Satya Dev Introduce His Wife Deepika In Gurthunda Seethakalam Pre Release Event - Sakshi
Sakshi News home page

Satya Dev: రియల్‌ హీరోయిన్‌ను పిలవమన్న తమన్నా.. భార్యను పరిచయం చేసిన సత్యదేవ్‌

Published Tue, Dec 6 2022 6:26 PM | Last Updated on Tue, Dec 6 2022 7:03 PM

Satya Dev introduce His Wife Deepika In Gurthunda Seethakalam Pre Release Event - Sakshi

కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నాడు సత్యదేవ్‌. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'లవ్‌ మాక్‌టైల్‌' సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ.. సినిమాలో నీకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, మరి నీ రియల్‌ హీరోయిన్‌ను పరిచయం చేయొచ్చుగా అంటూ సత్యదేవ్‌ను కోరింది.

ఆమె కేవలం మీకు స్టైలింగ్‌ మాత్రమే చేయలేదు. మీ ప్రధాన బలం కూడా ఆవిడేనని తెలుసంటూ ఆమెను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి సత్యదేవ్‌ బేబీ అంటూ తన భార్య దీపికను స్టేజీపైకి ఆహ్వానించాడు. అతడి భార్యాకొడుకు స్టేజీపైకి రాగానే వారిని సరదాగా పలకరించింది తమన్నా. తన భార్య గురించి సత్యదేవ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, స్టైలింగ్‌ అంతా దీపికానే చేసిందంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా సత్యదేవ్‌, దీపికది ప్రేమ వివాహం. సత్యదేవ్‌ సినిమాలకు దీపిక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది.

చదవండి: గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలితో పోల్చడం హ్యాపీగా ఉంది: తమన్నా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement