Lavanya Tripathi First Reaction On Rumours About Her Marriage With Varun Tej - Sakshi
Sakshi News home page

Lavanya Tripati: వరుణ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..

Published Wed, Feb 2 2022 5:42 PM | Last Updated on Thu, Feb 3 2022 7:36 AM

Lavanya Tripathi First Reaction On Marriage Rumours With Varun Tej In Live Chat - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లి రూమర్స్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ మారాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లావణ్య ఈ వార్తలపై పరోక్షంగా స్పందించినప్పటికి, నేరుగా ఇంతవరకు వరుణ్‌ తేజ్‌ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే లావణ్య తన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ షూటింగ్‌లో పాల్గొంది.

ఈ నేపథ్యంలో షూటింగ్‌ బ్రేక్‌లో లావణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌ నిర్వహించి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన డైట్‌, తన డైలి హ్యబిట్స్‌తో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో వరుణ్‌తో తేజ్‌తో తన పెళ్లి రూమర్లపై ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. దీనికి ఆమె ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చింది.  ‘నా పెళ్లి  ఎవరితో అనేది ఇంతవరకు నాకే తెలియదు. నా గురించి నాకు తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో’ అంటూ సమాధానం ఇచ్చింది.

ఆ తర్వాత అయితే మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా? ప్రశ్నించగా దీనికి లావణ్య ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. కాగా వరుణ్‌ సోదరి, నటి నిహారిక, లావణ్యలు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వ‌రుణ్‌, లావ‌ణ్య ఇద్ద‌రూ 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' చిత్రాల్లో న‌టించారు. ఆ సినిమాల స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ల‌వ్‌లో ప‌డ్డార‌ని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి. పైగా వ‌రుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావ‌ణ్య క‌నిపించ‌డంతో ఈ ఊహాగానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్లైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement