marriage rumours
-
అతనితో రిలేషన్షిప్.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
-
వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక
కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె నటిస్తున్న చిత్రాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ప్రేమ వ్యవహారం గురించి కావచ్చు. నటి మేనక, నిర్మాత సురేష్ ల వారసురాలు కీర్తి సురేష్. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్‌తో జత కట్టిన రజనీమురుగన్ మంచి విజయాన్ని అందించింది. అలా కథానాయకిగా స్థిరపడి పోయిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే, నటనకు అవకాశం ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. దాంతోపాటు ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లోనూ తరచూ చిక్కుకుంటోంది. కీర్తీ సురేష్ పెళ్లి అని, ఓ వ్యాపార వేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయాలపై కీర్తీ సురేష్ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తొలి సారిగా ఆమె తల్లి మేనక స్పందించారు. ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధం అవుతోందనీ గాసిప్స్ చాలానే వస్తున్నాయని. అయితే కీర్తీ. ఎవరిని ప్రేమించినా ఆ విషయాలు తమకు చెబుతుందని, దాన్ని తాము బహిరంగంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. అయితే కీర్తీ ఎవరినీ ప్రేమించడం లేదని, ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అనీ చెప్పారు. కీర్తీ సురేష్ గురించి వదంతులు దొర్లుతున్నాయంటే, ఆమె నటిగా ఎదుగుతోందని అర్థం అని మేనక పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో కీర్తీసురేష్ బిజీగా ఉంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్కు చురకలు అట్టిస్తున్నారు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. -
జయసుధ మూడో పెళ్లిపై వార్తలు.. స్పందించిన నటి
సీనియర్ నటి జయసుధ పేరు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె ‘సహజనటి’గా గుర్తింపు సాధించింది. అప్పట్లో సీనియర్ ఎన్టీర్, ఏఎన్నాఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్లతో ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆమె50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో చిత్రం వారసుడులో నటించారు. అయితే తాజాగా జయసుధ సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమెతో ఓ వ్యక్తి ప్రతి కార్యక్రమంలో ఆమె పక్కనే కనిపించడమే దీనికి కారణం. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ప్రతి ఈవెంట్‌కు హాజరవుతున్నారని వెల్లడించింది. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని.. నా బయోపిక్ తీస్తున్నారని తెలిపింది. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. జయసుధ మాట్లాడూతూ..'నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతడిని కలిశా.' అని చెప్పుకొచ్చారు జయసుధ. కాగా.. జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
షాకింగ్.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?
జయసుధ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఆమె సినీప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామీలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే! ఇటీవల వారసుడు(తమిళంలో వారీసు) మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. ఇమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిస్తున్నారట. ఏ కార్యక్రమం అయిన మూవీ ఈవెంట్ అయిన అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్త అని తెలిస్తోంది. అతడిని ఆమె సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ! ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. అదే సమయంలో జయసుధ ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జయసుధ ఈ వార్తలపై స్పందించేవరకు వేచి చూడాలి. చదవండి: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’ కాగా జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
రెండుసార్లు పెళ్లి తేదీలు విన్నా.. కానీ ఎవరూ పిలవలేదు: సిద్దార్థ్ మల్హోత్రా
ఈ ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన జంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీలెక్కనున్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెగ వైరలయ్యాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలను ఈ జంట ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. (ఇది చదవండి: కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?) కానీ ఈ వార్తలపై తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా నోరు విప్పారు. ఇప్పటికీ నా పెళ్లికి ఇంకా నన్ను ఎవరూ ఆహ్వానించలేదు. ప్రజలు కూడా ఎవరు పిలవలేదు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి తేదీలు కూడా విన్నా. అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహగానాల కంటే.. నా సినిమాలపై దృష్టి సారిస్తే మంచిది. అదే నాకు నచ్చుతుంది.' అని అన్నారు. ఇటీవల కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా పెళ్లి గురించి రూమర్స్ పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. షేర్షా సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి మిషన్ మజ్నుతో ఓటీటీలో అలరించనున్నారు. జనవరి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. చివరిసారిగా సిద్ధార్థ్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో నటించిన థ్యాంక్ గాడ్లో కనిపించాడు. -
వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: లగ్జరీ కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్ చూశారా? ఓ బడా వ్యాపారవేత్తతో త్వరలోనే ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే చాలాసార్లు శ్రీముఖి పెళ్లి రూమార్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్తా గట్టిగానే ఆమె పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతడినే ఆమె పరిణయం ఆడబోతుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసల వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: 'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్‌పై శ్రుతి కౌంటర్ అంతేకాదు ఇటీవల రెండు కటుంబాలు కలిసి మాట్లాడుకున్నారట. ఇక ముహుర్తం ఫిక్స్ చేయడమే మిగిలి ఉందంటున్నాయి సన్నిహిత వర్గాలు. అన్ని ఏర్పాట్లు అయ్యాక శ్రీముఖీ పెళ్లిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ యాంకరమ్మా స్పందించేవరకు వేచి చూడాలి. అయితే కాస్తా బొద్దుగా ఉండే శ్రీముఖి బక్కచిక్కిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే ఆమె సన్నగా నాజుగ్గా తయారైందంటూ మరోవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి శ్రీముఖి తన పెళ్లి వార్తలపై ఈసారి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ
తమన్నా పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అది ఒట్టి పుకారేనని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా ప్రేమలో ఉందని, త్వరలోనే అతనితో కలిసి ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌పై తమన్నా స్పందించింది. గుర్తుందా సీతాకాలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ..‘కొంతమంది నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. ఒకసారి డాక్టర్.. మరోసారి బిజినెస్ మెన్ అంటూ.. ఏవేవో కథనాలు అల్లారు. అవన్ని పుకార్లు మాత్రమే. నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే.. అందరితో నేనే షేర్ చేసుకుంటాను. జనరల్‌గా అందరి ఇళ్లల్లో అమ్మాయిలకు ఉన్నట్లే మా ఇంట్లో కూడా నా పెళ్లిపై ప్రెజర్ ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్. నటించడం అనేది నా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ని సీరియస్‌గా తీసుకొను’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. -
కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు
హీరోయిన్ తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలు అల్లుతున్నారు. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది తమన్నా. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది! దీంతో అది చూసి నెటిజన్లంత ఖంగుతిన్నారు. కొద్ది రోజులుగా వస్తున్న తన పెళ్లి రూమర్స్‌పై ఆమె స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే’ అంటూ వీడియోను పంచుకుంది. అయితే అందులో ఉన్నది తమన్నా అని తెలిసి అంతా షాకయ్యారు. కాగా గతంలో తమన్నా మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియో ఇది. ‘ఎఫ్ 3’ మూవీ సమయంలో తీసుకున్న వీడియో ఇది. ఈ చిత్రంలో తమన్నా పలు సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్?
‘కడల్’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవల ఈ జంట అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు పెళ్లెప్పుడు అంటూ వారి పోస్ట్స్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు! ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ జంట పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకొబోతున్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి అనంతరం భారీగా విందును ఇవ్వనున్నట్టు సమాచారం. పస్నేహితులు, సన్నిహితుల కోసం ఊటీ, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు జరుగుతున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమా హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు గతంలో తమిళ మీడియాలో కథనాలువ చ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ 31న కార్తీక్‌తో ప్రేమలో మంజిమా వెల్లడించగా.. నవంబర్ 5న తామిద్దరి ఫొటోలను షేర్ చేసి ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశాడు గౌతమ్ కార్తీక్. కాగా గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ తనయడు అనే విషయం తెలిసిందే. ❤️♾️🧿 pic.twitter.com/RlAlpLO2oS — Gautham Karthik (@Gautham_Karthik) October 31, 2022 -
పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష!
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట. అది కూడా ఓ సీనియర్ బడా ఇంటికి కోడలిగా వెళ్లబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వర్ష.. మిడిల్ క్లాస్ మెలోడిస్‌తో స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. తాజాగా ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ సరసన స్వాతిముత్యంలో నటించింది. చదవండి: అనసూయ పక్కన ఉన్న ఈ కొత్త వ్యక్తి ఎవరు? అతడితో అంత క్లోజ్ ఏంటి.. ఈ సినిమాతో ఆమె మరో హిట్ కొట్టేసింది. ప్రస్తుతం స్వాతిముత్యం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వర్ష పెళ్లి గురించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే తెరపై వర్ష అందం, అభినయానికి ఓ సీనియర్ నిర్మాత కొడుకు ఫిదా అయ్యాడట. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో సదరు నిర్మాత ఒకే అనేశాడట. ఇక బయట కూడా వర్ష వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను కొడలిగా చేసుకునేందుకు ఆ మాజీ నిర్మాత ఆసక్తిగా ఉన్నాడట. చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో.. దీంతో ఆలస్యం చేయకుండా పెళ్లి విషయాన్ని వర్ష తల్లిదండ్రులతో మాట్లాడాడట ఆయన. ఇరు కుటుంబాలు చర్చించుకుని పెళ్లికి ఒకే చెప్పుకున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ, వర్ష ఓ పెద్దింటికి కోడలిగా వెళుతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. ఇక ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే వర్ష బొల్లమ్మ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. -
సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా?
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్‌తో ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్న ఆమె అభిమానులకు మరింత చేరువయ్యింది. హౌజ్‌లో అభి-హారిక బాండింగ్ చూసి వారిద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ చర్చించుకున్నారు. చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ఆ రిలేషన్ హౌజ్ వరకే పరిమితమైంది, బయటకు వచ్చాక వీరిద్దరు కలుసుకుంది కూడా చాలా తక్కువ. దీంతో వారిద్దరి మధ్య ఏం లేదని స్పష్టమైంది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘కృష్ణ వ్రింద విహారి’ సందడి, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఎక్కడంటే ఈ తాజా బజ్ ప్రకారం.. ఓ యూట్యూబర్‌తో హారిక ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య హారిక ప్రియుడితో సైలెంట్‌గా ఏడడుగుల వేయబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హారిక స్పందించేవరకు వేచి చూడాల్సిందే. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ.. పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. చదవండి: ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే ఈ క్రమంలో తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఆమె కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ప్రస్తుతం దక్షిణాన పలు చిత్రాలు చేస్తున్న ఈషా ఈక్రమంలో అక్కడి ఓ స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందట. ఇక త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని, కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఒక్కటికాబోతున్నారంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ తెలుగు బ్యూటీ స్పందించేవరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు బయటకు రావడంతో ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆమె ఫాలోవర్స్. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత -
మళ్లీ పెళ్లి చేసుకోనున్న మేఘనా సర్జా?
కన్నడ స్టార్ చిరంజీవి సర్జా మరణంతో ఎంతగానో కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె కొన్ని నెలల తర్వాత ఓ కుమారుడికి జన్మనిచ్చింది. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోందామె. అయితే ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ రూమర్‌పై స్పందించింది. 'కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొందరేమో నా కొడుకును బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సూచిస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలి? నా భర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు.. ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు, నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. నేను మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? కొద్ది రోజులయ్యాక నా జీవితం ఎలా ఉంటుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు' అని మేఘన చెప్పుకొచ్చింది. కాగా చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ సుమారు పదేళ్లు ప్రేమలో మునిగి తేలాక 2018 మే 2న పెళ్లాడారు. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో మరణించారు. వీరికి రాయన్ రాజ్ సర్జా అనే కొడుకు పుట్టాడు. మేఘన నటించిన బుద్ధివంత 2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే ఆమె ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చదవండి: సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! ఓటీటీలో రాజ్‌కుమార్ రావు హిట్, స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! -
ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో డేటింగ్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్ ఫొటో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను కరణ్ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. తాజాగా హీరో షాహిద్ కపూర్‌తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్ ఎవరని అడగ్గా షాహిద్ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్‌తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు ఇంతలో షాహిద్ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్ అనౌన్స్మెంట్ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్, కియారాలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్‌బర్డ్స్ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్ కపుల్, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్‌లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో
కోలీవుడ్‌లో నవరస నాయకుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కార్తీక్. ఈయన వారసుడే గౌతమ్ కార్తీక్. తనూ హీరోగా మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఇటీవల ఈయన ప్రేమ వ్యవహారంపై వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నటి మంజిమా మోహన్‌తో ప్రేమ అంటూ త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. గౌతమ్ కార్తీక్ నటి మంజిమా మోహన్ దేవరాట్టం చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరూ చట్టపటాలు వేసుకుని షికారు చేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇటు గౌతం కార్తీక్ గాని, అటు మంజిమా మోహన్ గాని స్పందించడంలేదు. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక ఇలాంటి పరిస్థితుల్లో నటుడు గౌతమ్ కార్తీక్ ఒక భేటీలో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి గానీ, నటి మంజమా మోహన్ ప్రస్తావని గాని ఈయన ఎక్కడ తీసుకురాలేదు. తాను నటుడుగా సాధించాలని ఈ రంగంలోకి వచ్చానని, అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇకపై కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అన్నది చెప్పకపోవడంతో ఆ వధువు ఎవరు చెప్పు నవరస నాయకుడి వారసుడా.. అంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా.. -
వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు..
సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన నటి పవిత్రా లోకేశ్‌ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పవిత్రతో వివాహంపై నరేశ్ స్పందించలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరాశలో కుంగిపోయి ఉన్నప్పుడు పవిత్ర తనకు అండగా నిలిచారని చెప్పారు. మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్ 4వ పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. తనకు, నరేశ్‌కు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. అలాగే నరేశ్ జనవరిలో తనపై ఫిర్యాదు చేసిన విషయంపై కూడా ఆమె స్పందించారు. జూన్‌లో నాకు నోటీసులు అందాయని, వీటిపై తాను లీగల్ కోర్టులోనే ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. రమ్య చెప్పేదంత అబద్ధం: నరేశ్ నరేశ్ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్ చేశాను. కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను పవిత్రను పెళ్లి చేసుకోలేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నాకు పవిత్ర ఎమోషనల్ సపోర్టు మాత్రమే. పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి: సుచేంద్ర ఈ పెళ్లి వార్తలపై పవిత్ర లోకేశ్ భర్త డైరెక్టర్ సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది పైలా పచ్చిస్ జీవితమని, అందుకు తనని వదిలి వెళ్లిపోయిందన్నారు. సుచేంద్ర నా భర్త కాదు.. సుచేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు పవిత్రా లోకేశ్. ‘సుచేంద్ర నా భర్త కాదు. నేను ఆయనతో రిలేషన్ షిప్లో మాత్రమే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్రకు దూరంగా ఉంటున్నా’ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పవిత్రా లోకేశ్ ఇప్పటికే కర్ణాటక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే నరేశ్‌తో తన రిలేషన్‌పై నోరు విప్పిందామె. ఫార్మ్ హౌజ్‌లో నరేశ్‌తో కలిసి ఉంటున్నానని, నరేశ్ ఫ్యామిలీ మెంబర్‌గా తనని అంగీకరించారని చెప్పారు. -
త్వరలోనే తమన్నా పెళ్లి? క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
Tamannaah Gave Clarity On Her Marriage Rumours: తమన్నా.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అని పిలుపించుకుంటూ కుర్రాళ్ల గుండెళ్లో నిలిచిపోయింది. ఆమె కెరీర్లో పెద్దగా హిట్స్ లేకపోయినా వరస ఆఫర్లను అందిపుచ్చుకుంది. అందం, అభినయంతో పాటు డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ టీవీ షోలు, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరీర్‌ను బిజీగా మలుచుకుంటుంది. ఈ క్రమంలో షూటింగ్‌లకు బ్రేక్ దొరకడంతో తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మిల్కీ బ్యూటీ పెళ్లి అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఆ సినిమాతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ గేమ్ చెంజర్ కాదు: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ అంతేకాదు ఇప్పటికే తమన్నా కోసం కుటుంబ సభ్యులు వరుడ్ని కూడా వేతికారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమన్నా పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి రూమర్లపై తమన్నా స్పందించింది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ఇక ఇటీవల మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన తమన్నా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ వరుస ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే తమన్నా టూర్లకు వెళ్లడం చాలా అరుదు. అలాంటిది ఉన్నట్టుండి తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లడంతో ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా రీసెంట్గా గని మూవీ స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ మిల్కీ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ సినిమలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
హీరోయిన్‌తో నటుడి పెళ్లి? వాలెంటైన్స్‌డే రోజు ప్రకటన?
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ యంగ్ యాక్టర్ కుర్ర హీరోయిన్ మంజిమా మోహన్‌తో లవ్‌లో ఉన్నాడట. వీళ్లిద్దరూ తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు వారి ప్రేమను అఫీషియల్‌గా వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇదిలా ఉంటే అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్ఐఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, రైజా విల్సన్, రెబా మోనికా తదితరులు నటించారు. -
వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లి రూమర్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ మారాయి. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లావణ్య ఈ వార్తలపై పరోక్షంగా స్పందించినప్పటికి, నేరుగా ఇంతవరకు వరుణ్ తేజ్ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే లావణ్య తన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ షూటింగ్లో పాల్గొంది. ఈ నేపథ్యంలో షూటింగ్ బ్రేక్‌లో లావణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్ నిర్వహించి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన డైట్, తన డైలి హ్యబిట్స్తో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో వరుణ్‌తో తేజ్‌తో తన పెళ్లి రూమర్లపై ఓ నెటిజన్ ప్రశ్నించగా.. దీనికి ఆమె ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చింది. ‘నా పెళ్లి ఎవరితో అనేది ఇంతవరకు నాకే తెలియదు. నా గురించి నాకు తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అయితే మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా? ప్రశ్నించగా దీనికి లావణ్య ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. కాగా వరుణ్ సోదరి, నటి నిహారిక, లావణ్యలు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి. పైగా వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావణ్య కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. -
మాథ్యూస్ మంచి సన్నిహితుడు..పెళ్లిపై తాప్సీ క్లారిటీ!
కరోనా కాలంలో నటీనటులు, హీరోహీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. కాగా కొంతకాలంగా ఆమె డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ మ్యాథ్యూస్‌తో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. మ్యాథ్యూస్‌తో తను ప్రేమలో ఉన్నట్లు గతేడాది తాప్సీ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా త్వరలోనే తాప్సీ-మాథ్యూస్‌లు ఏడడుగులు వేయ్యనున్నారనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో తాప్సీ ఈ రూమర్స్‌పై తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ‘నాకు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మాథ్యూస్ నాకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తన రిలేషన్‌పై మాట్లాడుతూ.. సినిమా రంగానికి కానీ, సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనని తాప్పీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాను సినీ నటి అయినందున బయటి వ్యక్తినే వివాహం చేసుకోవానుకుంటానని, నటన తప్ప అది ఏ రంగమైనా పర్లేదు అని చెప్పుకొచ్చింది. అంతేగాక తన వృతి, వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెబుతూ గతంలో మ్యాథ్యూస్‌తో ప్రేమలో ఉన్న విషయం వెల్లడించింది. కాగా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని, ఏడాదికి కనీసం 6 సినిమాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ సంఖ్య 2 లేదా 3కు పడిపోయినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని తాప్సీ స్పష్టం చేసింది. చదవండి: దాదీ మళ్లీ తిరిగొస్తారనుకున్నా: తాప్సీ ఎమోషనల్ -
త్వరలో చెప్తా: పెళ్లి వార్తలపై నటుడి స్పందన
బాలీవుడ్ జంట తారా సుతారియా, ఆదార్ జైన్ ఏ ఫంక్షన్‌కైనా, ఏ ఈవెంట్‌కైనా కలిసే వెళ్తారు. ఎవరింట్లో సెలబ్రేషన్స్ జరిగినా ఇద్దరూ హాజరవ్వాల్సిందే. ప్రేమలో మునిగి తేలుతున్న వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై నటుడు తారక్ సుతారియా స్పందించాడు. ప్రస్తుతం తారా, తాను సంతోష క్షణాలను ఆస్వాదిస్తున్నామని, త్వరలోనే కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయని హింటిచ్చాడు. కానీ వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్నాడు. అనుకూలమైన సమయం, సందర్భం వచ్చినప్పుడు తానే అన్ని వివరాలు చెప్తానని పేర్కొన్నాడు. కాగా తారా సుతారియా, ఆదార్ జైన్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆదార్ సోదరుడు అర్మాన్ పెళ్లికి తారా వెళ్లడం, అక్కడ ఆదార్‌తో కలిసి సంగీత్‌లో డ్యాన్స్ చేయడంతో వీరి మధ్య బలమైన బంధం ఉందని ఫిక్సయ్యారంతా. ఇక తారా బర్త్‌డేను పురస్కరించుకుని వీళ్లు మాల్దీవులకు కూడా వెళ్లొచ్చడంతో ప్రేమ పక్షులని నిర్ధారణకు వచ్చేశారంతా! చదవండి: విసిగిపోయాను, కానీ బతికే ఉన్నా: శక్తిమాన్ నటుడు -
‘పెళ్లి చేసుకోను.. సినిమాలను వదలను’
మనసులో ఏం దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్. తనపై వచ్చే రూమర్లపై కూడా అలాంటి సమధానాలే ఇస్తారు వరలక్ష్మి. ఈ ఫైర్‌బ్రాండ్ వివాహం గురించి ఫిలింనగర్లో ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి వరలక్ష్మి పెళ్లి ముచ్చట ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే సినిమాలను వదిలేసి.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వరలక్ష్మి వివాహం చేసుకోబోయే వ్యక్తికి ఇండియన్ క్రికెట్ టీమ్‌తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించారు వరలక్ష్మి. ఇవన్ని తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. అదేంటో నా పెళ్లి గురించి నాకే చివరగా తెలుస్తుంది. మళ్లీ అవే పుకార్లు. నా పెళ్లి గురించి ఎందుకు అందరికి ఇంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. ఆ వార్తను ఇంటి పైకెక్కి అరిచి మరి అందరికి చెప్తాను. అప్పుడు దీని గురించి వార్తలు రాయండి. నేను పెళ్లి చేసుకోవడం లేదు.. సినిమాలు వదిలేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు వరలక్ష్మి.(మిమ్మల్ని మీరు నమ్మండి) Why am i the last to know that I'm getting married..??Hahahah the same nonsense rumors..why is everybody obsessed with me getting married..if I'm getting married I will shout it off the roof tops..to all u media ppl writing abt this..IM NOT GETTING MARRIED. IM NOT QUITTING FILMS pic.twitter.com/VimowM2pMR — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath) May 18, 2020 అయితే ఇన్నాళ్లు మీడియాలో విశాల్ - వరలక్ష్మిల వివాహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఈ వార్తలను ఖండించేవారు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్‌లో విశాల్‌కు అనిశా రెడ్డితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.(విశాల్... నా ఓటు కోల్పోయావ్) -
‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’
ముంబై: గత కొంతకాలంగా రాఖీసావంత్ పెళ్లిపై వస్తున్న ఊహగానాలు నిజమని తేలాయి. నిజాన్ని ఎన్ని రోజులని దాచగలమని భావించిందో ఏమో.. తన వివాహం ఓ ఎన్నారైతో జరిగిపోయిందని స్పష్టం చేసింది ఈ హాట్ బ్యూటీ రాఖీ సావంత్. ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. పైగా ఎప్పటికప్పడు వెడ్డింగ్ డ్రెస్, నిండైన పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కేవలం ఫొటోషూట్ కోసమేనంటూ ముందు బుకాయించినప్పటికీ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు. బ్రిటన్‌కు చెందిన బిజినెస్‌మాన్ రితేశ్‌ను పెళ్లి చేసుకున్నానంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘రితేశ్ నా వీరాభిమాని, ఓ ఇంటర్వ్యూలో తను నన్ను మొదటిసారిగా చూశాడు. తర్వాత మెసేజ్‌లు, కాల్స్‌తో దగ్గరయ్యాడు. ఇద్దరం మంచి మిత్రులయ్యాం. క్రమేణా మా బంధం మరింత బలపడి ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యాం. నేను జీవితాంతం తనతోనే ఉండిపోతాను. కానీ నాకింకా వీసా రాలేదు. వీసా రాగనే తనతోపాటు వెళ్లిపోతాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే టీవీ షోలో నటించాలన్న తన కోరికను నెరవేర్చుకుంటానని తెలిపింది ఈ హాట్ బ్యూటీ. కాగా వీరిద్దరూ పెళ్లికి ముందే ఏడాదిన్నరపాటు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరి మధ్య ప్రేమ బలపడటంతో ముంబైలోని ఓ హోటల్లో రాఖీసావంత్, రితేశ్‌లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను బయటికి వదలడంతో అభిమానులు పెళ్లయిపోయిందంటూ ప్రచారం చేయగా.. ఎట్టకేలకు.. ‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’ అంటూ రాఖీ సావంత్ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇక ఫ్యామిలీ ప్లానింగ్‌ను కూడా అప్పుడే నిర్ణయించేసుకున్నట్లు.. 2020లో పిల్లల్ని కనాలి అనుకుంటున్నానని రాఖీ చెప్పుకొచ్చింది. -
‘నాకింకా పెళ్లి కాలేదు’
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రాఖీ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాఖీ సావంత్, ఓ ఎన్నారైని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని, ఈ నెల 28న వీరి పెళ్లి వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్‌పై స్పందించిన రాఖీ సావంత్.. తానింకి సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఎవరితో రిలేషన్లో కూడా లేనని వెల్లడించారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ ప్రమోషన్ కోసం తాను చేసిన బ్రైడల్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram bridel shooting A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jul 29, 2019 at 2:23am PDT -
పెళ్లి వార్తలపై ఫైర్ అయిన వరలక్ష్మీ!
సాక్షి, తమిళసినిమా: వారు అనుకున్నది జరగదు అంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్.. కోలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీగా పేరొందిన వరూ.. హీరోయిన్ పాత్రలనే చేస్తానని మడికట్టుకుని కూర్చోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. మరో పక్క సేవ్ శక్తి పేరుతో సంస్థను నెలకొల్పి స్త్రీల సమస్యల గురించి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ గురించి ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరలక్ష్మి పెళ్లికి సిద్ధమైందని, ఇటీవల ఆమె వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ అవన్నీ వదంతులు లేని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. ‘ నాకు వివాహ నిశ్సితార్థం జరగలేదు. పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటి ఏ ఆధారాలు లేకుండా కొందరు పనికట్టుకుని వదంతులు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఈ రంగంలోకి పనిచేయడానికే వచ్చాను. పనీపాటా లేనివారే ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తుంటారు’ అని ఆమె మండిపడ్డారు. ‘నా కఠిన శ్రమ ఎప్పటికీ అపజయాన్ని ఇవ్వదు. నా పని నేను చేసుకుపోతున్నాను. మీరు అనుకున్నది జరగదు’ అని గాసిప్ రాయుళ్లపై ఆమె ఫైర్ అయ్యారు. వరలక్ష్మీ విశాల్‌తో కలిసి నటించిన సండైకోళి-2 చిత్రం ఈ నెల 19న, విజయ్‌తో కలిసి నటించిన సర్కార్ చిత్రం వచ్చే నెల దీపావళి సందర్భంగా తెరపైకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం కన్నిరాశి, వెల్వెట్ నగరం, అమ్మాయి, నీయా-2 తదితర చిత్రాల్లో వరూ నటిస్తున్నారు. తాజాగా బుల్లితెరపైనా ప్రత్యక్షం కానున్నారు. జయటీవీలో సామాజిక ఇతివృత్తంతో ప్రసారం కానున్న ‘ఉన్నై అరిందాళ్’ అనే కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి వార్తలపై స్పందించిన మిల్కీ బ్యూటీ
పెళ్లి వార్తలపై వరుసగా వస్తున్న రూమర్స్‌కు హీరోయిన్ తమన్నా చెక్ పెట్టారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్లో స్పందించారు. ‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్, ఇప్పుడేమో డాక్టర్.. నేనేమి భర్తల షాపింగ్ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నా పేరెంట్స్ కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం చట్ట ప్రకారం, గౌరవప్రదంగానూ మంచిది కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా’ అంటూ తమన్నా ట్వీట్ చేశారు. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్..? -
పెళ్లి కథనాలపై శ్వేతా బసు క్లారిటీ
సాక్షి, ముంబై: పెళ్లి కథనాలపై నటి శ్వేతాబసు ప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఈ మధ్య గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వివాహంపై వస్తున్న పుకార్లపై పెదవి విప్పారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో గత నాలుగేళ్లుగా స్నేహంగా ఉంటున్న ఆమె.. అతన్నే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు. మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న కథనాలు నిజమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు’ అని శ్వేత తెలిపారు. బాలీవుడ్లో ఇక్బాల్ చిత్రంతో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేత.. కొత్త బంగారు లోకంతో తెలుగువారికి చేరువయ్యారు. తర్వాత కళావర్ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కాబోయే భర్తతో రూపొందిస్తున్న కొన్ని షార్ట్ ఫిలింస్‌లో, మరికొన్ని వెబ్ సిరీస్‌లతోపాటు బాలీవుడ్‌లోనూ ఓ పొలిటికల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
రాయ్‌బరేలీ ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీ పెళ్లి!
రాయ్‌బరేలీ: సొంత పార్టీకే చెందిన యువ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం ఖరారైందంటూ నకిలీ వార్తలు గుప్పుమన్నాయి. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్, రాహుల్‌ల పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని, మే నెలలోనే పెళ్లి తంతు పూర్తవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కీలకమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్ ఉండనుండటంతో రాజకీయం వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కాగా, పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితి ఘాటుగా స్పందించారు. నేను రాఖీ కట్టే అన్నయ్య: ‘‘రాహుల్ గాంధీ నాకు పెద్దన్నలాంటి వారు. రాఖీ కూడా కడతాను. అలాంటిది మా ఇద్దరికీ పెళ్లా? అసలు ఇలాంటి ప్రచారం సాగడం నిజంగా బాధాకరం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చూసినప్పుడు మనసుకు కష్టంగా అనిపిస్తుంది’’ అని ఎమ్మెల్యే అదితి సింగ్ మీడియాతో అన్నారు. ప్రియాంకకు చాలా క్లోజ్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 29 ఏళ్ల అదితి సింగ్‌ది ప్రత్యేక స్థానం. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తిచేసిన ఆమె అనూహ్యరీతిలో రాజకీయరంగప్రవేశం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి 90వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అదితి.. రాహుల్ సోదరి ప్రియాంకతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. రాయ్‌బరేలి స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిలేశ్ సింగ్ కూతురే అదితి సింగ్. -
నాకదే ఇష్టం.. ఏ పని పెట్టుకోను: నటి
సాక్షి, చెన్నై: హీరోయిన్ అనుష్క నటించిన భాగమతి చిత్రం మంచి విజయం సాధించింది. అందంతో రంజింపజేయాలన్నా.. వీరనారిగా కత్తి పట్టి రణరంగంలో కదం తొక్కాలన్నా ఈ స్వీటికే చెల్లుతుంది. తాజాగా మాలీవుడ్లోకి ఈ ముద్దుగుమ్మ అగుడు పెట్టనుంది. సూపర్‌స్టార్ మమ్ముట్టితో ఆమె జత కట్టనున్నారు. ఆ సినిమాలో నటించడానికి నటి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా బ్యూటీ ఇచ్చిన బేటి చూద్దాం. ‘ఏ రంగం వారికైనా తమ విరామ సమయాన్ని ఏ విధంగా గడపాలో ఒక ప్రణాళిక ఉంటుంది. కొందరు ఫ్యామిలీతో, మరికొందరు స్నేహితులతో గడపాలని కోరుకుంటారు. అంతేకాక వారితో కలిసి బయట ప్రపంచంలో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నేను మాత్రం విరామం లభిస్తే ఏకాంతాన్ని కోరుకుంటాను. అదంటే నాకు చాలా ఇష్టం. విరామం దొరికితే ఏ పని పనెట్టుకోను. షూటింగ్ సమయంలో మన గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. 24 గంటలూ కథా పాత్రలోనే జీవించాల్సి ఉంటుంది. అలా ఏ మాత్రం విరామం లభించినా ఏకాంతంగా కూర్చుని నా గురించి నేను ఆలోచించుకుంటాను. నాలో నేనే మాట్లాడుకుంటాను. ఏకాంతంగా ఆలోచించే సమయంలో ఏదైనా తప్పు చేస్తే దాన్ని గ్రహించుకునే అవకాశం, సరిదిద్దుకునే మార్గం తెలుస్తోంది’ అని నటి అనుష్క పేర్కింది. -
‘సినిమాల్లోనే నటించాలా? వేరే పనులు లేవా?’
సాక్షి, చెన్నై: సినిమాల్లో నటించకపోతే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లేనా అంటూ సంచన నటి శ్రుతిహాసన్ ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యూటీ పెళ్లిపై ఇటీవల చాలానే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రుతిని తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రుతి అనూహ్యంగా నటనకు దూరం అయితే ఎవరికైనా ఏమైందనే ప్రశ్న తలెత్తడం సహజమే. అంతేకాక లండన్‌కు చెందిన బాయ్‌ఫ్రెండ్ మైఖైల్తో విందులు, విహారాలకు తిరిగారు. అందుచేత పెళ్లికి లగ్నం పెట్టేసుకుంటున్నా రేమోనన్న అనుమానం రాకమానదు. వరించిన అవకాశాన్ని కాలదన్నడం.. సంఘమిత్రలో కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడంతో శ్రుతి నట జీవితంపై రకరకాల ప్రచారానికి ఆస్కారం కలుగుతోంది. అయితే ఏ విషయంలోనైనా చాలా బోల్డ్‌గా వ్యవహరించే శ్రుతిహాసన్ తనపై వస్తున్న వదంతులపై కాస్త ఘాటుగానే స్పందించారు. వదంతులపై శ్రుతి ఫైర్.. వదంతులపై శుత్రి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నా వివాహాన్ని, సినిమాను కలిసి మాట్లాడకండి. వెండితెరపై మిమ్మల్ని చాలా కాలంగా చూడలేకపోతున్నామే, సినిమాలను వదిలేశారా ? అని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్లోనే నటించాలా ? నాకు వేరే పనులు లేవా? నా జీవితం సినిమాలతో పాటు పలు విషయాలతో ముడిపడి ఉంది. శ్రుతి పెళ్లికి సిద్ధం అవుతున్నారు వంటి ప్రచారాన్ని చేయకండి. నాకు సంగీత పరిజ్ఞానం ఉంది. అదే విధంగా నటన మాత్రమే కాక నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని’ ఆమె తెలిపారు. హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు.. అంతేకాక హీరోయిన్ కావడంపై కూడా ఆమె స్పందించారు. ’ నిజం చెప్పాలంటే నేను హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు. అవకాశం వచ్చింది చేసి చూద్దాం అని భావించాను. ఆ తర్వాత అదే దారిలో ఉన్నత స్థాయికి ఎదిగాను. ఆ స్థాయిని నిలదొక్కుకున్నాను. ఇప్పుడు మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసు ఏం చెబుతుందో అదే చేస్తాను. నటనతో పాటు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు లభించిన సమయాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను’ అని శ్రుతి హాసన్ చెప్పారు. -
'14 గంటలు ఫ్లైట్‌లో ఉంటే పెళ్లి చేసేశారు'
ఇటీవల తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. కొంత కాలంగా విమ్మీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే తనని పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ విషయంపై కాస్త ఆలస్యంగా స్పందించిన విజయ్ '14 గంటలు ఫ్లైట్ లో ఉంటే ఇండియాలో నా పెళ్లి చేసేశారంట. నా భార్య విమ్మీ పేరుతో పాటు నా ఇద్దరు పిల్లలు రమ్మీ, డమ్మీల పేర్లు ప్రస్థావించటం మీడియా మరిచిపోయింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్. ఫన్నీ గాసిప్' అంటూ కామెంట్ చేశాడు. పెళ్లి చూపులు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తరువాత ద్వారక సినిమాతోనూ పరవాలేదనిపించాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశురామ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు రాహుల్ సంక్రిత్యాన్ దర్వకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ తో పాటు, నందినీ రెడ్డి దర్వకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసేందుకు అంగీకరించాడు. -
ఫేస్బుక్లో ఆ ఇద్దరి ఫొటోలు హల్చల్
* పెళ్లయినట్లుగా ప్రచారం * ఇదంతా అసత్య ప్రచారమన్న నటి శోభా పూంజా బెంగళూరు: కన్నడ చిత్ర నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌లు వివాహం చేసుకున్నారనంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలను చూసిన ఇరువురి అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వారి ఫేస్బుక్లో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా ఇంకా చిత్రీకరణ దశలోనున్న కన్నడ చిత్రంలో నటిస్తున్న వీరిద్దరి ఫొటోలను కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీనిపై సినీ రచయిత స్పందిస్తూ తామిద్దరి ఫొటో ఎలా వైరల్ అయిందో తెలియట్లేదన్నారు. తనకు ఇదివరకే వివాహమైందని, ఇవేమి తెలియని కొంతమంది శుభా పూంజాతో తనకు వివాహమైనట్లు ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి శుభా పూంజా కూడా దీనిపై స్పందిస్తూ తనకు ఎవరితోనూ వివాహం కాలేదని, ఇది ఎవరో కావాలని తనను ఇబ్బంది పెట్టడానికి చేసిన చర్యగా ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నాగేంద్ర ప్రసాద్ తో కలిసి నటిస్తున్నానని, ఆ సినిమాలో సన్నివేశంలో భాగంగానే తామిద్దరికి పెళ్లయినట్లు నటించినట్లు శుభా పూంజా వివరణ ఇచ్చారు. -
లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్
సినీ తారలపై గాసిప్స్ సహజం. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై సెటైర్స్ వేశాడు. మీడియాలో వస్తున్న వార్తలపై తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించిన రాజ్ తరుణ్, 'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు. అయితే ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నవారికి పంచ్ ఇచ్చాడు. -
పుకార్లును తోసి పుచ్చిన సీతమ్మ
-
పెళ్లి లేదు...ఏమీలేదు: అనుష్క
చెన్నై : అందాల తార అనుష్క పెళ్లి వార్తలను ఆమె మేనేజర్ ఖండించాడు. అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊపుర్లేనని అనుష్క మేనేజర్ స్పష్టం చేశాడు. ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం అనంతరం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అనుష్క మేనేజర్ పైవిధంగా స్పందించాడు. 'బహుబలి' చిత్రం అనంతరం అనుష్క తెలుగులో 'బాగమతి' లో నటించనుంది. ఈ చిత్రానికి ఆమె గతంలోనే సైన్ చేసినట్లు మేనేజనర్ ఐఏఎన్ఎస్కు తెలిపాడు. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ 'లింగా' షూటింగ్‌తో బిజీగా ఉందన్నందున అనుష్క ....కొత్త చిత్రాలను అంగీకరించలేదని పేర్కొన్నాడు. మరోవైపు అజిత్ సినిమాలో నటిస్తున్నదని, అవన్నీ పూర్తి అయ్యేవరకూ కొత్త చిత్రాలు అంగీకరించటం లేదని తెలిపాడు. కాగా ఇటీవల ఓ దర్శకుడు అనుష్కను కలిసి కథ చెప్పారట. కథానాయిక చుట్టూ తిరిగే ఆ కథ అనుష్కకు బాగా నచ్చేసిందట. అయినా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దాంతో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే స్వీటీ పెళ్లివార్త విని అప్సెట్ అయిన అభిమానులకు అవన్నీ పుకార్లే అని తేలటం వారికి మాత్రం శుభవార్తే. (ఇంగ్లీషు కథనం కోసం) -
నాకు పెళ్లా!పెళ్లికొడుకెవరు?
‘ఏంటి?... నాకు పెళ్లా! నాకు తెలీదే... ముహూర్తం ఎప్పుడు? పెళ్లి కొడుకెవరు? ఎలా ఉంటాడు?’... ఓ కోలీవుడ్ చానల్ ఇంటర్వ్యూలో.. మీకు పెళ్లంటగా? అని ఓ జర్నలిస్ట్ అడిగితే... ఆమెపై స్వాతి సంధించిన ప్రశ్నల పరంపర ఇది. ‘నా పెళ్లి గురించి మా అమ్మానాన్నకు కూడా లేని తొందర మీడియాకు ఎక్కువైపోయింది’ అని ఆ ఇంటర్వ్యూలో మీడియాపై సెటైర్లు విసిరారు స్వాతి. ‘‘ప్రస్తుతం కెరీర్‌ని చక్కదిద్దుకోవడమే నా పని. మరిన్ని సినిమాలు చేయాలి. ‘మంచి నటి’ అనిపించుకోవాలి. అప్పుడుగానీ పెళ్లి గురించి ఆలోచించను’’ అన్నారు స్వాతి. మీ ‘పెళ్లి’ గురించి మీడియాలో వదంతులు వినిపించినప్పుడు మీకు కోపం వచ్చిందా? అనడిగితే- ‘‘కాదు నవ్వొచ్చింది. ఇంట్లోవాళ్లు కూడా హాయిగా నవ్వుకున్నారు. అయితే... పోను పోను జనాల నుంచి ప్రశ్నలెక్కువయ్యాయి. దాంతో కాస్త చిరాకనిపించింది’’ అని చెప్పారు. ఆమె నటించిన తెలుగు సినిమా ‘కార్తీకేయ’, తమిళ సినిమా ‘వడకర్రీ’ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. -
వ్యాపారితో ప్రేమేంటి?
నటి స్వాతి చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తున్నారని, వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఈ ఏడాది చివరిలో ఏడడుగులకు ముహూర్తం కుదిరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్లో కలర్స్ స్వాతిగా ప్రాచుర్యం పొందిన ఈ తెలుగమ్మాయి తమిళంలో యువ హీరోయిన్గా గుర్తింపు పొందారు. తాజాగా మాలీవుడ్లోకి రంగప్రవేశం చేసిన ఈ బహుభాషా నటికి కల్యాణ ఘడియలు దగ్గర పడినట్లు సమాచారం. తమిళంలో సుబ్రమణిపురం చిత్రం ద్వారా పరిచయమై స్వాతి ప్రస్తుతం వడకర్రి చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి అడగ్గా అదంతా అసత్యప్రచారం అంటూ కొట్టేశారు. ఇలాంటి నిరాధార వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారో గానీ తానెవరినీ ప్రేమించలేదని స్పష్టం చేశారు. అసలు తాను ఈ మధ్య కాలంలో చెన్నైకి రాలేదన్నారు. మూడు నెలల క్రితం వడకర్రి చిత్ర షూటింగ్ కోసం చెన్నై వచ్చానని చెప్పారు. అయితే ఇలాంటి వదంతులు ఇంతకు ముందు కూడా ప్రచారం అయ్యాయని, తాను చెన్నైకి వచ్చిన ప్రతి సారి ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం షూటింగ్ నిమిత్తమే చెన్నైకి వస్తానన్నారు. షూటింగ్లో పాల్గొంటే నటనపైనే తన పోకడ ఉంటుందన్నారు. ఒక వేళ ఏదైనా షాపింగ్ చెయ్యాలనుకుంటే యూనిట్‌లోని మిత్రులతో కలిసే వెళతానన్నారు. అలాంటిది ఎవరో ప్రచారం చేస్తున్నట్లు ఆ వ్యాపారవేత్తను కలుసుకునే అవకాశమెక్కడుంటుందని స్వాతి ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. -
రణబీర్ తో పెళ్లి వార్తలు అవాస్తవం: కత్రినా
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో పెళ్లివార్తలపై కత్రీనా కైఫ్ స్పందించారు. 2015లో రణబీర్, కత్రినాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి గురించి ప్లాన్స్ ఏమి లేవని.. ఈ రోజు మీడియాలో వార్త రావడం నా దృష్టికి వచ్చింది అని కత్రినా ఓ వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి గురించి ప్రస్తావన తమ మధ్యలో రాలేదు. అలాంటిదేమైనా ఉంటే.. అందరికంటే ముందే మీకు వెల్లడిస్తాను అని కత్రినా తెలిపింది. మీడియాలో వచ్చిన రూమర్లతో తనకు ఇలాంటి ఇబ్బంది లేదని.. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వార్తలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని రణబీర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
'నా పెళ్లి వార్తల్లో నిజంలేదు'
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు' సినిమాతో క్రేజ్ ను అమాంత పెంచుకున్న నటి అంజలి తనపై వచ్చిన పెళ్లి వార్తలను ఖండించింది. ఈ మధ్య అంజలి అదృశ్యం ఉదంతం వెనుక పెళ్లి జరిగిందనే వార్తలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొంది. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి సమయం వస్తే దాయాల్సిన అవసరం దేనికని' నటి అంజలి మండిపడింది. పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, తనపై ఇటువంటి పుకార్లు రావడం బాధ కల్గించదని పేర్కొంది. తన పెళ్లి వార్తను ఓ న్యూస్ పేపర్ లో చదివి షాకయ్యానని, ప్రస్తుతం షూటింగ్ లలో బిజీగా ఉన్నందున సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించానని ఆ లేఖలో పేర్కొంది. కాగా, తనకు ఇప్పటివరకూ సపోర్ట్ గా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. తాను ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఉండటానికి మీడియా కూడా ఓ కారణమేనని పేర్కొంది. ఓ తమిళ నిర్మాత మరియు అంజలి తల్లి తనను వేదిస్తున్నారంటూ కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఐదు రోజుల తర్వాత అంజలి తనంతట తానె తిరిగి వచ్చేసింది. అప్పుడు కూడా వేదింపులు భరించలేక అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు చెప్పినది. ఇదిలా ఉంటె ఆ నిర్మాత అంజలిపై తన పరువు ప్రతిష్ట లు దెబ్బతిన్నాయంటూ కేసు పెట్టాడు. అంతే కాకా తమిళ ఫిల్మ్ చాంబర్ లో కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. తన సినిమాలో నటించడానికి అంగీకరించి ఇప్పుడు డేట్స్ ఇవ్వడం లేదని తెలిపాడు. ఇవన్ని ఇలా ఉంటె అంజలి ఓ తెలుగు నిర్మాతను వివాహం చేసుకుందనే వార్తలు ఈ మధ్య గుప్పుమన్నాయి.