సత్యదేవ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‌గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.
జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్‌మీడియాలో వెల్లడించింది. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్ట్ చేసింది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఈ నెల 18 నుంచే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు స్ట్రీమింగ్ కానుంది. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి చూసేయొచ్చు.
జీబ్రా కథేంటంటే..
సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్‌లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్‌లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment