
గత వీకెండ్‌లో మూడు నాలుగు సినిమాలు రిలీజైతే దాదాపు అన్నింటికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటితో పోలిస్తే సత్యదేవ్ 'జీబ్రా'కు ఓ మాదిరి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్నే చిత్రబృందమే ప్రకటించింది. మొదటి రోజుతో పోల‍్చితే రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)
'ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు. అంతకన్నా ఏం కావాలి. ఈ క్షణం.. ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! ఐదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. 'బ్లఫ్ మాస్టర్'ని థియేటర్లలో మిస్సయి తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి మెచ్చుకున్నారు. 'జీబ్రా'కి అలా జరగొద్దని కోరుకుంటున్నా' అని సత్యదేవ్ రాసుకొచ్చాడు.
సత్యదేవ్.. మంచి నటుడు అని పేరైతే తెచ్చుకున్నాడు గానీ సరైన సినిమాలే పడట్లేదు. గత కొన్నేళ్లుగా హీరోగా తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు 'జీబ్రా'తో చాలా రోజుల తర్వాత సక్సెస్ చూసేసరికి భావోద్వేగానికి లోనవుతున్నాడు.
(ఇదీ చదవండి: ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్)
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, #ZEBRA - బొమ్మ సూపర్ హిట్-uu ❤️ ఎప్పటికీ రుణపడి ఉంటాము🙏
Live, let live.
Grow, let grow. pic.twitter.com/yJX25lfe39— Satya Dev (@ActorSatyaDev) November 26, 2024
Comments
Please login to add a commentAdd a comment