![Tamannaah Respond On Her Marriage Rumours and Gave Clarity - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/9/thamannah.jpg.webp?itok=cqza1Epn)
Tamannaah Gave Clarity On Her Marriage Rumours: తమన్నా.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అని పిలుపించుకుంటూ కుర్రాళ్ల గుండెళ్లో నిలిచిపోయింది. ఆమె కెరీర్‌లో పెద్దగా హిట్స్ లేకపోయినా వరస ఆఫర్లను అందిపుచ్చుకుంది. అందం, అభినయంతో పాటు డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ టీవీ షోలు, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరీర్‌ను బిజీగా మలుచుకుంటుంది. ఈ క్రమంలో షూటింగ్‌లకు బ్రేక్ దొరకడంతో తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మిల్కీ బ్యూటీ పెళ్లి అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: ఆ సినిమాతో పోలిస్తే ఆర్‌ఆర్‌ఆర్ గేమ్ చెంజర్ కాదు: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
అంతేకాదు ఇప్పటికే తమన్నా కోసం కుటుంబ సభ్యులు వరుడ్ని కూడా వేతికారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమన్నా పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి రూమర్లపై తమన్నా స్పందించింది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
ఇక ఇటీవల మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన తమన్నా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ వరుస ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే తమన్నా టూర్లకు వెళ్లడం చాలా అరుదు. అలాంటిది ఉన్నట్టుండి తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లడంతో ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా రీసెంట్‌గా గని మూవీ స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ మిల్కీ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ సినిమలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment