Dia Mirza
-
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
రేపు నువ్వే నాకు తల్లిగా నటిస్తావ్.. హీరోయిన్ను ఏడిపించిన హీరో
ఇప్పుడు నా పక్కన హీరోయిన్గా చేస్తున్నావ్ కానీ, తర్వాత నాకు తల్లిగా కూడా నటిస్తావ్.. అంటూ కథానాయిక దియా మీర్జాను ఏడిపించాడట సల్మాన్ ఖాన్. వీరిద్దరూ తుమ్కో నా భూల్ పయేంగే (2002) అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆనాటి జ్ఞాపకాలను దియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. అప్పట్లో హీరోయిన్.. ఇప్పుడు తల్లి!ఆమె మాట్లాడుతూ.. తుమ్కో నా భూల్ పయేంగే సినిమా షూటింగ్లో సల్మాన్‌కు తల్లిగా యాక్ట్ చేసిన నటి తన షాట్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు సల్మాన్ నా దగ్గరకు వచ్చి.. ఆమె గతంలో అతడి సినిమాలో హీరోయిన్గా నటించిందన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అస్సలు నమ్మలేదు. దీంతో అతడు.. అవును, మొదట్లో నా పక్కన హీరోయిన్గా చేసిందని నొక్కి చెప్పాడు.ఆ రోజు రాకూడదని కోరుకున్నా..నీ వయసులో ఉన్న నటి నీకు తల్లిగా నటించడమేంటని షాకయ్యాను. అతడు మాత్రం.. ఏదో ఒక రోజు నువ్వు కూడా నా తల్లి పాత్రలో యాక్ట్ చేస్తావ్ అన్నాడు. అలాంటి రోజు రాకూడదని కోరుకున్నాను. ఈ సంఘటన నేను ఎన్నటికీ మర్చిపోలేను. కానీ సల్మాన్ చాలా సరదా మనిషి. అప్పట్లో సెట్లో ఆడవాళ్లు తక్కువగా ఉండేవాళ్లు. ఆ సమయంలో నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చింది.ఎవరీ దియా?ఇకపోతే దియా మీర్జా.. రెహనా హై తేరే దిల్ మే, దమ్, తెహజీబ్, పరిణీత, దస్, ఫైట్ క్లబ్ మెంబర్స్ ఓన్లీ, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంజు, థప్పడ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా.. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో మెరిసింది.చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
Dia Mirza: చీరలో మహారాణిలా వెలిగిపోతున్న దియా మీర్జా (ఫోటోలు)
-
'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్‌గా పీవీ సింధు..
గత 18 ఏళ్లగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ 'ఎర్త్ అవర్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024కు గాను'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికైంది. మార్చి7న అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన సింధు.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగహన కల్పించే పనిలో పడింది. తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్ దియా మీర్జా, హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్ 'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్లగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘు దీక్షిత్ మాట్లాడుతూ.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యవరాణాన్ని రక్షించేందుకు మనమందరం ఏకం కావల్సిన సమయం అసన్నమైంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవహగహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. సహజ వనరులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరది. కాబట్టి అందరూ గంట సమయం పాటు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగమవుతరాని ఆశిస్తున్నానని" పేర్కొన్నాడు. చాలా సంతోషంగా ఉంది.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది .ఈ ప్రాతిష్టత్మక ఈవెంట్లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు ధన్యవాదాలు. ప్రతీ ఏడాది కూడా నేను ఈ ఎర్త్‌అవర్ కార్యక్రమంలో పాల్గోంటున్నాను. గతం కంటే ఈసారి ఎక్కువమంది ఈ కార్యక్రమంలో భాగమవుతారని ఆశిస్తున్నాను. నా వరకు అయితే ఈ ఏడాది అన్ని లైట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఒక గంట పాటు ఆపివేసి, నా కుటుంబంతో కలిసి క్యాండిల్‌లైట్ డిన్నర్ చేస్తాను. పర్యావరణాన్ని, ఈ భూమిని కాపాడే బాధ్యత మనందరది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను వాడడం మానేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో మేలు చేస్తోంది. ప్రతీ ఏడాది ఒక గంట మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని" దీయా మీర్జా పేర్కొంది. దుల్కర్ సల్మాన్ సైతం ఎర్త్ అవర్ గుడ్‌విల్ అంబాసిండర్‌గా ఎంపికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు అందరూ గంట సేపు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగం కావాలని అభిమానులను దుల్కర్ కోరాడు. అస్సలు ఏంటి ఈ ఎర్త్ అవర్? కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సుమారు 187 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేసి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందే ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది. అంటే మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుంచి 9: 30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా దియా మీర్జా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్, నటి, నిర్మాతగా రాణించింది. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెలిచింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా.. దియా మీర్జా ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. రహ్నా హై తేరే దిల్ మే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమె ఆర్ మాధవన్ సరసన నటించింది. ఆ తర్వాత సంజు, తప్పడ్, భీడ్ లాంటి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: నటుడితో విభేదాలు.. మరొకరితో లవ్‌లో పడ్డ నవాజుద్దీన్ భార్య!) కాగా.. 2019లో నిర్మాత సాహిల్ సంఘాను దియా మీర్జా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులిచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ అబ్బాయి జన్మించారు. దియా చివరిసారిగా భీఢ్ చిత్రంలో కనిపించింది. అయితే వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా మీర్జా స్కూల్ డేస్‌లో జరిగిన మొదటి క్రష్ గురించి వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన దియా.. స్కూల్లో భాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని తెలిపింది. తనను మోసం చేసినందుకు స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. దియా మాట్లాడుతూ.. 'నా సీనియర్ స్కూల్లో నాకంటే రెండేళ్లు పెద్ద. నేను అతనిపై విపరీతమైన ప్రేమ. కానీ ఈ విషయాన్ని అతనికి చెప్పలేదు. నేను అతన్ని ఇష్టపడ్డానని ఎలా తెలిసిందో నాకు తెలియదు. ప్రతి రోజూ మా ఇంటికి ఫోను చేసి ఐ లవ్ యు చెప్పడానికే కాల్ చేశా అనేవాడు. అది విని చాలా సంతోషించా. అతను నన్ను కూడా ప్రేమిస్తున్నాడని అనుకున్నా. మేము స్కూల్లో ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవాళ్లం. కానీ అతను నా బెస్ట్ ఫ్రెండ్‌తో కూడా అదే పని చేస్తున్నాడని తెలిసింది. దీంతో మేం నేరుగా ప్రిన్సిపాల్ కార్యాలయానికి వెళ్లాం. అతనిపై ఇద్దరం ఫిర్యాదు చేశాం.' అంటూ తెలిపింది. కాగా.. దియా ప్రస్తుతం తరుణ్ దూదేజా దర్శకత్వం వహించిన ధక్ ధక్‌లో నటిస్తోంది. ఇందులో రత్న పాఠక్ షా, ఫాతిమా సనా, సంజన సంఘీ నటిస్తున్నారు. (ఇది చదవండి: ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?) -
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
కీరవాణి పాటలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశా: హీరోయిన్
2000 సంవత్సరంలో మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకోవడానికి ముందు దియా మీర్జా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ కిరీటం అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయింది దియా. అయితే దీనికంటే ముందు ఆమె ఓ తమిళ సినిమాలో కూడా నటించింది. కాకపోతే ఎటువంటి ప్రాధాన్యత లేని ఓ చిన్న పాత్రలో! తాజాగా ఈ విషయాన్ని దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. '1999లో ఎన్ శ్వాస కాట్రే అనే తమిళ చిత్రం చేశాను. కేఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో జుంబలక్కా అనే పాటలో హీరోయిన్ ఫ్రెండ్‌గా, సైడ్ డ్యాన్సర్‌గా నటించాను. సరిగ్గా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్ట్రాగా ఉన్నాను. నాకు డబ్బులవసరం కావడంతో ఈ సాంగ్ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంతా ఎంతో బాగా జరిగింది. నాకు బాగానే డబ్బులిచ్చారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు' అని చెప్పుకొచ్చింది. తర్వాతి ఏడాది మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకున్న తర్వాత దియా మీర్జా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెహనా హై తేరే దిల్ మే, దీవానాపన్, దమ్, లగే రహో మున్నా భాయ్ వంటి పలు చిత్రాలు చేసింది. తెలుగులో వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది. ఇటీవల రిలీజైన భీద్లోనూ మెరిసింది. -
హోటల్ గదిలో హీరోయిన్ల వీడియోలు లీక్ కావడం చూసి షాకయ్యా : నటి
సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వాళ్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతుంటాయి. మొన్నటికి మొన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలువురు హీరో, హీరోయిన్ల హోటల్ రూమ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తాను. గతంలో హీరోయిన్స్ బాత్రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో భయపడ్డాను. అప్పటి నుంచి ఓ హోటల్‌కి వెళ్లినా అక్కడ రహస్య కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతాను. నేను వచ్చాకే రూమ్ కేటాయించమని చెబుతాను' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దియామీర్జా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 2001లో రెహనా హై టెర్రే దిల్ మే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన దియా మీర్జా తెలుగులో వైల్డ్ డాగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ మేనకోడలు దుర్మరణం.. ఎమోషనల్‌గా పోస్ట్
Dia Mirza Niece Tanya Kakade Dies At Car Accident In Hyderabad: ప్రముఖ మోడల్, హీరోయిన్, నిర్మాత దియా మీర్జా పుట్టింది హైదరాబాద్‌లో అయిన బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్ గెలుచుకున్న దియా.. సంజు, తప్పడ్, కుర్బాన్, లగే రహో మున్నాభాయ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో కూడా నటించింది దియా మీర్జా. అయితే దియా మీర్జా కుటుంబానికి సోమవారం (ఆగస్టు 1) ఎంతో విషాదకరమైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో దియా మీర్జా మేనకోడలు తాన్యా కక్డే మృతిచెందింది. ఆమె మరణవార్తను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చంది దియా. 'నా కోడలు. నా బిడ్డ. నా ప్రాణం ఇక లేదు. తను స్వర్గానికి వెళ్లింది. నువ్ ఎక్కడున్న శాంతి, ప్రేమను పొందుతావని ఆశీస్తున్నాను. నువ్ ఎప్పుడూ మా హృదయాల్లో చిరు నవ్వు నింపేదానివి. నీ ఆట, పాట, చిరునవ్వు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి' అని భావోద్వేగంగా రాసుకొచ్చింది దియా మీర్జా. చదవండి: హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) కాగా తాన్యా కక్డే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరో నలుగురు స్నేహితులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఆస్పుత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తాన్యా మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల తాన్యా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? #NewProfilePic pic.twitter.com/8syvsi22Mw — Mohammed Feroz Khan (@ferozkhaninc) June 6, 2022 View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) View this post on Instagram A post shared by Tanya Kakde (@tanyaakakade) -
మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట. ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official — Dia Mirza (@deespeak) May 20, 2022 -
చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్
Dia Mirza Emotional Post About Her Son Premature Birth: 2021 సంవత్సరం వెళ్లిపోయి న్యూ ఇయర్ 2022 రాబోతుంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు ఈ ఏడాది తమ జీవితంలో ఏర్పడిన విశేషాలు, కలిగిన కష్టాలు, బాధలను పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా శుక్రవారం (డిసెంబర్ 31)న 2021లోని మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను తల్లిగా మార్చిన ఈ ఇయర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది దియా. ఈ ఏడాది అంతులేని ఆనందాన్ని పొందానని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లో 'ఈ సంవత్సరం చావు అంచుల వరకు వెళ్లినా కూడా అంతులేని ఆనందాన్ని పొందాను. నా కొడుకు నెలలను నిండక ముందే పుట్టి కొన్ని పరీక్షలు పెట్టాడు. కానీ పాఠాలు నేర్చుకున్నాను. గొప్ప పాఠం. కష్టతరమైన కాలాన్ని అనుభవించా.' అని రాసుకొచ్చింది. అయితే దియా కుమారుడు అవ్యాన్ ఆజాద్ రేఖీ అత్యవసర పరిస్థుతుల వల్ల నెలలు నిండకముందే జన్మించాడు. మే 15న నియోనాటల్ ఐసీయూలో సీ-సెక్షన్ ద్వారా అవ్యాన్‌కు జన్మనిచ్చింది దియా. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. 'నా గర్భధారణ సమయంలో ఆకస్మిక అపెండెక్టమీ తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది చాలా ప్రమాదకరమైనది అని వైద్యులు తెలిపారు. వైద్యుల సకాలంలో స్పందించడంతో నా కొడుకుకు సురక్షితంగా జన్మనివ్వగలిగాను.' అని 40 ఏళ్ల దియా జూలైలో తెలిపింది. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్.. -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్‌కల్యాణ్‌తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
ప్రిన్సెస్‌లా హమీదా..స్పెషల్ ఏంటో చెప్పిన దియా
► ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న హమీదా ► తాను ఎలా రెడీ అవుతుందో వీడియో షేర్ చేసిన మలైకా ► చేనేత దుస్తుల్ స్పెషాలిటీ వివరించిన దియా మీర్జా View this post on Instagram A post shared by Hamida Khatoon ❄️ (@hamida_khatoon_official) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
ఫిబ్రవరిలో నటి పెళ్లి, మేలో మగబిడ్డకు జననం!
Dia Mirza Welcome Baby Boy: బాలీవుడ్ భామ దియా మీర్జా తన అభిమానులకు శుభవార్త తెలిపింది. ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా పసివాడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాబుకు 'అవ్యాన్ ఆజాద్ రేఖి' అని నామకరణం చేస్తున్నట్లు వెల్లడించింది. "మా బాబు అవ్యాన్ మే 14న పుట్టాడు. అనుకున్న సమయానికంటే చాలా ముందుగానే జన్మించాడు. కానీ అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. ఇప్పుడతడు క్షేమంగానే ఉన్నాడు. త్వరలోనే మా ఇంట్లోకి రాబోతున్న ఈ బుడ్డోడిని ఎత్తుకునేందుకు అవ్యాన్ అక్కతోపాటు, అతడి నానమ్మతాతయ్యలు కూడా తెగ ఎదురు చూస్తున్నారు" అని నటి చెప్పుకొచ్చింది. తల్లైన దియా మీర్జాకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా దియా మీర్జా గతంలో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లాడింది. ఐదేళ్ల ప్రయాణం తర్వాత విడాకుల ద్వారా అతడితో తెగదింపులు చేసుకుంది. అనంతరం ఆమె వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఫిబ్రవరి 15న ముంబైలో ఘనంగా జరిగింది. ఇక పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయాన్ని కూడా ఆమె నిర్మొహమాటంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే దియా మీర్జా ఇటీవలే కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్ డాగ్' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) -
Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!
జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఏనుగును చూసిన ఓ పులి తుర్రున పారిపోయింది. దారికి అడ్డంగా పడుకుని సేదతీరుతున్న ఓ పులి.. అదే దారిలో వస్తున్న ఏనుగును చూసి పిల్లిలా తప్పుకుంది. 21 సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో ఏనుగు తన మార్గంలో తాను నడుచుకుంటూ వస్తుంది. ఇక రెండూ భీకరంగా తలపడుతాయేమోనని.. అని చాలామంది అనుకుంటారు. కానీ వెనుక నుంచి వస్తున్న ఏనుగును చూసిన పులి.. లేచి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. దీంతో ఏనుగు దర్జాగా తన దారి గుండా వెళ్లింది. ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా.. "చివరి వరకు ఆగి.. ఏం జరిగిందో మీరూ చూడండి" అనే ట్యాగ్‌తో ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఎవరు తీశారో అతడి కోసం వెతకండి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పటివరకు దీన్ని లక్ష మందికి పైగా నెటిజన్లు వీక్షించగా.. 5300 మంది లైక్ కొట్టారు. దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ స్పందిస్తూ.."ఏనుగు అడవికి ప్రభువు" అని నేను ఎప్పుడూ చెబుతున్నాను.. అతనికి వ్యతిరేకంగా ఎవరూ నిలువరు "అని కామెంట్ చేశారు. ఇక పులులు చాలా వరకు ఏనుగు వంటి పెద్ద జంతువులను వేటాడవు. సాధారణంగా జింకలు, కోతులు, పందుల వంటి వాటిని వేటాడుతాయి. Watch what happens at the end! @SanctuaryAsia is looking for the person who captured this video. Kindly share in comments 💚 @BittuSahgal @vivek4wild @wti_org_india pic.twitter.com/H2FbIE2xYv — Dia Mirza (@deespeak) May 28, 2021 (చదవండి: విషాదం: పేలిన గ్యాస్ సిలిండర్.. ఏడుగురి మృతి) -
ప్రెగ్నెన్సీ మహిళలు వాక్సిన్ తీసుకోవచ్చా?, బాలీవుడ్ భామ క్లారిటీ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మొదట్లో వ్యాక్సిన్‌పై అపోహలు వచ్చినప్పటికీ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ప్రజలు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీనీ, క్రీడా ప్రముఖులు వరుసగా వాక్సీన్ తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా ట్వీటర్ ద్వారా వ్యాక్సిన్ గురించి ఓ ఆసక్తికర సమాచారాన్ని అందించింది. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. విదేశాల్లో తీసుకుంటున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఇంత వరకు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దియా మీర్జా ట్విటర్ వేదికగా తనకు తెలిసిన సమాచారాన్ని అందించారు. గర్బవతులు వ్యాక్సిన్ తీసుకోకూడదని ఆమె సూచించారు. ప్రెగ్నెంట్స్ కాకుండా పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని కోరారు. ప్రెగ్నెంట్, పాలిచ్చే మాతృమూర్తులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై క్లినికల్ ట్రయల్స్ జరుగలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యేంత వరకు వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అంటూ దియా మిర్జా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే దియా మీర్జా గర్భవతిగా ఉన్నట్లు ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. This is really important. Must read and also note that none of the vaccinations currently being used in India have been tested on pregnant and lactating mothers. My doctor says we cannot take these vaccines until required clinical trials have been done. https://t.co/eDtccY54Z1 — Dia Mirza (@deespeak) May 16, 2021 -
పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. అంతలోనే గర్భవతినని తెలిసింది!
దియా మీర్జా.. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ.. అటు కెరీర్ పరంగానూ మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన నాగార్జున వైల్డ్‌డాగ్ మూవీతో తెలుగు తెరపై సందడి చేసిన ఈ హైదరాబాదీ, శుక్రవారం ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాను త్వరలోనే తల్లికాబోతున్నానని, మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న దియా మీర్జా, ఈ విషయం తెలియజేయగానే, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అన్న సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె వద్ద ప్రస్తావించారు నెటిజన్లు. ‘‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. అయితే, మహిళా పూజారి సమక్షంలో, ఆమె చదువుతున్న వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని అనాదిగా ఆచరిస్తున్న కట్టుబాట్లను తెంచుకుని పురోగమిస్తున్నానని చెప్పిన ఓ మహిళ, పెళ్లికి ముందే గర్భవతినని ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్లైన తర్వాతే గర్భం దాల్చాలనే కట్టుబాటును ఆమె అనుసరిస్తున్నారా? వివాహానికి ముందే అమ్మతనాన్ని ఆస్వాదిస్తే తప్పా? అని ఓ ఇన్‌స్టా యూజర్ ప్రశ్నలు సంధించారు. ఇందుకు బదులిచ్చిన దియా.. ‘‘మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు. ఇక ఈ విషయం వివాహానికి ముందే ప్రకటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. అందుకే చెప్పలేదు. నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది. ఇలాంటి ఒకరోజు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు నా కల నెరవేరింది. మీరనుకుంటున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఇతర ఉద్దేశం లేదు’’ అని కుండబద్దలుకొట్టారు. ఇక బిడ్డను కనడం జీవితానికి గొప్ప బహుమతి అన్న దియా.. అది, పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత అన్న విషయం పూర్తిగా వ్యక్తిగతం అని, సదరు మహిళ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని, ఇందుకు సమాజం ఏమనుకుంటుందోనన్న భయాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. కాగా తొలుత, నిర్మాత సాహిల్ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం డివోర్సీ అయిన వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో జరిగింది. చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా Wild Dog Movie Review: విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ అదిరింది -
`వైల్డ్ డాగ్`మూవీపై సమంత రివ్యూ
హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తాజాగా నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్`మూవీపై రివ్యూ ఇచ్చింది. చాలాకాలంగా మంచి యాక్షన్ చిత్రాలను మిస్సవుతున్నానని ఆ లోటును 'వైల్డ్ డాగ్' చిత్రం తీర్చిందని తెలిపింది. ఎమోషనల్, యాక్షన్‌తో హాలీవుడ్ స్టయిల్లో ఈ సినిమా ఉందని చెప్పింది. ఏసీపీ విజయ్‌వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరు చేయలేరని తన మామగారిపై ప్రశంసల వర్షం కురిపించింది. నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్` శుక్రవారం(ఏప్రిల్2)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించగా ఆయన సరసన దియా మీర్జా నటించారు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చదవండి: Wild Dog Movie Review: విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ అదిరింది ‘వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. Just watched #WildDog .. it is fantastic 🔥🔥🔥... I really have been missing a good action flick .. and I got a Hollywood style ,kickass power packed, emotional, edge of your seat kinda action film .. Just watch it 🙌.. @iamnagarjuna no one else could have pulled this off 🤗❤️ — Samantha Akkineni (@Samanthaprabhu2) April 1, 2021 -
‘వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఇక యూఎస్ఏలో కూడా వైల్డ్ డాగ్ హవా కొనసాగుతుంది. తొలి రోజే అక్కడ 3,967 డాలర్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 1.2 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల బిజినెస్ చేసిందట. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి ఈ సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. సేఫ్‌లో జోన్లోకి వెళ్లాలంటే ఇంకా 5.5 కోట్లు వసూలు చేయాల్సింది. అయితే ఈ లక్ష్యాన్ని నాగార్జున ఛేదిస్తాడా అనేది ఈ వీకెండ్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా అదరగొట్టాడు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు. చదవండి: వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్ -
'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ
టైటిల్ : వైల్డ్‌డాగ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితురులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : అహిషోర్ సాల్మన్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : షానిల్ డియో విడుదల తేది : ఏప్రిల్ 02,2021 వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగ్.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించిందా? కింగ్ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం. కథ విజయ్ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్మెంట్లో ఆయన్ను అంతా ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసి సస్పెండ్ అవుతాడు విజయ్ వర్మ. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్ (అతుల్ కులకర్ణి).. సస్పెండ్ అయిన ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టేకప్ చేస్తాడు. తన టీమ్‌తో కలిసి విజయ్‌వర్మ బాంబు బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ను మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్ఐఏ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్ లీడ్ చేస్తున్న ఎన్ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్ అయిన ఆర్యా పండిట్ (సయామీ ఖేర్)ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ. నటీనటులు ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జున. ‘వైల్డ్‌డాగ్’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగ్. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్లో అదరగొట్టాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ జీవించేసింది. చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మీర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ సీరియస్ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్ ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాగార్జున నటన తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ అంశాలు లేకపోవడం ఫస్టాఫ్ -అంజి శెట్టె -
నా సగం కల పూర్తయింది.. ఇంకో సగం మిగిలి ఉంది
‘‘నేను తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. నాకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ఇదొక కారణం కావొచ్చు. ‘వైల్డ్‌డాగ్’ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని అన్నారు దియా మిర్జా. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ïకీలక పాత్ర చేసిన దియా మిర్జా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన సంగతులు. ‘వైల్డ్‌డాగ్’కథ, నాగ్ సార్, డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూసి ఈ సినిమా ఒప్పుకున్నాను. చాలా సంవత్సరాలుగా నాగ్ సార్ ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. నా చిన్నప్పుడు సుప్రియ (నాగార్జున మేనకోడలు, నటి–నిర్మాత) బొమ్మలతో నేను ఆడుకున్నాను. నా ఫస్ట్ కిచెన్ సెట్ సుప్రియదే. నాగ్ సార్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్. సినిమాలో ఆయనతో నా రిలేషన్ కథను ముందుకు తీసుకువెళ్తుంది. నేను తెలుగు అర్థం చేసుకోగలను. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. నా పాత ఇంటర్వ్యూలను గమనిస్తే నా ఫేవరెట్ యాక్టర్స్ నాగ్ సార్, వెంకీ సార్ అని చెప్పేదాన్ని. ఇప్పుడు నాగ్ సార్‌తో నటించాను. నా సగం కల పూర్తయింది. ఇంకో సగం మిగిలి ఉంది (నవ్వుతూ). ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్స్, స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. వీరందరికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కోణాల్లో ఆలోచించి కథల విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఓటీటీకి ఉండదు. -
హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి దియా మీర్జా ఇటీవలె రెండో పెళ్లి చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ముంబై బాంద్రాలోని నివాసంలో అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత భర్త వైభవ్‌తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ సందర్భంగా మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్న నటి..అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 'ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. స్వర్గంలా ఉన్నట్లుంది' అంటూ మాల్దీవులపై మనసు పారేసుకుంది. భర్తతో కలిసి మాల్దీవుల్లో సేద తీరుతున్న దియా..అక్కడి అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2014లో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడిపోయారు. తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భర్తతో విడాకుల అనంతరం వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైభవ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కాగా, దియా కంటే అతను నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె మెదటిసారి నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) చదవండి : రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్ -
సోషల్ హల్చల్: నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ..
♦ ఫొటో పిచ్చ పర్ఫెక్ట్గా వచ్చిందంటున్న పాయల్ రాజ్‌పుత్ ♦ ఫోనులో ఊసులాడుతున్న హెబ్బా పటేల్ ♦ ఓరకన్నుతో చంపేస్తోన్న 'డీ కంపెనీ' నటి నైనా గంగూలీ ♦ చమక్కుమని మెరుస్తోన్న కాజల్ ♦ ఫన్ టైమ్ అంటూ నాలుక బయటపెట్టిన శిల్పా శెట్టి ♦ నాజూకు సొగసుతో కైపెక్కిస్తోన్న కియారా అద్వానీ ♦ పచ్చని చెట్ల మధ్య పూల చీర కట్టుకున్న దియా మీర్జా ♦ మగత నిద్రలోకి జారుకున్నట్లు పోజిచ్చిన అదితి రావు హైదరీ ♦ పచ్చటి పైరు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న వితికా శెరు ♦ రెడ్ డ్రెస్సులో ప్రియమణిని చూసి అనాల్సిందే.. షీ సో క్యూట్.. షీ సో హాట్.. ♦ గాల్లోకి చూస్తూ కుర్రకారులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్న సంజీదా షైక్ View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) -
‘వైల్డ్ డాగ్’ మూవీ మీడియా సమావేశం
-
అప్పుడు డిప్రెస్ అయ్యా!
‘‘వైల్డ్ డాగ్’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను డీటీఎస్ సౌండ్‌లో పెద్ద తెరపై చూస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందుతారు. పైగా థియేటర్లు తెరవడం, ప్రేక్షకులు కూడా వస్తుండటంతో మా సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘వైల్డ్ డాగ్’ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాం. 37 ఏళ్లుగా షూటింగ్‌లతో బిజీగా ఉండేవాణ్ణి. లాక్డౌన్ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే సమయం దొరికింది. కానీ షూటింగ్‌లు లేకపోవడంతో డిప్రెషన్ గా అనిపించింది. నా జీవితంలో నుంచి 2020 తీసేశాను. ‘ఊపిరి’ చిత్రం సమయంలో సాల్మన్ ప్రతిభను గుర్తించాను. సాల్మన్ తో సినిమా చేద్దామని నిరంజన్ రెడ్డి అనగానే ఓకే అన్నాను. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా ఉంటుంది. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు సినిమాలో ‘వైల్డ్ డాగ్’ ఓ కొత్త ప్రయత్నం.. హిట్ అవుతుందనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేస్తున్నాం. 45 రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదలవుతుంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా
ముంబై: బాలీవుడ్ నటీ దియా మిర్జా ముంబై వ్యాపారవేత్త వైభవ్ రేఖీని ఈ నెల 15న పెళ్లాడిని సంగతి తెలిసిందే. అయితే పురోహితురాలి చేతిలో తన వివాహ వేడుకను జరుపుకుని నయా ట్రెండ్‌ను సెట్ చేశారామె. అంతేగాక తన పెళ్లిలో ముఖ్యమైన రెండు తంతులు లేకుండానే పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహా వేడుకల్లో జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు, తాళి, కన్యాదానం, అప్పగింతలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇక కన్యాదానం, అప్పగింతలు అనేవి పెళ్లిలో ముఖ్యమైన భాగాలు కదా. అయితే దియా మాత్రం ఈ రెండు తంతులు లేకుండానే తన వివాహం జరుపుకున్నారు. కావాలనే తన పెళ్లిలో అవి లేకుండా చూసుకున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది పెళ్లిలో అవి లేవెంటని అయోమయంలో పడ్డారంట. తాజాగా దియా దీనిపై స్పందిస్తూ తన పెళ్లిలో అవి లేకపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. పుట్టుక కొత్తది. అందుకే పాత విషయాలను కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేశాను. పెళ్లిలో అతి ముఖ్యమైన రెండు తంతులు కన్యాదానం, అప్పగింతలు. అవి రెండు నా పెళ్లిలో లేవు. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. వారి మధ్య తేడాను నిర్వచించే ఈ రెండు తంతులను నా పెళ్లిలో వద్దనుకున్నాను. మార్పు అనేది మన ఎంపికతోనే మొదలవుతుంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక పర్యావరణ వేత్త అయిన దియా తన పెళ్లిలో అస్సలు ప్లాస్టిక్ వాడలేదని వెల్లడించారు. 19 ఏళ్లుగా రోజూ పొద్దున్నే తాను సమయం గడిపే తోటలోనే నిరాడంబరంగా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) అయితే ఈ పెళ్లిలో ప్లాస్టిక్ అస్సలు వాడలేదని, పర్యావరణ హితంగానే తన పెళ్లి జరిగిందన్నారు. సహజసిద్ధమైన జీవవిచ్ఛిన్న సామగ్రినే అలంకరణకు వాడామని స్పష్టం చేశారు. ఇక మహిళా పూజారి తమ పెళ్లి జరిపించించడంపై మాట్లాడుతూ.. తన పెళ్లిలో ఇది మరోక సర్ప్రైజ్ అన్నారు. వేద సంప్రదాయం ప్రకారమే పురోహితురాలు తన వివాహ వేడుకను నిర్వహించిందని చెప్పారు. అయితే పెళ్లికి వెళ్లే ముందు వరకు ఓ మహిళ తన పెళ్లి చేయిస్తుందన్న విషయం తెలియదన్నారు. ఆమె తన చిన్ననాటి స్నేహితురాలైన అనన్య ఏర్పాటు చేశారని, ఆమె ఎవరో కాదు అనన్య వాల్ల ఆంటీ షీలా అని చెప్పారు. తన పెళ్లికీ ఆమెను పంపించి అనన్య మంచి కానుక ఇచ్చిందన్నారు. అంతకు మించి గొప్ప గౌరవం ఏముంటుందంటూ దియా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి) (ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్) -
రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి
సాధారణంగా, ఆలయాల్లో పూజలు, వివాహం, వ్రతం, యాగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే పూజారి తప్పనిసరి. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించే వారు. కానీ ప్రస్తుతం అక్కడక్కడ కొందరు ఇతర సామాజిక వర్గాల వారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అయితే ఎక్కడైనా ఈ విధులు నిర్వహించే వారే పురుషులే. పౌరోహిత్యం చేసే స్త్రీలు చాలా అరుదు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నయా ట్రెండ్ సెట్ చేశారు. పురోహితురాలి చేతుల మీదుగా తన వివాహ వేడుక జరుపుకున్నారు. మీరు చదివింది నిజమే.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దియా ఇది వరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు దియా మీర్జా. Thank you Sheela Atta for conducting our wedding ceremony. So proud that together we can #RiseUp #GenerationEquality https://t.co/aMZdyEZRdF pic.twitter.com/BeyFWCSGLw — Dia Mirza (@deespeak) February 17, 2021 ‘‘మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలా అట్టా.. ‘అందరం కలిసి ఎదుగుదాం’’.. ‘‘జనరేషన్ ఈక్వాలిటీ’’’’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దియా మీర్జా ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ‘‘పితృస్వామ్య వ్యవస్థని నాశనం చేయండి’’.. ‘‘ఈ మహిళ ఎంతో దీక్షగా, శ్రద్ధగా వివాహ తంతు జరిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను’’.. ‘‘వారిని ఎదగనివ్వండి’’.. ‘‘మహిళాసాధికరతకు నిదర్శనం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి? ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా -
ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్
ముంబై : ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో నటి దియా మీర్జా వివాహం జరిగింది. అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ముంబై బాంద్రాలోని నివాసంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఎరుపురంగు చీరలో దియా అందంగా ముస్తాబవగా, వైట్ అండ్ వైట్ కుర్తాలో వైభవ్ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను దియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్యార్ (ప్రేమ)అనే క్యాప్షన్‌ను జత చేసింది. ఇక గతేడాది నుంచి ప్రేమలో ఉన్న దియా-వైభవ్‌లు ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే 39 ఏళ్ల దియా ఇది వరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీతో ప్రేమలో ఉన్నట్లు గతేడాది గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దియా-వైభవ్‌లు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. వైభవ్‌కు కూడా ఇది రెండో పెళ్లి. అంతేకాకుండా దియా కంటే వైభవ్ నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. సంజు, దమ్, దస్, మై బ్రదర్ వంటి చిత్రాలతో పాపులర్ అయిన దియా మీర్జా చివరిగా ఆమె దర్శకుడు అనుభవ్ సిన్హా రూపొందించిన ‘థప్పడ్’లో నటించారు. ఇందులో తాప్పీ లీడ్ రోల్ పోషించగా దియా సామాజిక కార్యకర్తగా, మహిళ సంఘ నాయకురాలి పాత్రలో కనిపించారు. ఇక ఆమె తెలుగులో మెదటిసారి నటించిన ‘వైల్డ్ డాగ్’ లో కీ రోల్ పోషించారు. చదవండి : (ఫ్యాన్ మూమెంట్: విజయ్‌తో సారా సెల్పీ) (2013లో ఎంగేజ్మేంట్.. ఏడేళ్లు సహాజీవనం.. ఆ తర్వాత పెళ్లి..) -
మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి
ప్రముఖ నటి, బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్ రేఖీతో ఫిబ్రవరి 15న(సోమవారం) దియా ఏడడుగులు వేయనున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షలో వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గతేడాది నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దియా ఇదివరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు ఇక భర్తతో విడాకుల అనంతరం దియా వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీతో ప్రేమలో ఉన్నట్లు గతేడాది గుసగుసలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో దియా-వైభవ్‌లు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక వీరి పెళ్లికి కూడా ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం తెలుగులో ‘వైల్డ్ డాగ్’ మూవీలో నటిస్తున్నారు. చివరిగా ఆమె దర్శకుడు అనుభవ్ సిన్హా రూపొందించిన ‘థప్పడ్’లో నటించారు. ఇందులో తాప్పీ లీడ్ రోల్ పోషించగా దియా సామాజిక కార్యకర్తగా, మహిళ సంఘ నాయకురాలి పాత్రలో కనిపించారు. (చదవండి: అసభ్య వ్యాఖ్యలు.. ట్రోలర్స్‌కు దీపిక చురకలు) (కేబుల్ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు..) -
ఉత్తరాఖండ్ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడి గంగానది ఉపనది అయిన ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్‌ప్రాజెక్ట్‌ని ముంచెత్తింది. అందులో పని చేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. పెను విషాదాన్ని కలిగించిన ఈ ఉత్పాతంపై సెలబ్రిటీలు సానుభూతి వ్యక్తం చేస్తున్నా దియా మిర్జా మాత్రం దిగులును, నిస్సహాయతను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ‘హిమాలయాల్లో చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం, ఆనకట్టలు, పవర్ ప్రాజెక్టులు నిర్మించడం... ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. అంతేకాదు అమాయకుల ప్రాణాలు బలిగోరుతున్నాయి’ అని దియా మిర్జా గట్టిగా గొంతెత్తింది. గతంలో కూడా చాలాసార్లు పర్యావరణం గురించి మాట్లాడింది ఆమె. ‘గతంలో పుట్టినరోజు ఎవరిదైనా వస్తే ఏం బహుమతి ఇవ్వాలా అని నేను తెగ హైరానా పడేదాన్ని. తర్వాత ఎవరి పుట్టినరోజు ఆహ్వానం నాకు అందినా వారి పేరు మీద 11 చెట్లు నాటి ఆ చెట్లు నాటిన స్థలాన్ని చూసి రమ్మని చెప్పేదాన్ని. అలా ఒక సంవత్సరంలో నేను దాదాపు 18 వేల చెట్లు నాటాను’ అని చెప్పుకుందామె. చెట్లు కూల్చి గోడలు కట్టుకోవాలనుకునే సమాజం మీద కట్టలు తెంచుకున్న నదులు విరుచుకు పడతాయని ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే అంత మేలు. చదవండి: అనుబంధాల అంతరాలు త్రిభంగ -
వైల్డ్ డాగ్ ఎటు వెళ్తుంది?
నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అహిషోర్ సల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. అన్వేష్ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్ కథానాయికలుగా నటించారు. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి పెద్ద చిత్రమిది. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఈనెల 26న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల అవుతుందని కూడా వినిపిస్తోంది. మరి వైల్డ్ డాగ్ ఎటు వెళ్తుంది? వేచి చూడాలి. -
ఆయనకు ఫ్యాన్ అయిపోయా!
‘రేయ్’ (2015) సినిమాతో తెలుగుకి పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్. ఐదేళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున ‘వైల్డ్ డాగ్’లో నటించారామె. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా నటించారు సయామీ. అహిషోర్ సోల్మాన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున యన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ కథానాయికలు. ఈ సినిమాలో నటించడం గురించి సయామీ మాట్లాడుతూ – ‘‘వైల్డ్ డాగ్’లో నటించడం అద్భుతమైన అనుభువం. రా ఏజెంట్‌గా స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా కనిపించడం కోసం మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అలానే ఈ సినిమా కోసం చాలా స్టంట్స్ చేశాను. నిజమైన రా ఏజెంట్‌లానే కనిపించాననే అనుకుంటున్నాను. నాగార్జునగారితో పని చేయడం మంచి అనుభవం. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అన్నారు సయామీ. -
హిమాలయాలకు వీడ్కోలు
ఏసీపీ విజయ్‌వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్న చిత్రం ’వైల్డ్ డాగ్’. దియా మిర్జా హీరోయిన్ గా కీలక పాత్రలో సయామీ ఖేర్ నటిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ మనాలీలో జరిగింది. నాగార్జున పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చేశారు. ’’నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాలకు వీడ్కోలు చెప్తుంటే బాధగా అనిపించింది’’ అంటూ తన తోటి నటీనటులతో హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు నాగార్జున. ఇతర నటీనటులతో మనాలీలో షూటింగ్ జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు ఆరంభిస్తారు. ఈ చిత్రానికి మాటలు: కిరణ్ కుమార్, కెమెరా: షానీల్ డియో. -
ఏడు నెలల తర్వాత...
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఇటీవలే మొదలైంది. ఈ షూటింగ్లో జాయిన్ అయిన నాగార్జున అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ప్రేక్షకులతో తన ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘హాయ్.. ఇది రోహ్తంగ్ పాస్ (రోహ్తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇక్కడ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్) వచ్చేస్తాను. లవ్ యు ఆల్. సీ యు’’ అని పేర్కొన్నారాయన. ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నారు. దియా మీర్జా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎ¯Œ .ఎం. పాషా, జగన్మోహన్ వంచా, కెమెరా: షానీల్ డియో. -
నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు: దియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌కు చెమటలు పట్టిస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు బయటకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ ఎన్సీబీ అధికారుల విచారణలో వెల్లడించారని, దీంతో దియాతో పాటు, ఆమె మేనేజర్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశమందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఎన్సీబీ జాబితాలో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు) ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన దియా తనెప్పుడూ మాదక ద్రవ్యాలను తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఇలాంటి ఆరోపణలు.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా తనెంతో కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదంటూ వరుస ట్వీట్లు చేశారు. కాగా ఈ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు: తెరపైకి నమ్రత పేరు) -
దియా మీర్జాకు కొత్త చిక్కు
చక్కటి అమ్మాయి. దాంపత్యం చిక్కుల్లో పడింది. భర్తతో వచ్చిన చిక్కుల్ని విడాకులతో తొలగించుకుని బయటికి వచ్చేసింది. అలా వచ్చేశాక, ఆమె ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతుందా? ‘విడిపోయాక ధైర్యంగా ఉండగలుగుతున్నావా.. ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరైనా తనను అడుగుతుంటే!! దియా మీర్జాకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ఏవో మనస్పర్థలతో ఈ మధ్యే భర్త నుంచి విడిపోయి, వేరుగా ఉంటున్నారు దియా మీర్జా. దియా హైద్రాబాద్ అమ్మాయి. తన బిజినెస్ పార్టనర్‌నే లైఫ్ పార్ట్నర్గా చేసుకుంది. ఆరేళ్ల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరూ విడిపోయారు. తనే భర్తను వద్దనుకుందని అంటారు. ఆయన పేరు సహీల్ సింఘా. ‘ఒక బంధం నుంచి బయటికి వచ్చాక స్ట్రాంగ్‌గా ఉండగలమా?’ అని అడుగుతున్నారట దియా ఫ్రెండ్స్. వాళ్లు కూడా విడాకులు తీసుకున్నవారే. వాళ్ల ప్రశ్నలకు దియా దగ్గర సమాధానం లేదు. ‘‘ఎవరి జీవితమూ ఎవరికీ అనుభవంగా పనికిరాదు. పరిష్కారమూ చూపదు’’ అని మాత్రం అంటున్నారు. ఆ మాట కూడా.. నవ్వుతూనే. -
టాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్ నటి దియా మిర్జా త్వరలోనే టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో దియా మిర్జాను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరిణీతా, దస్, లగేరహో మున్నాభాయ్, క్యాష్, సంజు’ వంటి హిందీ సినిమాల్లో నటించారు దియా. ‘వైల్డ్ డాగ్’ ఆమెకు తొలి తెలుగు సినిమా. త్వరలోనే దియా మీర్జా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ‘‘దియా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నది కావడంతో ఆమె న్యాయం చేస్తారనే నమ్మకంతో తీసుకున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎన్.ఎమ్. పాషా, జగన్మోహన్ వంచ. -
ఉన్నత శిఖరాలు.. సాటిలేని సామర్థ్యాలు
శిఖరానికి కిరీటం పెడితే ఎలా ఉంటుంది? అత్యున్నతమైన పదవిలో ఒక మహిళ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది! వీళ్లెవరూ పదవుల కోసం ప్రయత్నించలేదు. పదవులే వీళ్ల కోసం ప్రయత్నించాయి. పనిలో సామర్థ్యం.. అంకితభావం.. నిబద్ధత ఉంటే.. ‘మీరే మమ్మల్ని లీడ్ చెయ్యాలి మేడమ్’ అని గొప్ప గొప్ప సంస్థలే అప్లికేషన్ పెట్టుకుంటాయి. అలా ఈ ఏడాది ‘లీడింగ్’లోకి వచ్చిన మహిళలు వీరు. 1. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2. సుమన్ కుమారి, పాకిస్తాన్లో సివిల్ జడ్జి పాకిస్తాన్ సివిల్ న్యాయమూర్తిగా సుమన్ కుమారి జనవరిలో నియమితులయ్యారు. ఖంబర్–షాదద్కోట్ జిల్లాకు చెందిన కుమారి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఒక హిందూ మహిళ పాకిస్తాన్లో జడ్జి కావడం ఇదే మొదటిసారి. 3. ఇంద్రా నూయి, అమెజాన్ డైరెక్టర్ అమెజాన్ కంపెనీ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళా ఇంద్రానూయి ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌లో డైరెక్టర్ అయిన రెండో మహిళగా ఇంద్రా నూయి గుర్తింపు పొందారు. ఆమెకన్నా ముందు 2019 ఫిబ్రవరి మొదటివారంలో స్టార్‌బక్స్ ఎగ్జిక్యూటివ్ రోసలిండ్ బ్రెవర్ అమెజాన్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. 4.జీసీ అనుపమ, ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్ ఆస్టన్రామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా డాక్టర్ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. అనుపమ సూపర్‌నోవాపై పరిశోధనలు చేశారు. 5. నీలా విఖేపాటిల్, స్వీడన్ ప్రధాని సలహాదారు స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖేపాటిల్ నియమితులయ్యారు. స్వీడన్లో జన్మించిన నీలా గుజరాత్‌లోని అహ్మద్‌నగర్‌లో తన బాల్యాన్ని గడిపారు. 6. నియోమీ జహంగీర్ రావు, యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జి అమెరికాలోని ప్రఖ్యాత డిస్టిక్ర్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్రావు ఎన్నికయ్యారు. 7. పద్మాలక్ష్మి , యూఎన్డీపీ అంబాసిడర్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి మార్చిలో నియమితులయ్యారు. 8. దియామీర్జా, ఐరాస ఎస్డీజీ ప్రచారకర్త ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియామీర్జా ఎంపికయ్యారు. పేదరికాన్ని రూపుమాపడం; అందరికీ ఆరోగ్యసంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. 9. అనితా భాటియా, యూఎన్–ఉమెన్ డిప్యూటీ డెరైక్టర్ మహిళా సాధికారత, స్త్రీ–పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్–ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా మేలో నియమితులయ్యారు. కలకత్తా లో బీఏ చదివిన అనిత వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు. 10. ప్రమీల జయపాల్, అమెరికా తాత్కాలిక స్పీకర్ అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల జయపాల్ జూన్‌లో సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ప్రమీల నిలిచారు. 11. షలీజా ధామీ, తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్ వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో తొలి మహిళా కమాండర్‌గా నిలిచారు. హెలికాప్టర్లను నడపడంలో ధామీకి 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 12. అంజలీ సింగ్, తొలి మహిళా సైనిక దౌత్యాధికారి విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పారు. రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్ అటాచీ’గా అంజలి సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించారు. -
రెండు విడాకులు.. ఒక రూమర్!
ఉబుసుకోక ఊహాలకు పనిచెప్పే గాసిప్‌రాయుళ్లు కొందరుంటారు. తలా-తోకాలేని ఊహాలతో కథనాలల్లి.. మీడియాలో పుకార్లకు షికార్లు తొడుగుతారు. తాజాగా ఓ రెండు జంటలు తాము వేరవుతున్నట్టు ప్రకటించాయి. వైవాహిక బంధం నుంచి తప్పుకొని.. పరస్పర సామరస్యంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. అంతే, రాసిప్రాయుళ్లు తమ చెత్తబుర్రలకు పదును పెట్టారు. ఈ జంటల విడాకులకు మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించి.. ఎఫైర్ కారణంగానే వాళ్లు విడిపోయారంటూ కథనాలు అల్లారు. దీనిపై ఆ జంటలు స్పందించి.. ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్ సంఘా, ప్రకాశ్ కోవెలముడి-కనికా దిల్హాన్ విషయంలో ఇది జరిగింది. బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ సంఘా నుంచి వేరవుతున్నట్టు ప్రకటించగా.. అదే సమయంలో దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి భార్య, స్క్రీన్‌రైటర్ కనికా దిల్హాన్ తాము విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో దియా-సాహిల్ విడాకులకు కారణం కనికా దిల్హాన్ అని వదంతులకు తెరతీశారు. సాహిల్‌తో కనికకు ఉన్న ఎఫైర్ కారణంగా ఈ రెండు జంటలు వేరయ్యాయి అంటూ కథనాలు సృష్టించారు. దీనిపై దియా మీర్జా స్పందిస్తూ.. ఈ వదంతులకు అసలు అర్థమే లేదని కొట్టిపారేశారు. తాము విడిపోవడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయమే లేదని ఆమె ట్విటర్లో స్పష్టం చేశారు. కనిక కూడా ట్విటర్లో ఈ కథనాలపై స్పందించారు. దియా, సాహిల్‌లను తన జీవితంలో ఏనాడూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత దారుణమైన, జుగుప్సకరమైన వదంతులని, టాబ్లాయిడ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఏకకాలంలో జరిగిన రెండు ఘటనల మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించడం సరికాదని, తాను ఫిక్షన్ రైటర్‌నని, తనను మించిపోయారని గాసిప్రాయుళ్లను ఎద్దేవా చేశారు. సాహిల్ సంఘా కూడా ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. -
‘అవును.. మేము విడిపోతున్నాం’
ముంబై : బాలీవుడ్లో మరో జంట విడాకులకు సిద్ధమైంది. ఐదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు నటి దియా మీర్జా, ఆమె భర్త సాహిల్ సంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దంపతులుగా విడిపోయినప్పటికీ తాము ఎల్లప్పుడూ స్నేహితులుగానే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ పదకొండేళ్లుగా ఒకరికై ఒకరుగా బతికిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మధ్య భార్యాభర్తల బంధం లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదు. మా జీవన ప్రయాణంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ కలిసి గడిపిన క్షణాలను, బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరం కృతఙ్ఞతా భావం కలిగి ఉంటాము. ఇటువంటి సమయంలో మాకు తోడుగా నిలిచి, మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. అదేవిధంగా మా వ్యక్తిగత విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడంలో..సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు. ఇక ఈ విషయంపై స్పందించాలనుకోవడం లేదు. దయచేసి మీడియా నా విన్నపాన్ని మన్నించాలి’ అంటూ దియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో తన, తన భర్త పేరిట ఓ లేఖ షేర్ చేశారు. కాగా హైదరాబాద్ భామ దియా మీర్జా తన చిరకాల స్నేహితుడు సాహిల్ సంగాతో ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు. తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 2014, అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌజ్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి బాబీ జాసూస్ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఇక సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే దియా... భారత్ తరఫున ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. పర్యావరణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రచారంలో చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా తన దగ్గరికి వచ్చిన సమయంలో సాహిల్‌తో ప్రేమలో పడినట్లు దియా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) on Jul 31, 2019 at 10:37pm PDT -
‘15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు’
ముంబై: ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల హీరోయిన్ దియా మిర్జా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరగాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఈ వార్త విని చాలా బాధ పడ్డాను. 15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు. ఆయనను ఎంతో గౌరవిస్తాను. నేను పనిచేసిన వారిలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. పూర్తి వివరాలు తెలియకుండా దీని గురించి వ్యాఖ్యానించలేను. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు జరగాల’ని దియా మిర్జా అన్నారు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన లగే రహో మున్నాభాయ్, సంజు సినిమాల్లో ఆమె నటించారు. హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తనను పలుమార్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బల్, సీనియర్ నటులు అలోక్‌నాథ్, నానాపటేకర్, సంగీత దర్శకుడు అనుమాలిక్ తదితరులు ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బేబి దియా
ఏ స్టార్‌కి ఎక్కడ ఫ్యాన్స్ ఉంటారో చెప్పలేం. వాళ్ల మాతృభాషలో ఉండొచ్చు.. పరాయి భాషల్లోనూ ఫ్యాన్స్ ఉండొచ్చు. అంతెందుకు? పరాయి దేశాల్లో కూడా ఫాలోయింగ్ ఉండి ఉండొచ్చు. ఒకవేళ అభిమానం ఎక్కువైతే ఆ స్టార్ పేరు తమ పిల్లలకో, అభిమానంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులకో పెట్టుకుని ఫ్యాన్స్ మురిసిపోతారు. ఇప్పుడు దియా మీర్జా పేరు ఓ ఖడ్గమృగానికి సెట్ అయింది. ‘లగేరహో మున్నాభాయ్, దస్, సంజు’ సినిమాలతో బాలీవుడ్లో ఫేమ్ సంపాదించారు దియా. యుఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్, భారతదేశపు వన్యప్రాణ సంరక్షణ ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలను అందిస్తున్నారామె. కెన్యాలోని ఓఐపెజెటా సంరక్షణ సంస్థలోని ఓ ఖడ్గ మృగానికి దియా మిర్జా పేరుని పెట్టారు. ఈ విషయాన్ని దియా తెలియజేస్తూ –‘‘థ్యాంక్యూ ఓఐపెజెటా. నా పేరును ఓ బ్యూటిఫుల్ బేబీకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. కెన్యాలోని ఈ ప్లేస్‌ని ఎవరైనా విజిట్ చేసినప్పుడు దియాతో ఫొటో దిగి నాకు షేర్ చేయండి’’ అని పేర్కొన్నారు. -
పసిమొగ్గలపై రాక్షసత్వమా..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడుల పట్ల బాలీవుడ్ నటి దియా మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలపై తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిని మతం, ప్రాంతాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడే నిందితుల పట్ల ఎవరూ సానుభూతి చూపరాదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్థుడి మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా తీర్పులు ఉండాలని ఆకాంక్షించారు. ముంబైలో సేవ్ ద చిల్ర్డన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దియా మీర్జా వీధి బాలలకు విద్యాబోధనలో చొరవ చూపుతున్నారు, ఈ పిల్లలకు గుర్తింపు ధ్రువీకరణ కోసం వీరికి ఆధార్ కార్డులు ఇప్పించేందుకు తమ బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. -
కుర్ర హీరోయిన్లే కావాలా?
ఒక హీరోయిన్‌కు 30 ఫ్లస్ దాటాయంటే.. ఆమెకు ఛాన్స్‌లు తగ్గిపోవటం ఇండస్ట్రీలో కామన్‌గా మారింది(కొందరిని మినహాయిస్తే...). ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా(37) కూడా ఉన్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో ఆమె రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మాన్యతాదత్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘ఒక నటీమణికి 30 ఏళ్లు వచ్చాయంటే, క్రమక్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. దర్శక నిర్మాతలు యంగ్ హీరోయిన్లే కావాలని కోరుకుంటున్నారు. అంతెందుకు 50 ఏళ్లు దాటిన మన హీరోలు కూడా పడుచు అమ్మాయిలతోనే జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏం? అందరికీ కుర్రహీరోయిన్లే కావాలా? మిగతా వాళ్లు నటనకు పనికిరారా?’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ..‘ఇక్కడ టాలెంట్‌తో పని లేదు. కేవలం ఫ్రెష్ ఫేస్‌ల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి. సినిమా రంగంలో మార్పులు వస్తున్నాయి. మరి యాక్టర్ల జీవితంలో మార్పు రాకూడదా?.. పర్సనల్ లైఫ్‌తోపాటు ప్రొఫెషనల్ లైఫ్ కోరుకోవటం తప్పేం కాదు కదా!’ అని ఆమె తెలిపారు. ‘అయితే వివాహం అయ్యాక కూడా కెరీర్‌ను తమ టాలెంట్‌తో అద్భుతంగా మలుచుకున్న వాళ్లూ లేకపోలేదు. ఉదాహరణకు షర్మిలా ఠాగూర్, వహీదా రెహమాన్, స్మితా పాటిల్‌లు.. పెళ్లయ్యాక కూడా కెరీర్‌ను సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. నేను కూడా వాళ్ల బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నా. అందుకే మంచి కథల కోసం ఇంత కాలం ఎదురు చూశా. మధ్యలో ఓ ఇరానియన్ చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ నుంచి కబురు అందింది. దాదాపు రెండేళ్ల తర్వాత సంజు కార్యరూపం దాల్చింది. సంజుతో మంచి చిత్రంలో నటించాననే కోరిక తీరింది’ అని దియా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
దిల్'దియా'
బాలలూ పర్యావరణాన్ని కాపాడండి..’అంటూ చిన్నారులకు పాఠాలు చెప్పింది బాలీవుడ్ భామ దియామీర్జా. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా శుక్రవారం ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడి కొనసాగుతోంది. చిన్నారుల చిత్రాలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్నాయి. రెండోరోజూ ప్రసాద్ ఐమ్యాక్స్ పిల్లల కేరింతలతో కళకళలాడింది. ప్రముఖులూ ఉత్సవంలో పాల్గొని చిన్నారులతో ఆడిపాడారు. ప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లోని 3 స్క్రీన్స్‌లో శుక్రవారం 9 సినిమాలు ప్రదర్శించారు. దేశవిదేశీ చిత్రాలు చిన్నారులను అలరించాయి. నగరం నలుచెరగుల నుంచే కాకుండా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచీ చిన్నారులు తరలివచ్చారు. చికాగో తదితర విదేశీ నగరాల నుంచి కూడా బాలబాలికలు వచ్చి సందడి చేశారు. ప్రకృతి పరిరక్షణ మరవొద్దు.. సినీ నటి దియామీర్జా మనం జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుగుతామని సినీ నటి దియామీర్జా అన్నారు. చిత్రోత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉదయం టూత్‌బ్రష్ వాడకంతో మొదలెట్టి ఎన్నో రకాలుగా పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేస్తున్నామని అన్నారు. సృష్టిలోని అన్ని ప్రాణులతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో చాలాసేపు ముచ్చటించారు. మనమేం తీసిపోం.. విదేశీ చిత్రాలతో పోలిస్తే టెక్నికల్‌గా కొంత తేడా తప్పితే.. మనమేం వాళ్లకి తీసిపోం. నార్వే, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాల చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆ లోకేషన్స్ మనకు నచ్చుతాయి. అదే మన లొకేషన్స్‌ను ఆస్వాదించలేం. అలాగే వారికి మన చిత్రాలు నచ్చుతాయి. ఎగిరే తారాజువ్వలు తదితర భారతీయ చిత్రాలకు మంచి గుర్తింపు లభిస్తోంది. మన దగ్గర చిన్నారుల చిత్రాలు థియేటర్లలో ఆడవు. ఆర్థికంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. – రాంప్రసాద్, దర్శకులు పిల్లలకు ఏవీ..? బాలల చిత్రం ‘ఆదిత్య క్రియేటివ్ జీనియస్’ రూపొందించాను. కలాం స్ఫూర్తితో సైంటిస్ట్‌గా మారిన ఆదిత్య పాత్రలో బాలనటుడు ప్రేమ్ చక్కగా నటించాడు. ఈ చిత్రానికి తెలుగు ప్రభుత్వాలు పన్ను మినహాయింపునిచ్చాయి. చిన్నారి శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపేందుకు రూపొందించిన చిత్రం ఇది. విదేశాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమా హాల్స్ ఉంటాయి. వారానికి ఒకసారైనా బాలల చిత్రాలను థియేటర్లలో చూపిస్తే పిల్లల్లో ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుంది. – భీమగాని సుధాకర్‌గౌడ్, దర్శకుడు టచ్ స్క్రీన్ టు నేచర్ టచ్ బాలల చిత్రం ‘డూడూ డీడీ’ రూపొందించాను. కొమరం భీమ్, దాసి చిత్రాలతో జాతీయ గుర్తింపు పొందిన నటులు భూపాల్ ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. పిల్లలు టచ్ స్క్రీన్ నుంచి నేచర్ టచ్‌లోకి వెళ్లడమే ఈ చిత్ర నేపథ్యం. వారం రోజులే ఈ సందడి. తర్వాత అంతా శూన్యమే. కోట్లు ఖర్చు చేసి కమర్షియల్ సినిమాలు తీసేవారు.. పిల్లల చిత్రాల జోలికి రాకపోవడం దురదృష్టకరం. పిల్లల చిత్రాల రూపకల్పన సామాజిక బాధ్యత. – అల్లాణి శ్రీధర్, బాలల చిత్రాల రూపకర్త అంశాలపై అవగాహన.. చిత్రోత్సవంలో భాగంగా జేఎన్టీయూ ఆడిటోరియంలో వివిధ అంశాల్లో చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి యానిమేషన్లో, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఫిల్మ్ మేకింగ్, సాయంత్రం 4:30 గంటల నుంచి స్టోరీ టెల్లింగ్‌లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ముఖేష్ఖన్నా శుక్రవారం హాజరై చిన్నారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆటిజం, బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. మనమూ మారాలి.. ‘డూడూ డీడీ’లో నేను చేసిన తాత పాత్ర.. నా సొంత క్యారెక్టరే అనిపించింది. పిల్లలకు సొంతంగా సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఎంతవరకు అవసరం? పిల్లలు మారాలంటే పెద్దలు మారాలి. తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లల్లోనూ మార్పు వస్తుంది. దర్శకులు, నిర్మాతలు వారి బాల్యం వైపు ఒకసారి తిరిగి చూడాలి. ప్రతి నిర్మాత ఒక్క బాలల చిత్రమైనా రూపొందించడం బాధ్యతగా తీసుకుంటే బ్రహ్మాండమైన చిత్రాలు వస్తాయని నా అభిప్రాయం. – భూపాల్, నటుడు స్ఫూర్తినివ్వాలి.. చిన్నారుల చిత్రాలు వారిలో స్ఫూర్తి నింపేలా, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలి. ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తే అలాంటి సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. నేను రూపొందించిన ‘సత్యమేవ జయతే’ త్రీడీ యానిమేషన్ సినిమా చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన సినిమా ఇది. హాలీవుడ్ చిత్రాల శైలిలో తీయడం లేదా వాటిని పునర్నిర్మించడం కన్నా భారతీయతను ప్రతిబింబించే సినిమాలు మనం తీయాలి. – కొత్తపల్లి సీతారామ్, నిర్మాత యానిమేషన్.. సూపర్బ్ రోజంతా వివిధ భాషా చిత్రాలను చూడడం మంచి అనుభవం. యానిమేషన్ సినిమాలు చాలా బాగున్నాయి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, పంచుకునేందుకు ఈ చిత్రోత్సవం అవకాశం ఇస్తోంది. హైదరాబాద్‌కు ఫస్ట్‌టైమ్ వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడికి మళ్లీ రావాలనుకుంటున్నాం. – అతేలి డేనియల్, నాగాలాండ్ సినిమా తీస్తా.. అవార్డు కొట్టేస్తా ఇండియాకు రావడం తొలిసారి. స్కూల్ పిల్లల కేరింతల మధ్య రకరకాల సినిమాలు చూడడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నేను కూడా జంతువులతో పాటు విభిన్న రకాల అంశాలతో షార్ట్‌ఫిల్మ్స్ తీస్తుంటాను. మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఈ చిత్రోత్సవం ఆ కోరిక తీరేందుకు ఉపయోగపడుతుంది. ఈ సినిమాల్లో వినియోగించిన టెక్నాలజీ తదితర నోట్ చేసుకుంటున్నాను. అవార్డు గెలుచుకునే బాలల చిత్రం తీయాలని ఆశ. – డానియల్, చికాగో నేనూ తీస్తాను... నేను దర్శకత్వం వహించిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాని చూసేందుకు ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ బాలల సినిమాల ప్రదర్శన, పండగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇంత మంచి ఫెస్టివల్‌కు మన నగరం వేదిక కావడం గర్వంగా అనిపిస్తోంది. ఇది చూస్తుంటే నాకు కూడా మంచి బాలల చిత్రం తీయాలనే ఆలోచన వస్తోంది. తప్పకుండా మంచి సందేశంతో తీస్తాను. – అజయ్ ఆండ్రూస్, దర్శకుడు -
బాలల కోసం నటి విరాళాల సేకరణ
ముంబై: ఒకప్పటి సినిమా తారలు కేవలం నటనకే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత తరంవారిలో కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో సినిమా తారలు పాల్గొనడం చాలా అరుదు. కానీ ఇప్పటి తరం తారలు మాత్రం నటనతోపాటు సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇటువంటివారిలో ముందుంటుంది దియా మీర్జా. తారగా, అందాల పోటీల్లో విజేతగా నిలిచిన దియా సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటోంది. నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా దియా మాట్లాడుతూ.. ‘కెట్టో అనే ఆన్ లైన్ వెబ్సైట్ ద్వారా పేదల పిల్లల కోసం నిధుల సేకరించాలని జెనెసిస్ ఫౌండేషన్ నిర్ణయించింది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం అవసరం. అందుకు ఎవరైనా సెలబ్రిటీలు కావాలని అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నా. ఇవ్వడం, పంచుకోవడం, ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం వంటి పదాలంటే నాకెంతో ఇష్టమ’ని పేర్కొంది. -
'ఇక్కడికి వస్తే నా చిన్నతనంలోకి వెళ్లిపోతా'
ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నగరంలో సందడి చేసింది. సిటీజనులకు 24 గంటలూ బాలీవుడ్ మ్యూజిక్ కిక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ "మిర్చి 95''ని బేగంపేట క్వీన్ ప్లాజాలో ఆమె మంగళవారం ప్రారంభించింది. "హైదదరాబాద్ తో నాది విడదీయరాని బంధం. ఇక్కడికి వచ్చినప్పుడు నా చిన్నతనంలోకి వెళ్లిపోతానం''టూ చిరునవ్వులు చిందించింది ఈ బ్యూటీ. మిర్చి బ్రాండ్‌ను మరింత విస్తృత పరిచేందుకు ఈ స్టేషన్ ప్రారంభించామని రేడియో మిర్చి చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ థాపన్ సేన్ చేప్పారు. ఈ నెల 17న సాయంత్రం 5గంటలకు దియా లైవ్ షో లో శ్రోతలతో మాట్లాడతారన్నారు. -
‘స్వచ్ఛ సాథీ’ ప్రచారకర్తగా దియా మీర్జా
ముంబై: ‘స్వచ్ఛ భారత్’ అనుబంధ యువత కార్యక్రమం ‘స్వచ్ఛ సాథీ’కి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియా మీర్జా నియమితులయ్యారు. ఈ కార్యక్రమం కింద 2 వేలకు పైగా విద్యార్థులను నియమించుకుంటారు. వీరు 10 వేల స్కూళ్లను సమన్వయపరుస్తారు. అక్కడి విద్యార్థులచే పరిశుభ్ర భారత్ కోసం ప్రమాణం చేయిస్తారు. ప్రచారకర్తగా దియా... అవగాహన కార్యక్రమాలు, స్ఫూర్తినిచ్చే వీడియోల ద్వారా విద్యార్థులతో మాట్లాడుతారు. ‘దియా యువతకు స్ఫూర్తి ప్రదాత. స్వచ్ఛ భారత్‌లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. మరింత యువతకు చేరువయ్యేందుకు ఆమె సాయం కీలకం కానుంది’’ అని స్వచ్ఛ భారత్ డెరైక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. -
ఇండో-ఇరానియన్ చిత్రంలో !
కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దియా మీర్జా. ప్రస్తుతం ఆమె ‘సలాం ముంబై’ అనే ఓ ఇండో - ఇరానియన్ చిత్రంలో నటిస్తున్నారు. ముంబైలో రెండు వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఓ ఇద్దరు మెడికోల మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘ఫ్యామిలీవాలా’ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. -
దియా మిర్జా డెరైక్షన్
ఈ జనరేషన్ హీరోయిన్లు అటు ప్రొడక్షన్లోనూ, ఇటు డెరైక్షన్లోనూ అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో దియా మిర్జా కూడా చేరారు. హైదరాబాదీ అమ్మాయిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన దియా మిర్జా ఇప్పుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది నిర్మాతగా ‘బాబీ జాసూస్’ అనే చిత్రాన్ని నిర్మించిన దియా, డైరక్షన్ వైపు దృష్టి సారించారు. ‘‘నాకు మొదటి నుంచి డెరైక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నా. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తా’’ అని చెప్పారు. -
నేను.. మీ దియా!
సెలబ్‌డబ్ సెలబ్రిటీస్ హార్ట్ బీట్ దియామీర్జా మోడల్‌గా మెరిశారు. సినీనటిగా వెలిగారు. నిర్మాతగా మారారు. వీటన్నింటికంటే మించి చిన్న వయసులోనే సందేశాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తోటి నటీనటులకు భిన్నంగా నిలిచారు. దియామీర్జా మన హైదరాబాదీ అని సగర్వంగా చెప్పుకొనేలా తన జీవనయానాన్ని మలచుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తన మనసులో మాటల్ని ఇలా పంచుకున్నారు. ..:: ఎస్.సత్యబాబు నేనెప్పుడూ మోడల్ని కావాలనుకోలేదు. అయ్యాను. నటిని అనే ఆలోచనే చేయలేదు. కాని సినిమాల్లో నటించాను. అదే క్రమంలో నిర్మాత అయ్యాను. డబ్బు కోసం సినిమాలు తీయడం లేదు. నా ఆలోచనలు, ఆశయాలను వీలైనంతగా ప్రతిఫలించే సినిమాలనే చేస్తున్నాను. ఇటీవల నేను తీసిన బాబీజసూస్ సినిమా అలాంటిదే. నేను.. మోడల్.. నటి.. ‘నువ్వు అందంగా ఉంటావన్న భావన తలకెక్కనీయవద్దు’ అని అమ్మ ఎప్పుడు హెచ్చరించేది. నేనెంచుకున్న కెరీర్ అందంతో ముడిపడి ఉన్నా.. కేవలం దాన్నే ఆధారంగా నేనెన్నడూ భావించలేదు. అందాలపోటీలను కనీసం చూడని నేను.. అనుకోకుండా ఓ రోజు బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నాను. మా అమ్మ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అందులో పార్టిసిపేట్ చేశాను. కిరీటం గెలుచుకున్నా.. ఒంటరి అయిపోయాను. సంతోషం అనేది ఇతరులతో పంచుకున్నప్పుడే కలుగుతుందని నాకు ఆనాడే తెలిసింది. ఇక సినిమాలు కూడా నేను ప్లాన్ చేసుకున్న రంగం కాదు. స్కూల్‌డేస్‌లో థియేటర్ అనుభవం ఉంది. బ్యూటీ కాంటెస్ట్‌లో విజయం నన్ను అమాంతంగా నటిని చేసేసింది. నేను...నా చిన్నతనం... మానసికంగా నా పరిణతికి నా స్కూల్డేసే కారణం. మా ఇంట్లోగానీ, స్కూల్లో గానీ.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా చూపేవారు కాదు. మా పేరెంట్స్‌ది ప్రేమ వివాహం. ఇద్దరి మతాలు వేరు. దీంతో చిన్నప్పుడు మన మతమేదని అమ్మను ప్రశ్నించేదాన్ని. ‘మానవత్వమే మన మతమ’ని అమ్మ చెప్పేది. అయితే ఆ సమాధానంతో అందరినీ కన్విన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో ఇండియన్ అని చెప్పమన్న అమ్మ సూచనను అమల్లోపెట్టాను. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు నాన్న పోయారు. తర్వాత నాకు స్టెప్ ఫాదర్‌గా అహ్మద్ అలీ మీర్జా వచ్చారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నా సర్నేమ్ ఆయన అందించిందే. నేను.. సేవ.. మొదటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువే. అందుకే మంచి ఉద్దేశాలతో వచ్చే ఎన్జీవోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. మహిళలపై దాడుల నుంచి గ్రామీణ విద్య వరకు మన జీవితాలపై ప్రభావం చూపే ఏ అంశమైనా నా అవసరం ఉందంటే తప్పకుండా ముందుంటాను. ఎన్డీటీవీ గ్రీన్థాన్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అందులో భాగంగా ఉన్నాను. కేన్సర్, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే సొసైటీలు, స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పెటా, క్రై.. ఇలా పలు సంస్థలతో కలసి కదులుతున్నాను. ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రచారం కోసం ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను సంప్రదిస్తే వెంటనే ఓకే చెబుతున్నాను. నేను.. ఆయన.. పెళ్లి నా జీవితానికి మరింత ఆనందాన్ని జత చేసింది. సాహిల్.. ఓ అద్భుతమైన భాగస్వామి. ఆయన మనస్తత్వం, ఆలోచనలు బాగుంటాయి. ఇంకో మాట.. నాపై భాగ్యనగరం ప్రభావం ఎంతో ఉంది. చిన్నప్పుడు నేను చదువుకున్న విద్యారణ్య స్కూల్లో అవలంబించిన జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి.. ఇక్కడ ఉండగా నా జీవితంలో ఎదురైన ప్రతి పరిణామం నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించాయి. -
గోంగూర పచ్చడి కంపల్సరీ
సిటీప్లస్ ‘హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడి విద్యారణ్య, స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదువుకున్నాను. ఈ నగరం నాకు చాలా నేర్పింది. చిన్నతనంలోనే పెద్ద ఆలోచనలు చేసేలా నన్ను మార్చింది’ అంటూ సిటీతో తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు మాజీ బ్యూటీక్వీన్, బాలీవుడ్ నటి దియామీర్జా. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాబాలన్ హీరోయిన్గా తాను ప్రొడ్యూస్ చేసిన బాబీజాసూస్ సినిమా కోసం చాలా రోజులు ఇక్కడ గడిపానని, మళ్లీ ఇప్పుడే అఫిషియల్‌గా రావడమని చెప్పారు. ‘ఇక్కడకు వ చ్చి.. తిరిగి వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమా నిర్మిస్తా’ అని చెప్పారు దియా. మహిళల స్వయం సాధికారత అంటే తనకు చాలా గౌరవమంటున్న దియా.. ఆడ- మగ ఇద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవాలన్నారు. తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలు.. ఇలా ఏ పాత్రలోనైనా మహిళ ఎంతో మనస్ఫూర్తిగా ఇమిడిపోతుందన్నారు. వరల్డ్‌కప్‌లో విరాట్‌కొహ్లీ ఫెయిల్యూర్‌కి, తద్వారా ఇండియా సెమీస్‌లో పరాజయం పాలవడానికి అతని గాళ్‌ఫ్రెండ్ అనుష్క కారణమంటూ అందరూ తప్పుపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదెంత మాత్రం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. దాదాపు 200 మంది మహిళలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ చైర్పర్సన్ మోనికా అగర్వాల్ పర్యవేక్షించారు. -
కొత్త పెళ్లికూతురు కబుర్లు!
పెళ్లి పుస్తకం ఎట్టకేలకు అందాల రాశి దియా మీర్జా పెళ్లి, ప్రేమికుడు సాహిల్ సంఘాతో ఇటీవల ఘనంగా జరిగింది. భర్త సాహిల్ గురించి దియా చెప్పిన కబుర్లు ఇవి... తొలిసారి... ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా నా దగ్గరికి వచ్చాడు. అతను స్క్రిప్ట్‌ను వినిపించిన పద్ధతి, హావభావాలు నాకు ‘నచ్చాయి’. ఇక అప్పటి నుంచి ఈ నచ్చడాల జాబితా పెరుగుతూ పోయి ప్రేమ వరకు, అక్కడి నుంచి పెళ్లి వరకు వచ్చింది.చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలుస్తాయి. ఒరినొకరం ఇష్టపడడానికి ఇదొక కారణం. గాఢమైన ప్రేమలో... సాహిల్‌కు కాస్త గర్వం ఎక్కువనే మాట నేనూ విన్నాను. అది నిజమైనా దాని వల్ల నేనేమీ ఇబ్బంది పడను. నిజం చెప్పాలంటే, నిండా ప్రేమలో మునిగిన వారికి ఏదీ సమస్య కాదు. చిన్న సమస్యకు ఆవేశకావేశాలకు లోనయ్యే ప్రేమ కాదు మాది. చెప్పాలంటే పరిణతితో కూడిన ప్రేమ. గట్టి పునాది ఉన్న గాఢమైన ప్రేమ. ఒక్క ‘సారీ’ కాదు... అప్పుడప్పుడు చిలిపి తగాదాలు మా మధ్య చోటు చేసుకుంటాయి. చాలా సందర్భాల్లో ఆయనే సారీ చెప్పి తగాదాకు ఫుల్స్టాప్ పెట్టేస్తారు. ఆయన సారీ చెప్పినందుకు... నేను మళ్లీ సారీ చెబుతాను. ఇక ఆ రోజంతా సారీలతోనే గడిచిపోతుంది. వంటంటే ఎంతిష్టం! మా ఇద్దరికీ వంట చేయడం అంటే మహా ఇష్టం. నేను ఇండియన్ వంటకాలు బాగా చేస్తాను. కొన్నిసార్లు హైదరాబాదీ వంటకాలు, కొన్నిసార్లు పంజాబీ వంటకాలు చేస్తుంటాను. నేను చేసే బిర్యానీ, కట్టి దాల్, ఖీమా..లాంటి హైదరాబాద్ వంటకాలంటే సాహిల్‌కు ఇష్టం. సాహిల్ యూరోపియన్, ఇటలియన్, థాయ్ వంటకాలు బాగా చేస్తాడు. - దియా మీర్జా, హీరోయిన్ -
నిర్మాతగా..?
పూజా భట్, జూహీ చావ్లా, ప్రీతీ జింటా, దియా మీర్జా.. ఇలా పలువురు బాలీవుడ్ తారలు నిర్మాతలుగా మారారు. ఇప్పుడీ జాబితాలో నేహా ధూపియా చేరనున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ చిత్రాలు చేసే అవకాశం రాలేదామెకు. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారాలనుకుంటున్నారామె. ‘‘నటన మాత్రం కాకుండా నాకేదైనా వ్యాపారం చేయాలనిపిస్తే, కచ్చితంగా నా దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంటుంది. ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఆసక్తి. మంచి మంచి సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం’’ అని ఇటీవల ఓ సందర్భంలో నేహా పేర్కొన్నారు. ‘‘మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నాయికగా నటిస్తారా?’’ అనే ప్రశ్న నేహా ముందుంచితే -‘‘ఆ విషయం గురించి ఇంకా ఆలోచించలేదు’’ అన్నారు. -
దియా మీర్జా పెళ్లికి 'బాబీ జాసూస్' ఆటంకం!
బాలీవుడ్ తెరపై అప్పుడప్పుడు దర్శనమిచ్చి.. ఇటీవల నిర్మాతగా మారిన హైదరాబాద్ అమ్మాయి దియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సాహిల్ సంగాను వచ్చే ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకునేందుకు దియా మీర్జా నిశ్చయించుకున్నారు. నిర్మాత మారిన దియా మీర్జా లవ్ బ్రేక్ అప్ జిందగీ, తాజాగా విద్యాబాలన్ తో బాబీ జాసూస్ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి సాహిల్ తో గత సంవత్సరమే వివాహం జరగాల్సి ఉండేది. అయితే బాబీ జాసూస్ నిర్మాణం కారణంగా 2015 వరకు పెళ్లి వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమం సందర్బంగా సాహిల్, దియా మీర్జాల మధ్య ప్రేమ చిగురించింది. -
అక్టోబర్‌లో దియామీర్జా పెళ్లి
‘బాబీ జాసూస్’ నిర్మాత, బాలీవుడ్ తార దియా మీర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘బాబీ జాసూస్’ సహ నిర్మాత అయిన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంఘాతో తన పెళ్లి అక్టోబర్‌లో జరగనుందని ఆమె చెప్పింది. తమ పెళ్లి భారత్‌లోనే జరుగుతుందని, వచ్చే వారం నుంచే పెళ్లి పనులపై ప్లానింగ్ ప్రారంభించనున్నామని తెలిపింది. -
డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు:దియా మీర్జా
ముంబై:గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న సాహిల్ సంగా- దియా మీర్జాలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యనే వారిద్దరూ బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మించిన 'బాబీ జాసెస్' చిత్రం విజయం సాధించడంతో మళ్లీ వార్తలో నిలిచారు. కొంత సాహిల్ తో వివాహానికి సంబంధించిన ఊహాగానాలపై దియా తొలిసారి స్పందించింది. ' మా పెళ్లి విషయంలో దాపరికాలు ఏమీ లేవు. మా వివాహం త్వరలోనే జరుగుతుంది. దీనిపై ఎవరూ డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు' అంటూ దియా పేర్కొంది. త్వరలో జరిగే తమ వివాహానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే చెబితే ఇక చెప్పడానికి ఏముంటుందని ప్రశ్నించింది. సాహిల్ తో మ్యారెజ్ కు ఆత్రుతగా ఉన్న దియా.. ఈ సంవత్సరంలోనే తమ పెళ్లి వేడుకలు ఉంటాయని కచ్చితంగా చెబుతోంది. కాకపోతే డిటెక్టివ్ లా ఎవరూ దీనిపై శోధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా పెళ్ల్లి తప్పకుండా ఇండియాలోనే జరుగుతుందని.. అది కూడా అక్టోబర్ లోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. దానికి సంబంధించి వివరాలను మరోవారంలో వెల్లడిస్తా నంటూ తెలిపింది. గత ఏప్రిల్ లో తన వ్యాపారి భాగస్వామి అయిన సాహిల్ తో దియా నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, తాజాగా విద్యాబాలన్‌తో 'బాబీ జాసూస్' చిత్రాన్ని తెరకెక్కించారు. -
బాబీ జాసూస్ ట్రైలర్ లాంచ్ కు విద్యాబాలన్
-
సాహిల్ సంగాతో దియా మీర్జా నిశ్చితార్థం
ఎంతోకాలంగా వార్తల్లో ఉన్న బాలీవుడ్ నటి దియా మీర్జా నిశ్చితార్థం చేసేసుకుంది. సుదీర్ఘంగా తన వ్యాపార భాగస్వామిగా ఉన్న సాహిల్ సంగాతోనే న్యూయార్క్ నగరంలో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని దియా మీర్జా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దియా మీర్జా.. ఇక్కడి స్టాన్లీ కాలేజిలో చదివింది. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఆమె, కొన్నాళ్ల క్రితం వరకు కునాల్ కపూర్‌తో కూడా తిరిగినట్లు వదంతులు వచ్చాయి. చివరకు సంగాతోనే ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఫొటోతో సహా ఆమె ట్విట్టర్ ఖాతాలో పెట్టగానే అభిమానులు, స్నేహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. వీళ్లిద్దరూ అమెరికాలో జరుగుతున్న ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమం కోసం అక్కడకు వెళ్లారు. అక్కడే నిశ్చితార్థం చేసేసుకున్నారు. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, విద్యాబాలన్‌తో 'బాబీ జాసూస్' చిత్రం కూడా నిర్మించారు. -
దేవుడిచ్చిన గొప్ప బహుమతి... అపజయం
మై ఫిలాసఫీ విజయం కంటే అపజయానికే ఎక్కువ విలువ ఇవ్వాలి. విజయం నుంచి మాత్రమే ఆత్మవిశ్వాసం పుడుతుంది అనే వాదనతో నేను ఏకీభవించను. అపజయాల నుంచి తలెత్తిన ‘కసి’ నుంచి కూడా దృఢమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. మనం ఒక పని చేస్తున్నామంటే... యాంత్రికంగా కాకుండా ఆ పనిని లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ పని పట్ల గౌరవం ఉండాలి. మన క్రమశిక్షణ దానికి తోడు కావాలి.ఒకరి సహాయం తీసుకోవడం కంటే సొంత కాళ్ల మీద నిలబడి పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. సహాయం తీసుకొని పొందిన విజయం కంటే, ఎవరి సహాయం లేకుండా చేసిన పని తాలూకు ఓటమి నేర్పిన పాఠాన్ని గొప్పగా భావిస్తాను. ప్రతి వ్యక్తికి ఉండే గొప్ప సంపద.. వారి మెదడు. కొన్ని సమయాలలో ప్రతిభావంతులకు తమలో ఉండే ప్రతిభ గురించి తెలియదు. తమకు తగిన పని దొరికినప్పుడు ఆ ప్రతిభ బయటపడుతుంది. రాశి కంటే వాసి ముఖ్యం అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాను. ఏ పనికైనా ‘సరైన సమయం’ రావాలని నమ్ముతాను. ‘‘ఫలానా పని నువ్వు చేయగలవు’’ అని ఎవరైనా సలహా ఇస్తే ‘చేయగలను’ అనే ఆత్మవిశ్వాసంతో పాటు ‘సరైన సమయం’ కోసం నిరీక్షించగల ఓపిక కూడా ఉండాలి. - దియా మీర్జా, నటి -
ములాయంకు ఓటు వేయను: విద్యాబాలన్
ముంబై: రేపిస్టులను సమర్ధిస్తూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ తారలు విద్యాబాలన్, దియా మీర్జాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ క్షమించరాని నేరమని విద్యాబాలన్ అన్నారు. యువకులు తప్పు చేయడం సహజం అంటూ ములాయం వెనుకేసుకు రావడాన్ని విద్యాబాలన్ తప్పపట్టారు. శిక్ష విధించడంపై అనేక అభిప్రాయ భేదాలున్నప్పటికి రేప్ ఏమాత్రం క్షమించరానిదని ఆయన అన్నారు. మహిళ మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ములాయంకు ఓటు వేసేది లేదని విద్యాబాలన్ అన్నారు. అలాగే ములాయం సింగ్ వ్యాఖ్యలు అత్యంత శోచనీయం, విషాదకరమైనవని మరో బాలీవుడ్ తార దియా మిర్జా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఓ మహిళ, మనిషిగా ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదన్నారు. -
‘బాబీ’ బాగా నవ్విస్తుంది
న్యూఢిల్లీ: త్వరలో విడుదలయ్యే బాబీ జసూస్ దియా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని దీని నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ దియా మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది. ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈమె 2011లోనూ లవ్ బ్రేకప్స్ జిందగీ తీసింది. నిర్మాతగా మారడం ఎలా అనిపిస్తోందంటే.. ‘పని చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టం. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది. ‘ఫ్యాషన్ వేదికలకు రావాలంటే ఇప్పటికీ భయమే. క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఎంతో కంగారుగా అనిపిస్తుంటుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రోత్సాహం శక్తిని ఇస్తుంటుంది. అందుకే పని సులువు అవుతుంది’ అని దియా మీర్జా వివరించింది. -
ఢిల్లీ ప్రజలారా ఓటు వేయండి: బాలీవుడ్ ప్రముఖుల విజ్క్షప్తి
రాజ్యాంగపరంగా సక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ ఓటర్లకు బాలీవుడ్ తారలు నేహా దూపియా, అదితిరావు, దియా మిర్జాలు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో దియా మిర్జాలు విజ్క్షప్తి చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైంది. అనుపమ్ ఖేర్ ఓటు అనేది ఓ భద్రత. ఎవరికైనా ఓటు వేయండి. కాని ఓటు వేయకుండా ఉండకండి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. వెళ్లి ఓటేయండి. Vote for any person/party that gives you a sense of security. It is your one chance to make a difference to your own future. Go & Vote.:) — Anupam Kher (@AnupamPkher) December 4, 2013 Exercise your right to vote today Delhi! It's the only way to have your concerns represented in government and for your voice to be heard. — soha ali khan (@sakpataudi) December 3, 2013 సోహా ఆలీ ఖాన్ ఢిల్లీ ప్రజల్లారా ఓటు వినియోగించుకోండి. ఓ వాయిస్ ను వినిపించడానికి, మీకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటేయ్యడమే సరియైన మార్గం. నేహ దూపియా మంచైనా.. చెడైనా.. మీ నేతకు మీరే బాధ్యత వహించాలి. ఓటు వేసిన తర్వాత ఇంక్ తో కూడిన వేలిని గుర్తును ట్విటర్ లో పెట్టండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అంటూ ట్వీట్ చేశారు. అదితిరావు ఈ రోజు మీ రోజు. ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి వెళ్లండి. మీ దేశం. మీ నగరం కోసం ఓటు వేయండి చేతన్ భగత్ మీ బాస్ ఎవరో చూపండి. హ్యపీగా ఓటు వేసిరండి దియా మీర్జా అతి ముఖ్యమైన హక్కును సక్రమంగా వినియోగించండి. ఓటు వేయండి. కోయిల్ పూరీ మీరు ఓటు వేశారా? నేను నా ఓటును సీక్రెట్ గా వేశాను. 15 సంవత్సరాలుగా పాలిస్తున్న షీలా నానీ(నానమ్మ) రిటైర్ కావాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అని ట్వీట్ చేశారు. కునాల్ కోహ్లీ ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలి. వెళ్లండి.. త్వరపడండి. గుల్ పనాగ్ ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి కదలండి. రాష్ట్ర జరిగే సంఘటనలు తర్వాత నిందించకుండా సరియైన వ్యక్తికి ఓటు వేయండి