Gurthunda Seethakalam Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన 'గుర్తుందా శీతాకాలం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. రిలీజ్‌కు ముందు పాజిటివి బజ్ క్రియేట్ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి అప్డేట్ లేకుండా డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
‘గుర్తుందా శీతాకాలం’మూవీ పబ్లిక్ టాక్
-
‘గుర్తుందా శీతాకాలం’మూవీ రివ్యూ
టైటిల్: గుర్తుందా శీతాకాలం నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు నిర్మాణ సంస్థలు: వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ దర్శకత్వం: నాగశేఖర్ సంగీతం: కాలభైరవ సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: డిసెంబర్ 9 , 2022 కథేంటంటే.. ఈ కథంతా రోడ్ జర్నీలో పరిచమైన ఇద్దరు వ్యక్తులు దేవ్(సత్యదేవ్), దివ్య (మేఘా ఆకాష్) మధ్య సంభాషణగా కొనసాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్, కాలేజీ డేస్‌లలో ఒక్కో అమ్మాయితో లవ్‌లో పడతాడు. స్కూల్ డేస్లోది అట్రాక్షన్. కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అయితే అతని శాలరీ తక్కువని, ధనవంతులుగా ఉన్న మనం అలాంటి వారితో జీవితాన్ని కొనసాగించలేమని తల్లి చెప్పడంతో అమ్ము మనసు మారుతుంది. ప్రతిసారి దేవ్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అనేకసార్లు అవమానిస్తుంది. అయినా కూడా దేవ్ ఆమెను ఒక్కమాట అనడు. చివరకు ఆమే దేవ్‌కి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిధి(తమన్నా) వస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి? నిధికి అబార్షన్ ఎందుకు అయింది? దేవ్ ప్రేమ, పెళ్లి విషయంలో స్నేహితులు ప్రశాంత్(ప్రియదర్శి), గీతుల పాత్ర ఏంటి? అసలు తన లవ్‌స్టోరీని అపరిచితురాలైన దివ్యకు ఎందుకు చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టెయిల్ తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా సరే.. వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే తెరపై చూపించే లవ్‌స్టోరీతో ప్రేక్షకుడు కనెక్ట్ అయితే అది వర్కౌట్ అవుతుంది. పాత్రల్లో లీనమైపోవాలి. కథ ఫ్రెష్‌గా ఉండాలి. అలాంటి లవ్‌స్టోరీని ఆడియన్ ఓన్ చేసుకుంటాడు. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్ అయింది. కొత్తదనం ఏమి కనిపించదు. హీరోకి స్కూల్‌డేస్.. కాలేజీ డేస్ లవ్‌స్టోరీ ఉండడం.. వాటిని నెమరేసుకోవడం ..ఈ తరహా కథలు తెలుగు ఆడియన్స్‌కు కొత్తేమి కాదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్’ సినిమాల మాదిరి కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్ డేస్, కాలేజీ డేస్ సీన్స్ నవ్విస్తాయి. అయితే కథనం మాత్రం ఊహకందేలా నెమ్మదిగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సత్యదేవ్, తమన్నాల మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. బలమైన సన్నివేశాలు ఏవి లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా ప్రధాన బలం సత్యదేవ్ అనే చెప్పాలి. దేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై ఓ కొత్త సత్యదేవ్‌ని చూస్తాం. రకరకాల వేరియేషన్స్‌ని బాగా పండించాడు. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్‌లో సత్యదేవ్ నటన బాగుంటుంది. నిధి పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించింది. సత్యదేవ్ ప్రియురాలు, డబ్బున్న అమ్మాయి అమృత పాత్రకి కావ్యా శెట్టి న్యాయం చేసింది. హీరో స్నేహితుడు ప్రశాంత్‌గా ప్రియదర్శి తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కథకు సపోర్ట్‌గా నిలిచాడు. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కాలభైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయింది. లక్ష్మీ భూపాల మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ కారణంతోనే ‘‘గుర్తుందా శీతాకాలం’' చేశా : సత్యదేవ్
‘‘గుర్తుందా శీతాకాలం’ మంచి సినిమా. ఇందులో కాలేజీ సీన్స్ ఉన్నాయి. ఈ వయసులో చేయకపోతే తర్వాత చేయలేం కాబట్టి చేశాను. మా సినిమా రిలీజ్‌కు ఈ సీతాకాలం సరైన సమయం అని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం’’ అని సత్యదేవ్ అన్నారు. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ – ‘‘స్కూల్, కాలేజ్, ఆ తర్వాత మిడిల్ ఏజ్.. ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకులను ఒప్పించడానికి ‘గుర్తుందా శీతాకాలం’లోని పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేశాను. ఇంతకుముందు ఇదే జోనర్లో ‘ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వచ్చినా మా సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ మధ్య థియేటర్స్‌కు జనాలు రావడం లేదంటున్నారు. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఆదరిస్తారు. ‘సీతారామం, కాంతార, లవ్ టుడే’ చిత్రాలు బాగుండటంతో మౌత్ టాక్ ద్వారా సూపర్‌హిట్ అయ్యాయి. ప్రస్తుతం ‘కృష్ణమ్మ, ఫుల్ బాటిల్’తో పాటు తమిళ్–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాను’’ అన్నారు. -
'నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, టికెట్లు ఇప్పించన్నా' హీరో ఆన్సర్ అదిరింది!
గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో సత్యదేవ్. కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన లవ్ మాక్‌టైల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. రేపు (డిసెంబర్ 9న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు సత్యదేవ్. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 'బ్రో, నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. స్టోరీ కూడా కనెక్ట్ అయింది. మూడు టికెట్స్ ఇవ్వొచ్చు కదా బ్రో' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'మూడు టికెట్సా? అంటే నువ్వు రావట్లేదా?' అని కౌంటరిచ్చాడు. 'అన్నా రిప్లై ఇవ్వకపోతే సినిమా చూడను ప్లీజ్ రిప్లై.. నీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మహేశ్‌బాబు 28వ సినిమా అప్డేట్ ఇప్పించు అన్నా' అని ఓ వ్యక్తి కోరగా.. 'నా ఇన్‌ఫ్లూయెన్స్‌తో గుర్తుందా శీతాకాలం టికెట్ ఇప్పించగలను కానీ ఆ అప్డేట్ ఎలా సాధ్యమవుతుందనుకున్నావు?' అని రిప్లై ఇచ్చాడు. రెబల్ స్టార్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా మిస్టర్ పర్ఫెక్ట్ అని, అల్లు అర్జున్ను ఐకాన్‌గా పేర్కొన్నాడు సత్యదేవ్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు కరకరలాడే అప్పడాలని చెప్పాడు. రీమేక్స్ అంటే జనాలిష్టపడట్లేదు, అయినా అంత నమ్మకంగా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీకి ఇవ్వొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా ఓటీటీకి అడిగారు. కానీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా' అని బదులిచ్చాడు సత్యదేవ్. Bro naaku 3 girlfriends unnaru bro ... Story kuda connect ayindhi. . oka three tkts bro #GurtundaSeetakalam #asksatyadev — Vineeth (@Vineethvineeee) December 7, 2022 #asksatyadev remakes meedha audience intrest chupiyatledhu kadha Anna Ayna Antha confident ga theatre release Endhuku Chesthunnaru Ott ki evvochu ga — Tarak_Star (@TarakStar9) December 7, 2022 Hai @ActorSatyaDev Anna, Watched #RamSetu film two days ago, your character and performance was terrific 👌. How is your working experience with #AkshayKumar Sir in that film? #AskSatyadev — 𝐑𝐚𝐯𝐢 𝐊𝐢𝐫𝐚𝐧 #𝐓𝐇𝐄𝐆𝐇𝐎𝐒𝐓 🗡️👑 (@PRAVIKIRAN18) December 7, 2022 చదవండి: లగ్జరీ కారు కొన్న సోనూసూద్ -
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్‌లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్‌లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
స్టేజీపై భార్యను పరిచయం చేసిన సత్యదేవ్
కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ మెప్పిస్తున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'లవ్ మాక్‌టైల్' సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. సినిమాలో నీకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, మరి నీ రియల్ హీరోయిన్ను పరిచయం చేయొచ్చుగా అంటూ సత్యదేవ్‌ను కోరింది. ఆమె కేవలం మీకు స్టైలింగ్ మాత్రమే చేయలేదు. మీ ప్రధాన బలం కూడా ఆవిడేనని తెలుసంటూ ఆమెను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి సత్యదేవ్ బేబీ అంటూ తన భార్య దీపికను స్టేజీపైకి ఆహ్వానించాడు. అతడి భార్యాకొడుకు స్టేజీపైకి రాగానే వారిని సరదాగా పలకరించింది తమన్నా. తన భార్య గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ అంతా దీపికానే చేసిందంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా సత్యదేవ్, దీపికది ప్రేమ వివాహం. సత్యదేవ్ సినిమాలకు దీపిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలితో పోల్చడం హ్యాపీగా ఉంది: తమన్నా -
హీరోలలో పెద్ద, చిన్న అనే తేడా చూడను..కథ నచ్చాలి: తమన్నా
‘గుర్తుందా శీతాకాలం’ సినిమాను గీతాంజలి మూవీతో పోలుస్తున్నారు.అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చారు.. ఆ అంచనాను మేము తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం నాకుంది’ అని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. యంగ్ హీరో సత్యదేవ్, తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా తమన్నా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాం ► మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి ► సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాం. ► సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరింది. ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దొరికింది. ► హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి.. ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను . ► ఇప్పటివరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు. నాగ శేఖర్( గుర్తుందా శీతాకలం చిత్ర దర్శకుడు) యాక్టర్ కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు ► నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయింది. ఇప్పటికీ నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను. ► ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను. ► భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను. ► ఈ ఏడాదిలో నేను నటించిన ఎఫ్3 విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ‘గుర్తుందా శీతా కాలం’రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో ‘భోళాశంకర్ ’ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నాను. -
వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ
తమన్నా పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అది ఒట్టి పుకారేనని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా ప్రేమలో ఉందని, త్వరలోనే అతనితో కలిసి ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్నా స్పందించింది. గుర్తుందా సీతాకాలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..‘కొంతమంది నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. ఒకసారి డాక్టర్.. మరోసారి బిజినెస్ మెన్ అంటూ.. ఏవేవో కథనాలు అల్లారు. అవన్ని పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే.. అందరితో నేనే షేర్ చేసుకుంటాను. జనరల్‌గా అందరి ఇళ్లల్లో అమ్మాయిలకు ఉన్నట్లే మా ఇంట్లో కూడా నా పెళ్లిపై ప్రెజర్ ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్. నటించడం అనేది నా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ని సీరియస్‌గా తీసుకొను’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. -
రష్మిక బ్యాన్పై స్పందించిన డైరెక్టర్.. కామెంట్స్ వైరల్
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ మీడియాతో తన ఫస్ట్ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కారణమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ నాగశేఖర్ స్పందించారు. ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా.. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. నేను కూడా సంజు వెడ్స్ గీత సినిమా కోసం చాలామంది నటీనటులకు ఛాన్స్ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకుంటారా? లేదా అన్నది వాళ్ల వ్యక్తిగతొం. నేను అది పట్టించుకోను. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం. రష్మికపై బ్యాన్ విషయానికి వస్తు.. దీని గుర్తించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఇలాంటివి నేను సపోర్ట్ చేయను అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఆ డైరెక్టర్ ప్రతి సినిమాకు నేనే పని చేస్తా: డైలాగ్ రైటర్
మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం". సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించారు. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ► 11 ఏళ్ల క్రితం అలా మొదలైంది సినిమా చేశాను. ఆ తర్వాత చందమామ కథలు వంటి లవ్ స్టోరీ రాశాను. తరువాత ఫ్యామిలీ, విలేజ్, గోదావరి స్లాంగ్ వంటి సినిమాలు, పొలిటికల్.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ కథలతో చాలా సినిమాలకు రాశాను.అయితే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రాసిన జానర్ మళ్ళీ రాయలేదు. ► నేను ఏ సినిమాకైనా కథ రాయాలి అంటే ఆ కథ నాకు ఇన్స్పిరేషన్ కలిగించాలి,అలాగే ఆ కథలో కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. చూసే అడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయినపుడే మనము సక్సెస్ అయినట్టు. ► గతంలో మనం చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్ వంటి సినిమాలు 10 సంవత్సరాలకోసారి కూడా రావు. ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. అతడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు. ► ఈ మధ్య ప్రేక్షకులు రీమేక్ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. ఆర్థిస్టులు కూడా రీమేక్ సినిమాలను ఛాలెంజ్‌గా తీసుకొని పోటీపడి నటిస్తారు. ఎందుకంటే రీమేక్‌లో ఆర్థిస్టులు నటించిన దానికంటే ఇంకా బెటర్ గా చెయ్యాలని ట్రై చేస్తారు. అప్పుడు సినిమా బాగా వస్తుంది. ఆలా చేసిన ఈ సినిమా కూడా 90% ఒరిజినల్ ఉండేలా సినిమాను రెడీ చేశాము. ► చాలామంది పెద్ద నిర్మాతలు నన్ను డైరెక్షన్ చేయమని అడిగారు. కానీ నాకు డైరెక్షన్ చేయాలని థాట్ వచ్చినప్పుడే చేస్తాను. ► చిరంజీవి లాంటి స్టార్ వ్యక్తికి డైలాగ్స్ రాస్తున్నప్పుడు నాకు ఎక్కువ ప్రెజర్ ఉండదు కానీ ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను రాసిన డైలాగులు చిరంజీవి గారి నోట్లోనుంచి వస్తే ఎలా ఉంటుందనే ఎగ్జయిట్‌మెంట్‌తో రాస్తాను. ► నాకు జీవితంలో ఎటువంటి గోల్స్ లేవు. కానీ, మంచి సినిమాలకు కథలు రాయాలి, నేను వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకుంటాను. ► అందరూ ఈ టైటిల్ గురించి అడుగుతున్నారు. అయితే ఎండాకాలంలో ప్రేమికులకు లవ్ స్టోరీ బాగోదు, వానకాలం లవ్ అనేది పెళ్లైన వాళ్ళకు మాత్రమే బాగుంటుంది. శీతాకాలంలో లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. ► నెక్స్ట్ మరీచిక, అన్నీ మంచి శకునములే సినిమాలకు పని చేస్తున్నాను. అలాగే నందిని రెడ్డి చేసే ప్రతి సినిమాకు కూడా రాస్తున్నాను అని ముగించారు. చదవండి: క్రికెటర్‌తో లవ్‌లో నటి? ఈ మధ్య మాటలు కూడా బంద్ అయ్యాయట! దయచేసి తండ్రి మాట వినొద్దు, అలాగైతేనే బన్నీలా అవుతారు: బండ్ల గణేశ్ -
Gurthunda Seethakalam Trailer: మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా..
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేం. అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ‘లవ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే..’, మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా’ లాంటి డైలాగ్స్ ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. -
అందుకే తమన్నాను తీసుకున్నాం: నిర్మాత
చాలామంది తమ జీవితంలో కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం". హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ సక్సెస్ఫుల్ దర్శకుడు, నటుడైన నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చినబాబు, ఎం.సుబ్బారెడ్దిల సమర్పణలో వేదాక్షర ఫిలింస్ నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబులు నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ► చిన్నప్పుడు చిరంజీవి గారి నెగిటివ్ ఫిల్మ్స్ తీసుకొని తెరమీద వెయ్యడం.. అలాగే ఆ నెగిటివ్ ఫిల్మ్ షర్ట్ కింద పెట్టి ఐరన్ చేస్తే షర్ట్ మీద చిరంజీవి బొమ్మ పడేది. ► సుబ్బారెడ్డితో కలసి ఆడు మగాడ్రా బుజ్జీ కు అసోసియేట్ గా వర్క్ చేశాను. ఆ తరువాత గజకేసరీ, సమంతతో టెన్ వంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు "గుర్తుందా శీతాకాలం"’ వంటి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాను. ► ఈ సినిమాకు భాగస్వామ్యం గా ఉన్న సుబ్బారెడ్డి 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.వారి సలహాలు తీసుకున్నాను. ప్రతి నిర్మాతకు మొదట కొంత ఇబ్బంది అనిపించినా అనుభవంతో అంతా సెట్ అయ్యి అలవాటు అవుతుంది. ► సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. మొదట నుంచి చివర వరకు కూడా నేను సెట్స్‌కు సరిగా వెళ్ళక పోయినా అకౌంట్స్ తో సహా ప్రతి విషయంలో మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపించాడు. తమన్నా ప్రొఫెషనల్ యాక్టర్. అంతా కొత్త వారితో చేస్తే మా సినిమా బిజినెస్ కూడా జరగాలి కాబట్టి తనను తీసుకున్నాం. ► డిసెంబర్ 9 న సుమారు 12 సినిమాలు రిలీజ్‌కు ఉన్నా కూడా మా సినిమాను మాత్రం రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాము. ► కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. తను కన్నడలో చాలా హిట్ సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమాకు కూడా చాలా కేర్ తీసుకొని బాగా చేశాడు. తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది. ► ఈ సినిమా చూస్తుంటే నాగార్జున గారి "గీతాంజలి" సినిమాకు దగ్గరగా ఉంటుంది ► నాకు రివాల్యూషనరీ, సామాజిక అంశాల మీద జరిగే షోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు, హార్రర్,క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథలు అంటే ఇష్టం. ► కృష్ణ వంశీ గారి రంగ మార్తాండ సినిమాకు ఫైనాన్సియల్ అసోసియేట్ అయ్యాము, సినిమా పూర్తైంది. ఎన్టీఆర్ బావమరిదితో శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చేస్తున్నాము. ఫిబ్రవరి లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాము.ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కథలు లైనప్ లో ఉన్నాయి అని ముగించారు. చదవండి: ఆ స్టార్ హీరోని నేను పెళ్లి చేసుకోవడం లేదు: కృతీసనన్ రష్యాలో ల్యాండైన పుష్ప టీమ్ -
‘గుర్తుందా శీతాకాలం’ చూస్తే మనందరి లవ్‌స్టోరీస్ గుర్తొస్తాయి: కావ్య శెట్టి
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది కన్నడ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్ గా కన్నడలో నేను నటించిన లవ్ మాక్టేల్ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు అడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. అలాగే మలయాళం లో ఒకటి, తమిళ్ లో మూడు సినిమాలు చేశాను. అయితే తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం. ► మూడు లవ్ స్టోరీస్ (త్రీ ఏజ్ గ్రూప్స్) కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూడు లవ్ స్టోరిస్ మీ హర్ట్ ని టచ్ చేసేలా ఉంటాయి. ఇందులో నేను కాలేజీ గర్ల్ అమ్ములు పాత్రలో నవ్విస్తాను.. కాలేజ్ నేపథ్యం లో సాగే నా పాత్ర మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ మెంట్ నిస్తుంది . ► నేను డి గ్లామర్ పాత్రలో ఒక సినిమా చేశాను కానీ నాకు గ్లామర్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే "గుర్తుందా శీతాకాలం"’ మాత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఎక్సటింగ్ గా ఉన్నాను. ► నా కో స్టార్ సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో నాకున్న డైలాగ్స్ కు ఎక్కువగా తనే హెల్ప్ చేశాడు. తనతో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. తమన్నా తో నాకు ఎటువంటి సీన్స్ లేవు, కానీ ప్రియదర్శి తో సీన్స్ ఉన్నాయి. కాలభైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి. ► కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయిన నిర్మాతలు రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు లలో మంచి మంచి లొకేషన్స్ లలో షూట్ చేశారు. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.. ► కన్నడ నుండి వచ్చిన హీరోయిన్స్ అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టి వంటి వారందరినీ అదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. వారిని ఆదరించినట్లే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూడు కన్నడ సినిమాలు , ఆమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇంకా కొన్ని లైనప్ లో ఉన్నాయి. -
శీతాకాలంలోనే వస్తున్న "గుర్తుందా శీతాకాలం" మూవీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు విడుదలకాకుండా వాయిదా పడుతూ వచ్చింది. శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్‌లో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్ అని ఈ సినిమా ట్రైలర్లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్ లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్‌కి జస్టిఫికేషన్ గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది అంటూ మూవీ టీం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
సత్యదేవ్, తమన్నా.. ‘గుర్తుందా.. శీతాకాలం’.. కొత్త తేదీ ఖరారు
సత్యదేవ్, తమన్నా జంటగా మేఘా ఆకాష్, కావ్యా శెట్టి, ప్రియదర్శి ముఖ్య తారలుగా నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్తుందా...శీతాకాలం’. ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సింది. అయితే తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లోని టీనేజ్, కాలేజ్ లైఫ్ సంఘటనలను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ విషయాలనే ఈ సినిమాలో చూపించాం. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్‌టైల్’కు తెలుగు రీమేక్‌గా ‘గుర్తుందా.. శీతాకాలం’ రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా చిన్న సినిమాలు విజయవంతం అవుతుండటంతో పరిశ్రమ మొత్తం సందడి సందడి మారిపోయింది. చిన్న నిర్మాతల్లో ఎక్కడలేని ధైర్యం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆడియెన్స్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చూస్తారన్నారు. ఆ తర్వాత మాస్ మూవీస్ చూసేందుకు వస్తున్నారు అన్నారు. ఆ తర్వాత అస్సలు ఆడియెన్స్ రావడం లేదన్నారు. కానీ కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ నిరూపించాయి. (చదవండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను : విజయ్ దేవరకొండ) ఈ మూడు చిత్రాల ఘన విజయం..చిన్న చిత్రాలకు గొప్ప ధైర్యాన్ని అందించింది. అందుకే సెప్టెంబర్ లో వరుస పెట్టి చిన్న సినిమాలు థియేటర్స్ కు క్యూ కట్టాయి. సెప్టెంబర్ 2న ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 9న సత్యదేవ్, తమన్నాల ‘గుర్తుందా సీతా కాలం’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. (చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..) ఈ మూడు చిత్రాలపై మంచి బజ్ ఉంది. సెప్టెంబర్ మూడో వారంలో నిఖిల్ కొత్త చిత్రం ‘18 పేజెస్’ రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 16 ‘శాకిని డాకిని’ విడుదలకు ముస్తాబవుతోంది. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కు అఫీసియల్ రీమేక్ గా తెరకెక్కింది శాకిని ఢాకిని. ఈ సినిమాకు పోటీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదల కానుంది. సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి, అల్లూరి రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎన్ని, ప్రేక్షకులను అలరిస్తాయో, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుతాయో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.