వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Renu Desai Comments On Varun Tej Lavanya Tripathi Marriage | Sakshi
Sakshi News home page

Varun Lavanya Marriage: వరుణ్-లావణ్య పెళ్లికి రేణు దేశాయ్ వెళ్లట్లేదు.. కారణమదేనా?

Published Mon, Oct 30 2023 8:05 PM | Last Updated on Mon, Oct 30 2023 8:41 PM

Renu Desai Comments On Varun Tej Lavanya Tripathi Marriage - Sakshi

మెగా ఫ్యామిలీ పెళ్లి బాజాలు మోగే టైమ్ వచ్చేసింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే కుటుంబమంతా ఇటలీకి వెళ్లిపోయారు. ఆల్రెడీ సందడి కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ వేడుకకు వెళ్లట్లేదని చెబుతూనే, దానికి కారణాన్ని కూడా బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

పెళ్లి సంగతేంటి?
దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. పెద్దల్ని ఒప్పించి ఈ జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో పెళ్లి ఉంటుందన్నారు. కానీ అది నవంబరుకి వాయిదా పడింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఇటలీ వెళ్లిపోయారు. అక్కడి ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది.

రేణు దేశాయ్ కామెంట్స్
ఈ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్.. తన భార్య అన్నా లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లిపోయాడు. అదే టైంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించాను. వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. అతడికి నా ఆశీస్సులు ఎ‍ప్పుడూ ఉంటాయి. అయితే వరుణ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. అకీరా, ఆద్య కూడా వరుణ్ పెళ్లికి వెళ్లట్లేదు' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement