satya dev
-
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్పై ప్రకటన
క్రైమ్ థ్రిల్లర్ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మాస్ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా మెప్పించింది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ప్రేక్షకులను మెప్పించిన జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అయితే, అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనేది మాత్రం ఆ సంస్థ ప్రకటించలేదు. త్వరలో అంటూ ఒక పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. అయితే, డిసెంబర్ 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్
గత వీకెండ్లో మూడు నాలుగు సినిమాలు రిలీజైతే దాదాపు అన్నింటికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటితో పోలిస్తే సత్యదేవ్ 'జీబ్రా'కు ఓ మాదిరి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్నే చిత్రబృందమే ప్రకటించింది. మొదటి రోజుతో పోల్చితే రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)'ఇది మీరు ఇచ్చిన విజయం. మీరు బాగుంది అన్నారు. అంతకన్నా ఏం కావాలి. ఈ క్షణం.. ఒక్క థియేట్రికల్ హిట్ కోసం!! ఐదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. 'బ్లఫ్ మాస్టర్'ని థియేటర్లలో మిస్సయి తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి మెచ్చుకున్నారు. 'జీబ్రా'కి అలా జరగొద్దని కోరుకుంటున్నా' అని సత్యదేవ్ రాసుకొచ్చాడు.సత్యదేవ్.. మంచి నటుడు అని పేరైతే తెచ్చుకున్నాడు గానీ సరైన సినిమాలే పడట్లేదు. గత కొన్నేళ్లుగా హీరోగా తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు 'జీబ్రా'తో చాలా రోజుల తర్వాత సక్సెస్ చూసేసరికి భావోద్వేగానికి లోనవుతున్నాడు.(ఇదీ చదవండి: ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్)తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, #ZEBRA - బొమ్మ సూపర్ హిట్-uu ❤️ ఎప్పటికీ రుణపడి ఉంటాము🙏Live, let live.Grow, let grow. pic.twitter.com/yJX25lfe39— Satya Dev (@ActorSatyaDev) November 26, 2024 -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ
తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యదేవ్ ఒకడు. నటుడిగా బాగానే పేరొచ్చింది కానీ హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన కన్నడ నటుడు ధనంజయ మరో కీలక పాత్ర పోషించాడు. బ్యాంక్ స్కామ్ తరహా స్టోరీతో తీసిన ఈ చిత్రం తాజాగా (నవంబర్ 22) థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!)సత్యదేవ్ 'జీబ్రా' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. అలానే కొన్నిచోట్ల షోలు కూడా షురూ అయిపోయాయి. దీంతో ట్విటర్లో టాక్ బయటకొచ్చింది. కామెడీ, థ్రిల్, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. అదే టైంలో సత్యదేవ్ మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు. సత్య కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇంతకీ ట్విటర్లో ఎవరు ఏమంటున్నారంటే?(ఇదీ చదవండి: Mechanic Rocky X Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?)Show completed:- #zebra Very very good movie Ok 1st half Blockbuster 2nd half 👌👌My rating 3/5 pic.twitter.com/DAhjTkUAvz— venkatesh kilaru (@kilaru_venki) November 21, 2024#Zebra Review ⭐🌟🌟 🌟#EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.@ActorSatyaDev & @Dhananjayaka screen presence steals the show & Nailed it 🔥🔥Comeback for both Actorbest Heist Drama . especially Bank Employee should not miss this movie . pic.twitter.com/KXFnGvq0ZW— Filmy Feed (@filmy_feed_) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥Super First Half with Blockbuster Second Half 🔥🔥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥Our Rating : 3.5/5 💥💥💥💥#SatyaDev #Zebra pic.twitter.com/WmNkei4BWi— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) November 22, 2024#Zebra : Worthu varma Worthu 🤌🔥🔥Comedy ✅ Suspence ✅ Action ✅ Thrills ✅ all are worked very well. Enjoyed alot.👏🔥🔥🔥- Master Mind Satya Dev Is back after Bluff Master 🤌🔥- Dhananjaja characterization 😈🔥- Satya as usual 🤯🔥🔥 - Priya Bhavani Shankar 😌❤️🔥-… pic.twitter.com/61IPWDQEtJ— SRi Harsha 😈 (@SSanivaar) November 21, 2024#Zebra - UNEXPECTED🔥Easily one of the best film in 2024 ♥️Lucky Baskar kind of Bank robbery film❤️🔥❤️🔥BGM & Robbery scenes are 🔥🔥🔥@ActorSatyaDev @Dhananjayaka @RaviBasrur @priya_Bshankar pic.twitter.com/I5oN8mp9gh— RAJA DK (@rajaduraikannan) November 21, 2024#SatyaDev's #ZebraReview - Second Half 👉 @Satyadev makes a solid comeback, delivering the much-needed punch.👉 #ZEBRA floats seamlessly with the right mix of fun, thrill, and twists.👉 #EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.👉… pic.twitter.com/xl2F7HFv5y— Pakka Telugu Media (@pakkatelugunewz) November 21, 2024Extraordinary Cinema 👌👌20's Scam ❤️🔥❤️🔥Duo Satya's 👌🤣🤣#Zebra pic.twitter.com/BvvifqNB3W— .Mark (@Aark_in_exile) November 21, 2024#Zebra #Review #Satyadev makes a solid comeback the much-needed 👊#ZEBRA floats with the mix of fun, thrill, and full of twists.#Satya 🔥🔥🙏Director sharp writing and engaging screenplay keep you hooked.Pre-climax and climax twist land perfectly.🔥🤙👊My rating: 🌟🌟🌟 pic.twitter.com/sjfrWFpeqh— Daily Newzzzz (@Not_Elon_Muskk) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥 #SatyaDev 🤯Action ✅ Comedy ✅ Drama ✅All worked wellSuper First Half And Blockbuster Second Half 🔥🔥#BlockbusterZebra 💥💥💥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥💥💥🤯(Movie Mania 3.5/5)… pic.twitter.com/kRNeaFJnEJ— Movie Mania (@Nimmapandu28) November 22, 2024 -
తప్పులు దిద్దుకుని జీబ్రా చేశాను : ఈశ్వర్ కార్తీక్
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ–‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినీ రంగంవైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వచ్చాను. కీర్తీ సురేష్‌గారితో ‘పెంగ్విన్ ’ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, తప్పులు దిద్దుకుని ‘జీబ్రా’ చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయగార్లు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియభవానీ పాత్రలూ ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను’’ అన్నారు. -
సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్
సత్యదేవ్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలోనూ ఇతడు నటించాడు. కానీ ఆ సీన్లన్నీ లేపేశారు. ఆ విషయాన్ని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.'ఆర్ఆర్ఆర్' కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ టీమ్‌పై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం 'ఆర్ఆర్ఆర్' టైటిల్ కార్డ్స్లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు. ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ ధనంజయ.. ఇందులో కీలక పాత్ర పోషించాడు. చాన్నాళ్లుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్‌కి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
వాస్తవ ఘటనల స్ఫూర్తితో సత్యదేవ్ సినిమా.. విడుదలపై ప్రకటన
సత్యదేవ్ , డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీబ్రా’ . లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల మోషన్ పోస్టర్‌ను వీడియో ద్వారా విడుదల చేశారు మేకర్స్. అక్టోబర్ 31న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. సత్యదేవ్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది ఈ సినిమాకు సంగీతం రవి బస్రూర్ అందించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఉన్నారు. సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ , జెన్నిఫర్ కథానాయికలుగా నటిస్తుండగా సునీల్,సత్య కీలకపాత్రలో కనిపించనున్నారు. -
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
‘‘నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ‘నాయగన్’ సినిమాలో కమల్‌హాసన్‌లా కొత్త గెటప్ ట్రై చేయాలని ఉంది. చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం అంటే ఇష్టం. అలాగే ‘బాహుబలి’ కూడా. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా కల. కొత్త తరహా కథతో రూపొందించిన కృష్ణమ్మ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని హీరో సత్యదేవ్ అన్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘కృష్ణమ్మ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఓకే అయ్యాక నేను చివర్లో ఈ ప్రాజెక్టులోకి వచ్చా. గోపాలకృష్ణ చెప్పిన కథ నిర్మాత కృష్ణకు నచ్చింది. ఆ తర్వాత ఈ కథను కొరటాల శివ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో సమర్పకుడిగా మారారు. కొరటాలగారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. అంత పెద్ద డైరెక్టర్ అయిన కొరటాల స్క్రిప్ట్‌లో మార్పు చెప్పకుండా సినిమాకు సపోర్ట్ చేయడం సంతోషం. ∙విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం, రౌడీయిజం గురించి చెబుతుంటారు. కానీ, విజయవాడ అంటే అవి మాత్రమే కాదని చెప్పే కథే కృష్ణమ్మ. ముగ్గురు స్నేహితుల కథే ఈ మూవీ. మంచి ఫ్యామిలీ ఉండాలి, జీవితంలో బాగా సెటిల్ కావాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కల చెదిరిపోతుంది.అసలు అప్పుడు వాళ్లేం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో వించిపేట భద్ర అనే పాత్ర చేశాను. విజయవాడ యాస, పొగరు, పగ.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత కృష్ణకి సినిమా అంటే ఫ్యాషన్. ఆయన ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ అంతా విజయవాడలోనే చేయడానికి సపోర్ట్ చేశారు. కాలభైరవ చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. ‘కృష్ణమ్మ’ మూవీతో సత్యదేవ్ స్టార్ అవుతాడనే నమ్మకం ఉందని రాజమౌళి అనడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ హిట్ అయి స్టార్డమ్ వచ్చినా నేను ఇప్పటిలాగే ఉంటాను. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్‌గారి ‘రామసేతు’ చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉత్తరాదిలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ రేంజ్ పాత్రలు రాకపోవడంతో చేయడంలేదు. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. -
సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీలో అతీరా రాజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓకేసులో సత్యదేవ్‌ను అన్యాయంగా ఇరికిస్తారు.. అతను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం.. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్.. అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ట్రైలర్లో సత్యదేవ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మరీ సత్య ఖాతాలో కమర్షియల్ హిట్ పడుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సత్య దేవ్ భార్య, కొడుకును చూశారా? ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన హీరో
టాలీవుడ్లో వర్సలైట్ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ తాజాగా 'గుర్తుందాదా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు. అయితే సినిమాల్లో రాకముందే సత్యదేవ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్ ఐకాన్’ యశస్వి మోసం బట్టబయలు! అయితే ఎప్పుడు తన కుటుంబాన్ని మీడియాకు పరిచయం చేయలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్ ఈవెంట్లో తన భార్యను పరిచయం చేసిన సత్యదేవ్ తాజాగా తన కొడుకును కూడా పరిచయం చేశాడు. ఈ రోజు తన కొడుకు బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్ చేశాడు. సత్య దేవ్ భార్య పేరు దీపికా, కొడుకు పేరు సవర్ణిక్. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. స్టేజ్‌పై శ్రీహాన్ ముందే సిరి కన్నీళ్లు! బుధవారం(ఫిబ్రవరి 8) తనయుడి బర్త్‌డే సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ కొడుకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో సత్య దేవ్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉంచిన సత్య దేవ్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అందమైన ఫ్యామిలీ, చూడముచ్చటైన జంట అంటూ సత్యదేవ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుర్తుందా శీతాకాలం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. రిలీజ్‌కు ముందు పాజిటివి బజ్ క్రియేట్ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి అప్డేట్ లేకుండా డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
ఓటీటీకి వచ్చేస్తున్న రామ్ సేతు.. ఫ్రీగా చూసేయండి..!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది. ‘రామ్ సేతు’ కథేంటంటే..': ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీ చూసి ఎంజాయ్ చేయండి. -
సూసైడ్ బాంబర్ అనుకొని నన్ను అరెస్ట్ చేశారు : సత్యదేవ్
టాలీవుడ్లో వర్సలైట్ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ తాజాగా 'గుర్తాందా శీతాకాలం' సినిమాలో తమన్నాతో కలిసి నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ పలు విశేషాలను పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే తనకు పిచ్చి ఇష్టమని, ఓరోజు కొదమసింహంలోని ఓ ఫైట్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే నుదిటిపై దెబ్బతగిలి ఆ మచ్చ అలాగే ఉండిపోయిందని తెలిపాడు. ఇక గాడ్‌ఫాదర్ సినిమా షూటింగ్ సందర్భంగా ఓరోజు చిరంజీవి తనను ఇంటికి ఆహ్వానించడంతో జీవితం ధన్యమైపోయిందని పేర్కొన్నాడు. ఇక సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు.. 'ఎయిర్‌పోర్టులో నన్ను సూసైడ్ బాంబర్ అనుకొని అరెస్ట్ చేశారు. సాధారణంగా సూసైడ్ బాంబర్స్ ట్రిగర్ కాలి దగ్గర ఉంచుకుంటారట. ఈ విషయం నాకు తెలియదు. ఎయిర్‌పోర్టులో నా పక్కన కూర్చున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ని కాలి దగ్గర పెట్టుకున్నాడు. అది తీయడానికి ప్రయత్నిస్తుంటే, అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. పక్కన నేను ఉండేసరికి నన్ను కూడా సూసైడ్ బాంబర్ అనుకొని అరెస్ట్ చేశారు' అంటూ చెప్పుకొచ్చాడు. -
‘గుర్తుందా శీతాకాలం’మూవీ రివ్యూ
టైటిల్: గుర్తుందా శీతాకాలం నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు నిర్మాణ సంస్థలు: వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ దర్శకత్వం: నాగశేఖర్ సంగీతం: కాలభైరవ సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: డిసెంబర్ 9 , 2022 కథేంటంటే.. ఈ కథంతా రోడ్ జర్నీలో పరిచమైన ఇద్దరు వ్యక్తులు దేవ్(సత్యదేవ్), దివ్య (మేఘా ఆకాష్) మధ్య సంభాషణగా కొనసాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్, కాలేజీ డేస్‌లలో ఒక్కో అమ్మాయితో లవ్‌లో పడతాడు. స్కూల్ డేస్లోది అట్రాక్షన్. కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అయితే అతని శాలరీ తక్కువని, ధనవంతులుగా ఉన్న మనం అలాంటి వారితో జీవితాన్ని కొనసాగించలేమని తల్లి చెప్పడంతో అమ్ము మనసు మారుతుంది. ప్రతిసారి దేవ్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అనేకసార్లు అవమానిస్తుంది. అయినా కూడా దేవ్ ఆమెను ఒక్కమాట అనడు. చివరకు ఆమే దేవ్‌కి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిధి(తమన్నా) వస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి? నిధికి అబార్షన్ ఎందుకు అయింది? దేవ్ ప్రేమ, పెళ్లి విషయంలో స్నేహితులు ప్రశాంత్(ప్రియదర్శి), గీతుల పాత్ర ఏంటి? అసలు తన లవ్‌స్టోరీని అపరిచితురాలైన దివ్యకు ఎందుకు చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టెయిల్ తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా సరే.. వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే తెరపై చూపించే లవ్‌స్టోరీతో ప్రేక్షకుడు కనెక్ట్ అయితే అది వర్కౌట్ అవుతుంది. పాత్రల్లో లీనమైపోవాలి. కథ ఫ్రెష్‌గా ఉండాలి. అలాంటి లవ్‌స్టోరీని ఆడియన్ ఓన్ చేసుకుంటాడు. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్ అయింది. కొత్తదనం ఏమి కనిపించదు. హీరోకి స్కూల్‌డేస్.. కాలేజీ డేస్ లవ్‌స్టోరీ ఉండడం.. వాటిని నెమరేసుకోవడం ..ఈ తరహా కథలు తెలుగు ఆడియన్స్‌కు కొత్తేమి కాదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్’ సినిమాల మాదిరి కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్ డేస్, కాలేజీ డేస్ సీన్స్ నవ్విస్తాయి. అయితే కథనం మాత్రం ఊహకందేలా నెమ్మదిగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సత్యదేవ్, తమన్నాల మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. బలమైన సన్నివేశాలు ఏవి లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా ప్రధాన బలం సత్యదేవ్ అనే చెప్పాలి. దేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై ఓ కొత్త సత్యదేవ్‌ని చూస్తాం. రకరకాల వేరియేషన్స్‌ని బాగా పండించాడు. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్‌లో సత్యదేవ్ నటన బాగుంటుంది. నిధి పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించింది. సత్యదేవ్ ప్రియురాలు, డబ్బున్న అమ్మాయి అమృత పాత్రకి కావ్యా శెట్టి న్యాయం చేసింది. హీరో స్నేహితుడు ప్రశాంత్‌గా ప్రియదర్శి తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కథకు సపోర్ట్‌గా నిలిచాడు. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కాలభైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయింది. లక్ష్మీ భూపాల మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ కారణంతోనే ‘‘గుర్తుందా శీతాకాలం’' చేశా : సత్యదేవ్
‘‘గుర్తుందా శీతాకాలం’ మంచి సినిమా. ఇందులో కాలేజీ సీన్స్ ఉన్నాయి. ఈ వయసులో చేయకపోతే తర్వాత చేయలేం కాబట్టి చేశాను. మా సినిమా రిలీజ్‌కు ఈ సీతాకాలం సరైన సమయం అని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం’’ అని సత్యదేవ్ అన్నారు. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ – ‘‘స్కూల్, కాలేజ్, ఆ తర్వాత మిడిల్ ఏజ్.. ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకులను ఒప్పించడానికి ‘గుర్తుందా శీతాకాలం’లోని పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేశాను. ఇంతకుముందు ఇదే జోనర్లో ‘ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వచ్చినా మా సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ మధ్య థియేటర్స్‌కు జనాలు రావడం లేదంటున్నారు. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఆదరిస్తారు. ‘సీతారామం, కాంతార, లవ్ టుడే’ చిత్రాలు బాగుండటంతో మౌత్ టాక్ ద్వారా సూపర్‌హిట్ అయ్యాయి. ప్రస్తుతం ‘కృష్ణమ్మ, ఫుల్ బాటిల్’తో పాటు తమిళ్–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాను’’ అన్నారు. -
'నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, టికెట్లు ఇప్పించన్నా' హీరో ఆన్సర్ అదిరింది!
గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో సత్యదేవ్. కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన లవ్ మాక్‌టైల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. రేపు (డిసెంబర్ 9న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు సత్యదేవ్. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 'బ్రో, నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. స్టోరీ కూడా కనెక్ట్ అయింది. మూడు టికెట్స్ ఇవ్వొచ్చు కదా బ్రో' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'మూడు టికెట్సా? అంటే నువ్వు రావట్లేదా?' అని కౌంటరిచ్చాడు. 'అన్నా రిప్లై ఇవ్వకపోతే సినిమా చూడను ప్లీజ్ రిప్లై.. నీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మహేశ్‌బాబు 28వ సినిమా అప్డేట్ ఇప్పించు అన్నా' అని ఓ వ్యక్తి కోరగా.. 'నా ఇన్‌ఫ్లూయెన్స్‌తో గుర్తుందా శీతాకాలం టికెట్ ఇప్పించగలను కానీ ఆ అప్డేట్ ఎలా సాధ్యమవుతుందనుకున్నావు?' అని రిప్లై ఇచ్చాడు. రెబల్ స్టార్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా మిస్టర్ పర్ఫెక్ట్ అని, అల్లు అర్జున్ను ఐకాన్‌గా పేర్కొన్నాడు సత్యదేవ్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు కరకరలాడే అప్పడాలని చెప్పాడు. రీమేక్స్ అంటే జనాలిష్టపడట్లేదు, అయినా అంత నమ్మకంగా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీకి ఇవ్వొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా ఓటీటీకి అడిగారు. కానీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా' అని బదులిచ్చాడు సత్యదేవ్. Bro naaku 3 girlfriends unnaru bro ... Story kuda connect ayindhi. . oka three tkts bro #GurtundaSeetakalam #asksatyadev — Vineeth (@Vineethvineeee) December 7, 2022 #asksatyadev remakes meedha audience intrest chupiyatledhu kadha Anna Ayna Antha confident ga theatre release Endhuku Chesthunnaru Ott ki evvochu ga — Tarak_Star (@TarakStar9) December 7, 2022 Hai @ActorSatyaDev Anna, Watched #RamSetu film two days ago, your character and performance was terrific 👌. How is your working experience with #AkshayKumar Sir in that film? #AskSatyadev — 𝐑𝐚𝐯𝐢 𝐊𝐢𝐫𝐚𝐧 #𝐓𝐇𝐄𝐆𝐇𝐎𝐒𝐓 🗡️👑 (@PRAVIKIRAN18) December 7, 2022 చదవండి: లగ్జరీ కారు కొన్న సోనూసూద్ -
స్టేజీపై భార్యను పరిచయం చేసిన సత్యదేవ్
కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'లవ్ మాక్‌టైల్' సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. సినిమాలో నీకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, మరి నీ రియల్ హీరోయిన్ను పరిచయం చేయొచ్చుగా అంటూ సత్యదేవ్‌ను కోరింది. ఆమె కేవలం మీకు స్టైలింగ్ మాత్రమే చేయలేదు. మీ ప్రధాన బలం కూడా ఆవిడేనని తెలుసంటూ ఆమెను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి సత్యదేవ్ బేబీ అంటూ తన భార్య దీపికను స్టేజీపైకి ఆహ్వానించాడు. అతడి భార్యాకొడుకు స్టేజీపైకి రాగానే వారిని సరదాగా పలకరించింది తమన్నా. తన భార్య గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ అంతా దీపికానే చేసిందంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా సత్యదేవ్, దీపికది ప్రేమ వివాహం. సత్యదేవ్ సినిమాలకు దీపిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలితో పోల్చడం హ్యాపీగా ఉంది: తమన్నా -
సత్యదేవ్ పాన్ ఇండియా చిత్రం.. వేసవికి విడుదల
సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఎస్ఎన్.రెడ్డి (పద్మజ ఫిల్మ్స్), బాల సుందరం–దినేష్ సుందరం (ఓల్డ్‌టౌన్ పిక్చర్స్) నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్నపాన్ ఇండియా చిత్రమిది. 2023 ఫిబ్రవరి మొదటివారంతో షూటింగ్ పూర్తవుతుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సుమన్ ప్రసార బాగే, కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి. -
Ram Setu Review: ‘రామ్ సేతు’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ సేతు నటీనటులు: అక్షయ్ కుమార్, నాజర్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా తదితరులు నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో దర్శకత్వం : అభిషేక్ శర్మ సంగీతం: డేనియల్ బి జార్జ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్ విడుదల తేది: అక్టోబర్ 25, 2022 అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా నేడు( అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘రామ్ సేతు’ కథేంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. రామసేతుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని భారతీయులు విశ్వసిస్తారు. రామసేతు వేనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది అందరికి ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకొని ‘రామ్ సేతు’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ శర్మ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడు. వాస్తవ గాధకు కల్పనను జోడించి కథనాన్ని నడిపించాడు. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలి. ఈ చిత్రంలో అది మిస్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్లస్ ఏంటంటే.. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చూపించారు. శ్రీలకంలో రావణాసురుడి ఆనవాళ్లు ఉన్నాయని, రామాయణం ప్రకారం రావణుడు ఉన్నాడంటే.. రాముడు కూడా ఉన్నట్లే కదా అని ఈ చిత్రం సారాంశం. శ్రీలంకలో ఉన్న త్రికూటరపర్వతం, అశోకవనం, స్వర్ణలంక ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించారు. అయితే హీరో టీమ్ చేసే పరిశోధన మాత్రం ఆసక్తికరంగా సాగదు. పేలవమైన స్క్రీన్‌ప్లే, పసలేని డైలాగ్స్, చప్పగా సాగే కీలక సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవు. ఎవరెలా చేశారంటే.. ఆర్కియాలజిస్ట్ ఆర్యన్గా అక్షయ్ చక్కగా నటించాడు. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గా తెరపై కనిపించాడు. గైడ్ ఏపీగా సత్యదేవ్ తనదైన నటనతో మెప్పించాడు. ఆయన ఎవరో అని రివీల్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. ఆర్యన్ టీమ్మెంబర్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పాత్రకు న్యాయం చేసింది. నాజర్, నుస్రత్ బరూచాతో పాటు ఇతన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. డేనియల్ బి జార్జ్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా. ఎడిటర్ రామేశ్వర్ ఎస్ భగత్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘జ్యోతిలక్ష్మి’ టైంలో పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తనదైన నటన స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్‌ఫాదర్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! ఇదిలా ఉంటే సత్యదేవ్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయన జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్వేర్ జాబ్‌ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్ చేశా. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకూ జాబ్ చేస్తూనే షూటింగ్లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అనంతరం ‘షూటింగ్ కోసం నైట్ షిఫ్ట్‌లు చేశాను. ఉదయం షూటింగ్, నైట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్ చేస్తున్నాననే విషయం డైరెక్టర్ పూరీ గారికి తెలియదు. జాబ్ టెన్షన్ షూటింగ్లో, సినిమా టెన్షన్ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్‌ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్. -
Ram Setu: రామ సేతు ట్రైలర్ వచ్చేసింది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో సాగుతుంది..’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. శ్రీ రాముడు నిర్మించిన రామ సేతు గురించి ఈ చిత్ర కథాంశం తిరుగుతోంది. ‘ఈ ప్రపంచంలో శ్రీరామునికి వేలాది మందిరాలు ఉన్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది’, ‘మన దేశంలో ఏడాది క్రితం వేసిన రోడ్లే గుంతలు పడుతున్నాయి.. మరి ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి వెతకడం ఏంటి’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. -
Godfather Review: గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ
టైటిల్: గాడ్ ఫాదర్ నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్,నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్,తదితరులు నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్.బీ చౌదరి దర్శకత్వం: మోహన్‌రాజా సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ : నీరవ్ షా ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్ విడుదల తేది: అక్టోబర్ 5, 2022 కథేంటంటే ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్ అకాల మరణంతో జన జాగృతి పార్టీ(జేజేపీ) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు జైదేవ్(సత్యదేవ్) భావిస్తాడు. సీఎం సీటు కోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, జేజేపీ పార్టీ కీలక నేత బ్రహ్మ తేజ(చిరంజీవి)మాత్రం జైదేవ్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో జైదేవ్ అతన్ని హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రలను బ్రహ్మ తేజ ఎలా తిప్పి కొట్టాడు. జైదేవ్ అసలు స్వరూపం భార్య సత్యప్రియ(నయనతార)కు ఎలా తెలిసింది? , అసలు బ్రహ్మ ఎవరు ? పీకేఆర్తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో వచ్చిన మసూన్ భాయ్(సల్మాన్ ఖాన్) ఎవరు? చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ హిట్ మూవీ లూసిఫర్‌కి రీమేక్. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. అంతేకాదు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అలాంటి సినిమాను ఎంచుకొని చిరంజీవి పెద్ద సాహసమే చేశాడు. కథపై నమ్మకంతో సినిమా చేశానని చెప్పాడు. చిరంజీవి నమ్మకం నిజమైంది. లూసిఫర్ చూసిన వాళ్లు కూడా గాడ్ ఫాదర్‌ని ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మాతృకలో కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. తనదైన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించాడు. పీకేఆర్ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రలను పరిచయం తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇద్దరు బలమైన,తెలివైన నాయకులు జైదేవ్(సత్యదేవ్), బ్రహ్మ(చిరంజీవి) ఆడే రాజకీయ చదరంగం అందరిని ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ముందు చిరు పలికే డైలాగ్స్ ఫాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సినిమా మరోస్థాయికి వెళ్తుంది. మసూద్ గ్యాంగ్ బ్రహ్మకు ఎందుకు సహాయం చేసింది?బ్రహ్మ నేపథ్యం ఏంటి.. చివరకు ఎవరిని సీఎం చేశారు?ఇలా సెకండాఫ్ సాగుతుంది. టిపికల్ నెరేషన్‌తో కొన్ని చోట్ల పొలిటికల్ డ్రామాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. హీరోయిజం ఎలివేషన్ మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. ప్రతి సీన్ చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోతాయి. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. బ్రహ్మతేజ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తన అభిమాన హీరోతో స్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో సత్యదేవ్ రెచ్చిపోయి నటించాడు. విలన్ జైదేవ్ పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి నయనతార కు చెప్పే సన్నివేశంలో సత్యదేవ్ నటన చాలా బాగుంటుంది. అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించి మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి పీకేఆర్ కూతురు, సత్యదేవ్ భార్య సత్యప్రియగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. సునీల్, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, షఫీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే.వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘గాడ్ ఫాదర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో డబ్ అయి, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాను మెగాస్టార్ మళ్లీ రీమేక్ చేయడంతో ‘గాడ్ ఫాదర్’పై అందరికి ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. దానికితోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలు మధ్య నేడు(ఆక్టోబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. ‘గాడ్ ఫాదర్’తో చిరంజీవి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడని నెటిజన్స్ అంటున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’అని ట్వీట్స్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెబుతున్నారు. మాతృకలో ఉన్న మెయిన్ పాయింట్‌ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలో భారీ మార్పులే చేశారని చెబుతున్నారు.ఇక మరికొంతమంది అయితే గాడ్ ఫాదర్ యావరేజ్ సినిమా అంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Better than Lucifer… Boss @KChiruTweets 👍🏻 & @ActorSatyaDev 👌🏻Thaman score good konni scenes ki… KCPD petti d’garu entra BGM laaga 😂 NajaBhaja Timber depot sequence 🔥 Just ahh makeup & hairstyle care tiskunte baundedi… #GodFather — 𝕽𝖆𝖛𝖎𝖎 (@Ravii2512) October 5, 2022 #Godfather A Good Political Action-Thriller that is a faithful remake which sticks true to the core but has changes that keep the proceedings engaging. Megastar and Thaman show all the way. Fine job of making changes without spoiling the core. Good One👍 Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) October 4, 2022 Sare inka fact to be agreed so mana boss @KChiruTweets kuda hit kottesadu malli #GodFather tho 🔥🔥🔥🔥 . Congrats to the entire team and especially for mega fans 🤟🤟 !! #GodFatherOnOct5th #GodFatherReview pic.twitter.com/7ErWNcmrHP — Akash Raju 🔥🔥 (@Raju_SSMB) October 5, 2022 Lucifer movie telugu lo release ayipoyi andharu chusaru and chala mandiki anthaga ekkaledu kuda… ilanti movie ni remake chesi…andhari uuhalani thaar maar chesi, mee range lo hit talk vastundi ante @KChiruTweets 🔥🙏🏽 Boss is always beyond fans expectations #GodFather — Anudeep (@AnudeepJSPK) October 5, 2022 First half Good and Second Half Average 👍👍 @MusicThaman anna gattiga duty chesadu 🔥 Production values 👌👌 SatyaDev performance 💥💥 Boss lo aa timing miss avuthundi and dlgs kuda yedho cheppali annattu cheppadu 👍 Finally Average film 🙂 2.5/5 👍#GodFatherReview https://t.co/21gK3i9D7x — Gopi Nath NBK (@Balayya_Garu) October 4, 2022 Hearing blockbuster response all over 💥🔥😎 #Godfather ఆయన స్థాయి వేరు... ఆయన స్థానం వేరు..🦁 అక్కడ ఉన్నది Boss ra Bacchas After a Gap BOSS IS BACK! 👑@KChiruTweets #BlockBusterGodFather pic.twitter.com/HzESnXuY5F — Muzakir Ali (@Muzakirali_07) October 5, 2022 ఒక ఇంద్ర,tagore, స్టాలిన్,ఎలానో #godfather కూడ ఆ లిస్ట్ లో చేరిపోయింది.hatters kooda అంటారు మూవీ చూసిన తర్వాత #Lucifer కంటే #godfather బాగుంది అని, elevation scence Ki @MusicThaman ichina bgm🔥🔥🔥,ippudu ravalamma tollywood #mohanalal fans, — yuga cherry (@yuga_cherry) October 5, 2022 #Godfather Review: 3.75/5 Perfect and Pure Mass & Family Entatainer Chiranjeevi Swag is Next Level Sallu Bhai did his Roll Perfectly 👍👍#GodFatherReview pic.twitter.com/mN5cV1BD6a — Rusthum (@JanasenaniPK) October 4, 2022 #Godfather first half works 👍 Decent execution. ✅ 1st half review:#Chiranjeevi’s swag and elevation 👍 Satya Dev is brilliant Lot of Goosebump moments for fans !! BGM is spot on 👍 Very Engaging and high on drama Waiting for 2nd half #Salman’s magic#GodfatherReview — Santosh R. Goteti (@GotetiSantosh) October 5, 2022 -
పుష్ప నటుడితో సత్యదేవ్ మల్టీస్టారర్!
వైవిధ్యమైన కథలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కొత్త సినిమాను ప్రకటించారు.‘పెంగ్విన్’ సినిమా ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. బాలసుందరం, దినేష్ సుందరం నిర్మించనున్న ఈ చిత్రం సత్యదేవ్ కెరీర్లో 26వ మూవీ. ‘‘మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. మరో హీరో పేరు త్వరలో వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అయితే ఈ చిత్రంలో సత్యదేవ్‌తో పాటు పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ధనంజయ నటించనున్నట్లు తెలుస్తుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాకు కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్ రాజ్. కాగా సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. -
చిరంజీవి 'గాడ్‌ఫాదర్'లో సత్యదేవ్ క్యారెక్టర్ ఇదే
‘గాడ్ ఫాదర్’ కోసం జై దేవ్ అవతారం ఎత్తారు సత్యదేవ్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినివను నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో జై దేవ్ పాత్ర చేశారు సత్యదేవ్. చిరంజీవి తమ్ముడిగా ఆయన క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు. Presenting versatile actor @ActorSatyaDev as the wily 'Jaidev' from #GodFather ❤️🔥 - https://t.co/rSZusB3TTy#GodFatherOnOct5th 💥 Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @LakshmiBhupal @AlwaysRamCharan @ProducerNVP pic.twitter.com/TupFBOIxs2 — Konidela Pro Company (@KonidelaPro) September 12, 2022 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీరోగా అజయ్‌గాడు, ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఇటీవలే 'విశ్వక్' సినిమాలో అలరించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజయ్ కతుర్వార్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను యంగ్ హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంటుండగా అజయ్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఫైర్ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అజయ్ దర్శకత్వం వహిస్తుండగా చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు. View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) చదవండి: చెర్రీ-ఉపాసనల మేకప్ ఆర్టిస్ట్‌తో నటుడి పెళ్లి -
నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్ దర్శకత్వంలో అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్‌కి యాక్టర్ సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్ అయ్యానో, థియేటర్స్‌లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్ సంగీతం, మనోహర్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్. -
సత్యదేవ్, తమన్నా.. ‘గుర్తుందా.. శీతాకాలం’.. కొత్త తేదీ ఖరారు
సత్యదేవ్, తమన్నా జంటగా మేఘా ఆకాష్, కావ్యా శెట్టి, ప్రియదర్శి ముఖ్య తారలుగా నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్తుందా...శీతాకాలం’. ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సింది. అయితే తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లోని టీనేజ్, కాలేజ్ లైఫ్ సంఘటనలను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ విషయాలనే ఈ సినిమాలో చూపించాం. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్‌టైల్’కు తెలుగు రీమేక్‌గా ‘గుర్తుందా.. శీతాకాలం’ రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమవుతుందో మనలో..’సాంగ్ విన్నారా?
సత్యదేవ్, అతిరా రాజీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి, కృష్ణమ్మ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఏమవుతుందో మనలో..’ అనే మెలోడి సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. ‘‘ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘ఏమవుతుందో మనలో..’ పాట ఉంటుంది. సన్ని కూరపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే!
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. నటన ప్రాధాన్యమున్ను పాత్రలను ఎంచుకుంటూ సహా నటుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన గాడ్సే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదలై ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్రం పరాజయం పొందింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్స్రీన్పై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. త్వరలోనే గాడ్సే ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17న నుంచి గాడ్సే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ కుట్టి ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నాగబాబు కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ విశ్వనాథ రామచంద్ర పాత్రలో కనిపించాడు. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాల కథాంశంగా గాడ్సే మూవీ తెరకెక్కింది. ఇదిలా ఉంటే సత్యదేవ్ నటించిన మరో చిత్రం గుర్తుందా శీతాకాలం కూడా థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సత్యదేవ్ చిరంజీవి గాడ్ ఫాదర్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన అక్షయ్ కుమార్ రామ్‌సేతు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించానున్నాడు. -
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సత్యదేవ్ కొత్త చిత్రం..
Satya Dev Krishnamma First Look Release On His Birthday: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. కాగా సోమవారం (జూలై 4) సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సత్యదేవ్‌తోపాటు లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె నటించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. చదవండి: హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ #Krishnamma is my next with director VV Gopalakrishna under the production of @ArunachalaCOffl. Super happy and blessed that blockbuster director #KoratalaSiva Garu is presenting it. pic.twitter.com/QbOLnzbHFU — Satya Dev (@ActorSatyaDev) July 3, 2022 -
ఇండియన్ సినిమాలను హాలీవుడ్ కాపీ కొడుతోంది : ప్రకాశ్ నాగ్
మన ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది. మన చిత్రాలను ఇప్పుడు హలీవుడ్ వారు సైతం కాపీ కొడుతున్నారు. మన సినిమాలో ఫైట్స్ , ఇంటెన్సిటీ, లుక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి’అని అన్నారు నటుడు ప్రకాశ్ నాగ్. గోపి గణేశ్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేశ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు ప్రకాశ్ నాగ్. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. విలన్‌గా ప్రకాశ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది అక్కడ కొంతకాలం మల్టీ నేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. అయితే నా లైఫ్ స్టైల్ చాలా ట్రెండీగా ఉండేది. ఇక్కడ మ్యూచివల్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు గోపి పరిచయమయ్యారు. ► గోపికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి మేము సోషల్ మెసేజ్ ఉన్న ఒక సినిమా తీస్తున్నాము ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ఉంది,మిమ్మల్ని చూడగానే మా సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు.నేను తెలుగు వాడిని అయినందున నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం.అందుకే నాకు మొదటి చిత్రానికే ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక, నిర్మాతలు దొరకడం నా అదృష్టం. అందుకే వారికి నా ధన్యవాదములు ► ఈ సినిమాలో సమాజంలో జరిగే చాలా విషయాలను చర్చించాం. ముఖ్యంగా మన వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం.. ఎలా పని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విషయాలను చూపించాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. నేను గాడ్సే వంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది . ► ప్రస్తుతం నేఏను కొన్ని కంపెనీ ల కు అడ్వైసరి రోల్ లో ఉన్నాను. ఆ కంపెనీ ల బిజినెస్ గ్రోత్ కోసం వారు నా సలహాలు తీసుకుంటారు.అటు బిజినెస్ ఇటు యాక్టింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా జర్నీని ఇక కొనసాగిస్తాను . ► నాకు తెలుగులో గాని బాలీవుడ్ లో గాని హాలీవుడ్ లో ఎక్కడైనా మంచి క్యారెక్టర్ దొరికితే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను .ఇప్పుడిప్పుడే కొన్ని కథలు వింటున్నాను అవి ఏంటనేది త్వరలో తెలియజేస్తాను. -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నా నిజ జీవితానికి ‘గాడ్సే’ కథ దగ్గర, అందుకే: సత్యదేవ్
‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ‘గాడ్సే’లో నిర్భయంగా చూపిస్తున్నాం. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఎపిసోడ్ భావోద్వేగంగా ఉంటుంది. సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు మా మూవీలో చర్చించిన సమస్యల గురించి ఆలోచిస్తారు’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘గాడ్సే’. చదవండి: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ సి.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కళాశాలలో చదివేటప్పటి నుంచే నాకు సామాజిక బాధ్యత ఎక్కువ. అందరూ నిబంధనలు పాటించాలనుకునేవాన్ని. నా నిజ జీవితానికి ‘గాడ్సే’ కథ దగ్గరగా ఉండటంతో వెంటనే కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రంలో నేను విశ్వనాథ రామచంద్ర అనే పాత్రలో కనిపిస్తా. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, యువత ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే సమాజం పురోగమిస్తుందనే సందేశాన్ని ఇస్తున్నాం. చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఫైట్ రీ క్రియేట్.. నెట్టింట వైరల్ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఈ చిత్ర కథ ప్రేక్షకులను వెంటాడుతుంది. ఎవరైనా స్టార్డమ్ కోసమే సినిమా ఇండస్ట్రీకి వస్తారు.. అయితే అది రావడానికి కష్ట పడటంతో పాటు ఓపిక అవసరం. వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఐశ్వర్య లక్ష్మీ బాగా చేశారు. పట్టాభిగారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సి.కల్యాణ్‌గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ‘గాడ్సే’ మూవీతో నా కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్
‘‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు గోపీ గణేష్ విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. ⇔ ‘గాడ్సే’ సినిమా ఫ్లాష్‌బ్యాక్ సీన్లో ఓ డ్రామా ఉంటుంది. అదేంటంటే.. గాంధీ పాత్రధారిని గాడ్సే కాల్చాలి. కానీ గాడ్సే పాత్రధారి అయిన చిన్నపిల్లవాడు బొమ్మ తుపాకీతో కూడా గాంధీ పాత్రధారిని కాల్చి చంపడానికి అంగీకరించకుండా తుపాకీని కిందకు దించుతాడు. అలాంటి పిల్లవాడు పెద్దవాడు అయ్యాక రియల్ గన్స్‌తో ఎందుకు సహవాసం చేయాల్సి వస్తుంది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల అతని వ్యక్తిత్వం, ఆలోచనా తీరు మారింది? అన్నదే కథాంశం. ⇔ ఈ కథను చెప్పేందుకు ఓ బ్యాచ్ రీ యూనియన్ అవుతున్నట్లుగా బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాను. ఓ సర్వే ప్రకారం చదువుకున్న అర్హతకు తగ్గ ఉద్యోగం చేస్తున్నవారు కేవలం 6.37 శాతం మంది మాత్రమే అని, మిగిలినవారు చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని కాస్త సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. ఎవర్నీ టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు. ఆలోచించాల్సిన అంశంగా తీసిన చిత్రం మాత్రమే. ⇔నిజానికి ‘గాడ్సే’ కథను పవన్ కల్యాణ్‌గారికి అనుకున్నాను. కానీ ఆయనతో చేయలేకపోయాను. ఈ కథను సత్యదేవ్గారికి చెప్పినప్పుడు సీరియస్ సబ్జెక్ట్ అన్నారు. కానీ ఓకే చేశారు. ఓ కామన్‌మేన్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ప్రతి కామన్ మేన్ కనెక్ట్ అవుతాడనే నమ్మకం ఉంది. -
నెగటివ్ రోల్స్ చేయను: గాడ్సే హీరోయిన్
‘‘ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నేను నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్ రోల్స్ మాత్రం చేయాలనుకోవడం లేదు. ఇంటెన్స్ అండ్ యాక్షన్ రోల్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యాలక్ష్మీ. సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యాలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘గాడ్సే’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కి రావడం సంతోషంగా ఉంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. ప్రభుత్వంతో పౌరులకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి? వ్యవస్థలోని లోపాలపై ఓ యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అనే అంశాల నేపథ్యంలో ‘గాడ్సే’ కథ సాగుతుంది. ఇందులో వైశాలి అనే సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. బ్యూటీ అండ్ బ్రెయిన్.. ఈ రెండూ ఉపయోగించే పాత్ర నాది. సత్యదేవ్ ఇంటెన్స్ అండ్ అమేజింగ్ యాక్టర్. తన నటనలో నిజాయితీ కనిపిస్తుంది. సి.కల్యాణ్‌గారు మంచి అభిరుచి గల నిర్మాత. గోపీ గణేష్‌గారు నన్ను నమ్మడంతో సెట్స్‌లో టెన్షన్లో లేకుండా నటించాను. మణిరత్నంగారి దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్ర చేశాను. మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సాయిపల్లవి చేస్తున్న ‘గార్గి’కి ఓ నిర్మాతగా ఉన్నాను’’ అన్నారు. -
తమన్నా-సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
టాలెంటెడ్ హీరో సత్యదేశ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డైరెక్టర్ నాగశేఖర్ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా, పెద్ద సినిమాల విడుదలతో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసి ప్రకటించారు. గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నామంటూ తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. చదవండి: సోషల్ మీడియాలో అశ్లీల కామెంట్స్, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ అయితే ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిలైయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్ లైఫ్ చాలామందికి ఓ మధుర జ్ఞాపకంలా ఉంటుంది. జీవితంలో సెటిలయ్యాక తమ కాలేజ్ డేస్, యూత్‌ఫుల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆనందపడతారు. అలాంటి సంఘటనల సమాహారంతో ‘గుర్తుందా శీతాకాలం’ రూపొందింది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు Embrace the Magical Love Journey 💞#GurtundaSeetakalam is releasing worldwide on July 15th 🥰#GurtundaSeetakalamOnJuly15@ActorSatyaDev @tamannaahspeaks @nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @nagshekarmov @anandaudioTolly pic.twitter.com/VyuFQYyFXe — Sri Vedaakshara Movies (@SriVedaakshara) June 9, 2022 -
‘అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’
‘‘టి. కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది. గోపీ గణేష్ తీసిన ‘గాడ్సే’ సినిమా ఆ లోటును తీర్చేసింది’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సత్యదేవ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని గోపీ గణేష్ చక్కగా తెరకెక్కించాడు. అవినీతి రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులపై సత్యదేవ్ గాడ్సేలా పోరాటం చేస్తాడు’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పటి వరకూ 83 సినిమాలు నిర్మించాను. చదవండి: అర్హత ఉన్నోడే అసెంబ్లీ..పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి అయితే ‘గాడ్సే’ సినిమా నిర్మించినందుకు హ్యాపీగా, గర్వంగా ఉంది. మరో సినిమాకి గోపీ గణేష్‌కి చెక్ కూడా ఇచ్చాను. ఎన్టీఆర్, శివాజీ గణేశన్గార్లలా క్యారెక్టర్లో షేడ్స్‌ను చూపించగల నటుడు సత్యదేవ్’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ముందు కె.ఎస్. రామారావుగారే ఆరంభించారు. ఆ తర్వాత కల్యాణ్‌గారు టేకప్ చేసి పూర్తి చేశారు. ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం తర్వాత మళ్లీ కల్యాణ్‌గారితో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారు చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’’ అన్నారు. -
పవర్ డైలాగ్స్‌తో సత్యదేవ్ ‘గాడ్సే’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం గాడ్సే. ఈ చిత్రానికి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మొదటి సారి తెలుగు లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.‘సత్యమేవ జయతే అంటారు.. 'ధర్మో రక్షితి రక్షత: అంటారు.. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ధైర్యవంతుడి పాత్రలో సత్యదేవ్ నటించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతంది.‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?' 'ప్రశ్నిస్తే... మారణకాండ చేసేస్తారా?, ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నో సర్పంచ్ కావాలి’, ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. జూన్17న ఈ చిత్రం విడుదల కానుంది. -
సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన నటించిన 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు సిద్దం అవుతుండగా, మరో సినిమా గాడ్సే కూడా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే టీజర్‌తో పాజిటివ్ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను తొలుత మే20న రిలీజ్ చేయాలని భావించినా అది కుదరలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ కీలక పాత్రలు పోషించారు. Only the date has changed. Not the cause. Godse from June 17, 2022. #GodseOnJune17 @MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/cuS9SM61XX — Satya Dev (@ActorSatyaDev) May 18, 2022 -
జోరు మీదున్న హీరోలు, రీమేక్ అంటే మరింత హుషారు
ఒక భాషలో హిట్టయిన సినిమా వేరే భాషలవాళ్లకు నచ్చుతుందా? ఆ సినిమా కథ కనెక్ట్ అయితే నచ్చుతుంది.. అలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలతో కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో అలాంటి కథలపై కొందరు స్టార్స్ ఓ చూపు చూశారు. ఆ కథలను రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి మంచి జోరు మీద ఉన్నారు. నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చేసి, డైరీని ఫుల్ చేసేశారు. ఈ నాలుగైదు చిత్రాల్లో ఇప్పటికే రెండు రీమేక్స్ సెట్స్ మీద ఉండటం విశేషం. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, దర్శకుడు పూరి జగన్నాథ్, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘బోళా శంకర్’. ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’కు రీమేక్ అని తెలిసింది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. అలాగే మలయాళంలో మరో హిట్‌గా నిలిచిన ‘బ్రో డాడీ’ చిత్రంలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు చేశారు వెంకటేశ్. ఈ మధ్య రెండు రీమేక్స్‌లో నటించారాయన. ధనుష్ తమిళ హిట్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’, మోహన్‌లాల్ మలయాళం హిట్ ‘దృశ్యం 2’ రీమేక్ ‘దృశ్యం 2’లో నటించారు వెంకటేశ్. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఇదే టైమ్‌లో వెంకీ డిజిటల్ ఎంట్రీ కూడా ఖరారైంది. ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో వెంకీతో పాటు రానా మరో ప్రధాన పాత్రధారి. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకులు. అమెరికన్ పాపులర్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’కు ఈ ‘రానా నాయుడు’ అడాప్షన్ అన్న మాట. అంటే ఆల్మోస్ట్ రీమేక్ అనుకోవాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఓ హీరోగా ఉన్న రానా దీనికంటే ముందు ‘భీమ్లానాయక్’ చిత్రంలో నటించారు. ఇది మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు తెలుగు రీమేక్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ హీరోగా నటించారు. అయితే పవన్ కల్యాణ్ మరో రీమేక్‌లో నటించనున్నారని సమాచారం. తమిళ హిట్ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అలాగే తమిళ హిట్ విజయ్ ‘తేరి’ తెలుగు రీమేక్‌లోనూ పవన్ కనిపిస్తారని, ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘కర్ణన్’ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ఓ కీ రోల్ చేస్తున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రాల్లో ‘గుర్తుందా.. శీతాకాలం’ ఒకటి. ఇది కన్నడ సినిమా ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక తమిళ హిట్ ‘ఓ మై కడవులే..’ రీమేక్ ‘ఓరి దేవుడా..’లో విశ్వక్ సేన్, మలయాళ ఫిల్మ్ ‘కప్పెలా’ రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో సిద్ధు జొన్నలగడ్డ (‘డీజే టిల్లు’ ఫేమ్), మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్ ‘బటర్ ఫ్లై’లో అనుపమా పరమేశ్వరన్, మలయాళ ‘నాయట్టు’ రీమేక్‌లో అంజలి, ‘మిడ్నైట్ రన్నర్స్’ రీమేక్‌లో నివేదా, రెజీనా.. ఇలా... మరికొందరు నటీనటులు రీమేక్స్ వైపు ఓ చూపు చూశారు. హిందీ ‘బదాయీ దో’, ‘దేదే ప్యార్ దే’, తమిళ ‘విక్రమ్ వేదా’, మలయాళ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, సౌత్ కొరియన్ ‘లక్కీ కీ’ వంటి చిత్రాలూ తెలుగులో రీమేక్ కానున్నాయి. చదవండి: విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్.. క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్ -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టీనేజ్ లైఫ్ చాలామందికి ఓ మధుర జ్ఞాపకంలా ఉంటుంది. జీవితంలో సెటిలయ్యాక తమ కాలేజ్ డేస్, యూత్‌ఫుల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆనందపడతారు. అలాంటి సంఘటనల సమాహారంతో సత్యదేవ్, తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: సంపత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి, రాఘవ సూర్య. -
‘స్కైలాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : స్కైలాబ్ నటీనటులు : సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ: బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ నిర్మాతలు : పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్ దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల విడుదల తేది : డిసెంబర్ 4, 2021 విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’.నిత్యామీనన్ హీరోయిన్. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘స్కైలాబ్’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్యదేశ్) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందనే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ. ఎవరెలా చేశారంటే... జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సత్యదేశ్, రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ? 1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్స్, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే నిర్మాతగా మారాను: నిత్యా మీనన్
‘‘నిర్మాతగా ‘స్కైలాబ్’ నా తొలి చిత్రం. డబ్బులు సంపాదించడానికి నిర్మాతను కాలేదు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ‘స్కైలాబ్’ సినిమా ఆరంభం నుంచే నేను నిర్మాత కాదు. ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను’’ అని నిత్యా మీనన్ అన్నారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రకథానాయిక, నిర్మాత నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘స్కైలాబ్ గురించి దర్శకుడు విశ్వక్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. స్కైలాబ్ గురించి మా తల్లిదండ్రులతో చర్చించగా, అప్పట్లో స్కైలాబ్ గురించిన భిన్నమైన కథనాలను చెప్పారు. స్కైలాబ్ భూమి మీద పడిపోతే చనిపోతామనే భ్రమలో చాలామంది తాము కూడబెట్టుకున్న ఆస్తులను ఖర్చు చేసేశారట. మరికొందరైతే బంగారు నాణేలు మింగేశారని చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అంశాలు నేనీ సినిమా చేసేందుకు దోహదం చేశాయి. బండిలింగంపల్లిలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం. ఇందులో నేను జర్నలిస్టు గౌరి పాత్రలో కనిపిస్తాను. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలతో నాకు పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే గౌరి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తెలంగాణ యాసలో మాట్లాడాను. అది చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇది థియేట్రికల్ సినిమా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నందు వల్లే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాను. లాక్డౌన్లో కాస్త బ్రేక్ దొరికింది. ప్రస్తుతం తమిళంలో ధనుశ్‌తో, మలయాళంలో 19(1)ఎ చిత్రాలతో పాటు హిందీలో ‘బ్రీత్ 3’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నిర్మాతగా వినూత్న సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్
సత్యదేవ్ ఈ పేరుకి తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే గాక ఇటీవలే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. ప్రస్తుతం సత్యదేవ్ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న హబీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హబీబ్ చిత్రం చిత్రీకరణ సమయంలో.. తీవ్ర ఆటంకాలు, ప్రమాదాల నడుమ భయపడుతూ రూపొందించినట్లు తెలిపాడు. ఎందుకంటే గత కొంత కాలంగా ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు తిరిగి దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం సాగిస్తున్న క్రమంలో చిత్ర బృందం ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రాణాలకు రిస్కీ అని తెలిసినా సత్యదేవ్ కథ కోసం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదిలా వుండగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్ పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డారట. స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చిందట. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్‌ని ఈ నటుడు విడవకపోవడం విశేషం. ఇటీవల సత్యదేవ్ తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
తిమ్మరుసులో ‘తియ్యగుందీ’ డైలాగ్.. నారా లోకేశ్‌పై మరోసారి సెటైర్లు
సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం తిమ్మరసు. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయిన ఈ చిత్రం థియేరట్స్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన సత్యదేవ్ ఈ చిత్రంలో లాయర్ అవతారం ఎత్తాడు. ఇంటెలిజెంట్ లాయర్‌గా నటించిన సత్యదేవ్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రీఓపెన్ చేస్తాడు. హత్యకేసు వెనకాల ఉన్న చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా?లేదా అన్న అంశాలపై ఈ చిత్రం తెరకెక్కించింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ అదిరిపోయింది. ముఖ్యంగా ఓ సందర్భంలో హీరో సత్యదేవ్‌తో కలిసి బొండం తాగుతూ బ్రహ్మాజీ చెప్పిన ‘తియ్యగుందీ’ అనే డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి ప్రచారంలో నారా లోకేశ్.. ఓ మజ్జిగ తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఎంతగా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం లేకుండా ప్రతీసారి తన అఙ్ఞానాన్ని బయటపెట్టే లోకేశ్ మజ్జిగ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డైలాగ్‌ను తిమ్మరసు సినిమాలో రిపీట్ చేయడంతో థియేటర్లో లోకేశ్‌ను గుర్తు చేసుకున్నారు ప్రేక్షకులు. మరోసారి లోకేశ్‌పై జోకులు పేలుస్తూ నెట్టింట ట్రోల్స్, మీమ్స్‌లు క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. -
ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ‘దారే లేదా’ అంటున్న నాని
హైదరాబాద్: టాలీవుడ్లో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజాగా ఈ బ్లఫ్‌మాస్టర్ నటిస్తున్న చిత్రంలో‘దారే లేదా’ అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు అండగా ఉంటూ, వారికి సేవలు అందించిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నట్లు నేచురల్ స్టార్ నాని తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. నాని స్వీయ నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. విజయ్ బులగానిన్ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు. ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్ విడుదల చేశారు. Our little tribute to our Heroes, incidentally on the day lakhs of doctors are protesting against the violence on them 💔 Share it with every frontline warrior you know. I’m sure it will put a smile on them 🙏🏼#DhaareLedha https://t.co/aQ7dzQvXQ6 pic.twitter.com/raGLISS82G — Nani (@NameisNani) June 18, 2021 చదవండి: రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్ -
గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా?
‘‘కరోనా తర్వాత మా ‘గాడ్సే’ సినిమా ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘తల్లితండ్రులు, యువకులు ఆలోచించే విధంగా చదువు నేపథ్యంలో ‘గాడ్సే’ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా? అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, జూన్ లేదా జూలై నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సత్యతో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘గాడ్సే’ చేస్తున్నాను. ప్రతి దేశంలో ఉన్న, జరుగుతున్న పాయింట్‌ని టచ్ చేసి బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాం’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ‘‘నా జీవితంలో ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’ చాలా ముఖ్యమైన సినిమాలు. ‘బ్లఫ్ మాస్టర్ 2’ ఎప్పుడు చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ చిత్రానికి రెండింతలు గొప్పగా ఉండే సినిమా ‘గాడ్సే’’ అన్నారు సత్యదేవ్. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేయస్ రామారావు, నటులు ప్రకాశ్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
లవ్ మాక్‌టైల్
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇందులో సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. భావనా రవి, నాగశేఖర్ నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ రీమేక్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్‌లో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం’’ అన్నారు. -
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ టీజర్ రిలీజ్
అందరూ ఎవరి మాట విన్నా, వినకపోయినా ఒకరు చెప్పినట్లు మాత్రం చచ్చినట్లు వినాల్సిందే. అది ఎవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది.. ఫొటోగ్రాఫర్.. అవును, అతను ఏది చెప్పినా కిక్కురుమనకుండా చేయాల్సిందే. పైగా పెళ్లైనా, పేరంటమైనా ఆయన లేనిదే ముందుకు సాగని పరిస్థితి. అలాంటి ఫొటోగ్రాఫర్ అవతారమెత్తాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఇది ‘మహేశింటె ప్రతీకారమ్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్. టీజర్‌ను చూస్తే.. ఈ ఫొటోగ్రాఫర్ ఓ అమ్మాయి ఫొటో క్లిక్‌మనిపించే సమయంలో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇంకేముందీ.. అద్దం ముందు నిల్చుని రెడీ అవ్వడం, తనలో తానే ముసిముసిగా నవ్వుకోవడం, గంటల తరబడి ఫోన్ మాట్లాడటం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. అయితే, టైటిల్ అంత భీకరంగా ఉన్నప్పటికీ టీజర్ మాత్రం సాఫీగా సాగుతుంది. కానీ ఎంతో సౌమ్యంగా కనిపిస్తున్న హీరో చివర్లో ఉగ్రావతారం ఎత్తాడు. అది దేనికోసమో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను బాహుబలి వంటి భారీ బడ్జెట్‌ను తెరకెక్కించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, నిర్మాత ప్రవీణా పరుచూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. (చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను) -
‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’
సాక్షి, హైదరాబాద్: ఈ పేరేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇది కొత్త తెలుగు సినిమా టైటిల్. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2016లో విడుదలై ఘన విజయం సాధించిన మలయాళం సినిమా ‘మహేశింతే ప్రతీకారం’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను 2020, ఏప్రిల్ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. సత్యదేవ్‌తో పాటు సీనియర్ నటుడు నరేశ్ ఇందులో కనిపించారు. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’ అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. విలక్షణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఆలోచింపజేసే కలియుగ
రాజ్, స్వాతీ దీక్షిత్ జంటగా తిరుపతి దర్శకత్వంలో నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన చిత్రం ‘కలియుగ’. ఈ నెల 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడు తిరుపతి సినిమాను బాగా తెరకెక్కించారు. భవిష్యత్‌లో సూర్య ఇలాంటి సినిమాలను ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్. ‘‘రెగ్యులర్ కథలను పక్కనపెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాను. చిత్రీకరణ సమయంలో సూర్య సపోర్ట్ మరువలేనిది. మా చిత్రం పాటను విడుదల చేసిన పవన్‌కల్యాణ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు తిరుపతి. ‘‘లవ్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సునీల్ కశ్యప్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు సూర్య. ‘‘సూర్య మంచి సినిమా తీశాడు’’ అన్నారు తాగుబోతు రామేష్. -
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ
మూవీ: రాగల 24 గంటల్లో జానర్: సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: ఈషా రెబ్బ, సత్య దేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, టెంపర్ వంశీ, ముస్కాన్ సేథీ, రవివర్మ, కృష్ణభగవాన్, అదిరే అభి తదితరులు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి సంగీతం: రఘు కుంచె మాటలు: కృష్ణభగవాన్ నిర్మాత: శ్రీనివాస్ కానూరు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సారి క్రైమ్ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాగల 24 గంటల్లో’చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్, ఎంటర్టైన్ తోడైతే క్రైమ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్ బేస్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. కథ: ఇండియాలోనే నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్) చేధించాడా? విద్య, గణేశ్, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు దాస్(రవివర్మ), పుణీత్, వినీత్, అద్వైత్, మేఘన(ముస్కాన్ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ. నటీనటులు: ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్ ఆరంభంలోనే నెగటీవ్ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు సత్యదేవ్. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్ అవుతుంది. తొలిసారి నెగటీవ్ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో కనిపించిన ‘ఒకరికి ఒకరు’హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నెగటీవ్ షేడ్‌లో కనిపించాడు. తొలుత సిన్సియర్ ఏసీపీగా కనిపించినా చివరకు అసలు రంగు బయటపడుతుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ కనిపించేది రెండు మూడు సీన్లలోనైనా మెప్పించాడు. ఇక సెకండాఫ్‌లో కాసేపు కనిపించి కథకు ప్రధానమైన ముస్కాన్ సేథీ అలరించింది. అంతేకాకుండా తన అందచందాలతో యూత్ కలల రాణిగా మారేలా చేసుకుంది. రవివర్మ, టెంపర్ వంశీ, అదిరే అభి, తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు. విశ్లేషణ: ‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్, సస్పెన్స్‌కు తోడు ఫుల్ గ్లామర్ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. ఊహకందని ట్విస్టులతో డైరెక్టర్ తన మ్యాజిక్ చూపించాడు. తొలి అర్థభాగంలో ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో తన పూర్తి అనుభవాన్ని రంగరించిన దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా కథను మలుపుతిప్పుతాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు లాజిక్ మిస్ అయితే ప్రేక్షకుడికి రుచించదు. కానీ ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా ముద్ర పడిపోయినా.. మధ్యలో ఢమరుకం, శివమ్ వంటి డిఫరెంట్ మూవీలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాడు. ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది ఇషా రెబ్బ. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్ గరుడవేగ అంజి సినిమాను రిచ్ లుక్‌లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్ రెండింటిలోనూ తన మార్క్ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మదిని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్: ఈషా రెబ్బ నటన సత్య దేవ్ విలనిజం సస్పెన్స్ దర్శకత్వం కెమెరా పనితనం మైనస్ పాయింట్స్ ఊహకందే పలు ట్విస్టులు సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిర్మాతే నా హీరో
‘‘నేను గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ టచ్ ఉన్నవి. ‘రాగల 24 గంటల్లో..’ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో సినిమా చేశా. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌లో ప్రేక్షకుడు ఉంటాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► నేను, కృష్ణభగవాన్ రెండు స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. ► హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ► ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్’ రీమేక్ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. అది సెట్స్ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్గా. అదీ వర్కౌట్ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. ► శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టర్ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్ హెచ్డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. ► నేను ఫామ్‌లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ కానూరి ప్రొడక్షన్లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను. -
సీమ సిరీస్..
శ్రీనగర్‌కాలనీ: సినిమా, టీవీ రంగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో నేడు డిజిటల్ రంగానికి అంతే డిమాండ్ పెరిగింది. రాబోయే కాలంలో డిజిటల్ రంగం మరింత కొత్త పుంతలు తొక్కుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిజిటల్లో వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. అలా ఇటీవల విడుదలై నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి). ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి చిత్రాల దర్శకుడు, రచయిత అనీష్ కురివిళ్ళ దర్శకత్వంలో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ సంయుక్తంగా గాడ్ వెబ్ సిరిస్‌ను నిర్మించాయి. రాయలసీమ రాజకీయ నేపథ్యంలో బోల్డ్, రా కంటెంట్‌తో సాగే ఈ వెబ్‌సిరీస్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. వెబ్‌సిరీస్‌ల గురించి, గాడ్ సిరీస్ గురించి దర్శకుడు అనీష్ కురివిళ్ళ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లో... వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్.. నేడు వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్‌తో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కో అంటే కోటి చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించాను. దర్శకత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాటెక్కలేదు. ఈ సంవత్సరం ప్రథమంలో ఓ స్టోరీ ఐడియాతో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ నన్ను సంప్రదించారు. సోరీకి నా స్టైల్‌కు తగ్గట్టు కొత్తరీతిలో ప్రేక్షకులకు అందించాలంటే నాకు కొంత సమయం కావాలని చెప్పాను. అలా ఈ స్టోరీ ఐడియాను మా టీం కో స్క్రిప్ట్ రైటర్ హంజా అలీ, డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్, స్క్రిప్ట్ అసిస్టెంట్ నీలగిరితో కలిసి రెండు నెలలు కష్టపడి కొత్తతరహా స్క్రిప్ట్‌ను 10 ఎపిసోడ్స్‌గా మూడు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలా 6 గంటల వెబ్‌సిరీస్‌ను ప్రారంభించాం. డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్ కడపకు చెందిన వ్యక్తి. తను కడప, రాయలసీమ స్లాంగ్‌ను, డైలాగ్స్ రూపంలో చాలా బాగా రాశాడు. వెబ్‌సిరీస్‌ను చూస్తే ఎక్కడా నెటిజన్లకు బోర్ కొట్టకుండా సినిమాలా తీయాలని గట్టిగా అనుకున్నాం. అలా గాడ్ పట్టాలెక్కింది. గ్యాంగ్‌స్టర్– సీమ రాజకీయాలు... వెబ్‌సిరీస్‌ను కూల్‌గా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించేలా స్క్రిప్ట్‌ను తయారుచేశాం. 1970 ప్రాంతంలో ఓ కుటుంబం బతుకుదెరువు కోసం ఓ కొత్త ప్రదేశానికి వెళుతుంది. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన కుటుంబంలోని పెద్ద ఎలా గ్యాంగ్‌స్టర్‌గా రాజకీయ నాయకుడిగా ఎదిగాడో చెబుతుంది. ప్రతి ఎపిసోడ్‌కు సినిమా తరహాలో బిగినింగ్, మిడిల్, ఎండింగ్ ఉండేలా ప్లాన్‌చేశాం. బోల్డ్ డైలాగ్స్, రా కంటెంట్‌తో రాజకీయ పార్టీలు , సీమ రాజకీయాలు, కుటుంబంలోని పాత్రలతో వెబ్‌సిరీస్ ఉంటుంది. అప్పుడు కోపంలో, సంతోషంలో, విషాదంలో ఎలా మాట్లాడతారో..అలాబోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. చిత్రంలో నటుడు ఎల్బీ శ్రీరాం డీఎన్ రెడ్డి పాత్రలో జీవించారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అద్బుతంగా ఇచ్చాడు. సుద్దాల అశోక్‌తేజ రచనలో రాకాసి పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. కొత్త ప్రదేశంలో చిత్రీకరణ.. 1970 ప్రాంతంలో పరిస్థితులు, అప్పటి స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పాలంటే ప్రత్యేకమైన ప్రదేశం కావాలి. అలా కర్ణాటక ప్రాంతంలో సీమకు దగ్గరగా ఓ ప్రదేశాన్ని చూశాం. ఈ ప్రదేశమే యునెస్కో హెరిటేజ్‌గా పేరొందిన అనెగుండి. అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి ఉండదు. రెండంతస్తుల భవనం కూడా ఉండదు. ఇక్కడ ఇళ్ళు, నిర్మాణాలు చాలా పురాతనమైనవి. అక్కడ రాళ్ళు మాట్లాడేలా కట్టడాలు, కొండలు ఉంటాయి. ఇక్కడే షూటింగ్ చేశాం. చాలా మంచి అనుభూతితో పాటు చాలా హెల్ప్ అయింది ఈ ప్రదేశం. మైనింగ్ సన్నివేశాలను బళ్ళారిలో చిత్రీకరించాం. టీం వర్క్‌తోనే విజయం.. ఏదైనా టీం వర్క్‌తోనే విజయం సాధిస్తాం. రైటింగ్ టీంతో పాటు యాక్టర్స్, చిత్ర యూనిట్ వెబ్‌సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. తెలుగు వెబ్‌సిరీస్‌లో గాడ్స్ ఆఫ్ దర్మపురి కొత్త తరహాను చూపించిందని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలిసి భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌కు, యాప్స్‌కు సినిమాకు మించిన డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. సినిమా దర్శకుడిగా వెబ్‌సిరీస్‌లకు మరింత ఆదరణ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా, టీవీలాగా వెబ్‌సిరీస్ ద్వారా మరికొంత మందికి ఉపాధి కలుగుతుంది. -
నా భర్తను నేనే చంపేశాను.!
సాక్షి, హైదరాబాద్: సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తాజా ట్రైలర్ కొంచెం ఇంట్రస్టింగ్‌గాను..అంతే థ్రిల్లింగ్‌నూ ఆసక్తి రేపుతోంది. ఇషా రెబ్బా నటనలో మరో మెట్టు ఎక్కినట్టు కనిపిస్తోంది. కాగా శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 15న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
రాగల 15 రోజుల్లో...
‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై ఈ చిత్రాన్ని కానూరు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా కానూరు శ్రీనివాస్ అభిరుచి గల నిర్మాత. కెమెరా, మ్యూజిక్ ఈ చిత్రానికి రెండు కళ్లు. స్క్రిప్ట్ నచ్చి కృష్ణభగవాన్ ఈ చిత్రానికి డైలాగులు రాశారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను’’ అన్నారు కానూరు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: రఘు కుంచె. -
ప్రేమకథలంటే ఇష్టం
‘‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో అందరికంటే చివరిగా వచ్చింది నేనే. ‘అసలేం జరిగింది’ అనే తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి, ఈ సినిమా లైన్ చెప్పడంతో నచ్చి, చేసేందుకు ఒప్పుకున్నాను’’ అని శ్రీరాం (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేం) అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరాం చెప్పిన విశేషాలు. ► శ్రీనివాస్ రెడ్డిగారు నాకు ఫోన్ చేసినప్పుడు నా పాత్ర కాదు, పూర్తి కథ చెప్పమన్నాను. ఈ సినిమాలో కథే హీరో. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హత్య చుట్టూ కథ నడుస్తుంది. ఓ రకంగా లేడీ సెంట్రిక్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా సాగుతుంది. ► ఈ చిత్రం స్క్రిప్ట్ మొత్తం 24 గంటల్లో నడిచే కథ. వాతావరణ విషయాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు ‘రాగల 24 గంటల్లో’ అని చెబుతుండటం మనకు తెలిసిందే. అందుకే ఈ కథకు ఆ టైటిల్ కరెక్టుగా సరిపోతుందని పెట్టాం. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేశా. నా గత పోలీస్ చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర ఇంకా డెప్త్‌గా ఉంటుంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో ఇలాంటి పోలీస్ పాత్ర చేస్తున్నాను. ► మర్డర్ మిస్టరీ కథాంశంతో చాలా సినిమాలు గతంలో వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్మెంట్తో ఈ సబ్జెక్ట్‌ని తెరకెక్కించారు. పేర్లు అయిపోగానే నేరుగా అసలు కథలో లీనమవుతారు ప్రేక్షకులు. ఎక్కడా సాగతీత ఉండదు. ► తెలుగు సినిమాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే మంచి కథలు కుదరకపోవడం వల్లే చేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో ‘అసలేం జరిగింది’ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు మధుకర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్లలో నటించడం నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ తమిళంలో మాత్రం రావడం లేదు. ► తమిళంలో లక్ష్మీరాయ్ హీరోయిన్గా ఒక చిత్రం, హన్సికతో మరో సినిమా.. ఇంకా 4 చిత్రాల్లో హీరోగా చేస్తున్నాను. ఆరు చిత్రాల్లోనూ నావి మంచి పాటలే. -
సినిమా ప్రమోషన్ అందరి బాధ్యత
‘‘ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నదే ఉంటాయి. అందరూ మంచి సినిమా తీయాలనే చేస్తారు. ఒక్కోసారి ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. ‘రాగల 24 గంటల్లో’ టీమ్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి.. అవుతుంది కూడా’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ప్రచార పాటని దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రచార పాటని విడుదల చేసినందుకు శ్రీనివాస్‌రెడ్డిగారు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు.. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే నేను థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాని ప్రమోట్ చేయడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. సరిగ్గా ప్రమోట్ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినప్పుడే విజయం సాధించి మరో సినిమా రూపంలో అందరికీ పని దొరుకుతుంది. సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉన్నా కూడా ప్రమోషన్ చేయాలి. ఎవరికైనా విజయాలు, అపజయాలు సాధారణం. అయితే శ్రీనివాస్ రెడ్డిగారు అందరితో మంచివాడు అనే ట్యాగ్‌లైన్ పొందడం సంతోషం. ఆయన ఎన్నో సక్సెస్‌లు కొడుతూనే ఉండాలి’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను, రఘు కుంచె ప్రమోషనల్ సాంగ్ చేద్దామనుకున్నప్పుడు దేవిశ్రీగారి ప్రత్యేక పాటలే గుర్తొచ్చాయి. మా ఈ పాటకి ఆయన పాటలే స్ఫూర్తి. అందుకే ఈ పాటని ఆయనతో విడుదల చేయించాం. ప్రస్తుతం యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రమోషన్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదు. అందరూ రావాల్సిన అవసరం ఉంది. నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియాపై ఉంది. నిర్మాత బాగున్నప్పుడే మరో సినిమా చేస్తారు.. దాని ద్వారా కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. శ్రీనివాస్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు. ‘‘సినిమాలంటే చాలా ప్యాషన్. కనీసం ఓ టీవీ సీరియల్ అయినా తీయలేనా? అనుకునేవాణ్ణి. సినిమా నిర్మిస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ భగవాన్గార్ల వల్లే ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీయగలిగాను. ఈ ఏడాదిలో వచ్చిన మంచి చిత్రాల్లో మా ‘రాగల 24 గంటల్లో’ సినిమా కూడా నిలుస్తుంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. ‘‘నాకు మంచివాళ్లంటే ఇష్టం. అందుకే.. శ్రీనివాస్‌రెడ్డిని బ్రదర్ థెరిస్సా అని పిలుస్తుంటా. ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ కావాలి.. శ్రీనివాస్ కానూరు పెద్ద నిర్మాత అవ్వాలి’’ అన్నారు నటుడు కృష్ణభగవాన్. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామన్ అంజి, పాటల రచయిత శ్రీమణి, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
24 గంటల్లో...
‘అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. వినోదాత్మక చిత్రాలే కాదు.. నాగార్జునతో ‘ఢమరుకం’ వంటి సోషియో ఫాంటసీతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషారెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ– ‘‘స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు, దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘుకుంచె నేపథ్య సంగీతం, ‘గరుడ వేగ’ ఫేమ్ అంజి కెమెరావర్క్ సినిమాకి హైలెట్’’ అన్నారు. కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, ‘టెంపర్’ వంశీ, అజయ్, అనురాగ్ తదితరులు నటించారు. -
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
-
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
‘‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్. బాగా పాపులర్ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరరెక్కిన ఈ సినిమా మొదటి పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్ రెడ్డి బావ, పులివెందులకు చెందిన వ్యాపారవేత్త దంతులూరి కృష్ణ విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి విజయాలను సాధించే దర్శకుడు శ్రీను. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘నేను ఈ సినిమా రషెస్ చూశా. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు దంతులూరి కృష్ణ. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ కానూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్ కెమెరామెన్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాస్‌రెడ్డితో మరో సినిమా తీస్తా
కథానాయిక ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్ హీరోగా నటించారు. శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీనివాస్ కానూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘స్వతహాగా వ్యాపారవేత్తను అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూశాను. నిర్మాతగా నా తొలి సినిమాని శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించడం సంతోషంగా ఉంది. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాం. సెప్టెంబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నాం. నా నెక్ట్స్ సినిమా కూడా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు. ‘‘కొంత గ్యాప్ తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. స్క్రీన్‌ప్లే బేస్డ్గా సాగే అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బా పెద్ద హీరోయిన్ల జాబితాలోకి వెళుతుంది. సత్యదేవ్ హీరోగా బిజీ అవుతారు. హాస్యనటుడు కృష్ణభగవాన్ ఈ సినిమాకు మాటలు రాయడం అదనపు ఆకర్షణ’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముస్కాన్ సే«థీ, గణేష్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, అనురాగ్, ‘టెంపర్’ వంశీ, రవి ప్రకాష్, రవి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలీబాబా. -
‘బ్రోచేవారెవరురా’ విజయోత్సవ వేడుక
-
రాగల 24 గంటల్లో...
‘‘రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని వాతావరణం విషయాలను చెప్పేవారు. అయితే మా ‘రాగల 24 గంటల్లో’ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.. అవి ఏంటి? అన్నదే సస్పెన్స్’’ అని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య తారలుగా, హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ కామెడీ, ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేశాను. ఇందులోనూ వినోదం మిస్ అవ్వదు. అందరి పాత్రలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్. ‘‘ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేశా’’ అని ఈషారెబ్బా అన్నారు. ‘‘ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు.. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే అందరిలో ఆసక్తి రేపుతుంది’’ అని శ్రీరామ్ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తి కావొచ్చింది. విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని కానూరు శ్రీనివాస్ తెలిపారు. గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: అంజి, సమర్పణ: శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
47 రోజుల సస్పెన్స్
పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘47 డేస్’. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. సత్యదేవ్ హీరోగా, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌గారి ‘47 డేస్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి ‘నాకు మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమా కూడా మా ‘నాకు మొగుడు కావాలి’ అంత హిట్ అవ్వాలి’’ అన్నారు. ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్న నేను సినిమా రంగంలోకి వస్తానన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్ రఫ్ కట్ చూసిన రామ్‌గోపాల్ వర్మగారు.. ‘మీరు విజువల్స్‌తో స్టోరీ చెప్పారు’ అనడం పెద్ద ప్రశంసలా అనిపించింది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు రఘు కుంచె. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు శశి భూషణ్, శ్రీధర్, విజయ్. ‘‘ఈ సినిమా హిట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకుడు బీవీయస్ రవి, దర్శకుడు వెంకటేష్ మహా, సతీష్ కాశెట్టి, కత్తి మహేష్, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్ కుమార్ సొహాని, సంగీతం: రఘు కుంచే, కెమెరా: జీకే. -
‘బ్లఫ్ మాస్టర్’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్లఫ్ మాస్టర్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సత్యదేవ్, నందిత శ్వేత, ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ సంగీతం : సునీల్ కాశ్యప్ దర్శకత్వం : గోపి గణేష్ నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్, పి. రమేష్ సపోర్టింగ్ రోల్స్‌తో వెండితెరకు పరిచయం అయిన సత్యదేవ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారాడు. తరువాత కూడా క్షణం, ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకొని మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన శతురంగవేట్టై సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ హీరోగా సక్సెస్ సాదించాడా..? కథ : ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ఏడేళ్ల వయస్సులో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక్కడ బతకాలంటే డబ్బు కావాలనే ఉద్దేశంతో.. ఆ డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్ రకరకాల పేర్లతో ఎన్నో మోసాలు చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కొని బయట పడతాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారాడు..? ఉత్తమ్ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు..? ఆమె రాకతో ఉత్తమ్ ఎలా మారాడు..? మంచి వాడిగా మారిన ఉత్తమ్‌కు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా సత్యదేవ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మాటలతో మాయ చేసి మోసం చేసే పాత్రలో సత్యదేవ్ నటన వావ్ అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో మెప్పించిన సత్య, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లోనూ అంతే బాగా ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో నందితా శ్వేత ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఆమె నటన కాస్త నాటకీయంగా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో మంచి మార్కులు సాధించింది. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : తమిళ సినిమా శతురంగవేట్టైని తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు గోపీ గణేష్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీర్చిదిద్దటంలో సక్సెస్ సాధించాడు. అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కథనంలో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, ఫైట్లు ఇరికించకుండా సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపించినా ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెడ్డటంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాకు మరో బలం డైలాగ్స్ చాలా డైలాగ్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయి. సునీల్ కాశ్యప్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సత్యదేవ్ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
పూరీగారు విజిల్స్ పడతాయన్నారు
‘‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనబడరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇది తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కు రీమేక్ అయినా కూడా అందులో నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితా శ్వేతా జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ చెప్పిన విశేషాలు. ► కెమెరామేన్ అవ్వాలని ఇండస్ట్రీకు వచ్చాను. నాకో యాడ్ ఏజెన్సీ ఉంది. యాడ్స్ రూపొందిస్తూ సినిమా కథలు తయారు చేసుకుంటుంటాను. సాయిరామ్ శంకర్ ‘రోమియో’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘చతురంగ వేటై్ట’ సినిమాకు ప్రేరణ మా గురువుగారు పూరి జగన్నాథ్ తీసిన ‘బిజినెస్‌మేన్’ చిత్రమే. అందులో మహేశ్‌బాబు, నాజర్‌గారు బ్యాంక్ ఓపెనింగ్ సన్నివేశంలో మాట్లాడే సందర్భం ఆధారంగా ‘చతురంగ వైటై్ట’ను రూపొందించారట వినోద్. గురువుగారి సినిమా ప్రేరణతో తీశారు కాబట్టి ఈ సినిమా రీమేక్ చేసే అర్హత నాకే ఉందని ఫీల్ అయ్యాను. ► ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఒరిజినల్ చూసి, ఆ దర్శకుడినీ కలిశాను. కొన్ని మార్పులు చేశాను. హీరో పాత్ర, డైలాగ్స్ సొంతంగా రాసుకున్నాను. అడిషనల్ డైలాగ్స్ పులగం చిన్నారాయణగారు అందించారు. సత్యదేవ్ కంటే ముందే ఇద్దరు ముగ్గురు హీరోలు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. వేరే హీరోలు కథ మార్చమన్నారు. నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ఈ సినిమాకు సత్యదేవ్ కరెక్ట్‌గా సూట్ అవుతాడని ఫస్ట్ నుంచి అనుకున్నాను. టెస్ట్ షూట్లో కృష్ణప్రసాద్‌గారు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా టీమ్ అందరూ నా డైలాగ్స్‌కు ఫ్యాన్ అయ్యారు. పూరీగారు కూడా నా డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయన్నారు. సునీల్ కశ్యప్ సినిమాను తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు మాత్రం మా సినిమా చూసి మోసపోడు. -
ఘరానా మోసగాడు
‘జ్యోతిలక్ష్మీ, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. నందితా శ్వేత కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించారు. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చితీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్ మాట్లాడుతూ– ‘‘ఎవరో నలుగరు రచయితలు నాలుగు గోడల మధ్య కూర్చుని రాసిన కథ కాదిది. వాస్తవాలను కథగా మలిచి సినిమా చేశాం. మాయ మాటలు చెప్పి మోసగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన తర్వాత అయ్యో మోసపోయాం అని బాధితులు బాధపడుతున్నారు. ఇలాంటి వాటికి ప్రతిరూపమే ఈ సినిమా. ఇందులో ఘరానా మోసగాడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. సత్య బాగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పాటలను రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అన్నారు రమేష్. ఫృథ్వీ, బ్రహ్మాజీ, ఆదిత్యామీనన్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
తమిళ సూపర్ హిట్ రీమేక్ 'బ్లఫ్ మాస్టర్'
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ సినిమా చతురంగ వేట్టై. ఈ సినిమాతో తెలుగులో గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రీమేక్ చేశారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందితా శ్వేత హీరోయిన్గా నటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . ప్రస్తుతం తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు , వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’ అని అన్నారు. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘రోజూ ఏ పేపర్లో చదివినా , ఏ టీవీ ఛానల్లో చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది’ అన్నారు. -
ఓ బ్లఫ్ మాస్టర్ కథ
‘జ్యోతిలక్ష్మి, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత కథానాయిక. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై నిర్మించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘లారెన్స్ నటించిన తమిళ ‘శివలింగ’ చిత్రాన్ని తొలిసారి మా బ్యానర్లో తెలుగులో అనువదించి మంచి విజయం అందుకున్నాం. 2014లో తమిళంలో ఘన విజయం సాధించిన ‘చతురంగ వేటై్ట’ సినిమాని ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. కొడైకెనాల్, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. పాటలను ఈ నెలాఖరులో, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు, ఘోరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతిచోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
చేతులు మారిన ఇంట్రస్టింగ్ రీమేక్
కోలీవుడ్ ఘనవిజయం సాధించిన శతురంగ వేట్టై సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను అడివి శేష్ హీరోగా రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే శేష్, గూఢచారి సినిమాతో బిజీగా కావటంతో ఈ రీమేక్ సునీల్ చేతికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమా సునీల్ నుంచి మరో నటుడి చేతికి వెళ్లింది. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా మారిన యువ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం 47 డేస్, గువ్వా గోరింక సినిమాల్లో నటిస్తున్నాడు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సత్యదేవ్ శతురంగ వేట్టై రీమేక్ లో నటించనున్నాడు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై గోపీ గణేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
‘సోషల్ మీడియా దుమారమే’
జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గువ్వా గోరింక’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాపై ఓ ఆసక్తికరమైన పాటను రూపొందించారు. ‘అరె దగ్గరి వాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాకా, ఇది ఆండ్రాయిడూ మజాకా. ఒడవని ముచ్చట రచ్చగ మార్చి పిచ్చెక్కిస్తది కాకా, నువు అందులోన దిగినాకా.. అంటూ సాగే ఈ పాటలో సోషల్ మీడియా ట్రెండ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ, ప్రియాలాల్, మధుమిత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.