ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు | Here's The List Of 15 New Movies And Web Series Releasing In OTT On This Friday November 1st 2024 | Sakshi
Sakshi News home page

Friday OTT Movie Releases: ఒక్కరోజే ఓటీటీలోకి ఏకంగా 15 మూవీస్.. అవి ఏంటంటే?

Nov 1 2024 8:33 AM | Updated on Nov 1 2024 9:39 AM

OTT Movies Telugu This Friday November 1st 2024

దీపావళిని దేశవ్యాప్తంగా అందరూ గ్రాండ్‪‌గా జరుపుకొన్నారు. పండగ రోజే తెలుగు, డబ్బింగ్ మూవీస్ కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు వీకెండ్ వచ్చేసింది. ఇందుకు తగ్గట్లే ఓటీటీల్లోకి కూడా క్రేజీ మూవీస్ వచ్చేశాయి. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విశ్వం, కలి అనే తెలుగు చిత్రాలతో పాటు హిట్లర్, లబ్బర్ పందు అనే డబ్బింగ్ మూవీస్.. యుధ్రా అనే హిందీ చిత్రం ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'తంగలాన్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దీపావళికి రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పారు. కానీ ఇందులో కాకుండా ఆస్ట్రో మూవీస్ అనే మరో ఓటీటీలో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వచ్చింది. అది కూడా భారత్‌లో స్ట్రీమింగ్ కావట్లేదు.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (నవంబర్ 1st)

అమెజాన్ ప్రైమ్

  • విశ్వం - తెలుగు సినిమా

  • సూరజ్ సూదేశ్ మూవీ - మలయాళ మూవీ

  • సత్తం ఎన్ కయిల్ - తమిళ సినిమా

  • ఇబ్బని తబ్బిడ ఇలయాలీ - కన్నడ మూవీ

  • బ్లాక్ - తమిళ సినిమా

  • ఫ్రీడమ్ - ఫ్రెంచ్ చిత్రం

  • యుధ్రా - హిందీ సినిమా (రెంట్ విధానం)

  • హిట్లర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • లెట్ గో - స్వీడిష్ సినిమా

  • ఇట్స్ ఆల్ ఓవర్ - స్పానిష్ సినిమా

  • బార్బీ మిస్టరీస్ - ఇంగ్లీష్ సిరీస్

హాట్‌స్టార్

  • మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ - ఇంగ్లీష్ సినిమా

  • లబ్బర్ పందు - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ఎక్స్‌ప్లోరర్: ఎండ్యురెన్స్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 3)

ఆహా

  • అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • కలి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

జియో సినిమా

  • దస్ జూన్ కి రాత్: చాప్టర్ 2 - హిందీ సిరీస్

జీ5

  • మిథ్య: ద డార్క్ చాప్టర్ - హిందీ సిరీస్

ఆస్ట్రో మూవీస్

  • తంగలాన్ - తమిళ మూవీ

  • అంధగన్ - తమిళ సినిమా

(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement