అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Lavanya Tripathi Comments On Conditions In Mega Family | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: మెగా కోడలు ట్యాగ్ అలాంటిది.. ఆ భేదాలు నాకు లేవు: లావణ్య

Jan 23 2024 12:53 PM | Updated on Jan 24 2024 10:53 AM

Lavanya Tripathi Comments On Conditions In Mega Family - Sakshi

ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే.. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్.. ఇకపై నటిస్తారా? లేదంటా ఇండస్ట్రీ టాటా చెప్పేస్తారా? అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈమె 'మిస్ ఫెర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా లావణ్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కెరీర్, అత్తారింట్లో కండీషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మెగా కోడలు ట్యాగ్ అలాంటిది
మెగా కోడలు ట్యాగ్ అనేది నటిగా తనకు బాధ్యత పెంచిందని.. లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించుకున్నానని, మెగా కోడలు అనే పేరు మాత్రం వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిందని.. ఈ పిలుపు చాలా స్పెషల్‌గా భావిస్తున‍్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. అలానే ఓటీటీ, సినిమాలు అనే భేదం తనకు లేదని.. నచ్చిన కథల్లో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు సాగుతున్నానని లావణ్య క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

నేను ఫెర్‌ఫెక్ట్ కాదు
వెబ్ సిరీస్ టైటిల్‌లానే మీరు కూడా ఫెర్‌ఫెక్టేనా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన లావణ్య.. ఫెర్‌ఫెక్షన్ కూడా ఓ సమస్య అని, దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పింది. తాను మాత్రం నిజజీవితంలో ఫెర్‌ఫెక్షనిస్ట్ కాదని స్పష్టం చేసింది. తన భర్త వరుణ్ తేజ్ మాత్రం ఫెర్‌ఫెక్షనిస్ట్ అని, అతడికి ఓసీడీ ఉందని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది.

కండీషన్స్ ఏం లేవు
సినిమాలు-కెరీర్ విషయంలో పెళ్లి తర్వాత అత్తారింట్లో కండీషన్స్ ఏమైనా పెట్టారా? అనే ప్రశ్నకు కూడా లావణ్య సమాధానమిచ్చేసింది. పాత్రల ఎంచుకునే విషయమై వరుణ్ కుటుంబుం తనకు ఎలాంటి కండీషన్స్, ఆంక్షలు పెట్టలేదని.. ఇలాంటి పాత్రలు చేయొద్దు లాంటి మాటలు కూడా తనతో అనలేదని చెప్పింది. కెరీర్ విషయంలో అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది. అలానే మంచి కథతో దొరికితే వరుణ్‌తో నటించడానికి తాను రెడీ అనే హింట్ ఇచ్చేసింది. 

(ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement