List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage - Sakshi
Sakshi News home page

Celebrities Pregnant Before Marriage: పెళ్లి కాకుండానే తల్లైన స్టార్‌ హీరోయిన్స్‌ వీళ్లే..

Published Thu, Nov 25 2021 6:36 PM | Last Updated on Fri, Nov 26 2021 10:54 AM

List Of Popular Actresses Who Got Pregnant Before Marriage - Sakshi

List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్‌ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం​ మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్‌ హీరోయిన్స్‌ ఎవరో చూసేయండి..


శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జ‌రిగే స‌మ‌యానికి శ్రీదేవి ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. 

సారిక
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్‌ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

రేణు దేశాయ్‌
బద్రీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్‌ ఆ సినిమా సమయంలోనే పవన్‌కల్యాణ్‌తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే  2009 లో  వీరిద్దరూ  పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు.

అమీ జాక్సన్‌
ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్‌. బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్‌ అనంతరం తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించిన అమీ జాక్సన్‌ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. 

నీనా గుప్తా
బాలీవుడ్‌ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్‌ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్‌ మథర్‌గానే మసాబాను పెంచింది నానా గుప్తా. 

కల్కి కొచ్లిన్‌
బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది.  తర్వాత హర్ష్‌ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది.

దియా మీర్జా
బాలీవుడ్‌ భామ దియా మీర్జా వైభవ్‌ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.



నటాషా 
బాలీవుడ్‌ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement