Zebra Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఇంకా 'పుష్ప 2' హవా నడుస్తూనే ఉంది. మరోవైపు అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి', విజయ్ సేతుపతి 'విడుదల 2', ఉపేంద్ర 'యూఐ', హాలీవుడ్ మూవీ 'ముఫాసా' థియేటర్లలోకి వచ్చేశాయి. వీటన్నింటిపైన ఓ మాదిరి బజ్ అయితే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ ఒక్కరోజే 20కి మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూద్దాం.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ జాబితా (డిసెంబర్ 20)అమెజాన్ ప్రైమ్ముర - మలయాళ మూవీమదనోల్సవం - మలయాళ సినిమాస్వైప్ క్రైమ్ - హిందీ సిరీస్బీస్ట్ గేమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాజీబ్రా - తెలుగు సినిమానిరంగళ్ మూండ్రు - తమిళ మూవీహాట్స్టార్వాట్ ఇఫ్? సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (డిసెంబర్ 22)నెట్ఫ్లిక్స్ఫెర్రీ 2 - డచ్ సినిమాసిక్స్ ట్రిపుల్ ఎయిట్ - ఇంగ్లీష్ మూవీయూనివర్ క్సో డబీజ్ - ఇంగ్లీష్ సిరీస్ఉజుమాకీ - జపనీస్ సిరీస్యోయో హనీసింగ్: ఫేమస్ - హిందీ మూవీఉంజులో - ఇంగ్లీష్ సినిమాదిలాన్ 1983 - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ద డ్రాగన్ ప్రిన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)వర్జిన్ రివర్ సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ - హిందీ సినిమా (డిసెంబర్ 21)ద ఫోర్జ్ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 22)సోనీ లివ్క్యూబికల్స్ సీజన్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్స్టాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్స్ట్కడకన్ - మలయాళ మూవీజియో సినిమాఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై - భోజ్‌పురి సినిమామూన్ వాక్ - హిందీ సిరీస్పియా పరదేశియా - మరాఠీ మూవీలెయిడ్ - ఇంగ్లీష్ సిరీస్థెల్మా - ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 21)లయన్స్ గేట్ ప్లేబాయ్ కిల్స్ వరల్డ్ - ఇంగ్లీష్ సినిమాబుక్ మై షోసెంటిమెంటాల్ - బెంగాలీ మూవీ(ఇదీ చదవండి: పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!) -
ఓటీటీలోకి వచ్చేసిన బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ సినిమా
యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ టెక్నీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై మోస్తరు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన 'జీబ్రా' మూవీని డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. కానీ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ చందాదారులు మాత్రం 48 గంటల ముందే చూడొచ్చని పేర్కొంది. అందుకు తగ్గట్లు ఇప్పుడు వాళ్ల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.'జీబ్రా' విషయానికొస్తే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్) ఇతడి లవర్. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో సూర్య సాయం కోరుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది కానీ అక్కడి నుంచే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ అవేంటి? సూర్యతో పాటు అతడి ఫ్యామిలీని డాన్ ఆది (డాలీ ధనంజయ) ఎందుకు చంపాలనుకున్నాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
మరో వారం వచ్చేసింది. టాలీవుడ్ ఇంకా 'పుష్ప 2' మేనియాలోనే ఉంది. గతవారం బాక్సాఫీస్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం దాదాపు అరడజను మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ 'బచ్చమల్లి', ఉపేంద్ర 'యూఐ', విజయ్ సేతుపతి 'విడుదల 2', ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' హాలీవుడ్ డబ్బింగ్ 'ముఫాసా', మలయాళ డబ్బింగ్ మూవీ 'మార్కో' రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం ఏకంగా 30 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో సత్యదేవ్ 'జీబ్రా' మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. మిగిలనవన్నీ కూడా హిందీ-ఇంగ్లీష్ మూవీసే. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 16 నుంచి 22 వరకు)నెట్ఫ్లిక్స్ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 17రోనీ చింగ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 18మనా మన్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 18ద మ్యానీ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 18దిలాన్ 1983 (ఇండోనేసియన్ సినిమా) - డిసెంబర్ 19ద డ్రాగన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19ఫెర్రీ 2 (డచ్ సినిమా) - డిసెంబర్ 20సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 20ఉంజులో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20యునివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 20ఉజుమాకీ (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 20యోయో హనీసింగ్: ఫేమస్ (హిందీ మూవీ) - డిసెంబర్ 20స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ (హిందీ సినిమా) - డిసెంబర్ 21ద ఫోర్జ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 22అమెజాన్ ప్రైమ్గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ మూవీ) - డిసెంబర్ 18బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 19హాట్స్టార్ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్ఫుల్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 17వాట్ ఇఫ్? సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 22జియో సినిమాట్విస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 18మూన్ వాక్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 20పియా పరదేశియా (మరాఠీ మూవీ) - డిసెంబర్ 20ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై (భోజ్ పురి సినిమా) - డిసెంబర్ 20థెల్మా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 21ఆహాజీబ్రా (తెలుగు సినిమా) - డిసెంబర్ 20మనోరమ మ్యాక్స్పలోట్టీస్ 90స్ కిడ్స్ (మలయాళ సినిమా) - డిసెంబర్ 18ఆపిల్ ప్లస్ టీవీద సీక్రెట్ లైవ్స్ ఆఫ్ .యనిమల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 18లయన్స్ గేట్ ప్లేబాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 20బుక్ మై షోసెంటిమెంటాల్ (బెంగాలీ మూవీ) - డిసెంబర్ 20(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే) -
ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సత్యదేవ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్‌మీడియాలో వెల్లడించింది. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్ట్ చేసింది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఈ నెల 18 నుంచే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు స్ట్రీమింగ్ కానుంది. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి చూసేయొచ్చు. జీబ్రా కథేంటంటే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్పై ప్రకటన
క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మాస్ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ప్రేక్షకులను మెప్పించిన జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అయితే, అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఆ సంస్థ ప్రకటించలేదు. త్వరలో అంటూ ఒక పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. అయితే, డిసెంబర్ 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
టాలీవుడ్‌ని నిండా ముంచిన నవంబర్.. 22 సినిమాలు ఫ్లాప్!
టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయింది. గతేడాది మాదిరే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్‌కి కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజైన సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.నవంబర్ మెదటి వారంలోనే దాదాపు 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ కూడా ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఇక నిఖిల్ సినిమా అయితే భారీ ఫ్లాప్‌ని మూటకట్టుకుంది. జితెందర్ రెడ్డి సినిమాకు ఓ మోస్తారు టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక మంచు లక్ష్మి ఆదిపర్వం, హెబ్బా పటేల్ ‘ధూంధాం’ లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.ఇక రెండోవారంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం.. నవంబర్ 14న విడుదలై ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట ఫ్లాప్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాలతో వచ్చి సూర్య ‘కంగువా’..ఘోర పరాజయాన్ని చవిచూసింది.(చదవండి: హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!)ఇక నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ పోరులో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సత్యదేవ్‌తో పాటు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డారు. విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జీబ్రా రెండూ.. నవంబర్ 22న విడుదలయ్యాయి. వీటిలో మెకానిక్ రాకీ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సెకండాఫ్ బాగున్నా.. ఫస్టాఫ్‌ని భరించడం కష్టమేనని రివ్యూస్ చెప్పాయి. అయితే కొంతవరకు అయినా కలెక్షన్స్ వస్తాయని భావించినా.. మూడో రోజు నుంచే సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు. (చదవండి: చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్)ఇక సత్యదేవ్ జీబ్రా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి స్క్రీన్స్ కూడా పెరిగాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ఆ జోష్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రమైతే ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.ఇక నవంబర్ చివరి వారంలో మరో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో రోటి కపడా రొమాన్స్ మూవీకి మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ.. అప్పటికే ప్రేక్షకులంతా పుష్ప 2 ఫీవర్‌లోకి వెళ్లారు. మొత్తంగా నవంబర్ నెల అయితే ఎప్పటి మాదిరే టాలీవుడ్‌ని నిండా ముంచేసింది. ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్లో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ పుంజుకునే అవకాశం ఉంది. పుష్ప 2తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఇయర్ ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందో చూడాలి. -
ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్
గత వీకెండ్లో మూడు నాలుగు సినిమాలు రిలీజైతే దాదాపు అన్నింటికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటితో పోలిస్తే సత్యదేవ్ 'జీబ్రా'కు ఓ మాదిరి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్నే చిత్రబృందమే ప్రకటించింది. మొదటి రోజుతో పోల్చితే రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)'ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు. అంతకన్నా ఏం కావాలి. ఈ క్షణం.. ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! ఐదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. 'బ్లఫ్ మాస్టర్'ని థియేటర్లలో మిస్సయి తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి మెచ్చుకున్నారు. 'జీబ్రా'కి అలా జరగొద్దని కోరుకుంటున్నా' అని సత్యదేవ్ రాసుకొచ్చాడు.సత్యదేవ్.. మంచి నటుడు అని పేరైతే తెచ్చుకున్నాడు గానీ సరైన సినిమాలే పడట్లేదు. గత కొన్నేళ్లుగా హీరోగా తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు 'జీబ్రా'తో చాలా రోజుల తర్వాత సక్సెస్ చూసేసరికి భావోద్వేగానికి లోనవుతున్నాడు.(ఇదీ చదవండి: ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్)తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, #ZEBRA - బొమ్మ సూపర్ హిట్-uu ❤️ ఎప్పటికీ రుణపడి ఉంటాము🙏Live, let live.Grow, let grow. pic.twitter.com/yJX25lfe39— Satya Dev (@ActorSatyaDev) November 26, 2024 -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ
తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యదేవ్ ఒకడు. నటుడిగా బాగానే పేరొచ్చింది కానీ హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన కన్నడ నటుడు ధనంజయ మరో కీలక పాత్ర పోషించాడు. బ్యాంక్ స్కామ్ తరహా స్టోరీతో తీసిన ఈ చిత్రం తాజాగా (నవంబర్ 22) థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!)సత్యదేవ్ 'జీబ్రా' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. అలానే కొన్నిచోట్ల షోలు కూడా షురూ అయిపోయాయి. దీంతో ట్విటర్లో టాక్ బయటకొచ్చింది. కామెడీ, థ్రిల్, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. అదే టైంలో సత్యదేవ్ మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు. సత్య కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇంతకీ ట్విటర్లో ఎవరు ఏమంటున్నారంటే?(ఇదీ చదవండి: Mechanic Rocky X Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?)Show completed:- #zebra Very very good movie Ok 1st half Blockbuster 2nd half 👌👌My rating 3/5 pic.twitter.com/DAhjTkUAvz— venkatesh kilaru (@kilaru_venki) November 21, 2024#Zebra Review ⭐🌟🌟 🌟#EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.@ActorSatyaDev & @Dhananjayaka screen presence steals the show & Nailed it 🔥🔥Comeback for both Actorbest Heist Drama . especially Bank Employee should not miss this movie . pic.twitter.com/KXFnGvq0ZW— Filmy Feed (@filmy_feed_) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥Super First Half with Blockbuster Second Half 🔥🔥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥Our Rating : 3.5/5 💥💥💥💥#SatyaDev #Zebra pic.twitter.com/WmNkei4BWi— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) November 22, 2024#Zebra : Worthu varma Worthu 🤌🔥🔥Comedy ✅ Suspence ✅ Action ✅ Thrills ✅ all are worked very well. Enjoyed alot.👏🔥🔥🔥- Master Mind Satya Dev Is back after Bluff Master 🤌🔥- Dhananjaja characterization 😈🔥- Satya as usual 🤯🔥🔥 - Priya Bhavani Shankar 😌❤️🔥-… pic.twitter.com/61IPWDQEtJ— SRi Harsha 😈 (@SSanivaar) November 21, 2024#Zebra - UNEXPECTED🔥Easily one of the best film in 2024 ♥️Lucky Baskar kind of Bank robbery film❤️🔥❤️🔥BGM & Robbery scenes are 🔥🔥🔥@ActorSatyaDev @Dhananjayaka @RaviBasrur @priya_Bshankar pic.twitter.com/I5oN8mp9gh— RAJA DK (@rajaduraikannan) November 21, 2024#SatyaDev's #ZebraReview - Second Half 👉 @Satyadev makes a solid comeback, delivering the much-needed punch.👉 #ZEBRA floats seamlessly with the right mix of fun, thrill, and twists.👉 #EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.👉… pic.twitter.com/xl2F7HFv5y— Pakka Telugu Media (@pakkatelugunewz) November 21, 2024Extraordinary Cinema 👌👌20's Scam ❤️🔥❤️🔥Duo Satya's 👌🤣🤣#Zebra pic.twitter.com/BvvifqNB3W— .Mark (@Aark_in_exile) November 21, 2024#Zebra #Review #Satyadev makes a solid comeback the much-needed 👊#ZEBRA floats with the mix of fun, thrill, and full of twists.#Satya 🔥🔥🙏Director sharp writing and engaging screenplay keep you hooked.Pre-climax and climax twist land perfectly.🔥🤙👊My rating: 🌟🌟🌟 pic.twitter.com/sjfrWFpeqh— Daily Newzzzz (@Not_Elon_Muskk) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥 #SatyaDev 🤯Action ✅ Comedy ✅ Drama ✅All worked wellSuper First Half And Blockbuster Second Half 🔥🔥#BlockbusterZebra 💥💥💥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥💥💥🤯(Movie Mania 3.5/5)… pic.twitter.com/kRNeaFJnEJ— Movie Mania (@Nimmapandu28) November 22, 2024 -
‘జీబ్రా’ క్లైమాక్స్ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్
‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.→ ఇందులో నేను బ్యాంకర్ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది. -
తప్పులు దిద్దుకుని జీబ్రా చేశాను : ఈశ్వర్ కార్తీక్
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ–‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినీ రంగంవైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వచ్చాను. కీర్తీ సురేష్‌గారితో ‘పెంగ్విన్ ’ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, తప్పులు దిద్దుకుని ‘జీబ్రా’ చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయగార్లు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియభవానీ పాత్రలూ ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను’’ అన్నారు.