Evadu movie
-
మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
నటి అమీ జాక్సన్ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ (Ed Westwick)ను నటి అమీ జాక్సన్ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు 'ఆస్కార్ అలెగ్జాండర్' అని నామకరణం చేశారు.చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో 'ఎవడు' సినిమాలో హీరోయిన్గా చేసిన అమీ జాక్సన్ మరోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్తో ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)బ్రిటీష్ మోడల్ కమ్ యాక్టర్ అయిన ఈమె.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. మన దక్షిణాదిలో ఎవడు, రోబో 2, ఐ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే అనుకున్నంతగా ఫేమ్ రాకపోవడంతో కొన్నేళ్ల క్రితం జార్జ్ పయనెట్టు అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వీళ్లకు కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు ఐదేళ్లు. అయితే 2022లో అమీ-జార్జ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.జార్జ్ నుంచి విడిపోయిన తర్వాత అమీ.. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్తో డేటింగ్ చేసింది. 2022 నుంచి వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు నెలలైన పూర్తి కాలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ పిక్స్ చూస్తుంటే త్వరలో మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ) -
హీరో రాంచరణ్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ‘ఎవడు’ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కోనేరు నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో రాంచరణ్తేజ, నిర్మాతలపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసును కొట్టివేయాలని రాంచరణ్తేజ, దిల్రాజు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కేజీ శంకర్ సోమవారం విచారించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)