శీతాకాలంలోనే వస్తున్న "గుర్తుందా శీతాకాలం" మూవీ | Tamannaah Bhatia And Satyadev Gurthunda Seethakalam Gest Release Date | Sakshi
Sakshi News home page

Gurthunda Seethakalam : రిలీజ్‌కు రెడీ అయిన తమన్నా, సత్యదేవ్‌ల  "గుర్తుందా శీతాకాలం"

Published Sun, Nov 27 2022 10:33 AM | Last Updated on Sun, Nov 27 2022 10:35 AM

Tamannaah Bhatia And Satyadev Gurthunda Seethakalam Gest Release Date - Sakshi

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న  చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఇప్పటివరకు విడుదలకాకుండా వాయిదా పడుతూ వచ్చింది.

శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్‌లో  శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్‌ అని ఈ సినిమా ట్రైలర్లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్ లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్‌కి జస్టిఫికేషన్ గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది అంటూ మూవీ టీం పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement