ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్ | Amy Jackson Announces Pregnancy With Ed Westwick, Baby Bump Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Amy Jackson Baby Bump Photos: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు

Published Fri, Nov 1 2024 7:52 AM | Last Updated on Fri, Nov 1 2024 9:05 AM

Amy Jackson Pregnancy With Ed Westwick Pics Viral

తెలుగులో 'ఎవడు' సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమీ జాక్సన్ మరోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)

బ్రిటీష్ మోడల్ కమ్ యాక్టర్ అయిన ఈమె.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. మన దక్షిణాదిలో ఎవడు, రోబో 2, ఐ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే అనుకున్నంతగా ఫేమ్ రాకపోవడంతో కొన్నేళ్ల  క్రితం జార్జ్ పయనెట్టు అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వీళ్లకు కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు ఐదేళ్లు. అయితే 2022లో అమీ-జార్జ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.

జార్జ్ నుంచి విడిపోయిన తర్వాత అమీ.. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేసింది. 2022 నుంచి వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలైన పూర్తి కాలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ పిక్స్ చూస్తుంటే త్వరలో మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement