మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య | Varun Tej Lavanya Tripathi First Wedding Anniversary Video | Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Tripathi: మెగా పెళ్లి ఇంత సరదాగా జరిగిందా?

Nov 2 2024 7:19 AM | Updated on Nov 2 2024 8:40 AM

Varun Tej Lavanya Tripathi First Wedding Anniversary Video

మెగాకపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి అప్పుడే పెళ్లయి ఏడాది అయిపోయింది. దీంతో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపిన క్షణాల్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. వాటన్నింటిని ఒకటిన్నర నిమిషంలోనే చాలా చక్కగా చూపించారు.

(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)

వరుణ్ తేజ్.. లావణ్య గురించి చెప్పడం, అలానే లావణ్య.. వరుణ్‌ని 'హే మిస్టర్' అని పిలవడం లాంటి విజువల్స్ బాగున్నాయి. ఈ వీడియోలోనే హల్దీ, పెళ్లికి సంబంధించిన అన్నింటినీ చూపించేశారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం లాంటివి కూడా భలే అనిపించాయి.

రీసెంట్‌గా వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి వరుణ్-లావణ్య స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చారు. దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలానే  పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్యకు వరుణ్ విషెస్ కూడా చెప్పాడు. సరే ఇదంతా పక్కనబెడితే వరుణ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. దీనిపై ఈ మెగా హీరో బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement