Actress Tamannaah Bhatia Gives Clarity On Her Marriage Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ

Published Tue, Dec 6 2022 3:13 PM | Last Updated on Tue, Dec 6 2022 3:42 PM

Tamannaah Bhatia Gives Clarity On Her Marriage Rumours - Sakshi

తమన్నా పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అది ఒట్టి పుకారేనని తేలిపోయింది.  ఇక ఇప్పుడు ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా ప్రేమలో ఉందని, త్వరలోనే అతనితో కలిసి ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్నా స్పందించింది.

గుర్తుందా సీతాకాలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..‘కొంతమంది నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. ఒకసారి డాక్టర్‌.. మరోసారి బిజినెస్‌ మెన్‌ అంటూ.. ఏవేవో కథనాలు అల్లారు. అవన్ని పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్‌ అయితే.. అందరితో నేనే షేర్‌ చేసుకుంటాను. జనరల్‌గా అందరి ఇళ్లల్లో అమ్మాయిలకు ఉన్నట్లే మా ఇంట్లో కూడా నా పెళ్లిపై ప్రెజర్‌ ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌, రూమర్స్‌ గురించి ఎక్కువగా ఆలోచించను.

ఎందుకంటే అది వారి పార్ట్‌ ఆఫ్‌ లైఫ్‌. నటించడం అనేది నా లైఫ్‌. సోషల్‌ మీడియాలో వచ్చే మీమ్స్‌ని సీరియస్‌గా తీసుకొను’ అని తమన్నా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్‌ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్‌ 9న విడుదల కాబోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement