నిర్మాతగా..? | Neha Dhupia to produce films? | Sakshi
Sakshi News home page

నిర్మాతగా..?

Published Mon, Sep 22 2014 11:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నిర్మాతగా..? - Sakshi

నిర్మాతగా..?

 పూజా భట్, జూహీ చావ్లా, ప్రీతీ జింటా, దియా మీర్జా.. ఇలా పలువురు బాలీవుడ్ తారలు నిర్మాతలుగా మారారు. ఇప్పుడీ జాబితాలో నేహా ధూపియా చేరనున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ చిత్రాలు చేసే అవకాశం రాలేదామెకు. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారాలనుకుంటున్నారామె. ‘‘నటన మాత్రం కాకుండా నాకేదైనా వ్యాపారం చేయాలనిపిస్తే, కచ్చితంగా నా దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంటుంది. ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఆసక్తి. మంచి మంచి సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం’’ అని ఇటీవల ఓ సందర్భంలో నేహా పేర్కొన్నారు. ‘‘మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నాయికగా నటిస్తారా?’’ అనే ప్రశ్న నేహా ముందుంచితే -‘‘ఆ విషయం గురించి ఇంకా ఆలోచించలేదు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement