా అతని కంటబడతారు. అయితే, అనూహ్యంగా డాక్టర్ ఆనంద్ ఆ పోలీస్ వ్యక్తిని చంపేయడంతో అసలు కథ మొదలవుతుంది. డాక్టర్ ఇంట్లో లాక్ అయిన ఆ వ్యక్తులు ఎలా బయటపడ్డారు. అసలు ఆనంద్ వెనకున్న మిస్టరీ ఏంటీ అనేది ప్రధాన కథ. (చదవండి: అది అదృష్టంగా భావిస్తున్నా) విశ్లేషణ: కథలో చాలా భాగం ఒక ఇంట్లోనే జరుగుతుండటంతో స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. నలుగురికి మంచి జరిగేందుకు ఒక్కడు చనిపోతే ఫరవాలేదని కథాంశం. అయితే, ఆ ఒక్కరు ఎవరేనేది ప్రశ్న! ఇక కథానాయకుడు ఆనంద్ పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. మనసున్న డాక్టర్‌గా, సైకో థ్రిల్లర్‌గా రెండు కోణాలున్న పాత్రలో ఒదిగిపోయాడు. మొత్తం ఏడు ఏపిసోడ్లుగా ఉన్న ఈ సిరీస్‌లో తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్ నుంచి థ్రిలింగ్ మొదలవుతుంది. ఇక లాక్డ్ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్ అయిందంటే సినిమాటోగ్రఫీ మూలంగానే. దాంతోపాటు సన్నివేశాలకు తగ్గట్టుగా ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజిషన్ నటన పరంగా సీనియర్ నటి శ్రీలక్ష్మీ చాలా రోజుల తర్వాత ఓ మంచి, ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించి మెప్పించారు. సంయుక్త, వాసు ఇంటూరి, అభిరామ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు. ఆపరేషన్లకు సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కీలకంగా పనిచేసింది. మొత్తంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడక్కడా లాజికల్‌గా కొన్ని సీన్లు కన్ఫ్యూజ్ చేస్తాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను కోరుకున్నప్పటికీ.. మరీ ఎక్కువ సేపు చీకటి వాతావరణకం కొంచెం విసుగ్గా తోచే అవకాశముంది. క్లైమాక్స్‌లో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుగా ఉంది. అయితే, ఈ సిరీస్‌కు రెండో పార్ట్ కూడా తీసే ఉద్దేశంతో ఫుల్ క్లారిటీ ఇవ్వలేదేమో! (చదవండి: ఇంట్లోనే విడాకుల వాదనలు వకాలత్ ఫ్రమ్ హోమ్) బలం: కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సత్యదేవ్ నటన బలహీనతలు కొన్ని చోట్ల లాజికల్‌గా సెట్ కానీ సీన్లు సిరీస్ అధిక భాగం చీకట్లో ఉండటం. -
అది అదృష్టంగా భావిస్తున్నా
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని చాలామంది నటీనటులు అంటుంటారు. అయితే అచ్చ తెలుగమ్మాయి చందన కొప్పిశెట్టి మాత్రం డాక్టర్ అయ్యాక నటి అయ్యారు. డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసిన చందన కథానాయిక కావాలన్న సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఆడిష¯Œ ్సలో విజేతగా నిలిచి కథానాయిక అవకాశాన్ని అందుకున్నారు. సత్యదేవ్ హీరోగా మహా వెంకటేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదౖలñ ంది. ఈ సందర ్భంగా చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో నటనకు బాగా అవకాశం ఉన్న స్వాతి పాత్రను ఇందులో చేశాను. తొలి చిత్రంలోనే అభినయానికి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరోయిన్గా రాణించాలన్న నా ఆశయానికి ఈ చిత్రం బంగారు బాట వేసింది. నా నటనను చూసిన కొందరు సినీ పెద్దలు.. పెద్ద హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయంటూ కితాబు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. ప్రస్తుతం రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలు చెబుతాను’’ అన్నారు. -
శీతాకాలం ప్రేమ
సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగÔó ఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన, రవి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఆడియో హక్కులను కర్ణాటకకు చెందిన ఆనంద్ ఆడియో సంస్థ 75లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ మాట్లాడుతూ –‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేసన్ అనగానే ట్రేడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మా చిత్రం టైటిల్ విన్నవారంతా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయని, తమ ప్రేమకథలను గుర్తు చేసుకుంటున్నారు. టైటిల్ పొయెటిక్‌గా ఉంది అంటుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య హెగ్డే, లైన్ప్రొడ్యూసర్స్: సంపత్‌కుమార్, శివ్దశ్ యశోదర.