
నటి అమీ జాక్సన్ మరోసారి తల్లయ్యారు. రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించారు. 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. వారి ప్రేమకు గుర్తుగా 'ఆండ్రూ' అనే బాబుకు జన్మనిచ్చారు. ఆయనతో విడిపోయిన తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ (Ed Westwick)ను నటి అమీ జాక్సన్ (Amy Jackson) ప్రేమించి గత ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులకు జన్మించిన బిడ్డకు 'ఆస్కార్ అలెగ్జాండర్' అని నామకరణం చేశారు.

చిత్రపరిశ్రమలో ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమీ జాక్సన్ సుపరిచితమే అని తెలిసిందే. ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ పెళ్లికాకుండానే 'ఆండ్రూ' అనే కుమారుడికి మొదట జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత 2020లో పెళ్లి చేసుకుంటామని వారు ప్రకటించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది.
ఇంతలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను ప్రేమించి 2024లో వివాహ బంధంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఆమె జీవిత ప్రయాణం సంతోషంగా ఉంటుందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment